క్రిమియా విషయంలో రష్యామీద ఆంక్షలు విధించాలన్న అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాల ఆలోచనకు తాము మద్దతిచ్చే ప్రసక్తి లేదని భారత్ స్పష్టం చేసింది.
క్రిమియా విషయంలో రష్యామీద ఆంక్షలు విధించాలన్న అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాల ఆలోచనకు తాము మద్దతిచ్చే ప్రసక్తి లేదని భారత్ స్పష్టం చేసింది. ఏకపక్షంగా ఆంక్షలు విధిస్తామంటే ఊరుకునేది లేదని తెలిపింది. ఇరాన్, ఇరాక్ లాంటి దేశాలపై కూడా ఏకపక్ష ఆంక్షలను భారత్ ఎప్పుడూ సమర్థించలేదని, అందుకే ఈసారి కూడా ఒకే దేశం లేదా కొన్ని దేశాలు కలిసి ఇలాంటి చర్యలకు పాల్పడుతామంటే మద్దతివ్వబోమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అంతకుముందు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మన ప్రధాని మన్మోహన్ సింగ్కు అక్కడి మొత్తం పరిస్థితిని వివరిస్తూ లేఖ రాశారు.
వివిధ దేశాల సార్వభౌమత్వం గురించి భారతదేశం అనుసరిస్తున్న విధానాలు ఈ సమస్యకు దౌత్యపరమైన పరిష్కారం రావడానికి పుతిన్ అభిప్రాయపడ్డారు. నల్లసముద్రానికి సంబంధించి రష్యా తీసుకున్న చర్యల్లో భాగస్వామ్యం ఉందంటూ రష్యా, ఉక్రెయిన్లకు చెందిన పలువురు అధికారులపై అమెరికా, యూరోపియన్ యూనియన్ ఆంక్షలు విధించాయి. ఆస్ట్రేలియా కూడా రష్యాకు చెందిన కొందరు రాజకీయ నాయకులపై ఆర్థిక, పర్యాటక ఆంక్షలు విధిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో రష్యాకు భారత మద్దతు కీలకంగా నిలవనుంది.