Putin
-
పుతిన్ కారులో భారీ పేలుడు.. జెలెన్స్కీ భవిష్యవాణి నిజమేనా?
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Russian President Vladimir Putin)కు చెందిన అధికారిక కార్లలో అత్యంత లగ్జరీ కారు లిమోజిన్‌లో భారీ పేలుడు సంభవించింది. మాస్కో నడిబొడ్డున జరిగిన ఈ ఘటన రష్యా అధ్యక్షుని భద్రతపై పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. ఈ ఘటనతో ప్రపంచ నేతలంతా ఉలిక్కిపడ్డారు. ‘ది సన్’ తెలిపిన వివరాల ప్రకారం పుతిన్‌కు చెందిన ఈ అత్యంత ఖరీదైన కారు లుబియాంకాలోని ఎఫ్ఎస్బీ ప్రధాన కార్యాలయం సమీపంలో కాలిపోతూ కనిపించింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం కారు ఇంజిన్ నుండి మంటలు ప్రారంభమై, వాహనం లోనికి వ్యాపించాయి. JUST IN: 🇷🇺 Luxury limousine from Russian President Putin's official motorcade exploded on the streets of Moscow, just blocks from the FSB headquarters.It's unclear if this is an attempted ass*ssination attempt pic.twitter.com/Da4tcUoZEU— BRICS News (@BRICSinfo) March 29, 2025అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపు అక్కడికి సమీపంలోని రెస్టారెంట్‌లోని సిబ్బంది కారుకు అంటుకున్న మంటలను ఆర్పేందుకు ముందుకు వచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీలో వాహనం నుండి దట్టమైన నల్లటి పొగ రావడం, కారు వెనుక భాగం దెబ్బతిడాన్ని చూడవచ్చు. ఈ పేలుడుకు గల కారణం ఇంకా తెలియరాలేదని, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని ‘ది సన్’ పేర్కొంది. ఈ కారును ప్రెసిడెన్షియల్ ఎస్టేట్ డిపార్ట్మెంట్ పర్యవేక్షిస్తుంటుంది. ఇదిలావుండగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యం క్షీణిస్తోందని, ఆయన త్వరలో చనిపోతారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ (Ukrainian President Volodymyr Zelensky) వ్యాఖ్యానించారు. బుధవారం జరిగిన ఒక ఇంటర్వ్యూలో జెలెన్స్కీ ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. పుతిన్ కారు తగలబడిన ఘటన నేపధ్యంలో ఆయన మరణాన్ని జెలెన్స్కీ ముందే ఊహించారంటూ పలు కథనాలు వెలువడుతున్నాయి. కైవ్ ఇండిపెండెంట్ వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం యూరోవిజన్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జెలెన్స్కీ మాట్లాడుతూ పుతిన్ త్వరలో చనిపోతారని, ఇరు దేశాల యుద్ధం కూడా త్వరలో ముగుస్తుందని అన్నారు.ఇది కూడా చదవండి: Rajasthan Day: 19 రాచరిక రాష్ట్రాలు కలగలిస్తే.. -
అణు యుద్ధానికి గేట్లు తెరిచిన ట్రంప్!
-
విరామం అంటూనే విరుచుకుపడింది
కీవ్: అగ్రరాజ్యం అమెరికా ప్రోద్బలంతో కాల్పుల విరమణకు దాదాపు తలూపిన రష్యా చిట్టచివర్లో తల ఎగరేసింది. శాంతిని కోరుకుంటున్నామని, 30 రోజులపాటు ఉక్రెయిన్ ఇంధన, మౌలిక వసతులపై దాడులు చేయబోమని సూత్రప్రాయ అంగీకారానికి సిద్ధపడిన రష్యా వెనువెంటనే సమరనినాదం చేసింది. మంగళవారం రాత్రి నుంచి నిరాటంకంగా రష్యా డ్రోన్లు జనావాసాలపై దాడులు చేస్తున్నాయని ఉక్రెయిన్ బుధవారం ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో దాదాపు గంటకుపైగా ఫోన్లో సంభాషించిన కొద్దిగంటలకే రష్యా మళ్లీ తన భీకర దాడులను మొదలుపెట్టడం గమనార్హం. దాడులు ఆపబోమని తాజా ఘటనతో రష్యా చెప్పేసిందని, సమీ పట్టణంలోని ఒక ఆస్పత్రిపై, ప్రజల ఇళ్లపై డ్రోన్ల దాడులు జరిగాయి. ముఖ్యంగా డోనెట్సక్ ప్రాంతంలోని నగరాలపై 150 డ్రోన్ల దాడులు జరిగాయి. వీటితోపాటు కీవ్, ఝిటోమిర్, చెరి్నహీవ్, పోల్టావా, ఖర్కీవ్, కిరోవోహార్డ్, డినిప్రోపెట్రోవ్సŠక్, చెర్కసే ప్రాంతాలపైనా డ్రోన్లు విరుచుకుపడ్డాయి. అయితే ప్రాణనష్టం వివరాలు వెల్లడికాలేదు. ఉక్రెయిన్ సైతం డ్రోన్లకు పనిచెప్పింది. రష్యా ప్రాంతాలపై డ్రోన్ దాడులుచేసింది. 57 డ్రోన్లను కూల్చేశామని రష్యా ప్రకటించింది. చమురు శుద్ధి కర్మాగారాలపై దాడులు చేస్తోందని ఆరోపించింది. ‘‘కాల్పుల విరమణ చర్చల వేళ ఇలా దాడులతో ఉక్రెయిన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. దీంతో చర్చలు రైలు పట్టాలు తప్పే ప్రమాదమొచ్చింది’’ అని రష్యా రక్షణ శాఖ ఆగ్రహం వ్యక్తంచేసింది. -
ట్రంప్ ప్రతిపాదనతో ఆటలొద్దు
లండన్: ఉక్రెయిన్– రష్యా మధ్య శాంతి కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన ఒప్పందంతో ఆటలాడొద్దని రష్యా అధినేత పుతిన్‌ను యునైటెడ్ కింగ్డమ్(యూకే) ప్రధానమంత్రి కియర్ స్టార్మర్ హెచ్చరించారు. పుతిన్ నిజంగా శాంతిని కోరుకుంటే అది చాలా సులభంగా సాధ్యమవుతుందని అన్నారు. కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాలని, ఉక్రెయిన్‌పై వెంటనే దాడులు నిలిపివేయాలని చెప్పారు. శాంతి ప్రయత్నాలకు విఘాతం కలిగించాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని తేల్చిచెప్పారు. 30 రోజులపాటు కాల్పుల విరమణ పాటించాలంటూ డొనాల్డ్ ట్రంప్ చేసిన చక్కటి ప్రతిపాదనకు రష్యా ప్రభుత్వం అడ్డుపుల్లలు వేస్తోందని మండిపడ్డారు. శాంతియుత పరిస్థితులు నెలకొనడం పుతిన్‌కు ఇష్టం లేదా? అని ప్రశ్నించారు. ఇలాగే మొండిగా వ్యవహరిస్తే రష్యాపై ఆర్థిక ఆంక్షలు తీవ్రతరం చేస్తామని, అప్పుడు మరో గత్యంతరం లేక ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ముగించక తప్పదని వెల్లడించారు. ఉక్రెయిన్‌తో చర్చలకు పుతిన్ సిద్ధమైతే, రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం సజావుగా కొనసాగేలా తాము బాధ్యత తీసుకుంటామని స్టార్మర్ తెలిపారు.ఆయన శనివారం యూరప్‌తోపాటు మిత్రదేశాల అధినేతలతో వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఈ భేటీలో 25 దేశాల నేతలు పాల్గొన్నారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధం, తాజా పరిణామాలపై, పుతిన్ వైఖరిపై చర్చించారు. రెండు దేశాల మధ్య శాశ్వతంగా శాంతి నెలకొనాలని ఈయూ, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్ తదితర దేశాలన్నీ కోరుకుంటున్నట్లు స్టార్మర్ తెలిపారు. రష్యా మెడలు వంచడానికి అవసరమైతే సైన్యాన్ని సైతం రంగంలోకి దించడానికైనా సిద్ధమేనని సంకేతాలిచ్చారు. ప్రాక్టికల్ ప్లానింగ్‌తో ‘ఆచరణ దశ’ప్రారంభించేలా ముందుకు సాగుతున్నామని ఉద్ఘాటించారు.వర్చువల్ సమావేశంలో ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీ పాల్గొన్నారు. ఉక్రెయిన్–రష్యా మధ్య కాల్పుల విరమణ ప్రక్రియ ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉండగా, రష్యా మొండి వైఖరితో ఆగిపోయిందని జెలెన్స్కీ విమర్శించారు. కాల్పుల విరమణను అడ్డుకోవడానికి రష్యా కుట్రలు సాగిస్తోందని ఆరోపించారు. ఇదిలా ఉండగా, శాంతి కోసం మరింత చొరవ తీసుకోవాలని యూరప్ దేశాలు నిర్ణయానికొచ్చాయి. కాల్పుల విరమణకు అంగీకరించేలా పుతిన్‌పై ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా ఏం చేయాలన్న దానిపై చర్చించడానికి యూరప్ దేశాల మిలిటరీ ప్లానింగ్ సమావేశం వచ్చేవారం జరగబోతోంది. -
పుతిన్ నియంత కాదు: ట్రంప్
వాషింగ్టన్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ‘నియంత’ అని పిలవడానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిరాకరించారు. ఓవల్ ఆఫీస్‌లో జరిగిన మీడియా సమావేశంలో ‘పుతిన్‌ను నియంతగా భావిస్తున్నారా’ అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన పై సమాధానమిచ్చారు. తాను ఆ పదాలను అంత తేలికగా ఉపయోగించనని స్పష్టం చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో భేటీ అనంతరం సోమవారం సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ తెలివిగా వ్యవహరిస్తే ఉక్రెయిన్‌లో యుద్ధం తొందరగా ముగిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.‘‘మనం స్మార్ట్ కాకపోతే అది కొనసాగుతూనే ఉంటుంది. లేదంటే ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది’’ అని వ్యాఖ్యానించారు. శాంతి ఒప్పందంలో భాగంగా ఉక్రెయిన్ భూభాగాన్ని రష్యాకు అప్పగించాల్సి ఉంటుందా అనేది కీలక చర్చనీయాంశమైంది. దీనిపై ట్రంప్‌ను ప్రశ్నించగా.. ‘‘సంప్రదింపులు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. అయితే.. రష్యా ఆక్రమించిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడం అంత తేలికైన విషయం కాదు. అమెరికా, ఉక్రెయిన్ మధ్య ఖనిజాల ఒప్పందం ఖరారయ్యే అవకాశం ఉంది. ఈ ఒప్పందం సంతకం చేయడానికి త్వరలోనే జెలెన్స్కీ అమెరికా వస్తారని ఆశిస్తున్నా’’ అని ట్రంప్ పేర్కొన్నారు.ఏరోస్పేస్, వైద్య, సాంకేతిక పరిశ్రమలలో ఉపయోగించే కీలకమైన ఖనిజాలు ఉక్రెయిన్‌లో ఉన్నాయి. అయితే.. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి కీవ్‌కు అందించిన 180 బిలియన్ డాలర్ల అమెరికన్ సహాయంలో కొంత భాగాన్ని భర్తీ చేయడానికి ఖనిజాలపై ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది. మరోవైపు రష్యా–ఉక్రెయిన్ శాంతి చర్చల అనంతరం పుతిన్‌ను కలుస్తానని ట్రంప్ తెలిపారు. శాంతి ఒప్పందానికి పుతిన్ అంగీకరిస్తారని, అతను మరింత యుద్ధాన్ని కోరుకోవడం లేదని ట్రంప్ చెప్పుకొచ్చారు. శాంతి అంటే ఉక్రెయిన్ లొంగిపోవడం కాదు: మాక్రాన్ అయితే.. ఉక్రెయిన్ సార్వబౌమత్వాన్ని పణంగా పెట్టి ఏ శాంతి ఒప్పందం జరగకూడదని మాక్రాన్ స్పష్టం చేశారు. ఏ శాంతి ఒప్పందంలోనైనా భద్రతా హామీలు ఉండాలని, శాంతి అంటే ఉక్రెయిన్ లొంగిపోవడం కాదని మాక్రాన్ హెచ్చరించారు. ఒప్పందం కుదిరితే ఉక్రెయిన్‌కు శాంతి పరిరక్షక దళాలను పంపే ప్రతిపాదనపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో కలిసి పనిచేస్తామని మాక్రాన్ తెలిపారు. సుస్థిరత్వాన్ని ఏర్పరచడానికి యూరప్ సిద్ధంగా ఉందని, ఆ శాశ్వత శాంతిని సాధించడానికి బలమైన అమెరికా జోక్యం అవసరమని మాక్రాన్ నొక్కి చెప్పారు. అట్లాంటిక్ విభేదాలున్నప్పటికీ అమెరికా అధ్యక్షుడితో చర్చలు ముందుకు సాగాయని మాక్రాన్ నొక్కి చెప్పారు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక కొత్త దౌత్య అవకాశం లభించిందన్నారు. -
ట్రంప్‌తో చర్చలకు పుతిన్ రెడీ: రష్యా
మాస్కో: డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడేందుకు తమ అధ్యక్షుడు పుతిన్ సిద్ధంగా ఉన్నారని రష్యా ప్రకటించింది. అయితే ఈ విషయమై అమెరికా నుంచి స్పందన కోసం వేచి చేస్తున్నట్లు తెలిపింది. ఇరు దేశాల అధినేతల మధ్య భేటీ త్వరలో ఉంటుందా లేదా అన్న విషయంపై మాత్రం రష్యా స్పష్టత ఇవ్వలేదు.దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో ట్రంప్ వర్చువల్‌గా మాట్లాడారు. అణ్వాయుధాలను తగ్గించే దిశగా ప్రపంచ దేశాలు పని చేయాలని తాను భావిస్తున్నట్లు చెప్పారు. రష్యా,చైనాలు కూడా వారి అణ్వాయుధ సామర్థ్యాలను తగ్గించుకోవడానికి మద్దతిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.ఉక్రెయిన్ యుద్ధానికి వీలైనంత త్వరగా ముగింపు పలుకుతానన్న ఆయన చమురు ధరలు దిగివస్తే ఈ యుద్ధం మరింత వేగంగా ముగిసిపోతుందని చెప్పారు. అయితే ట్రంప్ చేస్తున్న ఈ వాదనతో రష్యా మాత్రం ఏకీభవించలేదు. చమురు ధరలకు తాము యుద్ధం ఆపడానికి సంబంధం లేదని స్పష్టం చేసింది.అమెరికా-రష్యా సంబంధాలు ఉక్రెయిన్ యుద్ధంతో అత్యంత దారుణంగా క్షీణించాయి. రష్యాతో పోరాడుతున్న జెలెన్స్కీ సైన్యానికి మాజీ అధ్యక్షుడు బైడెన్ హయాంలో అమెరికా భారీ స్థాయిలో ఆయుధ సాయంతో పాటు ఆర్థికంగానూ ఆదుకుంటోంది. -
కుదిరితే కప్పు టీ
మాస్కో: భారత్, రష్యా మధ్య దశాబ్దాలుగా స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయి. భారత ప్రధానమంత్రులు ఎవరైనా సరే రష్యాతో అనుబంధానికి అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు. రష్యా అధినేతలు సైతం అదే రీతిలో స్పందిస్తుంటారు. ప్రస్తుత అధ్యక్షుడు పుతిన్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో తన స్నేహం, అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. మోదీతో చక్కటి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ప్రపంచదేశాల అధినేతల్లో తనకున్న కొద్ది మంది మిత్రుల్లో మోదీ కూడా ఒకరని అన్నారు.పుతిన్ తాజాగా మీడియా ప్రతినిధుల వార్షిక సమావేశంలో మాట్లాడారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన విషయం బయటపెట్టారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో తేనీరు సేవిస్తూ ఏ దేశ అధినేతతో సంభాషించాలని మీరు కోరుకుంటారు? అని ప్రశ్నించగా, భారత ప్రధాని మోదీతోపాటు జర్మనీ మాజీ చాన్స్‌లర్ హెల్ముత్ కోల్, ఫ్రాన్స్ అధ్యక్షుడు జాక్విస్ చిరక్, ఇటలీ మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోనీ, చైనా అధినేత షీ జిన్‌పింగ్‌తో మాట్లాడడం ఇష్టమని, వారంతా తనకు మంచి స్నేహితులని స్పష్టంచేశారు. కుదిరితే వారితో టీ సేవిస్తూ సంభాషించడానికి ఇష్టపడతానని వెల్లడించారు.బ్రెజిల్, చైనా, దక్షిణాఫ్రికా, రష్యా, ఇండియాతో కూడిన ‘బ్రిక్స్’ కూటమి పశ్చిమ దేశాలకు వ్యతిరేకం కాదని పుతిన్ తేల్చిచెప్పారు. తమ కూటమి దేశాల ప్రయోజనాల కోసం తప్ప ఇతర దేశాలకు వ్యతిరేకంగా తాము పనిచేయడం లేదని వివరించారు. ఇదిలా ఉండగా, పుతిన్ వచ్చే ఏడాది మొదట్లో భారత్‌లో పర్యటించబోతున్నారు. ప్రతిఏటా కనీసం ఒక్కసారైనా భేటీ కావాలని పుతిన్, మోదీ ఇప్పటికే నిర్ణయించుకున్నారు. -
మీరు రష్యాలో ఉంటేనే సేఫ్ అనుకుంటా సార్!
-
అణ్వాయుధ దాడికి పుతిన్ ఆదేశం.. ప్రపంచదేశాల ఆందోళన
మాస్కో: ప్రపంచమంతా ఎంతగానో భయపడుతున్నట్లే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశాలు జారీ చేశారు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన అణు క్షిపణి సాతాన్-2ను ఉక్రెయిన్‌పై ప్రయోగించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ తొలిసారిగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి.ఉక్రెయిన్‌కు అణ్వాయుధాలు అందించడం గురించి పశ్చిమ దేశాలు యోచిస్తున్న సమయంలో పుతిన్ నుంచి ఈ ఆదేశాలు వెలువడటం గమనార్హం. రష్యాలో రూపొందిన సాతాన్-2 క్షిపణి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అణు క్షిపణి. దీనికి ఏకకాలంలో డజన్ల కొద్దీ అణ్వాయుధాలను మోసుకెళ్లగల సామర్థ్యం ఉంది. ఈ అణు క్షిపణి బరువు 208.1 టన్నులు. ఇది 10 టన్నుల వరకు పేలోడ్‌ను మోయగలదు. దీని స్ట్రైక్ రేంజ్ 35 వేల కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ వివరాల ఆధారంగా ఈ క్షిపణి ఎంత ప్రమాదకరమో ఇట్టే ఊహించుకోవచ్చు.రష్యా ఇప్పుడు ఈ క్షిపణికి ఆర్ఎస్-28 సర్మత్ అనే పేరు పెట్టింది. ప్రపంచదేశాలు దీనిని సాతాన్-2 పేరుతో పిలుస్తున్నాయి. దీనిని రష్యా విజయవంతంగా పరీక్షించిన తర్వాత, 2023లో దీనిని సైన్యంలో చేర్చింది. ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలైన తర్వాత రష్యా ఈ క్షిపణిని పరీక్షించింది. ఈ క్షిపణిని ఆధునిక అవసరాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేశారు.ఇది కూడా చదవండి: నైజీరియన్ యువతులతో వ్యభిచారం 9 మంది అరెస్ట్ -
అణ్వాయుధాల వాడకంపై పుతిన్ సంచలన నిర్ణయం
మాస్కో:ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తీవ్రమవనుందా.. వెయ్యి రోజుల నుంచి రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ఇక ముందు కొత్త మలుపు తిరగనుందా.. రెండు దేశాల యుద్ధం మరో ప్రపంచ యుద్ధంగా మారనుందా..అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తే అవుననే తెలుస్తోంది.తాజాగా రష్యా అణుబాంబుల వినియోగానికి అనుమతించే నిబంధనలను మరింత సరళతరం చేసే ఫైల్‌పై రష్యా అధ్యక్షుడు పుతిన్ తాజాగా సంతకం చేశారు. అణుబాంబులు కలిగి ఉన్న దేశం సాయంతో ఏ దేశమైనా తమపై దాడి చేస్తే..దాన్ని ఆ రెండు దేశాలు కలిసి దాడిగానే రష్యా పరిగణించనుంది. ఇలాంటి సందర్భాల్లో అణ్వాయుధాలు లేని దేశంపైనా రష్యా దాడి చేయనుంది.తాము అందజేసే లాంగ్రేంజ్ క్షిపణులను రష్యాపై ప్రయోగించేందుకు ఉక్రెయిన్‌కు అమెరికా అనుమతించిన నేపథ్యంలో అణ్వాయుధాలపై పుతిన్ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.ఉక్రెయిన్‌కు మద్దతుగా రష్యాపై ఒకవేళ పశ్చిమదేశాలు నేరుగా దాడి చేస్తే వాటిపై అణ్వాయుధాలు వాడటానికి వీలుగా నిబంధనలు సవరించినట్లు సమాచారం. -
ట్రంప్‌తో చర్చలకు సిద్ధం: పుతిన్
మాస్కో: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌తో చర్చలకు సిద్ధమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ఎన్నికల్లో విజయానికి ట్రంప్‌ను అభినందించారు. ట్రంప్‌ను ధైర్యశాలిగా అభివర్ణించారు. సోచిలో శుక్రవారం ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడారు. వైట్‌హౌస్‌లో తొలి విడతలో ట్రంప్ అన్నివైపుల నుంచీ ఒత్తిళ్లు ఎదుర్కొన్నారని పుతిన్ అన్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధానికి ముగింపు పలకగలనని ట్రంప్ అనడంపై స్పందిస్తూ.. కనీసం దృష్టి పెట్టాల్సిన అంశమిదని రష్యా అధ్యక్షుడు అన్నారు. జూలైలో ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నంపై మాట్లాడుతూ.. ఆయనపై ఒక అభిప్రాయానికి రావడానికి ఇది దోహదపడిందని పేర్కొన్నారు. కాల్పులు జరిగి చెవి నుంచి రక్తమోడుతున్నా.. ట్రంప్ వెంటనే తేరుకొని పిడికిలి బిగించి.. ఫైట్, ఫైట్, ఫైట్.. అని నినదించిన విషయం తెలిసిందే. దీనిపై పుతిన్ మాట్లాడుతూ.. ‘ట్రంప్ చక్కగా స్పందించారు. ధైర్యంగా పరిస్థి తులను ఎదుర్కొ న్నారు. ధీశాలి’ అని కితాబి చ్చారు. గురువారం ట్రంప్ ఎన్బీసీ ఛానల్‌తో మాట్లాడు తూ.. పుతిన్‌తో మాట్లాడాలని భావిస్తున్నా నన్నారు. దీనిపై పుతిన్ స్పందిస్తూ ట్రంప్‌తో చర్చలకు సిద్ధమని విలేకరులతో అన్నారు. సూపర్ పవర్ దేశాల జాబితాలో భారత్‌ను చేర్చాలిప్రపంచంలోని అత్యంత బలీయమైన దేశాల జాబితాలో భారత్‌ను చేర్చాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ప్రపంచదేశాలన్నింటిలోకి భారత ఆర్థికవ్యవస్థే అతి వేగంగా వృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. శుక్రవారం పుతిన్ సోచిలో ఒక కార్యక్రమంలో మాట్లాడారు. -
అణు క్షిపణుల పరీక్షకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశం
మాస్కో: ఉక్రెయిన్ విషయంలో పశ్చిమ దేశాలపై పెరుగుతున్న ఒత్తిడి మధ్య రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆ దేశ న్యూక్లియర్ ఫోర్స్‌కు కీలక ఆదేశాలు జారీ చేశారు. క్షిపణి ప్రయోగాలకు కసరత్తు వెంటనే ప్రారంభించాలని సూచించారు. అణ్వాయుధ సామర్థ్యం కలిగిన బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణుల ప్రయోగ పరీక్షలు నిర్వహించాలని సైనిక అధికారులతో జరిగిన వీడియో సమావేశంలో పుతిన్ ఆదేశించారు. పుతిన్ ఆదేశాల మేరకు రష్యా అణు దళం అణు క్షిపణులను పరీక్షించడం మొదలుపెట్టింది. ఉక్రెయిన్‌కు పెరుగుతున్న పాశ్చాత్య దేశాల మద్దతు నేపథ్యంలో అణుశక్తి సామర్థ్యాన్ని ప్రస్తావించిన పుతిన్.. రష్యాలోని అణు ఆయుధాగారం దేశ సార్వభౌమాధికారం, భద్రతకు నమ్మదగిన హామీ అని పేర్కొన్నారు. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కొత్త హెచ్చరికలు, ప్రమాదాలను పరిగణనలోకి తీసుకుంటే, యుద్ధానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండటం చాలా ముఖ్యమని పుతిన్ పునరుద్ఘాటించారు.కాగా కమ్చట్కా ద్వీపకల్పంలోని కురా టెస్టింగ్ రేంజ్‌లోని ప్లెసెట్స్క్ లాంచ్ ప్యాడ్ నుంచి యార్స్ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ఐసీబీఎం)ను సైన్యం పరీక్షించినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అన్ని క్షిపణులు తమ లక్ష్యాలను ధ్వంసం చేశాయని పేర్కొంది. గత నెలలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అమెరికా, నాటో మిత్రదేశాలను హెచ్చరించారు. రష్యా పై దాడులు చేసేందుకు పాశ్చాత్య దేశాలు ఇచ్చిన లాంగ్ రేంజ్ ఆయుధాలను ఉక్రెయిన్ ఉపయోగిస్తే, రష్యాపై నాటో యుద్ధం ప్రారంభించినట్లుగా భావించాల్సి వస్తుందని పుతిన్ పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: మరింత దగ్గరైన పాక్- రష్యా.. సైనికాధికారుల భేటీలో వెల్లడి -
ప్రధాని మోదీ, జిన్‌పింగ్ చర్చలు
కజన్: బ్రిక్స్ సమావేశాల సైడ్‌లైన్స్‌లో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో రష్యాలో బుధవారం(అక్టోబర్ 23) సమావేశమయ్యారు. వీరిద్దరూ ఈ భేటీలో ఏం చర్చిస్తారన్నది కీలకలంగా మారింది. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారత్, చైనా వాస్తవాధీన రేఖపై పెట్రోలింగ్ నిర్వహించే విషయంలో ఇరు దేశాల మధ్య ఇటీవలే ఒప్పందం కుదిరిన నేపథ్యంలో జిన్‌పింగ్,మోదీ భేటీ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. 2020లో సరిహద్దులో జరిగిన భారత, చైనా సైనికుల ఘర్షణల తర్వాత చైనా,భారత్ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి సరికాదు: మోదీ బ్రిక్స్ రెండో రోజు సమావేశాల్లో బుధవారం ప్రధాని మోదీ పాల్గొని మాట్లాడారు. సమావేశాలను పుతిన్ విజయవంతంగా నిర్వహించారని ఈ సందర్భంగా ప్రధాని కొనియాడారు. భవిష్యత్తులో బ్రిక్స్ మరింత పటిష్టమైన వేదిక అవుతుందన్నారు. బ్రిక్స్ చిన్న,మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రపంచంలో 40 శాతం జనాభాకు బ్రిక్స్ ప్రాతినిథ్యం వహిస్తుందన్నారు. ప్రతి ఒక్కరు తల్లి పేరుతో మొక్క నాటే కార్యక్రమాన్ని భారత్‌లో చేపట్టామని చెప్పారు. ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి ఉండటం సరికాదన్నారు. బ్రిక్స్ దేశాలు లోకల్ కరెన్సీ ద్వారా వ్యాపారం చేయడాన్ని ప్రోత్సహించాలని కోరారు. ఇదీ చదవండి: ఢిల్లీ కాలుష్యంపై సుప్రీం అసహనం -
పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ
మాస్కో:పదహారవ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ రష్యా వెళ్లారు. పర్యటనలో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మోదీ సమావేశమై చర్చలు జరిపారు.ఈ పర్యటనలో చైనా అధ్యకక్షుడు జిన్‌పింగ్‌తోనూ ప్రధాని సమావేశమవనున్నారు. 22,23 తేదీల్లో జరిగే బబ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకుగాను ప్రధాని మంగళవారం రష్యాలోని కజన్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టులో ఆయనకు ఘనస్వాగతం లభించింంది. కాగా, మూడు నెలల వ్యవధిలో ప్రధాని రష్యాలో పర్యటించడం ఇది రెండోసారి కావడం విశేషం. ఇదీ చదవండి: బ్రిక్స్ సదస్సు.. రష్యాలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం -
పుతిన్‌తో ట్రంప్ రహస్య స్నేహం.. పదవి నుంచి దిగిపోయాక ఆరుసార్లు ఫోన్
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రష్యా అధినేత పుతిన్ కోసం కోవిడ్–19 టెస్టింగ్ కిట్లు రహస్యంగా అందజేశారా? పుతిన్ వీటిని వ్యక్తిగతంగా వాడుకున్నారా? పదవి నుంచి దిగిపోయిన తర్వాత కూడా పుతిన్‌తో ట్రంప్ రహస్యంగా స్నేహ సంబంధాలు కొనసాగించారా? అవుననే చెబుతోంది ఓ పుస్తకం. వాటర్‌గేట్ కుంభకోణంపై వార్తలు రాసిన విలేకరి బాబ్ వుడ్‌వర్డ్ రచించిన ‘వార్’అనే పుస్తకంలో ఈ సంచలన విషయాలు ప్రస్తావించారు. ఈ పుస్తకం ఈ నెల 15న విడుదల కానుంది. ఇందులోని కొన్ని ముఖ్య అంశాలను అమెరికా పత్రికలు బయటపెట్టాయి. ట్రంప్ 2021లో అధికారం నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత ట్రంప్, పుతిన్ కనీసం ఆరుసార్లు ఫోన్లో సీక్రెట్‌గా మాట్లాడుకున్నారని ట్రంప్ సహాయకుడు చెప్పినట్లు పుస్తకాన్ని ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. ప్రస్తుతం ఈ వ్యవహారం మొత్తం అమెరికాలో సంచలనాత్మకంగా మారింది. ఇదిలా ఉండగా, వార్ పుస్తకంలోని అంశాలను ట్రంప్ ప్రచార బృందం ఖండించింది. అదొక చెత్త పుస్తకం, అందులోని కాగితాలు టాయిలెట్ టిష్యూగా వాడుకోవడానికి పనికొస్తాయని ఎద్దేవా చేసింది. ట్రంప్ సైతం స్పందించారు. కథలు చెప్పడంతో దిట్ట అయిన బాబ్ వుడ్‌వర్డ్ చెప్పే పనికిమాలిన విషయాలు నమ్మాల్సిన అవసరం లేదని అన్నారు. అతడొక చెడ్డవ్యక్తి అని విమర్శించారు. తాజా వివాదంపై రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ కూడా స్పందించింది. ‘వార్’పుస్తకంలో ప్రస్తావించిన వాటిలో ఏమాత్రం వాస్తవం లేవని, అవన్నీ అభూత కల్పనలు అని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తేలి్చచెప్పారు. -
పుతిన్‌పై ప్రశ్న.. రిపోర్టర్‌పై బైడెన్ ఆగ్రహం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా ఓ మీడియా ప్రతినిధిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం(సెప్టెంబర్13) వైట్‌హౌస్‌లో బైడెన్, బ్రిటన్ పీఎం కీర్ స్టార్మర్ ముఖ్యమైన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సంబంధించి బ్రీఫింగ్ ఇస్తుండగా స్కై న్యూస్ మీడియా ప్రతినిధి ఒకరు బైడెన్‌ను ప్రశ్నించారు.రష్యాపై ఉక్రెయిన్ లాంగ్ రేంజ్ క్షిపణులను ప్రయోగించే విషయంలో పశ్చిమ దేశాలకు పుతిన్ వార్నింగ్ ఇవ్వడాన్ని రిపోర్టర్ ప్రస్తావించారు. దీనికి బైడెన్ స్పందిస్తూ నేను మాట్లాడే వరకు మీరు నిశ్శబ్దంగా ఉంటే మంచిది.ముందు నన్నుపూర్తిగా చెప్పనివ్వండని రిపోర్టర్‌పై మండిపడ్డారు. అనంతరం సమావేశం ముగిసిన తర్వాత రిపోర్టర్ బైడెన్‌ను తిరిగి ప్రశ్నించారు.తాను పుతిన్ గురించి అసలు ఆలోచించనని,ఉక్రెయిన్‌తో యుద్ధంలో పుతిన్ గెలిచే ఛాన్సే లేదని బైడెన్ సమానధానమిచ్చారు.ఉక్రెయిన్‌కు సాయం చేసేందుకు అమెరికా ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ లాంగ్ రేంజ్ క్షిపణుల వినియోగించడంపై అమెరికాకు కొత్త విధానమేమీ లేదని చెప్పారు. 2022 ఫిబ్రవరిలో మొదలైన రష్యా,ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇప్పటికీ కొనసాగుతోంది. -
పుతిన్ ఆకస్మిక చర్చల ప్రతిపాదన
ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధమనీ, అందుకు ఇండియా, చైనా, బ్రెజిల్ మధ్యవర్తిత్వం వహించాలనీ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ నెల 5న చేసిన ఆకస్మిక ప్రతిపాదన ఆసక్తిని కలిగించింది. చర్చలకు ఆయన సుముఖతను చూపటం ఇది మొదటిసారి కాదు. యుద్ధం రెండున్నరేళ్ల క్రితం మొదలు కాగా చర్చల ప్రస్తావనలు గతేడాదిగా వస్తూనే ఉన్నాయి. కొన్నిసార్లు స్వయంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, యూరోపియన్ దేశాల అధినేతలు, వివిధ అంత ర్జాతీయ సంస్థల బాధ్యులు ఈ మాట అంటూనే ఉన్నారు. కానీ కొన్ని కీలకమైన షరతులను పుతిన్ మొదటి నుంచీ పెడుతున్నారు. వీటిని జెలెన్స్కీ అంతే బలంగా తిరస్కరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చర్చలంటూ జరిగినా, అవి ఎలా ముందుకు సాగేదీ ఎవరూ చెప్పలేరు.జెలెన్స్కీ గత జూన్‌లో స్విట్జర్లాండ్‌లో తొంభైకి పైగా దేశాలతో శాంతి సదస్సు నిర్వ హించారు. కానీ ఆ సదస్సుకు ఆయన రష్యాను ఆహ్వానించలేదు. ఆ కారణంగా చైనా వెళ్లలేదు. అంతలోనే ఆయన, త్వరలో మరొక సదస్సు జరపగలమనీ, దానికి రష్యాను ఆహ్వానించగలమనీ ప్రకటించారు. ఆ సదస్సుకు హాజరయ్యేటట్లు రష్యాను ఒప్పించవలసిందిగా కోరేందుకు తన విదేశాంగ మంత్రి దిమిత్రి కునేబాను చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ వద్దకు రాయబారం పంపారు. ఉక్రెయిన్ ప్రతి పాదనలు ఏమిటో చూసి అపుడు స్పందించగలమన్నది రష్యా జవాబు.ఇవన్నీ జూన్, జూలై పరిణామాలు. అటువంటిది ఇపుడు పుతిన్ ఆకస్మికంగా చర్చల ప్రతిపాదన చేయటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇది ఆకస్మికం, ఆశ్చర్యకరంగా తోచటానికి మరికొన్ని కారణాలు న్నాయి. జూన్, జూలై పరిణామాల తర్వాత, కొంత వెనుకముందులుగా చర్చలు ప్రారంభం కావచ్చునని పలువురు భావిస్తుండగా, ఆ తర్వాత కొద్ది వారాలకే ఉక్రెయిన్ సైన్యం తమకూ, రష్యాకూ మధ్యగల ఉత్తర సరిహద్దు నుంచి రష్యాకు చెందిన కర్స్క్ ప్రాంతంపై వేలాది సైన్యంతో మెరుపుదాడి చేసి తగినంత భూభాగాన్ని తన అధీనంలోకి తెచ్చుకుంది. ఇది మరొక ఆశ్చర్యకర పరిణామం. ఎందుకంటే, యుద్ధం జరుగుతున్నది తూర్పు ప్రాంతాలలో. అక్కడ రష్యాది పూర్తి పై చేయిగా ఉండి రోజురోజుకూ ముందుకు చొచ్చుకొస్తున్నారు. ప్రస్తుతం పోక్రొవ్స్‌క్ అనే అతి కీలకమైన కూడలి పట్టణం వద్ద యుద్ధం కేంద్రీకృతమై ఉంది. ఆ పట్టణాన్ని కోల్పోతే ఉక్రెయిన్ తూర్పు ప్రాంతమంతా ప్రమాదంలో పడుతుంది. స్వయంగా ఉక్రె యిన్ సైన్యం చెప్తున్న దానిని బట్టి ఆ కేంద్రం కొద్ది రోజులలోనే రష్యా చేజిక్కవచ్చు. అటువంటి విపత్కర స్థితిలో పోక్రొవ్స్క్కు అదనపు బలాలను పంపి రక్షించుకునేందుకు బదులు కర్స్క్పై దాడి ఎందుకు అన్న సందేహాలు తలెత్తాయి.ఆ చర్చను కొద్దిసేపు వాయిదా వేసి ప్రస్తుతానికి వస్తే, చర్చల మాట రెండు వైపుల నుంచీ కొత్త కాదు. కానీ, అందుకు ఇండియా, చైనా, బ్రెజిల్ మధ్యవర్తిత్వం వహించాలనటం కొత్తమాట. ఇక్కడ ఒక స్పష్టీకరణ అవసరం. వ్లాడివాస్టోక్లో జరుగుతున్న ఈస్టర్న్ ఎకనమిక్ ఫోరం సదస్సు సందర్భంగా ఈ మాట వచ్చింది. ఒక విలేఖరి ప్రశ్నకు సమాధానంగా పుతిన్ ఈ మాట అన్నట్లు వార్తలలో కనిపించింది గానీ, అది నిజం కాదని ఆ వీడియోను చూసినపుడు అర్థమవుతుంది. పుతిన్ ఒక లిఖిత ప్రకటనను చదవటం అందులో కనిపిస్తుంది. అనగా, ముందే ఆలోచించి చెప్పిన మాట అది. వార్తలలో వెలువడిన దానిని బట్టి రష్యా అధ్యక్షుడు అన్నది, చర్చలకు తాము సిద్ధం. అందుకు ఇండియా, చైనా, బ్రెజిల్ మధ్య వర్తిత్వం వహించాలి. వారీ పని చేయగలరు. యుద్ధంతో ముడిపడి ఉన్న అన్ని సమస్యలను వారు పరిష్కరించగలరనే విశ్వాసం ఉంది. ఈ అంశంపై తాను వారితో నిరంతరం సంప్రదిస్తున్నాను. జెలెన్స్కీ, బైడెన్ ఇరువురితో మోదీ మాట్లాడగలరు. అంతర్జాతీయ సంబంధాలలో కీలక పాత్ర వహించేందుకు మోదీకి ఇది మంచి అవకాశం అన్నది పుతిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వ్యాఖ్య. యథా తథంగా ఈ మాటలు ముఖ్యమైనవే. పుతిన్ మరికొన్ని ముఖ్యమైన మాటలన్నారు. వీడియోలో వినిపించిన ఆ మాటలు ఎందువల్లనో వార్తలలో కనిపించలేదు. అవి, ఉక్రెయిన్‌తో చర్చలకు షరతుల వంటివి. అవి ఈ విధంగా ఉన్నాయి. ప్రస్తుతం ఉక్రెయిన్ పాలనలో గల డొనెటెస్క్, లుహాన్స్క్, ఖేర్సాన్, జపోరిజిజియా అనే నాలుగు తూర్పు ప్రాంతాలను రష్యాకు వదలి వేస్తున్నట్లు ప్రకటించాలి. (ఇప్పటికే రష్యా అధీనంలో గల క్రిమియా గురించి ఆయన ప్రస్తావించలేదు గానీ, ఆ విషయమై రాజీకి, చర్చలకు అవకాశం లేదని గతంలోనే అన్నారు.) ‘నాటో’లో చేరబోమని కూడా ఉక్రెయిన్ ప్రకటించాలి. ఆ నాలుగు ప్రాంతాల నుంచి సైన్యాన్ని పూర్తిగా ఉపసంహరించాలి. ఇవి జరిగితే ‘అదే నిమిషంలో’ యుద్ధాన్ని విరమించి చర్చలను ప్రకటిస్తాము.అనగా ఇవి చర్చలకు షరతులన్నమాట. ఈ షరతులను పుతిన్ మొదటినుంచీ పెడుతున్నారు. ఆ విషయంలో రాజీ లేదంటున్నారు. వీటిని జెలెన్స్కీ తమ వైపు నుంచి అంతే బలంగా తిరస్కరిస్తున్నారు. పైగా, రష్యా 2014లో ఆక్రమించిన క్రిమియాను తిరిగి ఇవ్వవలసిందేనంటున్నారు. ఇదే మాట ఇటీవల కూడా పునశ్చరించారు. పైన పేర్కొన్న నాలుగు ప్రాంతాలలో గణనీయమైన భాగాన్ని ప్రస్తుత యుద్ధంలో రష్యా ఆక్రమించుకోగా, అక్కడి నుంచి ఖాళీ చేయాలంటున్నారు. నాటో సభ్యత్వం తమ హక్కని వాదిస్తున్నారు. అనగా, ఇవన్నీ చర్చలకు పుతిన్, జెలెన్స్కీల షరతులన్నమాట. తమ సార్వ భౌమత్వం, భౌగోళిక సమగ్రతల పరిరక్షణకు అవసరమని జెలెన్స్కీ చెబుతున్నారు. నాటో కూటమి విస్తరణ నుంచి ఆత్మరక్షణకూ, ఆ నాలుగు ప్రాంతాలలో మెజారిటీలో గల రష్యన్ భాషీయులపై చిరకాలంగా సాగుతున్న ఉక్రెయిన్ వేధింపులు, తరచూ ప్రాణ హననం నుంచి వారిని రక్షించుకునేందుకు ఇది తప్పనిసరి అని రష్యా వాదిస్తున్నది. ఈ షరతులలోని సహేతుకతలలోకి వెళితే రెండు వైపులా న్యాయం కనిపిస్తుంది. ఉక్రెయిన్ భౌగోళిక సమగ్రతకు రక్షణ ఉండవలసిందే. అదే విధంగా, అమెరికన్ నాటో కూటమి క్రమంగా రష్యా సరిహద్దుల వైపు విస్తరిస్తూ, ఉక్రెయిన్ను నాటోలో చేర్చు కొనజూస్తూ, రష్యా అస్తిత్వానికే ముప్పు తలపెడుతున్నపుడు, వారు ఆత్మరక్షణ కోసం ప్రయత్నించరాదని అనలేము. అట్లాగే, పై నాలుగు ప్రాంతాలలోని రష్యన్ భాషీయులపై మొదటినుంచీ తీవ్రమైన వేధింపు మాట నిజమైనందున, వారికి రక్షణ అవసరం.ఈ విధమైన పరిస్థితులు, షరతుల మధ్య ఇండియా, చైనా, బ్రెజిల్‌లు రాజీ మార్గం కనుగొనటం ఎంత మాత్రం తేలిక కాదు. ఉభయ పక్షాలు ఈ షరతులు విధించటం, వాటిని వారు పరస్పరం తిరస్కరించటం ఇప్పటికే పలుమార్లు జరిగాయి. నాటో ద్వారా ప్రపంచాధిపత్యం అనే లక్ష్యం గల అమెరికా, ఆ కూటమిలో చేరరాదని ఒకవేళ ఉక్రెయిన్ నిర్ణయించుకున్నా అందుకు సమ్మతించే అవకాశం కనిపించదు. ఆ విధంగా మధ్యవర్తుల బాధ్యత మరింత క్లిష్టతర మవుతుంది. అదట్లుంచి భారత్, చైనా, బ్రెజిల్ ప్రముఖ దేశాలు కావటమే గాక రష్యాతో పాటు బ్రిక్స్ కూటమిలో భాగస్వాములు. తన ఆధిపత్యానికి నష్టమని భావించే అమెరికా ఆ కూటమిని భంగ పరిచేందుకు మొదటినుంచి ప్రయత్నిస్తున్నది. ఈ పరిస్థితులన్నింటి మధ్య, ఒకవేళ అసలు ఈ ముగ్గురి మధ్యవర్తిత్వమంటూ సాకారమైనా, అది ఏ విధంగా ముందుకు సాగేదీ ఎవరూ చెప్పలేరు. ఇంతకూ ఈ ప్రతిపాదనకు జెలెన్స్కీ స్పందన ఏమిటో తెలియదు... ఆయన ఇండియా, చైనాల పాత్రను ఇప్పటికే కోరి ఉన్నప్పటికీ.తిరిగి యుద్ధం విషయానికి వస్తే, కర్స్క్పై ఉక్రెయిన్ దాడిలోని ఉద్దేశం రష్యన్ సైన్యాన్ని పోక్రొవ్స్‌క్ నుంచి అటు మళ్లించేట్లు చేయటమని సైనిక నిపుణులు ఊహాగానాలు చేశారు. కానీ రష్యన్ వ్యూహకర్తలు ఆ పని చేయక పోక్రొవ్స్క్ను, ఇతర తూర్పు ప్రాంతా లను ఆక్రమించే పని సాగిస్తున్నారు. ఆ విధంగా కర్స్క్ వ్యూహం విఫలమైందని ఇపుడు ఉక్రెయిన్ సైన్యాధికారులే అంగీకరిస్తున్నారు. ఉక్రెయిన్ కొత్త సైన్యాధిపతి జనరల్ అలెగ్జాండర్ సిరిస్కియీ కొద్ది రోజుల క్రితం మాట్లాడుతూ, కర్స్క్ వైపు నుంచి కూడా తమపై దాడికి రష్యా ఆలోచించటంతో దానిని నిరోధించేందుకు తామే ముందు దాడి చేశామన్నారు గానీ అది నిజమని తోచదు. అటువైపు రష్యన్ యుద్ధ సన్నాహాలు అసలు లేనే లేవు. పుతిన్ ప్రతిపాదనకు రాగల రోజులలో జెలెన్స్కీ స్పందనలు వచ్చినపుడు గానీ ఈ విషయమై కొంత స్పష్టత రాదు.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
రష్యా యుద్ధం ఆగాలంటే అదొక్కటే మార్గం: జెలెన్ స్కీ
కీవ్: ఉక్రెయిన్-రష్యా మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. రష్యాపై ఉక్రెయిన్ సైన్యం దాడులను తీవ్రతరం చేసింది. ఇదే సమయంలో రష్యా బలగాలు కూడా ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్క్ స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధంలో రష్యా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటే మాత్రం వారి దాడులను ఆపగలిగే అవకాశముందని చెప్పుకొచ్చారు.ఇక, తాజాగా ఓ వీడియోలో జెలెన్ స్కీ మాట్లాడుతూ.. రష్యాపై దాడులను తీవ్రతరం చేసి ఆస్తులను ధ్వంసం చేసినప్పుడు మాత్రమే వారు వెనక్కి తగ్గుతారు. అప్పుడు యుద్ధానికి ముగింపు పలికేందుకు రష్యా ముందుకు వచ్చే అవకాశం ఉందన్నారు. రష్యా భూభాగంలో సైనిక లక్ష్యాలను ధ్వంసం చేయడానికి ఉక్రెయిన్ సైన్యానికి అనుమతించాలని అమెరికాను కోరారు. రష్యాలో సుదూర క్షిపణులు ప్రయోగించడానికి తమకు అనుమతి ఇవ్వాలన్నారు. ఈ విషయమై తమ భాగస్వామ్య దేశాలతో చర్చిస్తున్నామని, వారిని ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇదే సమయంలో ఉక్రెయిన్‌పై రష్యా దాడులను కూడా ప్రస్తావించారు. ఈనెల 30వ తేదీన ఉక్రెయిన్‌పై రష్యా జరిపిన దాడిలో ఆరుగురు పౌరులు మరణించారు. 97 మంది గాయపడ్డారని చెప్పారు. Il discorso del Presidente d’Ucraina Volodymyr Zelenskyy. pic.twitter.com/5UzBII0WdS— Ukr Embassy to Italy (@UKRinIT) September 1, 2024 ఇదిలా ఉండగా.. ఆగస్టు 30-31 తేదీల్లో ఉక్రెయిన్ రక్షణ మంత్రి రుస్టెమ్ ఉమరోవ్ వాషింగ్టన్లో అమెరికా అధికారులు, నిపుణులతో సమావేశమయ్యారు. రష్యాతో పోరులో ఉక్రెయిన్‌కు కావాల్సిన ఆయుధాలు గురించి చర్చించారు. ఈ నేపథ్యంలోనే జెలెన్ స్కీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరోవైపు.. ఉక్రెయిన్ సైన్యం రష్యా భూభాగంలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈక్రమంలో రష్యాలోని కుర్స్క్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది. -
కటకటాల్లో టెలిగ్రామ్ చీఫ్
ఆయనేమీ అమెరికా సైనికుల అకృత్యాలను ఆన్లైన్లో రచ్చకీడ్చిన జులియన్ అసాంజ్ కాదు. దేశదేశాల్లోని కోట్లాదిమంది పౌరులపై నిఘా ఉంచుతున్న అమెరికా జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఎస్ఏ) తీరుతెన్నులను బట్టబయలు చేసి రష్యాలో తలదాచుకుంటున్న ఎడ్వర్డ్ స్నోడెన్ కాదు. ఆయన వేలాది కోట్ల డాలర్ల విలువైన అతి పెద్ద మెసేజింగ్ సంస్థ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈఓ పావెల్ ద్యురోవ్. రెండు రోజుల క్రితం ఫ్రాన్స్ పోలీసులు పారిస్‌లో ఆయన్ను అరెస్టు చేసి నిర్బంధించారని తెలియగానే ట్విటర్, టెస్లా సంస్థల అధిపతి ఎలాన్ మస్క్ ఖండించారు. పావెల్ విడు దల కోసం ట్విటర్ వేదికగా ‘ఫ్రీ పావెల్’ ఉద్యమాన్ని ప్రారంభించారు. ప్రపంచాధినేతల్లో ఎంతో పలుకుబడిగల మస్క్ గతంలో ఎప్పుడూ ఇలాంటి వివాదాల జోలికిపోలేదు. ఆరు నూరైనా... ఎలాంటి పర్యవసానాలూ, పరిణామాలూ ఎదురైనా పౌరుల భావప్రకటనా స్వేచ్ఛ ఉండితీరాలని వాదించటంలో పావెల్‌కి ఎవరూ సాటిరారు. నిజానికి అది వివాదాస్పదం కావటంతోనే అతను జైలుపాలయ్యాడు. కారణాలు వెల్లడి కాకపోయినా పసివాళ్లతో రూపొందించిన బూతుచిత్రాల పంపిణీకీ, మాదకద్రవ్య ముఠాల కార్యకలాపాలకూ, ఉగ్రవాద కార్యకలాపాలకూ, అక్రమమార్గాల్లో ద్రవ్య చలామణీకీ టెలిగ్రామ్ అవకాశమిస్తోందన్నది చాన్నాళ్లుగా ఉంటున్న అభియోగాల సారాంశం. భావప్రకటనా స్వేచ్ఛకు ఏమేరకు హద్దులుండాలి... దానివల్ల ఎదురయ్యే దుష్పరిణామాలకు బాధ్యులెవరు... ఈ విషయంలో ప్రభుత్వాల ప్రమేయాన్ని ఎంతవరకూ అనుమతించాలి వంటి ప్రశ్నలు ఎప్పటినుంచో అందరినీ వేధిస్తున్నాయి. ఇప్పుడు పావెల్ అరెస్టుతో అవి మరింత ప్రము ఖంగా చర్చకొస్తున్నాయి. పావెల్ రష్యా పౌరుడని పేరునిబట్టి ఎవరైనా గుర్తుపడతారు. అయితే ప్రస్తుతం ఆయనకు ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దేశాల పౌరసత్వం ఉంది. అసమ్మతిని అణిచేయటంలో సిద్ధహస్తుడైన రష్యా అధ్యక్షుడు పుతిన్ చాన్నాళ్లుగా అతన్ని బంధించాలని ప్రయత్నిస్తున్నారు. పావెల్‌ను అప్పగించాలని, కనీసం మాట్లాడటానికి అనుమతించాలని తాజాగా ఫ్రాన్స్‌ను రష్యా డిమాండ్ చేస్తోంది. 2011లో రష్యా నిర్వహించిన ఎన్నికలు పూర్తిగా బోగస్ అంటూ బయ ల్దేరిన ‘మంచు విప్లవం’ (స్నో రివల్యూషన్) దేశం నలుమూలలా విస్తరించటానికి పావెల్ దోహద పడ్డాడు. ఆ క్రమంలో ఏర్పడిన మెసేజింగ్ యాప్ కాస్తా తర్వాతకాలంలో టెలిగ్రామ్‌గా రూపుదిద్దు కుంది. పావెల్ ఉక్రెయిన్‌లో రష్యా దురాక్రమణను ఖండించే అభిప్రాయాలకు చోటిచ్చాడు.అంతేకాదు... ఇజ్రాయెల్ గాజాలో సాగిస్తున్న అకృత్యాలను బట్టబయలు చేసే వీడియోలను వెల్లడించేందుకు అనుమతించాడు. ఇతర దిగ్గజ సంస్థలు మొహం చాటేసిన ఈ అకృత్యాలు టెలి గ్రామ్ లేకపోతే బాహ్య ప్రపంచానికి బహుశా తెలిసేవి కాదు. వాట్సాప్ వంటి ఇతర సంస్థలకు లేని వెసులుబాటు– రెండు లక్షలమందితో గ్రూప్ నిర్వహించటం– టెలిగ్రామ్లోనే సాధ్యం. అయితే ఇందువల్ల అనర్థాలు తలెత్తటం కూడా వాస్తవం. ఆమధ్య పారిస్, బెర్లిన్ నగరాల్లో పేలుళ్లకు, దాడులకు ఉగ్రవాద సంస్థ ఐఎస్ టెలిగ్రామ్ యాప్‌ను వాడుకుంది. ఆ తర్వాత సంస్థ సాంకేతిక సిబ్బంది దాన్ని కట్టడిచేశారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు చోటీయని వ్యవస్థ ఏర్పర్చు కోవాలని, నేరగాళ్ల ఆనుపానులు ఎప్పటికప్పుడు తమకు అందించాలని అనేక దేశాలు టెలిగ్రామ్‌ను కోరుతున్నాయి. యూరప్ దేశాలు ఈయూ డిజిటల్ సర్వీసుల చట్టాన్ని రెండేళ్ల క్రితం తీసు కొచ్చాయి. పర్యవసానంగా చాలా మాధ్యమ సంస్థలు దారికొచ్చాయి. కృత్రిమ మేధ (ఏఐ) ఆధా రంగా ‘అవాంఛిత’ సందేశాలను జల్లెడ పడుతున్నాయి. వాటిని నిలిపేస్తున్నాయి. అయితే సమస్యే మంటే... ఈ వంకన అనేక మాధ్యమాలు సహేతుకమైన అసమ్మతికి కూడా తలుపులు వేస్తున్నాయి. నియంతలకు వంత పాడుతున్నాయి. కొన్ని సంస్థలైతే సంకేత నిక్షిప్త సందేశాల(ఎన్క్రిప్షన్)కు అవకాశమున్నదని పైకి చెబుతూ తమ వినియోగదారుల ఆనుపానులు తెలుసుకోవటానికి ప్రభు త్వాలకు అవకాశమిస్తున్నాయి. కానీ టెలిగ్రామ్ లొంగటం లేదు. ప్రతి దేశంలోనూ స్థానిక చట్టాల లొసుగులను వాడుకుని బయటపడుతోంది. అలాగని తన వేదికపై వినియోగదారులు పరస్పరం పంపుకునే సందేశాలు టెలిగ్రామ్‌కు తెలియక కాదు. వాటిని అవసరమనుకున్నప్పుడల్లా చూస్తోంది. భావప్రకటనా స్వేచ్ఛకూ, బాధ్యతకూ మధ్య సన్నని విభజన రేఖ ఉంటుంది. స్వేచ్ఛ మాటున వదంతులు సృష్టించటం, అల్లర్లకు ఆజ్యం పోయటం ఎవరు చేసినా తప్పే అవుతుంది. అలాంటి వారు చట్టం ముందు తలవంచాల్సిందే. ఆ మధ్య గోరక్షణ పేరుతో బృందాలు ఏర్పడి వ్యక్తులను కొట్టిచంపిన ఉదంతాలు పెరిగాక సందేశాల పంపిణీపై వాట్సాప్ అనేక పరిమితులు విధించింది. మన దేశంలో టెలిగ్రామ్‌కు 50 లక్షలమంది చందాదారులున్నారు. మాదకద్రవ్యాలు, జూదం, బెది రించి డబ్బులు గుంజుకోవటం వంటి కార్యకలాపాలకు అది వేదిక వుతున్నదని మన ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇటీవల నీట్ ప్రశ్నపత్రాల లీకు పుణ్యం టెలిగ్రామ్దే. కేంద్ర హోంశాఖ నేతృత్వంలోని ఇండియన్ సైబర్ క్రైం కో–ఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) ఆ వ్యవహారాలపై దృష్టి సారించింది. ఇది ఒక కొలిక్కి వస్తే టెలిగ్రామ్ నిషేధానికి కూడా గురికావొచ్చన్నది విశ్లేషకుల అంచనా. ఏదేమైనా తనవల్ల సమాజానికి నష్టం కలుగుతున్నదని గ్రహించాక టెలిగ్రామ్ బాధ్యత గుర్తెరగవలసింది. కనీసం ఆ పని ఇప్పుడైనా జరగాలి. అదే సమయంలో ఆ వంకన ప్రభుత్వాలు సహేతుక విమర్శ లకూ, అసమ్మతికీ పాతరేయకుండా చూడటం ప్రజాస్వామికవాదుల కర్తవ్యం. -
ఏఐ ప్యాషన్ షో.. ప్రముఖుల ర్యాంప్ వాక్! (ఫొటోలు)
-
దేశాధినేతల స్నేహ రహస్యం ఏమిటి?
ఇటీవలి కాలంలో రష్యా–భారత దేశాల మధ్య సరుకుల వర్తకం 65 బిలియన్ల డాలర్ల మేర జరిగిందని తేలింది. ‘వర్తకం’ అంటే తెలుసు కదా? ఈ దేశం, ఆ దేశానికీ; ఆ దేశం, ఈ దేశానికీ సరుకులు అమ్మడమూ, కొనడమూ! రెండు దేశాల మధ్యా వర్తకం అన్నప్పుడు, యంత్రాలూ, ముడి ఆయిలూ, మరీ ముఖ్యంగా మారణాయుధాలూ, ఎన్నో! ముఖ్యంగా రష్యా నించి యుద్ధ సామగ్రిని భారత ప్రభుత్వం, పెద్ద ఎత్తున కొన్నది. ఇంతకీ, ఈ దేశాధినేతలు చేసేది ఏమిటి? రెండు దేశాల పెట్టుబడిదారీ వర్గాల తరఫున ప్రతినిధులుగా వ్యవహరించడమే! అంటే, సరుకుల్ని అమ్ముకోడానికీ, కొనుక్కోడానికీ, దేశాధినేతలు స్నేహాలు ప్రకటిస్తూ, ఒకరిని ఒకరు ఆకాశానికి ఎత్తేసుకుంటారు!నిన్నగాక మొన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా వెళ్ళినప్పుడు, రష్యా ప్రెసిడెంటు పుతిన్ అన్న మాటలు ఇవి: ‘‘నా ప్రియాతి ప్రియమైన స్నేహితుణ్ణి కలిసినందుకు ఎంతో సంతోషంగా వుంది.’’‘‘ఇచ్చానమ్మా వాయినం, పుచ్చుకున్నానమ్మా వాయినం’’ అన్నట్టు, పుతిన్ గురించి మోదీ కూడా ఏదో అనాలి కదా? ఆ మాటలు ఇవి: ‘‘నా ప్రియమిత్రుడు పుతిన్, రష్యా–భారత్‌ల మధ్య స్నేహాన్ని శిఖరాగ్రాలకు తీసికెళ్ళాడు’’అని! ఇద్దరూ కలవగానే భారత ప్రధాని, తన ప్రత్యేకమైన అలవాటు ప్రకారం, ఆ ప్రియ మిత్రుణ్ణి ‘ఆత్మీయ ఆలింగనం’ చేసుకున్న దృశ్యాలు అందరూ చూసే వుంటారు. అంతేనా? పుతిన్, మోదీని, తన గుర్రపు శాలకి తీసికెళ్ళడం, అక్కడ వాళ్ళిద్దరూ చెరో గుర్రానికీ ఏదో తినిపిస్తూ, ముద్దు చెయ్యడం! ఇంతేనా! బుజ్జి కారులో మోదీని ఎక్కించుకుని, పుతినే ఆ బుజ్జిని స్వయంగా నడుపుతూ, తన పెద్ద ఎస్టేట్‌లో విలాసంగా తిప్పడం! ఆ ప్రియ స్నేహితులిద్దరికీ అంతా సరదాగా జరిగిపోయింది. ఈ రెండు దేశాల అగ్రనేతలూ ఎందుకు కలిశారంటారు? ఇటీవలి కాలంలో రష్యా–భారత దేశాల మధ్య సరుకుల వర్తకం 65 బిలియన్ల డాలర్లది (సుమారు 542 లక్షల కోట్ల రూపాయలది) జరిగిందని తేలింది. ‘వర్తకం’ అంటే తెలుసు కదా? ఈ దేశం, ఆ దేశానికీ; ఆ దేశం, ఈ దేశానికీ సరుకులు అమ్మడమూ, కొనడమూ! ఈ భారీ వర్తకం వల్ల వచ్చిన మొత్తంలో, భారత దేశానికి వచ్చింది, దాదాపు 20 శాతమేనట! రష్యాకి 80 శాతం! రెండు దేశాల మధ్యా వర్తకం అన్నప్పుడు, యంత్రాలూ, ముడి ఆయిలూ, మరీ ముఖ్యంగా మారణాయుధాలూ, ఎన్నో! ముఖ్యంగా రష్యా నించి యుద్ధ సామగ్రిని భారత ప్రభుత్వం, పెద్ద ఎత్తున కొన్నది. రెండు దేశాల అధినేతలు కలిసినప్పుడు, ఏమేమి మాట్లాడుకునేదీ, ఏ రకం ఒప్పందాలు చేసుకునేదీ, అన్నీ క్షుణ్ణంగా అంతకు ముందే, రెండు దేశాల మంత్రులూ, అధికారులూ, సిద్ధం చేసి వుంచుతారు. మోదీకి ఎర్ర తివాచీలూ, సైనిక వందనాలూ, విందు భోజనాలూ, వగైరాలు అయ్యాక, దేశాధినేతలు సరుకుల గురించి అధికారికంగా, లాంఛనంగా, కాసేపు ముచ్చటించుకుంటారు.వర్తకంలో, ఎగుమతులుగా, దిగుమతులుగా, ఇటూ అటూ తిరిగిన ఆ సరుకుల తయారీదారులు, ఆ రెండు దేశాల కార్మికులే! కార్మికుల యజమానులు, ఆ దేశాల పెట్టుబడిదారులు! కొన్ని సరుకులు ప్రభుత్వ రంగ సంస్థలలో తయారైనవైతే, ప్రభుత్వాలు కూడా పెట్టుబడిదారులే!ఇంతకీ, ఈ దేశాధినేతలు చేసేది ఏమిటి? రెండు దేశాల పెట్టుబడిదారీ వర్గాల తరఫున ప్రతినిధులుగా వ్యవహరించడమే! ‘కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక’ అనే 1848 నాటి రచనలో, మార్క్స్, ఎంగెల్సులు చెప్పినట్టు: ‘‘ఆధునిక రాజ్యంలో, ప్రభుత్వం (ఎగ్జిక్యూటివ్) అనేది, మొత్తం బూర్జువా వర్గపు సమష్టి వ్యవహారాలను చక్కబెట్టే కమిటీ మాత్రమే!’’ మైకెల్ పెరెంటీ అనే ఒక అమెరికన్ రాజకీయ శాస్త్రవేత్త అయితే, మార్క్స్, ఎంగెల్సులకన్నా ఒక అడుగు ముందుకు వేసి, అనేక ఆధారాలు చూపుతూ, ‘‘కొద్దిమందికే ప్రజాస్వామ్యం’’ అనే తన పుస్తకంలో, ‘ప్రెసిడెంట్’ అనే దేశాధినేత గురించి, మామూలు మాటల్లో చెప్పాలంటే, ‘సరుకులు అమ్మేవాడు’ (‘‘సేల్సుమాన్ ఆఫ్ ది సిస్టం’’) అంటాడు!అంటే, సరుకుల్ని అమ్ముకోడానికీ, కొనుక్కోడానికీ, దేశాధినేతలు స్నేహాలు ప్రకటిస్తూ, ఒకరిని ఒకరు ఆకాశానికి ఎత్తేసుకుంటారు! తమ దేశాల్లో వున్న అత్యున్నత బిరుదుల్ని ఒకరికి ఒకరు ఇచ్చుకోవడం కూడా! అదే జరిగింది నిన్న! పాతకాలపు రష్యాలో, ‘సనాతన చర్చి’ని (‘ఆర్తొడాక్స్ చర్చ్’) స్థాపించిన మత బోధకుడైన ‘సెయింటు ఆండ్రూ’ పేరుతో వున్న ‘అత్యున్నత బిరుదు’గా ఆ దేశం కీర్తించే బిరుదుని మోదీకి, పుతిన్ ఇచ్చి సత్కరించాడు. ఈ బిరుదుని జారు చక్రవర్తి 1698లో ప్రవేశ పెట్టాడు. దీనిని 1917లో, కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన విప్లవం జరిగాక, 1918లో రద్దు చేశారు. 1998లో, ‘ఎల్త్సిన్’ అనే మాజీ కామ్రేడు తిరిగి దానిని ప్రవేశపెట్టాడు. ఈ కామ్రేడే 1991లో ‘సోవియట్ కమ్యూనిస్టు పార్టీ’ని రద్దు చేసినవాడు! అదే సంవత్సరం సోవియట్ యూనియన్ని కూడా రద్దు చేశాడు!భారతదేశపు సనాతన మతాభిమానుల్లో అగ్రగణ్యుడైన వ్యక్తికి, ఆ దేశ సనాతన మత బోధకుడి పేరన వున్న బిరుదు దొరికింది! ఎంత సముచిత సత్కారం! మోదీ రష్యా పర్యటనలో, కొసమెరుపు అనదగ్గ సంగతి ఒకటి వుంది. ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు జెలెనిస్కీ, మోదీ రష్యాలో పర్యటించడాన్ని ఇలా తప్పుపట్టాడు: ‘‘ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామ్యపు దేశాధినేత, మాస్కోలో, రక్త పిపాసిని (పుతిన్‌ని) కావలించుకోవడం నిరాశాజనకం’’ అని! ఈ జెలెనిస్కీని కూడా, ఈ మోదీయే, నిన్న పుతిన్‌ని కావిలించుకున్నట్టే, మొన్న, అంటే, ఆ మధ్య, ఇటలీలో గట్టిగా కావిలించుకున్నాడు! ఈ కావిలింతలు మోదీకి రాజకీయ వెన్నతో పెట్టిన విద్య!ఉక్రెయిన్‌లో పిల్లల ఆసుపత్రి మీద రష్యా బాంబులు పడి, అనేక మంది చచ్చిపోయిన కొన్ని గంటల తర్వాత, మోదీ రష్యానేల మీద అడుగు పెట్టాడు. ఆ వార్త విమానం దిగుతూ విన్నాడేమో! తర్వాత, మొక్కుబడిగా పుతిన్‌తో అన్నమాటలు: ‘‘యుద్ధం పరిష్కారం కాదు. మానవుల ప్రాణాలు అమూల్యం, అమాయక పిల్లల మరణాలు చూస్తే, హృదయం ద్రవిస్తుంది!’’ అబ్బా! ఎంత సున్నిత హృదయం! ఈ మాటలు మోదీ అంటున్నప్పుడు, పుతిన్ బెల్లం కొట్టిన రాయిలాగా ముభావంగా వుండిపోయాడు! ‘ఈ రకం మొక్కుబడి మాటలు అన్ని దేశాల అధినేతలకీ మామూలేలే’ అన్నట్టు!మరి, ఏ సమస్యకీ యుద్ధం పరిష్కారం కాదని, మోదీ భావించినప్పుడు, రష్యా నించీ, అమెరికా నించీ, ఫ్రాన్స్ నించీ, ఇజ్రాయిల్ నించీ కుప్పలు కుప్పలుగా, లక్షల కోట్ల ఖర్చుతో మారణాయుధాలు ఎందుకు కొన్నట్టు? పైగా, ఉక్రెయిన్ మీద రష్యా దాడిని ఖండిస్తూ, ఐక్య రాజ్య సమితిలో కొన్ని దేశాలు తీర్మానాలు చేసినప్పుడు, మోదీ ప్రభుత్వం ఓటింగులో పాల్గొననే లేదు! దీన్ని ఏమనాలి? ‘యుద్ధం వద్దు! అది పరిష్కారం కాదు!’ అనే నీతి వచనాలా! దురాక్రమణ యుద్ధం చేస్తున్న దేశపు ప్రభుత్వం ఇచ్చే ఆ దేశపు ‘అత్యున్నత’ బిరుదుని మోదీ, ఏ శాంతి నీతితో తీసుకున్నట్టు? ఈ రెండు దేశాధినేతల స్నేహ రహస్యం తెలిసిందా? - వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి- రంగనాయకమ్మ -
పుతిన్ కక్ష సాధింపు..! ప్రత్యర్థి భార్యపై వారెంట్
మాస్కో: అయిదోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత కూడా రాజకీయ ప్రత్యర్థులు లక్ష్యంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ వేట ఆగలేదు. ప్రత్యర్థులు చనిపోయిన తర్వాత కూడా వారి కుటుంబ సభ్యులపై కక్ష సాధింపు కొనసాగుతోంది.గతంలో జైలులో వివాదాస్పదంగా మృతి చెందిన అధ్యక్షుడు పుతిన్ ప్రత్యర్థి అలెక్సీ నవాల్ని భార్య యులియా నవల్నయాపై తాజాగా అరెస్టు వారెంట్ జారీ అయింది. తీవ్రవాదసంస్థలో చేరినందుకుగాను వారెంట్ జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు.యులియాను రెండు నెలలు నిర్బంధంలో ఉంచేందుకు పోలీసులకు అనుమతిచ్చినట్లు మాస్కోలోని బాస్మన్నే కోర్టు వెల్లడించింది. తనపై వారెంట్ జారీ అవడం పట్ల యులియా తీవ్రంగా స్పందించారు. పుతిన్ ఒక హంతకుడు, వార్ క్రిమినల్, జైలులో ఉండాల్సిన వాడని మండిపడ్డారు. యులియాపై అరెస్ట్ వారెంట్ జారీ అయినట్లు ఆమె సిబ్బంది ఎక్స్(ట్విటర్)లో ధృవీకరించారు.యులియా భర్త, పుతిన్ ప్రత్యర్థి అలెక్సీ నవాల్ని ఆర్కిటిక్ జైలులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈయన మృతిపై అమెరికా సహా పలు దేశాలు స్పందించాయి. నవాల్ని మృతి చెందిన తర్వాత ఆయన పోరాటాన్ని ముందుకు తీసుకువెళతానని భార్య యులియా ప్రతిజ్ఞ చేశారు. -
యుద్ధం వద్దు..!
-
గుర్రపుశాలలో మోదీ, పుతిన్
మాస్కో: రష్యాలో ప్రధాని మోదీ టూర్ రెండోరోజు కొనసాగుతోంది. మంగళవారం(జులై 9) ఉదయం రష్యా అధ్యకక్షుడు పుతిన్, మోదీలు కలిసి పుతిన్ అధికారిక నివాసం నొవో ఒగర్యోవ్లో గార్డెన్లో టీ సేవించారు. ఈ సందర్భంగా వీరిద్దరూ పలు విషయాలపై అనధికారికంగా చర్చించుకున్నారు. అనంతరం గార్డెన్లో ఇద్దరు కలిసి కొద్దిసేపు నడిచారు. అక్కడే ఉన్న గుర్రాలశాలను సందర్శించి గుర్రాలను చేతితో నిమిరి పలకరించారు. మంగళవారం పుతిన్, మోదీ మధ్య శిఖరాగ్ర సదస్సులో భాగంగా ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. ప్రధాని మోదీ సోమవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో మాస్కో చేరున్నారు. అనంతరం అధ్యక్షుడు పుతిన్ నివాసంలో ఇచ్చిన విందు స్వీకరించారు. ఈ సందర్భంగా భారత ప్రజల కోసం మోదీ చేస్తున్న కృషిని పుతిన్ కొనియాడారు. -
రష్యా టూర్‌కు బయలుదేరిన ప్రధాని
న్యూఢిల్లీ: మూడో టర్ములో ప్రధాని మోదీ రెండో విదేశీ టూర్ మొదలైంది. రష్యా, ఆస్ట్రియా దేశాల్లో పర్యటన కోసం సోమవారం(జులై 8) ఆయన ఢిల్లీ నుంచి బయలుదేరారు. మూడు రోజుల పాటు రెండు దేశాల్లో ప్రధాని పర్యటన సాగనుంది. Over the next three days, will be in Russia and Austria. These visits will be a wonderful opportunity to deepen ties with these nations, with whom India has time tested friendship. I also look forward to interacting with the Indian community living in these countries.…— Narendra Modi (@narendramodi) July 8, 2024 పర్యటనలో భాగంగా భారత్, రష్యా 22వ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని పాల్గొననున్నారు. సదస్సులో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ద్వైపాకక్షిక చర్చలు జరపనున్నారు. రష్యాలో నివసిస్తున్న భారతీయులను ప్రధాని కలవనున్నారు. అనతరం అక్కడి నుంచి ఆస్ట్రియా వెళ్లనున్నారు. 40 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఆస్ట్రియాలో పర్యటించనుండటం విశేషం. -
అగ్రరాజ్యాలు కళ్లు తెరుస్తాయా?
తెగేదాకా లాగితే ఏమవుతుందో అమెరికాతోపాటు యూరప్ దేశాలు తెలుసుకోవాల్సిన సందర్భమిది. బుధవారం రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉత్తర కొరియాను సందర్శించి ఆ దేశంతో సైనిక ఒడంబడిక కుదుర్చుకున్నారు. ఆ మర్నాడు వియత్నాం వెళ్లి డజను ఒప్పందాలు చేసుకున్నారు. అందులో అణు పరిశోధనలకు సంబంధించిన అంశం కూడా ఉంది. వియత్నాంతో రక్షణ, భద్రత సహా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకోవటం తమ లక్ష్యమని కూడా పుతిన్ చెప్పారు. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ యుద్ధం ప్రారంభించిన నాటినుంచీ దాన్ని ఆంక్షల చట్రంలో బిగించి ఏకాకిని చేయాలని అమెరికా, యూరప్ దేశాలు తలపోశాయి. ఉత్తర కొరియా ఏనాటినుంచో అలాంటి ఆంక్షల మధ్యే మనుగడ సాగిస్తోంది. ఇరాన్ సరేసరి. ఇలా ఏకాకుల్ని చేయాలన్న దేశాలన్నీ ఏకమవుతున్నాయని, అది ప్రమాద సంకేతమని అమెరికా, పాశ్చాత్య దేశాలు గ్రహిస్తున్న దాఖలా లేదు. ఆసియా–పసిఫిక్ ప్రాంతానికి సరికొత్త భద్రతా వ్యవస్థ ఏర్పడాలన్నదే తన ధ్యేయమని పుతిన్ అనటంలోని ఉద్దేశమేమిటో తెలుస్తూనే ఉంది. ఉత్తర కొరియా ఆవిర్భావానికీ, దాని మనుగడకూ నాటి సోవియెట్ యూనియనే కారణం. జపాన్ వలస పాలనతో సర్వస్వం కోల్పోయి శిథిలావస్థకు చేరుకున్న కొరియా భూభాగంలోకి రెండో ప్రపంచ యుద్ధం ముగింపు దశలో సోవియెట్ సైనిక దళాలు అడుగుపెట్టాయి. ఆ వెంటనే అమెరికా సైతం అప్పటికింకా సోవియెట్ సైన్యం అడుగుపెట్టని దక్షిణ ప్రాంతానికి తన సైన్యాన్ని తరలించింది. పర్యవసానంగా ఆ దేశం ఉత్తర, దక్షిణ కొరియాలుగా విడిపోయింది. సోవియెట్ స్ఫూర్తితో సోషలిస్టు వ్యవస్థ ఏర్పడిందని మొదట్లో ఉత్తర కొరియా ప్రకటించినా అక్కడ అనువంశిక పాలనే నడుస్తోంది. ఆ దేశం గురించి పాశ్చాత్య మీడియా ప్రచారం చేసే వదంతులే తప్ప అక్కడ ఎలాంటి వ్యవస్థలున్నాయో, అవి ఏం సాధించాయో తెలుసుకునే మార్గం లేదు. ఇటు పెట్టుబడిదారీ వ్యవస్థ వేళ్లూనుకున్న దక్షిణ కొరియా, అమెరికా అండదండలతో బహుముఖ అభివృద్ధి సాధించింది. సోవియెట్ యూనియన్ కుప్పకూలి రష్యా ఏర్పడ్డాక ఉత్తర కొరియాతో ఆ దేశానికున్న సంబంధాలు క్రమేపీ కొడిగట్టాయి. ప్రచ్ఛన్న యుద్ధ దశ అంతమైందని, ఇక ప్రపంచం నిశ్చింతగా ఉండొచ్చని అందరూ అనుకున్నారు. అమెరికా, పాశ్చాత్య దేశాలు పేరాశకు పోనట్టయితే ఆ ఆశ సాకారమయ్యేది. అది లేకపోబట్టే ప్రపంచం మళ్లీ గతంలోకి తిరోగమిస్తున్న వైనం కనబడుతోంది. అనునిత్యం సమస్యలతో సతమతమయ్యే ఆ పరిస్థితులు తిరిగి తలెత్తటం ఖాయమన్న అంచనాలు వస్తున్నాయి.కొన్నేళ్లక్రితం వరకూ ఉత్తర కొరియాపై కారాలు మిరియాలు నూరుతున్న పాశ్చాత్య దేశాలను రష్యా పెద్దగా పట్టించుకునేది కాదు. పొరుగునున్న చైనానుంచే ఆ దేశానికి సమస్త సహకారం లభించేది. 1994లో తనకున్న ఒక అణు రియాక్టర్నూ మూసేయడానికి ఉత్తర కొరియా అంగీకరించింది. అందుకు బదులుగా అమెరికా నుంచి రెండు విద్యుదుత్పాదన అణు రియాక్టర్లు స్వీకరించటానికి సిద్ధపడింది. కానీ 2002లో జార్జి డబ్ల్యూ బుష్ అధికారంలోకొచ్చాక ఆ ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దుచేశారు. ఈ పరిణామాల సమయంలోకూడా రష్యా మౌనంగానే ఉంది. శత్రువు శత్రువు తన మిత్రుడని ఎంచి ఇప్పుడు అదే రష్యా తాజాగా ఉత్తర కొరియాతో సైనిక ఒప్పందం కుదుర్చుకుంది. తన నేతృత్వంలోని వార్సా కూటమిని రద్దుచేసుకుని, నాటోలో చేరడానికి రష్యా సిద్ధపడినప్పుడు తిరస్కరించింది నాటోయే. తూర్పు దిశగా విస్తరించే ఉద్దేశం తమకు లేదని, దాని సరిహద్దు దేశాలకు నాటో సభ్యత్వం ఇవ్వబోమని హామీ ఇచ్చిన ఆ సంస్థ అందుకు విరుద్ధంగా ప్రవర్తించింది. పొరుగునున్న చిన్న దేశాలపై పెత్తనం చలాయించాలన్న యావ రష్యాకుంటే దాన్ని ఎలా దారికి తేవాలో ఆ దేశాలు నిర్ణయించుకుంటాయి. కానీ వాటితో అంటకాగి రష్యాను చికాకు పర్చటమే ధ్యేయంగా గత రెండు దశాబ్దాలుగా అమెరికా, పాశ్చాత్య దేశాలు ప్రవర్తించాయి. ఈమధ్య ఇటలీలో జీ–7 సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శాంతియుతంగా, చర్చలద్వారా ఉక్రెయిన్ సమస్యకు పరిష్కారం అన్వేషించాలని సూచించారు. కానీ వినేదెవరు? విశ్వసనీయతగల అంతర్జాతీయ సంస్థల మధ్యవర్తిత్వంలో రష్యా, ఉక్రెయిన్ల మధ్య చర్చలు జరిగితే, ఒప్పందం కుదిరితే అది ఆ రెండు దేశాలకూ మాత్రమే కాదు, ప్రపంచానికి కూడా మంచి కబురవుతుంది. ప్రపంచం ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం అంచుల్లో ఉంది. అమెరికా, దాని ప్రత్యర్థులు రష్యా, చైనాలు ప్రధాన అణ్వస్త్ర దేశాలు. అమెరికా వద్ద దాదాపు 1,700 అణ్వస్త్రాలున్నాయి. అందులో కనీసం సగం నిమిషాల్లో ప్రయోగించేందుకు వీలుగా నిరంతర సంసిద్ధతలో ఉంటాయంటారు. అమెరికాపై ఒక్క అణ్వస్త్రం ప్రయోగించినా క్షణాల్లో యూరప్, ఆసియా దేశాల్లోని దాని స్థావరాలనుంచి పెద్ద సంఖ్యలో అణ్వస్త్రాలు దూసుకెళ్లి శత్రు దేశాలను బూడిద చేస్తాయి. రష్యా, చైనాలపై దాడి జరిగినా ఇదే పరిస్థితి. చిత్రమేమంటే ఒకప్పుడు అణ్వాయుధాలపై బహిరంగ చర్చ జరిగేది. అది ఉద్రిక్తతల నివారణకు తోడ్పడేది. 80వ దశకంలో మధ్యతరహా అణ్వాయుధాల మోహరింపు యత్నాలు జరిగినప్పుడు అమెరికా, యూరప్ దేశాల్లో భారీయెత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఫలితంగా అప్పటి అమెరికా అధ్యక్షుడు రీగన్, నాటి సోవియెట్ అధ్యక్షుడు గోర్బచెవ్ వాటి నిషేధానికి సంసిద్ధులయ్యారు. కానీ సాధారణ ప్రజలకు సైతం యుద్ధోన్మాదం అంటించారు. ఈ పరిస్థితులు మారాలి. అగ్రరాజ్యాలు వివేకంతో మెలిగి శాంతి నెలకొనేందుకు చిత్తశుద్ధితో కృషిచేయాలి. -
‘బలి’ కోరుతున్న సాంకేతిక విజయం!
‘ది హ్యాండ్ ఆఫ్ గాడ్’ గోల్ గురించి క్రీడా ప్రియులందరూ వినే ఉంటారు. 1986 ఫుట్‌బాల్ వరల్డ్ కప్ సందర్భంగా అర్జెంటీనా – ఇంగ్లండ్ మ్యాచ్‌లో డీగో మారడోనా చేసిన తొలి గోల్ వివాదాస్పదమైంది. డీగో చేసిన హెడర్ గోల్‌ను వాస్తవానికి చేత్తో నెట్టాడని ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో రికార్డింగ్ సౌకర్యం లేకపోవడం వల్ల రెఫరీ దాన్ని గోల్‌గానే ప్రకటించాడు. తర్వాత నాలుగు నిమిషాలకే ‘గోల్ ఆఫ్ ది సెంచరీ’ని కొట్టిన మారడోనా, అదే ఊపులో వరల్డ్ కప్‌ను గెలుచుకోవడమే గాక ఫుట్‌బాల్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించారు. వివాదాస్పద గోల్‌పై ఆ తర్వాత స్పందించిన మారడోనా అది ‘సగం మారడోనా హెడ్, సగం హ్యాండ్ ఆఫ్ గాడ్’ ఫలితమని ప్రకటించాడు.దుబాయ్‌లో ఇటీవల కురిపించిన కృత్రిమ వర్షం ఎంత బీభత్సాన్ని సృష్టించిందో ప్రపంచమంతా చూసింది. క్లౌడ్ సీడింగ్ ఓవర్‌డోస్‌కు వాతావరణ మార్పులు కూడా తోడైన ఫలితంగా రెండేళ్లలో కురవాల్సిన వర్షమంతా ఒకేరోజు కురిసి ఎమిరేట్‌ను అతలాకుతలం చేసింది.ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి జరిగిన ఎన్నికల ఫలితాలను చూస్తుంటే ఏదో ‘అదృశ్య హస్తం’ (హ్యాండ్ ఆఫ్ గాడ్) పనిచేసినట్టుగా, కృత్రిమ ఓట్ల వర్షం కురిపించినట్టుగా అనిపించక మానదు. లేదంటే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఇటువంటి ఫలితాలు రావాలంటే రష్యా నాయకుడు పుతిన్ లేదా తుర్కియే పాలకుడు ఎర్డోగాన్ లేదా మయన్మార్ మిలిటరీ జుంటా ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగి ఉండాలి. అలా జరగలేదు కాబట్టి ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ ప్రమేయం ఉండాలి. ఎవరా గాడ్? కేంద్ర ప్రభుత్వమా? ఎన్నికల సంఘమా... ఎవరు? కృత్రిమ ఓట్ల వర్షానికి క్లౌడ్ సీడింగ్ ఎవరు చేశారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జనసామాన్యం మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలివి.ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్లను ట్యాంపరింగ్ చేయడం ద్వారా ఫలితాలను తారుమారు చేయడం సాధ్యమేనని స్వయంగా చంద్రబాబే పలుమార్లు ప్రకటించారు. ఆయన అభిమాని వేమూరి రవి ఇంకొంచెం ముందుకెళ్లి ఈవీఎమ్‌లను ఎలా హ్యాక్ చేయవచ్చో మీడియా సమక్షంలోనే ప్రదర్శించి చూపెట్టారు. అందువల్ల ఈవీఎమ్‌ల ట్యాంపరింగ్ అనే ఆర్ట్‌పై కూటమికి స్పష్టమైన అవగాహన ఉన్నది.రాష్ట్రవ్యాప్తంగా సాయంత్రం 5 గంటలకు 68 శాతం ఓట్లు పోలయ్యాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. కానీ తుది వివరాలను ప్రకటించడానికి దాదాపు మూడు రోజుల సమయాన్ని తీసుకున్నది. ఈ అసాధారణ జాప్యంపై సందేహాలను లేవనెత్తుతూ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పత్రిక సైతం కథనాన్ని ప్రచురించింది. ఆ గడువు ముగిసిన తర్వాత పోలయిన ఓట్ల సంఖ్య కూడా అనుమానాలను రేకెత్తించే విధంగానే ఉన్నది.తుది పోలింగ్ శాతాన్ని సుమారు 81గా నిర్ధారిస్తూ మూడు రోజుల తర్వాత ఈసీ తాపీగా ప్రకటన విడుదల చేసింది. మామూలుగా పోలింగ్ సమయం ముగిసిన తర్వాత పోలింగ్ కేంద్రం ఆవరణలో నిలబడి ఉన్నవారికి స్లిప్స్ పంపిణీ చేస్తారు. వారికి మాత్రమే ఓటువేసే అవకాశం కల్పిస్తారు. అలా నిలబడిన వారికి ఈసారి ఎందుకనో స్లిప్స్ లేదా టోకెన్లు పంపిణీ చేయలేదనే వార్తలు వినవస్తున్నాయి. ఇది అనుమానించదగ్గ అంశం.పోలింగ్ గడువు ముగిసిన తర్వాత ప్రాంగణంలో నిలబడి ఉన్నవారి సంఖ్య మనకున్న సమాచారం మేరకు ఎక్కడా యాభై నుంచి వంద దాటలేదు. వీరు ఓట్లు వేయడానికి ఇంకో రెండు, మూడు గంటలు చాలు. అంటే తొమ్మిది గంటలకల్లా పోలింగ్ పూర్తి కావాలి. కానీ అర్ధరాత్రి దాటిందాకా పోలింగ్ జరుగుతూనే ఉందట! అంటే ఆ యాభైమందే అంతసేపూ సైక్లింగ్ చేస్తున్నారా? వేలాది పోలింగ్ బూత్‌లలో గడువు ముగిసే సమయానికి 65 నుంచి 70 శాతం మధ్యనున్న పోలింగ్ శాతం తుది ప్రకటన వచ్చేసరికి 85 నుంచి 95 శాతం దాకా ఎగబాకింది.పోలింగ్‌కు ముందు జరిగిన రాజకీయ పరిణామాలను కూడా గమనంలోకి తీసుకోవాలి. ఎన్డీఏ కూటమిలో చేరడం కోసం చంద్రబాబు పడిన పాట్లు, భరించిన అవమానాలు తెలిసినవే. కూటమిగా కుదురుకున్న తర్వాత వారు ‘ఎలక్షనీరింగ్’ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. అనేక ప్రాంతాల్లోని ప్రభుత్వాధికారులను బదిలీ చేశారు. కనీవినీ ఎరుగని విధంగా ఏ ప్రాంతంలో ఏ అధికారిని నియమించాలో కూడా ఎన్నికల సంఘానికి సూచించారు. ఈసీ కూడా కూటమి కోర్కెలన్నింటినీ మారుమాట్లాడకుండా నెరవేర్చింది. సాధారణంగా తెలుగు రాష్ట్రాల ఎన్నికలు ఎప్పుడూ తొలి ఫేజ్‌లోనే ఉంటూ వచ్చాయి. కానీ కూటమి కోరిక మేరకు ఈసారి నాలుగో ఫేజ్‌కు నెట్టివేశారు.మొదటి మూడు దశల పోలింగ్ తర్వాత జాతీయ స్థాయిలో ఎన్డీఏలో అభద్రతా భావం మొదలైందట. పోలింగ్ సరళి తమకు అనుకూలంగా లేదనే నిర్ధారణకు ఎన్డీఏ పెద్దలు వచ్చారు. నాలుగో దశకు ఎన్నికలను వాయిదా వేయించుకున్న చంద్రబాబు అదనంగా లభించిన సుమారు నెల రోజుల సమయాన్ని ప్రత్యేక ‘ఏర్పాట్ల’ కోసం ఉపయోగించుకున్నారు. ఈ ఏర్పాట్లకు ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ పూర్తిగా సహకరించింది. దేశవ్యాప్తంగా 19 లక్షల ఈవీఎమ్‌ల మిస్సింగ్‌పై ఇప్పటికీ కేంద్రం నుంచి స్పష్టమైన సమాధానాలు రాలేదు. ఇవెక్కడున్నాయి? ఏ పనికి వినియోగిస్తున్నారు? ఎవరి సేవల కోసం ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ వీటిని వినియోగిస్తున్నారో తేలవలసి ఉన్నది.గడచిన ఐదేళ్లుగా ప్రత్యర్థులపై లేని దాడులను ఉన్నట్లుగా చూపించి గగ్గోలు పెట్టినవారు పోలింగ్ రోజు సాయంత్రం, మరునాడు – మళ్లీ కౌంటింగ్ రోజు నుంచి గత నాలుగు రోజులుగా జరిగిన హింసాకాండపై మౌనం వహించారు. ఈ హింసాకాండ కూడా అప్పటికప్పుడు ఆవేశంతో చెలరేగినట్టు లేదు. జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక క్రమం కనిపిస్తున్నది. కృత్రిమ ఓట్ల వర్షం కురిసే సమయానికి ఎవరూ పోలింగ్ కేంద్రాల వైపు వెళ్లకుండా బెదరగొట్టేందుకు దాడులు జరిగాయి. మరుసటి రోజు కూడా చాలాచోట్ల ఇవి కొనసాగాయి. మళ్లీ కౌంటింగ్ పూర్తవుతున్న సమయం నుంచి నాలుగు రోజులుగా యథేచ్ఛగా రాష్ట్రవ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి. అసాధారణమైన ఓటింగ్ సరళిని సమీక్షించడానికి ప్రత్యర్థులు గ్రామాల్లో పర్యటించే అవకాశం లేకుండా బెదరగొట్టడానికి ఈ దాడులు జరిగాయి. పోలీసు యంత్రాంగం పూర్తిగా కూటమి వ్యూహానికి తోడుగా నిలబడింది.విచక్షణారహితంగా జరుగుతున్న ఈ దాడులు మన ప్రజాస్వామ్య భవిష్యత్తు మీద ప్రశ్నార్థకాన్ని రచిస్తున్నాయి. ఈ దాడులను ఖండించకపోగా ‘వైఎస్సార్సీపీ కవ్వింపు చర్యలకు రెచ్చిపోకండ’ని ముఖ్యమంత్రి కాబోయే చంద్రబాబు ట్వీట్ చేశారు. గత రెండేళ్లుగా లోకేశ్ ఒక రెడ్‌బుక్‌ను సభల్లో ప్రదర్శిస్తూ హెచ్చరికలు జారీ చేసేవారు. తాను రెడ్‌బుక్‌లో పేర్లు ఎక్కించిన వారి సంగతి అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తానని చెప్పేవారు. ఇప్పుడా రెడ్‌బుక్ హోర్డింగ్‌లను కూడళ్లలో ఏర్పాటు చేశారు. దాని సందేశమేమిటో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.సందేశం గూండాతండాలకు స్పష్టంగానే అర్థమైంది. టీడీపీ వారికి చాలాచోట్ల జనసైనికులు కూడా తోడయ్యారు. ప్రత్యర్థులపై దాడులు చేస్తున్న సందర్భాల్లో పోలీసులు మౌన ప్రేక్షక పాత్రను పోషించారు. కొన్నిచోట్ల పారిపోతూ కనిపించారు. ఇప్పటివరకు బయటకొచ్చిన వీడియోల్లో ఇటువంటి దృశ్యాలెన్నో కలవరం కలిగించాయి.నూజివీడులో వైసీపీకి చెందిన ముసినిపల్ కౌన్సిలర్‌ను వెంబడించి కత్తులతో పొడుస్తున్న దృశ్యం పిండారీల దండయాత్రను తలపించింది. ఒక హాస్టల్ నిర్వాహకుడి ఇంటిపై దాడిచేసి గృహాన్ని ఛిద్రం చేసి, ఆ పెద్దమనిషిని మోకాళ్లపై కూర్చోబెట్టి కాళ్లు పట్టించుకున్న పైశాచికత్వం భయానకంగా కనిపించింది. రాళ్ల దాడులు, కర్రలతో దాడులు, కత్తులతో దాడులు, కిడ్నాప్‌లు... ఎన్నెన్ని దృశ్యాలు? వైసీపీకి చెందిన వారి కార్యాలయాలను పెట్రోల్ పోసి తగలబెట్టారు. వాహనాలను తగులబెట్టారు. జెండా దిమ్మెలను సుత్తులతో పగులగొట్టారు. శంకుస్థాపన ఫలకాలను ధ్వంసం చేశారు. గ్రామ సచివాలయాల మీద దాడులు చేశారు. వైఎస్సార్ విగ్రహాలను తొలగించి ఈడ్చుకుంటూ అవమానించారు.వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంపై వైఎస్సార్ అక్షరాలు తొలగించారు. ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్‌ల వంటి విప్లవాత్మక కార్యక్రమాలను ప్రారంభించిన వైఎస్సార్ పేరు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి బాగుంటుందని భావించిన ప్రభుత్వం చట్టసవరణ ద్వారా ఎన్టీఆర్ పేరును మార్చి వైఎస్సార్ పేరు పెట్టారు. బదులుగా విజయవాడ కేంద్రంగా ఏర్పడిన కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరును పెట్టారు. ఒక అల్లరిమూక దాడి చేసి ఇప్పుడా అక్షరాలను తొలగించింది..విశ్వవిద్యాలయాల మీద కూడా దాడులకు తెగబడ్డారు. వీసీలు, రిజిస్ట్రార్లు తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభు త్వం మారితే యూనివర్సిటీ పాలకవర్గాలను కూడా మార్చాలనే ఓ కొత్త ఆచారానికి శ్రీకారం చుట్టబోతున్నట్టు కనిపిస్తున్నది. నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారు రాజీనామాలు చేయడం సంప్రదాయం కానీ, ఇవి నామినేటెడ్ పదవులు కావు. సెర్చ్ కమిటీ సిఫారసుల మేరకు గవర్నర్ చేసిన నియామకాలు. అయినా సరే తమ పార్టీవాడే వీసీగా కూర్చోవాలనే దుందుడుకుతనం ప్రజాస్వామిక పద్ధతులను దెబ్బతీస్తున్నది.భయానక వాతావరణాన్ని కల్పించడం ద్వారా ప్రతిపక్షాలను కట్టడి చేయాలని కొత్త ప్రభుత్వం భావిస్తే అది నెరవేరే అవకాశం ఉండదు. నాలుగు రోజులు ఆలస్యమైనా సరే ఎన్నికల అవకతవకలపై వారు దృష్టి సారించకుండా ఉండరు. నిజానిజాలు తవ్వితీయకుండా ఉండరు. అలాగే కొత్త ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం జనంతో కలిసి విపక్షాలు కచ్చితంగా ఉద్యమిస్తాయి. కూటమికి లభించిన విజయం సాంకేతికమైనదే. అయినా సరే, ప్రభుత్వాన్ని అదే ఏర్పాటు చేస్తుంది. అడ్డంకులేమీ ఉండవు. చేసిన హామీలను నెరవేర్చి, ప్రజాస్వామిక వాతావరణాన్ని పునరుద్ధరించితే కొత్త ప్రభుత్వం ప్రజల మన్నన పొందుతుంది.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
మోదీకి దేశాధినేతల శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: మూడోసారి అధికార పగ్గాలు స్వీకరిస్తున్న ప్రధాని మోదీకి పలు ప్రపంచ దేశాల అధినేతలు శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్, బ్రిటన్ ప్రధా ని రిషి సునాక్, జర్మనీ చాన్స్‌లర్ ఓలాఫ్ స్కోల్జ్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలానీ ఇలా 75 దేశాలకు చెందిన అగ్రనేతలు మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. -
పుతిన్ ఐదోసారి ప్రమాణం
మాస్కో: రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ ఐదోసారి ప్రమాణం చేశారు. మంగళవారం క్రెమ్లిన్ ప్రాసాదంలో 2,500 మంది ముఖ్య అతిథుల సమక్షంలో పుతిన్ రష్యా రాజ్యాంగంపై ప్రమాణం చేశారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ..అన్ని అడ్డంకులను అధిగమిస్తూ ఐక్యంగా ఉంటూ లక్ష్యాలను అధిగమించి, విజయాలను అందుకుంటామని చెప్పారు.ఈ కార్యక్రమానికి అమెరికా నటుడు స్టీవెన్ సీగల్ వంటి పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. అయితే, అమెరికా, యూకే, జర్మనీ దౌత్యవేత్తలు గైర్హాజరయ్యారు. అంతకుముందు పుతిన్ 30 గన్ సెల్యూట్ స్వీకరించారు. క్రెమ్లిన్ కేథడ్రల్ స్క్వేర్ వద్ద ప్రెసిడెన్షియల్ రెజిమెంట్ పరేడ్‌ను తిలకించారు. దగ్గర్లోని అనన్షియేషన్ కేథడ్రల్‌లో రష్యన్ ఆర్థోడాక్స్ పాటియార్క్ కిరిల్ ఆశీస్సులు అందుకున్నారు. ఆరేళ్ల పదవీ కాలానికి గాను 2030 వరకు ఆయన అధ్యక్ష పదవిలో కొనసాగుతారు. -
సిరియాలో జోక్యం ముస్లింల అణచివేత
రష్యా రాజధాని మాస్కోలో తాజాగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థ (ఐసిస్) చేసిన అమానవీయ దాడి ప్రపంచాన్ని నిర్ఘాంతపరిచింది. రష్యాపై దాడులు ఐసిస్‌కు కొత్తేమీ కాదు. కొన్నేళ్ల కింద రష్యా పౌరులే లక్ష్యంగా విమానాన్నే బాంబుతో పేల్చేసి 244 మందిని బలి తీసుకున్న చరిత్ర దానిది! కాబూల్‌లోని రష్యా రాయబార కార్యాలయంపైనా దాడులకు తెగబడింది. సిరియా అంతర్యుద్ధంలో తమకు వ్యతిరేకంగా పుతిన్ జోక్యం రష్యాపై ఐసిస్ ఆగ్రహానికి ప్రధాన కారణం. రష్యాలోని ముస్లింలు తీవ్ర అణచివేతకు గురవుతున్నారన్న వార్తలు దాని విద్వేషాన్ని మరింతగా పెంచి పోషించాయి. ఫలితంగా రష్యాకు, ఐసిస్‌కు మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం నిత్యం నిప్పుల కుంపటి రాజేస్తూనే ఉంది... అలా మొదలైంది... ఐసిస్ అరాచకం 2015లో సిరియాలో అంతర్యుద్ధానికి దారితీసింది. ఐసిస్‌ను అణిచే ప్రయత్నాల్లో అధ్యక్షుడు బషీర్ అల్ అసద్‌కు పుతిన్ దన్నుగా నిలిచారు. దాంతో రష్యాపై ఐసిస్ తీవ్ర ద్వేషం పెంచుకుంది. మాస్కోలో తాజా మారణహోమానికి తెగబడింది ఐసిస్ ఖోరసాన్ (ఐసిస్–కె). ఇది అఫ్గానిస్థాన్‌లో ఐసిస్ అనుబంధ సంస్థ. 2022లో అఫ్గాన్ రాజధాని కాబూల్‌లోని రష్యా రాయబార కార్యాలయంపై ఆత్మాహుతి దాడి చేసి ఇద్దరు ఉద్యోగులతో పాటు ఎనిమిది మందిని పొట్టన పెట్టుకుంది ఐసిస్–కెనే. దీన్ని పాకిస్థానీ తాలిబాన్ ముఠా సభ్యులు 2015లో ప్రారంభించారు. అఫ్గాన్‌లో భద్రతా దళాలతో పాటు మంత్రులపై, మైనారిటీలపై వరుస దాడులతో ప్రాచుర్యంలోకి వచి్చంది. 2018కల్లా ప్రపంచంలోని నాలుగు అత్యంత ప్రమాదకరమైన ఉగ్ర సంస్థల్లో ఒకటిగా ఎదిగింది. ఉగ్ర శిక్షణ నిమిత్తం ఇరాక్, సిరియాల్లోని అగ్ర నాయకత్వం నుంచి కోట్లది డాలర్లు అందకుంటూ వచి్చంది. తర్వాత అమెరికా సైన్యం, అఫ్గాన్ కమెండోలు, అఫ్గాన్ తాలిబన్ల ముప్పేట దాడితో ఐసిస్–కె ఆగడాలకు కళ్లెం పడింది. అమెరికా వైమానిక దాడులు దాని అగ్ర నాయకత్వాన్ని దాదాపుగా తుడిచిపెట్టేశాయి. 2021లో అమెరికా సైన్యం అఫ్గాన్ నుంచి వైదొలగడంతో ఐసిస్–కె మళ్లీ పుంజుకుంది. అదే ఏడాది కాబూల్ విమానాశ్రయంపై దాడి చేసి 13 మంది అమెరికా సైనికులతో పాటు ఏకంగా 170 మంది పౌరులను బలి తీసుకుంది. కొన్నేళ్లుగా అఫ్గాన్ ఆవల కూడా విస్తరిస్తోంది. గత జనవరిలో ఇరాన్లో దివంగత మేజర్ జనరల్ ఖాసీం సులేమానీ స్మారక ర్యాలీపై ఆత్మాహుతి దాడికి తెగబడి 84 మందిని పొట్టన పెట్టుకుంది. ఇస్తాంబుల్‌లో ఓ చర్చిపైనా దాడి చేసింది. పుతిన్‌ను, ఆయన విధానాలను ఐసిస్–కె తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తెగలపరంగా తమ ప్రబల శత్రువులైన తాలిబన్లతో పుతిన్ సాన్నిహిత్యం రష్యాపై విద్వేషాన్ని మరింత ఎగదోసింది. దీనికి తోడు రష్యాలో ముస్లింలపై అణచివేత పెరుగుతోందని ఆమ్నెస్టీతో పాటు పలు హక్కుల సంస్థలు ఆరోపిస్తున్నాయి. రష్యాలో ముస్లింలు 2 కోట్ల దాకా ఉంటారని అంచనా. మతపరమైన ప్రార్థనలు కూడా చేసుకోలేనంతగా వారిపై తీవ్ర అణచివేత చర్యలు కొనసాగుతున్నాయని, విద్య, ఉపాధి తదితరాల్లో నూ వివక్ష కొనసాగుతోందని వార్తలొస్తున్నాయి. ఉక్రెయిన్ నుంచి ఆక్రమించుకున్న క్రిమియాలో కూడా ముస్లింలపై రష్యా తీవ్ర ఆంక్షలు అమలు చేస్తోందని చెబుతున్నారు. ఇవన్నీ ఐసిస్–కెకు మరింత కంటగింపుగా మారాయి. హిజాబ్ ముస్లిం సంప్రదాయం కాదంటూ పుతిన్ చేసిన వ్యాఖ్యలు రష్యాపై దాని ద్వేషాన్ని మరింతగా పెంచాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రష్యా అధ్యక్ష ఎన్నికలు.. పుతిన్ ఘన విజయం
మాస్కో: రష్యా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు పుతిన్ మరోసారి ఘన విజయం సాధించారు. ప్రాథమిక ఫలితాల ప్రకారం పుతిన్‌కు రికార్డుస్థాయిలో 88 శాతం ఓట్లు లభించినట్లు తెలుస్తోంది. మార్చి 15న ప్రారంభమైన ఎన్నికల పోలింగ్ మూడు రోజుల పాటు జరిగి 17న ముగిశాయి. 1999 నుంచి దేశ అధ్యక్ష పదవిలో కొనసాగుతున్న పుతిన్ తాజా విజయంతో మరో ఆరేళ్లపాటు అధ్యక్ష పదవిలో కొనసాగనున్నారు. ఈ ఎన్నికల్లో పుతిన్‌తో కలిపి నలుగురు అధ్యక్ష పదవికి పోటీపడ్డారు. కాగా, చివరిరోజు పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని, పుతిన్ విధానాలను వ్యతిరేకిస్తున్నవారు పోలింగ్ కేంద్రాలకు రావాలని ఇటీవల అనుమానాస్పదంగా మృతి చెందిన ప్రతిపక్ష నేత నావల్నీ మద్దతుదారులు ఇచ్చిన పిలుపుతోనే చివరిరోజు ఓటర్లు పోటెతినట్లు చెబుతున్నారు. ఎన్నికల సందర్భంగా పలు పోలింగ్ కేంద్రాల్లో ఘర్షణలు జరిగాయి. కొన్నిచోట్ల బ్యాలెట్ పెట్టెల్లో ఇంకు పోశారు. దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసనకారులు అరెస్టయ్యారు. బలమైన ప్రత్యర్థులు, పుతిన్‌ను గట్టిగా విమర్శించేవారెవరూ లేకుండానే ఎన్నికలు కొనసాగాయి. పలు యూరప్ దేశాల్లోని ప్రధాన నగరాల్లో ఉన్న రష్యా దౌత్య కార్యాలయాల్లో పెద్దఎత్తున రష్యా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు ఎన్నికల సమయంలో ఉక్రెయిన్ నుంచి రష్యాపైకి డ్రోన్లు దూసుకొచ్చాయి. ఎన్నికలను అడ్డుకునేందుకు ఉక్రెయిన్ దాడులకు పాల్పడిందని రష్యా ఆరోపించింది. ఇదీ చదవండి.. వెనక్కి తగ్గేది లేదు.. గాజాపై దాడులు కొనసాగిస్తాం -
‘‘రష్యా ఎన్నికలు ఒక బూటకం.. చనిపోయేదాకా పుతిన్‌దే పవర్’’
లండన్: రష్యా అధ్యక్షుడు పుతిన్ చనిపోయే వరకు పవర్‌లోనే ఉంటాడని, ప్రస్తుతం జరుగుతున్న అధ్యక్ష ఎన్నికలు కింది నుంచి మీది దాకా ఒక భూటకం అని యాంటీ కరప్షన్ యాక్టివిస్ట్, రష్యా నుంచి బహిష్కరణకు గురైన ఇన్వెస్టర్ బిల్ బ్రౌడర్ వ్యాఖ్యానించారు. అధ్యక్షఎన్నికల వేళ బ్రౌడర్ వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. ‘దేశ ప్రజలకు జైలు, చావు తప్ప పుతిన్ ఇచ్చేది ఏమీ లేదు. ఇది ఒక గొప్ప లీడర్ లక్షణం కాదు. పుతిన్ ప్రజలను ఇంకా అణచివేస్తే తిరుగుబాటు తప్పదు. ప్రజలు డిసైడైతే పుతిన్‌కు రొమేనియా కమ్యూనిస్టు లీడర్ నికోలే సెస్క్యూకు పట్టిన గతే పడుతుంది’అని బిల్ బ్రౌడర్ హెచ్చరించారు. హెమిటేజ్ క్యాపిటల్ అనే కంపెనీ ద్వారా రష్యాలో 1990 నుంచి 2000 సంవత్సరం వరకు భారీగా పెట్టుబడులు పెట్టిన బిల్ బ్రౌడర్ను అవినీతి ఆరోపణలపై 2005లో దేశం నుంచి బహిష్కరించారు. కాగా, తొలుత రష్యా గూఢచర్య సంస్థ కేజీబీ ఏజెంట్‌గా పనిచేసిన పుతిన్ 1999 నుంచి రష్యాలో అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లోనూ పుతిన్ గెలుపు ఖాయమేనన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. దీంతో మరో ఆరేళ్లపాటు పుతిన్ అధ్యక్ష పదవిలో కొనసాగనున్నారు. మార్చి 15న ప్రారంభమైన రష్యా ఎన్నికలు 17 దాకా మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఇదీ చదవండి.. కెనడాలో భారత సంతతి ఫ్యామిలీ అనుమానాస్పద మృతి -
కేరళలో రష్యా ఎన్నికల పోలింగ్!!
తిరువనంతపురం: రష్యా ఎన్నికలు శుక్రవారం(మార్చ్ 15) ఉదయం ప్రారంభమయ్యాయి. అయితే ఈ ఎన్నికల పోలింగ్ భారత్‌లోని కేరళ రాజధాని తిరువనంతపురంలో కూడా జరుగుతుండడం విశేషం. కేరళలో నివసిస్తున్న రష్యా పౌరులు తిరువనంతపురంలోని రష్యా కాన్సులేట్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ తరహాలో ఇక్కడ నివసిస్తున్న రష్యన్ల కోసం పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడం ఇది మూడోసారని రష్యా కాన్సులేట్ డైరెక్టర్ రతీష్ నాయర్ తెలిపారు. పోలింగ్ విషయంలో తమకు సహకరిస్తున్న రష్యన్లకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. టూరిస్టులుగా లేదా నివాసం ఉండేందుకు భారత్ వచ్చిన రష్యన్లకు దేశ అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసేందుకు అవకాశం కల్పించడం సంతోషంగా ఉందని రష్యా పౌరురాలు ఉలియా తెలిపారు. రష్యా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ మార్చ్ 17వరకు మూడు రోజుల పాటు జరగనుంది. ప్రస్తుత అధ్యక్షుడు పుతిన్‌తో పోటీపడేందుకు ముగ్గురు అభ్యర్థులకు రష్యా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్(సీఈసీ)అనుమతిచ్చింది. ఈ ముగ్గురు ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధాన్ని సమర్ధించిన వారే కావడం గమనార్హం. ఈ ఎన్నికల్లో పుతిన్ గెలుపు దాదాపు ఖాయమేనన్న అంచనాలున్నాయి. ఇదీ చదవండి.. మొదలైన రష్యా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ -
Russia Ukrain War: అణుయుద్ధంపై పుతిన్ సంచలన వ్యాఖ్యలు
మాస్కో: దేశంలో సాధారణ ఎన్నికల పోలింగ్‌కు రెండు రోజుల ముందు రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌కు అమెరికా గనుక తన సేనలను పంపితే తాము అణు యుద్ధానికి వెనకాడబోమని స్పష్టం చేశారు. మార్చ్ 15 నుంచి 17 వరకు దేశంలో ఎన్నికలు జరగనున్న సందర్భంగా ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో పుతిన్ మాట్లాడారు. ప్రస్తుతానికి అణుయుద్ధం చేయాల్సిన పరిస్థితులు లేవని, ఉక్రెయిన్‌పై అణ్వాయుధాలు వాడాల్సిన అవసరం తనకు కనిపించడం లేదన్నారు. అయితే మిలిటరీ, సాంకేతిక కోణంలో తాము అణుయుద్ధం చేసేందుకు అన్ని విధాలా సంసిద్ధంగా ఉన్నామని పుతిన్ బాంబు పేల్చారు. ఉక్రెయిన్‌తో యుద్ధం విషయంలో చర్చలకు పుతిన్ సిద్ధంగా లేరని అమెరికా ప్రకటించిన తర్వాత అణుయుద్ధంపై రష్యా అధ్యక్షుడు స్పందించడం గమనార్హం. 1962 క్యూబన్ మిసైల్ సంక్షోభం తర్వాత మళ్లీ ప్రస్తుత ఉక్రెయిన్ యుద్ధం తర్వాతే రష్యా, పశ్చిమ దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. 2022 ఫిబ్రవరిలో వేలాది మంది రష్యా సైనికులను ఉక్రెయిన్‌కు పంపి ఆ దేశంతో పూర్తిస్థాయి యుద్ధానికి పుతిన్ తెరలేపారు. కాగా, అమెరికా సేనలు ఉక్రెయిన్‌లోకి ప్రవేశిస్తే యుద్ధం తీవ్రస్థాయికి చేరుతుందని, తాము అణ్వాయుధాలు వాడాల్సి వస్తుందని పుతిన్ ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారు. ఇదీ చదవండి.. దాదాపు 70 ఏళ్ల తర్వాత రీ మ్యాచ్ -
Russia: మహిళలపై పుతిన్ ఆసక్తికర వ్యాఖ్యలు
మాస్కో: మహిళా దినోత్సవం సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలోని మహిళలపై ప్రశంసల జల్లు కురిపించారు. మాతృత్వపు బహుమతులను వారు అందిస్తున్నారని కీర్తించారు. మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం(మార్చ్ 8)నాడు పుతిన్ దేశంలోని మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. ‘మహిళలు క్లిష్టతరమైన బాధ్యతలు వేగంగా, సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు మగవారి పట్ల చాలా కేరింగ్‌గా ఉంటారు. ఎన్నో సమస్యలున్నప్పటికీ వారెప్పుడూ అందంగానే వెలిగిపోతుంటారు’అని పుతిన్ వ్యాఖ్యానించారు. ఇటీవలి కాలంలో రష్యాలో బర్త్‌రేటు పెంచే ప్రచారాన్ని పుతిన్ తీవ్రం చేశారు. ముగ్గురు పిల్లలున్న యువ తల్లిదండ్రుల కోసం ఏం చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని మహిళా దినోత్సవం సందర్భంగా పుతిన్ మరోసారి స్పష్టం చేశారు. గత వారం పార్లమెంట్లో మాట్లాడుతూ ముగ్గురు అంతకంటే ఎక్కువ పిల్లలున్న తల్లిదండ్రులు దేశానికి గొప్ప గౌరవం అని పుతిన్ కీర్తించడం గమనార్హం. కాగా, సోవియెట్ కాలం నుంచి రష్యాలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. మార్చి 8 వుమెన్స్ డేను హాలిడేగా ప్రకటించి మహిళలకు భారీగా బహుమతులు అందిస్తారు. ఇదీ చదవండి.. ఐదోసారి పెళ్లికి సిద్ధమైన మర్డోక్ -
Russia-Ukraine war: మరింత జోక్యంతో అణు యుద్ధమే
మాస్కో: ఉక్రెయిన్‌లోని లక్ష్యాలను సాధించే వరకు తమ యుద్ధం కొనసాగుతుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ కుండబద్దలు కొట్టారు. ఉక్రెయిన్‌కు అండగా సైన్యాలను పంపించడం ద్వారా మరింత లోతుగా జోక్యం చేసుకోవాలని చూస్తే అణు యుద్ధం తప్పదని పశ్చిమ దేశాలను ఆయన హెచ్చరించారు. వచ్చే నెల్లో దేశాధ్యక్ష పదవికి జరగనున్న ఎన్నికల్లో పుతిన్ విజయం ఇప్పటికే ఖరారైంది. ఎన్నికలను పురస్కరించుకుని గురువారం ఆయన దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. యుద్ధంలో పుతిన్ విజయం యూరప్‌లో తీవ్ర విపరిణామాలకు దారి తీస్తుందని, దీనిని నివారించేందుకు నాటో దేశాలు ఉక్రెయిన్‌లోకి ప్రత్యక్షంగా బలగాలను పంపించే అవకాశాలు సైతం ఉన్నాయంటూ ఫ్రాన్సు అధ్యక్షుడు మాక్రాన్ ఇటీవల చేసిన హెచ్చరికలపై ఆయన పైవిధంగా స్పందించినట్లుగా పరిశీలకులు భావిస్తున్నారు. ‘గతంలో మన దేశంలోకి సైన్యాన్ని పంపించిన వారికి ఎలాంటి గతి పట్టిందో మనకు తెలుసు. మళ్లీ అటువంటిదే జరిగితే ఈసారి పరిణామాలు మరింత దారుణంగా ఉంటాయి. మన వద్ద కూడా పశ్చిమదేశాల్లోని లక్ష్యాలను చేరగల ఆయుధాలున్న సంగతిని వాళ్లు గుర్తుంచుకోవాలి. ఆ దేశాలు చేస్తున్న ప్రకటనలు ప్రపంచాన్ని భయపెడు తున్నట్లుగా అగుపిస్తోంది. ఇవన్నీ నిజమైన అణు సంఘర్షణ ముప్పును మరింతగా పెంచుతున్నాయి. దానర్థం మానవ నాగరికత విధ్వంసం. యుద్ధంతో ఎదురయ్యే పెను సవాళ్లు, అణు యుద్ధం తాలూకూ పరిణామాలు వాళ్లకు అర్థం కావా?’అని పుతిన్ ప్రశ్నించారు. ‘దేశం పూర్తిస్థాయి అణు యుద్ధ సన్నద్ధతతో ఉంది. ఎంతో శక్తివంతమైన నూతన ఆయుధాలను సైన్యం మోహరించింది. వాటిలో కొన్నిటిని ఇప్పటికే ఉక్రెయిన్ యుద్ధక్షేత్రంలో ప్రయోగించి చూసింది’ అని చెబుతూ ఆయన శక్తివంతమైన బురెవెస్ట్నిక్ అణు క్రూయిజ్ క్షిపణి వంటి వాటిని ఈ సందర్భంగా ప్రస్తావించారు. నాటో దేశాలపై రష్యా దాడి చేసే ప్రమాదముందంటూ పశ్చిమదేశాలు చేస్తున్న ప్రకటనలను భ్రమలుగా అధ్యక్షుడు పుతిన్ కొట్టిపారేశారు. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పైకి భారీగా సైన్యాన్ని పంపించినప్పటి నుంచి పుతిన్ అణు ముప్పుపై పశ్చిమ దేశాలను పలుమార్లు హెచ్చరించిన విషయం తెలిసిందే. -
Alexi Navalni: పుతిన్ ప్రత్యర్థి మరణం.. వెలుగులోకి సంచలన విషయం
మాస్కో: ఇటీవల రష్యా జైలులో వివాదాస్పద స్థితిలో మరణించిన పుతిన్ రాజకీయ ప్రత్యర్థి, రష్యా ప్రతిపక్షనేత అలెక్సీ నవాల్ని మృతికి సంబంధించి సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. నవాల్నిని జైలులో గుండెపై ఒకే ఒక్క గుద్దు గుద్ది చంపేసి ఉంటారని మానవహక్కుల కార్యకర్త వ్లాదిమిర్ ఒసెచిన్ తెలిపారు. ఇది రష్యా గూఢచారి సంస్థ కేజీబీ వేగులు చేసిన హత్యే అయి ఉండొచ్చన్నారు. కేజీబీ ప్రత్యేక వేగులకు మనుషులను గుండెపై ఒకే ఒక్క గుద్దు గుద్ది చంపేయడంపై శిక్షణ ఇస్తారని చెప్పారు. ఇది వారి హాల్‌మార్క్ హత్య చేసే విధానమని తెలిపారు. ఈ హత్య చేసే ముందు నవాల్ని శరీరాన్ని బలహీపర్చే ఉద్దేశంతో జీరో డిగ్రీ కంటే తక్కువ ఉష్ణోగ్రతలో అతడిని ఉంచారన్నారు. ఇలా చేయడం వల్ల మనిషిలో రక్తప్రసరణ నెమ్మదిస్తుందని చెప్పారు. అనంతరం గుండెపై గుద్ది చంపేస్తారన్నారు. కాగా, గత వారం ఆర్కిటిక్ పోలార్ వోల్ఫ్‌లోని పీనల్ కాలనీ జైలు అలెక్సీ నవాల్ని వివాదాస్పద స్థితిలో మృతి చెందారు. జైలులో సాయంత్రం వేళ కొద్దిసేపు వాకింగ్ తర్వాత నావల్ని ఇబ్బందిగా ఫీలయ్యారని, అనంతరం ఆయన కుప్పకూలారని జైలు అధికారులు వెల్లడించారు. అత్యంత వివాదాస్పదంగా మారిన నావల్ని మృతిపై రష్యాలో ఆయన అభిమానుల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. ప్రపంచవ్యాప్తంగా అమెరికా సహా పలు దేశాధినేతలు నవాల్ని మృతికి పుతినే కారణమని పరోక్షంగా వ్యాఖ్యానించాయి. నవాల్ని భార్య, కూతురును అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కాలిఫోర్నియాలోని ఓ హోటల్లో కలిసి పరామర్శించారు. ఇదీ చదవండి.. నవల్ని మృతదేహం తల్లికి అప్పగింత -
కిమ్‌కు పుతిన్ గిఫ్ట్.. కారు కంపెనీపై అమెరికా కొరడా
వాషింగ్టన్: ఉత్తర కొరియా, రష్యా మధ్య పెరుగుతున్న సంబంధాలపై అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోంది. తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్‌కు బహుమతిగా విలాసవంతమైన లిమోసిన్ కారు ఇవ్వడం వివాదాస్పదమవుతోంది. ఈ కారు ఉత్పత్తి చేసిన కంపెనీపై అమెరికా తాజాగా ఆంక్షలు విధించింది. ఉక్రెయిన్, రష్యా యుద్ధానికి రెండేళ్లు పూర్తవడం, అలెక్సీ నావల్ని మృతిపై రష్యాపై అమెరికా తాజాగా విధించిన 500 ఆంక్షల జాబితాలో లిమోజిన్ కారు కంపెనీ ఆరస్‌ను కూడా అగ్రరాజ్యం చేర్చడం గమనార్హం. ఉత్తర కొరియాకు రష్యా ఆర్టిలరీ బాంబులు సరఫరా చేస్తుండటం, కొరియా ద్వీపకల్పంలో ఉత్తర కొరియా రెచ్చగొట్టే చర్యలపై చైనా, అమెరికా ఉన్నతస్థాయి అధికారులు వీడియోకాన్ఫరెన్స్‌లో శుక్రవారం చర్చించారు. కాగా, ఇటీవలి కాలంలో దక్షిణ కొరియా సరిహద్దులో ఉత్తర కొరియా ఆర్టిలరీ బాంబుల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. దీంతో ఆ ప్రాంతంలోని దక్షిణ కొరియాకు చెందిన ఐలాండ్‌లో నివసిస్తున్న ప్రజలను ఖాళీ చేయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతేకాక అత్యాధునిక ఆయుధాలు, క్షిపణులను పరీక్షిస్తూ ఎప్పటికప్పుడు దక్షిణకొరియాను ఉత్తర కొరియా రెచ్చగొడుతోంది. ఇదీ చదవండి.. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం.. రెండేళ్లు -
ఉక్రెయిన్ పోరు దారెటు?!
‘ఇక్కడ బతుకు దుర్భరంగా వుంది. స్వీయానుభవంలోకి రాకుండా దీన్నర్థం చేసుకోవటం పూర్తిగా అసాధ్యం’ అని తన సన్నిహితుడికి రాసిన లేఖలో రష్యాలోని అతి శీతలమైన ఆర్కిటిక్ ప్రాంత కారాగారంలో ఇటీవల కన్నుమూసిన అసమ్మతివాది అలెక్సీ నవాల్నీ అన్నారట. రెండేళ్లు పూర్తయి మూడో యేట ప్రవేశించిన ఉక్రెయిన్ యుద్ధం కూడా అటువంటి పరిస్థితుల్నే సృష్టించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రారంభించిన ఈ దురాక్రమణ యుద్ధం పర్యవసానంగా అటు రష్యా సైనికులూ... ఇటు ఉక్రెయిన్ సైనికులూ, పౌరులూ కూడా చెప్పనలవికాని యాతనలు పడు తున్నారు. ఈ యుద్ధం నిరుడు రెండో ఏడాదిలో ప్రవేశించే సమయానికి ఉక్రెయిన్ పౌరుల్లో కాస్తయినా విశ్వాసం వుండేది. వచ్చే వేసవిలో రష్యా సైనికులను తరిమేయగలమని నమ్మేవారు. ఇప్పుడు అదంతా ఆవిరైంది. 2025 నాటికి మెరుగైన ఫలితాలొస్తాయని తాజాగా పాశ్చాత్య మీడియా నమ్మబలుకుతోంది. అమెరికా అండదండలతో పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్‌కు దండిగా ఆయుధాలు, ట్యాంకులు, యుద్ధ విమానాలు, క్షిపణులు అందించటంతోపాటు రష్యాపై ఆంక్షలు కూడా విధించాయి. 1945 తర్వాత యూరోప్ దేశాలన్నీ చిక్కుకున్న ఈ భారీ యుద్ధం ఎటుపోతుందో, చివరికేమవుతుందో ఎవరి అవగాహనకూ అందటం లేదు. ఈమధ్యే అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నాటో కూటమి దేశాలను హెచ్చరించారు. తమ తమ జీడీపీల్లో రక్షణకు 2 శాతంకన్నా తక్కువ వ్యయం చేసే యూరోప్ దేశాలకు తాను గద్దెనెక్కిన తర్వాత సహకరించబోనని ప్రకటించారు. పైగా యూరోప్‌ను ‘మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండ’ని రష్యాకు చెబుతానన్నారు. ఆయన మళ్లీ అ«ధ్యక్షుడు కావటం ఖాయమని దాదాపు సర్వేలన్నీ చెబుతున్నాయి. ఈనాటికీ 18 శాతం ఉక్రెయిన్ భూభాగం రష్యా అధీనంలో వుంది. అక్కడా, ఇతరచోట్లా ఉక్రెయిన్ పౌరులు భయంతో బతుకులీడుస్తున్నారు. అంతేకాదు... రష్యా క్షిపణి దాడులు జరిగిన ప్రతిసారీ సమీప బంధువులనూ, స్నేహితులనూ కూడా అనుమాన దృక్కులతో చూసే ధోరణి మొదలైంది. కొందరు రష్యాకు అమ్ముడుపోయి క్షిపణి దాడులకు కారణమవుతున్నారన్న అభిప్రాయం అందరిలోనూ వుంది. ఇరాన్, ఉత్తర కొరియాలు రష్యాకు అవసరమైన డ్రోన్లు, క్షిపణులు అందిస్తున్నాయి. యుద్ధంలో పాల్గొనే సైనికులకు అవసరమైన సామగ్రిని తుర్కియే సరఫరా చేస్తోంది. చైనానుంచి పేలుడు పదార్థాల్లో వినియోగించే రసాయనాలు వస్తున్నాయి. 2022 ఫిబ్రవరి మొదలుకొని ఇంతవరకూ రష్యా ఆదాయాన్ని 433 బిలియన్ డాలర్ల మేర (దాదాపు రూ. 35,500 కోట్లు) గండికొట్టగలిగామని పాశ్చాత్య దేశాలు సంబరపడుతున్నా రష్యా దూకుడు తగ్గలేదు. యుద్ధరంగంలో రష్యా వినియోగిస్తున్న ఆయుధాల్లోని 95 శాతం విడిభాగాలు అమెరికా, పాశ్చాత్య దేశాల్లో తయారైనవేనన్నది కియూవ్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అధ్యయన సారాంశం. సీఐఏ డైరెక్టర్ బిల్ బర్న్స్ చెప్తున్న ప్రకారం ఇంతవరకూ 3,15,000 మంది రష్యా సైనికులు ఈ యుద్ధంలో మరణించటమో, గాయపడటమో జరిగింది. మూడింట రెండువంతుల శతఘ్నులుధ్వంసమయ్యాయి. రక్షణ కేటాయింపులు పెంచే విధానానికి స్వస్తిచెప్పి ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని యుద్ధకాల ఆర్థిక వ్యవస్థగా (వార్ ఎకానమీ) రష్యా మార్చిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సమర్థతగల నాయకుడనీ, యుద్ధ హీరో అని పాశ్చాత్య మీడియా కీర్తించటంవల్ల ఒరిగేదేమిటో అర్థంకాదు. గతంతో పోలిస్తే ఆయన రేటింగ్స్ పడిపోయాయన్నది వాస్తవం. ముఖ్యంగా కమాండర్ ఇన్ చీఫ్ జలూజినీని తొలగించటం, కియూవ్ నగర మేయర్‌తో విభేదాలు జెలెన్స్కీ ప్రతిష్టను దెబ్బతీశాయి. ఉక్రెయిన్‌కు మరో ఆరువేల కోట్ల డాలర్ల ఆర్థిక సాయానికి అమెరికా సెనేట్ గతవారం అంగీకారం తెలిపినా రిపబ్లికన్లకు ఆధిక్యతవున్న ప్రతినిధుల సభలో ఏమవుతుందో తెలియదు. కొత్త ఆయుధాల సరఫరాకు ఇప్పటికే రిపబ్లికన్లు బ్రేక్ వేశారు. ఉక్రెయిన్‌కు అందించదలచుకున్న సాయం విషయంలో ప్రత్యామ్నాయ మార్గాలను వెదకాలన్న సూచనలు రావటం అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు సమస్యాత్మకమే. ఉక్రెయిన్ యుద్ధాన్ని నిలువరించి, యుద్ధ నేరాలకు మూల్యం చెల్లించేలా రష్యాపై అంతర్జాతీయ వేదికల ద్వారా ఒత్తిళ్లు పెంచటమే ఇప్పుడున్న ఏకైక మార్గం. ఈ బాధ్యతను అమెరికా, పాశ్చాత్య దేశాలు విస్మరిస్తున్నాయి. ఉక్రెయిన్‌కు ఆయుధాలందిస్తూ పోతే అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్ తదితర దేశాల ఆయుధ పరిశ్రమలకు ఆర్డర్లు పెరుగుతాయితప్ప ఒరిగేదేమీ వుండదు. ఉక్రెయిన్ గెలుపు గురించీ, రష్యాపై తీసుకునే చర్యల గురించీ ఆర్భాటంగా మాట్లాడుతున్న అమెరికా, పాశ్చాత్య దేశాలు యుద్ధం మొదలై రెండేళ్లవుతున్నా తమ దేశాల్లోని రష్యా ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవటంలో వెనకడుగేస్తున్నాయి. వివిధ ఫైనాన్షియల్ కంపెనీల్లో వున్న 30,000 కోట్ల డాలర్ల విలువైన రష్యా ఆస్తుల్ని యుద్ధం మొదలైన రోజుల్లోనే స్తంభింపజేశారు. కానీ వాటì స్వాధీన ప్రక్రియను ప్రారంభిస్తే డాలర్ల రూపంలో నిధులు డిపాజిట్ చేసే విధానానికి చాలా దేశాలు స్వస్తి చెబుతాయన్న భయం అమెరికాకు ఉంది. ఇలా తమ ఆర్థిక వ్యవస్థల గురించీ, భవిష్యత్తు గురించీ ఆచి తూచి అడుగు లేస్తున్న సంపన్న దేశాలు ఈ యుద్ధాన్ని ఆపటంపై మాత్రం దృష్టి సారించటం లేదు. ఉక్రెయిన్ పోరునూ, గాజాలో ఇజ్రాయెల్ సాగిస్తున్న దారుణ మారణకాండనూ ఇకనైనా నిలువరించకపోతే అన్ని దేశాలూ పెను సంక్షోభంలో కూరుకుపోతాయి. ఆ పరిస్థితి తలెత్తకుండా చూడటం అందరి కర్తవ్యం కావాలి. -
Alexi Navalni: నావల్ని భార్య, కూతురుకు బైడెన్ ఓదార్పు
కాలిఫోర్నియా: ఇటీవల రష్యాలోని ఆర్కిటిక్ పీనల్ కాలనీ జైలులో వివాదస్పద స్థితిలో మృతి చెందన రష్యా ప్రతిపక్షనేత, అధ్యక్షుడు పుతిన్ రాజకీయ ప్రత్యర్థి అలెక్సీ నావల్ని(47) భార్య, కుమార్తెను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పరామర్శించారు. అమెరికాలోని కాలిఫోర్నియాలని ఓ హోటల్లో నావల్ని భార్య, కుమార్తెలతో బైడెన్ గురువారం సమావేశమయ్యారు. నావల్ని మృతితో తీవ్ర దుఃఖంలో ఉన్న వారిద్దరనీ బైడెన్ ఓదార్చారు. ఈ విషయమై ఎక్స్(ట్విటర్)లో బైడెన్ ఒక పోస్టు చేశారు. నావల్ని మృతి తర్వాత కూడా వారు ధైర్యంగానే ఉన్నారు’ అని తెలిపారు. నావల్ని మృతదేహాన్ని రహస్యంగా ఖననం చేయాలని, ఎలాంటి అంతిమయాత్ర నిర్వహించడానికి వీలు లేదని తమపై రష్యా ప్రభుత్వం ఒత్తిడి తీసుకువచ్చిందని నావల్ని తల్లి లియుడ్మిలా ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలాఉంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం మూడో ఏడాదిలోకి అడుగు పెడుతున్న సందర్భంగా, దేశంలో ప్రతిపక్షనేత నావల్ని వివాదాస్పద మృతి కారణంగా రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు అమెరికా యోచిస్తోంది. కాగా, గత వారం రష్యాలోని జైలులో వివాదాస్పద స్థితిలో మృతి చెందిన నావల్ని తన జీవితమంతా పుతిన్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడారు. ఇదీ చదవండి.. ఇజ్రాయెల్ దాడుల్లో 48 మంది మృతి -
Alexi Navalni: కుటుంబ సభ్యులనూ వదలని పుతిన్
మాస్కో: రష్యాలోని జైలులో ఇటీవల వివాదస్పద స్థితిలో మృతి చెందిన ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్ని కుటుంబాన్ని కూడా పుతిన్ ప్రభుత్వం వదలడం లేదు. అలెక్సీ నావల్ని తమ్ముడు ఒలెగ్ నావల్నిపై గతంలో ఉన్న క్రిమినల్ కేసులకు తోడు అక్కడి ప్రభుత్వం తాజాగా మరో కేసు పెట్టింది. ఈ విషయాన్ని అక్కడి అధికారిక వార్తా ఏజెన్సీ టాస్ వెల్లడించింది. అయితే ఏ సెక్షన్‌పై ఎందుకు ఒలెగ్పై కేసు పెట్టారన్న వివరాలు తెలపలేదు. కేసు నమోదైన వెంటనే పోలీసులు ఒలెగ్ కోసం గాలింపు చేపట్టారు. ఒలెగ్ ఇప్పటికే పోలీసుల వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. 2014లో ఓ కేసులో ఒక ఫ్రాడ్ కేసులో ఒలెగ్‌కు మూడున్నర సంవత్సరాల జైలు శిక్ష కూడా పడింది. అప్పట్లో అన్న అలెక్సీపై ఒత్తిడి పెంచడానికి అతడి తమ్ముడు ఒలెగ్పై రష్యా ప్రభుత్వం అక్రమ కేసులు మోపిందనే ఆరోపణలున్నాయి. కాగా, మరోవైపు అలెక్సీ మరణంపై దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో సహా పలు ప్రపంచ దేశాల అధినేతలు అలెక్సీ మరణానికి పుతినే కారణమన్నట్లుగా పరోక్ష వ్యాఖ్యలు కూడా చేశారు. అలెక్సీ మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన భార్య ఇప్పటికే ప్రతిజ్ఞ కూడా చేసింది. ఇదీ చదవండి.. పుతిన్ ప్రేమలో పడ్డారా.. ఆమెతో సన్నిహితంగా -
అలెక్సీ నావల్నీ మరణం.. చిక్కుల్లో ట్రంప్!
వాషింగ్టన్: రష్యా ప్రతిపక్ష నేత, ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై కరడుగట్టిన విమర్శకుడిగా పేరొందిన అలెక్సీ నావల్నీ మృతి.. ఇప్పుడు అమెరికా ఎన్నికల్లో చర్చనీయాంశంగా మారింది. నావల్నీ మృతిపై.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరిగా స్పందించలేదని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. రిపబ్లికన్ పార్టీలో పుతిన్ వింగ్ (పుతిన్ అనుకూల వర్గం) పట్ల జాగ్రత్తగా ఉండాలని ట్రంప్‌ను ఉద్దేశించి ఆ పార్టీ నేత లిజ్ చెనే హెచ్చరించారు. అలాంటివారిని వైట్‌హౌజ్‌లోకి వెళ్లనివ్వకూడదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ మృతిపై డొనాల్డ్ ట్రంప్ సరైన రీతిలో స్పందించలేదు. చట్టానికి అతీతులుగా వ్యవహరించడంలో ట్రంప్, పుతిన్‌లు ఇద్దరూ ఇద్దరే. నాటో దేశాలపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అమెరికా, బ్రిటన్ల భద్రతను ప్రమాదంలో పడేస్తాయి’అని చెనే తెలిపారు. కాగా, నాటో మార్గదర్శకాల ప్రకారం ఖర్చు పెట్టని దేశాలను రష్యా ఏమైనా చేసుకోవచ్చని.. ఈ విషయంలో రష్యాను తాను ప్రోత్సహిస్తానని ఇటీవల ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇదీ చదవండి.. సొంత బ్రాండ్ షూస్ విడుదల చేసిన ట్రంప్ -
Russia: ప్రతిపక్ష నేతలకు పుతిన్ భయం..!
మాస్కో: పుతిన్ విమర్శకుడు, రష్యా ప్రతిపక్షనేత అలెక్సీ నావల్ని(47) శుక్రవారం దేశంలోని ఆర్కిటిక్ జైలులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు అనుమానాస్పద స్థితిలో మరణించిన,జైలు శిక్షలు పడిన, దేశ బహిష్కరణకు గురైన రష్యా ప్రతిపక్షనేతల ఉదంతాలు మళ్లీ చర్చనీయాంశమయ్యాయి. పుతిన్ తీవ్ర విమర్శకుడిగా పేరొందిన మాజీ డిప్యూటీ సీఎం బొరిస్ నెమ్సోవ్ 2015లో మాస్కోలోని క్రెమ్లిన్ భవనం సమీపంలోని బ్రిడ్జిపై నడుస్తూ వెళుతుండగా దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. ఈ కేసులో ఐదుగురికి శిక్ష పడినప్పటికీ వీరి వెనుక ఉన్న మాస్టర్‌మైండ్ ఎవరన్నది ఇప్పటికీ తెలియలేదు. నెమ్సోవ్ మంచి వక్త. పుతిన్ విధానాలను తీవ్రంగా విమర్శించడమే కాక ఎప్పటికప్పుడు ఆందోళనలు నిర్వహించేవారు. రష్యా ప్రతిపక్ష నేతల్లో ఒకరైనా వ్లాదిమిర్ కరాముర్జా(42)కు 2023 ఏప్రిల్‌లో సుదీర్ఘంగా 23 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఈ జైలు శిక్షను కేవలం రష్యా ఉక్రెయిన్, యుద్ధంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను దేశద్రోహం కేసులో విధించారు. ఉక్రెయిన్‌పై రష్యా చేసిన దాడి మీద విమర్శలు చేసినందుకుగాను మరో ప్రతిపక్ష నేత ఇల్యా యాషిన్కు 2022 డిసెంబర్లో ఎనిమిదిన్నర సంవత్సరాల జైలు శిక్ష పడింది. తాజాగా జైలులో మరణించిన నావల్ని అనుచరుడు లిలియా చన్యాషెవాకు 2023లో ఏడున్నరేళ్ల జైలు శిక్ష విధించారు. పుతిన్‌ను విమర్శించి దేశ బహిష్కరణకు గురైన వారు కూడా చాలా మందే ఉన్నారు. ఆయిల్ రంగంలో వ్యాపార దిగ్గజం మిఖాలీ పదేళ్ల జైలు శిక్ష తర్వాత లండన్ వెళ్లిపోయారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమైన తర్వాత విమర్శలు గుప్పించిన వారందరూ ఇప్పుడు ప్రపంచంలోని పలు దేశాలకు వెళ్లి బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. పుతిన్‌కు వ్యతిరేకంగా వార్తలు రాసిన ఇండిపెండెంట్ మీడియా జర్నలిస్టులపై చాలా మంది మీద ఫారెన్ ఏజెంట్లుగా ముద్ర వేశారు. ఇదీ చదవండి.. జైలులోనే మృతి చెందిన పుతిన్ ప్రత్యర్థి నావల్ని -
జైలులో పుతిన్ ప్రత్యర్థి మృతి.. అమెరికా కీలక ప్రకటన
వాషింగ్టన్: రష్యా ప్రతిపక్షనేత, పుతిన్ ప్రత్యర్థి అలెక్సీ నావల్ని జైలులోనే మృతి చెందడంపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. నావల్ని మృతిని తాము ఇంకా ధృవీకరించలేదని, ఒకవేళ నిజమైతే మాత్రం అదొక భయంకర విషాదం అని వైట్‌హౌజ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ సుల్లివాన్ అమెరికా పబ్లిక్ రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. మరోవైపు నావల్ని మృతిపై అమెరికా స్టేట్ సెక్రటరీ ఆంటోనీ బ్లింకెన్ జర్మనీలోని మ్యూనిచ్‌లో స్పందించారు. నావల్ని మృతి నిజమైతే అది రష్యాలోని ప్రభుత్వ బలహీనత, కుళ్లును సూచిస్తుందని వ్యాఖ్యానించారు. జైలులో నావల్ని మృతి ఒక వ్యక్తిలోని భయాన్ని తెలియజేస్తోందని పరోక్షంగా పుతిన్‌ను ఉద్దేశించి అన్నారు. ఇదీ చదవండి.. జైలులోనే మృతి చెందిన పుతిన్ ప్రత్యర్థి -
Russia: జైలులోనే మృతి చెందిన పుతిన్ ప్రత్యర్థి
మాస్కో: పుతిన్‌ను తీవ్రంగా విమర్శించే ప్రతిపక్ష నేతగా పేరున్న జైలులో ఉన్న రష్యా ప్రతిపక్ష పార్టీ నేత అలెక్సీ నావల్నీ(47) జైలులోనే మృతి చెందారు. ఈ విషయాన్ని యమాలో నెనెట్స్ ప్రాంత జైలు సర్వీసు డిపార్ట్మెంట్ వెల్లడించింది. నావల్నీ పలు రాజకీయ ప్రేరేపిత కేసుల్లో దోషిగా తేలడంతో 2021 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. నావల్ని గతంలో రష్యా ఇన్ ద ఫ్యూచర్ ప్రతిపక్ష పార్టీని లీడ్ చేయడంంతో పాటు పుతిన్ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై పోరాడేందుకు యాంటీ కరప్షన్ ఫౌండేషన్ స్థాపించారు. నావాల్ని మరణంపై పుతిన్‌కు సమాచారమందినట్లు రష్యా మీడియా కథనాలు ప్రచురించింది. త్వరలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నావల్ని మరణం వివాదాస్పదమవుతోంది. ‘ఫిబ్రవరి 16న కరక్షనల్ కాలనీ(జైలు) నెంబర్ 3లో కొంత సేపు నడక తర్వాత నావాల్ని కాస్త ఇబ్బందిగా ఫీలయ్యారు. ఆ వెంటనే ఆయన స్పృహ కోల్పోయారు. తర్వాత వైద్యులు వచ్చి నావల్నీకి అత్యవసర చికిత్స అందించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. అనంతరం డాక్టర్లు నావల్నీ మృతి చెందినట్లు ధృవీకరించారు’ అని ఫెడరల్ ప్రిజన్ సర్వీస్ కార్యాలయం వెల్లడించింది. ఇదీ చదవండి.. భారతీయుల వరుస హత్యలు.. స్పందించిన అమెరికా -
పుతిన్, మోదీ కీలక చర్చలు.. రష్యాకు విషెస్ చెప్పిన ప్రధాని
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ సోమవారం రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్లో చర్చలు జరిపారు. రెండు దేశాలకు సంబంధించిన ప్రాంతీయ అంశాలతో పాటు పలు ఇతర అంతర్జాతీయ అంశాలపైన ఇద్దరి మధ్య చర్చ జరిగింది. బ్రిక్స్ కూటమికి రష్యా అధ్యక్షత వహించే విషయంపైనా చర్చించారు. ‘ప్రెసిడెంట్ పుతిన్‌తో మంచి సంభాషణ జరిగింది. రెండు దేశాల మధ్య భవిష్యత్తు సంబంధాలపై తీసుకోవాల్సిన చొరవపై ఇరువురం చర్చించాం. బ్రిక్స్‌కు రష్యా అధ్యక్షత వహించే విషయంపైనా మాట్లాడాం’అని ప్రధాని మోదీ తన ఎక్స్(ట్విటర్) ఖాతాలో తెలిపారు. ఇటీవల రెండు దేశాల మధ్య అధికారుల స్థాయిలో జరిగిన హై లెవెల్ భేటీలపైనా మోదీ,పుతిన్‌లు సమీక్షించారని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. 2024లో బబ్రిక్స్కు రష్యా అధ్యక్షత వహించే విషయమై భారత్ పూర్తి మద్దతిస్తోందని ప్రకటిస్తూ వారికి ప్రధాని శుభాకాంక్షలు తెలిపారని పీఎంవో పేర్కొంది. ఇదీచదవండి.. మహారాష్ట్ర సీఎం నిర్ణయంపై సుప్రీం కోర్టుకు ఉద్ధవ్ థాక్రే -
ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థిగానే పుతిన్
మాస్కో: రష్యా అధ్యక్ష పదవికి వ్లాదిమిరి పుతిన్ ఈసారి స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేయనున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న పుతిన్‌ను ఆయన మద్దతుదారులు లాంఛనంగా ప్రతిపాదించారు. మరో ఆరేళ్ల కాలానికి 2024లో రష్యాలో ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో పుతిన్ అధికార యునైటెడ్ రష్యా పార్టీ అభ్యర్థిగా పోటీ చేయట్లేదు. అయినప్పటికీ పుతిన్‌కు ఆ పార్టీ పూర్తి మద్దతునిచ్చింది. పార్టీ టికెట్‌పై కాకుండా అధ్యక్షునిగా ఇలా పోటీ చేయడానికి కనీసం 500 మంది మద్దతు అవసరమని రష్యా ఎన్నికల చట్టాలు చెబుతున్నాయి. ఇదేగాక 40 ప్రాంతాల నుంచి కనీసం 3 లక్షల మంది సంతకాలను సేకరించాల్సి ఉంటుంది. పుతిన్‌కు మద్దతు పలికినవారిలో అధికార 'యునైటెడ్ రష్యా పార్టీ' నేతలు, ప్రముఖ నటులు, గాయకులు, క్రీడాకారులు ఉన్నారు. పుతిన్ 2011లో నెలకొల్పిన రాజకీయ సంకీర్ణ కూటమి 'పీపుల్స్ ఫ్రంట్' ఏకగ్రీవంగా ఆయన్ని నామినేట్ చేసింది. త్వరలోనే దేశవ్యాప్తంగా సంతకాల సేకరణ చేపట్టనున్నారు. 2012 ఎన్నికల్లోనూ ఆయన స్వతంత్రునిగానే బరిలో దిగారు. ఈ సారి కూడా ఆయన ఎన్నికవడం లాంఛనంగా మారనుంది. మరోమారు ఆరేళ్ల పాటు రష్యా అధ్యక్షునిగా పనిచేయనున్నారు. ఇదే చదవండి: బందీలపై కాల్పులు! -
రష్యా అధికారిక కార్యక్రమాల్లో పుతిన్ డూప్? క్రెమ్లిన్ ఏమంటోంది?
రష్యా పలు అధికారిక కార్యక్రమాల కోసం అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డూప్ (బాడీ డబుల్స్)ను వినియోగిస్తున్నదంటూ సోషల్‌మీడియాలో తరచూ పలు ఊహాగానాలను షికారు చేస్తున్నాయి. అయితే వీటిని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ఖండించింది. క్రెమ్లిన్ అధ్యక్ష ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ఇటువంటి వాదనలను వినోదం కోసమే చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. మాస్కోలో ప్రారంభమైన రష్యా ఎగ్జిబిషన్లో పెస్కోవ్ మాట్లాడుతూ ‘మాకు ఉన్నది పుతిన్ ఒక్కరే. రష్యా అధ్యక్షుని ‘బాడీ డబుల్స్’ అంటూ వస్తున్న ఊహాగానాలు హాస్యాస్పదమైనవని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఇటీవలి కాలంలో ఇటువంటివి విరివిగా కనిపిస్తున్నాయని అన్నారు. కొందరు నిపుణులు ఇంటర్నెట్లో పుతిన్ రూపాలను లెక్కకుమించి సృష్టిస్తున్నారని ఆరోపించారు. రష్యా అధ్యక్షుని బాడీ డబుల్స్‌ను పలు విదేశీ పర్యటనలతో సహా కొన్ని బహిరంగ కార్యక్రమాలకు కూడా ఉపయోగించారని ఒక వార్తాపత్రిక పేర్కొంది. అలాగే ఇటీవల జపనీస్ టీవీ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించింది. ఉక్రెయిన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ కిరిల్ బుడనోవ్ కూడా ఇదే విధమైన ప్రకటన చేశారు. పుతిన్ ‘లుక్-అలైక్’ అంటూ వచ్చిన పలు నివేదికలు అసంబద్ధమైనవంటూ తాజాగా మరోమారు డిమిత్రి పెస్కోవ్ స్పష్టం చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ మంచి ఫిట్నెస్ కలిగి ఉన్నారని , నాన్‌స్టాప్‌గా కూడా పని చేయగలరని ఆయన పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: పాక్‌పై ప్రాణాంతక అమీబా దాడి.. 11 మంది మృతి! -
పుతిన్ ఆరోగ్యంపై పుకార్లు.. ఖండించిన క్రెమ్లిన్
మాస్కో: రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను క్రెమ్లిన్ ఖండించింది. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని స్పష్టం చేసింది. పుతిన్ ఆరోగ్యం సరిగా లేదని ఆరోపణలు వెల్లువెత్తున్న నేపథ్యంలో క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ స్పందించారు. బాడీ డబుల్స్‌ను వాడుతున్నారని నిరాధార ఆరోపణలను కొట్టిపారేశారు. అదంతా అబద్ధంగా పేర్కొన్నారు. పుతిన్ ఆరోగ్యం సరిగా లేదని రష్యన్ టెలిగ్రామ్ ఛానెల్లో వదంతులు వచ్చాయని పేర్కొంటూ ప్రశ్చ్యాత దేశాల మీడియా ప్రచురణలు వెలుగులోకి వచ్చాయి. పుతిన్ (71) క్యాన్సర్, పార్కిన్సన్స్ వ్యాధితో సహా తీవ్రమైన వ్యాధులతో పోరాడుతున్నట్లు 2022 నుంచే వివిధ నివేదికలు వస్తున్నాయి. బహిరంగ ప్రదర్శనలలోనూ పుతిన్ అస్థిరంగా, ఉబ్బినట్లుగా కనిపించడం ఈ పుకార్లకు అప్పట్లోనే ఆజ్యం పోసింది. తాజాగా సెప్టెంబర్‌లో రష్యాన్ టెలిగ్రామ్ ఛానెల్లో ఓ పోస్టు దర్శనమిచ్చింది.'మీరు మమ్మల్ని విడిచిపెట్టవద్దు. సజీవంగా ఆరోగ్యంగా ఉన్నారని దేవుడిని ప్రార్ధిస్తున్నాం' అంటూ ఓ పోస్టు వెలుగులోకి వచ్చింది. దీంతో మీడియా ప్రతినిధులు పుతిన్ ఆరోగ్యంపై క్రెమ్లిన్ ప్రతినిధిని తాజాగా ప్రశ్నించారు. బాడీ డబుల్స్‌కు సంబంధించి 2020లోనే పుకార్లు వచ్చాయి. భద్రతా ప్రయోజనాలు దృష్ట్యా ఓ దేహాన్ని ఉపయోగించారనే ఊహాగానాలు వచ్చాయి. ఆ పుకార్లను క్రెమ్లిన్ అప్పట్లోనే ఖండించింది. ఇదీ చదవండి: లండన్ నడిబొడ్డున జిహాద్ నినాదాలు.. రిషి సునాక్ ఆగ్రహం -
పేదరికంలో పుట్టిన పుతిన్ రష్యా అధ్యక్షుడెలా అయ్యారు?
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల తన 71వ పుట్టినరోజును జరుపుకున్నారు. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూసిన ఆయన 21వ శతాబ్దంలో రష్యాను ముందుకు నడిపిస్తున్నారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన పుతిన్ లా కోర్సు పూర్తిచేసి, సోవియట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కేజీబీలో చిన్న ఉద్యోగంతో కెరియర్ ప్రారంభించి దేశ అధ్యక్షుని హోదాకు చేరుకున్నారు. పుతిన్ 1952, అక్టోబర్ 7న లెనిన్గ్రాడ్ (నేటి సెయింట్ పీటర్స్బర్గ్)లో జన్మించారు. పుతిన్ తండ్రి కర్మాగారంలో పనిచేసేవాడు. తల్లి వీధులు ఊడ్చే పని చేసేది. పుతిన్ తన 12 సంవత్సరాల వయస్సులో జూడో నేర్చుకోవడం మొదలుపెట్టాడు. పుతిన్ కళాశాలలో చదువుతున్న సమయంలో సోవియట్ యూనియన్ కమ్యూనిస్ట్ పార్టీలో సభ్యునిగా చేరారు. 1991లో ఆ పార్టీ రద్దు అయ్యే వరకు సభ్యునిగా కొనసాగారు. కళాశాల చదువు తరువాత పుతిన్ సోవియట్ యూనియన్ గూఢచార సంస్థలో చిన్న పోస్ట్‌లో చేరారు. అనంతరం అదే కేజీబీలో లెఫ్టినెంట్ కల్నల్ స్థాయికి చేరుకున్నారు. పుతిన్ 1991లో కేజీబీకి రాజీనామా చేశారు. అప్పుడే అతని రాజకీయ జీవితం ప్రారంభమైంది. మేయర్ కార్యాలయంలో విదేశీ సంబంధాల కమిటీకి ఎన్నికయ్యారు. తరువాత దాని అధిపతి అయ్యారు. 1994, 1996 మధ్యకాలంలో సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో అనేక ప్రభుత్వ పదవులను నిర్వహించారు. 1996లో పుతిన్ మాస్కో వెళ్లారు. అక్కడ అప్పటి అధ్యక్షుడు బోరిస్ యెల్ట్సిన్ పరిపాలనలో భాగమ్యారు. యెల్ట్సిన్ రాజీనామాకు ముందు పుతిన్ ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ డైరెక్టర్, రష్యా భద్రతా మండలి కార్యదర్శిగా ఉన్నారు. 1999లో కొంతకాలం మంత్రిగా కూడా పనిచేశారు. యెల్ట్సిన్ రాజీనామా తర్వాత పుతిన్ తాత్కాలిక అధ్యక్షుడయ్యారు. నాలుగు నెలల తర్వాత జరిగిన ఎన్నికల్లో పుతిన్ అధికారికంగా దేశ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత పుతిన్ ఇక వెనుతిరిగి చూసుకోలేదు. తొలుత 2004 నుంచి 2008 వరకు, ఆ తర్వాత 2012 నుంచి ఇప్పటి వరకు అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారు. 2008 నుండి 2012 వరకు పుతిన్ నాటి అధ్యక్షుడు దిమిట్రీ మెద్వెదేవ్ దగ్గర ప్రధాన మంత్రిగా ఉన్నారు. ఇది కూడా చదవండి: మార్స్ రెడ్ ప్లానెట్ ఎందుకయ్యింది? విలక్షణత ఎలా వచ్చింది? -
అమెరికాకు వ్యతిరేకంగా చేతులు కలిపిన రష్యా, ఉత్తర కొరియా
కరడుగట్టిన నియంతగా పేరుగాంచిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రత్యేక రైలులో మిత్రదేశం రష్యా చేరుకున్నారు. రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌తో కిమ్ భేటీకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. నేడో రేపో చర్చలు జరగనున్నాయి. అగ్రరాజ్యం అమెరికాపై ఉన్న ఉమ్మడి శత్రుత్వం వల్ల రష్యా–ఉత్తర కొరియా సన్నిహితంగా మారాయని చెప్పొచ్చు. రెండు దేశాలూ అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్రమైన ఆంక్షలను ఎదుర్కొంటున్నాయి. రష్యా, ఉత్తర కొరియాలను దుష్ట దేశాలుగా అమెరికా అభివర్ణిస్తోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్తర కొరియా పట్ల కొంత ఉదారంగానే వ్యవహరించారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ మాత్రం కిమ్ పట్ల కఠిన వైఖరి అవలంబిస్తున్నారు. ఈ నేపథ్యంలో కిమ్–పుతిన్ తాజా సమావేశంపై ప్రపంచమంతటా ఆసక్తి నెలకొంది. ఈ భేటీ వల్ల ప్రపంచ భౌగోళిక–రాజకీయ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ ఆయుధమే కీలకం.. పుతిన్–కిమ్ భేటీతో ఎవరికి ఎంత లాభం? అనేదానిపై చర్చ మొదలైంది. కిమ్ రాజ్యంలో భారీస్థాయిలో ఆయుధ పరిశ్రమ వర్థిల్లుతోంది. ఆయుధాల ఉత్పత్తి సామర్థ్యం అధికంగా ఉంది. మరోవైపు ఉక్రెయిన్‌పై సుదీర్ఘ కాలంగా యుద్ధం కొనసాగిస్తున్న రష్యా వద్ద ఆయుధ నిల్వలు నిండుకున్నాయి. పైగా ఉక్రెయిన్ నుంచి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అమెరికా సహా పశ్చిమ దేశాలు ఇస్తున్న ఆయుధాలతో ఉక్రెయిన్ సైన్యం రష్యాపై విరుచుకుపడుతోంది. రష్యాకు ఇతర దేశాల నుంచి ఇప్పటికిప్పుడు ఆయుధాలు అందే పరిస్థితి లేదు. అందుకే ఉత్తర కొరియా నుంచి ఆయుధాల సేకరణపై పుతిన్ దృష్టి పెట్టారు. ఉత్తర కొరియా నుంచి రష్యాకు ఆయుధాల ఎగుమతిపై ఇరుదేశాల నడుమ ఇప్పటికే ఫలవంతమైన చర్చలు జరిగినట్లు అమెరికా అనుమానిస్తోంది. తుది ఒప్పందం కోసమే కిమ్ రష్యాకు వెళ్లినట్లు చెబుతోంది. అయితే, దీనిపై రష్యా ఇప్పటిదాకా అధికారికంగా స్పందించలేదు. ఆయుధాల కొనుగోలును నిర్ధారించలేదు. కానీ, రక్షణ రంగంలో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని రష్యా, ఉత్తర కొరియా తీర్మానించుకున్నాయని చెప్పడానికి ఎన్నో దృష్టాంతాలు కనిపిస్తున్నాయి. రష్యా రక్షణ శాఖ మంత్రి సెర్గీ షోయిగు ఈ ఏడాది జూలైలో ఉత్తర కొరియాలో పర్యటించారు. అక్కడ ఆయుధాల ప్రదర్శనను తిలకించారు. ఆయుధాల ఫ్యాక్టరీలను సైతం సందర్శించినట్లు వార్తలొచ్చాయి. ఉత్తర కొరియాతో కలిసి ఉమ్మడిగా సైనిక విన్యాసాలు చేపడతామని సెర్గీ ప్రకటించారు. అప్పట్లో సెర్గీకి కిమ్ జోంగ్ ఉన్ ‘టూర్ గైడ్’గా పనిచేశారు. దగ్గరుండి తమ ఆయుధాలను చూపించారు. సంతకాన్ని రద్దు చేసుకుంటే! ఉత్తరకొరియా నుంచి ఆయుధాలు చేతికి అందిన తర్వాత ఉక్రెయిన్‌పై పూర్తిస్థాయి యుద్ధం మొదలవుతుందని పుతిన్ సంకేతాలిస్తున్నారు. అమెరికా కనుసన్నల్లో నడస్తున్న ప్రపంచ క్రమం(వరల్డ్ ఆర్డర్) మారుతుందని అంటున్నారు. తమ లక్ష్య సాధనకు ఉత్తర కొరియాతో సైనిక సహకారం సైతం కుదుర్చుకోవాలని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, అణ్వస్త్ర ప్రయోగాలు కొనసాగిస్తున్న ఉత్తర కొరియాపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఇటీవల ఆంక్షలు విధించింది. ఉత్తర కొరియాతో ఎవరూ ఆయుధ వ్యాపారం చేయరాదని ఆదేశించింది. ఈ తీర్మానంపై రష్యా కూడా సంతకం చేసింది. తమ సంతకాన్ని రద్దు చేసుకొనే అవకాశం లేకపోలేదని అధికార వర్గాలు తాజాగా తేల్చిచెప్పాయి. భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశమైన రష్యా వెనక్కి తగ్గితే ఉత్తర కొరియాపై ఆంక్షలు బలహీనమవుతాయి. అప్పు డు ఉత్తర కొరియా నుంచి యథేచ్ఛ గా ఆయు ధాలు కొనుగోలు చేసుకో వచ్చు. ప్రతిఫలం అదేనా? రష్యా సంగతి సరే మరి ఉత్తరకొరియాకు దక్కే ప్రయోజనమేంటి?రష్యాకు ఆయుధాలు ఇచ్చి, తిరిగి పొందే ప్రతిఫలం ఏమై ఉంటుంది? కిమ్ రాజ్యంలో ప్రస్తుతం తీవ్ర ఆహార కొరత వేధిస్తోంది. పౌష్టికాహారం అనేది కలలో మాటగా మారింది. అందుకే మానవతా సాయం పేరిట రష్యా నుంచి భారీగా ఆహార ధాన్యాలను తీసుకోవాలని కిమ్ ప్రభుత్వం నిర్ణయానికొచ్చింది. అలాగే సైన్యానికి ఉపయోగ పడే శాటిలైట్లు, అణ్వస్త్ర సహిత జలాంతర్గాములు తయారు చేసే అత్యాధునిక టెక్నాలజీ ఉత్తర కొరియా వద్ద లేదు. ఇలాంటి సాంకేతికతలో రష్యా ముందంజలో ఉంది. ఆయుధాలకు ప్రతిఫలంగా ఈ టెక్నాలజీని రష్యా నుంచి సొంతం చేసుకోవాలని కిమ్ ప్రభుత్వం నిర్ణయానికొచి్చనట్లు సమాచారం. అందుకు పుతిన్ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్థూలంగా చెప్పాలంటే పుతిన్ తనకు అవసరమైన ఆయుధాలను ఉత్తర కొరియా నుంచి తీసుకుంటారు. బదులుగా ఆహార ధాన్యాలు, ఆధునిక టెక్నాలజీని కిమ్‌కు అందజేస్తారు. ఇద్దరికీ లాభమేనన్నమాట! ఇక ఒప్పందాలపై సంతకాలు చేయడమే మిగిలి ఉంది. -
పుతిన్‌తో త్వరలో కిమ్ జోంగ్ ఉన్ భేటీ!
సియోల్: ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ రష్యా అధినేత పుతిన్‌తో సమావేశం కాబోతున్నారా? ఇందుకోసం త్వరలోనే రష్యాకు బయలుదేరి వెళ్తారా? నిజమేనని అమెరికా అధికార వర్గాలు చెబుతున్నాయి. అమెరికాకు బద్ధ వ్యతిరేకి అయిన కిమ్ జోంగ్ ఉన్ ఇటీవలి కాలంలో పుతిన్‌కు స్నేహ హస్తం అందిస్తున్నారు. ఇద్దరు నేతలు ముఖాముఖి భేటీ అవుతుండడం చర్చనీయాంశంగా మారింది. ఉక్రెయిన్‌పై యుద్ధం సాగిస్తున్న రష్యా వద్ద ఆయుధ నిల్వలు వేగంగా నిండుకుంటున్నాయి. అందుకే ఉత్తర కొరియా నుంచి ఆయుధాలు కొనుగోలు చేయాలని రష్యా నిర్ణయించినట్లు సమాచారం. పుతిన్, కిమ్ సమావేశంలో ఇదే అంశంపై చర్చించే అవకాశం ఉంది. రష్యాకు అందించే సహాయానికి బదులుగా ఆహారం, అత్యాధునిక ఆయుధ టెక్నాలజీని తమకు అందజేయాలని పుతిన్ నుంచి కిమ్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇరువురు నేతలు చివరిసారిగా 2019 ఏప్రిల్‌లో కలుసుకున్నారు. -
మాస్కోకు నార్త్ కొరియా కిమ్, రహస్య భేటీ?
సియోల్: ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ దూకుడుగా ఉన్నారు. పశ్చిమ దేశాల హెచ్చరికలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. మిత్ర దేశాలతో ఆయుధ ఒప్పందాలకు సిద్ధపడుతున్నారు. యుద్ధసామాగ్రి సరఫరా అంశంపై ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, పుతిన్ త్వరలో భేటీ కానున్నారు. కొత్త ఆయుధ సామగ్రితో మరింత విధ్వంసానికి ప్రణాళికలు చేస్తున్నారని అమెరికా ఆరోపిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధంలో మాస్కోకు ఆయుధాలు అందించడంపై చర్చించేందుకు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలవనున్నారని అమెరికా తెలిపింది. ఆయుధాలు, యుద్ధ సామాగ్రిని కొనుగోలు చేయడానికి కిమ్‌తో రష్యా రహస్యంగా చర్చలు జరుపుతోందని వైట్ హౌస్ గత వారం హెచ్చరించింది. ఆ తర్వాత తాజాగా ఈ ప్రకటన చేసింది. కిమ్ సాధారణంగా ఉత్తర కొరియా దాటి బయటికి వెళ్లరు. కానీ పుతిన్‌తో ఈ నెలాఖరున రష్యాలోని వ్లాడివోస్టాక్‌కు వెళ్లి పుతిన్‌ను కలుసుకునే అవకాశం ఉందని న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది. మాస్కోకు కూడా కిమ్ పర్యటించే అవకాశం ఉందని వెల్లడించింది. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో గతేడాది రష్యాకు ఉత్తరకొరియా రాకెట్లను, మిస్సైల్లను సరఫరా చేసిన విషయం తెలిసిందే. ఆయుధ సరఫరా ఒప్పందంపై రష్యా రక్షణ మంత్రి సెర్గీ సోయిగు గత నెలలో ఉత్తర కొరియాలో పర్యటించారని అమెరికా జాతీయ భద్రతా మండలి (ఎన్ఎస్సీ) ప్రతినిధి అడ్రియన్ వాట్సన్ తెలిపారు. రష్యాతో ఆయుధ ఒప్పందాలు రద్దు చేసుకుని, అంతర్జాతీయ ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని ఉత్తరకొరియాను కోరారు. ఉత్తర కొరియా, రష్యా మధ్య ఆయుధ ఒప్పందాలు భద్రతా మండలి నిర్ణయాలకు వ్యతిరేకమని అమెరికా, బ్రిటన్, దక్షిణ కొరియా, జపాన్‌లు గత వారం సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. ఇదీ చదవండి: రక్షణ మంత్రిని తొలగించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ -
ప్రిగోజిన్ ఉత్థాన పతనాలు!
కిరాయి సైన్యం అధిపతి యెవ్‌గనీ ప్రిగోజిన్ బుధవారం విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడని రెండు రోజుల తర్వాత రష్యా అధికారికంగా ధ్రువీకరించింది. రెండు నెలల క్రితం తిరుగుబాటు ప్రకటించి మాస్కోవైపు శతఘ్నులతో దూసుకెళ్లిన ప్రిగోజిన్ అధ్యక్షుడు పుతిన్ మినహా ఇతర ఉన్నత స్థాయి నాయకగణంపై విమర్శలు గుప్పిస్తూ వచ్చాడు. కానీ ఉన్నట్టుండి జూన్ 23న నేరుగా తన కిరాయి సైనికులతో మాస్కో దిశగా దండయాత్రకు తరలివెళ్లి అందరినీ ఆశ్చర్య పరిచాడు. బహుశా పుతిన్ మినహా మిగిలినవారిపైనే తాను ఆగ్రహిస్తున్నట్టు నమ్మించ గలుగుతున్నానని ప్రిగోజిన్ భ్రమపడి వుండొచ్చు. ఈ అలజడి పుతిన్‌ను భయోత్పాతంలో ముంచిందనీ, ఆయన అజ్ఞాతానికి పోయారనీ ప్రచారం జరిగింది. ఆ మర్నాడు మీడియాతో మాట్లాడిన పుతిన్, ప్రిగోజిన్‌ను ‘నమ్మక ద్రోహి’గా అభివర్ణించారు. ఇలా ప్రకటించటం మరణ శాసనమేనని అప్పట్లో చాలామంది జోస్యం చెప్పారు. రష్యాలో లేదా విదేశాల్లో ఉంటూ విమర్శలు గుప్పించే రాజకీయ ప్రత్యర్థులు కావొచ్చు, దేశ రహస్యాలను వేరే దేశాలకు విక్రయించినవారు కావొచ్చు పుతిన్ దృష్టిలో నమ్మక ద్రోహులే. ఆ హిట్ లిస్ట్‌లోని వారిలో తప్పనిసరై ఒకరిద్దరిని జైల్లో పడేశారు తప్ప ఇంతవరకూ ఎవరినీ ప్రాణాలతో వదల్లేదు. ఇతరేతర అంశాలైతే వేరుగానీ, నమ్మక ద్రోహాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించబోనని గతంలో పుతిన్ చేసిన ప్రకటనను ప్రిగోజిన్ వ్యవహారంలో కొందరు గుర్తుచేశారు. నిజానికి బెలారస్ మధ్యవర్తిత్వంతో ప్రిగోజిన్ శాంతించారని, అతనికీ, ప్రభుత్వానికీ అంగీకారం కుదిరిందని ప్రకటన వచ్చినప్పుడు ప్రిగోజిన్‌కు రోజులు దగ్గరపడినట్టేనని చాలామంది అనుకున్నారు. అదే సమయంలో పుతిన్ అతన్ని క్షమిస్తారన్న విశ్లేషణలూ వచ్చాయి. ఎందుకంటే ఉక్రెయిన్‌పై ఏడాదిన్నర క్రితం దురాక్రమణ యుద్ధం మొదలెట్టాక రష్యా చేజిక్కించుకున్న పెద్ద నగరం బఖ్మూత్. వేరే నగరాలు చిక్కినట్టే చిక్కి చేజారగా, బఖ్మూత్ మాత్రం ఇంకా రష్యా నియంత్రణలోనే ఉంది. ఈ విజయం నిస్సందేహంగా ప్రిగోజిన్దే.అందుకే అతన్ని మళ్లీ తన దారికి తెచ్చుకుని ఉక్రెయన్ను ముప్పుతిప్పలు పెట్టడానికి పుతిన్ వినియోగించుకుంటారని భావించారు. కానీ ప్రిగోజిన్ తలరాతను పుతిన్ అప్పటికే వేరే రాశారు. తన 23 యేళ్ల ఏలుబడిలో పుతిన్ కఠినాత్ముడన్న పేరు తెచ్చుకోవటానికే మొగ్గుచూపారు. కానీ ప్రిగోజిన్ విషయంలో దాన్నంతటినీ తాత్కాలికంగానైనా దిగమింగి అతను క్షేమంగా వెళ్లిపోవటానికి అంగీకరించి, ఆ ఇమేజ్ను పోగొట్టుకున్నారు. చివరకు క్రెమ్లిన్‌లో అతని కిరాయి సైన్యంతో సమావేశమైనప్పుడు అందులో ప్రిగోజిన్ సైతం పాల్గొనటానికి పుతిన్ అనుమతించారు. ఈ ఆధునిక కాలంలో కూడా రాజ్యాలు తమ మనుగడ కోసం కిరాయి సైన్యాలపై ఆధారపడటం వింతగానే ఉంటుంది. అమెరికాలో పోలీసు విధులు కాంట్రాక్టులకు ఇచ్చే అలవాటున్నా సైన్యం విషయంలో ఆ విధానం పెట్టుకోలేదు. ఆఫ్రికా ఖండంలో ప్రస్తుతం అనేక దేశాలు ప్రిగోజిన్ సేవ లను వాడుకుంటున్నాయి. వాస్తవానికి పాశ్చాత్య దేశాల మీడియా చాన్నాళ్లుగా ప్రిగోజిన్ గురించి కథనాలు వెలువరిస్తున్నా ఆ సైన్యం ఉనికిని పుతిన్ ధ్రువీకరించలేదు. ఆఫ్రికా ఖండ దేశాల్లో అతని సైనికుల ఆగడాలపై అనేకానేక కథనాలు వచ్చాయి. ఆఖరికి ఉక్రెయిన్ దురాక్రమణ యుద్ధ సమయంలోనూ కిరాయి సేనల ఉనికిని రష్యా అధికారికంగా అంగీకరించలేదు. తమ చట్టాలు ప్రైవేటు సైనిక కంపెనీలను అంగీకరించబోవన్నదే పుతిన్ చెబుతూవచ్చిన జవాబు. కానీ జూన్ 23 నాటి తిరుగుబాటు ఈ వ్యవహారాన్ని బజారున పడేసింది. మాస్కోలో మాఫియా తరహా రాజ్యం నడు స్తోందన్న పాశ్చాత్య మీడియా ప్రచారానికి బలం చేకూర్చింది. రెండు దశాబ్దాలపైగా పుతిన్ అటు వంటి రాజ్యాన్నే నడుపుతున్నారనడానికి ఆయన వ్యతిరేకుల అనుమానాస్పద మరణాలను చాలామంది ఉటంకిస్తుంటారు. పుతిన్ అవినీతిపై కథనాలు రాస్తున్న మహిళా జర్నలిస్టు అనా పొలిటికోవ్స్కియాను 2006లో కాల్చిచంపారు. ఫెడరల్ సెక్యూరిటీ అధికారిగా పనిచేస్తూ 2006లో బ్రిటన్ పరారైన అలెగ్జాండర్ లిత్వినెంకో లండన్‌లోని దుకాణంలో రేడియో ధార్మిక పదార్థం కలిసిన టీ తాగి మరణించారు. పుతిన్ అధికారానికి రావటానికి తోడ్పడిన బోరిస్ బెరిజోవ్స్కీ ఆయన ఆగ్రహానికి గురై బ్రిటన్ వెళ్లిపోయినా 2013లో అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. 2015లో బోరిస్ నెమ్ట్స్నోవ్ అనే భౌతిక శాస్త్రవేత్తను క్రెమ్లిన్‌లో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిచంపారు. ఒకప్పుడు పుతిన్‌కు సన్నిహితంగా మెలిగి తర్వాత అతనికి బద్ధ వ్యతిరేకి అయిన అలెక్సీ నవాల్ని సైతం 2020లో ఒక రేడియో ధార్మిక పదార్థం బారినపడ్డారు. ఆయన చచ్చి బతికాడనుకుంటే ఇప్పుడు నిరవధికంగా జైల్లో మగ్గుతున్నాడు. చట్టసభలూ, ఇతర వ్యవస్థలూ సజావుగా పనిచేస్తున్నట్టు కనబడే రాజ్యాల్లో నియంతలు బయల్దేరి వాటిని భ్రష్టుపట్టించటం, అధికారంలో శాశ్వతంగా కొనసాగేట్టు చూసుకోవటం కొత్తేమీ కాదు. కానీ పుతిన్ తీరే వేరు. రాజ్య వ్యవస్థలకు సమాంతరంగా చట్టాలతో సంబంధం లేకుండా పటిష్టమైన సొంత వ్యవస్థలను ఏర్పాటు చేసుకుని వాటిద్వారా వ్యతిరేకులను అణచివేసే విధానం ఆయనది. ఇది అత్యంత ప్రమాదకరమైనది. ఒకప్పుడు జర్మనీ నియంత హిట్లర్‌ను మట్టికరిపించే క్రమంలో 87 లక్షల మంది సైనికులతో సహా దాదాపు 2 కోట్ల 70 లక్షలమంది ప్రాణాలు పోగొట్టు కున్న దేశానికి ఈ పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించివుండరు. ఏదేమైనా ప్రిగోజిన్ ఉత్థాన పతనాలు వర్తమాన ప్రపంచ దుఃస్థితికి అద్దం పడతాయి. -
పుతిన్ బద్ధశత్రువు అలెక్సి నవాల్నీకి మరో 19 ఏళ్ల జైలు శిక్ష
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు బద్ధ శత్రువైన ప్రతిపక్ష నాయకుడు అలెక్సి నవాల్నీకి మరో 19 ఏళ్ల శిక్షను ఖరారు చేస్తూ అక్కడి న్యాయస్థానం తీర్పును వెలువరించింది. తీవ్రవాదిగా ప్రకటించబడిన ఆయన పదకొండున్నర సంవత్సరాల జైలు శిక్షలో భాగంగా జనవరి 2021 నుండి శిక్షను అనుభవిస్తుండగా తాజాగా ఆయనపై మరిన్ని అభియోగాలను మోపి అతడి జైలుశిక్షను మరింత పొడిగించారు. ఈ మేరకు విచారణకు సంబంధించిన వీడియోను విడుదల చేశారు. వీడియోలో నవాల్నీ నల్లని దుస్తులు ధరించి ఉన్నారు. చేతులు జోడించుకుని నిలబడి తీర్పును వింటున్నట్లు కనిపించారు. వీడియోలో న్యాయమూర్తి వెలువరించిన తీర్పుకు సంబంధించిన ఆడియో అస్పష్టంగా ఉందని నవాల్నీ అనుచరలు అన్నారు. తీర్పును విని నిర్దారించడం కష్టంగా ఉందని చెప్పారు. రష్యాలో పుతిన్‌కు ఏకైక ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న నవాల్నీపై ఉగ్రవాదం సహా పలు కేసులు నమోదు చేశారు. ఇందులో ఆయన ఇప్పటికే 11 ఏళ్లకు పైగా శిక్ష పడగా.. తాజాగా మరికొన్ని అభియోగాల్లో మరో 19 ఏళ్లు కారాగార శిక్ష ఖరారైంది. పుతిన్ తన ప్రత్యర్థిని బయటకు వెళ్లకుండా జైళ్లోనే మగ్గే విధంగా ప్రణాళికలు చేస్తున్నారని నవాల్నీ అనుచరులు ఆరోపిస్తున్నారు. నవాల్నీ ప్రస్తుతం 47 ఏళ్ల వయసులో ఉన్నారు. కాగా తాజా తీర్పుతో అతని అనుచరుల్లో అసంతృప్తి నెలకొంది. ఇదీ చదవండి: Putin Critic Alexei Navalny: రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు బద్ధశత్రువుపై మరిన్ని కేసులు -
పుతిన్‌ను అరెస్టు చేస్తే.. రష్యాతో యుద్దం తప్పదు: సౌతాఫ్రికా అధ్యక్షుడు
ఆగష్టులో జొహానెస్బర్గ్ వేదికగా బ్రిక్స్ దేశాల సదస్సు జరగనుంది. దీనికి రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా హాజరుకానున్నారు. ఈ ఏడాది మార్చిలో పుతిన్‌పై అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీసీ) అరెస్టు వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఐసీసీ సభ్య దేశంగా ఉన్న దక్షిణాఫ్రికా పుతిన్‌ను అరెస్టు చేయాల్సి ఉంటుంది. దీంతో పుతిన్ అరెస్టు విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పుతిన్‌ను అరెస్టు చేస్తే రష్యాతో యుద్ధం తప్పదని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమపోసో అన్నారు. బ్రిగ్స్ సమావేశం నేపథ్యంలో దక్షిణాఫ్రికాకు వస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను అరెస్టు చేయాలని ఆ దేశ ప్రతిపక్ష డెమోక్రటిక్ అలయెన్స్ అక్కడి న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. కోర్టులో విచారణ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో పుతిన్‌ను అరెస్టు చేస్తే రష్యాతో యుద్ధం ప్రకటించినట్లేనని రమఫొస పేర్కొన్నారు. రష్యాతో యుద్ధం చేయడం దక్షిణాఫ్రికా రాజ్యాంగానికి విరుద్ధమని కోర్టుకు తెలిపారు. మరోవైపు బ్రిక్స్ దేశాల వేదికను తమ దేశం నుంచి మార్చాలన్న ప్రతిపాదనను ఆయా దేశాలు తిరస్కరించినట్లు దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పౌల్ మషతిలే తెలిపారు. గత కొన్నాళ్లుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం దురాక్రమణమని పలు దేశాలు అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. ఐక్యరాజ్య సమితి నియమాలకు విఘాతం కలిగిస్తోందని తెలుపతూ.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను అరెస్టు చేయాలని కోరాయి. ఆ తర్వాత ఐసీసీ ఆయనపై అరెస్టు వారెంట్‌ను జారీ చేసింది. ఇరుదేశాల మధ్య యుద్ధాన్ని విరమించాలని పలు దేశాలు కోరుతున్నాయి. ఇదీ చదవండి: మండుతున్న ధరలు, ఆస్తులు అమ్ముకుంటున్న పాకిస్తాన్.. పరిస్థితి కష్టమేనంటున్న ఐఎంఎఫ్ నివేదిక -
వాగ్నర్ గ్రూప్ చీఫ్ హతం! ఇందులో నిజమెంత? అమెరికా సందేహాలు
వాషింగ్టన్: రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై తిరుగుబాటు చేసిన కిరాయి సైన్యం ‘వాగ్నర్ గ్రూప్’ అధినేత యెవ్గెనీ ప్రిగోజిన్ ఇప్పుడు ఎక్కడున్నారు? రష్యాలోనే ఉన్నారా? లేక పొరుగు దేశం బెలారస్లో తల దాచుకుంటున్నారా? తిరుగుబాటు తర్వాత పుతిన్‌తో ఆయన సమావేశమై తన చర్యలపై వివరణ ఇచి్చనట్లు వార్తలు వెలువడ్డాయి. అందులో నిజమెంత? ఇలాంటి ప్రశ్నలు జనం మదిలో మెదులుతున్నాయి. అయితే, పుతిన్ ఆదేశాలతో రష్యా అధికారులు ప్రిగోజిన్‌ను ఇప్పటికే అంతం చేసి ఉండొచ్చని లేక జైల్లో బంధించి ఉండొచ్చని అమెరికా మాజీ సైనిక ఉన్నతాధికారి జనరల్ రాబర్ట్ అబ్రామ్స్ చెప్పడం ఆసక్తికరంగా మారింది. పుతిన్‌తో ప్రిగోజిన్ భేటీ రష్యా ఆడిన డ్రామా అని ఆయన తేలి్చచెప్పారు. ప్రిగోజిన్‌ను ఇక బహిరంగంగా చూడటం అనుమానమేనన్నారు. వాగ్నర్ గ్రూప్ చీఫ్‌ను రష్యా అధికారులు చంపేసి అయినా ఉండాలి లేదా జైల్లో పెట్టయినా ఉండాలి లేదా ఎక్కడైనా దాచేసి ఉండాలి అని రాబర్ట్ అబ్రామ్స్ వెల్లడించారు. ప్రిగోజిన్ జూన్ 23న తన ప్రైవేట్ సైన్యంతో కలిసి పుతిన్‌పై తిరుగుబాటు చేయడం తెలిసిందే. కొందరు రష్యా సైనికాధికారుల అండతోనే ఆయన ఈ చర్యకు పాల్పడినట్లు వాదనలు వినిపించాయి. తిరుగుబాటు కొన్ని గంటల్లోనే ముగిసింది. ఆ తర్వాత జూన్ 29న ప్రిగోజిన్ తన వాగ్నర్ గ్రూప్ కమాండర్లతో కలిసి పుతిన్‌తో సమావేశమయ్యారని, ఇకపై రష్యా ప్రభుత్వానికి విధేయులుగా ఉంటామన్నట్టు వార్తలొచ్చాయి. ఉక్రెయిన్‌పై యుద్ధంలో ప్రిగోజిన్ సేవల దృష్ట్యా అతడికి పుతిన్ క్షమాభిక్ష ప్రసాదించినట్టు వార్తలొచ్చాయి. -
మోదీ, పుతిన్ ఫోన్ కాల్.. ఏం మాట్లాడుకున్నారంటే..?
ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్లో సంభాషించుకున్నారు. ఇటీవల రష్యాలో జరిగిన అంతర్యుద్ధం, ఉక్రెయిన్ అంశాలపై చర్చించుకున్నారు. ప్రిగోజిన్ తిరుగుబాటు నేపథ్యంలో మోదీ మద్దతు తెలిపినట్లు క్రెమ్లిన్ ప్రకటించింది. రష్యాలో శాంతి పరిరక్షణలు నెలకొని పౌరుల భద్రత కాపాడాలని మోదీ ఆకాంక్షించినట్లు పేర్కొంది. అమెరికా పర్యటన తర్వాత మొదటిసారి మోదీ, పుతిన్‌లు ఫోన్లో సంభాషించడం ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యాలో ఇటీవల జరిగిన సంఘటనలను ఇరువురు నాయకులు చర్చించుకున్నారు. అంతర్జాతీయంగా, ప్రాంతీయంగా జరుగుతున్న మార్పులు, పరస్పర సహకార అంగీకారాలపై ముచ్చటించారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమై ఏడాది దాటిపోయింది. ఈ క్రమంలో ఇరుదేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనలపై చర్చ జరిగిందని క్రెమ్లిన్ తెలిపింది. జీ20, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లలో ఇరుదేశాల మధ్య జరిగిన దౌత్య ఒప్పందాలపై కూడా మోదీ, పుతిన్ మాట్లాడుకున్నారు. అయితే.. ప్రిగోజిన్ తిరుగుబాటుతో రష్యా దేశం ఎప్పడూ లేనంత ఇబ్బందుల్లో పడిపోయింది. పుతిన్ అధికారంలోకి వచ్చిన రెండు దశాబ్ధాల్లో ప్రిగోజిన్ తిరుగుబాటే అతనికి అతి పెద్ద ఛాలెంజ్‌గా మారింది. ఇదీ చదవండి: యుద్ధ వాతావరణంలో ప్రశాంతంగా సాండ్ విచ్ తింటూ.. -
వాగ్నర్ సేనకు రష్యా క్షమాభిక్ష
మాస్కో: వాగ్నర్ సైన్యం తిరుగుబాటును నిలిపేయడంతో ఆ సైన్యం చీఫ్ ప్రిగోజిన్, అతని బలగాలకు రష్యా ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించింది. వారిపై ఎలాంటి క్రిమినల్ విచారణ ఉండదని ప్రకటించింది. 24 గంటల్లోపే వారు తమ కార్యకలాపాలను ఆపేయడంతో ఈ కేసును నిలిపివేస్తున్నట్టు ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ తెలిపింది. ఉక్రెయిన్‌తో 16 నెలలుగా యుద్ధం సాగుతున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ అధికారానికి ముప్పుగా పరిణమించిన సంఘటనల వరుసలో ఇది తాజా మలుపు. ప్రస్తుత సంక్షోభాన్ని నివారించే లక్ష్యంతో ప్రిగోజిన్‌కు పుతిన్ కొన్ని వాగ్దానాలు చేశారని, మరికొన్ని హామీలు ఇచ్చారని క్రెమ్లిన్ ప్రతినిధి చెప్పారు. వాగ్నర్ గ్రూప్‌కు ఏడాదిలో రూ.8 వేల కోట్లకు పైగా చెల్లించినట్లు అధ్యక్షుడు పుతిన్ వెల్లడించారు. ఆ గ్రూపు బలగాలకు జీతాలు, అలవెన్సులను సమకూర్చామన్నారు. ఆ డబ్బును ఎలా ఖుర్చు చేశారన్న విషయమై అధికారులు దర్యాప్తు చేస్తారని పుతిన్ చెప్పారు. ఇలా ఉండగా, ప్రిగోజిన్ తమ దేశంలోనే ఉన్నారని బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషేంకో ప్రకటించారు. అతని బలగాలు కూడా కొంతకాలం పాటు బెలారస్‌లోనే ఉంటాయని వెల్లడించారు. రష్యా మిలిటరీ ఆధీనంలో పనిచేయడానికి ఒప్పందాలపై సంతకం చేయడానికి జూలై 1 గడువు కంటే ముందే తన దళాలు తమ ఆయుధాలను మార్చుకోవడానికి సిద్ధమవుతున్నాయని ప్రిగోజిన్ తెలిపారు. -
పుతిన్ Vs వాగ్నర్ గ్రూప్
-
రష్యాలో ప్రిగోజిన్ తిరుగుబాటుపై ఉక్రెయిన్ అధ్యక్షుడు ఏమన్నారంటే..?
యెవనిన్ ప్రిగోజిన్ నాయకత్వంలోని వాగ్నర్ సైన్యం తిరుగుబాటుతో రష్యా కష్టకాలంలో పడింది. ప్రిగోజిన్ అరెస్టును ఇప్పటికే ప్రకటించిన రష్యా అధ్యక్షుడు పుతిన్.. అతన్ని దేశ ద్రోహిగా సంబోధించాడు. దీనిపై స్పందించిన ప్రిగోజిన్.. తాను నిజమైన దేశ భక్తుడనని చెప్పుకున్నారు. తన సైన్యం తిరుగుబాటుతోనే దేశంలో ప్రజా ఉద్యమం మొదలైందని చెప్పారు. అయితే.. రష్యాలో మొదలైన ఈ అంతర్యుద్ధాన్ని ఉద్దేశించి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ స్పందించారు. చెడును కోరేవారు అందులో అంతమవుతారని అన్నారు. కాగా.. వాగ్నర్ సైన్యం తిరుగుబాటుతో ఇన్ని రోజులు ఉక్రెయిన్‌లో మోగిన బాంబుల మోతలు ఇక రష్యాలో వినిపిస్తున్నాయి. Prigozhin went on to say that Wagner forces fought in Africa and Ukraine while the Russian military leadership embezzled ammunition, weapons, and money needed by forces on the ground for their own gain. — The Kyiv Independent (@KyivIndependent) June 24, 2023 రష్యా సైన్యం వాగ్నర్ సైన్యం తిరుగుబాటును అణిచివేయడానికి సిద్ధమైంది. ఈ క్రమంలో వాగ్నర్ సేన లక్ష్యంతో వోరోనెజ్ సమీపంలోని హైవేపై మిలిటరీ బాంబుల వర్షం కురిపించి. ఆ దృశ్యాలు స్థానికంగా భయానక వాతావరణాన్ని సృష్టించాయి. The moment of the explosion on the highway near #Voronezh. https://t.co/Fp9RJR9rey pic.twitter.com/B1Ieuh9yF2 — NEXTA (@nexta_tv) June 24, 2023 ప్రిగోజిన్ నాయకత్వంలోని వాగ్నర్ ప్రైవేటు సైన్యం ఇప్పటికే రస్తొవ్ దక్షిణ మిలటరీ ప్రధాన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నట్లు, అంతర్జాతీయ వ్యవహారాల ప్రధాన కార్యాలయాన్ని ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు తెలిపింది. కానీ అధికారంగా రష్యా సైన్యం ధ్రువీకరించలేదు. జిల్లా మిలిటరీ కార్యాలయంపై దాడి జరిగిన సమయంలో స్థానిక ప్రజలు పరుగులు పెడుతున్న దృశ్యాలు భయానక వాతావరణాన్ని సృష్టించాయి. There was an explosion near the headquarters of the Southern Military District in Rostov-on-Don - RT propaganda correspondent from the scene. pic.twitter.com/jNQdGkota0 — NEXTA (@nexta_tv) June 24, 2023 రోస్తోవ్ నగరాన్ని ఆక్రమించామని వాగ్నర్ సేన ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఓ పెద్ద ఆయిల్ స్థావరంపై దాడి జరిగింది. చమురు డిపోలో మంటలు చెలరేగగా.. దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. వీటిని అదుపు చేయడానికి అగ్ని మాపక సిబ్బంది రంగంలోకి దిగారు. An oil depot near #Voronezh is on fire, according to local media outlets. pic.twitter.com/itgHw2c5zc — NEXTA (@nexta_tv) June 24, 2023 ఇదీ చదవండి: రష్యాలో సైన్యంపై పుతిన్ సన్నిహితుడి తిరుగుబాటు.. పాతిక వేలమంది చావడానికి రెడీ! -
పుతిన్ పై వాగ్నర్ గ్రూప్ తిరుగుబావుటా
-
ష్..! దేశమంటే ప్రాణం.. ఇది పుతిన్‌లో మరో కోణం..!
దేశమంటే ప్రాణం.. జాతీయ గీతం అంటే గౌరవం.. ఇదీ పుతిన్ నమ్మిన సిద్ధాంతం. ఓ వైపు పశ్చిమ దేశాలన్నీ కలిసి పగబట్టినా.. పట్టు వీడని మనస్థత్వం ఆయనది. ప్రపంచంలో రష్యా దేశ స్వాభిమానాన్ని నిలపడంలో అలిసిపోకుండా పోరాడుతున్నారు. అయినప్పటికీ ప్రతీ చిన్న విషయంలోనూ దేశ ప్రేమను వెలిబుచ్చుతున్నారు. ఇలాంటి వీడియోనే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ చిన్న సంఘటనతో దేశానికి ఆయన ఇచ్చే గౌరవం ఎంతటిదో అర్ధమవుతుంది. సెయింట్ పీటర్‌బర్గ్‌లో నిర్వహించిన ఓ జాతీయ వేడుకలో పుతిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పెట్రోలియం రిఫైనరీ కంపెనీ గాజ్ప్రోమ్ నెఫ్ట్‌కు చెందిన అధికారి ఎలెనా ఇల్యుఖినాతో కలిసి పడవపై నిలబడి ఉన్నారు. ఈ క్రమంలో జాతీయ గీతం ఆలాపన ప్రారంభమైంది. అదే సమయంలో పుతిన్‌తో ఎలెనా చర్చను ప్రారంభించారు. జాతీయ గీతానికి గౌరవంగా నిలబడిన పుతిన్..మాట్లాడొద్దంటూ మూతిపై వేలు చూపించారు. తప్పు చేసినదానిలా భావించిన ఎలెనా.. నిశ్శబ్దంగా పుతిన్ పక్కన నిలబడ్డారు. 22 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా.. నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. Vladimir Putin 😎 reminds his talkative host not to speak during the Russian National Anthem pic.twitter.com/xMf7W8FeVH — Megh Updates 🚨™ (@MeghUpdates) June 18, 2023 అధ్యక్షుల వారి ఆంతర్యమేంటో..! మరో వేడుకలో పుతిన్ ఆ దేశ రక్షణ మంత్రికి వీపు చూపించిన వీడియో కూడా ఇటీవల బాగా వైరల్ అయింది. సైనికులకు బహుమతులు ఇవ్వడానికి మిలిటరీ ఆస్పత్రికి వెళ్లిన పుతిన్.. సైనికులతో మాట్లాడతారు. ఈ క్రమంలో పక్కనే నిల్చున్న రక్షణ మంత్రి సెర్జీ షోయిగు వైపు చూసి వెంటనే ముఖం తిప్పుకున్నారు. అంతటితో ఆగకుండా షోయిగుకు వీపు చూపించారు. వెనకనే ఉన్న మంత్రి ఎలా స్పందించాలో తెలియక తికమకపడ్డారు. దేశమే ప్రధానం.. ఆ తర్వాతే పుతిన్‌కు ఎవరైనా అనే విషయం ఈ ఘటనతో అర్థమవుతుంది. ఈ వీడియో వైరల్ కాగా.. నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. అధ్యక్షుల వారీ ఆంతర్యమేంటో అని కామెంట్లు పెట్టారు. రక్షణ మంత్రి ఉద్యోగం ఊడినట్టేనని ఫన్నీగా స్పందించారు. అయితే.. ఉక్రెయిన్‌తో యుద్ధంలో సరైనా విజయాలు సాధించట్లేదనే మంత్రిపై ఆ విధంగా పుతిన్ ప్రవర్తించారని మరికొందరు కామెంట్ చేశారు. You don't have to be a body language expert to understand what Putin currently thinks about his Defence Minister Sergei Shoigu... 😅 pic.twitter.com/ZRfJaJDE1X — Jimmy Rushton (@JimmySecUK) June 12, 2023 ఇదీ చదవండి:రష్యా అధ్యక్షుడికి తిక్క రేగింది.. భారీ క్షిపణులతో దాడి.. -
రెచ్చిపోయిన రష్యా.. ఒకేరోజు వెయ్యి మంది మృతి
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం: రష్యా ఆధీనంలో ఉన్న డొనెట్స్క్ లో పదే పదే దాడులు చేసి రెచ్చగొట్టినందుకు రష్యా కోపంతో భారీ క్షిపణులతో విచక్షణారహితంగా దాడి చేసి 1000 మంది ఉక్రెయిన్ బలగాలను బలిగొంది. ఈ మేరకు రష్యా రక్షణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. రష్యా ఆధీనంలో ఉన్న ప్రాంతాలను ఒక్కొక్కటిగా తిరిగి స్వాధీనం చేసుకునే పనిలో ఉన్న ఉక్రెయిన్ కు భారీ స్ట్రోక్ ఇచ్చింది పుతిన్ సైన్యం. కొద్దిరోజుల క్రితం రష్యా స్వాధీనం చేసుకున్న డొనెట్స్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ సాయుధులు కనీసం 35 సార్లు దాడులు చేశారు. దీంతో విసుగు చెందిన రష్యా బలగాలు భారీ మిసైళ్ళతో విరుచుకుపడి ఉక్రెయిన్ బలగాలపై దాడి చేసింది. ఈ భారీ విధ్వంసంలో కనీసం 1000 మంది ఉక్రెయిన్ సైన్యం నాశనమై ఉంటుందని అంచనా వేస్తున్నారు. గత కొంత కాలంగా క్యివ్ సైన్యం డొనెట్స్క్ లోని జనావాసాల మీద దాడులు చేస్తూ వాటిని రష్యా చేసిందని ఆరోపించే ప్రయత్నం చేస్తోందని, అందుకే వారికి బుద్ధి చెప్పాలన్న ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది రష్యా రక్షణ శాఖ. ఈ ప్రమాదంలో ఒకేరోజు భారీగా ప్రాణ నష్టం జరిగిందని ఉక్రెయిన్ వర్గాలు కూడా ప్రకటించాయి. ఇది కూడా చదవండి: ఔరంగజేబు వారసులెవరూ లేరిక్కడ! -
ఒడిశా రైలు ప్రమాద ఘటన: ప్రపంచ నేతల దిగ్భ్రాంతి
లండన్/మాస్కో: దుర్ఘటనకు పలు ప్రపంచదేశాల నేతలు ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. ఈ విషాద సమయంలో భారత్‌కు అండగా నిలుస్తామని భరోసానిస్తూ సంతాప సందేశాలు పంపారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తదితరులు తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తపరిచారు. ‘మృతుల కుటుంబాల బాధను మేమూ పంచుకుంటాం. గాయాలపాలైన ప్రయాణికులు త్వరగా కోలుకోవాలని మేం కోరుకుంటున్నాం’ అని టెలిగ్రామ్ ద్వారా ప్రధాని మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒక సందేశం పంపారు. ‘విషాదంలో మునిగిన వారు, ప్రధాని మోదీ తరఫున మేం ప్రార్థనలు చేస్తున్నాం’ అంటూ రిషి సునాక్ ఒక ట్వీట్‌చేశారు. ‘ఒడిశా ప్రమాద ఘటనలో భారత్‌కు సంఘీభావంగా నిలుస్తున్నాం’ అని మాక్రాన్ ట్వీట్‌చేశారు. ప్రమాదంలో ఇంతటి ప్రాణనష్టం జరగడంపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. జపాన్ ప్రధాని కిషిదా, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహాల్ (ప్రచండ) , పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, శ్రీలంక విదేశాంగ మంత్రి, భూటాన్ ప్రధాని షెరింగ్, ఇటలీ ప్రభుత్వం, ఐక్యరాజ్యసమితి సర్వసభ్యసభ అధ్యక్షుడు కసాబా కొరొసో, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తమ సానుభూతి సందేశాలు పంపించారు. -
మాస్కోపై డ్రోన్ దాడులు
మాస్కో: రష్యా రాజధాని మాస్కోపై మంగళవారం ఉదయం డ్రోన్ల దాడి జరిగింది. ఈ దాడిలో ప్రాణహాని జరగలేదని, భవనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. మాస్కోపైకి దూసుకొచ్చిన ఎనిమిది డ్రోన్లను రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని చెప్పారు. డ్రోన్ల దాడిపై అధ్యక్షుడు పుతిన్ స్పందించారు. ఇది ఉక్రెయిన్ ప్రభుత్వం చేసిన ఉగ్రవాద దాడి అంటూ ఆరోపించారు. మాస్కోలో డ్రోన్లను కూల్చి వేసిన ప్రాంతంలో కొన్ని భవనాలకు స్వల్ప నష్టం వాటిల్లిందని నగర మేయర్ సెర్గీ సొబియానిన్ చెప్పారు. ఇద్దరు పౌరులకు స్వల్పంగా గాయాలయ్యాయి, దెబ్బతిన్న రెండు బహుళ అంతస్తుల భవనాల్లోని వారిని ఖాళీ చేయించామని తెలిపారు. అయిదు డ్రోన్లను మాస్కోలో కూల్చివేయగా, మూడింటిని జామ్ చేసి దారి మళ్లించి పేల్చివేసినట్లు రక్షణ శాఖ తెలిపింది. యుద్ధం మొదలైన దాదాపు ఏడాదిన్నర కాలంలో డ్రోన్లతో ఏకంగా సుదూర ప్రాంతంలోని రష్యా రాజధానిపై డ్రోన్ దాడి జరగడం ఇది రెండోసారి. ఈ నెలారంభంలో అధ్యక్షుడు పుతిన్ లక్ష్యంగా రెండు డ్రోన్లు క్రెమ్లిన్‌పైకి వచ్చాయని రష్యా ఆరోపించింది. రష్యా గత 24 గంటల్లో మూడో విడత ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై వేకువజామున బాంబులతో విరుచుకుపడింది. కీవ్ వాసులు భయంతో షెల్టర్లలోకి పరుగులు తీశారు. దాడులతో ఒకరు చనిపోయారు. పేలుడు పదార్థాలతో వచి్చన 20 షహీద్ డ్రోన్లను కూల్చి వేసినట్లు కీవ్ అధికారులు తెలిపారు. మొత్తమ్మీద 24 గంటల్లో 31 వరకు డ్రోన్లను కూల్చి వేసినట్లు ఉక్రెయిన్ తెలిపింది. -
మరోసారి ఆక్రమిత ఉక్రెయిన్‌లోకి పుతిన్
కీవ్: యుద్ధం మొదలై దాదాపు 13 నెలలు పూర్తవుతున్న వేళ రష్యా అధ్యక్షుడు పుతిన్ సోమవారం ఉక్రెయిన్‌లోని రష్యా ఆక్రమిత ప్రాంతాల్లో పర్యటించి తమ సైన్యం సన్నద్ధతను సమీక్షించారు. మొదట ఖేర్సన్ ప్రావిన్స్‌కు చేరుకున్న పుతిన్ అక్కడి రష్యా సేనల కమాండ్ పోస్ట్‌కు వెళ్లారు. తర్వాత లుహాన్సŠక్లోని రష్యన్ నేషనల్ గార్డ్ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. ఖేర్సన్, లుహాన్సŠక్లో సైనిక ఉన్నతాధికారులతో సమావేశమై తాజా పరిస్థితిని సమీక్షించారు. రష్యా అధీనంలోకి వచ్చిన ఉక్రెయిన్ ప్రాంతాల్లో పుతిన్ పర్యటించడం గత రెండు నెలల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం. కొన్ని నెలల క్రితమే ఆక్రమించాక ఉక్రెయిన్‌లోని ఖేర్సన్, లుహాన్సŠక్, డోనెట్స్కŠ, జపోరిజియా ప్రావిన్స్‌లను స్థానిక ‘రెఫరెండమ్’ల ద్వారా గత సెప్టెంబర్‌లో రష్యా తనలో కలిపేసుకున్న విషయం తెల్సిందే. -
పశ్చిమ దేశాలదే ఈ పాపం
మాస్కో: ఉక్రెయిన్‌లో ప్రస్తుత పరిస్థితికి ముమ్మాటికీ పశ్చిమ దేశాలే కారణమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోపించారు. ఉక్రెయిన్‌లో సైనిక చర్య ప్రారంభం కావడానికి, ఇదింకా కొనసాగుతుండటానికి అవే బాధ్యత వహించాలన్నారు. తమను నిందించడం తగదన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రకు ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో పుతిన్ మంగళవారం జాతినుద్దేశించి ప్రసంగించారు. పశ్చిమ దేశాల ఆటలో రష్యా, ఉక్రెయిన్ బాధిత దేశాలుగా మారాయన్నారు. తాము ఉక్రెయిన్ ప్రజలపై పోరాడడం లేదని, కేవలం స్వీయ మనుగడ కోసమే పోరాటం సాగిస్తున్నామని చెప్పుకొచ్చారు. సమస్య పరిష్కారం కోసం చర్చలకు సిద్ధంగా ఉన్నామని ఉద్ఘాటించారు. పుతిన్ ఇంకా ఏం చెప్పారంటే... అందుకే ఇలాంటి అడ్డదారులు ‘‘పాశ్చాత్య దేశాల చేతుల్లో ఉక్రెయిన్ బందీగా మారడం విచారకరం. రష్యా పతనమే వాటి లక్ష్యం. స్థానిక ఘర్షణను అంతర్జాతీయ పోరుగా మార్చడమే వాటి ఉద్దేశం. రష్యా సరిహద్దు వరకూ విస్తరించాలని నాటో కూటమి ప్రయత్నించింది. రష్యా ఉనికిని కాపాడుకునేందుకు దేనికైనా సిద్ధం. మాపై యుద్ధం ప్రారంభించింది పశ్చిమ దేశాలే. దాన్ని ముగించడానికి మేం బలాన్ని ఉపయోగిస్తున్నాం. మాపై ‘సమాచార దాడులు’ కూడా జరుగుతున్నాయి. రష్యా సంస్కృతి, సంప్రదాయాలు, విలువలను దెబ్బతీయాలని కుట్రలు పన్నుతున్నారు. యుద్ధక్షేత్రంలో రష్యాను ఓడించడం అసాధ్యమని వారికి తెలుసు కాబట్టి ఇలాంటి అడ్డదారులు ఎంచుకుంటున్నారు. మా ఆర్థిక వ్యవస్థపైనా దాడి చేస్తున్నారు. కానీ, వారిప్పటిదాకా సాధించింది ఏమీ లేదు. ఇకపైనా ఏమీ ఉండబోదు.’’ సైనికులకు, వారి కుటుంబాలకు కృతజ్ఞతలు ‘‘తూర్పు దేశాలను నాశనం చేయాలని పశ్చిమ దేశాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే నాటో దళాల సంఖ్యను పెంచుతున్నారు. డాన్బాస్ ప్రాంతంలో సమస్యను శాంతియుతంగా పరిష్కరించేందుకు మేము ప్రయత్నించాం. కానీ, పశ్చిమ దేశాలు క్రూరంగా వ్యవహరించాయి. ఉక్రెయిన్–రష్యా సమస్య పరిష్కారానికి అవి సిద్ధంగా లేవు. వాటి వైఖరి వల్లే వ్యవహారం మరింత జటిలంగా మారుతోంది. రష్యాపై యుద్ధం కోసం ఆ దేశాలు ఉక్రెయిన్‌కు 150 బిలియన్ డాలర్లు అందజేశాయి. చివరకు ఉక్రెయిన్‌కు ఇరాక్, యుగోస్లావియా గతి పట్టించడం ఖాయం. ప్రపంచ భద్రత, శాంతి కోసం చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం’’ అని పుతిన్ పునరుద్ఘాటించారు. రష్యా కోసం పోరాడుతున్న సైనికులకు, వారి కుటుంబాలకు శిరసు వంచి నమస్కరిస్తున్నట్లు చెప్పారు. ‘న్యూ స్టార్ట్’లో రష్యా భాగస్వామ్యం రద్దు అమెరికాతో కుదిరిన ‘న్యూ స్టార్ట్ సంధి’లో తమ భాగస్వామ్యాన్ని రద్దు చేసుకున్నట్లు పుతిన్ మంగళవారం ప్రకటించారు. అణ్వాయుధాల నియంత్రణ కోసం అమెరికా, రష్యా మధ్య కుదిరి, ఇంకా అమల్లో ఉన్న చివరి ఒప్పందం ఇదే కావడం గమనార్హం. ఒకవేళ అమెరికా అణ్వాయుధ పరీక్షలు చేపడితే తాము కూడా అందుకు సిద్ధమని పుతిన్ పేర్కొన్నారు. అమెరికా, దాని నాటో మిత్రదేశాలు రష్యాను లక్ష్యంగా చేసుకున్నాయని, అందుకే న్యూ స్టార్ట్ సంధి నుంచి భాగస్వామ్యాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చిందని వివరించారు. ఒప్పందం నుంచి పూర్తిగా వైదొలగలేదని అన్నారు. తమను ఓడించి, తమ అణ్వాయుధాలను స్వా«దీనం చేసుకోవాలన్నదే పశ్చిమ దేశాల ఆలోచన అని మండిపడ్డారు. అమెరికా, రష్యా మధ్య న్యూ స్టార్ట్ సంధి 2010లో కుదిరింది. 2021 ఫిబ్రవరిలో ఈ సంధి గడువు ముగిసిపోగా, మరో ఐదేళ్లు పొడిగించారు. -
పుతిన్ గెలవడం కల్ల రష్యాపై మరిన్ని ఆంక్షలు తప్పవు
వార్సా: ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న పచ్చిమ దేశాల సంకల్పాన్ని ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కఠినతరంగా మార్చిందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. కఠినమైన, అప్రియమైన రోజులు ముందు ముందు ఉండబోతున్నాయని, అందుకు సిద్ధంగా ఉండాలని ఉక్రెయిన్‌కు సూచించారు. తాము, తమ మిత్రదేశాలు ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తాయని వెల్లడించారు. ఉక్రెయిన్‌పై రష్యా ఎప్పటికీ విజయం సాధించలేదని తేల్చిచెప్పారు. రష్యాపై దాడిచేసేందుకు పచ్చిమ దేశాలు కుట్ర పన్నుతున్నాయంటూ పుతిన్ చేసిన ఆరోపణలను బైడెన్ ఖండించారు. అలాంటి ఉద్దేశం తమకు లేదని పేర్కొన్నారు. స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాలు నేడు, రేపు, ఎప్పటికీ రక్షణ కవచంగా నిలుస్తాయని ఉద్ఘాటించారు. జో బైడెన్ ఉక్రెయిన్ పర్యటన ముగించుకొని మంగళవారం పోలాండ్‌కు చేరుకున్నారు. పోలాండ్ అధ్యక్షుడు అండ్రెజ్ డుడాతో సమావేశమయ్యారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధంతోపాటు పలు కీలక అంశాలపై చర్చించారు. నాటోకు అమెరికా ఎంత అవసరమో అమెరికాకు నాటో, పోలాండ్ కూడా అంతే అవసరమని డుడాతో బైడెన్ అన్నారు. అనంతరం రాజధాని వార్సాలోని రాజభవనంలో ఉక్రెయిన్ శరణార్థులను, స్థానిక ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రష్యా దండయాత్రను తట్టుకొని ఉక్రెయిన్ బలంగా ఎదురు నిలుస్తోందని ప్రశంసించారు. ఉక్రెయిన్ వైఖరి గర్వకారణమన్నారు. ‘నాటో’ కూటమి గతంలో ఎన్నడూ లేనంగా బలంగా ఇప్పుడు ఉందని పేర్కొన్నారు. నాటోలోని ఏ ఒక్క దేశంపై అయిన ఎవరైనా దాడి చేస్తే అది మొత్తం నాటోపై దాడి చేసినట్లేనని హెచ్చరించారు. అయితే న్యూ స్టార్ట్ ఒప్పందంలో తమ భాగస్వామ్యాన్ని రద్దు చేసుకుంటున్నామన్న పుతిన్ ప్రకటనపై బైడెన్ స్పందించలేదు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి కృషి చేస్తున్నారంటూ పోలాండ్, ఉక్రెయిన్ సైన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ‘‘పుతిన్ తనను తాను కఠినమైన వ్యక్తినని అనుకుంటున్నారు. కానీ అమెరికా ఉక్కు సంకల్పంతో పేచీ పెట్టుకుంటున్నారు. చేసిన తప్పులకు రష్యా మూల్యం చెల్లించుకోక తప్పదు’’ అన్నారు. మిత్రదేశాలతో కలిసి రష్యాపై ఈ వారంలోనే మరిన్ని ఆంక్షలు విధించబోతున్నట్లు వెల్లడించారు. -
యద్ధాన్ని ఆపేలా పుతిన్‌ని మోదీ ఒప్పించగలారా?
ఉక్రెయిన్‌లో యుద్ధం ఆగడానికి చాలా సమయం పడుతుందని అమెరికా పేర్కొంది. ఇరు దేశాలు శత్రుత్వానికి ముగింపు పలికేలా పలు ప్రయత్నాలు చేయాల్సి ఉంటుందని పిలుపునిచ్చింది. ఆ ప్రయత్నాలన్నింటిని తాను స్వాగతిస్తానని కూడా వెల్లడించింది యూఎస్. ఈ మేరకు అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ మాట్లాడుతూ..పుతిన్‌కి ఈ యుద్ధాన్ని ఆపడానికి ఇంకా కొంత సమయం అవసరమని భావిస్తున్నా. ప్రధాని మోదీ పుతిన్ ఒప్పించి ఈ యుద్ధాన్ని ముగించేలా చేయగలరా అని ప్రశ్నించారు. ఒకవేళ మోదీ యుద్ధాన్నే ఆపేలా ఏ ప్రయత్నం చేసినా.. దాన్ని తాను స్వాగతిస్తామని, ఆయనకు అవకాశం ఇస్తామని కిర్బీ అన్నారు. కాగా, భారత్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మాస్కోలో పుతిన్‌తో సమావేశమైన కొద్ది రోజుల్లనే వైట్‌హౌస్ నుంచి ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. ఇదిలా ఉండగా, గతేడాది షాంఘై కో ఆపరేషన్ సమ్మిట్ సందర్భంగా పీఎం మోదీ మాట్లాడుతూ.."నేటి యుగం యుద్ధం కోసం కాదు. ఈ రోజు మనం శాంతి మార్గంలో ఎలా పురోగమించాలి అనే అవకాశాల గురించి చర్చింకునే తరుణం." అని మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. (చదవండి: ప్లీజ్ దేవుడా! ఒక్క బిడ్డనైనా కాపాడు..ఓ బాధిత తండ్రి ఆవేదన) -
ఉక్రెయిన్‌కు ఆయుధాలిస్తే ప్రపంచ వినాశనమే.. రష్యా హెచ్చరిక
కీవ్: ఉక్రెయిన్‌కు శక్తివంతమైన ఆయుధాలిచ్చి తమను తాము నాశనం చేసుకోవద్దని పశ్చిమదేశాలకు రష్యా పార్లమెంట్ స్పీకర్ వ్యాచెస్లావ్ వొలోదిన్ హెచ్చరించారు. ఎదురుదాడులకు ఉపయోగపడే ఆయుధాలను ఉక్రెయిన్‌కు అందజేస్తే, తాము మరింత శక్తివంతమైన ఆయుధాలను వాడాల్సి వస్తుందని, అంతిమంగా ప్రపంచ వినాశనానికే దారి తీస్తుందన్నారు. ఉక్రెయిన్‌కు యుద్ధ ట్యాంకులు మినహా గగనతల రక్షణ వ్యవస్థలు తదితరాలను అందజేస్తామంటూ నాటో, అమెరికా ఇస్తున్న హామీలపై ఆయన ఆదివారం ఈ మేరకు స్పందించారు. చదవండి: పెరూలో ఆందోళనలు హింసాత్మకం -
షాకింగ్.. బ్రిటన్ మాజీ ప్రధాని ఫోన్ హ్యాక్.. కీలక రహస్యాలు లీక్!
లండన్: బ్రిటన్ మాజీ ప్రధాని లిజ్ ట్రస్ వ్యక్తిగత ఫోన్‌ను రష్యా అధ్యక్షుడు పుతిన్ కోసం పనిచేసే ఏజెంట్లు హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది. మిత్ర దేశాలతో లిజ్ మాట్లాడిన సంభాషణలతో పాటు ఆమె తన క్లోజ్ ఫ్రెండ్ క్వాసి కార్తెంగ్ పంపుకున్న సందేశాలు వంటి కీలక రహస్యాలు రష్యా చేతికి చిక్కినట్లు డెయిలీ మెయిల్ కథనం ప్రచురించింది. ట్రస్ ప్రధాని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సమయంలోనే రష్యా ఏజెంట్లు ఫోన్ హ్యాక్ చేసినట్లు పేర్కొంది. ట్రస్ ప్రధాని బాధ్యతలు చేపట్టాక ఆమె క్లోజ్ ఫ్రెండ్ క్వాసి కార్తెంగ్ ఆర్థిక మంత్రి అయ్యారు. ఈ ఫోన్ హ్యాక్ చేసిన రష్యాకు బ్రిటన్ రహస్యాలు తెలిశాయని డెయిలీ మెయిల్ కథనం పేర్కొంది. ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ఆయుధ సరఫరా, మిత్ర దేశాలతో సంబంధాలతో పాటు మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌ను ఆమె వివర్శించిన సంభాషణలు కూడా పుతిన్ చేతికి చేరినట్లు వెల్లడించింది. ఇతర దేశాలకు కీలక సమాచారం చిక్కడంతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడి ఉండవచ్చని తెలిపింది. లిజ్ ట్రస్ బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన 45 రోజుల్లోనే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. యూకే చరిత్రలోనే అతితక్కువ కాలం ప్రధానిగా పనిచేసింది ఆమే కావడం గమనార్హం. పదవి చేపట్టాక దేశంలో ఆర్థిక సంక్షోభం మరింత ముదరడం, మంత్రులు రాజీనామా చేయడంతో లిజ్ ట్రస్ స్వతహాగా పదవి నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత రిషి సునాక్ ఎలాంటి పోటీ లేకుండా బ్రిటన్ ప్రధాని అయ్యారు. చదవండి: ఫుట్‌బాల్ స్టేడియం సమీపంలో పేలుడు.. 10 మంది యువకులు మృతి -
అణ్వాయుధాలు ప్రయోగించం-పుతిన్
అణ్వాయుధాలు ప్రయోగించం-పుతిన్ -
రష్యాను ఏకాకిని చేయటమా? అది అసాధ్యం: పుతిన్
మాస్కో: ఉక్రెయిన్‌పై సైనిక చర్యతో విరుచుకుపడుతున్న రష్యాను నిలివరించేందుకు పశ్చిమ దేశాలతో పాటు చాలా దేశాలు ఆంక్షలు విధించాయి. అయినా.. వెనక్కి తగ్గేదేలే అంటూ దాడులు కొనసాగిస్తున్నారు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఈ నేపథ్యంలో మరిన్ని ఆంక్షలు విధించి.. ప్రపంచ దేశాలకు దూరం చేయాలనే వాదనలు వచ్చాయి. ఈ క్రమంలో ప్రపంచ దేశాల నుంచి రష్యాను వేరు చేసి ఏకాకిని చేయటం అసాధ్యమని పేర్కొన్నారు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలు దశాబ్దాలుగా మాస్కో సాధించిన ప్రగతిని నిలువరించలేవని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉన్నతాధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు పుతిన్. ‘ప్రస్తుత పరిస్థితి మా దేశానికి ప్రధాన సవాలు అని తెలుసు. మా శత్రు దేశాల నుంచి ముప్పు పొంచి ఉన్నప్పటికీ.. మేము ప్రజల నమ్మకాన్ని, దశాబ్దాల పురోగతిని కోల్పోము. దేశంలోని సొంత సాంకేతికతను ఉపయోగించుకుంటూ కొత్త పరిష్కారం కోసం దేశం చూస్తోంది. మా దేశానికి పెద్ద సవాలు ఇది. కానీ, మేము వెనక్కి తగ్గేదే లేదు. ప్రపంచానికి దూరంగా ఏకాకిగా మారటమనేది అసాధ్యమని విస్పష్టం.’ అని పేర్కొన్నారు. రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలనే ప్రయత్నాలను తిప్పికొట్టారు పుతిన్. అందుకోసం దేశీయ తయారీని ప్రోత్సహించటం, అంతర్గతంగా ఎండ్ టూ ఎండ్ టెక్నాలజీని అభివృద్ధి చేయటం, విదేశీ ఎగుమతులను నిలిపివేయటం వంటి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మరోవైపు.. రష్యా సాంకేతిక విభాగాలను ప్రోత్సహించటమే తమ తొలి ప్రాధాన్యమని తెలిపారు ఆ దేశ ఆర్థిక మంత్రి అంటోన్ సిలునోవ్. ప్రభుత్వం ఒక రూబల్ పెట్టుబడితో వస్తే.. ప్రైవేటు సంస్థలు మూడు రూబల్ పెట్టాలని కోరారు. ఇదీ చదవండి: ఉక్రెయిన్‌ని మట్టికరిపించేలా...తదుపరి దశ దాడులకు దిగుతున్న రష్యా! -
Sakshi Cartoon: ప్రపంచాన్ని కూడా ఖతం చేద్దామనుకుంటున్నారా సార్!
ఈ మూడేండ్లలో ప్రపంచాన్ని కూడా ఖతం చేద్దామనుకుంటున్నారా ఏంటీ సార్! -
యుద్ధానికి మూణ్నెల్లు
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగి మంగళవారంతో మూడు నెలలు పూర్తయ్యాయి. రేవు పట్టణం మారియుపోల్‌ను ఆక్రమించడం మినహా ఇన్నాళ్లలో రష్యా పెద్దగా సాధించిందేమీ లేదు. సైనికంగా కనీవినీ ఎరగని నష్టాలతో ఎన్నడూ లేనంత అప్రతిష్ట మూటగట్టుకుంది. పైగా అంతర్జాతీయంగా దాదాపుగా ఏకాకిగా మారింది. పాశ్చాత్య దేశాల ఆంక్షలతో ఆర్థికంగా బాగా దెబ్బ తింది. రోజుల్లో చేజిక్కుతుందనుకున్న ఉక్రెయిన్ పాశ్చాత్య దేశాల దన్నుతో ఇప్పటికీ దీటుగా పోరాడుతూ రష్యాకు చుక్కలు చూపిస్తోంది. యుద్ధాన్ని ఎలా ముగించాలో తెలియక అధ్యక్షుడు పుతిన్ తల పట్టుకుంటున్నారు. రాజధాని కీవ్‌ను ఆక్రమించాలన్న వ్యూహం విఫలమవడంతో రూటు మార్చారు. కనీసం తూర్పు ఉక్రెయిన్‌లో తమ అధీనంలో ఉన్న డోన్బాస్ ప్రాంతాన్నయినా పూర్తిగా చేజిక్కించుని గౌరవంగా వెనుదిరిగాలని చూస్తున్నా, ఉక్రెయిన్ గెరిల్లా యుద్ధ తంత్రానికి రష్యా సైన్యం దీటుగా బదులివ్వలేకపోతోంది. అఫ్గానిస్థాన్‌లో పదేళ్ల యుద్ధంలో కోల్పోయినంత మంది సైనికులను ఉక్రెయిన్‌లో రష్యా మూడు నెలల్లోపే నష్టపోయిందని ఇంగ్లండ్ తాజాగా అంచనా వేసింది. యుద్ధం పట్ల రష్యన్లలోనూ వ్యతిరేకత నానాటికీ పెరుగుతోంది. మెక్‌డొనాల్డ్స్ వంటి రెస్టారెంట్లు మొదలుకుని పెద్ద పెద్ద కంపెనీల దాకా అన్నీ రష్యావ్యాప్తంగా ఒక్కొక్కటిగా మూతబడుతూ వస్తున్నాయి. అంతర్జాతీయ ఆంక్షలు రష్యాకు చాలా కష్టాలు తెచ్చిపెట్టాయని పుతిన్ సోమవారం అంగీకరించారు. మారియుపోల్‌లో 200 శవాలు రష్యా ఆక్రమణలోకి వెళ్లిన మారియుపోల్‌లో ఓ అపార్ట్మెంట్ శిథిలాల్లో కుళ్లి దుర్వాసన వస్తున్న స్థితిలో ఉన్న 200కు పైగా శవాలు తాజాగా బయటపడ్డాయి. నగరంలో నెలకొన్న అత్యంత అపరిశుభ్ర వాతావరణం పలు వ్యాధులకు దారి తీయవచ్చన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. లుహాన్స్క్లో ఉక్రెయిన్ అధీనంలో ఉన్న సెవెరో డొనెట్స్క్, పరిసర నగరాలపై రష్యా తీవ్ర బాంబు దాడులకు దిగింది. గత వారం డెస్నాపై జరిగిన క్షిపణి దాడిలో 87 మంది అమాయకులు బలయ్యారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. ఉక్రెయిన్ నెగ్గాలి: ఈయూ రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ నెగ్గి తీరాలని ఈయూ చీఫ్ ఉర్సులా వాండెర్ లెయన్ అన్నారు. అందుకు యూరప్ అన్నివిధాలా సాయం చేస్తుందన్నారు. ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలుపంపనున్నట్టు అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ తెలిపారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని మిత్ర దేశం ఫిలిప్పీన్స్ తొలిసారిగా తీవ్రంగా తప్పుబట్టింది. యుద్ధాన్ని మొత్తం యూరోపియన్ యూనియన్‌పైనే దాడిగా స్పెయిన్ ప్రదాని పెడ్రో శాంచెజ్ అభివర్ణించారు. లక్షకు పైగా శరణార్థులకు స్పెయిన్ ఆశ్రయమిస్తోందని చెప్పారు. యుద్ధాన్ని నిరసిస్తూ జెనీవాలో ఉన్న సీనియర్ రష్యా దౌత్యవేత్త బోరిస్ బొందరెవ్ రాజీనామా చేశారు. ఉక్రెయిన్‌పై పుతిన్ తెర తీసిన యుద్ధం కారణంగా తన కెరీర్లో మొదటిసారి అవమానంతో తలొంచుకున్నట్టు చెప్పారు. -
Russia War: శాంతి చర్చల కోసం రంగంలోకి కీలక వ్యక్తి.. పుతిన్ రెస్పాన్స్..?
వాషింగ్టన్: ఉక్రెయిన్‌లో రష్యా భీకర దాడులు కొనసాగుతున్న వేళ మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్.. రష్యా, ఉక్రెయిన్ దేశాల్లో పర్యటన ఖరారైంది. ఈ నెల 26న రష్యాలో, 28న ఉక్రెయిన్‌లో గుటెరస్ పర్యటించనున్నారు. ఈ పర్యటన విషయంపై రెండు దేశాలకు ఆయన లేఖలు రాశారు. కాగా, రెండు దేశాల మధ్య శాంతి చర్చలు జరిపేందుకు ఆంటోనియో గుటెరస్ రంగంలోకి దిగారు. ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఆయన వేర్వేరుగా సమావేశం కానున్నారు. అటు రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్తో, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబాతోనూ ఆయన భేటీ కానున్నారు. మరోవైపు.. కాల్పుల విరమణ కోసం వివిధ పక్షాలు చేసిన ప్రయత్నాలు ఫలితమివ్వకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన ప్రజలను తరలించేందుకు వీలుగా రష్యా యుద్ధానికి విరామం ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా గుటెరస్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌లో 1.2 కోట్ల మందికి మానవతా సాయం అవసరం ఉందన్నారు. డొనెట్స్క్, లుహాన్స్క్, మరియుపోల్, ఖేర్సన్ వంటి నగరాల్లోనే చాలా మంది ఉక్రేనియన్లు బిక్కుబిక్కుమంటూ జీవితం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా చావు బతుకుల మధ్య ఉన్న ప్రజల కోసం రష్యా, ఉక్రెయిన్ దేశాలు తుపాకులు వదిలాలని పిలుపునిస్తున్నానని అన్నారు. ఇది కూడా చదవండి: రక్షణ విషయంలో రష్యాపై భారత్ ఆధారపడొద్దు -
యుద్ధం మరింత ఉగ్రం
-
హమ్మయ్య! వాటి ధరలు తగ్గుతున్నాయని సంతోషించేలోగా..
మండే ఎండలను మించి పెట్రోలు, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. అంతర్జాతీయ ధరలను అనుసరించి రేట్లు సవరిస్తున్నట్లు ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి. దీంతో ఈ అంతర్జాతీయంగా ధరలు ఎప్పుడు తగ్గుతాయా అంటూ సామాన్యులు ఎదురు చూస్తున్నారు. రష్యా ఉక్రెయిన్ల మధ్య శాంతి చర్చల రూపంలో ఆ తరుణం రానే వచ్చింది. ఇక పెట్రోలు ధరలు ఏమైనా తగ్గుతాయేమో అనుకునేలోగా మళ్లీ కథ మొదటికి వచ్చింది. ఉక్రెయిన్ రష్యా యద్ధం మొదలైన తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశాన్నంటాయి. 2022 మార్చిలో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 140 డాలర్లకు ఎగిసింది. మొత్తంగా మార్చి నెల సగటు 112 డాలర్లుగా నమోదు అయ్యింది. అంతకు ముందు ఫిబ్రవరిలో ఈ సగటు ధర 94 డాలర్లు ఉండగా జనవరిలో 84.67 డాలర్లుగా ఉంది. యుద్ధం మొదలైన తర్వాత బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 25 డాలర్లకు పైగానే పెరిగింది. దీంతో మన దగ్గర లీటరు పెట్రోలు, డీజిల్ ధరలను పది రూపాయలకు పైగానే ఆయిల్ సంస్థలు పెంచాయి. మార్చి చివరి వారం నుంచి ఉక్రెయిన్ - రష్యాల మధ్య శాంతి చర్చలు మొదలయ్యాయి. అంతర్జాతీయ ఆంక్షల కారణంగా రష్యా మొత్తబడుతున్నట్టు కనిపించింది. దీంతో ముడి చమురు ధరలు తగ్గుతూ వచ్చాయి. ఏప్రిల్ 1 నుంచి 12 వరకు ముడి చమురు సగటు ధర 98.48 డాలర్లుగా వచ్చింది. మార్చి సగటు 112 డాలర్లతో పోల్చితే దాదాపు 13 డాలర్ల వరకు ధర తగ్గింది. యుద్ధం ముగిసిపోతే సాధారణ పరిస్థితులు నెలకొని బ్యారెల్ ధరలు తగ్గి రిటైల్ మార్కెట్లో పెట్రోలు ధరలు తగ్గుతాయనే నమ్మకం ఏర్పడింది. ఉక్రెయిన్ మొండి వైఖరి కారణంగా శాంతి ప్రక్రియల నుంచి వెనక్కి తగ్గుతున్నామని, యుద్ధం మరింత కాలం కొనసాగవచ్చంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన తాజా ప్రకటనతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. పుతిన్ ప్రకటనకి ముందు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 98 డాలర్ల దగ్గర ఉండగా పుతిన్ ప్రకటన వెలువడిన తర్వాత 2022 ఏప్రిల్ 13న 104 డాలర్లకు చేరుకుంది. ఒక్కరోజులోనే దాదాపు 6 డాలర్లు పెరిగింది. 2020 ఏప్రిల్‌లో బ్రెంట్ రకం క్రూడ్ ఆయిల్ బ్యారెల్ సగటు ధర రూ. 63 డాలర్లుగా ఉంది. ఆ సమయంలో మన దగ్గర లీటరు పెట్రోలు ధర రూ. 75 ఉండగా డీజిల్ ధర రూ.65లుగా ఉంది. అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా బ్యారెల్ ధర 99 డాలర్లు ఉండగా హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ. 119 డీజిల్ ధర 115 దగ్గర ఉంది. యుద్ధం మరింత కాలం కొనసాగితే పెట్రో బాదుడు తప్పేలా లేదు. చదవండి: అంతర్జాతీయంగా కొన్ని శక్తులు కుమ్మక్కై ధరలు పెంచేస్తున్నాయి -
టెన్షన్లో జెలెన్ స్కీ.. చెచెన్యా రంజాన్ కడీరోవ్ సంచలన వ్యాఖ్యలు
కీవ్: ఉక్రెయిన్‌లో రష్యా బలగాల దాడులు కొనసాగుతున్నాయి. రష్యా దాడుల్లో ఉక్రెయిన్ పౌరులు వేల సంఖ్యలో మృత్యువాతపడుతున్నారు. తాజాగా రష్యా సైన్యం దాడుల్లో ఉక్రెయిన్ రాజధాని కీవ్ సమీపంలో 1200 మందికి పైగా ఉక్రెనీయుల మృతదేహాలు బయటపడినట్టు ఆ దేశ అధికారులు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో రష్యా దుశ్చర్య ప్రపంచానికి బహిర్గతమైందన్నారు. మరోవైపు.. దక్షిణ కొరియా ప్రభుత్వ నేతలతో జరిగిన వీడియో మీటింగ్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ.. రష్యాపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. రష్యా దాడి వల్ల దక్షిణ నగరమైన మరియుపోల్‌లో వేలాది మంది మృతిచెందారని అన్నారు. మురియుపోల్ నుంచి భారీ సంఖ్యలో శరణార్థులు పారిపోయారని తెలిపిన జెలెన్ స్కీ.. శరణార్థులు ఇచ్చిన ఇచ్చిన సమాచారం మేరకు అక్కడ వేలాది మంది మృతిచెందారని వెల్లడించారు. భారీ గొయ్యిల్లో ఆ మృతదేహాలను ఖననం చేశారని ఆరోపించారు. చెచన్ ఫైటర్లు అక్కడ లూటీలకు పాల్పడినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌లో రష్యా దాడులపై రిపబ్లిక్ ఆఫ్ చెచెన్యా దేశాధ్యక్షడు రంజాన్ కడీరోవ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓ వీడియోలో మాట్లాడుతూ.. మరియుపోల్ మాత్రమే కాదు, కీవ్‌పై కూడా దాడి చేస్తామని పేర్కొన్నాడు. ఈ క్రమంలో కీవ్, ఇతర నగరాలను కూడా స్వాధీనం చేసుకుంటామని వెల్లడించాడు. -
ఉక్రెయిన్ యుద్ధం.. పెద్దన్న పాత్రలో ప్రధాని మోదీ!
Modi Need To Speak Directly Putin How To End The War: టర్కీలో శాంతి చర్చల్లో పురోగతి లభించిందని అంతా అనుకున్నారుగానీ అందుకు విరుద్ధంగా రష్యా వైఖరి ఉన్నట్లు తెలుస్తోంది. రష్యా బలగాలను ఉపసంహరించుకుంటానని హామి ఇచ్చి మరీ ఉక్రెయిన్‌ని బాంబులతో దద్దరిల్లేలా చేసింది. బుధవారం చెర్నిహివ్‌లో బలగాలు మైమానిక దాడులతో విరుచుకుపడ్డాయి. దీంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ కూడా రష్యా హామీని నిలబెట్టుకోకుండా అత్యంత దారుణంగా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. ఈ మేరకు ఉక్రెయిన్ భారత్ రష్యాతో గల సంబంధాలను ఉపయోగించి ఈ యుద్ధం ఆపేలా చేస్తే ఉక్రెయిన్‌లో మరో వేల ప్రాణాలను బలవ్వవు అని భారత్‌కి మరోసారి హితబోధ చేసింది. ఒక మీడియా సమావేశంలో ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా.. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ యుద్ధం ఆపేందుకు మధ్యవర్తిగా వ్యవహరిస్తే గనుక తాము దాన్ని స్వాగతిస్తాం అని అన్నారు. రష్యాతో భారత్ కలిగి ఉన్న సంబంధాలను సద్వినియోగం చేసుకుని. పెద్దన్న పాత్ర పోషిస్తూ యుద్ధాన్ని ఆపడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ని ఒప్పించాలని తాము అభ్యర్తిస్తున్నాం అని అన్నారు. రష్యాలో అన్ని నిర్ణయాలు తీసుకునే ఏకైక వ్యక్తి పుతిన్ కాబట్టి ఆయనతో మోదీ నేరుగా మాట్లాడి యుద్ధం ఆపేలా చేయాలని కోరుకుంటున్నాం అని చెప్పారు. అయినా ఈ భూమ్మీద యద్ధం కావాలని కోరుకునే ఏకైక వ్యక్తి పుతిన్‌గా అభివర్ణించారు. రష్యా దురాక్రమణ నుంచి ఉక్రెయిన్‌ని రక్షించుకునేందుకే తాము పోరాడుతున్నామని ఇది న్యాయబద్ధమైన పోరాటం అని అన్నారు. భారత్ ఉక్రెయిన్‌కు మద్దతు ఇస్తుందని ఆశిస్తున్నాను అని కూడా అన్నారు. అంతేకాదు ఖార్కివ్‌లో రష్యా బాంబు దాడిలో మృతి చెందిన భారత విద్యార్థికి విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా సంతాపం వ్యక్తం చేశారు. బుధవారం ఇస్తాంబుల్‌లో ఉక్రెయిన్ మరోసారి రష్యాతో చర్చలు జరిపింది. కానీ మాస్కో చర్చల పురోగతిపై ఆశలు నీరుగారుస్తోందన్నారు. (చదవండి: యుద్ధంలో.. పుతిన్‌ను తప్పుదోవ పట్టిస్తోందెవరు?) -
పుతిన్‌పై వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పను: బైడెన్
వాషింగ్టన్: రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంకెంతమాత్రమూ అధికారంలో ఉండటానికి తగరంటూ చేసిన వ్యాఖ్యలను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సమర్థించుకున్నారు. యుద్ధం పేరుతో ఉక్రెయిన్‌లో పుతిన్ చేస్తున్న దుర్మార్గాలపై తన ఆక్రోశాన్ని ఆ వ్యాఖ్యలు ప్రతిబింబించాయన్నారు. అందుకు క్షమాపణ చెప్పడం గానీ, వాటిని వెనక్కు తీసుకోవడం గానీ చేయబోనన్నారు. రష్యాలో తానేమీ నాయకత్వ మార్పు కోరడం లేదనిస్పష్టం చేశారు. అది అమెరికా విధానం కాదన్నారు. ‘ఉక్రెయిన్‌పై మతిలేని యుద్ధంతో పుతిన్ ఇప్పటికే ప్రపంచమంతటా అంటరాని వ్యక్తిగా మారారు. స్వదేశంలో ఆయన పరిస్థితి ఏం కానుందో! చెడ్డ వ్యక్తులు చెడు పనులు చేయడాన్ని అనుమతించొద్దు. నా వ్యాఖ్యలను ఆ ఉద్దేశంతోనే చూడాలి. అంతే తప్ప పుతిన్‌ను తప్పించేందుకు అమెరికా ప్రయత్నిస్తుందన్నది నా వ్యాఖ్యల ఉద్దేశం కాదు’ అంటూ వివరణ ఇచ్చారు. (చదవండి: పుతిన్ ధీమా... జెలెన్ స్కీ అభ్యర్థన) -
రష్యా విభజన దిశగా యోచన...టెన్షన్లో ఉక్రెయిన్!
Zelenskyy accused the West of cowardice: గత నెలరోజులకు పైగా రష్యా ఉక్రెయిన్‌పై పోరు సాగిస్తూనే ఉంది. రష్యా వేటిని లక్ష్యపెట్టక బాంబుల దాడులతో ఉక్రెయిన్‌ని అల్లకల్లోలం చేస్తోంది.ఈ నేపథ్యంలో యూఎస్ చట్ట సభ్యులతోనూ, యూరోపియన్ దేశాలకు తమకు మిలటరీ సాయం అందిచమని ఉక్రెయిన్ అధ్యక్షుడు అభ్యర్థించారు. ఈ విషయమైన జెలెన్ స్కీ మాట్లాడుతూ తమకు మరిన్ని యుద్ధ ట్యాంకులు, ఆయుధాలు కావాలని విజ్క్షప్తి చేశారు. అయితే పశ్చిమ దేశాలు తమకు మిలటరీ సాయం అందించెందుకు వెనకడుగు వేస్తున్నాయని, పిరికివని ఆరోపణలు చేశారు. అయితే యూఎస్, యూరోపియన్ దేశాలు ఉక్రెయిన్‌కి పెద్ధ ఎత్తన మిలటరీ సాయం అందిచాయి కూడా. కానీ జెలెన్స్కీ అది సరిపోదని మరింత సాయం కావాలని కోరారు. మరోవైపు ఉక్రెయిన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ అధిపతి కైరిలో బుడనోవ్, ఉక్రెయిన్ను రెండుగా విభజించాలని రష్యా ప్రయత్నిస్తోందని, ఉత్తర దక్షిణ కొరియాల మాదిరిగానే చేయాలని చూస్తోందని ఆరోపించారు. అంతేకాదు ష్యా ఇప్పుడు తూర్పు డోన్బాస్ ప్రాంతాన్ని నియంత్రించడంపైనే ప్రధాన దృష్టి పెట్టిందని, దాని ప్రధాన లక్ష్యానికి చేరుకున్న తర్వాత బలగాలు ఉపహరించి విభజన దిశగా అడుగులు వేస్తోందేమోనని ఉక్రెయిన్ భయాందోళనలో ఉంది. అయితే ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ అధికారి మాత్రం ఉక్రేనియన్ల గెరిల్లా యుద్ధం అటువంటి ప్రణాళికలను నిర్వీర్యం చేస్తుందని ధీమాగా చెబుతుండటం గమనార్హం. అంతేకాదు 2014 నుంచి రష్యా-మద్దతుగల వేర్పాటువాదులచే పాక్షికంగా నియంత్రణలో ఉన్న తూర్పు డాన్బాస్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడంపై మాస్కో తన దృష్టిని కేంద్రీకరించిందని ఉక్రెయిన్ పేర్కొంది. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి దళాలను తూర్పు వైపుకు మళ్లిస్తున్నట్లు రష్యా ఉన్నత స్థాయి అధికారి పేర్కొన్నట్లు వెల్లడించింది. మరోవైపు ఉక్రెయిన్‌తో చర్చల్లో, మాస్కో డోనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాల స్వాతంత్య్రాన్ని గుర్తించాలని డిమాండ్ చేస్తోందని తెలపింది. అంతేగాక యుద్ధాన్ని ముగించడంపై రష్యాతో చర్చలు జరగనున్నట్లు ఉక్రేనియన్ ప్రతినిధి డేవిడ్ అరాఖమియా సోషల్ మీడియాలో పేర్కొన్నారు. సోమవారం టర్కీలో సమావేశమవుతాయని కూడా చెప్పారు. కానీ రష్యా మాత్రం చర్చలు మంగళవారం ప్రారంభముతాయని చెప్పడం గమనార్హం. ఇంతకముందు జరిగిన చర్చలు, ఒప్పందాల్లో ఎలాంటి పురోగతి లేదు. ఈ మేరకు జెలెన్ స్కీ కూడా తన పాత పాటనే పాడుత్నున్నారు. ఈ వారం టర్కీలో జరిగే ఉక్రేనియన్-రష్యన్ చర్చలలో ఉక్రెయిన్ ప్రాధాన్యతలు "సార్వభౌమాధికారం ప్రాదేశిక సమగ్రత" అని జెలెన్స్కీ నొక్కి చెప్పారు. తాను శాంతి కోసమే చూస్తున్నాని, ఈసారి టర్కీలో ముఖాముఖి సమావేశానికి అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు. (చదవండి: అనూహ్యం.. వెనక్కి తగ్గిన జెలెన్స్కీ! పుతిన్ తగ్గట్లేదా?) -
పుతిన్ VS జెలెన్స్కీ
-
టెక్నాలజీనే పుతిన్ ప్రధాన శత్రువు
రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధంలో సామాజిక మాధ్యమాలు కూడా కీలక పాత్రను పోషిస్తున్నాయి. హృదయాలను అద్భుతమైన ఊహాత్మకతతో గెల్చుకోవడం ఎలాగో టిక్‌టాక్ ఉక్రెయినియన్లకు నేర్పింది. యుద్ధం అనివార్యమని స్పష్టమవుతుండటంతో సైనిక దళాల కదలికలను పసిగట్టడానికి వారు తక్షణం రంగంలోకి దిగారు. తమ జీవితాలు ఎలా ధ్వంసమవుతున్నాయో ప్రపంచానికి చూపడానికి స్మార్ట్ ఫోన్లను ఉపయోగించసాగారు. అదే సమయంలో రష్యన్ ప్రభుత్వం సెన్సార్షిప్ పేరుతో మీడియాపై యుద్ధం ప్రకటించింది. అసలు యుద్ధం ఎలా పరిణమిస్తుందో గానీ, ఈరోజు పుతిన్ తన ప్రధాన శత్రువైన టెక్నాలజీ విషయంలో ఏ రకంగానూ సరిపోలనని నిరూపించుకుంటున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ అనేక రూపాల్లో వ్యక్తమవుతోంది. అఫ్గానిస్తాన్, సిరియా ఉదంతంలో కంటే, టిక్‌టాక్ వీడియోలు ఉక్రెయిన్‌పై యుద్ధంతో మరింత త్వరగా, సన్నిహితంగా పెనవేసుకుపోయాయి. హృదయాలను అద్భుతమైన ఊహాత్మకతతో గెల్చుకోవడం ఎలాగో టిక్‌టాక్ ఉక్రెయినియన్లకు నేర్పింది. ఉక్రెయినియన్లు ఈ మాధ్యమాన్ని అధికంగా వినియోగిస్తారు కనుక ఇది వారి ఏకైక వేదికగా మారింది. అమెరికా, బ్రిటన్ దేశాల్లోని జర్నలిస్టులకు ఈ యూజర్లే ప్రధాన వనరులు అయిపోయారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఉంటున్న ఒక ఇన్ఫ్లూయెన్సర్ ఫిబ్రవరి 23న పరుపుమీద కూర్చుని తనకు తాను రికార్డింగ్ చేశారు. తనకు సమీపంలో పేలుళ్ల గురించి ఆమె వర్ణిస్తూ ఏదో సీరియస్ ఘటన ప్రారంభమవుతున్నట్లుందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈలోగా రష్యాలో యువతీయువకులు రష్యన్ మాల్స్‌లో షాపులను మూసి వేస్తున్న వీడియోలను పోస్ట్ చేయడం మొదలెట్టారు. తర్వాత ఒక ఉక్రెయిన్ మహిళ, పోలండ్వైపు తాను ప్రయాణిస్తున్న ప్రతి అడుగునూ గ్రాఫిక్స్‌తో చూపిస్తూ తాను తప్పించుకున్న విధానాన్ని సుదీర్ఘంగా చూపించారు. ఆమె పది గంటలపాటు రైలులో నిల్చుని ప్రయాణించింది. తర్వాత సరిహద్దు వద్ద అయిదుగంటల పాటు నిలబడి పాస్‌పోర్టు కూడా లేకుండా పోలండ్‌లోకి అడుగుపెట్టింది. అలాగా తన చుట్టూ ఉన్న ఇతర శరణార్థులు రుచికరమైన కుడుములను తింటూండటం గురించి కూడా ఆమె చిత్రీకరించింది. యుద్ధ నేపథ్యంలో టిక్‌టాక్ వ్యూయర్లు ఉక్రెయిన్ గురించి చేసిన శోధన ఒక్కరోజులో 1.4 బిలియన్లకు పెరిగిందని వార్‌టాక్ అనే టిక్‌టాక్ అకౌంట్ పేర్కొంది. ఇలా యుద్ధంలో నాలుగు వారాలు గడిచిన తర్వాత అమెరికా, రష్యా రెండు దేశాలూ ఉక్రెయిన్‌పై దాడి గురించిన వార్తలను ఈ టిక్‌టాక్ యూజర్ల పోస్టుల నుంచే తమ ప్రజలు చూస్తున్నారని గుర్తిం చాయి. ముప్పైమంది ఉక్రెయిన్ సోషల్ మీడియా ప్రభావశీలురికి కనీవినీ ఎరుగని విధంగా జో బైడెన్ పాలనాయంత్రాంగం బ్రీఫింగ్ చేయడం అసాధారణమనే చెప్పాలి. అలాగే మాస్కో ప్రభుత్వ అను కూల వార్తలు పోస్ట్ చేయడం కోసం రష్యన్ ప్రభుత్వం రష్యన్ సోషల్ మీడియా ప్రభావశీలురకు డబ్బులిస్తోందని వైస్ న్యూస్ రిపోర్ట్ చేసింది. అయితే అనుకూల ప్రచారంతో యుద్ధాన్ని గెలవడానికి రష్యాకు సోషల్ మీడియా ప్రభావశీలురు సరిపోరు. ఎందుకంటే యుద్ధాన్ని మొదలు పెట్టిందే రష్యా కదా! రష్యన్ అనుకూల ప్రచారా నికి పెద్దగా విలువ ఏముంటుంది? ఉక్రెయిన్‌కి ఉన్న ఇంటర్నెట్ పునాదిని ఎవరూ అంతతేలిగ్గా లోబర్చుకోలేరు. ఉక్రెయిన్‌లో 5 వేల మంది బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఉన్నారు. రష్యా దాడి ప్రారంభం కాగానే శాటిలైట్ ఆధారిత కమ్యూనికేషన్ సర్వీస్ కోసం ఉక్రెయిన్ ప్రభుత్వం అభ్యర్థన మేరకు ఎలాన్ మస్క్ తన స్టార్‌లింక్ ఇంటర్నెట్ సర్వీస్‌ని యాక్టివేట్ చేశారు. ఈలోపు వ్లాదిమిర్ పుతిన్ ప్రభుత్వం సోషల్ మీడియాపై సెన్సార్షిప్తోపాటు, ప్రభుత్వ వ్యతిరేక యుద్ధ వార్తలు పంపితే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించడంతో టిక్‌టాక్ వంటి ఇతర అంతర్జాతీయ మీడియాపై ఆధారపడటం మరింతగా పెరిగింది. సైనిక కార్యకలాపాలపై తప్పుడు వార్తలు పంపితే 15 సంవత్సరాల జైలు శిక్షకు అనుమతిస్తూ రష్యా పార్లమెంట్ మార్చి నెల ప్రారంభంలో చట్ట సవరణ చేసింది. కొద్ది రోజుల లోపే ప్రముఖ పాశ్చాత్య వార్తల నెట్ వర్క్‌లన్నీ రష్యా నుంచి బయటకు వెళ్లిపోయాయి. తమ జర్నలి స్టులను ప్రమాదంలో పడేయడం ఇష్టంలేక బీబీసీ, బ్లూమ్‌బెర్గ్ తదితర పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టర్లు కూడా రష్యాలోని తమ ఆఫీసులను ఖాళీ చేశాయి. దేశం లోపల ప్రముఖ అమెరికన్ టెలివిజన్ నెట్వర్క్స్ వార్తల ప్రసారాన్ని నిలిపివేయడంతో సోషల్ మీడియా వీడియోలు విస్తృ తంగా ప్రసారమవుతున్నాయి. ఇకపోతే ఉక్రెయిన్ సోషల్ మీడియా రష్యన్ ప్రాపగాండాని ఎదుర్కోవడంలో మీకు తోడ్పడుతుంది. తన సొంత సోషల్ మీడియా బలగాన్ని ఏర్పర్చుకున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ నేతృత్వంలోనే సెన్సార్ షిప్ ఉంటుంది కాబట్టి వార్తలపై ఆంక్షలు విధించే పరిస్థితి కూడా ఉత్పన్నం కాదు. పైగా ఉక్రెయిన్ ప్రభుత్వ అధికారిక ట్విటర్ ఖాతా చాలా స్థిరమైంది. దాన్ని విస్తృతంగా అనుసరిస్తుంటారు. ఇక ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న రెండో యుద్ధం ఏమిటి అంటే, తప్పుడు సమాచారం, దుష్ప్రచారంపై సాగిస్తున్న యుద్ధమే! సాంకేతిక అవకా శాలు విస్తృతమవుతున్నందున యుద్ధ కాలంలో వాస్తవాల తనిఖీ కొత్త పుంతలు తొక్కుతోంది. బ్రిటన్‌లో సెంటర్ ఫర్ ఇన్ఫర్మేషన్ రిసైలెన్స్ సంస్థ తనిఖీ చేసిన టిక్‌టాక్ వీడియోలలో 80 నుంచి 90 శాతం వరకు పౌరులు పోస్ట్ చేసిన ఒరిజినల్ వీడియోలు అని తెలిసింది. ఈ యుధ్ధం మనకు తెలిపింది ఏమిటంటే, ఔత్సాహికులు, ఓపెన్ సోర్స్ పరిశోధకులు రష్యా దాడి సమయంలో కీలకమైన సైనిక కదలికలను విశ్లేషించడానికి టెక్నాలజీని ఉపయోగించడం. సైన్యం కదలికలను జియోలొకేట్ ద్వారా వీడియోలు తీసి యుద్ధం జరుగుతుండగానే ఘటనలను పునర్నిర్మించడం ప్రపంచానికి కొత్తే అని చెప్పాలి. చివరగా, రష్యన్ ప్రభుత్వం సెన్సార్షిప్కి వ్యతిరేకంగా జరిగిన యుద్ధం గురించి చెప్పాలి. బ్లాక్ చేసిన సేవలను పొందడానికి రష్యా లోనే వీపీఎన్ యాప్స్‌ని డౌన్లోడ్ చేయడం విపరీతంగా పెరిగి పోయింది. మరొక మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ ఇప్పటికీ ప్రభుత్వ అనుకూల, స్వతంత్ర కంటెంట్ రెండింటినీ పొందడానికి అనుమతి స్తోంది. బీబీసీ, రష్యన్ సర్వీస్ వంటి కొన్ని విదేశీ మీడియాల కంటెంట్‌ని కూడా టెలిగ్రామ్ అందిస్తోంది. అటు ఉక్రెయిన్‌లో, ఇటు రష్యాలో కూడా స్వతంత్ర మీడియాని సజీవంగా ఉంచడానికి పాశ్చాత్య దేశాల నుంచి దాతలు క్రౌడ్ ఫండింగ్ అందించడానికి పరుగు తీస్తున్నారు. రష్యన్ ప్రముఖ స్వతంత్ర వార్తా వెబ్సైట్ మెదుజా, లాత్వియాకు వెలుపల ఉన్న రష్యా శ్రోతలకు సమాచారం పంపుతూంటుంది. ఇది ఇప్పుడు మీడియా ఫండింగ్ సోదర కంపెనీ లకు పెద్ద సెలెబ్రిటీ అయిపోయింది. గూగుల్, ఫేస్బుక్ వంటి బడా మీడియా కంపెనీలతో పెట్టుకున్న రష్యా నష్టపోయింది. ఈ రెండు కంపెనీలు రష్యాను బ్లాక్ చేశాయి. రష్యా ఆన్లైన్ ఆర్థికవ్యవస్థకు ఊపిరాడకుండా చేసిన రెండు ప్రభావాల గురించి ఒక ప్రముఖ పత్రిక జర్నలిస్టు పేర్కొన్నారు. అవి ఏమిటంటే, సాంకేతిక నిపుణులు చాలామంది రష్యాను వదిలి వెళ్లిపోయారు. దీంతో రష్యన్ సెర్చ్ ఇంజిన్లు దెబ్బతిన్నాయి. ఎందుకంటే ఈ కంపెనీల నుంచి వచ్చిన ప్రకటనలపైనే ఇవి ఆధారపడి ఉండేవి. ‘పుతిన్స్ పీపుల్: హౌ ద కేజీబీ టుక్ బాక్ రష్యా అండ్ దెన్ టుక్ ఆన్ ద వెస్ట్’ పుస్తకం రాసిన జర్నలిస్ట్ కేథరిన్ బెల్టన్, పుతిన్ 2000 సంవత్సరంలో రష్యా అధ్యక్ష పదవిని చేపట్టాక వేసిన తొలి అడుగు గురించి చెప్పారు. అధికారం చేపట్టిన నాలుగు రోజులలోపే రష్యాలో ప్రైవేట్ యాజమాన్యంలోని మీడియాకు వ్యతిరేకంగా పుతిన్ చర్యలు చేపట్టారు. ‘మీడియా మోస్ట్’ సంస్థ యజమాని, పాపులర్ టీవీ చానల్ ఎన్టీవీ ఓనర్ అయిన వ్లాదిమిర్ గుసిన్స్కీ ఆఫీసులపై పుతిన్ దాడి చేయించారు. మీడియా పవర్‌పై రష్యా అధ్యక్షుడి బద్ధ వ్యతిరేకత, ప్రభుత్వ టీవీపై ప్రయోగాలు చేయడం, ప్రైవేట్ మీడియా సంస్థలను ప్రభుత్వం స్వాధీనపర్చుకోవడం, ప్రభుత్వ కంపెనీ గాజ్ప్రోమ్ స్వాధీనం చేసుకున్న మీడియా ఆస్తులను తాను నమ్మిన కీలక వ్యక్తు లకు పుతిన్ అప్పగించడం వంటి ప్రతి అంశాన్నీ ఈ పుస్తక రచయిత్రి పూసగుచ్చినట్లు వివరించారు. కానీ తన మతిస్థిమితం లేనితనం, మూర్తీభవించిన అహంభావం అలా పక్కనబెట్టి చూస్తే, ఈ రోజు రష్యన్ అధ్యక్షుడు పుతిన్ తన ప్రధాన శత్రువైన టెక్నాలజీ విషయంలో ఏ రకంగానూ సరిపోలనని నిరూపించుకుంటున్నారు. వ్యాసకర్త జర్నలిస్ట్, మీడియా వ్యాఖ్యాత -
యుద్దంలో మరో ట్విస్ట్.. రష్యాకు ఎదురుదెబ్బలు.. పుతిన్‌కు కౌంటర్
కీవ్: ఉక్రెయిన్‌లో రష్యా బలగాల దాడులు తీవ్రతరమయ్యాయి. సామాన్య పౌరులే లక్ష్యంగా రష్యన్ దళాలు దాడులు చేస్తున్నాయి. కాగా, దాడుల్లో ఉక్రెయిన్ పోర్టు నగరం మరియుపోల్‌లోని బలగాలు ఆయుధాలు కిందపడేసి.. లొంగిపోవాలన్న రష్యా డిమాండ్‌ను ఉక్రెయిన్ తిరస్కరించింది. లొంగిపోయే ప్రసక్తే లేదని ఘాటుగా స్పందించింది. అయితే, మరియుపోల్‌లో రష్యా బలగాలు భీకర దాడులు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్ సైన్యం ఆయుధాలు కింద పడేసి అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించాయి. ఈ క్రమంలో తమ దేశ బలగాలు లొంగిపోయే ప్రసక్తే లేదని ఉక్రెయిన్ ఉప ప్రధాని ఇరినా వెరెశ్చక్ స్పష్టం చేశారు. రష్యా హెచ్చరికలను వ్యతిరేకిస్తున్నట్టు వెల్లడించారు. అంతకు ముందు రష్యా బలగాలు మరియుపోల్ నగరంలోని ఆర్ట్ స్కూల్‌పై బాంబు దాడులు చేశాయి. ఈ దాడులు జరిగిన సమయంలో ఆ స్కూల్లో 400 మంది శరణార్థులు ఉన్నట్లు అధికారులు చెప్పారు. ప్రాణ నష్టం గురించి తెలియాల్సి ఉంది. మరోవైపు.. దాడుల్లో రష్యాకు మరో షాక్ తగిలింది. బ్లాక్‌సీ ఫ్లీట్‌కు చెందిన సీనియర్ నౌకాదళ కమాండర్ ఆండ్రీ పాలీ.. మరియుపోల్‌లో ఉక్రెయిన్‌తో జరిగిన దాడుల్లో మృతి చెందారు. ఈ విషయాన్ని సేవస్టోపోల్ పోర్ట్ సిటీ గవర్నర్ మైఖేల్ రాజోజయేవ్ తెలిపారు. తాజాగా.. రష్యా బాంబు దాడుల్లో సుమీఖింపోరమ్ కెమికల్ ప్లాంట్ నుంచి అమ్మోనియా లీక్ అయింది. ప్లాంటుకు దాదాపు 5 కిలోమీటర్ల మేర అమ్మోనియా ప్రభావం ఉంటుందని సుమీ గవర్నర్ ఓబ్లాస్ట్ మిత్రో పేర్కొన్నారు. దీంతో కెమికల్ ప్లాంట్ సమీపంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మాస్కులు ధరించి శ్వాస తీసుకోవాలని కోరారు. -
Russia-Ukraine war: ఉక్రెయిన్‌పై ‘అణు’ ఖడ్గం!
ఉక్రెయిన్‌పై దండయాత్రకు దిగి 25 రోజులు గడుస్తున్నా రష్యా పెద్దగా సాధించిందేమీ కన్పించడం లేదు. అమ్ములపొదిలో ఆయుధాలు ఖాళీ అయిపోతున్నాయి. రష్యా సైనికుల్లో నైరాశ్యం పెరిగిపోతోంది. అంతర్జాతీయ ఆంక్షల చట్రంలో ఇరుక్కొని దేశం నలిగిపోతోంది. అధ్యక్షుడు పుతిన్ యుద్ధోన్మాదంపై స్వదేశంలోనే తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దాంతో ఆయన ఓవైపు రాజీమార్గాలను అన్వేషిస్తూనే మరోవైపు దాడులను తీవ్రతరం చేస్తున్నారు. ఈ క్రమంలో తొలిసారిగా హైపర్ సోనిక్ క్షిపణిని ప్రయోగించిన రష్యా, మున్ముందు అణు దాడులకూ పాల్పడుతుందేమోనన్న అనుమానాలు బలపడుతున్నాయి... రష్యా అణు బాంబు ప్రయోగించే సాహసం చేస్తుందా అన్న అంశంపై రకరకాల విశ్లేషణలు విన్పిస్తున్నాయి. ఎటూ పాలుపోకపోవడంతో పుతిన్ అసహనంతో రగిలిపోతున్న మాట నిజమేనని స్లేట్ ఆన్లైన్ మ్యాగజైన్ జాతీయ భద్రతా వ్యవహారాల ప్రతినిధి ఫ్రెడ్ కప్లన్ అన్నారు. ‘‘ది బాంబ్: ప్రెసిడెంట్స్, జనరల్స్, అండ్ ది సీక్రెట్ హిస్టరీ ఆఫ్ న్యూక్లియర్ వార్’’ రచయిత అయిన ఆయన రష్యా అణు యుద్ధ భయాలపై లోతైన విశ్లేషణ చేశారు. ‘ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా ఓటమి అంచుల్లో ఉంది. అంతమాత్రాన పుతిన్ అణ్వాయుధాలు ప్రయోగిస్తారని అనుకోలేం. ఉక్రెయిన్ గగనతలాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటించడానికి నాటో నిరాకరించింది గనుక రష్యా ఆ సాహసం చేయకపోవచ్చు. అమెరికా, నాటో దేశాలు యుద్ధంలోకి నేరుగా ప్రవేశిస్తే అది వేరే సంగతి. వాటిని అడ్డుకోవడానికి రష్యా ఎంతకైనా తెగించవచ్చు. రష్యా, అమెరికా దగ్గర పరస్పరం నామరూపాల్లేకుండా చేసుకోగలిగినన్ని అణ్వాయుధాలు పోగుపడి ఉన్నాయి. కానీ వాటిని ప్రయోగించే అవకాశాలు లేవనే చెప్పాలి. రష్యా చిన్న అణు బాంబుల్ని ప్రయోగించినా కనీసం 8 వేల టన్నుల రేడియేషన్ వెలువడి ఊహాతీతమైన విధ్వంసం జరుగుతుంది. అదీగాక అణ్వాయుధాలను వాడే దేశంపై అంతర్జాతీయంగా ఆంక్షలు మరింతగా పెరుగుతాయి. అందుకే 1945 తర్వాత ఏ దేశమూ ఆ సాహసం చేయలేదు. అయినా ఏ దేశం యుద్ధ వ్యూహం ఎలా ఉంటుందో ఊహించడం కష్టం. అమెరికా, నాటో దేశాలు ఉక్రెయిన్‌కు మద్దతుగా ప్రత్యక్షంగా యుద్ధానికి దిగనంత వరకూ అణు ముప్పుండకపోవచ్చు. అందుకే ఉక్రెయిన్ ఎంత ప్రాధేయపడ్డా నో ఫ్లై జోన్ ప్రకటించకుండా అ మెరికా ఆచితూచి వ్యవహరిస్తోంది. పరోక్ష సాయానికే పరిమితమవుతోంది’’ అని అన్నారాయన. చైనా సహకారం లేకుండా... రష్యా అణ్వాయుధాలు ప్రయోగిస్తుందా లేదా అన్నదాన్ని చైనాతో ముడిపెట్టి చూడాలని బ్లూమ్‌బర్గ్ యూరప్ రిపోర్టర్ మారియో టాడియో అన్నారు. ‘‘చైనా నుంచి రష్యాకు ఆశించిన సైనిక తదితర సహకారం అందడం లేదు. పుతిన్ దౌత్య పరిష్కారం కోరుకుంటున్నారు. అణ్వాయుధ ప్రయోగానికి దిగకపోవచ్చు’’ అని అన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా ప్రయోగించిన ఆయుధాలు ► కల్బీర్ క్రూయిజ్ క్షిపణులు: పౌర ప్రాంతాలపై వీటిని విరివిగా ప్రయోగించింది. 2015లో సిరియాలో జరిపిన దాడుల్లోనూ వీటిని వాడింది. ► ఇస్కాండర్ క్షిపణులు: 500 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించే వీటిని భారీ భవనాలను నాశనం చేయడానికి ప్రయోగించింది. ► రాకెట్ దాడులు: కీవ్‌తో పాటు ఖర్కీవ్, ఒడెశా, చెర్నిహివ్, ఇర్పిన్‌లపై వీటిని భారీగా ప్రయోగిస్తోంది. స్మెర్క్, గ్రాడ్, ఉరకాన్ రాకెట్ లాంఛర్ల ద్వారా వీటిని ప్రయోగించి ధ్వంసరచన చేస్తోంది. ► శతఘ్నులు: అత్యంత శక్తిమంతమైన 203ఎం ఎం పియోని, 152–ఎంఎం హైసింథ్, అకాకియా హొవిట్జర్ శతఘ్నులను ప్రయోగిస్తోంది. ► క్లస్టర్, వాక్యూమ్ బాంబులు: అత్యంత ప్రమాదకరమైన వీటిని జనసమ్మర్ధ ప్రాంతాలపై విస్తృతంగా ప్రయోగించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘‘మానాన్నలాగా మీరూ కావద్దు’’ : హాలీవుడ్ హీరో భావోద్వేగ వీడియో
టెర్మినేటర్ స్టార్, హాలీవుడ్ హీరో ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న యుద్ధంపై స్పందించారు. దయచేసి ఈ యుద్ధాన్ని ముగించండి. మీరే యుద్ధాన్ని మొదలు పెట్టారు.. మీరే కొనసాగిస్తున్నారు.. మీరే దీన్ని ముగించాలి అంటూ డైరెక్టుగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్నుద్దేశించి వ్యాఖ్యానించారు. అలాగే రష్యా ప్రజలకు, సైనికులకు ఉద్వేగభరితమైన సందేశంతో ఒక వీడియోను షేర్ చేశారు కాలిఫోర్నియా మాజీ గవర్నర్. రష్యా ప్రజలంటే తనకు చాలా అభిమానమని అందుకే ఈ వీడియో ద్వారా మాట్లాడుతున్నా అన్నారు. రష్యన్ ప్రజల బలం, వారి మనసు తనకు ఎపుడూ స్ఫూర్తినిస్తుందని అందుకే ఉక్రెయిన్‌లో యుద్ధం గురించి తెలుసుకోవలసిన భయంకరమైన విషయాలున్నాయంటూ తన తొమ్మిది నిమిషాల వీడియోలో కొన్ని అంశాలను చెప్పుకొచ్చారు. అలాగే రష్యన్ వెయిట్‌లిఫ్టర్ యూరి వ్లాసోవ్ 14 సంవత్సరాల వయస్సులో తనకు స్ఫూర్తిగా నిలిచిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘ఉక్రెయిన్ను 'డి-నాజిఫై' చేసే యుద్ధం అని రష్యా ప్రభుత్వం చెప్పిందని తెలుసు, "ఇది నిజం కాదు. క్రెమ్లిన్‌లో అధికారంలో ఉన్నవారు ఈ యుద్ధాన్ని ప్రారంభించారు. ఇది రష్యా ప్రజల యుద్ధం కాదు చట్టవిరుద్ధమైన యుద్ధం. ప్రపంచం మొత్తం ఖండించిన తెలివిలేని యుద్ధం కోసం మీ జీవితాలు, మీ అవయవాలు, మీ భవిష్యత్తులు త్యాగం చేయబడుతున్నాయి. ఇప్పటికే వేలాది రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దేశం కోసం వారంతా యుద్దం చేస్తోంటే నాయకులు మాత్రం విజయంకాంక్షతో ఉన్నారు. I love the Russian people. That is why I have to tell you the truth. Please watch and share. pic.twitter.com/6gyVRhgpFV — Arnold (@Schwarzenegger) March 17, 2022 స్క్వార్జెనెగర్ మాట్లాడుతూ ఉక్రెయిన్‌లో దాని చర్యలు, క్రూరత్వం కారణంగా ప్రపంచం రష్యాకు వ్యతిరేకంగా మారింది, పిల్లల ఆసుపత్రి, ప్రసూతి ఆసుపత్రితో సహా రష్యన్ ఫిరంగిదళాలు బాంబులతో నేలమట్టం చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా స్క్వార్జె నెగర్ రెండవ ప్రపంచ యుద్ధంలో రష్యాలో నాజీల కోసం పోరాడుతున్నప్పుడు తన తండ్రికి కలిగిన గాయాలను గుర్తుచేసుకున్నారు. శారీరకంగానూ, మానసికంగానూ కుంగిపోయి జీవితాంతం బాధతోనే గడిపారు, మీరు ఆయనలా బాధపడటం తనకు ఇష్టం లేదంటూ రష్యా దళాలకు సందేశమిచ్చాడు. అలాగే రష్యాల్లో ఉక్రెయిన్‌పై దండయాత్రకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ఉద్యమకారులను మీరు నా హీరోలు అంటూ ప్రశంసించారు. కాగా ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసి నేటికి (మార్చి, 18) 23వ రోజు. అమెరికా అధ్యక్షులు జో బిడెన్, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ఈరోజు చర్చించనున్నారని వైట్‌హౌస్ అధికార ప్రతినిధి జెన్ ప్సాకి తెలిపారు. -
పుతిన్‌తో ఛాలెంజ్ ఎఫెక్ట్ ? అమ్మాయిగా పేరు మార్చుకున్న ఎలన్‌మస్క్!
ఫేస్ టూ ఫేస్ తేల్చుకుందాం రమ్మంటూ ఎలన్ మస్క్ వేసిన ట్వీట్.. చాప కింద నీరులా రష్యాలో కాక రేపుతోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ నేరుగా స్పందించకపోయినా అతని కింద పని చేస్తున్న అధికారులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. మా బాస్కే ఛాంలెజ్ విసురుతావా ? అంటూ కౌంటర్ ఎటాక్ స్టార్ చేశారు. తేల్చుకుందారం రమ్మంటూ ఎలన్ మస్క్ చేసిన ట్వీట్‌పై రష్యా ఆధీనంలోని చెచెన్యా రిపబ్లిక్ హెడ్ రమ్జాన్ కేడీరోవ్ టెలిగ్రామ్‌లో ఎలన్ మస్క్‌కు పంపిన మెసేజ్‌లో స్పందిస్తూ.. ఎలన్ మస్క్ ! నవ్వు. పుతిన్ వేర్వేరు రంగాలకు చెందిన వారు. నువ్వేమో బిజినెస్‌మేన్, ట్విట్టర్ యూజర్వి పుతినేమో రాజకీయవేత్త, వ్యూహకర్త ఎలా కదనరంగంలో దిగుతారు. ఒకవేళ బాక్సింగ్ రింగులో మీరు తలపడితే.. అసలే స్పోర్ట్స్మాన్లా ఉండే పుతిన్ దెబ్బకు నీలో ఉన్న దయ్యం ఎగిరిపోతుంది అంటూ కౌంటర్ ఇచ్చాడు. అయితే ఈ పంచులు ఇక్కడితే ఆగిపోలేదు. పుతిన్ లాంటి స్ట్రాంగ్ పర్సన్‌తో నువ్వు యుద్ధం చేయాలంటే నువ్వు మరింత బలంగా మారాలి. ఇలా ఎలోనాగా ఉంటే సరిపోదు. నీకు కావాలంటే రష్యాలో ఉన్న మిలిటరీ ట్రైనింగ్ కేంద్రాల్లో శిక్షణ ఇప్పిస్తాను. అప్పుడు నువ్వు ఎలానా నుంచి ఎలన్గా మారవచ్చంటూ దెప్పి పొడిచాడు. వివాదాలను కొని తెచ్చుకునే అలవాటు ఉన్న ఎలన్‌మస్క్.. రమ్జాన్ నుంచి వచ్చిన కవ్వింపు చర్యలకు మరింతంగా రెచ్చిపోయాడు. నాకు మంచి ఆఫర్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. అలాంటి శిక్షణ తీసుకోవడం నాకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది. అప్పుడు నాతో పోరాడటానికి పుతిన్ భయపడితే.. నాది లెఫ్ట్ హ్యాండ్ కాకపోయినా సరే పుతిన్‌తో కేవలం ఎడమ చేయితో ఫైట్ చేయడానికి నేను రెడీ రిటార్ట్ ఇచ్చాడు. అక్కడితో ఊరుకుంటే ఎలన్‌మస్క్ ఎలా అవుతాడు. ఈ ట్వీట్‌ను పోస్ట్ చేసే సమయంలో తన డీపీ పేరును సైతం ఎలోనా మస్క్‌గా మార్చుకుని మరింతగా రెచ్చగొట్టాడు ఎలన్ మస్క్. Telegram post by Ramzan Kadyrov, head of Chechen Republic! pic.twitter.com/UyByR9kywq — Elona Musk (@elonmusk) March 15, 2022 చదవండి: ఏయ్ పుతిన్.. ఒంటరిగా నాతో కలబడే దమ్ముందా? సవాల్ విసిరిన ఎలన్ మస్క్ -
ఉక్రెయిన్-రష్యా ఎఫెక్ట్.. లబోదిబోమంటున్న బిలియనీర్స్!
గత కొద్ది రోజుల నుంచి ఉక్రెయిన్ - రష్యా మధ్య యుద్దం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ యుద్దాన్ని నివారించడం కోసం చాలా దేశాలు అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికి ఈ యుద్దం ముగియడం లేదు. దీంతో యూరోపియన్ దేశాలు రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేత యుద్దాన్ని ఆపించేందుకు రష్యా దేశానికి చెందిన బిలియనీర్స్ మీద ఆంక్షలు విధించేందుకు సిద్దమయ్యాయి. దీంతో, చాలా మంది రష్యా బిలియనీర్స్ లబోదిబో అంటున్నారు. మార్చి 4 నుంచి ఇటలీ ఆ దేశంలోని సార్డినియా, లిగురియన్ తీరం & లేక్ కోమోతో సహా ఇతర సుందరమైన ప్రదేశాలలో రష్యా దేశానికి చెందిన దనవంతులకు గల 143 మిలియన్ యూరోలు($156 మిలియన్లు) విలువైన లగ్జరీ యాచ్‌లు, విల్లాలను స్వాధీనం చేసుకుంది. "మొదట మేము ఉక్రెయిన్ మీద పుతిన్ దాడిని ఆపగలగాలి" అని ఇటాలియన్ విదేశాంగ మంత్రి లూయిగి డి మాయో ఇటాలియన్ స్టేట్ మీడియాకు చెప్పారు. ఇంకా, పుతిన్‌కు సన్నిహితంగా ఉండే దనవంతుల వర్గాలకు చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి ఇటలీ ప్రణాళికలను రచిస్తున్నట్లు తెలుస్తుంది. ఇటాలియన్ పోలీసులు శాన్ రెమో ఓడరేవులో పుతిన్‌కు దగ్గరగా ఉన్న జెన్నాడీ టిమ్చెంకో అనే వ్యక్తికి చెందిన సూపర్ యాచ్ "లీనా"ను వెంటనే స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 65 మిలియన్ యూరోలు ఉంటుందని అంచనా. అలాగే టస్కానీ & కోమోలోని విల్లాలు కూడా ఉన్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. రష్యన్-ఉజ్బెక్ వ్యాపార దిగ్గజం అలిషర్ ఉస్మానోవ్'కు చెందిన విల్లాను ఉత్తర సార్డినియాలోని టోనీ ఎమరాల్డ్ తీరం వెంబడి స్వాధీనం చేసుకున్నారు. హాంబర్గ్ ఓడరేవులో ఉస్మానోవ్ పడవను స్వాధీనం చేసుకున్నట్లు వచ్చిన వార్తలను జర్మన్ అధికారులు ఖండించారు. జర్మనీ ఆర్థిక మంత్రిత్వ శాఖ "రష్యాపై మరిన్ని ఆంక్షలను వేగంగా అమలు చేసేందుకు" సిద్దం అవుతున్నట్లు పేర్కొంది. కానీ, ఆ దేశం ఏ ఆస్తులను స్వాధీనం చేసుకున్నారో బహిరంగంగా చెప్పడానికి నిరాకరించింది. బిలియనీర్స్ స్వర్గధామం అయిన బ్రిటన్ దేశం రష్యాపై మరింత ఒత్తిడి చేయలని చూస్తుంది. ఫ్రాన్స్ దేశంతో సహ ఇతర అనేక యూరోప్ దేశాలు రష్యా ధనవంతులకు చెందిన ఆస్తులను స్వాదినం చేసుకోవాలని చూస్తున్నాయి. (చదవండి: లీకైన ఆడియో టేపులు, వాటాల కోసం కొట్టుకుంటున్నారు?!) -
రంగంలోకి దిగిన ఉక్రెయిన్ అధ్యక్షుడి భార్య.. తనదైన స్టైల్లో వార్నింగ్
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. వేల సంఖ్యలో సైనికులు, పౌరులు మృత్యువాతపడుతున్నారు. ఈ క్రమంలో రష్యా దాడులు నిలిపివేయాలని పలు దేశాలు ముక్తకంఠంతో పుతిన్ హెచ్చరిస్తున్నాయి. కానీ, పుతిన్ మాత్రం అవేవీ పట్టించుకోకుండా తనదైన శైలిలో ఆయా దేశాలను హెచ్చరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడి భార్య వొలెనా జెలెన్స్కా కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టింది సైనిక చర్య కాదని, పూర్తిస్థాయి యుద్ధమని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రపంచదేశాలకు తెలియజేయాలని ఇతర దేశాల ప్రథమ మహిళలను కోరారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ పోస్టును రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా జెలెన్ స్కా మాట్లాడుతూ.. రష్యా చెప్పినట్లుగా ఉక్రెయిన్‌లో జరుగుతున్నది ప్రత్యేక సైనిక చర్య కాదు. అది పూర్తి స్థాయి యుద్ధమని ఆవేదన వ్యక్తం చేశారు. మీ బిడ్డలు ఉక్రెయిన్‌తో యుద్ధ విన్యాసాల్లో పాల్గొనడం లేదు. ఉక్రెయిన్ను ఆక్రమించుకునే క్రమంలో మరణిస్తున్నారని రష్యన్ తల్లులకు వినిపించేలా చెప్పండి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం యుద్ధం మా దేశం మీదే, ఐరోపా సరిహద్దుల్లో జరుగుతుందని భావించకండి. భవిష్యత్తులో మీపై దాడిచేసే శత్రువును ఉక్రెయిన్ ఎదుర్కొంటోందని చెప్పండి. పుతిన్ అణు దాడి గురించి బెదిరిస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే.. ప్రపంచంలో సురక్షితమైన ప్రదేశం అనేదే ఉండదని సూచించండి అంటూ ఆమె ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. ఈ విషయాన్ని ప్రపంచానికి వెల్లడించాలని అభ్యర్థించారు. ఉక్రెయిన్ శాంతిని కోరుకుంటోంది. తనను తాను రక్షించుకుంటుందని స్పష్టం చేశారు. అలాగే ఉక్రెయిన్‌కు మద్దతు ప్రకటించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. View this post on Instagram A post shared by Olena Zelenska (@olenazelenska_official) -
మాట తప్పిన పుతిన్.. తీవ్ర ఆందోళనలో జెలెన్ స్కీ
కీవ్: ఎన్ని ఆంక్షలు విధించినా పుతిన్ మాత్రం ఉక్రెయిన్‌పై దాడులను ఆపడం లేదు. ఉక్రెయిన్‌కు సహకరిస్తున్న దేశాలకు వార్నింగ్ ఇస్తూ దాడులను ముమ్మరం చేస్తున్నారు. కాగా, పౌరులను తరలించేందుకు శనివారం యుద్ధానికి తాత్కాలికంగా విరామం ఇస్తున్నట్టు ప్రకటించిన రష్యా.. మాట తప్పింది. యుద్దం నిలిపివేసిన అనంతరం మరియుపోల్, వోల్నోవాఖ నగరాల్లో యుద్ధ క్షేత్రం నుంచి పౌరులను తరలింపునకు ఉక్రెయిన్ ప్రభుత్వం బస్సులను, రైళ్లను సిద్ధం చేసుకుందని మరియుపోల్ మేయర్ వదిమ్ బాయ్చెంకో చెప్పారు. అయితే, యుద్దం ఆపిన గంట వ్యవధిలోనే రష్యా బలగాలు దాడులు ప్రారంభించాయని ఆయన ఆరోపించారు. రష్యా బలగాలు నగరంపై బాంబుల దాడులు చేశాయని ఆయన ఆరోపించారు. ఉక్రెయిన్ ప్రజలు ఇండ్లు, ఆసుపత్రులపై దాడులు చేసినట్టు వెల్లడించారు. నగరాన్ని రష్యా సైన్యం నిర్బంధించి.. మానవతా కారిడార్‌కు నిరాకరించినట్లు చెప్పారు. ఇప్పటికే నగరంలో నీరు, విద్యుత్తు సౌకర్యం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రష్యా బలగాల చేతిలో సుమారు 4 లక్షల మంది నగరవాసులు బంధీగా ఉన్నారని తెలిపారు. రష్యా భీకర దాడులు కొనసాగుతున్న వేళ ఉక్రెయిన్‌లోని వందల మంది పురుషులు తమ దేశం తరఫున సైన్యంలో చేరేందుకు కీవ్‌లో సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే మిలిటరీ ఆపరేషన్ కోసం 18-60 వయసు వారు దేశం విడిచి వెళ్లటాన్ని ఉక్రెయిన్ నిషేధించింది. కాగా, ఉక్రెయిన్ ఆయుధాలు సరఫరా చేసేందుకు పలు దేశాలు ముందుకు వస్తున్నాయి. తాజాగా ఉక్రెయిన్‌కు పోలాండ్ మిగ్-29 యుద్ధ విమానాలు, Su-25 విమానాలను అందించే అవకాశం ఉన్నట్టు ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. -
రష్యాకు సర్ప్రైజ్ షాక్.. టెన్షన్లో పుతిన్..?
వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు 11వ రోజుకు చేరుకున్నాయి. దాడుల నేపథ్యంలో రష్యా బలగాలు అరాచకంగా వ్యవహరిస్తున్నాయి. ఉక్రెయిన్‌లోని పలు పట్టణాలు, నగరాలపై పట్టును సాధించే ప్రయత్నం చేస్తున్న రష్యన్ బలగాలు ఉక్రెయిన్ మహిళలపై అత్యాచారాలకు తెగబడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రష్యన్ సైనికులు తమ దేశ ప్రజలపై రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్నారని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా ఆరోపించారు. మరోవైపు దాడుల నేపథ్యంలో రష్యాపై ఆంక్షల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా అమెరికన్ పేమెంట్ సంస్థలైన వీసా, మాస్టర్‌కార్డ్.. రష్యాలో తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తున్నామని వీసా సీఈవో అల్ కెల్లీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో రష్యాలో వీసా కార్డు సేవలను పూర్తి స్థాయిలో నిలిపివేస్తామని ఆయన వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్ పూర్తి స్థాయిలో సైబర్ వార్‌ను ముమ్మరం చేసింది. ఆ దేశానికి చెందిన వందలాది మంది హ్యాకర్లు డిజిటిల్ యుద్ధం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. యువకులు డిజిటల్ ఆర్మీగా ఏర్పాటై రష్యా దాడుల్ని నిలువరిస్తున్నారు. వీరంతా రష్యాకు చెందిన వెబ్సైట్లను బ్లాక్ చేయడం, తప్పుడు సమాచారం వ్యాప్తి చేయకుండా అడ్డుకోవడమే కాకుండా రష్యా సైనికులు ఏయే ప్రాంతాల్లో ఉన్నారో గుర్తించి ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. దీంతో రష్యా సైతం తమ హ్యాకర్లని రంగంలోకి దింపింది. రష్యా హాకర్లు ఇ–మెయిల్స్ ద్వారా మాల్వేర్లు పంపించి ఇంటర్నెట్ వ్యవస్థని స్తంభింపజేస్తున్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య డిజిటల్ యుద్ధంతో యూరప్ దేశాలు కూడా పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. -
War Updates: ఉక్రెయిన్‌లో బుల్లెట్ గాయాలైన విద్యార్థి రేపు భారత్‌కు..
Russia-Ukraine War Day 11 LIVE Updates: ఉక్రెయిన్‌పై రష్యా బలగాల దాడులు 11వ రోజుకు చేరుకున్నాయి. రష్యా సైన్యం వైమానిక దాడులను జెట్‌స్పీడ్ వేగంతో కొనసాగిస్తోంది. మరోవైపు రష్యాపై ఆంక్షలు విధించడం యుద్ధంతో సమానమని పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందుకు నాటో దేశాలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. దాడులు కొనసాగుతుండగానే సోమవారం(మార్చి 7వ తేదీన) రెండు దేశాల మధ్య మూడోసారి శాంతి చర్చలు జరుగనున్నాయి. ►ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపు కోసం ఏర్పాటుచేసిన మిషన్ గంగా మిషన్ ద్వారా ఇప్పటి వరకు 76 విమానాల్లో 15,920 మంది భారతీయ విద్యార్థులను స్వదేశానికి చేర్చినట్లు కేంద్రమంత్రి జ్యోతిరాధిత్యా సింధియా తెలిపారు. ♦రోమేనియా నుంచి 31 విమనాల్లో 6680 మంది విద్యార్థులు ♦పోలాండ్ నుంచి 13 విమానాల ద్వారా 2822 మంది విద్యార్థులు ♦హంగేరి నుంచి 26 విమానాల్లో 5300 మంది విద్యార్థులు ♦స్లోవేకియా నుంచి 6 విమానాల్లో 1118 మందిని భారత్‌కు తరలించినట్లు తెలిపారు. #OperationGanga Update: We have successfully evacuated over 15920 students via 76 flights. Breakup - Romania - 6680 (31 flights) Poland - 2822 (13 flights) Hungary - 5300 (26 flights) Slovakia - 1118 (6 flights) @HardeepSPuri @KirenRijiju @Gen_VKSingh — Jyotiraditya M. Scindia (@JM_Scindia) March 6, 2022 ► ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో గాయపడిన భారతీయ విద్యార్థి హర్జోత్ సింగ్‌ను సోమవారం స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. వీకే సింగ్ తెలిపారు. కీవ్ నుంచి ఉక్రెయిన్ సరిహద్దు వైపు ప్రయాణిస్తుండగా అతడిపై కాల్పులు జరిగాయి. గాయపడిన హర్జోత్ తన పాస్‌పోర్టు పోగొట్టుకున్నాడని, సోమవారం తమతో పాటు భారత్‌కు తీసుకురానున్నట్లు పోలాండ్‌లో ఉన్న కేంద్ర మంత్రి జనరల్ వీకే సింగ్ ట్విటర్ ద్వారా పేర్కొన్నారు. हरजोत सिंह वह भारतीय हैं जिन्हें कीव में युद्ध के दौरान गोली लग गई थी। अफरातफरी में इनका पासपोर्ट भी गुम गया था। सहर्ष सूचित कर रहा हूं कि हरजोत कल भारत हमारे साथ पहुंच रहे हैं। आशा है घर के खाने और देखभाल के साथ शीघ्र स्वास्थ्यवर्धन होगा।#OperationGanga#NoIndianLeftBehind pic.twitter.com/NxOkD9mJ9U — General Vijay Kumar Singh (@Gen_VKSingh) March 6, 2022 ►ఉక్రెయిన్ ఎయిర్‌స్పేస్‌ను నోఫ్లై జోన్‌గా ప్రకటించాలని విదేశాలకు అ దేశ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ మరోసారి విజ్ఞప్తి చేశారు. ఉక్రెయిన్‌లోని ఎయిర్‌పోర్టులపై రష్యా బాంబు దాడులు చేస్తోందని, దాడుల కట్టడికి ఉక్రెయిన్ గగనతలాన్ని నో ఫ్లైజోన్‌గా ప్రకటించాలని అమెరికాతో సహా యూరోపియన్ దేశాలను కోరారు. ►ఉక్రెయిన్‌లో రష్యా మిలటరీ దాడులపై పోప్ ఫ్రాన్సిస్ స్పందించారు. యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో రక్తపు, కన్నీటి నదులు పారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేవలం సైనిక చర్య మాత్రమే కాదని, మరణం, విధ్వంసం, దుఃఖాన్ని నాటుతోన్న యుద్ధమని విచారం వ్యక్త చేశారు. ఉక్రెయిన్ సంక్షోభ సమయంలో శరణార్థుల కోసం మానవతా కారిడార్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ►ఉక్రెయిన్‌లోని ఆరోగ్య సంరక్షణ కేంద్రాలపై దాడులను ప్రపంచ ఆరోగ్య సంస్థ ధృవీకరించింది. ఆరోగ్య కేంద్రాలపై దాడి ఘటనలో ఆరుగురు మృతి చెందినట్లు, 11 మంది గాయాలపాలైనట్లు తెలిపింది. ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, హెల్త్ వర్కర్లపై దాడులు అంతర్జాతీయ మానవతా చట్టాలను ఉల్లంఘించినట్లేనని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ ఆదివారం ట్విట్టర్లో తెలిపారు. .@WHO has confirmed several attacks on health care in #Ukraine, causing multiple deaths and injuries. Additional reports are being investigated. Attacks on healthcare facilities or workers breach medical neutrality and are violations of international humanitarian law. #NotATarget https://t.co/Wdc2jeoHIB — Tedros Adhanom Ghebreyesus (@DrTedros) March 6, 2022 ►ఉక్రెయిన్ ఓడరేవు నగరం ఒడెస్సాపై రష్యా దళాలు బాంబు దాడికి సిద్ధమవుతున్నాయని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. ►ఉక్రెయిన్ పొరుగు దేశాల నుంచి గడిచిన 24 గంటల్లో 2100 భారతీయ విద్యార్థులను స్వదేశానికి తీసుకొచ్చినట్లు పౌర విమానయానశాఖ తెలిపింది. సోమవారం రోజు 8 విమానాల(బుడాపెస్ట్(5) సుసీవా(2) బుచారెస్ట్(1)) ద్వారా మరో 1500 మంది భారతీయులను స్వదేశానికి తీసుకురానున్నట్లు వెల్లడించింది. ►ఫిబ్రవరి 22న ప్రారంభించిన ప్రత్యేక విమానాల ద్వారా ఇప్పటి వరకు 15,900 మంది విద్యార్థులను ఉక్రెయిన్ నుంచి భారత్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. ►ఉక్రెయిన్ చిక్కుకుపోయిన భారతీయులను ఆపరేషన్ గంగా’ మిషన్ ద్వారా సరిహద్దు దేశాలైన పోలండ్, హంగరీ, రొమేనియా, స్లోవేకియా నుంచి స్వదేశానికి తరలిస్తున్న విషయం తెలిసిందే. కాగా హంగేరిలో ఆపరేషన్ గంగా కార్యక్రమం ముగింపు దశకు చేరుకుందని. నేడు చివరి విమానాలు బయల్దేరనున్నట్లు అక్కడి భారత రాయబార కార్యాలయం ఆదివారం వెల్లడించింది. ఎంబసీ ఏర్పాటు బస కాకుండా స్వతహాగా వేరే చోట్ల ఉన్న వారందరూ వెంటనే బుడాపెస్ట్‌కు చేరుకోవాలని సూచించింది. Important Announcement: Embassy of India begins its last leg of Operation Ganga flights today. All those students staying in their OWN accommodation ( other than arranged by Embassy) are requested to reach @Hungariacitycentre , Rakoczi Ut 90, Budapest between 10 am-12 pm — Indian Embassy in Hungary (@IndiaInHungary) March 6, 2022 ►ఉక్రెయిన్‌లో యుద్ధం నేపథ్యంలో గత పది రోజుల్లో లక్షాలాది మంది శరణార్ధులుగా మారిపోయారు. ఇప్పటివరకు 15 లక్షల మంది ప్రజలు దేశం విడిచి పొరుగు దేశాలకు వెళ్లినట్లు ఐరాస వెల్లడించింది, రెండో ప్రపంచ యుద్ధం తరువాత యూరప్‌లో అతి తక్కువ కాలంలో అత్యంత వేగంగా పెరుగుతున్నశరనార్ధుల సంక్షోభం ఇదేనని తెలిపింది. More than 1.5 million refugees from Ukraine have crossed into neighbouring countries in 10 days — the fastest growing refugee crisis in Europe since World War II. — Filippo Grandi (@FilippoGrandi) March 6, 2022 ►ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపును సమన్వయం చేసేందుకు హంగేరీలోని బుడాపెస్ట్‌లో భారత రాయబార కార్యాలయం కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ►ఉక్రెయిన్ నుంచి తమ పౌరులను తరలించడంలో పెద్ద పెద్ద దేశాలే ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ తాము భారతీయులను విజయవంతంగా తీసుకురాగులుగుతున్నామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వెల్లడించారు. కోవిడ్‌ను విజయవంతంగా కంట్రోల్ చేశామని, ఇప్పుడు ఉక్రెయిన్ నుంచి తమ ప్రజలను సురక్షితంగా తరలిస్తున్నామని పేర్కొన్నారు. ఇదంతా భారత్‌కు పెరుగుతున్న ఆదరణ వల్లే సాధ్యమైందన్నారు. పెద్ద దేశాలు కూడా ఈ విషయంలో ఇబ్బంది పడుతున్నాయని అన్నారు. ఈ మేరకు పుణె యూనివర్సిటీలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ►రష్యా మిలటరీ దాడి మొదలైనప్పటి నుంచి నేటి వరకు 11 వేల మంది ఆ దేశ సైనికులు మృతి చెందారని ఉక్రెయిన్ ఆర్మీ అధికారులు ఆదివారం వెల్లడించారు అలాగే 44 విమనాలు, 48 హెలికాప్టర్లు, 285 ట్యాంక్‌లు, 109 ఆర్టిలరీ ఆయుధాలను ద్వంసం చేసినట్లు పేర్కొన్నారు. These are the indicative estimates of Russia's losses as of March 6, according to the Armed Forces of Ukraine. pic.twitter.com/TgPPCn565U — The Kyiv Independent (@KyivIndependent) March 6, 2022 తనను సజీవంగా చూడడం ఇదే చివరిసారి కావచ్చని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇవే తన చివరి మాటలు కావొచ్చంటూ భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు. ఆక్రమణదారుల నుంచి తమ దేశాన్ని కాపాడుకుంటామని అన్నారు. తమ మాతృభూమిని కాపాడుకునేందుకు ఉక్రెయిన్ ప్రజలు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడుతున్నారని ప్రశంసించారు. ► ఇప్పటికీ ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులకు అక్కడి భారతీయ రాయబార కార్యాలయం కీలక సూచనలు చేసింది. వెంటనే ఓ ఫామ్‌లో వివరాలు నమోదు చేయాలని పేర్కొంది. పేరు, ఉక్రెయిన్‌లో ఏ నగరంలో ఉన్నారు.. వంటి అంశాలతో కూడిన ఓ దరఖాస్తును అత్యవసర ప్రాతిపదికన నింపాలంటూ సూచించింది. ఇందకు ఓ గూగుల్ డాక్యుమెంట్‌ను జతచేసింది. All Indian nationals who still remain in Ukraine are requested to fill up the details contained in the attached Google Form on an URGENT BASIS . Be Safe Be Strong @opganga@MEAIndia@PIB_India@DDNewslive@DDNationalhttps://t.co/4BrBuXbVbz — India in Ukraine (@IndiainUkraine) March 6, 2022 ► ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధం మొదలు పెట్టినప్పటి నుంచి మార్చి 4 వరకు జరిగిన దాడుల్లో కనీసం 351 మంది పౌరులు మృతి చెందినట్లు ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల విభాగం వెల్లడించింది. మృతుల్లో 22 మంది చిన్నారులు ఉన్నట్లు తెలిపింది. మరోవైపు 707 మంది గాయపడ్డారని, అందులోనూ 36 మంది పిల్లలు ఉన్నట్లు పేర్కొంది. అయితే వాప్తవ లెక్కలు ఇంకా ఎక్కువే ఉండవచ్చని అభిప్రాయపడింది. From 24 Feb—4 March, we recorded 1,058 civilian casualties in context of Russia’s military action against #Ukraine: 351 killed, incl 22 children; 707 injured, incl 36 children, mostly caused by shelling & airstrikes. Real toll is much higher. Full update https://t.co/q4Qfs3W4uV pic.twitter.com/QmITDereSH — UNHumanRightsUkraine (@UNHumanRightsUA) March 5, 2022 ► భారత్ ప్రయోజానాల దృష్ట్యా యుద్ధం ఆపమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్‌కి చెప్పండి అని ఉక్రెయిన్ భారత ప్రధాని నరేంద్ర మోదీని అభ్యర్థించింది. ఈ మేరకు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించాలని రష్యాను కోరండి అని ప్రధాని మోదీకి పిలుపునిచ్చారు. ఇది అన్ని దేశాల ఉత్తమ ప్రయోజనాల కోసమేనని స్పష్టం చేశారు. ► ఉక్రెయిన్‌లో వైమానిక స్థావరం ధ్వంసం ఉక్రెయిన్‌లో రష్యా వైమానిక దాడులను తీవ్రతరం చేసింది. ఆదివారం ఉక్రెయిన్‌లోని స్టారోకోస్టియాంటినివ్ వైమానిక స్థావరం లక్ష్యంగా రష్యా దాడులు చేసింది. ఈ క్రమంలో ఉక్రెయిన్‌కు చెందిన స్టారోకోస్టియాంటినివ్ స్థావరం పూర్తిగా ధ్వంసమైంది. ► ఉక్రెయిన్‌లోని జైటోమిర్ ప్రాంతంలో నాలుగు Su-27, ఒక MiG-29 విమానాలను, రాడోమిషాల్ ప్రాంతంలో ఒక Su-27, Su-25, ఒక Su-25 విమానాలను రష్యా గత ఒక్కరోజులో కూల్చివేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిజిన్ ప్రాంతంలో మరో విమానంను కాల్చినట్లుగా తెలుస్తోంది. ► 2,203 మిలిటరీ కేంద్రాలు ధ్వంసం: రష్యా రక్షణ శాఖ ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు బాంబులు, క్షిపణి ప్రయోగాలతో బీభత్సం సృష్టిస్తున్నాయి. అయితే, ఇప్పటి వరకు ఉక్రెయిన్‌కు చెందిన 2,203 మిలిటరీ మౌళిక సదుపాయాల కేంద్రాలను ధ్వంసం చేసినట్టు రష్యా రక్షణ శాఖ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. ► మెట్రో స్టేషన్ సమీపంలో క్షిపణి దాడిలో ఉక్రెయిన్ పౌరుడు మృతి ఉక్రెయిన్‌లో రష్యా బలగాల దాడులు కొనసాగుతున్నాయి. ఆదివారం రష్యా ట్రూప్స్ జైటోమిర్ ప్రాంతంలోని మెట్రో స్టేషన్ సమీపంలో క్షిపణి దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఉక్రేనియన్ పౌరుడు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. ► భారత్ చేరుకున్న మరో 210 మంది విద్యార్థులు ఉక్రెయిన్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆపరేషన్ గంగా కొనసాగుతోంది. ఉక్రెయిన్ నుంచి భారత విద్యార్థులను స్వదేశానికి తరలిస్తున్నారు. కాగా, ఆదివారం ఉదయం ఉక్రెయిన్ నుంచి 210 మంది భారత విద్యార్థులు ఇండియాకు చేరుకున్నారు. భారత వైమానిక దళ విమానం రొమేనియాలోని బుకారెస్ట్ నుంచి విద్యార్థులను ఢిల్లీ సమీపంలోని హిండన్ బేస్‌ను తరలించింది. Indian Air Force flight carrying 210 Indians evacuated from Ukraine arrives at Hindan airbase near Delhi from Bucharest, Romania. pic.twitter.com/CZAXHIuGcF — ANI (@ANI) March 6, 2022 ► రష్యాకు మరో షాక్.. వీసా, మాస్టర్ కార్డ్ సేవలు బంద్ ఉక్రెయిన్‌పై దాడుల నేపథ్యంలో రష్యాపై ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా అమెరికన్ పేమెంట్ సంస్థలైన వీసా, మాస్టర్‌కార్డ్.. రష్యాలో తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తున్నామని వీసా సీఈవో అల్ కెల్లీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో రష్యాలో వీసా కార్డు సేవలను పూర్తి స్థాయిలో నిలిపివేస్తామని ఆయన వెల్లడించారు. రష్యా హెలికాప్టర్‌ను కూల్చేశాం: ఉక్రెయిన్ రక్షణశాఖ తమ వైమానిక రక్షణ దళ నిపుణులు రష్యా హెలికాప్టర్‌ను శనివారం కూల్చేశారని ఉక్రెయిన్ రక్షణ శాఖ ట్విట్టర్లో వెల్లడించింది. చెర్నిహివ్ నగర శివారులో ఈ సంఘటన జరిగిందని పేర్కొంది. రష్యా హెలికాప్టర్లో ఒక పైలట్ మరణించాడని, అతడిని మేజర్ క్రివోలాపోవ్‌గా గుర్తించినట్లు తెలిపింది. #stoprussia ⚔️ Так гинуть російські окупанти. Цього разу у вертольоті! Слава Україні та її захисникам! Разом до перемоги! 🇺🇦@GeneralStaffUA pic.twitter.com/raFOepF06P — Defence of Ukraine (@DefenceU) March 5, 2022 బైడెన్‌కు జెలెన్ స్కీ ఫోన్.. ► ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మరోసారి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో రెండో సారి ఫోన్లో మాట్లాడారు. ఈ క్రమంలో ఉక్రెయిన్‌కు రక్షణ, ఆర్థిక మద్దతు, రష్యాపై ఆంక్షల కొనసాగింపు వంటి కీలక అంశాలపై చర్చించినట్టు జెలెన్ స్కీ పేర్కొన్నారు. పుతిన్‌తో ఇజ్రాయెల్ ప్రధాని భేటీ.. ► దాడుల నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలి బెన్నెట్ భేటీ అయ్యారు. క్రెమ్లిన్‌లో వీరిద్దరి మధ్య జరిగిన భేటీలో ఉక్రెయిన్‌తో శాంతి చర్చలు చేపట్టాలని పుతిన్‌ను కోరినట్టు సమాచారం. మరోవైపు కీవ్, మాస్కోలతో ఇజ్రాయెల్‌తో కీలక సంబంధాలు ఉన్న కారణంగా ఉక్రెయిన్ చర్చల కోసం ఆ దేశాన్ని ఆశ్రయించింది. -
Sakshi Cartoon: ఉక్రేయన్లు గ్యాంగ్స్టర్లు-పుతిన్
ఉక్రేయన్లు గ్యాంగ్స్టర్లు-పుతిన్ -
పుతిన్‌తో సంబంధాలు.. ఆస్తులు అమ్ముకుంటున్న రష్యన్ బిలియనీర్లు
ప్రపంచం మొత్తం వారిస్తున్న వినకుండా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌పై దాడికి దిగాడు. దీంతో అతనికి దగ్గరి వారిగా పేరొందిన అందరినీ టార్గెట్ చేస్తున్నాయి వెస్ట్రన్ కంట్రీస్. ముఖ్యంగా రష్యన్ బిలియనీర్లు పుతిన్‌తో ఉన్న సంబంధాల కారణంగా చిక్కుల్లో పడుతున్నారు. ఇంగ్లండ్ దేశంలో ఫుట్‌బాల్ ఆటకు ఎనలేని క్రేజ్ ఉంది. అక్కడ క్లబ్ స్థాయిల్లో జరిగే లీగ్‌లకు ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ స్థాయిలో హడావుడి ఉంటుంది. ప్రతీ క్లబ్‌కి పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ ఉంటారు. ఇలా ఫుల్ క్రేజ్ ఉన్న ఫుట్‌బాల్ క్లబ్స్‌లో చెల్సియా ఒకటి. లండన్‌లో ఈ క్లబ్‌ని 1905లో నెలకొల్పారు. ఈ క్లబ్‌ని రష్యాకి చెందిన అబ్రామోవిచ్ అనే బిలియనీర్ 2003లో కొనుగోలు చేశాడు. అబ్రామోవిచ్ చేతికి వెళ్లిన తర్వాత ఈ క్లబ్ జాతకం మారిపోయింది. ఇంగ్లండ్ ఫుట్‌బాల్ క్లబ్లో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది. 19 ఏళ్ల కాలంలో అనేక లీగుల్లో సత్తా చాటింది. 19 ట్రోఫీలను గెలుచుకుంది. క్లబ్‌ను విజయ ప్రస్థానంలో నడిపించడంలో దాని ఓనర్ రష్యన్ బిలియనీర్ అబ్రామోవిచ్ మనసు పెట్టి పని చేశారు. అయితే ఉక్రెయిన్‌పై రష్యా ఏకపక్ష దాడులను నాటో సభ్య దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా, యూకేలు రష్యాపై గరంగరంగా ఉన్నాయి. వరుస పెట్టి రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నారు. తమ దేశంలో ఉన్న రష్యన్ దేశస్థుల ఖాతాలను స్థంభింపజేస్తున్నారు. పలు బ్యాంకులు రష్యన్ సంస్థలకు సంబంధించిన లావాదేవీలు ఆపేస్తున్నాయి. రష్యా దాడితో ఒక్కసారిగా ఆ దేశ బిలియనీర్లు జాతకం మారిపోయింది. వారి బ్యాంకు ఖాతాలు పని చేయడం లేదు. ముఖ్యంగా పుతిన్‌కి దగ్గర వాడిగా పేరున్న అబ్రామోవిచ్పై కఠిన చర్యలకు యూకే అథారిటీలు రెడీ అయ్యాయి. ఈ పరిస్థితుల్లో చెల్సియా క్లబ్‌ను విజయవంతంగా నడిపించడం కష్టమని అబ్రమోవిచ్ భావించారు. దీంతో చెల్సియా క్లబ్‌ని అమ్మేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆర్థిక సమస్యలు, ఆంక్షల ప్రభావం చెల్సియాపై పడకూడదనే ఉద్దేశంతోనే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, రష్యా దాడుల ప్రభావంతో ఒక్క సారిగా పరిస్థితులు మారిపోయాయని అబ్రామోవిచ్ అంటున్నారు. తాజా నిర్ణయం మనసుకు ఎంతో కష్టంగా ఉన్నా తప్పడం లేదంటూ వాపోతున్నారు. రష్యా అధ్యక్షుడికి సన్నిహంతా మెలుగుతూ ఇంత కాలం ప్రభను అనుభవించిన బిలియనీర్లు ఇప్పుడు కష్టాలు ఎదుర్కొంటున్నారు. రెండు రోజుల క్రితం స్పెయిన్‌లో రష్యాకు చెందిన ఆయుధాల సరఫరా వ్యాపారికి చెందిన రూ. 59 కోట్ల విలువైన అధునాతన యాచ్‌ని అందులో పని చేసే సిబ్బంది సముద్రంలో ముంచి వేసేందుకు ప్రయత్నించారు. రష్యా దాడులకు నిరసనగా ఆ యాచ్ మెయింటనెన్స్ పనులు చూస్తున్న ఉక్రెయిన్ ఇంజనీరు ఈ పని చేసినట్టు దర్యాప్తులో తేలింది. మొత్తంగా రష్యన్ బిలియనీర్లు ప్రపంచ వ్యాప్తంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. -
రహస్య ప్రదేశానికి పుతిన్ ఫ్యామిలీ
-
పుతిన్ పై విమర్శలు గుప్పించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
-
పుతిన్ మూడు డిమాండ్లు.. ఉక్రెయిన్ నో!
కీవ్: ప్రపంచ దేశాలు ఆసక్తిగా, ఆశగా ఎదురు చూస్తున్న రష్యా, ఉక్రెయిన్ చర్చలు సోమవారం అసంపూర్ణంగా ముగిశాయి. ఇరు దేశాల అధికారులు బెలారస్ సరిహద్దులోని గోమెల్లో సమావేశమయ్యారు. చర్చల్లో కీలక నిర్ణయాలేమీ జరగలేదు. మరోమారు సమావేశం కావాలని ఇరుపక్షాలు అంగీకరించాయని రష్యాకు చెందిన స్పుత్నిక్ మీడియా తెలిపింది. తమ దేశంతో పాటు క్రిమియా, డాన్బాస్ ప్రాంతాల నుంచి బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలని రష్యాను ఉక్రెయిన్ డిమాండ్ చేసిందని తెలిపింది. చర్చలు జరుగుతుండగానే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్ చర్చలు జరిపారు. ‘‘క్రిమియాపై రష్యా సార్వభౌమత్వాన్ని గుర్తించాలి. ఉక్రెయిన్ తటస్థ దేశంగా కొనసాగాలి. నాటో సభ్యత్వ డిమాండ్‌ను శాశ్వతంగా వదులుకోవాలి. అప్పుడే యుద్ధం ఆగుతుంది’’ అని స్పష్టం చేసినట్టు సమాచారం. చర్చలు రెండో దఫా చర్చలు పోలాండ్– బెలారస్ సరిహద్దుల్లో త్వరలో జరిగే అవకాశం ఉందని ఉక్రెయిన్ అధ్యక్ష సలహాదారు మైకోలియో పోడోలక్ చెప్పారు. పుతిన్‌కు ఆసక్తి లేదా? చర్చల్లో ఉక్రెయిన్ తరఫున రక్షణ మంత్రితో పాటు ఉన్నతాధికారులు పాల్గొనగా రష్యా నుంచి మాత్రం పుతిన్ సాంస్కృతిక సలహాదారుతో పాటు ఇతర అధికారులు వచ్చారు. దీంతో పుతిన్‌కు ఈ చర్చలపై ఆసక్తి పెద్దగా లేదని నిపుణులు భావిస్తున్నారు. చర్చించుకుందామంటూ తొలుత రష్యా చేసిన ప్రతిపాదించగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తిరస్కరించడం తెలిసిందే. చర్చలకు బయలుదేరడం మొదలు, అవి జరిగి, ఇరుపక్షాలూ వెనుదిరిగే దాకా బెలారస్లో విమానాలు, హెలికాప్టర్లు, క్షిపణలు ఏవీ ఎగరకుండా చూస్తామని అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో హామీ ఇవ్వడంతో గోమెల్లో చర్చలకు జెలెన్స్కీ అంగీకరించారు. తక్షణ పరిష్కారం లభించకున్నా ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఈ చర్చలు ఉపయోగపడతాయని దేశాలన్నీ ఆశిస్తున్నాయి. తగ్గిన రష్యా దూకుడు ఉక్రెయిన్ రాజధాని, ఇతర నగరాల్లోకి చొచ్చుకొస్తున్న రష్యా సేనల దూకుడు ఆదివారం కాస్త తగ్గింది. సంఖ్యలో తక్కువగా ఉన్నా, ఉక్రెయిన్ బలగాలు పలు చోట్ల సాధ్యమైనంతమేర రష్యా చొరబాటును అడ్డుకుంటున్నారు. ఉక్రెయిన్ ప్రతిఘటన, అంతర్జాతీయ కఠిన ఆంక్షల నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ‘అణు’ ఘంటికలు మోగించారు. దేశమంతా యుద్ధవాతావరణం నెలకొనడంతో వేలాది ఉక్రెయిన్ కుటుంబాలు పారిపోతున్నాయి. చాలామంది బంకర్లు, బేస్మెంట్లలో తలదాచుకుంటున్నారు. ఇప్పటివరకు యుద్ధంలో ఎంతమంది చనిపోయింది అధికారికంగా తెలియరాలేదు. 102 మంది పౌరులు మరణించారని, వందలాది మంది గాయపడ్డారని ఐరాస తెలిపింది. 352 మంది పౌరులు చనిపోయారని, వీరిలో 16మంది పిల్లలున్నారని జెలెన్స్కీ చెప్పారు. ఉక్రెయిన్‌కు ఆయుధాల సరఫరాను పాశ్చాత్య దేశాలు కొనసాగించాయి. కర్ఫ్యూ సడలించడంతో సోమవారం కీవ్‌లో సూపర్మార్కెట్ల వద్ద భారీ క్యూలు కనిపించాయి. సోమవారం నుంచి రష్యాకు తోడుగా బెలారస్ సైతం యుద్ధంలోకి బలగాలను పంపనుందని అమెరికా ఇంటిలిజెన్స్ వర్గాలు తెలిపాయి. రష్యా అనుకున్నదాని కన్నా ఆక్రమణ కష్టంగా, నెమ్మదిగా సాగుతోందని తెలిపాయి. ఉక్రెయిన్‌కు వెల్లువలా సాయం ఉక్రెయిన్‌కు సాయంగా స్టింగర్ మిస్సైళ్లను పంపుతామని జర్మనీ, అమెరికా ప్రకటించాయి. ఈయూ సైతం తొలిసారి ఒక దేశానికి ఆయుధాలు, మందుగుండు సరఫరా చేయనుంది. సోమవారం చర్చల కోసం ఈయూ రక్షణ మంత్రులు సమావేశం అవుతున్నారు. ఉక్రెయిన్‌కు అందే సాయాన్ని అడ్డుకోవడానికి రష్యా మార్గాలు వెతుకుతోంది. నాటో వర్గాలు రెచ్చగొడుతున్నాయంటూ ఆదివారం పుతిన్ చేసిన అణు హెచ్చరికలపై పాశ్చాత్య దేశాలు మండిపడ్డాయి. అవి కేవలం బెదిరింపులేనని భావిస్తున్నాయి. రష్యా ఏం చేస్తుందో.. కీవ్‌లోని పౌరులు సురక్షిత మార్గంలో నగరం వీడేందుకు అవకాశమిస్తామని రష్యా మిలటరీ ప్రకటించింది. దీంతో ఒక్కసారి నగరం వశమయ్యాక మిగిలిన పౌరులపై రష్యా విరుచుకుపడవచ్చన్న భయాలు పెరిగాయి. ప్రస్తుతం నగర రక్షణకు ముందుకు వస్తున్న ప్రతిఒక్కరికీ ఉక్రెయిన్ అధికారులు ఆయుధాలిస్తున్నారు. ఖార్కివ్‌తో పాటు చాలా నగరాల్లో రష్యా బలగాలను ఉక్రెయిన్ సేనలు ప్రతిఘటిస్తున్నాయి. దేశంలోని వైమానిక స్థావరాలన్నీ తమ అధీనంలోకి వచ్చాయని సోమవారం రష్యా సైనికులు ప్రకటించారు. దీనిలో నిజానిజాలపై యూఎస్ అనుమానం వ్యక్తం చేసింది. ఎవరేమన్నారు! చర్చలు ఐదు గంటలపాటు సాగాయి. ఉమ్మడి ప్రయోజనాలు కలిగించే కొన్ని విషయాలను ఇరు పక్షాలు గుర్తించాయి. మరో దఫా సమావేశమయ్యేందుకు అంగీకారం కుదిరింది. – రష్యా ప్రతినిధి వ్లాదిమిర్ మెడిన్ స్కీ కాల్పుల విరమణ అవకాశాలపై దృష్టి సారించాం. సమీప భవిష్యత్‌లో రెండో దఫా చర్చలు జరుగుతాయి. వీటిని పోలాండ్– బెలారస్ సరిహద్దుల్లో జరిపేందుకు అంగీకరించడం జరిగింది. – ఉక్రెయిన్ ప్రతినిధి మైఖైలో పొడోలైక్ -
బెలారస్ బార్డర్లో చర్చలు
కీవ్: సంక్షోభ నివారణకు రష్యా బృందంతో చర్చలకు సిద్ధమని ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం తెలిపింది. కీవ్ సమీపంలోకి రష్యా సేనలు వస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరు పక్షాలు బెలారస్ సరిహద్దులో ఏదో ఒక ప్రాంతంలో చర్చలు జరుపుతాయని జెలెన్స్కీ కార్యాలయం తెలిపింది. ఏ సమయంలో చర్చలు జరిగేది వెల్లడించలేదు. అంతకుముందు చర్చలకు బెలారస్‌లోని గోమెల్ నగరానికి తమ బృందం వెళ్లిందని రష్యా ఆదివారం తెలిపింది. నాటోలో చేరకపోవడం సహా కీలక డిమాండ్లపై చర్చలకు సిద్ధమని జెలెన్స్కీ శుక్రవారం ప్రకటించిన నేపథ్యంలో రష్యా ఈ బృందాన్ని పంపింది. అయితే బెలారస్లో చర్చలకు తాము సిద్ధం కాదని జెలెన్స్కీ చెప్పారు. తమపై మిస్సైల్ దాడులు చేస్తున్న భూభాగంపై చర్చలు అంగీకరించమని, వార్సా, బ్రటిస్లవా, బుడాపెస్ట్, ఇస్తాంబుల్, బకు తదితర నగరాల్లో ఎక్కడైనా చర్చలకు రెడీ అని తెలిపారు. చర్చలు నిజాయతీగా, యుద్ధాన్ని ముగించేలా ఉండాలన్నారు. అయితే గోమెల్ నగరం పేరును ఉక్రెయిన్ వర్గాలే ప్రతిపాదించాయని రష్యా చెప్పగా, అబద్ధమని జెలెన్స్కీ కొట్టిపారేశారు. చర్చలు ఆరంభమయ్యేవరకు మిలటరీ చర్య కొనసాగుతూనే ఉంటుందని రష్యా పేర్కొంది. అణుభయాలే కారణమా నాటో నేతల వ్యాఖ్యల నేపథ్యంలో దేనికైనా సిద్ధంగా ఉండాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ తమ అణు విభాగానికి ఆదేశాలిచ్చారు. దీంతో పరిస్థితి మరింత విషమిస్తుందన్న భయంతో చర్చలకు ఉక్రెయిన్ అంగీకరించినట్లు నిపుణులు భావిస్తున్నారు. చర్చలు ముగిసి, ఉక్రెయిన్ బృందం క్షేమంగా వెనుతిరిగేంతవరకు బెలారస్ గగనతలంలో విమానాలు, హెలికాప్టర్లు, మిస్సైళ్లు ప్రయాణించవని బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ హామీ ఇచ్చారని ఉక్రెయిన్ తెలిపింది. అందుకే చర్చలకు అంగీకరించామని చెప్పింది. -
ఉక్రెయిన్‌కు సాయం చేస్తాం.. రొమేనియా స్పందన ఇదే..
కీవ్: రష్యా సైనిక దాడుల కారణంగా ఉక్రెయిన్‌లో భయానక దృశ్యాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే భారీ సంఖ్యలో ఇరు దేశాల సైనికులు, పౌరులు మృత్యువాతపడ్డారు. ఎంతో మంది తీవ్రంగా గాయపడి ఆర్తనాదాలు చేస్తున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ వార్నింగ్‌తో యుద్దం సందర్బంగా ఇప్పటికే చాలా దేశాలు ఉక్రెయిన్‌కు హ్యాండ్ ఇచ్చాయి. దీంతో తాము ఒంటిరిగానే పోరు జరుపుతున్నామంటూ జెలెన్ స్కీ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌కు తాము అండగా నిలుస్తామంటూ రొమేనియా ముందుకు వచ్చింది. ఉక్రెయిన్‌కు అన్ని విధులుగా తాము సాయం అందిస్తామని రొమేనియా ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. ఉక్రెయిన్‌కు సరిహద్దు దేశంగా రొమేనియా ఉండటంతో తమ దేశంలోకి వచ్చిన ఉక్రెయిన్ మహిళలకు, పిల్లలకు సాయం అందిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌కు 3.3 మిలియన్ డాలర్ల విలువైన సహాయం అందించనున్నట్టు పేర్కొంది. అంతేకాకుండా చమురు, మంచి నీరు, ఆహరం, మిలిటరీ సామాగ్రి, బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లను అందజేస్తామని రొమేనియా ప్రభుత్వ ప్రతినిధి డాన్ కార్బునారు వెల్లడించారు. అంతేకాకుండా.. రష్యా దాడుల్లో గాయపడిన సైనికులకు, పౌరులకు వైద్య సాయం అందిస్తామన్నారు. సరిహద్దుల్లో గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించేందుకు అంబులెన్స్‌లను సిద్దం చేసినట్టు చెప్పారు. రెండు దేశాల సరిహద్దుల నుంచి చిన్న పిల్లలు, గర్భిణిలు, వృద్ధుల తరలింపు కోసం ప్రత్యేక బస్సులను, అంబులెన్స్‌లను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. -
ఈయూ ఆంక్షలు.. రష్యా సంచలన నిర్ణయం
మాస్కో: ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా ఇప్పటికే పలు దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. శుక్రవారం యూరోపియన్ యూనియన్ (ఈయూ) సైతం రష్యాపై కఠిన ఆంక్షలు విధించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, విదేశాంగ మంత్రి లావ్రోవ్ ఆస్తులను ఫ్రీజ్ చేస్తున్నట్టు ఈయూ ప్రకటించింది. ఈ ఆంక్షల నేపథ్యంలో రష్యా సంచలన నిర్ణయం తీసుకుంది. రష్యాలోని ఫ్రెంచ్ గయానా నుంచి అంతరిక్ష ప్రయోగాలను నిలిపివేస్తున్నట్లు శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు రష్యా అంతరిక్ష సంస్థ రోసోకాస్మోస్ డైరెక్టర్ జనరల్ డిమిత్రి రోగోజిన్ ట్విట్టర్ వేదికగా.. ఈయూ విధించిన ఆంక్షలకు ప్రతిస్పందనగా, రాకెట్ ప్రయోగాలకు సంబంధించి యూరప్‌లోని ఇతర భాగస్వామ్య దేశాలకు సహకారం నిలిపివేస్తున్నామని అన్నారు. ఫ్రెంచ్ గయానాలోని కౌరూ కాస్మోడ్రోమ్, రోసోకాస్మోస్ నుంచి రష్యా రాకెట్ ప్రయోగ సిబ్బందిని, సాంకేతిక నిపుణులను ఉపసంహరించుకున్నట్టు వెల్లడించారు. -
ఉక్రెయిన్‌పై వార్.. పుతిన్‌కు ఊహించని షాక్
Russia-Ukraine: ఉక్రెయిన్ రాజధాని కైవ్‌ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా బలగాలు హై స్పీడ్ వేగంతో దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా తీరుపై ఇప్పటికే ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఉక్రెయిన్‌పై సైనిక చర్యలకు దిగిన రష్యాపై ఐరోపా, అమెరికా సహా పలు ఆసియా పసిఫిక్ దేశాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా ఉక్రెయిన్‌పై సైనిక చర్యలకు దిగిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై యూరోపియన్ యూనియన్(ఈయూ) ఆంక్షలు విధించింది. పుతిన్, రష్యా విదేశాంగశాఖ మంత్రి లావ్రోవ్ ఆస్తులను ఫ్రీజ్ చేస్తున్నట్టు ఈయూ వెల్లడించింది. మరోవైపు ఉక్రెయిన్ అధికారులతో చర్చలకు పుతిన్ సిద్దంగా ఉన్నారని రష్యా అధ్యక్షుడి కార్యాలయం వెల్లడించింది. చర్చల కోసం బెలారస్ రాజధాని మిన్స్క్కు రష్యా ఓ బృందాన్ని పంపనున్నట్టు పేర్కొంది. European Union agrees to freeze European assets linked to Russian President Vladimir Putin and Foreign Minister Lavrov over Ukraine invasion, reports AFP — ANI (@ANI) February 25, 2022 -
Russia And Ukraine War:చైనా సడన్ ఎంట్రీ.. పుతిన్‌కు జిన్‌పింగ్ ఫోన్‌కాల్
మాస్కో: రష్యా సైనిక దాడుల కారణంగా ఉక్రెయిన్‌లో నరమేధం జరుగుతోంది. బాంబులు, మిస్సెల్స్‌తో రష్యా బలగాలు ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతున్నాయి. రెండవ రోజే ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను రష్యా బలగాలు చుట్టుముట్టాయి. తాజాగా.. ఉక్రెయిన్ పరిణామాలపై రష్యా విదేశాంగ మంత్రి కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్ సైన్యం పోరాటం ఆపితే చర్చలకు సిద్ధమని ప్రకటించారు. ఉక్రెయిన్ ఆర్మీ ఆయుధాల్ని వదలి లొంగిపోవాలని, అప్పుడే చర్చలు ముందుకెళ్తాయని ఆ ప్రకటనలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ వెల్లడించారు. ఈ ప్రకటన అనంతరం తాము కూడా చర్చలకు సిద్దంగా ఉన్నామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సైతం ప్రకటించారు. ఈ తరుణంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. శుక్రవారం చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్.. పుతిన్‌తో ఫోన్లో మాట్లాడినట్టు సమాచారం. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపేయాలని జిన్‌పింగ్ కోరినట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్‌తో చర్చలు జరపాలని పుతిన్‌ను జిన్‌పింగ్ కోరారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకొల్పేందుకు తాను సిద్ధమని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. దీంతో పుతిన్, జిన్‌పింగ్ మధ్య జరిగిన చర్చ ఆసక్తికరంగా మారింది. -
పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఉక్రెయిన్ అధ్యక్షుడి ఆవేదన ఇదే..
కైవ్: రష్యా ధాటికి ఉక్రెయిన్‌లో భయానక వాతావరణం చోటుచేసుకుంది. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ ప్రజలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. పుతిన్ సైన్యం అత్యాధునిక ఆయుధాలతో ఉక్రెయిన్ను లక్ష్యంగా చేసుకుని దాడులను కొనసాగిస్తోంది. రష్యా సైనిక దాడుల్లో 137 మంది ఉక్రెయిన్ సైనికులు వీర మరణం పొందారు. మరోవైపు రష్యాపై ప్రపంచ దేశాలు ఆంక్షలను విధిస్తున్నాయి. ఇదిలా ఉండగా శుక్రవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడియర్ జెలెన్స్కీ సోషల్ మీడియాలో తమ ఆవేదన వ్యక్తం చేశారు. రష్యాను ఎదుర్కొనేందుకు తాము ఒంటిరిగానే పోరాటం చేస్తున్నామని వెల్లడించారు. కానీ, మా దేశం నుండి రష్యా దళాలను వెనక్కి పంపడానికి మా బలం, బలగం సరిపోదు. దృఢమైన సంకల్పంతోనే అది సాధ్యమవుతుందని దేశ ప్రజలు, సైనికుల్లో ధైర్యం నింపారు. ప్రపంచ దేశాలన్నీ ఉక్రెయిన్‌లోని ఘటనలను గమనిస్తున్నాయని స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక కార్యకలాపాలను తగ్గించడానికి మాస్కోపై విధించిన ఆంక్షలు సరిపోవని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, రష్యా బలగాలు కైవ్‌ను సమీపిస్తున్నాయన్న తరుణంలో ఉక్రెయిన్ సైనికులు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీని ఓ బంకర్లో దాచిపెట్టారు. పుతిన్ హెచ్చరిక.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఉక్రెయిన్‌పై దాడులను కొనసాగిస్తూనే మరోసారి దాని మిత్ర దేశాలకు వార్నింగ్ ఇచ్చారు. ఉక్రెయిన్‌కు సపోర్ట్ చేస్తూ రష్యాకు వ్యతిరేకంగా ఏ దేశమైన చర్యలకు దిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఉక్రెయిన్ ప్రజలపై దాడి చేయడం తమ లక్ష్యం కాదని, తమ పౌరులను, సైనికులను రక్షించుకునేందుకే దాడులు చేస్తున్నట్టు పుతిన్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. యూకే, అమెరికా, కెనడా, యూరోపియన్ యూనియన్‌తో సహా అనేక దేశాలు ఉక్రెయిన్‌లో రష్యా సైనిక దాడులను ఖండించాయి. ఈ క్రమంలోనే రష్యాపై తీవ్ర ఆర్ధిక ఆంక్షలను సైతం విధించాయి. నాటో సభ్య దేశాల జోలికి వస్తే ఊరుకునేది లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. రష్యాను హెచ్చరించారు. -
పుతిన్‌కు ప్రధాని మోదీ ఫోన్ కాల్!.. యుద్ధం ఆగేనా..?
సాక్షి, న్యూఢిల్లీ: ఉక్రెయిన్-రష్యా సంక్షోభంపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఉక్రెయిన్ విషయంలో ప్రపంచ దేశాలు మాట్లాడకూడదని, జోక్యం చేసుకోకూడదని పుతిన్ అన్ని దేశాలకు ముక్కు సూటిగా చెప్పేశారు. ఇదిలా ఉండగా ఉక్రెయిన్‌లో రక్తపాతం సృష్టిస్తున్న సందర్బంగా గురువారం రాత్రి భారత ప్రధాని నరేంద్ర మోదీ.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడనున్నారన్న విషయం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ మారింది. కాగా, ఉక్రెయిన్‌పై రష్యా మరణాహోమాన్ని ఆపడానికి భారత ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని ఆ దేశ రాయబారి ఇగోర్ పోలిఖా.. ప్రధాని మోదీని అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో పుతిన్‌తో ప్రధాని మోదీ ఏం మాట్లాడుతారనే విషయం ఆసక్తికరంగా మారింది. మోదీ మాట్లాడిన తర్వాత ఎలాంటి పరిస్థితులు చోటుచేసుకుంటాయోనని అన్ని దేశాలు వేచి చూస్తున్నాయి. మరోవైపు.. ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో మోదీ లోక్ కల్యాణ్‌మార్గ్‌లోని ప్రధాని నివాసంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కీలక సమావేశానికి హోం శాఖ, రక్షణ, ఆర్థిక, విదేశాంగ శాఖల మంత్రులతో పాటు క్యాబినెట్ కార్యదర్శి, జాతీయ భద్రతా సలహాదారు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో భారతీయుల తరలింపు, ముడి చమురు ధరలపై దీని ఎఫెక్ట్‌పై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. -
దూకుడు పెంచిన రష్యా.. పుతిన్ తీరుపై ఫుల్ ఫైర్
మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా దూకుడు క్రమంగా ప్రత్యక్ష సైనిక ఆక్రమణగా మారుతోంది. ఈ పరిణామాలపై అమెరికా, యూరప్‌తో పాటు పలు ప్రపంచ దేశాలు మండిపడ్డాయి. అంతర్జాతీయ ఒప్పందాలను రష్యా అతిక్రమిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఐరాస భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమై, రష్యా చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు ప్రకటించింది. రష్యా చర్యలపై ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. తూర్పు ఉక్రెయిన్‌లోని ఈ సమస్యను మిన్స్క్ ఒప్పందానికి లోబడి శాంతియుతంగా పరిష్కరించుకోవాలని రష్యాకు సూచించారు. తన సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునేందుకు ఉక్రెయిన్ చేసే అన్ని ప్రయత్నాలకూ ఐరాస పూర్తి మద్దతిస్తుందని చెప్పారు. బలప్రయోగం ద్వారా ఏమైనా చేయొచ్చని పుతిన్ భావిస్తున్నారని, తన దుందుడుకు చర్యల ద్వారా అంతర్జాతీయ వ్యవస్థలనే సవాలు చేస్తున్నారని ఐరాసలో అమెరికా ప్రతినిధి లిండా థామస్ గ్రీన్‌ఫీల్డ్ విమర్శించారు. ఆయనకు గట్టిగా బదులివ్వాల్సిన సమయం వచ్చిందన్నారు. జర్మనీ, ఫ్రాన్స్, టర్కీ, డెన్మార్క్, ఫిన్లాండ్, బెల్జియం, ఆస్ట్రియా తదితర దేశాలన్నీ రష్యా చర్యను తీవ్రంగా తప్పుబట్టాయి. 15 దేశాలతో కూడిన భద్రతా మండలి ఉక్రెయిన్ సంక్షోభంపై భేటీ కావడం ఇటీవలి కాలంలో ఇది మూడోసారి. కాగా, రష్యాకు దగ్గరవుతున్న చైనా మాత్రం, సంక్షోభ నివారణకు మరిన్ని చర్చలు మేలంటూ ఆచితూచి స్పందించింది. (ఇది చదవండి: రష్యాకు షాకిచ్చిన అమెరికా.. బైడెన్ కీలక నిర్ణయం) -
తూర్పు ఉక్రెయిన్‌లోని వేర్పాటు ప్రాంతాలకు.. స్వతంత్ర హోదాకు రష్యా నిర్ణయం!
మాస్కో: ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగే ఆలోచన లేదంటూనే సంక్షోభాన్ని మరింత పెంచే చర్యలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ దిగుతున్నారు. తూర్పు ఉక్రెయిన్‌లో వేర్పాటువాదుల అదీనంలోని రెండు ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా గుర్తించాలని ఆయన నిర్ణయించారు. సోమవారం తన నేతృత్వంలోని ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ కౌన్సిల్‌ను సమావేశపరిచి ఈ విషయమై లోతుగా చర్చించారు. తర్వాత జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ దీనిపై మాట్లాడారు. దీనిపై ఉక్రెయిన్ తీవ్ర ఆందోళన వెలిబుచ్చింది. ఐరాస భద్రతా మండలిని తక్షణం సమావేశపరిచి రష్యా దూకుడుపై చర్చించాలని కోరింది. ఆ రెండు వేర్పాటువాద ప్రాంతాల్లో రష్యా అనుకూల రెబల్స్ ప్రభుత్వాలు నడుపుతున్నాయి. తమను స్వతంత్ర దేశాలుగా గుర్తించాలని, ఉక్రెయిన్ ఆక్రమణల బారినుంచి కాపాడి అన్నివిధాలా ఆదుకోవాలని రెబెల్స్ తాజాగా రష్యాను కోరారు. రష్యా పార్లమెంటు దిగువ సభ కూడా గత వారం పుతిన్‌కు ఆ మేరకు విజ్ఞప్తి చేసింది. -
అఫ్గాన్‌లో అమెరికా సాధించింది శూన్యం: పుతిన్
మాస్కో: అఫ్గానిస్తాన్‌లో 20 ఏళ్ల పాటు యుద్ధం చేసిన అమెరికా చివరకు సాధించింది శూన్యమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. అఫ్గాన్‌లో అమెరికా చర్యలు, కార్యకలాపాలను ఆయన తప్పుపట్టారు. అఫ్గాన్ ప్రజలకు నాగరికత నేర్పేందుకు, సంస్కరించేందుకు అమెరికా సైన్యం 20 సంవత్సరాలపాటు ప్రయత్నించిందని. సొంత నియమాలు, జీవన ప్రమాణాలను ప్రవేశపెట్టాలని చూసిందని చెప్పారు. చివరకు విషాదం, నష్టం మాత్రమే మిగిలాయని పేర్కొన్నారు. అనుకున్న ఫలితం రాలేదన్నారు. చదవండి : Siddharth Shukla: దిగ్ర్భాంతిలో బాలీవుడ్, టీవీ ఇండస్ట్రీ 20 ఏళ్ల సుదీర్ఘ యుద్ధం వల్ల అమెరికా కంటే అఫ్గాన్ ప్రజలకే ఎక్కువ నష్టం వాటిల్లిందని పుతిన్ వ్యాఖ్యానించారు. ఒకరిపై బయటి నుంచి ఏదో రుద్దడం అసాధ్యమని తేల్చిచెప్పారు. ఎవరికైనా ఏదైనా చేయాలనుకుంటే ముందుగా వారి చరిత్రను సమగ్రంగా తెలుసుకోవాలని, వారి సంస్కృతిని అలవర్చుకోవాలని, సంప్రదాయాలను గౌరవించాలని వెల్లడించారు. చదవండి : Afghanistan Crisis: కొరకరాని కొయ్యగా పంజ్‌షీర్.. కొత్త ప్రభుత్వం ఎప్పుడు? -
మానవాళికి మంచిరోజులు!
మాస్కో: కరోనా వైరస్ నిరోధానికి వ్యాక్సిన్‌ను తయారు చేసిన తొలిదేశంగా రష్యా రికార్డు సృష్టించినట్లు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మంగళవారం ప్రకటించారు. వైరస్ నిరోధానికి ఈ స్పుత్నిక్–5 టీకా అద్భుతంగా పనిచేస్తుందని స్థిరమైన రోగ నిరోధక స్పందనను కలగజేస్తుందని స్పష్టం చేసిన పుతిన్ ఇప్పటికే తన కుమార్తెల్లో ఒకరికి ఈ టీకా ఇచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వ సమావేశం ఒకదాంట్లో పుతిన్ మాట్లాడుతూ టీకా అభివృద్ధి ప్రపంచం మొత్తానికి ఓ ముఖ్యమైన ఘట్టమని అభివర్ణించారు. తన కుమార్తె తొలి దఫా టీకా వేసుకున్న తరువాత శరీర ఉష్ణోగ్రత 38 డిగ్రీ సెల్సియస్ వరకూ పెరిగిందని, ఒక రోజు తరువాత 37 డిగ్రీలకు చేరుకుందని ఆయన వివరించారు. (రష్యా వ్యాక్సిన్‌ను నమ్మలేమంటున్న సైంటిస్ట్‌లు!) రెండో డోస్ తరువాత కూడా ఉష్ణోగ్రత కొంత పెరిగినా ఆ తరువాత ఏ సమస్య లేదని, శరీరంలో యాంటీబాడీలు తగినంత ఉత్పత్తి అయినట్లు తెలిసిందని వివరించారు. సమీప భవిష్యత్తులోనే టీకాను పెద్ద ఎత్తున తయారు చేస్తామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ‘‘విదేశాల్లో టీకా కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా త్వరగా విజయం సాధించాలని కోరుకుంటున్నా. మార్కెట్లో బోలెడన్ని ఉత్పత్తులు అందుబాటులో రానున్నాయి’’అని పుతిన్ వ్యాఖ్యానించినట్లు స్పుత్నిక్ వార్తా సంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది. టీకాను అభివృద్ధి చేసిన గమలేయా రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌తోపాటు బిన్నోఫార్మ్ అనే కంపెనీలో వాణిజ్య ఉత్పత్తి జరుగుతుందని, చాలా దేశాలు టీకా సరఫరా కోసం సంప్రదిస్తున్నాయని రష్యా ఆరోగ్య మంత్రి మురాష్కో తెలిపారు. మానవాళి మొత్తం ఏకమై కరోనా మహమ్మారిపై చేస్తున్న యుద్ధం ముగింపునకు వస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కోవిడ్ రాకుండా నిలువరించే వ్యాక్సిన్‌ను తయారు చేయటంలో ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు నిమగ్నమై ఉండగా... తొలిసారి తాము ఆ ఘనతను సాధించినట్లు రష్యా ప్రకటించింది. తమ దేశంలో దీనికి తొలి టీకా అందుబాటులోకి వచ్చిందని తన కుమార్తెల్లో ఒకరికి దీన్ని ఇచ్చామని సాక్షాత్తూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. దీనిపై కొందరికి సందేహాలున్నా... వ్యాక్సిన్ ప్రయత్నాల్లో నిస్సందేహంగా ఇది ముందడుగేనని చెప్పొచ్చు. ప్రయోగ దశలపై అనుమానాలు రష్యాలోని గమలేయా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడిమియాలజీ అండ్ మైక్రోబయాలజీ కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు రెండు టీకాలను అభివృద్ధి చేసింది. వీటిని మానవులపై పరీక్షించేందుకు రష్యా ఏప్రిల్‌లో అనుమతులు జారీ చేసింది. అంతేకాకుండా.. టీకా ప్రయోగాలు వీలైనంత వేగంగా జరిగేందుకు ప్రభుత్వం సహకరించాలని, వేగంగా అనుమతులు జారీ చేయాలని పుతిన్ స్వయంగా ఆదేశాలు జారీ చేశారు. టీకా ప్రయోగాల కోసం 18 – 65 మధ్య వయస్కులను ఎన్నుకున్నారు. మహిళలు, పురుషులు ఇద్దరిపై ప్రయోగాలు జరిగాయి. తొలి దశలో భాగంగా 18 మందికి జూన్ 18న, రెండో దశలో 20 మంది కార్యకర్తలకు జూన్ 23న టీకాలు ఇచ్చారు. రెండు బృందాల్లోని కార్యకర్తల్లో కరోనా వైరస్ నిరోధానికి అవసరమైన ప్రతిస్పందన కనిపించింది. కొందరు తలనొప్పి, జ్వరం వంటి వాటితో ఇబ్బందిపడినప్పటికీ టీకా ప్రయోగించిన 24 గంటల్లో ఈ లక్షణాలన్నీ తగ్గిపోయాయని యూనివర్సిటీ తెలిపింది. కార్యకర్తలందరినీ 28 రోజులపాటు ఐసోలేషన్‌లో ఉంచారు. విడుదలైన తరువాత కూడా వైద్యులు వీరిని కనీసం ఆరునెలలపాటు పరిశీలిస్తారని తెలుస్తోంది. గమలేయా ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన ఈ టీకాను బర్డెంకో మిలిటరీ ఆసుపత్రిలోనూ పరీక్షించారు. గమలేయా డైరెక్టర్ అలెగ్జాండర్ గింట్స్‌బర్గ్ తెలిపిన ప్రకారం.. ఈ టీకాను రెండు డోసులుగా తీసుకుంటే రెండేళ్లపాటు కరోనా వైరస్ నుంచి రక్షణ లభిస్తుంది. ఒకే రకమైన జన్యువులను వేర్వేరు వాహకాల ద్వారా ఇవ్వడం వల్ల దీర్ఘకాలంలో మాత్రమే లభించే నిరోధకత వేగంగా సంక్రమిస్తుందని ఆయన అంటున్నారు. అయితే గమలేయా ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన టీకాలు రెండూ మానవ ప్రయోగాలన్నీ పూర్తి చేసుకున్నాయని రష్యా చెబుతుండగా.. డబ్ల్యూహెచ్ఓ మాత్రం వీటిని తొలిదశలో ఉన్న టీకాలుగా మాత్రమే చూపుతోంది. డబ్ల్యూహెచ్ఓ వెబ్సైట్లో కోవిడ్–19 టీకా ప్రయోగాలపై ఉన్న సమాచారం ప్రకారం చైనాకు చెందిన సైనోవాక్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ/ఆస్ట్రాజెనెకాల టీకాలు మాత్రమే మూడో దశ మానవ ప్రయోగాల దశకు చేరుకున్నాయి. టీకా విడుదలకు తమకు సమయం పడుతుందని ఈ సంస్థలు చెబుతున్నాయి. (20 దేశాల నుంచి బిలియన్ డోసులు ప్రి ఆర్డర్) -
గుడ్‌న్యూస్ : తొలి వ్యాక్సిన్ వచ్చేసింది!
మాస్కో : కరోనా వైరస్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచానికి రష్యా తీపికబురు అందించింది. ప్రపంచంలోనే తొలి కోవిడ్-19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ప్రకటించారు. ఈ వ్యాక్సిన్ కరోనా వైరస్‌ను సమర్ధవంతంగా నిరోధించే వ్యాధి నిరోధకతను కలిగిఉందని వ్యాక్సిన్‌ను ప్రారంభిస్తూ ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోనే తొలి కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను మంగళవారం ఉదయం రష్యా నమోదు చేసిందని మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌లో పుతిన్ వెల్లడించారు. వ్యాక్సిన్ పనితీరుపై తనకు సమాచారం అందించాలని ఆరోగ్య మంత్రి మైఖేల్ మురష్కోను ఆయన కోరారు. ఈ నెలలోనే కరోనా వ్యాక్సిన్‌ను ప్రజల ముందుకు తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించామని చెప్పారు. కొద్దివారాల్లోనే పెద్ద ఎత్తున వ్యాక్సిన్ ఉత్పత్తిని చేపట్టి లక్షలాది డోసులను సరఫరా చేస్తామని తెలిపారు. రష్యా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ను స్పుట్నిక్ వీగా వ్యవహరిస్తారు. కాగా పుతిన్ తన ఇద్దరు కుమార్తెల్లో ఒకరికి వ్యాక్సిన్ వేయించినట్టు ప్రకటించారు. వ్యాక్సిన్ అందించిన తర్వాత ఆమెలో కరోనా వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు దీటుగా పెరిగాయని చెప్పారు. తొలుత వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ చేపడతామని తెలిపారు. రష్యాకు చెందిన గామలేయా ఇనిస్టిట్యూట్ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా ఇప్పటివరకూ 2 కోట్లకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వెలుగుచూడగా 7.35 లక్షల మంది మహమ్మారి బారినపడి మరణించారు. కోటి 34 వేల మంది పైగా ఈ వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇక పలు దేశాల్లో కరోనా వైరస్ నిరోధానికి అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్లు వివిధ దశల్లో ఉన్నాయి. చదవండి : లిక్విడ్ బదులు జెల్ శానిటైజర్లు విక్రయించాలి -
రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని సంప్రదింపులు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్‌తో గురువారం ఫోన్లో సంప్రదింపులు జరిపారు. రెండవ ప్రపంచ యుద్ధంలో విజయం సాధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంతో పాటు, రష్యాలో రాజ్యాంగ సవరణలపై విజయవంతంగా ఓటింగ్‌ను పూర్తి చేసినందుకు అధ్యక్షుడు పుతిన్‌ను ప్రధాని అభినందించారు. భారత్-రష్యా ప్రజల మధ్య స్నేహానికి సంకేతంగా ఈ ఏడాది జూన్ 24 న మాస్కోలో జరిగిన సైనిక కవాతులో భారతీయ బృందం పాల్గొందని ప్రధాని గుర్తు చేశారు. కోవిడ్-19 ప్రతికూల ప్రభావాన్నఅధిగమించేందుకు ఇరు దేశాలు చేపట్టిన చర్యలను ఇరువురు నేతలు సమీక్షించారు. కోవిడ్-19 అనంతరం ప్రపంచానికి ఎదురయ్యే సవాళ్లను సంయుక్తంగా ఎదుర్కొనేందుకు ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు అవసరమని ఇరువురు నేతలు అంగీకరించారు. ఈ ఏడాది చివరిలో భారత్‌లో జరిగే వార్షిక ద్వైపాక్షిక సదస్సుకు ద్వైపాక్షిక సంప్రదింపులను ముమ్మరం చేయాలని నిర్ణయించారు. ద్వైపాక్షిక సదస్సుకు భారత్‌కు రావాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ప్రధాని మోదీ ఆహ్వానించారు. తనకు ఫోన్ చేసిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపిన పుతిన్ అన్ని రంగాల్లో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగాస్వామ్యాన్ని పటిష్టం చేసేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. (చదవండి : పుతిన్ రక్షణకు భారీ టన్నెల్ ఏర్పాటు) -
మధ్యవర్తిత్వాన్ని వ్యతిరేకించిన మోదీ
మాస్కో: భారత్, రష్యా దేశాలు మధ్యవర్తిత్వానికి వ్యతిరేకమని నరేంద్ర మోదీ అన్నారు. బుధవారం మాస్కో పర్యటనలో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కలిసిన సందర్భంగా మోదీ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ మాట్లాడుతూ తమ దేశ అంతర్గత సమస్యలను తామే పరిష్కరించుకుంటామని వేరే దేశాల ప్రమేయం అవసరం లేదని తెలిపారు. మోదీ సర్కారు తీసుకున్న ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, భారత రాజ్యాంగానికి అనుగుణంగానే జరిగిందని రష్యా అధికార వర్గాలు తెలిపాయి. పుతిన్ మాట్లాడుతూ భారత్, రష్యా మధ్య 15 రంగాలకు సంబంధించిన ఒప్పందాలు జరిగాయని పేర్కొన్నారు. వీటిలో ముఖ్యంగా వాణిజ్యం, ఇందనం, రక్షణ రంగంలో ఇరుదేశాలు పరస్పర సహకారంతో ముందుకెళ్తాయని వెల్లడించారు. తమిళనాడులోని కుడుంకుళం అణుఒప్పందం ద్వారా 3.3 మిలియన్ల ఇంధనాన్ని భారత్‌కు సరఫరా చేశామని పుతిన్ గుర్తుచేశారు. రష్యా అత్యున్నత పౌరపురస్కారానికి ఎంపిక చేసినందుకుగాను పుతిన్‌కు మోదీ కృతజతలు తెలిపారు. ఇది యావత్ భారత్దేశం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. -
మోదీకి గేట్స్ ఫౌండేషన్ అవార్డు
న్యూయార్క్: ప్రధాని మోదీ ప్రతిష్టాత్మక ‘గ్లోబల్ గోల్‌కీపర్’ అవార్డుకు ఎంపికయ్యారు. పారిశుద్ధ్య పరిస్థితిని మెరుగుపరిచే లక్ష్యంతో మోదీ ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమానికి గుర్తింపుగా మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ ఆయన సతీమణి మెలిండాల పేరుతో ఏర్పాటైన ట్రస్ట్ బెల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఈ అవార్డును అందజేయనుంది. ఈ నెల 24న బ్లూమ్‌బర్గ్ గ్లోబల్ బిజినెస్ ఫోరమ్ వేదికగా జరగనున్న ఓ కార్యక్రమంలో మోదీ ఈ అవార్డు అందుకోనున్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో పాల్గొనేందుకు ప్రధాని త్వరలో అమెరికా వెళ్లనున్న సంగతి తెలిసిందే. ప్రపంచ సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో పరిష్కరించే ప్రయత్నాలు చేపట్టిన రాజకీయ నేతలకు గుర్తింపుగా ఈ అవార్డు ఇస్తున్నట్లు ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. జాతిపిత మహాత్మాగాంధీ 150వ జన్మదినోత్సవం నాటికి దేశానికి బహిరంగ మలవిసర్జన రహితం చేయాలన్న లక్ష్యంతో మొదలైన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే తొమ్మిది కోట్ల మరుగుదొడ్లను నిర్మించిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం దేశంలో 98 శాతం గ్రామాలు బహిరంగ మలవిసర్జన రహితయ్యాయి. నాలుగేళ్ల క్రితం ఈ సంఖ్య కేవలం 38. గాంధీ పార్కు ఆవిష్కరణ? గాంధీజీ 150వ జయంతి సందర్భంగా ఏర్పాటైన ‘గాంధీ పీస్ గార్డెన్’ను మోదీ ప్రారంభించనున్నారు. న్యూయార్క్‌లోని భారతీయ కాన్సులేట్ జనరల్, లాంగ్ ఐలాండ్ కేంద్రంగా పనిచేస్తున్న శాంతి ఫండ్, న్యూయార్క్ స్టేట్ యూనివర్శిటీలు కలిసికట్టుగా నాటే 150 మొక్కలు ఈ పార్కులో ఉంటాయి. పార్కులో తమకిష్టమైన వారి జ్ఞాపకార్థం మొక్కలు పెంచుకోవచ్చు. 2014 ఎన్నికల తరువాత మోదీ తొలిసారి ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రసంగించగా.. రెండోసారి గెలిచాక మరోసారి ఈ చాన్సు వచ్చింది. రష్యాతో సంబంధాలను విస్తరిస్తాం వ్లాడివోస్టోక్/న్యూఢిల్లీ: రష్యాలోని వ్లాడివో స్టోక్‌లో జరిగే ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం (ఈఈఎఫ్) సదస్సు సందర్భంగా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్‌తో పరస్పర ఆసక్తిగల ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించనున్నట్లు మోదీ తెలిపారు. అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానంపై ఈ నెల 4వ తేదీన వ్లాడివోస్టోక్ చేరుకోనున్న ప్రధాని ఈఈఎఫ్ 5వ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. అక్కడే జరిగే భారత్–రష్యా 20వ వార్షిక భేటీలోనూ పాల్గొననున్నారు. ఈ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరిం చడంతోపాటు, బలోపేతం చేసుకోవాలన్న రెండు దేశాల ఆకాంక్షలకు అనుగుణంగా తన పర్యటన కొనసాగుతుందన్నారు.. సృజనాత్మకత పెంచుకోండి: ఉపాధ్యాయులకు ప్రధాని సూచన సృజనాత్మకత, ఆవిష్కరణలపై ఆసక్తిని పెంచుకుని సాంకేతికతను బోధనలో ఉపయోగించుకోవాలని మోదీ ఉపాధ్యాయులను కోరారు. ఢిల్లీలో తనను కలిసిన జాతీయ అవార్డు గ్రహీతలైన ఉపాధ్యాయులనుదేశించి ప్రధాని మాట్లాడారు. ఆవిష్కరణలకు అవసరమైన వాతావరణం కల్పించేందుకు తమ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వారికి ఆయన వివరించారు. -
సికింద్రాబాద్ టు నాగ్‌పూర్... సెమీ హైస్పీడ్ కారిడార్‌కు ఓకే!
సాక్షి, హైదరాబాద్: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సెమీ హైస్పీడ్ రైలు భాగ్యం హైదరాబాద్‌కు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. సికింద్రాబాద్–నాగ్‌పూర్ మధ్య ఈ రైలు పరుగుపెట్టే అవకాశం కనిపిస్తోంది. దాదాపు మూడేళ్ల క్రితం ఈ కారిడార్ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసిన రష్యా రైల్వే కంపెనీ తాజాగా ఈ కారిడార్‌లో 180 కి.మీ. వేగంతో రైళ్ల ప్రయాణం సాధ్యమేనని తేలుస్తూ త్వరలో నివేదిక సమర్పించనుంది. అలాగే ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు సిద్ధమని రష్యన్ రైల్వే సమ్మతి వ్యక్తం చేసినట్టు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ కిర్గిస్తాన్ పర్యటనలో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జరిపిన ద్వైపాక్షిక చర్చల్లో ఈ అంశం చర్చకు వచ్చినట్లు రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి. భారత్‌లో సెమీ హైస్పీడ్ ప్రాజెక్టు చేపడుతున్నందుకు సంతోషంగా ఉందని స్వయంగా పుతిన్ ప్రస్తావించినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. సగానికి తగ్గనున్న సమయం... సికింద్రాబాద్–నాగ్‌పూర్ మధ్య దూరం 584 కి.మీ. ఇంత దూరం ప్రయాణానికి ప్రస్తుతం ఎక్స్‌ప్రెస్‌లకు దాదాపు 9 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం పరుగుపెడుతున్న సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ల గరిష్ట వేగం గంటకు 120 కి.మీ., కానీ రైళ్ల ట్రాఫిక్, ట్రాక్‌ల పరిస్థితి, సిగ్నలింగ్ వ్యవస్థ వల్ల అవి సగటున 75 కి.మీ. వేగాన్ని మించడంలేదు. దీంతో ప్రధాన కారిడార్లలో సెమీ హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టాలని దాదాపు నాలుగేళ్ల క్రితం రైల్వేశాఖ నిర్ణయించింది. బుల్లెట్ రైలు ఇప్పట్లో సాధ్యం కానందున గంటకు 200 కి.మీ. వేగంతో ప్రయాణించేలా సెమీ బుల్లెట్ రైళ్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం తొలుత ఐదు కారిడార్లను ఎంపిక చేసింది. వాటిలో అంత వేగంగా రైళ్ల ప్రయాణం సాధ్యమా కాదా అని తేల్చేందుకు వివిధ దేశాలకు చెందిన కంపెనీలకు బాధ్యత అప్పగించింది. ఇందులో భాగంగా ఢిల్లీ–చండీగఢ్ సెక్షన్‌ను ఫ్రెంచ్ కంపెనీకి, చెన్నై–కాజీపేట మార్గాన్ని జర్మన్ కంపెనీకి, చెన్నై–బెంగళూరు–మైసూరు మార్గాన్ని చైనా కంపెనీకి, ఢిల్లీ–జైపూర్ మార్గాన్ని ఇటలీ కంపెనీకి అప్పగించాలని నిర్ణయించింది. 2016లో గోవాలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మోదీ జరిపిన ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా సికింద్రాబాద్–నాగ్‌పూర్ మార్గాన్ని రష్యా రైల్వే కంపెనీకి అప్పగించాలని నిర్ణయించారు. ఆ మేరకు అదే సంవత్సరం రష్యన్ రైల్వేస్‌కు సంబంధించి భారత్‌లో ఉన్న విభాగం అధిపతి వ్లాదిమీర్ ఎ ఫినోవ్... భారత రైల్వే బోర్డు యంత్రాంగంతో చర్చలు జరిపారు. అందులో తీసుకున్న నిర్ణయం ఆధారంగా అలెగ్జాండర్ కులాగిన్ ఆధ్వర్యంలోని 12 మంది ఇంజనీరింగ్ నిపుణులతో కూడిన రష్యన్ రైల్వేస్ ప్రతినిధి బృందం హైదరాబాద్ వచ్చింది. స్థానిక రైల్వే అధికారులతో కలసి ప్రత్యేక రైలులో సికింద్రాబాద్ స్టేషన్ నుంచి నాగ్‌పూర్ వరకు పరిశీలిస్తూ ప్రయాణించింది. గంటకు 200 కి.మీ. వేగంతో రైలు దూసుకెళ్లాలంటే ప్రస్తుత ట్రాక్‌లో చేయాల్సిన మార్పులను గుర్తించింది. ఆ తర్వాత మరో బృందం 2017 డిసెంబర్లో నాగ్‌పూర్‌కు వెళ్లి అక్కడి నుంచి సికింద్రాబాద్ వరకు ప్రయాణిస్తూ అధ్యయనం చేసింది. కానీ ఇప్పటివరకు నివేదిక సమర్పించలేదు. దీంతో ఈ కారిడార్ ప్రతిపాదన అటకెక్కినట్టేనన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ తాజాగా ప్రధాని మోదీతో రష్యా అధ్యక్షుడు పుతిన్ జరిపిన చర్చల్లో ఈ అంశం ప్రస్తావనకు రావడంతో అది సాకారమయ్యే అవకాశం ఉందని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. ఇది సాకారమైతే రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం సగానికి సగం తగ్గిపోతుంది. దాదాపు నాలుగు గంటల్లోనే గమ్యం చేరే అవకాశం ఉంటుంది. ఫలితంగా హైదరాబాద్–ఢిల్లీ ప్రయాణ సమయం కూడా తగ్గనుంది. ఆ మేరకు వీలుగా ట్రాక్‌ను పూర్తిస్థాయిలో పటిష్టం చేస్తారు. నివేదిక సమర్పించిన తర్వాత అంచనా వ్యయం విలువ తెలుస్తుంది. వేగంగా మూడో లైన్ పనులు.... కాజీపేట–బల్లార్షా మార్గం అత్యంత కీలకమైనది కావడంతో ఈ కారిడార్‌లో ప్రయాణించే రైళ్ల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో రైళ్ల వేగం మందగించింది. ఈ మార్గం బొగ్గు వ్యాగన్లు ప్రయాణించేది కావడం, బొగ్గు సరఫరాకు ప్రాధాన్యం ఉండటంతో ఈ మార్గంలో వాటి కోసం ఎక్స్‌ప్రెస్ రైళ్లను కూడా నిలిపేస్తున్నారు. దీంతో ప్రయాణికుల రైళ్ల ప్రయాణంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ కారిడార్‌లో మూడో మార్గం నిర్మించాలని రైల్వేశాఖ గతంలో నిర్ణయించి ప్రయారిటీ ప్రాజెక్టుగా గుర్తించింది. ఫలితంగా పనులు వేగంగా సాగుతున్నాయి. కాజీపేట నుంచి మంచిర్యాల మధ్య దాదాపు పని పూర్తయింది. మంచిర్యాల, పెద్దంపేట, రామగుండం, మందమర్రి సెక్షన్లో పనులు చివరి దశకు వచ్చాయి. సిర్పూర్ కాగజ్‌నగర్–మాకుడి మధ్య 29 కి.మీ. మార్గంలో ఫారెస్ట్ క్లియరెన్స్ కోసం పెండింగ్‌లో పడ్డాయి. రాఘవాపురం–పొత్కపల్లి మధ్య 31 కి.మీ. మార్గం, బిజ్గర్ షరీఫ్–ఉప్పల్ మధ్య 18 కి.మీ. మార్గంలో ఇటీవలి వరకు భూసేకరణ జరగక నిలిచిపోయిన పనులు ఇప్పుడు పూర్తి కావొచ్చాయి. ప్రస్తుతం బీరూరు–మాణిక్‌ఘర్ పనులు జరుగుతున్నాయి. హైస్పీడ్ కారిడార్ కావాలంటే ఆ మార్గంలో గూడ్సు రైళ్లు తిరగొద్దని రష్యన్ ఇంజనీర్లు గతంలో పేర్కొన్నారు. ఇప్పుడు మూడో కారిడార్ అందుబాటులోకి వస్తే ఆ సమస్య కూడా దాదాపు పరిష్కారమవుతుంది. భవిష్యత్తులో నాలుగో లైన్ కూడా నిర్మించనున్నారు. రైల్–19 వస్తుందా...? వందే భారత్ ఎక్స్‌ప్రెస్... భారతీయ రైల్వేలో నవశకానికి నాంది పలికింది. ఇంజిన్ లేని ఈ రైలు అభివృద్ధి చెందిన దేశాల వేగవంతమైన రైళ్లను తలపిస్తోంది. గంటకు 180 కి.మీ. వేగంతో దూసుకుపోతోంది. రైల్–18 పేరిట మొదలైన ఈ రైళ్ల తదుపరి వెర్షన్ రైల్–19 (2019)గా రాబోతోంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పూర్తిగా సీటింగ్‌కే పరిమితం కాగా కొత్త వెర్షన్లో స్లీపర్ కోచ్‌లు ఉంటాయి. ఈ సంవత్సరమే పట్టాలెక్కే ఈ రైళ్లు సెమీ హైస్పీడ్ రైళ్లుగా నిలుస్తున్నాయి. మరి సికింద్రాబాద్–నాగ్‌పూర్ సెమీ హైస్పీడ్ కారిడార్‌లో వీటినే ప్రవేశపెడతారా లేక అధునాతన కొత్త రైళ్లను ప్రారంభిస్తారా అన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. -
ట్రంప్‌ను కాదని ట్రయంఫ్ ఒప్పందం...!
భారత్–రష్యా ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక అధ్యాయానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన శ్రీకారం చుట్టబోతోంది. రష్యాతో ఎస్–400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థ కొనుగోలు (ఐదు వ్యవస్థల కొనుగోలుకయ్యే వ్యయ ఒప్పందం దాదాపు రూ.50 వేల కోట్లు–550 కోట్ల డాలర్లు) కుదుర్చుకుంటే భారత్‌కు ఆంక్షలు తప్పవన్న అమెరికా తాజా హెచ్చరికల నేపథ్యంలో దీనికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఈ పర్యటనలో భాగంగా ఇరుదేశాల మధ్య కీలకాంశాలపై చర్చ జరిగినా క్షిపణి వ్యవస్థల కొనుగోలు ఒప్పందమే కీలకంగా మారనుంది. అయితే పుతిన్ పర్యటన భారత రక్షణరంగానికే పరిమితం కాకుండా అంతరిక్ష, ఇంధన రంగాల్లో పరస్పరసహకారానికి ఉపయోగపడనుంది. ఏమిటీ ఆంక్షలు ? 2014లో ఉక్రెయిన్ నుంచి క్రిమియాను హస్తగతం చేసుకోవడం, సిరియా అంతర్యుద్ధంలో ప్రమేయం, 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యంపై పుతిన్‌ను శిక్షించేందుకు కాట్సా (కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్‌సిరీస్ థ్రూ శాంక్షన్స్ యాక్ట్ ) చట్టాన్ని గత ఆగస్టులో అమెరికా ఆమోదించింది. రష్యాతో రక్షణ, నిఘారంగాల్లో వ్యాపారం చేసే దేశాలపై ఆటోమెటిక్‌గా ఆంక్షలు విధించేందుకు ఈ చట్టం వీలు కల్పిస్తుందని గతంలోనే అమెరికా హెచ్చరించింది. ఆంక్షలు విధించేలా రష్యాతో లావాదేవీలు నెరపొద్దంటూ తన మిత్రదేశాలు, భాగస్వామ్యపక్షాలకు గతంలోనే అగ్రరాజ్యం విజ్ఞప్తి చేసింది. కాట్సా సెక్షన్ 23 పరిధిలోకి ఎస్–400 క్షిపణి రక్షణ వ్యవస్థతో సహా ఇతర అంశాలు వస్తాయని స్పష్టంచేసింది. రష్యా నుంచి చైనా వివిధ సైనిక ఉత్పత్తులు, ఎస్–400 వ్యవస్థను కొనుగోలు చేసినందుకు అమెరికా గత నెలలోనే ఆంక్షలు విధించింది. నాటో కూటమి మిత్రపక్షం టర్కీ కూడా రష్యా నుంచి క్షిపణి వ్యవస్థ కొనుగోలు చేయాలని నిర్ణయించడంపై అమెరికా గుర్రుగా ఉంది. మినహాయింపుపై భారత్ ఆశాభావం..! ప్రస్తుతం అమెరికా–రష్యా అంతర్గత పోరులో భారత్ చిక్కుకుంది. ఈ ఒప్పందం విషయంలో ఏదో ఒక రూపంలో అమెరికా ప్రభుత్వం నుంచి ఉపశమనం లభిస్తుందనే ఆశాభావంతో భారత్ ఉంది. రష్యాతో భారత్‌కు దీర్ఘకాలిక సైనిక సంబంధాలున్న విషయాన్ని గుర్తుచేస్తూ ఎస్–400 వ్యవస్థపై ఇప్పటికే పలుపర్యాయాలు చర్చలు సాగిన నేపథ్యంలో ప్రస్తుతం తుదిదశకు చేరుకుందని రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అమెరికా–సోవియట్ ప్రచ్ఛన్నయుద్ధ కాలంలో 80 శాతానికి పైగా సైనిక పరికరాలు రష్యా నుంచే భారత్‌కు వచ్చాయి. ఆ తర్వాత మారిన పరిస్థితుల్లో అమెరికా అతి పెద్ద ఆయుధాల సరఫరాదారుల్లో ఒకటిగా (గత పదేళ్లలో 1,500 కోట్ల డాలర్ల విలువైన ఒప్పందాలతో) నిలుస్తోంది. తమ ఆయుధాల దిగుమతిలో ముందువరసలో ఉన్న భారత్‌పై అమెరికా కఠినమైన ఆంక్షలు విధించకపోవచ్చుననే అభిప్రాయంతో మనదేశం అధికారులున్నారు. క్షిపణి వ్యవస్థల కొనుగోలు విషయంలో ‘ప్రత్యేక మాఫీ’ లేదా ఆంక్షల నుంచి మినహాయింపు ఇవ్వాలని అమెరికాను భారత్ కోరనున్నట్టు తెలుస్తోంది. పాకిస్తాన్‌పై పైచేయి.. ఈ క్షిపణి వ్యవస్థలతో మన రక్షణరంగం పాకిస్తాన్‌పై పైచేయి సాధించడంతో పాటు చైనాతో (ఈ దేశం ఇప్పటికే ఈ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది) సరిసమానంగా నిలిచేందుకు దోహదపడుతుంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలోనే ఈ ఒప్పందం ఖరారైతే వచ్చే రెండేళ్లలో మొదటి క్షిపణి వ్యవస్థ, నాలుగున్నరేళ్లలో మొత్తం అయిదు వ్యవస్థలు మనకు అందుబాటులోకి వస్తాయి. ఎస్–400 సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ (సామ్) వ్యవస్థలోని కమాండ్ పోస్ట్‌లో యుద్ధ నిర్వహణ పద్ధతులు, క్షిపణి ప్రయోగం, రాడార్ ద్వారా శత్రు దేశాల క్షిపణులు, విమానాలు, ఇతర యుద్ధ ప్రయోగాలను పసిగట్టి, వాటిని ఛేదించే ఏర్పాట్లున్నాయి. ఈ క్షిపణి వ్యవస్థలను అన్ని ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా లాంఛర్ వాహనాలపై వీటిని ఏర్పాటు చేస్తారు. ఈ క్షిపణి వ్యవస్థ సులువుగా ఎక్కడికైనా తరలించేందుకు వీలుగా ఉండడంతో యుద్ధమొచ్చినప్పుడు ఏ నగరాన్నయినా వైమానికదాడుల నుంచి కాపాడుకునేందుకు ఉపయోగపడుతుంది. పాకిస్తాన్ తక్కువ దూరం (షార్ట్ రేంజ్) నుంచి ప్రయోగించే నాసర్(హతఫ్–9) అణు క్షిపణిని నిరోధించేందుకు ఈ ఎస్–400 ఉపకరిస్తుంది. ప్రత్యేకతలేంటీ ? రష్యా అల్మాజ్ యాంటే సంస్థ ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థలను రూపొందించింది. ఒక్కో వ్యవస్థలో రెండు రాడార్లు, మిస్సైల్ లాంఛర్లు, కమాండ్ పోస్టులుంటాయి. ఒక్కో రాడార్ 100 నుంచి 300 లక్ష్యాలను ఏకకాలంలో గుర్తించగలదు. ఈ వ్యవస్థ దాదాపు 600 కి.మీ దూరం నుంచే శత్రు క్షిపణులు, ఇతర ప్రయోగాల జాడను కనిపెడుతుంది. 400 కి.మీ పరిధి నుంచే 36 లక్ష్యాలను ఏకకాలంలో ఛేదించగలదు. పాకిస్తాన్‌లోని అన్ని వైమానిక స్థావరాలు, టిబెట్‌లోని చైనా స్థావరాలు దీని పరిధిలోకి వస్తాయి. శత్రుదేశాల నుంచి భిన్న పరిధుల్లో వచ్చే క్షిపణులు, ఇతర ప్రయోగాలను ఇందులోని సూపర్సోనిక్, హైపర్సోనిక్ మిసైల్స్ అడ్డుకుంటాయి. -
పుతిన్‌కు చైనా పురస్కారం
బీజింగ్ /క్వింగ్డావ్: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ శుక్రవారం బీజింగ్‌లోని గ్రేట్‌హాల్ ఆఫ్ పీపుల్ భవనంలో రష్యా అధినేత పుతిన్‌కు చైనా అత్యున్నత పురస్కారమైన ‘ఫ్రెండ్షిప్ మెడల్’ను అందజేశారు. ఈ మెడల్‌ను చైనా ప్రదానం చేయడం ఇదే తొలిసారి. శాంతియుతమైన ప్రపంచం కోసం పుతిన్ చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డును అందజేశారు. చైనాలో పుతిన్‌కు అత్యంత గౌరవముందని వ్యాఖ్యానించారు. గతేడాది రష్యాలో పర్యటించిన జిన్‌పింగ్‌ను ‘ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ’ పురస్కారంతో పుతిన్ గౌరవించారు. ఎస్సీవో సదస్సులో పాల్గొనేందుకు పుతిన్ బీజింగ్‌కు వచ్చిన నేపథ్యంలో అమెరికా దూకుడును కట్టడి చేసేందుకు ఇరుదేశాధినేతలు ఈ సమావేశంలో ఓ అంగీకారానికి వచ్చే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. నేటి నుంచి ఎన్సీవో సదస్సు ప్రారంభం చైనాలోని క్వింగ్డావ్లో శనివారం ప్రారంభంకానున్న షాంఘై సహకార సంస్థ(ఎస్సీవో) సదస్సుకు సర్వం సిద్ధమైంది. ఈ సదస్సులో భారత్, చైనా, రష్యా సహా 8 దేశాల అధినేతలు హాజరై ఉగ్రవాదంపై పోరుతో పాటు పలు అంతర్జాతీయ అంశాలపై చర్చించనున్నారు. జూన్ 9 నుంచి రెండ్రోజుల పాటు ఎస్సీవో సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు హాజరుకానున్న ప్రధాని మోదీ.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో శనివారం భేటీ కానున్నారు. ఈ విషయమై ప్రధాని మోదీ స్పందిస్తూ..‘ సదస్సులో వేర్వేరు దేశాధినేతలతో భేటీ అయి పలు అంశాలపై విస్తృతంగా చర్చింనున్నాం’ అని ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. అయితే ప్రధాని పాక్ అధ్యక్షుడితో భేటీ అవుతారా? అన్న విషయమై స్పష్టత రాలేదు. ఇరాన్ అణు ఒప్పందం నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలగడంతో పాటు చైనా ఉత్పత్తులపై భారీ సుంకాలు, రష్యాపై యూరప్ దేశాలతో కలసి దౌత్యపరమైన ఆంక్షలు విధించిన నేపథ్యంలో జరగనున్న ఈ భేటీకి విశేష ప్రాధాన్యం ఏర్పడింది. -
500 అమెరికా క్షిపణులతో వచ్చినా...
మాస్కో : అణ్వాయుధ దేశాల మధ్య పోటీ తీవ్రతరమవుతోంది. ఒక దేశానికి మించి మరొక దేశం అత్యాధునిక ఆయుధాలను తయారు చేస్తున్నాయి.అగ్రదేశాల మధ్య ఈ పోటీ మరింత తీవ్రంగా ఉంది. తాజాగా రష్యా సర్మట్ ఖండాంతర క్షిపణిని రెండోసారి పరీక్షించింది. ఈ ప్రయోగం ద్వారా తాము అనుకున్న లక్ష్యాన్ని క్షిపణి చేరుకున్నట్లు రష్యా రక్షణ శాఖ మంత్రి ఓ ప్రకటనలో తెలిపారు. ఒక్క సర్మట్ క్షిపణిని అడ్డుకోవడానికి 500 అమెరికా ఏబీఎస్ క్షిపణులు అవసరమని ఆయన పేర్కొన్నారు. ఏకకాలంలో 10 టన్నుల పేలోడ్(సాధరణ, అణు పదార్థాలు)ను సర్మట్ మోసుకెళ్లగలదని వివరించారు. ప్రయోగం అనంతరం దాదాపు 20 మాక్‌ల వేగాన్ని(ధ్వని వేగానికి 20 రెట్లు) ఒక సెకన్ కాలంలో అందుకుంటుందని చెప్పారు. దేశ రక్షణకు 2021 నుంచి సర్మట్ అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. -
రష్యన్ల అనూహ్య మరణాలు.. పుతిన్ బాధ్యుడా?
హైదరాబాద్ : రష్యా మాజీ గూఢచారి సెర్జీ స్క్రీపాల్ హత్యకు రసాయన ఆయుధంతో చేసిన ప్రయత్నానికి నిరసనగా అమెరికా సహా అనేక పాశ్చాత్య దేశాల్లో గూఢచారులుగా పనిచేస్తున్నారనే ఆరోపణలపై 100మందికి పైగా రష్యా దౌత్యవేత్తలను బహిష్కరించారు. ఈ నెల 4న దక్షిణ ఇంగ్లండ్‌లోని శాలిస్బరీలో స్క్రీపాల్(66), ఆయన కూతురు యూలియా(33)ను ‘నోవిచోక్’ అనే విషపదార్థంతో చంపడానికి రష్యన్లు ప్రయత్నించగా వారిద్దరూ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. నరాలపై పని చేసే కొన్ని విష పదార్థాల్లో ఒకటైన నోవిచోక్ వంటి రసాయనాలను రష్యా తన శత్రువులను, అసమ్మతి వాదులను తుద ముట్టించడానికి వినియోస్తోందని చాలాకాలంగా పాశ్చాత్య ప్రభుత్వాలు ఆరోపిస్తున్నాయి. సైనిక గూఢచర్యం నుంచి శత్రు శిబిరంలో చేరిన స్క్రీపాల్ రష్యా సైనిక గూఢచర్య సంస్థ జీఆర్‌యూలో ఉన్నతాధిగారిగా చేరిన స్క్రీపాల్ తన విధుల్లో భాగంగా ఐరోపా దేశాలైన మాల్టా, స్పెయిన్లలో పని చేశారు. అనారోగ్యం కారణంగా 1996లో అక్కడి నుంచి మాస్కోలోని జీఆర్యూ ఆఫీసులో చేరారు. 1999లో ఆరోగ్యం క్షీణించిందనే సాకుతో జీఆర్యూ నుంచి రిటైరయ్యారు. అయితే, 1995 నుంచి స్క్రీపాల్ బ్రిటిష్ గూఢచార సంస్థ ఎస్ఐఎస్(ఎం16)తో సంబంధాలు పెట్టుకుని ఐరోపా దేశాల్లో పనిచేస్తున్న 300 మందికి పైగా రష్యన్ గూఢచారుల వివరాలను ఈ సంస్థకు వెల్లడించారని రష్యా సర్కారు ఆరోపించింది. 2004 డిసెంబర్లో అప్పుడే బ్రిటన్ నుంచి తిరిగొచ్చిన ఆయనను మాస్కోలోని ఆయన ఇంటి ముందే రష్యా అధికారులు అరెస్ట్ చేశారు. దేశ ద్రోహ నేరంపై ఆయన్ను సైనిక కోర్టులో విచారించి 13 ఏళ్ల జైలు శిక్ష విధించగా, 2006 నవంబర్‌లో ఈ శిక్షను సైనిక సుప్రీంకోర్టు ఖరారు చేసింది. అమెరికాలో అరెస్ట్ అయిన పది మంది రష్యన్ గూఢచారుల విడుదలకు బదులుగా మరో ముగ్గురు రష్యన్లతో పాటు స్క్రీపాల్ను 2010 జులై 9న విడుదల చేశారు. అప్పటి రష్యా అధ్యక్షుడు దిమిత్రీ మెద్వెదేవ్ క్షమాభిక్షతో జైలు నుంచి విడుదలైన ఆయన బ్రిటన్ చేరుకుని 2011లో శాలిస్బరీలో ఇల్లు కొనుగోలు చేసి స్థిరపడ్డారు. ఇటీవల మాస్కో నుంచి వచ్చిన కూతురు యూలియాతో కలిసి శాలిస్బరీ షాపింగ్ మాల్ సమీపంలోని ప్రదేశంలో బెంచీపై కూర్చుని ఉండగా హఠాత్తుగా వారు కుప్పకూలిపోయారు. విష ప్రయోగంతో మృతి చెందిన లిత్వినెంకో రష్యా గూఢచార సంస్థ ఎఫ్ఎస్బీ మాజీ అధికారి అలెగ్జాండర్ లిత్వినెంకో 2006 నవంబర్‌లో విష ప్రయోగం వల్ల మరణించడం తీవ్ర సంచలనం సృష్టించింది. పుతిన్ ఆదేశాలతో దేశ బహిష్కరణకు గురైన రష్యన్ మాజీ బ్యాంకర్ జర్మన్ గోర్బున్త్సోవ్ 2012లో తూర్పు లండన్‌లో క్యాబ్‌లో వెళుతుండగా ఆయనపై గుర్తు తెలియని వ్యక్తులు నాలుగుసార్లు కాల్పులు జరిపారు. గోర్బున్త్సోవ్ ఈ ఘటనలో బతికి బయటపడ్డారు. 2012 నవంబర్‌లో లండన్‌లో తాను నివసించే గేటెడ్ కమ్యూనిటీ కాంపౌండ్‌లో రష్యన్ వ్యాపారి అలెగ్జాండర్ పెరెపిల్చినీ కుప్పకూలి మరణించారు. ఓ అమెరికన్ వ్యాపారి నియంత్రణలోని హెర్మిటేజ్ అనే ఇన్వెస్ట్మెంట్ ఫండ్‌ను రష్యా అధికారులు ఎలా మోసగించారో స్విస్ అధికారులకు పెరెపిల్చినీ సమాచారం అందించారు. ఆయన తిన్న ఓ రష్యా వంటకంలో జెల్సెమియం అనే విషపూరిత పువ్వు నుంచి తీసిన అవశేషాలు ఉన్నాయని శవ పరీక్షలో తేలింది. పుతిన్ మాజీ గురువుగా పరిగణించే బిలియనీర్ బోరిస్ బెరెజోవ్స్కీ కూడా దేశ బహిష్కరణ తర్వాత లండన్‌లో స్థిరపడి పుతిన్‌పై పదేళ్లకు పైగా మీడియా ద్వారా పోరాటం జరిపారు. 2013 మార్చిలో ఆయన తన లండన్ అపార్ట్మెంట్లో ఆత్మహత్య చేసుకుని మరణించినట్టు కనుగొన్నారు. ఆయనది హత్యేనని శవపరీక్షలో తేలింది. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
‘అమెరికాను మించిన ఆయుధాలున్నాయి’
వాషింగ్టన్: అణు క్షిపణులు సహా అత్యంత శక్తిమంతమైన, అజేయమైన ఆయుధాలు తమ వద్ద ఉన్నాయని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. తమ ఆయుధాల ముందు అమెరికా ఆయుధ సంపత్తి దిగదుడుపేనని పేర్కొన్నారు. వార్షిక స్టేట్ ఆఫ్ ద నేషన్ ప్రసంగంలో పుతిన్ మాట్లాడారు. ఆయుధాలకు సంబంధించిన కొన్ని ప్రతీకాత్మక వీడియోలనూ ఆయన చూపించారు. వీడియోల్లో ఆయుధాలు అమెరికా వైపునకు గురిపెట్టినట్లుగా ఉన్నాయి. శత్రు దేశాల రక్షణ వ్యవస్థలు తమ ఆయుధాలను గుర్తించేలోపే అవి విధ్వంసం సృష్టిస్తాయని పుతిన్ చెప్పారు. కాగా, పుతిన్ వ్యాఖ్యలపై అమెరికా మండిపడింది. ప్రచ్ఛన్న యుద్ధ కాలం నాటి ఒప్పందాలను ఉల్లంఘించి రష్యా శక్తిమంతమైన ఆయుధాలను తయారుచేస్తోందని ఆరోపించింది. ఈ విషయాన్ని తాము ఎప్పటినుంచో చెబుతున్నా రష్యా తోసిపుచ్చిందనీ, కానీ ఇప్పుడు ఆ దేశాధ్యక్షుడే స్వయంగా ఆ విషయం బయటపెట్టారని అమెరికా పేర్కొంది. -
‘పుతిన్ లిస్టు’ విడుదల
మాస్కో: అమెరికా, రష్యాల మధ్య ఉద్రిక్తతలు పెంచే దిశగా అగ్రరాజ్యం విడుదల చేసిన ‘పుతిన్ లిస్టు’ ప్రకంపనల్ని రేపుతోంది. తమ అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకున్నారని ఆరోపిస్తూ రష్యాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల పేర్లతో ఈ జాబితాను అమెరికా విడుదల చేసింది. అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకున్నందుకు రష్యాను శిక్షించాలని అమెరికన్ కాంగ్రెస్ చేసిన చట్టం అమల్లో భాగంగా సోమవారం అర్ధరాత్రి దాటాక అమెరికా ఆర్థిక శాఖ ఈ జాబితాను విడుదల చేసింది. రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ వెబ్సైట్లో పేర్కొన్న పుతిన్ పరిపాలన యంత్రాంగంలోని అందరి పేర్లతో పాటు కేబినెట్ మంత్రుల్ని, ఆ దేశానికి చెందిన ప్రముఖ బిలియనీర్లను ఇందులో చేర్చింది. జాబితాలోని 114 మంది రాజకీయ నాయకుల్లో పుతిన్ సహాయకులు, కేబినెట్ మంత్రుల పేర్లు ఉండగా.. 96 మంది బిలియనీర్లలో వివాదరహితులుగా పేరొందిన పలువురు వ్యాపారవేత్తలు కూడా ఉండటం గమనార్హం. రష్యా ప్రధాని దిమిత్రి మెద్వెదెవ్, విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, నిఘా విభాగాలైన ఎఫ్ఎస్బీ, జీఆర్యూలకు చెందిన ఉన్నతాధికారులు కూడా ఇందులో ఉన్నారు. ఇక బిలియనీర్లలో ప్రముఖ ఆయిల్ వ్యాపారి, చెల్సియా ఫుట్‌బాల్ క్లబ్ యజమాని రోమన్ అబ్రమోవిక్, అల్యూమినియం వ్యాపారి ఓలెగ్ డెరిపస్క, 2012 అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్‌పై పోటీచేసిన మిఖాయిల్ ప్రొఖొరొవ్తో పాటు వివాద రహితులుగా పేరున్న ప్రముఖ సెర్చ్ ఇంజిన్ యాండెక్స్ వ్యవస్థాపకుడు అర్కడి వోలొజ్ తదితరులున్నారు. నా పేరు లేదే..!: పుతిన్ పుతిన్ దీనిపై మాట్లాడుతూ జాబితాలో తన పేరు చేర్చనందుకు నిరాశ చెందానని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇది విద్వేష పూరిత చర్యని, ఈ పరిణామం అమెరికా–రష్యా సంబంధాల్ని మరింత జటిలం చేసిందని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ విషయాన్ని మరింత పెద్దదిగా చేసే ఉద్దేశం తనకు లేదన్నారు. ఈ అంశాన్ని వదిలిపెట్టి దేశం గురించి, ఆర్థిక వ్యవస్థ గురించి రష్యా ఆలోచించాలని అన్నారు. రష్యా ప్రతినిధి అలెస్కీ చెపా మాట్లాడుతూ.. ఇది ఉద్రిక్తతల్ని పెంచే చర్యగా పేర్కొన్నారు. -
పుతిన్‌కు సబ్‌చెక్
ఆమె రాబోయే ఎన్నికలలో పుతిన్‌ను ఢీకొనబోతోంది. కొందరు ఆమెను గ్లామర్ డాల్ అంటున్నారు. కొందరు భవిష్యత్ తేజం అని భావిస్తున్నారు. ఎదిరించడం గొప్ప లక్షణం. మేరు పర్వతాన్ని తొలిచే పని కూడా తొలి గునపం పోటుతోనే మొదలవుతుంది. సెనియా సబ్‌చెక్ రష్యాలో పుతిన్ ప్రాభవానికి చెక్ పెడుతుందా? రష్యా మారిపోతోంది. చరిత్రకు సరైన వైపు ఉండాలనుకునే రాజకీయాల్లోకి రావాలనే నిర్ణయం తీసుకున్నాను. – సెనియా సబ్‌చెక్ సెనియా సబ్‌చెక్! రష్యా రాజకీయాలపట్ల ఆసక్తి ఉన్న వాళ్లందరి దృష్టిని మరల్చిన పేరు. గ్లామర్ వరల్డ్‌తో పరిచయం ఉన్నవాళ్లకైతే ఆమె సుపరిచితురాలు. ఫ్యాషన్ షోలు నిర్వహించి ఆ రంగంలో పేరు సంపాదించింది. అన్నిటికన్నా టీవీ యాంకర్‌గా చాలా ఫేమస్. టి.ఎన్.టి. చానల్లో ప్రసారమైన ’ఈౌఝ 2’ కు హోస్ట్‌గా ఆమె తొలి గుర్తింపు పొందింది. బిగ్బ్రదర్కు డర్టీ వర్షన్ అని ఈ షోకి పేరు. ఎమ్‌టీవీ రష్యాలో ఓపెన్ డిబేట్ ప్రోగ్రామ్‌ను లాంచ్ చేసింది. ఫస్ట్ ఎపిసోడ్ ‘వేర్ ఈజ్ పుతిన్ లీడింగ్ అస్?’ బ్రçహ్మాండమైన రేటింగ్ సంపాదించింది. దాంతో సెనియా తనే సొంతంగా ‘టీవీరెయిన్’ అనే చానల్‌ను ప్రారంభించింది. ఇవన్నీ ఆమెకు రష్యాలో ప్రాచుర్యం కల్పించాయి. ఇక తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు రష్యా అధ్యక్షపదవికి పోటీ చేయనున్నట్టు ఇచ్చిన ప్రకటన, ఆ విధంగా ఆమె పుతిన్‌కు విసిరిన చాలెంజ్ సెనియాను ప్రపంచమంతా పాపులర్ అయ్యేలా చేసింది. నచ్చిన వాళ్లు శభాష్ అన్నారు. గ్లామర్డాల్కి పాలిటిక్స్ ఏంటీ అనుకున్నవాళ్లు నవ్వుకున్నారు. కొందరు రాజకీయ పండితులు పెదవి విరిచారు. ఎవరు ఏమనుకున్నా తనను తాను ‘ఎగైనెస్ట్ ఆల్’గా బ్రాండింగ్ చేసుకుంటోంది. ఈ మాత్రమైనా గొంతెత్తి నిలబడేవాళ్లు ఉండాలి కదా అని ఎక్కువ మంది ఆమె వైపు మురిపెంగా చూస్తున్నారు. రాజకీయ నేపథ్యం సెనియా సబ్‌చెక్ ఎవరో కాదు... పుతిన్ రాజకీయ గురువు అనటోలీ సబ్‌చెక్ పుత్రిక. అనటోలీ సెయింట్ పీటర్స్బర్గ్ మేయర్. తల్లి ల్యూదిమిలా నరుసోవా కూడా పొలిటీషియనే. వీళ్ల రెండో సంతానమే సెనియా. చిన్నప్పటి నుంచీ రాజకీయ వాతావరణంలోనే పెరిగినా 35 ఏళ్లు వచ్చేవరకు వాటి జోలికి పోలేదు ఆమె. సెయింట్ పీటర్స్బర్గ్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో డిగ్రీ చదివింది. ఆ తర్వాత మాస్కోలో పాలిటిక్స్‌లో పీజీ చేసింది. టీవీ యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టి, యాక్టర్‌గా కూడా పని చేసి పొలిటికల్ జర్నలిస్ట్‌గా టర్న్ తీసుకుంది. సామాజిక కార్యకర్తగానూ బాధ్యతలు నిర్వహిస్తోంది. తొలి నిరసనోద్యమానికి ప్రతీక ఉన్నట్టుండి సెనియాకు రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి ఎందుకు కలిగింది? దీనికి ముందు కొంత కథ జరిగింది. రష్యా ఎన్నికల్లో రిగ్గింగ్‌కు పాల్పడ్డాడని పుతిన్‌కు వ్యతిరేకంగా నిరసనలు, ధర్నాలు జరిగాయి. అందులో పాల్గొంది సెనియా. అయితే పుతిన్‌కు వ్యతిరేకంగా పెద్దగా నినాదాలేమీ ఇవ్వలేదు. కానీ తొలి నిరసనోద్యమానికి ప్రతీకగా పేరు తెచ్చుకుంది. ఆ ర్యాలీలతోనే పుతిన్ పాలన, ప్రస్తుత రష్యా రాజకీయాలపట్ల అవగాహన పెంచుకుంది. ‘రష్యా మారిపోతోంది. చరిత్రకు సరైన వైపు ఉండాలనుకునే రాజకీయాల్లోకి రావాలనే నిర్ణయం తీసుకున్నాను’ అని చెప్తుంది సెనియా. మరి తన తండ్రికి ఆప్తుడైన పుతిన్‌కు వ్యతిరేకంగానా... అని అడిగితే.. ‘నా జీవితంలో పుతిన్‌కు ఎలాంటి రోల్ లేదు. అతనో అస్పష్టమైన జ్ఞాపకం అంతే. 24 గంటలు ఆయన మా నాన్నతో ఉన్నా నేనెప్పుడూ ఆయనను పట్టించుకోలేదు. మా నాన్నకు ఆయన ఆప్తుడే కావచ్చు కాని నాకు తెలిసి... నాన్న అత్యంత సన్నిహిత వర్గంలో పుతిన్ ఎప్పుడూ లేడు. ఎప్పుడూ చేతిలో ఏవో ఫైల్స్‌తో వచ్చేవాడు. వచ్చీరాగానే నాన్న ఆఫీస్ గదిలోకి వెళ్లేవాడు. పుతిన్‌తో కలిసి మేం హాలీడేస్ స్పెండ్ చేసిందీ లేదు. ఓ రెండుసార్లనుకుంటా ఆయనతో కలిసి మేం వెళ్లింది. అదీ ఫిన్లాండ్, టర్కీకి. అంతేతప్ప ఆయన దగ్గర కూర్చొని కథలు, కబుర్లు విన్న అద్భుతమైన జ్ఞాపకలేవీ మాకు లేవు. అసలు ఆయన అలాంటి ఎమోషన్స్ ఉన్న మనిషే కాడు. నా దృష్టిలో ఆయనొక యంత్రం. తాను అనుకున్నది సాధించడానికి ఎంతకైనా తెగించగల సమర్థుడు’ అని చెప్తుంది. ధరలు సామాన్యులకు అనుకూలంగా ఉండాలని సెనియా భావిస్తోంది. స్త్రీ, పురుషులు సమానమైన పని చేస్తున్నప్పుడు వేతనమూ సమానంగానే ఉండాలన్న వాదన ఆమెది. సెనియా స్త్రీ పక్షపాతిగానూ గుర్తింపు పొందింది. ఎల్జీబీటీ హక్కుల కోసం కూడా తన గళం వినిపిస్తోంది. ఆమె అంతర్జాతీయ అవగాహన ప్రకారం ఉక్రెయిన్, సిరియాల్లో రష్యా మిలిటరీ జోక్యం సరికాదని భావిస్తోంది. తన పొలిటికల్ హీరో మార్గరెట్ థాచర్ అంటుంది. ‘కష్టపడి పనిచేసే తత్వం థాచర్ సొంతం. తనకు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్లను ఏనాడూ పట్టించుకోలేదు. తను నమ్మినదాన్ని ఆచరించిన ఐరన్ లేడీ’ అంటూ మార్గరేట్ థాచర్ మీదున్న తన అభిమానాన్ని చాటుకుంది. ‘నేను పోటీ చేస్తే నా ప్రత్యర్థులకు ముఖ్యంగా వ్లాదిమిర్ పుతిన్‌కు వ్యతిరేక ఓట్లు పడే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తోంది’’ అని నమ్ముతోంది సెనియా సబ్‌చెక్. ప్రీపోల్ రిజల్ట్స్ అయితే ఒక సంస్థ సెనియాకు మద్దతు ఇస్తున్నవాళ్ల గురించి సర్వే నిర్వహించింది. అందులో ఆమెకు కచ్చితంగా ఓటు వేయాలనుకుంటున్న వాళ్లు కేవలం ఒక శాతమేనట. తొమ్మిది శాతం మంది ఓటు వేసేందుకు మొగ్గు చూపుతున్నారట. పదిహేను నుంచి ఇరవై శాతం మంది ఆమెకు ఓటు వేయాలా వద్దా అనే మీమాంసలో ఉన్నారు. ఇది ఆరంభం మాత్రమే అని సెనియా భావన. క్రెమ్లిన్‌కు గ్లామర్ ‘ఆమె అభ్యర్థిత్వం వల్ల క్రెమ్లిన్ భవనానికి మళ్లీ గ్లామర్ వచ్చినట్టే. ఎన్నికల్లో పోటీ చేస్తున్న మరో రాజకీయ వారసత్వంగా పుతిన్ ఓట్లను చీల్చే సాధనంగా’ ఆమె గురించి విమర్శకులు అంచనాలు వేస్తున్నారు. ‘‘ఈ తరం భిన్నమైన రష్యాను కోరుకుంటోంది. నిజమైన ప్రజాస్వామ్యపాలనలో బతకాలనుకుంటోంది. మార్చిలో జరగబోయే ఎన్నికలు వాళ్ల ఆశను నెరవేరుస్తాయి’’ అని సెనియా సబ్‌చెక్ విశ్వాసం. తీర్పు ప్రజల చేతుల్లో ఉంది. తీర్పు ఫలితం తెలియాలంటే ఈ మార్చి వరకు ఆగాలి... చూడాలి!! – శరాది -
కాపాడినందుకు థ్యాంక్స్.. ట్రంప్‌కు పుతిన్ ఫోన్
మాస్కో : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు రష్యా అధ్యక్షుడు పుతిన్ ధన్యవాదాలు చెప్పారు. సెయింట్ పీటర్ బర్గ్‌లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడేందుకు కుట్రలు చేస్తున్నారనే విషయాన్ని అమెరికా నిఘా సంస్థ సీఐఏ వెల్లడించినందుకు ఆయన ప్రత్యేకంగా ట్రంప్‌కు ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పినట్లు రష్యా అధ్యక్షభవనం క్రెమ్లిన్ ఒక ప్రకటనలో తెలిపింది. సెయింట్ పీటర్ బర్గ్‌లోని ప్రముఖమైన చోటు ఖజాన్ క్యాథెడ్రెల్పై బాంబులతో దాడులు చేసి పేల్చేయాలనుకున్నారని, అందుకు ఈ వారంలోనే కుట్ర చేశారని రష్యా ఫెడరల్ సెక్యూరిటీ వెల్లడించింది. అయితే, ఆ కుట్రకు పాల్పడిన ఏడుగురు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను తాము పట్టుకున్నామని, దాంతో భారీ కుట్రను భగ్నం చేసినట్లయిందని అన్నారు. ఈ విషయం తాము అధ్యక్షుడు పుతిన్‌కి తెలియజేయగాని ఆయన వెంటనే ట్రంప్‌కు ఫోన్ చేసి ఆయనకు, ఆయన నిఘా సంస్థకు ధన్యవాదాలు చెప్పినట్లు వెల్లడించారు. ఇలా ట్రంప్, పుతిన్ మధ్య సంభాషణ జరగడం గడిచిన వారంలోనే రెండోసారి. అంతకుముందు ద్వైపాక్షిక సంబంధాలు, ఉత్తర కొరియా విషయంలో వ్యవహరించాల్సిన తీరుపై వారు చర్చించుకున్న విషయం తెలిసిందే. -
పుతిన్‌ను కలుస్తా..!
టోక్యో : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి చేస్తున్న ఆసియా పర్యటన సరికొత్త చరిత్రకు నాంది పలుకబోతోంది. ట్రంప్ పర్యటనతో ఇప్పటికే ఆసియాలో ఒకరకమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ట్రంప్.. ఆదివారం జపాన్‌లో అడుగు పెట్టారు. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా సైతం.. అణ్వాయుధాలకు పదును పెడుతున్నట్లు ప్రకటించి వాతావరణాన్ని మరింత వేడెక్కించింది. ఎయిర్ ఫోర్స్ ఒర్ విమానం టోక్యో విమానాశ్రయంలో దిగీదిగగానే.. ట్రంప్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తే ప్రకటన చేశారు. ఆసియా పర్యటన వ్యూహాత్మకంగా ఉంటుందంటూనే.. తాను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రత్యేకంగా సమావేశమవుతానని ప్రకటించారు. ఉత్తర కొరియా సమస్యకు పరిష్కారం కోసమే పుతిన్‌తో చర్చిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్తర కొరియా సమస్య నుంచి అంతర్జాతీయ సమాజాన్ని కాపాడేందుకు రష్యా సహకారం చాలా అవసరం. అందులో భాగంగానే ఆయనను కలుస్తున్న ట్రంప్ పేర్కొన్నారు. ఉత్తర కొరియా అనేది అమెరికాకు మాత్రమే కాదు.. ప్రపంచానికే ప్రమాదకర దేశమని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా.. కొరియా చుట్టూ అమెరికా బాంబర్ విమానాలు చక్కర్లు కొట్టడంతో.. ఉత్తర కొరియా మరోసారి క్షిపణి పరీక్షలు నిర్వహించింది. -
ట్రంప్ నా భార్య కాదు
అమెరికా అధ్యక్షుడిపై పుతిన్ వ్యంగ్యోక్తులు మాస్కో: ఇరు దేశాల మధ్య నెలకొన్న దౌత్య పోరు నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యంగ్యోక్తులు విసిరారు. ట్రంప్ అనుభవరాహిత్యంతో అంతర్జాతీయ వ్యవహారాల్లో ఇబ్బందులు పడుతున్నారా అన్న ప్రశ్నను పుతిన్ కొట్టిపారేశారు. ‘ట్రంప్ నా భార్య కాదు. నేను ఆయనకు భర్త కాను’ అని ఆయన చమత్కిరించినట్లు రష్యా మీడియా పేర్కొంది. ట్రంప్ అభిశంసనకు గురైతే రష్యా ఎలా స్పందిస్తుంది అని అడినప్పుడు అమెరికా అంతరంగిక రాజకీయాలను తాము చర్చించడం సరికాదన్నారు. గతేడాది ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు రష్యా హర్షం వ్యక్తం చేసింది. తమతో సంబంధాల పునరుద్ధరణకు ట్రంప్ పాటుపడతారని ఆశించింది. అయితే రష్యాపై అమెరికా ఆంక్షలు విధించడంతో పాటు ఆ దేశ కాన్సులేట్ కార్యాలయాలను మూసివేయడంతో రెండు దేశాల మధ్యదూరం కొనసాగుతోంది. మరింత కుదిస్తాం: పుతిన్ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే తమ దేశంలో పనిచేస్తున్న దౌత్యవేత్తల్లో అదనంగా 155 మందిని తగ్గించేలా అమెరికాపై ఒత్తిడి పెంచుతామని పుతిన్ అన్నారు. వెంటనే ఈ చర్యలకు దిగబోమని, భవిష్యత్తులో జరిగే పరిణామాలను బట్టి తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రష్యాలో పనిచేస్తున్న అమెరికా దౌత్యాధికారుల సంఖ్యపై పరిమితులు విధించే హక్కు తమకు ఉందన్నారు. అమెరికాలో తమ దౌత్యాదికారుల సంఖ్యను కుదించడంలో ఆ దేశం గౌరవంగా వ్యవహరించలేదని ఆరోపించారు. -
అమెరికాకు షాక్ ఇచ్చిన పుతిన్
-
హిల్లరీవైపే పుతిన్ మొగ్గుచూపారు
డోనాల్డ్ ట్రంప్ ప్రకటన వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా తనకు అనుకూలంగా వ్యవహరించిందన్న ఆరోపణలను డోనాల్డ్ ట్రంప్ కొట్టిపారేశారు. నిజానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ హిల్లరీ క్లింటనే అధ్యక్షురాలు కావాలని కోరుకున్నారని ప్రకటించారు. ఆమెకు అధికారం వస్తే అమెరికా బలహీనమవుతుందని అంచనా వేశారని వెల్లడించారు. ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తను, పుతిన్ తమ దేశాల ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామన్నారు. జర్మనీ నగరం హాంబర్గ్‌లో గత వారం నిర్వహించిన జీ–20 సదస్సులో వీరిద్దరూ భేటీ కావడం తెలిసిందే. ‘మా సైన్యం బలోపేతానికి నేను అధికశ్రద్ధ చూపాను. హిల్లరీ అధికారంలోకి వచ్చి ఉంటే సైన్యం బలహీనంగా మారేది. ఇంధనం ధర మరింత పెరిగేది. అందుకే ట్రంప్ నన్ను వ్యతిరేకించారు’ అని వివరించారు. గ్రీన్‌కార్డు నిబంధనలను సరళీకరించండి న్యూయార్క్: అమెరికాలో నివసించే భారతీయ ఉద్యోగులు/వ్యాపారులు శాశ్వత నివాసానికి ఉద్దేశించిన గ్రీన్‌కార్డ్ పొందాలంటే 12 ఏళ్ల పాటు నిరీక్షించాలంటూ వచ్చిన వార్తలపై అమెరికా నేతలు స్పందించారు. దీనికి సంబంధించి ఒక బిల్లును కాన్సస్ రాష్ట్రానికి చెందిన రిపబ్లికన్ కాంగ్రెస్ నేత కెవిన్ యోడర్ ప్రవేశపెట్టారు. ఈ సమస్యకు కారణమైన ‘దేశ ఆధారిత’ విధానాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ నిబంధన ఉండటం వల్ల భారత్, చైనా వంటి అధిక జనాభా దేశాల నుంచి వచ్చే వారికి అన్యాయం జరుగుతోందని ఆయన వివరించారు. కాంగ్రెస్‌లో ఉన్న 230 మందిలో ఇప్పటికే 100 మందికి పైగా నేతలు ఈ బిల్లుకు ఆమోదం తెలిపారు. ఈ బిల్లు ఆమోదం పొందితే ‘దేశ ఆధారిత గ్రీన్‌కార్డ్ జారీ’ నిబంధనని తొలగిస్తారు. ప్రస్తుతం ఈ నిబంధనల ప్రకారం స్వతంత్ర దేశం నుంచి వచ్చిన ఉద్యోగుల కుటుంబాలకు కోటా ప్రకారం గ్రీన్‌కార్డులు మం జూరు చేయాలి. దీంతో భారత్, చైనాల నుంచి వచ్చిన వారితో సమానంగా చిన్న దేశం గ్రీన్లాండ్ నుంచి వచ్చిన ఉద్యోగులకూ గ్రీన్‌కార్డులు అందుతున్నాయి. పెద్ద దేశాల నుంచి దరఖాస్తుదారులు ఎక్కువగా ఉండటంతో ప్రతి సంవత్సరం వారి గ్రీన్‌కార్డ్ దరఖాస్తు కోసం ఏళ్ల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. అలాగే ఈ బిల్లు అమలులోకి వస్తే తాత్కాలిక వీసా మీద అమెరికాలో పనిచేసే వారికి కూడా మరింత ప్రయోజనం చేకూరనుంది. ట్రంప్ అభిశంసనకు తీర్మానం అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యానికి అనుమతించి న్యాయ ప్రక్రియకు విఘాతం కలిగించినందున ట్రంప్‌ను అభిశంసించాలని కోరుతూ డెమోక్రాట్ ఎంపీ బ్రాడ్ షెర్మన్ తీర్మానం ప్రవేశపెట్టారు. మరో డెమోక్రాట్ సభ్యుడు అల్ గ్రీన్ దీనిపై సంతకం చేశారు. అమెరికా అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. పార్లమెంటులో రిపబ్లికన్ల ప్రాబల్యం ఉన్నందున ఈ తీర్మానాన్ని అడ్డుకునే అవకాశం ఉంది. డెమోక్రాట్లకు ప్రతినిధుల సభలో తగిన మెజారిటీ లేకపోవడమే ఇందుకు కారణం. -
ట్రంప్‌పై రష్యా మీడియా ఫైర్
మాస్కో: రాజకీయాల్లో ఎప్పుడు మిత్రులవుతారో.. ఎప్పుడు శత్రువులుగా మారుతారో చెప్పడం కష్టం. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మరోసారి ఇది రుజువైనట్లు అనిపిస్తోంది. నిన్నటిదాకా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు స్నేహ హస్తం అందించిన రష్యా.. తాజాగా శత్రు వైఖరి ప్రదర్శిస్తోంది. ట్రంప్ ఓ గ్రేట్ లీడర్ అని చెప్పిన రష్యానే.. ఇప్పుడాయన ప్రమాదకరమని చెబుతోంది. ట్రంప్‌పై రష్యా అధికారిక టీవీ ఛానల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ కంటే ట్రంపే ప్రమాదకర నాయకుడని ఓ టీవీ జర్నలిస్టు వ్యాఖ్యానించారు. రష్యాలోని మిగతా టీవీ చానల్స్ కూడా ట్రంప్‌పై ఇలాంటి ఆరోపణలే చేశాయి. దీంతో ట్రంప్, రష్యా మధ్య సంబంధాలు బలహీనపడేలా కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్‌కు రష్యా మద్దతు పలికింది. కానీ, సిరియాపై అమెరికా దాడి నుంచి ఇరుదేశాల మధ్య దూరం పెరుగుతోంది. -
ట్రంప్, పుతిన్‌ల బంధానికి బీటలు!
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ట్రంప్ పొగడ్తల్లో ముంచెత్తారు. ఇరుదేశాల మధ్య ఉన్న శత్రుత్వాన్ని పక్కనబెట్టి.. పరస్పరం సహకారంతో ముందుకెళ్తామని ట్రంప్ చెప్తూ వచ్చారు. పుతిన్ సైతం ట్రంప్‌కు మద్దతుగా మాట్లాడారు. రష్యా విషయంలో ట్రంప్ పోకడలపై హిల్లరీ వర్గం తీవ్రస్థాయిలో మండిపడింది కూడా. అయితే.. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కొన్నాళ్లకే పరిస్థితిలో మార్పు వచ్చిందా? అంటే అవుననే అంటున్నారు నాటో మాజీ కమాండర్ జేమ్స్ స్టావ్రైడిస్. ట్రంప్ ప్రభుత్వ వర్గాలు.. ప్రపంచంలో మంచిని సపోర్ట్ చేసే శక్తిగా రష్యాను భావించడంలేదని స్టావ్రైడిస్ వెల్లడించారు. ప్రస్తుతం ట్రంప్, రష్యాల మధ్య సంబంధాలు క్షీణిస్తున్నాయని అన్నారు. సిరియాలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆనుసరిస్తున్న విధానాలు.. ఆయన ఎంత క్లిష్టమైన భాగస్వామి అన్న విషయాన్ని వెల్లడిస్తున్నాయని స్టావ్రైడిస్ పేర్కొన్నారు. ఇటీవల సిరియాలో అమెరికా క్షిపణి దాడుల నేపథ్యంలో స్టావ్రైడిస్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా క్షిపణి దాడులను రష్యా ఖండించిన విషయం తెలిసిందే. అమెరికాది దూకుడు చర్య అని.. అంతర్జాతీయ ఒప్పందాలను ఆ దేశం ఉల్లంఘించిందని రష్యా పేర్కొంది. -
ఏం జరిగినా జడ్జిదే బాధ్యత
► ప్రయాణ నిషేధ ఉత్తర్వుల్ని అడ్డుకోవడంపై ట్రంప్ మండిపాటు ► అమెరికన్లు ఆ జడ్జినే ప్రశ్నించాలంటూ అమెరికా అధ్యక్షుడి ట్వీట్ ► పుతిన్ ను గౌరవిస్తా.. రష్యాతో కలిసి సాగడం మంచిది: ట్రంప్ వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మళ్లీ కోపమొచ్చింది. ఈసారి ఏ దేశాధినేతో లేక వ్యతిరేకులపైనో కాకుండా ఏకంగా జడ్జిపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడు ముస్లిం ఆధిక్య దేశాల నుంచి పౌరుల రాకపై నిషేధాన్ని అడ్డుకున్నందుకు శాన్ ప్రాన్సిస్కో జిల్లా జడ్జి జేమ్స్ రాబర్ట్‌ను ట్వీటర్లో తీవ్రంగా తప్పుపట్టారు. దేశంలో ఏదైనా జరిగితే అమెరికన్లు ఆ జడ్జినే తప్పుపట్టాలంటూ ట్వీట్ చేశారు. నిషేధాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ జేమ్స్ రాబర్ట్ శనివారం ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ‘మన దేశాన్ని ఇలాంటి ఆపదలోకి ఒక జడ్జి నెడతారనే విషయం నమ్మలేకుండా ఉన్నాను. ఒకవేళ ఏదైనా జరిగితే ఆ జడ్జిని, న్యాయవ్యవస్థనే తప్పుపట్టండి. శరణార్థులు ప్రవాహంలా వస్తున్నారు. ఇది విచారకరం’ అంటూ సోమవారం ట్వీట్ చేశారు. శాన్ ఫ్రాన్సిస్కో కోర్టు ఆదేశాలపై వైట్‌హౌస్ అప్పీలును తొమ్మిదో సర్క్యూట్ కోర్టు తోసిపుచ్చిన అనంతరం ట్రంప్ వరుస ట్వీట్లు చేశారు. నిషేధం సరైనదే: సమర్ధించుకున్న ట్రంప్ ‘అమెరికాకు వచ్చే వారిని చాలా జాగ్రత్తగా తనిఖీ చేయమని హోం ల్యాండ్ సెక్యూరిటీ అధికారుల్ని ఆదేశించా. మేం చేయాల్సిన పనిని కోర్టులు చాలా కఠినం చేశాయి. జడ్జి అభిప్రాయం హాస్యాస్పదం’ అని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా ఏమైనా అమాయక దేశమా? రష్యా అధ్యక్షుడు పుతిన్ పాలనను ఒకవైపు తప్పుపడుతూనే మరోవైపు ఆ దేశానికి ట్రంప్ స్నేహ హస్తం అందించారు. పుతిన్ పాలనలో జరిగిన హత్యలతో పాటు అమెరికా చేసిన తప్పుల వల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రజలు మరణించారంటూ ఫాక్స్ న్యూస్ ఇంటర్వూ్యలో వెల్లడించారు. పుతిన్ హంతకుడు కదా? అని విలేకరి ప్రశ్నించగా... ‘అవును... అనేక తప్పులు జరిగాయి. అనేకమంది హత్యకు గురయ్యారు. అయితే మన వద్ద కూడా చాలామంది హంతకులు ఉన్నా రు. అమెరికాను అమాయక దేశంగా భావిస్తున్నారా?’ అంటూ ట్రంప్ ప్రశ్నించారు. రష్యా సహకారం తీసుకుంటా ఐసిస్‌పై పోరులో రష్యాతో కలసి పనిచేసేందుకు తాను సిద్ధమని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ‘నేను పుతిన్ ను గౌరవిస్తాను. అయితే దానర్థం స్నేహితులని కాదు. నేను అనేక మంది ప్రజల్ని గౌరవిస్తాను. అంతమాత్రాన వారితో నేను వారితో స్నేహం చేయాలని ఆశిస్తున్నట్లు కాదు. పుతిన్ రష్యా అధినేత. ఐసిస్‌పై పోరులో మనకు సాయం చేస్తే... రష్యా తో కలిసి సాగడం మంచిదని నేను చెప్పగలను’ అంటూ ప్రకటించారు. రష్యాతో సంబంధాలపై ట్రంప్ వ్యాఖ్య ల్ని డెమోక్రటిక్ పార్టీ సెనెటర్లు తప్పుపట్టారు. -
ట్రంప్ గెలుపునకు పుతిన్ కృషి
అమెరికా నిఘా సంస్థ నివేదిక వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపునకు, హిల్లరీ ఓటమికి పుతిన్ ‘ప్రభావిత ప్రచారం’నిర్వహించారని అమెరికా జాతీయ నిఘా సంస్థ పేర్కొంది. అమెరికా ఎన్నికల లక్ష్యంగా పుతిన్ ప్రభావిత ప్రచారానికి ఆదేశాలిచ్చారని తాము ఓ అంచనాకు వచ్చామని ఆ సంస్థ డైరెక్టర్ తన నివేదికలో పేర్కొన్నారు. అమెరికా ప్రజాస్వామ్య విధానంపై ప్రజల్లో నమ్మకం పోయేలా చేయడం, హిల్లరీ క్లింటన్‌ను ఓడించడమే రష్యా లక్ష్యం అని 31 పేజీల ఆ నివేదికలో పేర్కొన్నారు. ఆ నివేదికను గురువారం అధ్యక్షుడు బరాక్ ఒబామాకు సమర్పించారు. అయితే దీనిని ట్రంప్ ఖండించారు. -
కోల్డ్ వార్-2
-
ఫోర్బ్స్ టాప్–10లో మోదీ
న్యూయార్క్: ప్రఖ్యాత ఫోర్బ్స్ మేగజీన్ తాజాగా వెలువరించిన ‘ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తుల జాబితా’ లో ప్రధాని మోదీ టాప్–10లో స్థానం సంపాదించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ వరసగా నాలుగో ఏడాదీ తొలి స్థానాన్ని కైవసంచేసుకున్నారు. కాబోయే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో స్థానంలో నిలిచారు. జర్మనీ చాన్స్‌లర్ మెర్కల్ మూడవ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ నాల్గవ, పోప్ ఫ్రాన్సిస్ ఐదో, మోదీ తొమ్మిదో ర్యాంక్ పొందారు. ‘గత కొన్నేళ్లలో మోదీ పాపులారిటీ విపరీతంగా పెరిగి ఆయన ప్రపంచస్థాయి నేతగా ఎదిగారు.’ అని ఫోర్బ్స్ వ్యాఖ్యానించింది. ఈ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ 38వ, ఉత్తర కొరియా నేత కిమ్ 43వ, ఒబామా 48వ, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల 51వ, ఐసిస్ ఉగ్రనేత అబుబకర్ 57వ ర్యాంక్ పొందారు. మొత్తం 74 పేర్లతో ఫోర్బ్స్ జాబితాను విడుదలచేసింది. -
పుతిన్ అండ్ పెట్స్
రాజతంత్రాలు రణతంత్రాల మధ్య కాసింత మానసికోల్లాసానికి దేశాధ్యక్షులు ఏం చేస్తారు? విందు వినోదాలు... స్నేహితులతో కాలక్షేపం.... కానీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ అలా కాదు. ఏ మాత్రం టైమ్ దొరికినా అతడు తన పెంపుడు జంతువులతో గడుపుతాడు. మూగ జీవులతో ఆడుకుంటాడు. వాటి బాగోగులు చూడడంలో సంతృప్తి చెందుతాడు. మనుషులంటే ఏవో ఒకటి ఆశిస్తారు. కాని పెంపుడు జంతువులు ఏమీ ఆశించవు. ప్రేమిస్తాయి. ఉత్తినే అలా ప్రేమిస్తూనే ఉంటాయి. అందుకే పుతిన్‌కు అవి అంటే ఇష్టం. ఇలాంటి ఇష్టం ఉన్న దేశాధ్యక్షులు ఎంతమంది? మొన్నామధ్య పుతిన్ దత్తత తీసుకున్న మూడు సైబీరియా పులుల్లో ఒకటి అభయారణ్యపు కంచెలు దాటి చైనాలో అడుగుపెట్టింది. చైనా ఈ సంగతి తెలిసి మరేం ఫరవాలేదనీ తమ అడవుల్లో ఆ పులికి ఆహారం కోసం గొర్రెలనూ, దుప్పులనూ పంపుతామనీ చెప్పింది. అయితే ఆశ్చర్యకరంగా ఆ పులి మరుసటిరోజు చనిపోయి కనిపించింది. ఇది తెలిసి పుతిన్ ఎంత బాధపడ్డాడో చైనా అంత హడలిపోయింది. ఎటొచ్చి ఏం గొడవ వస్తుందో అని. ఒక పెంపుడు జంతువు వల్ల రెండు దేశాల మధ్య స్నేహం చెడిపోయేంత స్థాయిలో పుతిన్‌కు మూగజీవుల పట్ల ఆసక్తి ఉంది. ఇక అతడికి సొంతంగా అనేక శునకాలు ఉన్నాయి. వాటిలో ఇష్టమైనది – ‘యుమె’ అనే ‘అకిటా’ జాతి శునకం. జపాన్‌లో విస్తృతంగా కనిపించే ఈ జాతి శునకాన్ని రష్యాలో, అమెరికాలో, మరికొన్ని దేశాల్లో పెంచుకుంటున్నారు. పరాయివాళ్లతో పూర్తిగా దూరంగా ఉంటూ తన యజమాని కుటుంబంతో చాలా దగ్గరగా మసలే అకిటా జాతి శునకాలు యజమానితో ఆటలాడుతూ ఉల్లాసాన్ని పెంచుతాయి. ప్రేమ పంచుతూ ఆనందాన్నిస్తాయి. ఈ శునకాలతోటే కాదు... మంచు ఎలుగుబంటులు, డాల్ఫిన్లు, పులులు, గుర్రాలు... ఒకటనేముంది పుతిన్ మూగప్రాణుల ఆప్తమిత్రుడు. పూర్వాశ్రమంలో కెజిబి (రష్యా గూఢచార సంస్థ) ఏజెంట్ అయిన పుతిన్ సకల తంత్రాలలోనే కాదు... క్రూరమృగాలతో కూడా ఎలా వ్యవహరించాలో తెలుసుకున్నాడు. వేటగాడిగా కూడా అతడు అవసరమైతే తుపాకీ పట్టగలడు. ఈ విషయాన్ని కూడా అతడు ఫొటోల ద్వారా లోకానికి వెల్లడి చేస్తూ ఉంటాడు. ఇదంతా ఎందుకు అనంటే... ‘నేను మరీ కరడుగట్టిన దేశాధ్యక్షుణ్ణి కాదు. నా గుండెల్లో ప్రేమ ఉంది అని చెప్పడానికే. లేదా నేను ప్రేమనూ పంచగలనూ శత్రువును తుద ముట్టించనూ గలను అని చాటడానికే’ అని ఒక పరిశీలకుడు తేల్చాడు. ఏమైనా రష్యాకు రాజు కూడా మూగజీవుల ప్రేమకు బానిసే అని ఈ ఫొటోల ద్వారా మనకు తెలుస్తోంది. -
కొత్త లైన్‌తోనే ‘హై స్పీడ్’
సికింద్రాబాద్-నాగ్‌పూర్ కారిడార్‌పై రష్యా నిపుణుల ప్రాథమిక అభిప్రాయం రెండు రోజులపాటు 12 మంది ఇంజనీర్ల పరిశీలన సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్-నాగ్‌పూర్ మార్గంలో సెమీ హైస్పీడ్ రైలు ప్రాజెక్టుకు భారీ ఖర్చు తప్పదని రష్యా రైల్వే ఓ అభిప్రాయానికి వచ్చింది. పైగా ప్రస్తుతం ఉన్న లైన్‌నే హైస్పీడ్ కారిడార్‌గా మార్చటం చిక్కుముడులతో కూడిందని గుర్తించింది. ప్రతిపాదిత ప్రాజెక్టు ప్రకారం ఈ మార్గంలో రైళ్లను గంటకు 200 కి.మీ. వేగంతో నడపాల్సి ఉంటుంది. ఆ వేగంతో రైళ్లను నడపాలంటే ప్రస్తుత లైన్ తట్టుకోలేదని ప్రాథమికంగా నిర్ధారించింది. ఆ స్థారుుకి లైన్‌ను అభివృద్ధి చేయాలంటే దాదాపు 60 శాతం మేర పూర్తిగా మార్చాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. సికింద్రాబాద్-నాగ్‌పూర్ మార్గంలో సెమీ హైస్పీడ్ రైలు ప్రాజెక్టును చేపట్టేందుకు ఉన్న అవకాశాలను రష్యా రైల్వే సంస్థకు చెందిన 12 మంది ఇంజనీర్లతో కూడిన బృందం రెండు రోజుల పాటు అధ్యయనం చేసింది. రష్యాతో ఒప్పందం సికింద్రాబాద్-నాగ్‌పూర్ మధ్య 575 కిలోమీటర్ల దూరం ఉంది. ప్రస్తుతం ఈ రెండు స్టేషన్ల మధ్య సూపర్‌ఫాస్టు రైళ్లు తిరిగేందుకు దాదాపు 10 గంటల సమయం తీసుకుంటున్నారుు. దాన్ని 4 నుంచి ఐదు గంటలకు తగ్గించేలా సెమీ హైస్పీడ్ రైళ్లను నడపాలనేది ప్రాజెక్టు ఉద్దేశం. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రష్యా రైల్వే సంస్థతో ఒప్పందం చేసుకుంది. దేశంలో తొలిదశలో అహ్మదాబాద్-ముంబై మధ్య జపాన్ సాయంతో హైస్పీడ్ రైలు ప్రాజెక్టు పనులు త్వరలో మొదలు కాబోతున్నారుు. మలిదశలో మరికొన్ని నగరాల మధ్య సెమీ హైస్పీడ్ రైళ్లను నడపాలనేది ప్రభుత్వం నిర్ణయం. ఇందుకోసం ఇటీవల గోవాలో రష్యా అధ్యక్షుడు పుతిన్, ప్రధాని మోదీ సమక్షంలో రెండు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చును రెండు దేశాలు 50:50 చొప్పున భరించేందుకు నిర్ణరుుంచాయి. ఇందులో భాగంగా రష్యా రైల్వేకు చెందిన 12 మంది ఇంజనీరింగ్ నిపుణులు హైదరాబాద్ వచ్చి అధికారులతో భేటీ అరుు శని, ఆదివారాలు రెండు రోజుల పాటు ఆ మార్గాన్ని స్థానిక అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా రష్యా బృందం కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఒకే లైన్‌తో ఇబ్బంది ఈ మార్గంలో నిత్యం 85 రైళ్లు పరుగుపెడుతున్నాయి. సరుకు రవాణా, సాధారణ ప్రయాణికుల రైళ్లు ఒకే లైన్‌పై నడుస్తున్నాయి. దీన్ని 200 కి.మీ. వేగానికి తగ్గట్టుగా స్థారుు పెంచాలంటే కొంతకాలంపాటు ఈ రైళ్లను ప్రత్యామ్నాయ మార్గాలమీదుగా మళ్లించాల్సి ఉంటుంది. బల్లార్షా మార్గం ఉత్తర- దక్షిణ భారతానికి ప్రధాన అనుసంధాన మార్గం కావటంతో దీనిపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఈ మార్గాన్ని మూయాలంటే సాధ్యమయ్యే పరిస్థితి లేదు. ఇక కనీసం 60 శాతం మేర పూర్తిస్థారుులో మారిస్తే తప్ప ఈ మార్గం కొత్త ప్రాజెక్టుకు పనికిరాదని రష్యా నిపుణులు పేర్కొన్నట్టు సమాచారం. అలాంటప్పుడు కొత్త మార్గాన్నే నిర్మించాల్సి ఉంటుంది. అందుకు దాదాపు రూ.20 వేల కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. ఇంతఖర్చును భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందా అన్నది ప్రధానాంశం. కొత్త లైన్‌తోనే లాభం.. హైస్పీడ్ రైళ్లు నడిచేందుకు తట్టుకునేలా నేల స్వభావం ఉన్నందున కొత్త లైను నిర్మిస్తే కొన్ని దశాబ్దాల పాటు భావి అవసరాలు తీరే అవకాశం ఉన్నందున కొత్త లైను నిర్మాణమే మేలని రష్యా నిపుణులు సూచించినట్లు సమాచారం. దీన్ని హైస్పీడ్ కారిడార్‌గా కూడా వినియోగించుకునే అవకాశం ఉంటుందని వారు సలహా ఇచ్చినట్టు తెలిసింది. దీనికి సంబంధించి పూర్తిస్థారుు నివేదికను త్వరలో రష్యా నిపుణులు రైల్వే బోర్డుకు సమర్పించనున్నారు. దాని ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఇక్కడి రైల్వే అధికారులు వెల్లడించారు. సగటు వేగం 80 కి.మీ మాత్రమే... ఈ లైనుపై సూపర్‌ఫాస్టు రైళ్లు 120 కి.మీ. వేగంతో ప్రయాణిస్తున్నాయి. కానీ వాస్తవంగా వాటి ప్రయాణ వేగం సగటున 80 కి.మీ.గా మాత్రమే ఉంటోంది. ఉన్న లైను పాతది కావటం, దాని దిగువన కాంక్రీట్ బెడ్ లేనందున అది అంతకంటే ఎక్కువ వేగాన్ని తట్టుకోలేదని వారు తేల్చారు. కనీసం గంటకు 150 కిలోమీటర్ల వేగాన్ని కూడా తట్టుకోలేదని రష్యా ఇంజనీర్లు తేల్చినట్టు సమాచారం. కాగా, వారు తమ పర్యటనలో సిగ్నలింగ్, ఇంజనీరింగ్ వ్యవస్థలు, బోగీల సామర్థ్యం, రైళ్ల ట్రాఫిక్, రైల్వే గేట్లు, వంతెనలు, ఇతర మౌలిక సదుపాయాల గురించి అధ్యయనం చేసినట్టు సమాచారం. ఖాజీపేటలో కూడా స్థానిక అధికారులతో రష్యా నిపుణులు భేటీ అయ్యారు. -
అక్టోబర్ తర్వాత పోటీలో ఉండననుకున్నా
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి 2015 జూన్‌లో ట్రంప్ తన ప్రచారాన్ని ప్రారంభించాక, అక్టోబర్‌కు మించి రేసులో ఉంటానని ఆయనే అనుకోలేదట. ఈ విషయాన్ని ఆయనే రిపబ్లికన్ పార్టీలో తన ప్రత్యర్థి, న్యూజెర్సీ గవర్నర్ క్రిస్ క్రిస్టీతో చెప్పినట్లు ఒక పుస్తకం పేర్కొంది. అప్పట్లో రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న వారిలో క్రిస్ క్రిస్టీ ఒకరు. ట్రంప్, క్రిస్టీలలో ఎవరు రేసు నుంచి వైదొలిగినా పోటీలో నిలిచిన వారికి ఓడిపోయిన వారు మద్దతు ఇచ్చుకోవాలని వారి మధ్య ఒప్పందం ఉండేదని సీఎన్ఎన్ రాజకీయ పాత్రికేయులు రాసిన ‘అన్‌ప్రెసిడెంటెడ్: ద ఎలక్షన్ దట్ చేంజ్డ్ ఎవ్రీథింగ్’ అనే పుస్తకంలో వివరించారు. ట్రంప్‌కు పుతిన్ ఫోన్ ట్రంప్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్ తొలిసారి మంగళవారం ఫోన్ చేశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు. రష్యాతో బలమైన బంధం ఏర్పరచుకునేందుకు ఉత్సుకతతో ఎదురు చూస్తున్నట్లు ట్రంప్ పుతిన్‌తో అన్నారు. ట్రంప్‌కు ఒబామా హెచ్చరిక ఇరాన్ అణు ఒప్పందం, పారిస్ వాతావరణ మార్పు ఒప్పందం లాంటి అంతర్జాతీయ నిర్ణయాలను రద్దు చేయకూడదని అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు ఒబామా ట్రంప్‌ను హెచ్చరించారు. ట్రంప్ పరిపాలనకు, ప్రచారానికి తేడా తెలుసుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రతిష్టాత్మక ఒప్పందాలు కుదరడం వెనుక ఎంతో శ్రమ ఉందన్నారు. మిషెల్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మహిళ అమెరికా ప్రథమ మహిళ మెషెల్ ఒబామాపై చార్ల్స్టన్లోని క్లే పట్టణానికి చెందిన పమేలా టేలర్ అనే మహిళ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఇక అందమైన, హుందాగా ఉండే ప్రథమ పౌరురాలిగా మెలానియా ట్రంప్ రాబోతోంది. ఇన్నాళ్లూ హై హీల్స్ వేసుకున్న కోతిలా ఉండే మిషెల్‌ని చూడలేక విసిగిపోయాను’ అని ఆమె తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. నెటిజన్ల నుంచి ఆగ్రహం వ్యక్తం కావడంతో పోస్ట్ తీసేసి క్షమాపణలు కోరారు. -
మరింత బలోపేతంగా బ్రిక్స్
అంతర్జాతీయ ఎజెండాను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర హాంగ్జౌ: అంతర్జాతీయంగా తన వాణిని బలంగా వినిపించే శక్తిగా బ్రిక్స్(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) సమాఖ్య ఎదిగిందని మోదీ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ ఎజెండాను తీర్చిదిద్దడంలో బ్రిక్స్ కీలక పాత్ర పోషిస్తోందని, అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ లక్ష్యాలను సాధించేందుకు వీలుగా సహాయం అందిస్తోందని చెప్పారు. జీ20 సదస్సుకు ముందుగా బ్రిక్స్ దేశాల అధినేతల సమావేశంలో మోదీ ప్రసంగించారు. ఈ సమావేశంలో బ్రెజిల్ అధ్యక్షుడు మైఖెల్ తీమెర్, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా పాల్గొన్నారు. వీరితో మోదీ ద్వైపాక్షికంగానూ చర్చలు జరిపారు. ‘దక్షిణ ఆసియా లేదా ప్రపంచంలో ఎక్కడైనా సరే ఉగ్రవాదులకు బ్యాంకులు, ఆయుధాల తయారీ పరిశ్రమలు లేవు. కానీ ఎవరో వారికి నిధులు, ఆయుధాలు సరఫరా చేస్తున్నారనేది స్పష్టం. అందువల్ల బ్రిక్స్ దేశాలు సంయుక్తంగా ఉగ్రవాదం కట్టడికి చర్యలు తీసుకోవాలి. ఉగ్రవాదులపైనే కాక వారికి సహాయ సహకారాలు అందిస్తున్న వారిని కూడా గుర్తించి చర్యలు తీసుకోవాలి’ అని మోదీ సూచించారు. చైనాకు మిత్రదేశమైన పాకిస్థాన్‌ను ఉద్దేశించే మోదీ ఈ వ్యాఖ్యలు చేసినట్టు స్పష్టమవుతోంది. స్థిరత్వానికి ఉగ్రవాదం అవరోధంగా మారిందని, ఇది మానవాళికి ముప్పుగా పరిణమించిందని అన్నారు. సామాజిక మాద్యమాల ద్వారా ఉగ్రవాద భావజాల వ్యాప్తి విస్తృతమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం బ్రిక్స్ దేశాధినేతలు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ప్రపంచ శాంతికి, భద్రతకు విఘాతం కలిగిస్తున్న ఉగ్రవాదాన్ని వారు తీవ్రంగా ఖండించారు. -
మొదటి యూనిట్‌ను ప్రారంభించిన ప్రధాని మోది
-
ట్రంప్, పుతిన్‌ల బ్రొమాన్స్!
విల్నీయస్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్ష పదవికి రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్‌లకు సంబంధించిన ఓ పేయింటింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇరువురు ప్రముఖ నేతల గాఢ చుంబనాన్ని చూపిస్తున్న ఈ గ్రాఫిటీ పెయింటింగ్‌ను లిథువేనియా వీధుల్లో స్థానిక కళాకారుడు మిండాగస్ బొనాను వేసాడు. బార్బెక్యూ రెస్టారెంట్ సహ యజమాని డొమినికాస్తో కలిసి ఇటీవల ఆవిష్కరించిన ఈ పెయింటింగ్ ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. తూర్పు జర్మనీ కమ్యూనిస్టు నాయకుడు ఎరిక్ హోనెక్కర్, సోవియట్ లీడర్ లియోనార్డ్ బ్రెజ్నెవ్కు సంబంధించిన ఓ ఫోటో గ్రాఫ్ ఆధారంగా.. 1990లో బెర్లిన్ గోడపై గ్రాఫిటీ కళాకారుడు దిమిత్రీ రూబెల్ వేసిన పెయింటింగ్‌తో ఈ చిత్రానికి పోలికలున్నాయి. అయితే 'మేక్ ఎవ్రిథింగ్ గ్రేట్ ఎగైన్' అంటూ క్యాప్షన్‌ను కూడా జోడించిన పుతిన్, ట్రంప్ ల చిత్రంపై నెటీజనులు పలురకాలుగా స్పందిస్తున్నారు. గతంలో పలు సందర్భాల్లో ట్రంప్, పుతిన్ ఒకరినొకరు అభినందించుకున్న విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు. దీనిపై డొమినికస్ మీడియాతో మాట్లాడుతూ.. ఇద్దరు నేతల మధ్య సారూప్యతల ఫలితంగా వచ్చిన ఆలోచన ఇదని తెలిపాడు. -
ఈ జగదేక శ్రీమంతులు నలుపా.. తెలుపా?
సంచలన విషయాలు బయటపెట్టిన ఐసీఐజే విదేశాల్లో ప్రముఖులకు చెందిన 2,14,000 కంపెనీల గుట్టురట్టు ► విదేశాల్లో ప్రముఖులకు చెందిన 2,14,000 కంపెనీల గుట్టురట్టు ► డబ్బులు దాచడానికి గుట్టల కొద్దీ పుట్టుకొచ్చిన కంపెనీలు ► ‘పనామా’లో మొస్సాక్ ఫోన్సెకా సంస్థ ద్వారా ఏర్పాటు ► యజమానుల పేర్లు రహస్యంగా ఉంచటమే ఈ సంస్థ పని ► మొస్సాక్ ఫోన్సెకాకు చెందిన 1.15 కోట్ల రహస్య పత్రాలు వెల్లడి ► జాబితాలో అమితాబ్, ఐశ్వర్యారాయ్, డీఎల్ఎఫ్ కేపీ సింగ్ ► నాయకులు, కార్పొరేట్లు సహా 500 మంది భారతీయుల పేర్లు ► ప్రపంచవ్యాప్తంగా 140 మంది రాజకీయ నాయకులు ► రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా డజను మంది ప్రస్తుత, మాజీ దేశాధినేతలు ► అమెరికా నిషేధించిన డ్రగ్ గ్యాంగులు, టైస్టు సంస్థలదీ ఇదే తీరు ► మే తొలి వారంలో మొత్తం జాబితా బయట పెడతామన్న ఐసీఐజే పన్ను స్వర్గాల్లోని కుబేరుల గుట్టు బయటపడింది. చట్టాలకు, పన్నులకు అతీతంగా ఉండే దేశాల్లో గుట్టలకొద్దీ కంపెనీలను ఏర్పాటు చేసి డబ్బులు తరలించిన శ్రీమంతుల రహస్యాలు మరోసారి వెలుగుచూశాయి. వీరిలో ప్రపంచవ్యాప్తంగా పలువురు దేశాధినేతలతోపాటు బాలీవుడ్ స్టార్లు అమితాబ్, ఐశ్వర్యారాయ్, పలువురు క్రీడాకారులు... ఒకరేమిటి!! చివరకు మాఫియా డాన్లు, దొంగలు, మాదకద్రవ్యాల స్మగ్లర్లు, అవినీతి రాజకీయ నేతలు, పన్ను ఎగవేతదారులు సైతం చాలామందే ఉన్నారు. వీళ్లే కాదు. ఉగ్రవాదం ఆరోపణలపై అమెరికా గతంలో నిషేధించిన సంస్థలు, రోగ్ దేశాలుగా పేర్కొన్న దేశాల నేతలదీ ఇదే తీరు. దాదాపు 120 దేశాల్లోని జర్నలిస్టులు, మీడియా సంస్థలతో కూడిన ‘కన్సార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ఐసీఐజే) ఈ గుట్టు బయటపెట్టింది. ఈ కన్సార్షియంలో మన దేశం నుంచి ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పత్రిక ఉంది. దర్యాప్తులో భాగంగా 2,14,000 విదేశీ కంపెనీలకు చెందిన 2.6 టెరాబైట్ల డేటాను... 1.15 కోట్లకుపైగా పత్రాల్ని ఐసీఐజే చేజిక్కించుకుంది. వీటిలో ఈ-మెయిల్స్, పాస్‌పోర్టులు, బ్యాంకు ఖాతాలు, క్లయింట్ల రికార్డులు... చాలానే ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ పనామా కేంద్రంగా పనిచేస్తున్న న్యాయ సేవల సంస్థ ‘మొస్సాక్ ఫోన్సెకా’కు చెందినవి. వీళ్లందరి పేరిటా గుట్టలకొద్దీ రహస్య కంపెనీలు ఏర్పాటు చేసిన సంస్థ ఇదే. దాదాపు 40 ఏళ్ల పాటు.. అంటే 1977 నుంచి 2015 డిసెంబర్ వరకు ఉన్న డేటాను పరిశీలించి ఈ వివరాల్ని ఐసీఐజే బయటపెట్టింది. జాబితాలోని అందరి పేర్లనూ మే మొదటివారంలో వెల్లడిస్తామని ఐసీఐజే స్పష్టంచేసింది. పారిస్/న్యూఢిల్లీ దేశ, విదేశాల్లో పనామా పేపర్లు పెను సంచలనం సృష్టించాయి. రహస్య డాక్యుమెంట్ల ద్వారా వెల్లడైన అంశాలు అనేక ప్రశ్నలను తెరపైకి తెచ్చాయి. ఇంతకీ ఆ పేపర్లు బయటపెట్టిందేంటి? ఇదేమైనా మోసమా? మనీ లాండరింగా? ఒకసారి చూద్దాం... మొస్సాక్ ఫోన్సెకా: ఈ కంపెనీ తమ క్లయింట్ల రహస్యాలకు కాపలాదారు లాంటిది. దీని క్లయింట్లలో మాఫియా డాన్లు, మాదకద్రవ్యాల స్మగ్లర్లు, పన్ను ఎగవేతదారులు, అవినీతి రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. క్లయింట్ల విదేశీ రహస్యాలను కాపాడే ప్రపంచంలోని 5 అతిపెద్ద కంపెనీల్లో ఫోన్సెకా ఒకటి. 500 మందికిపైగా ఉద్యోగులు, సహాయకులు ఉన్న ఈ సంస్థకు... ప్రపంచవ్యాప్తంగా 40 కార్యాలయాలున్నాయి. వీటిలో స్విస్‌లో 3, చైనాలో 8 ఉండటం గమనార్హం. ఇదేం చేస్తుందంటే... పన్ను స్వర్గాల్లాంటి దేశాల్లో ఎవరైనా డబ్బులు దాచుకోవాలంటే... వారి రహస్యాలు బయట పడకుండా ఈ సంస్థ అల్లిబిల్లి కంపెనీలను సృష్టిస్తుంది. ఒకవేళ ఆయా దేశాల్లో చట్టాలు గనక మారితే... వెంటనే క్లయింట్లను అప్రమత్తం చేసి, అక్కడి సంస్థల్ని ఆగమేఘాల మీద వేరే దేశాలకు తరలిస్తుంది. అసలు యజమానుల పేరు బయటకు తెలియకుండా... వారి తరఫున ఫోన్సెకా నమోదు చేసిన కంపెనీ పేరే ఎక్కడైనా కనపడుతుంది. ఇది తనకు చెందిన పలువురు డ మ్మీలను నామినీ డెరైక్టర్లుగా నియమిస్తుంది. దీంతో వీళ్లపేర్లే బయటకు కనిపిస్తాయి. ఇక క్లయింట్లు ఇచ్చే సొమ్మును బట్టి రకరకాల దేశాల్లో, రకరకాల కంపెనీలను ఇది సృష్టిస్తుంది. దీంతో దర్యాప్తు చేసేవారి తలప్రాణం తోకకొస్తుంది. పనామాలో ఫోన్సెకా సంస్థ క్లయింట్ల తరఫున ప్రైవేట్ ఫౌండేషన ్లను ఏర్పాటు చేస్తోంది. ఎందుకంటే పనామాలో వీటిపై పన్నులు లేవు. అక్కడి చట్టప్రకారం వీటి వ్యవస్థాపకుల, లబ్ధిదారుల పేర్లు వెల్లడించాల్సిన అవసరం లేదు. ఇదికాక... క్లయింట్లు ఇరుక్కున్నపుడు డాక్యుమెంట్లకు వెనకటి తేదీలు వేయటంతో పాటు, ఆస్తుల్ని దాచుకోవటానికి వీలుగా క్లయింట్ల పేరిట ఫౌండేషన్లు ఏర్పాటు చేసి, వాటి లబ్ధిదారుగా తొలుత ఏదైనా స్వచ్ఛంద సంస్థను పేర్కొనటం, తరవాత లబ్ధిదారును మార్చేయటం చేస్తోంది. ఇదీ... ఇండియా కథ ప్రపంచవ్యాప్తంగా ఇలా కంపెనీలు పెట్టి, డబ్బు దాచుకున్న వారిలో 500కు పైగా భారతీయుల పేర్లూ బయటపడ్డాయి. వీరిలో బాలీవుడ్ స్టార్లు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు చాలామందే ఉన్నారు. అయితే ఇక్కడ అందరికీ తలెత్తే ప్రశ్న ఒక్కటే!!. వీరిలా డబ్బులు దాచుకోవటం నేరమా? విదేశాల్లో కంపెనీలు పెట్టడం తప్పా? ఇది చట్ట సమ్మతమేనా... కాదా? ఈ ప్రశ్నలకు జవాబులు చూద్దాం... మనదేశంలో పన్నులు చాలా ఎక్కువే. దీంతో మనవాళ్లు కొందరు విదేశాల్లో సంపాదించే డబ్బుల్ని అక్కడే ఉంచుకోవటానికి ఇష్టపడుతున్నారు. నిజానికి 2004 వరకు భారతీయులు తమ రూపాయల్ని విదేశీ కరెన్సీలోకి మార్చుకుని విదేశాల్లో పెట్టుబడి పెట్టడానికి ఆర్బీఐ అనుమతించేది కాదు. అయితే కంపెనీలకు ఇవి వర్తించేవి కావు. అవి ఆర్బీఐ, ప్రభుత్వ అనుమతితో విదేశాల్లో కంపెనీల్ని కొనుగోలు చేసేందుకు వీలుండేది. దీంతో వ్యక్తులు విదేశాల్లో ట్రస్టులు ఏర్పాటు చేసి, పవరాఫ్ అటార్నీ తమపేరున పెట్టుకునేవారు. ఇలాంటి ట్రస్టుల్ని ఫోన్సెకాా ఏర్పాటు చేసేది. ఇదీ నేరం... ఇక్కడ గమనించాల్సిందేమిటంటే... 2004 వరకు తమ రూపాయలు విదేశీ కరెన్సీలోకి మార్చుకుని విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఏ వ్యక్తికీ ఆర్బీఐ అనుమతి లేదు. ఈ లెక్కన చూస్తే... 2004కు ముందు విదేశాల్లో తమ పేరిట ఖాతాలు తెరిచిన భారతీయులంతా చట్ట విరుద్ధంగా చేసినట్లే. అది నేరమే. 2004లో ఆర్బీఐ అనుమతి... రిజర్వుబ్యాంకు 2004 ఫిబ్రవరిలో సరళీకృత రెమిటెన్స్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్)ను ఆర్బీఐ ప్రకటించింది. దీనిప్రకారం ఎవరైనా ఒక ఏడాదిలో 25,000 డాలర్లు విదేశాలకు తీసుకెళ్లొచ్చు. ఆ మొత్తాన్ని మెల్లగా పెంచగా ఇపుడది 2.5 లక్షల డాలర్లకు చేరింది. దీన్ని వైద్య ఖర్చులు, విరాళాలు, కాలేజీ ఫీజు, షేర్ల క్రయవిక్రయాలకు వినియోగించవచ్చని ఆర్బీఐ పేర్కొంది. దేనికి వాడకూడదో మాత్రం చెప్పలేదు. షేర్లు కొనొచ్చని ఉంది కదా అనే సాకుతో... కొందరు వ్యక్తులు ‘పేపర్’ కంపెనీల్లో షేర్లను కొన్నారు. ఈ పేపర్ కంపెనీల్నే పెట్టుబడి గొట్టాలుగా మార్చారు. పేపర్ కంపెనీల్లో షేర్లను అమ్మటం ఫోన్సెకా పని. 2010లో మళ్లీ ఆర్బీఐ సవరణలు... రెమిటెన్స్ స్కీము దుర్వినియోగమవుతోందని భావించిన ఆర్బీఐ 2010లో వివరణిచ్చింది. భారతీయులు వ్యక్తిగతంగా విదేశాల్లో కంపెనీలను ఏర్పాటు చేయకూడదని తేల్చింది. కానీ నిపుణులు దీనికో భాష్యం చెప్పారు. ‘‘కంపెనీలు ఏర్పాటు చేయొద్దన్నారు గానీ... కంపెనీల్ని టేకోవర్ చెయ్యకూడదనలేదుగా?’’ అని లొసుగు వెతికారు. దీంతో షెల్ కంపెనీల్ని ఏర్పాటు చేసి వాటిని విక్రయించటం మొదలెట్టింది ఫోన్సెకా. 2013లో మరోసారి సవరణ... దేశంలో ఉన్న సంస్థలకు నూరుశాతం అనుబంధ సంస్థలైతే విదే శాల్లో ఏర్పాటు చేసుకోవచ్చంటూ 2013లో ఆర్బీఐ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. లేదా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఓడీఐ) ద్వారా భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోవచ్చని కూడా తెలిపింది. దీంతో సాంకేతికంగా... 2013కన్నా ముందు భారతీయులు విదేశాల్లో ఏర్పాటు చేసిన కంపెనీలు నిబంధనల్ని ఉల్లంఘించినట్లేనని ఐసీఐజే చెబుతోంది. ఐసీఐజే అంటే... ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు(ఐసీఐజే)లో 60 దేశాలకు చెందిన 160 మంది రిపోర్టర్లు ఉన్నారు. వీరు పరిశోధనాత్మక కథనాల కోసం పనిచేస్తున్నారు. దీన్ని 1997లో ఏర్పాటు చేశారు. ఖండాతర నేరాలు, అవినీతి వ్యవహారాలు, స్కాంలు వెలికితీస్తూ ‘వాచ్డాగ్’ జర్నలిజాన్ని అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ వార్తా సంస్థలతో కలిసి పనిచేస్తోంది. ఇలా చేస్తే మోసం చేసినట్టే ► 2004 కన్నా ముందు వ్యక్తులు విదేశాల్లో ఇన్వెస్ట్ చేసినా నేరమే. ► 2013కన్నా ముందు వ్యక్తులు విదేశాల్లో కంపెనీలు పెట్టినా నేరమే. ► మరో కీలకమైన అంశమేంటంటే ‘వెల్లడి ఒప్పందం’. వ్యక్తులు గనక ప్రభుత్వానికి, ఆర్బీఐకి చెప్పి.. దాని ప్రకారం ఇన్వెస్ట్ చేసి ఉంటే పెద్ద ఇబ్బందులుండవు. కానీ వీరెవరికీ విదేశాల్లోని తమ ఆస్తుల గురించి చెప్పకుండా ఉంటే మాత్రం... మనీలాండరింగ్, ఫెమా వంటి రకరకాల కేసులు వర్తిస్తాయి. ► విదేశాల్లో సంపాదించిన డబ్బును కూడా భారతీయులు అధికారులకు తెలియజేయాలి. వాటిని గనక ఫోన్సెకా ద్వారా అక్కడే వివిధ కంపెనీల్లో దాచి ఉంటే... పన్నులు ఎగవేసినట్టే. వారిని ప్రాసిక్యూట్ చేసే అవకాశముంటుంది. అందుకని మున్ముందు బయటపడాల్సిన అంశం ఇదే. ఇదో చిత్రమైన మెయిల్ ఫోన్సెకా కంపెనీ అధికారి నుంచి అమెరికా బిలియనీర్‌కు అందిన ఈ-మెయిల్‌ను ఐసీఐజే బయటపెట్టింది. దీన్లో... బ్యాంకును ఎలా మోసగిస్తారో సమగ్రంగా వివరించారు. ఖాతాదారుడికి బదులు వేరే వ్యక్తుల్ని బ్యాంకులకు పరిచయం చేస్తామని... అందువల్ల అసలు వ్యక్తి పేరు బయటకు రాదని, ఫీజు మాత్రం చాలా ఎక్కువగా ఉంటుందని ఈ-మెయిల్లో పేర్కొన్నారు. నిజానికి ఈ కంపెనీ క్లయింట్‌కు కావాల్సిన సేవల్ని బట్టి ఫీజులు వసూలు చేస్తోంది. ఫొన్సెకాలో కంపెనీ తెరిచేందుకు కావాల్సిన పత్రాలు 1. పాస్‌పోర్ట్ ఫొటోకాపీ 2. బ్యాంకు రిఫరెన్స్ ఉత్తరం 3. ఫ్రొఫెషనల్ రిఫరెన్స్ ఉత్తరం 4. ఏదైనా నెలవారీ వినియోగదారుల స్టేట్మెంట్ దర్యాప్తు బృందం ఏర్పాటు భారత్‌కు చెందిన 500 మంది విదేశాల్లో సొమ్ము దాచుకున్నట్లు పనామా పేపర్స్ ద్వారా వె ల్లడి కావడంతో దీనిపై కేంద్రం స్పందించింది. ఇందులో వెలుగుచూసిన అంశాలను పరిశీలించి దర్యాప్తు చేసేందుకు వివిధ విభాగాల ఉన్నతాధికారులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మంగళవారం వెల్లడించారు. ఈ అంశంపై ప్రధాని మోదీ తనతో చర్చించారని, ఆయన సూచన మేరకు దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. సీబీడీటీ, ఆర్బీఐ, ఎఫ్ఐయూ(ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్) విభాగాల ఉన్నతాధికారులతో ఈ బృందం ఏర్పాటైంది. ఈ వివరాల ఆధారంగా తాము కూడా దర్యాప్తు చేపడతామని నల్లధనంపై ఏర్పాటైన సిట్ వెల్లడించింది. మా దేశంపై దాడి: మొసాక్ ఫోన్సెకా తమ సంస్థకు చెందిన రహస్య పత్రాలను వెల్లడించడంపై పనామాలోని మొసాక్ ఫొన్సెకా మండిపడింది. ‘‘ఇది నేరం. మోసం. మా దేశంపై దాడి. మా దేశం అనేక కంపెనీలను ఆకర్షించడం జీర్ణించుకోలేని కొన్ని దేశాలు కుట్రతో ఇదంతా చేశాయి’’ అని ఆ సంస్థ వ్యవస్థాపక సభ్యుడు రామన్ ఫొన్సెకా అన్నారు. హ్యాకింగ్ చేసి అక్రమంగా డాక్యుమెంట్లు సంపాదించారని ఆరోపించారు. లీకైన పత్రాల్లో చాలావరకు నిజమైనవేనన్నారు. 40 ఏళ్ల నుంచి కంపెనీ నడుపుతున్నామని, ఎప్పుడూ ఎలాంటి తప్పు చేయలేదన్నారు. బ్యాంకుల్ని మోసగించడానికి ఎలాంటి సేవలు అందించలేదని తెలిపారు. మన దేశంలో ఎవరెవరు? ఐశ్వర్యారాయ్ ఐశ్వర్యారాయ్, ఆమె తల్లిదండ్రులు బృందా కృష్ణరాజ్ రాయ్, కృష్ణరాజ్, సోదరుడు ఆదిత్య రాయ్ డెరైక్టర్లుగా 2005లో బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌లోని ఓ కంపెనీ ఏర్పాటైంది. దాని పేరు ఆమిక్ పార్టనర్స్ లిమిటెడ్. 2008లో ఆ కంపెనీ మూతపడే వరకు ఐశ్వర్యారాయ్ ఆ కంపెనీ షేర్‌హోల్డర్‌గా ఉన్నారు అమితాబ్ బచ్చన్ బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌తోపాటు బహమాస్‌లో 1993లో ఏర్పాటు చేసిన నాలుగు షిప్పింగ్ కంపెనీలకు డెరైక్టర్‌గా పనిచేశారు. ఈ కంపెనీల ద్వారా మిలియన్ డాలర్ల వ్యాపారం చేశారు. కేపీ సింగ్ ప్రముఖ భవన నిర్మాణాల సంస్థ డీఎల్ఎఫ్ ప్రమోటర్ ఈయన. బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌లో 2010లో నమోదైన ఓ కంపెనీని తన భార్య ఇందిరాసింగ్తో కలిసి కొనుగోలు చేశారు. ఈయన తనయుడు రాజీవ్‌సింగ్, కూతురు పియాసింగ్ పేరిట 2012లో మరో రెండు కంపెనీలు నెలకొల్పారు. వీటి విలువ సుమారు కోటి డాలర్లు ఉంటుందని అంచనా. గర్వారే కుటుంబం వ్యాపార దిగ్గజం గర్వారే కుటుంబానికి చెందిన అశోక్, ఆయన కుమారుడు ఆదిత్య, భార్య సుష్మ గర్వారేలకు బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ (బీవీఐ)లో ఏర్పాటైన రాండార్ ఓవర్సీస్ సహా పలు విదేశీ సంస్థల్లో వాటాలున్నాయి. 1996 మేలో రాండార్ ఏర్పాటైంది. ఆదిత్య, సుష్మలకు పలు పనామా సంస్థల్లో పవర్ ఆఫ్ అటార్నీలున్నాయి. 10,000 డాలర్ల ఆస్తులతో గర్వారేలు 2010లో ఫుజియామా టీమ్ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. ఇంకా పలు పనామా సంస్థల్లో ఆదిత్య, సుష్మలకు పవర్ ఆఫ్ అటార్నీలు ఉన్నాయి. వీటిలో చాలా మటుకు సంస్థలు 2014లో మూతపడ్డాయి. విదేశీ మిత్రులతో కలిసి ఏర్పాటు చేసిన కొన్ని సంస్థల ప్రధానోద్దేశం భారత్‌లో పెట్టుబడులు పెట్టడమేనని, అది నెరవేరకపోవడంతో చాలా మటుకు సంస్థలు మూతబడ్డాయని, వీటితో గర్వారే కుటుంబసభ్యులకు ఎటువంటి ప్రమేయమూ లేదని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇండియా బుల్స్ దేశీ రియల్టీ దిగ్గజాల్లో ఒకైటె న ఈ సంస్థ సమీర్ గెహ్లాట్, ఆయన సోదరుడు నాగేంద్ర, తండ్రి బల్వాన్ సింగ్‌ల సారథ్యంలో ఉంది. 2012లో కుటుంబ ఆస్తుల నిర్వహణ కోసం ఎస్జీ ఫ్యామిలీ ట్రస్ట్ ఏర్పాటైంది. దీనికి పర్పెచ్యువల్ మేనేజ్మెంట్ ప్రైవేట్ సంస్థ ట్రస్టీగా ఉంది. ఎస్జీ ట్రస్టు ఆధ్వర్యంలోని క్యాలేయిస్ ఇన్ఫ్రాకు క్లైవ్డేల్ ఓవర్సీస్ అనే అనుబంధ సంస్థ ఉంది. ఈ క్లైవ్డేల్కు బహమాస్, మారిషస్, బ్రిటన్ దేశాల్లో పలు అనుబంధ సంస్థలున్నాయి. ఈ సంస్థల్లో చాలా వాటి గురించి నియంత్రణ సంస్థలకు ట్రస్ట్ వెల్లడించినప్పటికీ.. బ్రిటన్ లావాదేవీల గురించి మాత్రం వెల్లడించలేదు. క్లైవ్డైల్కు లండన్‌లో మూడు ప్రాపర్టీలున్నాయి. వీటిలో విలాసవంతమైన అపార్ట్మెంట్ల నిర్మాణం జరుగుతోంది. శిశిర్ కె బజోరియా ఆరు దేశాల్లో ఉక్కు రిఫ్రాక్టరీ యూనిట్లున్న ఎస్కే బజోరియా గ్రూప్ ప్రమోటరు. ఈయన కోల్‌కతాకి చెందిన పాత తరం వ్యాపార కుటుంబానికి చెందిన వ్యాపారవేత్త. బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్ (బీవీఐ)కి చెందిన హాప్టిక్ (బీవీఐ) సంస్థ యజమానిగా ఫస్ట్ నేమ్స్ గ్రూప్, బజోరియా పేర్లున్నాయి. దీని ఆస్తులు మిలియన్ డాలర్ల పైగా ఉన్నాయి. తమ కుటుంబం ఫస్ట్ నేమ్స్ గ్రూప్‌కి క్లయింట్లు మాత్రమేనని, హాప్టిక్‌తో ఎటువంటి సంబంధం లేదని శిశిర్ ప్రకటించారు. ఓంకార్ కన్వర్ టైర్ల తయారీలో ఉన్న అపోలో గ్రూప్ చైర్మన్. కన్వర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు బీవీఐలో జేఅండ్‌ఎస్ సిస్టమ్స్ కార్పొరేషన్‌ను, రెండు ట్రస్టులను ఏర్పాటు చేశారు. జేఅండ్ఎస్కు మెర్కామ్ ఆయిల్ శాండ్స్‌లో మిలియన్ షేర్లతో పాటు బార్క్లేస్ బ్యాంక్, కేమాన్ నేషనల్ బ్యాంక్ అండ్ ట్రస్ట్ కంపెనీలో ఖాతాలు ఉన్నాయి. 2014 నవంబర్ 30 నాటికి కేమాన్ ఖాతాలో 3,65,478 పౌండ్ల బ్యాలెన్స్ ఉంది. కన్వర్ కుటుంబం భారత చట్టాలకు అనుగుణంగానే విదేశీ పెట్టుబడులు పెట్టిందని అపోలో టైర్స్ వివరణ ఇచ్చింది. హరీశ్ సాల్వే ప్రముఖ లాయరు. 1999-2002 మధ్య సొలిసిటర్ జనరల్‌గా కూడా వ్యవహరించారు. సాల్వే కుటుంబం బీవీఐలో క్రెస్ట్‌బ్రైట్, పెబుష్ గ్రూప్, ఎడెన్వాల్ సంస్థలను ఏర్పాటు చేసింది. బ్రిటన్‌లో తన పెట్టుబడుల నిర్వహణ కోసం చట్టబద్ధంగా 2012లో క్రెస్ట్‌బ్రైట్‌ను ఏర్పాటు చేసినట్లు, ప్రస్తుతం ఏ కంపెనీకి ఆస్తులు, ఆదాయం లేవని సాల్వే పేర్కొన్నారు. జహంగీర్ ఎస్ సొరాబ్జీ మాజీ టార్నీ జనరల్ సోలి సొరాబ్జీ తనయుడు, బోంబే హాస్పిటల్లో గౌరవ కన్సల్టెంటు. బీవీఐలో 2010 నవంబర్‌లో ఏర్పాటైన మూన్గ్లో ఇన్వెస్ట్మెంట్స్ గ్లోబల్‌లో ఏకైక షేర్‌హోల్డరు. ఆర్బీఐ స్కీము ప్రకారమే విదేశాల్లో ఇన్వెస్ట్మెంటు కోసం పంపిన నిధులను కంపెనీ అందుకుందని, తన ఐటీ రిటర్నుల్లో కూడా వివరాలన్నీ పొందుపర్చడం జరిగిందని జహంగీర్ తెలిపారు. మోహన్‌లాల్ లోహియా ఇండో రమా సింథటిక్స్ గౌరవ చైర్మన్. 2007లో బీవీఐలో రిజిస్టరయిన వెంటన్ గ్రూప్‌కు ఫస్ట్ డెరైక్టర్ కూడా. సహజసిద్ధంగా ఇది మూతబడేలా వదిలేయాలని 2012లో ఫోన్సెకాకు ఈమెయిల్ ద్వారా సందేశం పంపారు. 2010లో లోహియా చారిటబుల్ ఫౌండేషన్‌ను 10,000 డాలర్ల కార్పస్‌తో ఏర్పాటు చేశారు. జవారే పూనావాలా కోటీశ్వరుడు సైరస్ పూనావాలా సోదరుడైన జవారే.. రాయల్ వెస్టర్న్ ఇండియా టర్ఫ్ క్లబ్ మేనేజింగ్ కమిటీకి సారథి. రియల్టీ, ఆతిథ్య తదితర రంగాలకు చెందిన నాలుగు సంస్థల బోర్డుల్లో ఉన్నారు. 2013లో బీవీఐలో ఏర్పాటైన స్టాలాస్ట్లో జవారే, ఆయన భార్య బెహ్రోజ్, ఇద్దరు కుమార్తెలు డెరైక్టర్లుగా ఉన్నారు. ఇందిరా శివశైలం, మల్లికా శ్రీనివాసన్ అమాల్గమేషన్స్ గ్రూప్ చైర్మన్ అనంతరామకృష్ణన్ శివశైలం సతీమణి అయిన ఇందిర 2008లో కన్ను మూశారు. ప్రస్తుతం టాఫే చైర్మన్‌గా ఉన్న మల్లికా శ్రీనివాసన్ ఈమె కుమార్తె. 1999లో బీవీఐలో ఏర్పాటైన స్టాన్‌బ్రిడ్జ్ కంపెనీ షేర్‌హోల్డరుగా ఇందిర పేరుంది. తర్వాత ఆ వాటాలు కుమార్తెలకు అందాయి. స్టాన్బ్రిడ్జ్కి తనకు ఎటువంటి సంబంధం లేదని మల్లికా శ్రీనివాసన్ వివరణిచ్చారు. అబ్దుల్ రషీద్ మీర్ కాటేజ్ ఇండస్ట్రీస్ ఎక్స్పొజిషన్ (సీఐఈ) వ్యవస్థాపకుడు, సీఈవో. పనామాలో 2002లో మాండేల్ ఎస్‌ఏను 10,000 డాలర్ల అథీకృత మూలధనంతో ఆయన ప్రారంభించారు. కంపెనీలో వాటాలను మీర్ కుమారుడు ముజీబ్‌కు దఖలుపర్చడం జరిగింది. ముజీబ్ 2005లో హత్యకు గురికావడంతో రషీద్ మీర్, తబసుమ్ మీర్లు మాండేల్ ఎస్ఏ అదనపు డెరైక్టర్లుగా నియమితులయ్యారు. తబసుమ్ మీర్ 17 భారత కంపెనీల్లో డెరైక్టరుగా ఉన్నారు. ముజీబ్ మరణానంతరం ట్రస్టును మూసివేసి, వచ్చిన వాటిని కుటుంబ సభ్యులకు పంచేయడం జరిగిందని, భారత ప్రభుత్వానికీ వివరాలు సమర్పించామని తబసుమ్ పేర్కొన్నారు. ప్రపంచ నేతల్లో ఎవరెవరంటే.. 50 దేశాల్లోని సుమారు 140 మంది రాజకీయ నేతలు విదేశాల్లో కంపెనీలు పెట్టి పెద్దఎత్తున సొమ్మును పోగేసుకున్నారు. వారిలో 12 మంది ప్రస్తుత, మాజీ దేశాధ్యక్షులతోపాటు ప్రముఖ సినీనటుడు జాకీచాన్ వంటి వారున్నారు. వారిలో ముఖ్యుల వివరాలివీ.. వ్లాదిమిర్ పుతిన్ (రష్యా అధ్యక్షుడు) ఈయన నేరుగా కంపెనీలు ఏర్పాటు చేయకపోయిన తన సన్నిహితుల ద్వారా ఇబ్బడిముబ్బడిగా నెలకొల్పారు. ఇలా అనేక దేశాల్లో ఏర్పాటైన కంపెనీల విలువ 200 కోట్ల డాలర్లు ఉంటుందని అంచనా. జిన్‌పింగ్ (చైనా అధ్యక్షుడు) వర్జిన్ ఐలాండ్స్‌లో ఈయన బావమర్ది పేరిట 2 కంపెనీల్లో పెద్దఎత్తున షేర్లున్నాయి. సిగ్మున్దుర్ డేవిడ్ గన్లాగ్సన్ (ఐస్‌ల్యాండ్ ప్రధాని) విదేశాల్లో భార్య పేరిట అనేక కంపెనీలు ఏర్పాటు చేశారు. పెట్టుబడుల కోసం అందులో పెద్దఎత్తున సొమ్ము దాచారు. పీట్రో పొరోషెంకో (ఉక్రెయిన్ అధ్యక్షుడు) విదేశాల్లో పలు కంపెనీల్లో మెజారిటీ వాటాలు కలిగి ఉన్నారు. వీటి విలువ కోట్లలో ఉంటుంది. నవాజ్ షరీఫ్ (పాక్ ప్రధాని) తన కుటుంబీకుల పేరిట బ్రిటన్‌లో పలు కంపెనీలు, ఆస్తులున్నాయి డేవిడ్ కామెరూన్ (బ్రిటన్ ప్రధాని) కామెరాన్ తండ్రి పనామాలో ఓ కంపెనీ ఏర్పాటు చేశారు. పన్నులు ఎగ్గొటేందుకు అనేక మార్గాలు చూపిచండం ఈ కంపెనీ ప్రత్యేకత. మాక్రి (అర్జెంటీనా అధ్యక్షుడు) ఈయన తండ్రి, సోదరుడు విదేశాల్లో అనేక కంపెనీలు నడుపుతున్నారు -
ఉత్తర కొరియా అధ్యక్షుడికి రష్యా హెచ్చరిక!
మాస్కో: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన దుందుడుకు చర్యలను తగ్గించుకోవాలని రష్యా సూచించింది. శత్రుదేశాలను ఎదుర్కోవడానికి అణ్వాయుధాలను ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నాం అంటూ కిమ్ చేస్తున్న ప్రకటనలు అంతర్జాతీయ న్యాయ చట్టాల ఉల్లఘన కిందకు వస్తుందని, తద్వారా ఉత్తర కొరియాపై సైనిక చర్యకు దిగే చట్టపరమైన అవకాశం ఉంటుందని హెచ్చరిస్తూ రాష్యా విదేశాంగ శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. అంతర్జాతీయ అణ్వాయుధ నిరోధక చట్టాలను దిక్కరిస్తూ హైడ్రోజన్ బాంబు ప్రయోగం నిర్వహించి కిమ్ దూకుడును ప్రదర్శించిన విషయం తెలిసిందే. అనంతరం అణ్వాయుధాలను ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నామంటూ, బాలిస్టిక్ క్షిపణుల ద్వారా సుదూర ప్రాంతాల్లోని లక్ష్యాలను సైతం చేదించేలా అణ్వాయుధాలను సూక్ష్మీకరించడంలో ఉత్తర కొరియా విజయం సాధించినట్లు కిమ్ ప్రకటించారు. ఉద్రిక్త పరిస్థితుల మధ్య అమెరికా, ఉత్తర కొరియా సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా చర్యలపై రష్యా చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. -
తాలిబన్ చీఫ్‌తో రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ
-
మా పూర్తి మద్దతు ఉంటుంది
-
మాస్కో చేరుకున్న ప్రధాని మోదీ
మాస్కో: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక విమానంలో రష్యా రాజధాని మాస్కో చేరుకున్నారు. సావత్సరిక చర్చల్లో భాగంగా రెండు రోజులపాటు ప్రధాని మోదీ రష్యాలో పర్యటిస్తారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ తో ప్రధాని భేటీ కానున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన తర్వాత ద్వైపాక్షిక సంబంధాల చర్చ నిమిత్తం చేస్తున్న తొలి రష్యా పర్యటన. గతంలో 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా రష్యా వెళ్లిన మోదీ ప్రస్తుతం ప్రధాని పదవిలో అక్కడికి వెళ్లారు. భారత్, రష్యా మధ్య ఆర్థిక, శక్తి, రక్షణ సంబంధమైన అంశాలకు సంబంధించి అగ్రనేతలు ఒప్పందాలు చేసుకోనున్నారు. సాంకేతిక పరిజ్ఞానం, మైనింగ్ ఇతర రంగాల్లో పరస్పర ఒప్పందాలపై ఇరుదేశాల నేతలు చర్చిస్తారు. రష్యా వ్యాపారవేత్తలతో కూడా ప్రధాని సమావేశం అవుతారు. -
'రష్యా మాకు చిరకాల మిత్రురాలు'
న్యూఢిల్లీ: రష్యా పర్యటనపట్ల తానెంతో ఆశావాహంతో ఉన్నానని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఈ పర్యటన ఎంతో ముఖ్యమైనదని చెప్పారు. సావత్సరిక చర్చల్లో భాగంగా రెండు రోజులపాటు ప్రధాని మోదీ రష్యాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ తో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ బుధవారం ఒక ప్రకటన చేశారు. ఈ ప్రకటనలో 'నేను ఈ రోజు రష్యా పర్యటనను ప్రారంభిస్తున్నాను. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన తర్వాత ద్వైపాక్షిక సంబంధాల చర్చ నిమిత్తం చేస్తున్న తొలి రష్యా పర్యటన. ఈ పర్యటనపట్ల నేనేంతో ఆశావాహంతో ఉన్నాను. భారత్-రష్యా మధ్య సంబంధాలు ఎంత గొప్పవో చరిత్ర చెబుతుంది. ప్రపంచంలోనే రష్యా భారత్ కు కీలక మిత్రురాలు. ఈ సందర్భంగా నా ఆలోచన ఓసారి 2001లోకి వెళ్లింది. నాడు నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోగానే నాడు అటల్ బిహారీ వాజపేయితోపాటు రష్యాకు వెళ్లాను. మళ్లీ ఇప్పుడు. నా పర్యటనతో భారత్-రష్యా మధ్య ఆర్థిక, శక్తి, రక్షణ సంబంధమైన అంశాలు ప్రధానంగా ఒప్పందాలు చేసుకోవడంతోపాటు సాంకేతిక పరిజ్ఞానం, మైనింగ్ ఇతర రంగాల్లో పరస్పర సహకారం కొనసాగుతుంది. వ్యాపార ఒప్పందాలు కూడా చేసుకుంటాం. వీటి ద్వారా మాకే కాకుండా మొత్తం ప్రపంచానికి కూడా మేలు జరుగుతుంది. రష్యా వ్యాపార వేత్తలతో కూడా సమావేశం ఉంటుంది. వారిని భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానిస్తాం' అని మోదీ తన ప్రకటనలో తెలిపారు. -
'అది ముమ్మాటికి శత్రుచర్యే.. వెన్నుపోటే'
మాస్కో: తమ దేశ యుద్ధ విమానాన్ని కూల్చివేసిన విషయాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఏ విధంగానైనా టర్కీ మీద అవకాశం దొరికినప్పుడల్లా పగ తీర్చుకోవాలన్న ధోరణిలో మాట్లాడుతున్నారు. తమ విమానాన్ని కూల్చివేసిన టర్కీ చర్య ముమ్మాటికీ శత్రు చర్యేనని అన్నారు. ఆ విషయం అంత తేలిగ్గా తీసుకోలేమని, అది ఒక ఫోన్ కాల్ ఎత్తినంత తేలిక కాదని అన్నారు. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అస్సాద్‌ను బహిష్కరించాలని అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడులను ఆయన కొట్టి పారేశారు. గురువారం మాస్కోలో మీడియా సమావేశంలో మాట్లాడిన పుతిన్.. టర్కీపై నిప్పులు చెరిగారు. టర్కీ అధ్యక్షుడు రికెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ను దుయ్యబట్టారు. టర్కీ రాజకీయ నాయకత్వంలో ఏదో లోపం ఉందని అన్నారు. ముందు తమతో మాట్లాడకుండా నాటో బలగాలతో టర్కీ అధికారులు సంప్రదింపులు జరపడమేమిటని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికి వెన్నుపోటేనని చెప్పారు. మమ్మల్ని సంప్రదిస్తే మేమేమన్నా దూరంగా వెళ్లిపోతామా అని ప్రశ్నించారు. మాది అలా పారిపోయే దేశం కాదని అన్నారు. సిరియాను ఎవరు పరిపాలించాలో తేల్చాల్సింది అంతర్జాతీయ సమాజం కాదని, అక్కడి ప్రజలే తేల్చుకుంటారని, నిబంధనలు, పాలకులు వారి ఇష్టమని అన్నారు. సిరియాలో తమ వాయు సేనలను మరింత పెంచుతున్నామని, ఇస్లామిక్ స్టేట్ పై దాడులు కొనసాగించి తీరుతామని మరోసారి స్పష్టం చేశారు. గత నవంబర్ 24న రష్యా యుద్ధ విమానాన్ని టర్కీ కూల్చి వేయడంతో ఇద్దరు పైలెట్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. -
ఫోర్బ్స్ జాబితాలో ముందుకెళ్లిన మోదీ
న్యూయార్క్: ఫోర్బ్స్ శక్తిమంతుల జాబితాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొమ్మిదో స్థానం దక్కించుకున్నారు. మొత్తం 73మందితో కూడిన ప్రపంచ శక్తిమంతుల జాబితా-2015ను ఫోర్బ్స్ బుధవారం సాయంత్రం విడుదల చేసింది. ఈ జాబితాలో గత ఏడాది మోదీ 15వ స్థానంలో నిలిచారు. ఇక రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వరుసగా మూడోసారి మొదటి స్థానాన్ని దక్కించుకోగా, ఈసారి జర్మనీ వైఎస్ చాన్సలర్ ఎంజెలా మెర్కెల్ రెండో స్థానం, గతేడాది రెండో స్థానంలో ఉన్న అమెరికా అధ్యక్షుడు ఒబామా మూడో స్థానంలో ఉన్నారు. ఇక, మోదీ తర్వాత భారత్ నుంచి రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ 36 స్థానంలో ఉండగా భారత సంతతికి చెందిన లక్ష్మీ మిట్టల్ 55, సత్యనాదెళ్ల 61 స్థానంలో నిలిచారు. టాప్ టెన్ శక్తిమంతులు వీరే... 1. వ్లాదిమిర్ పుతిన్ (63) 2. యాంజెలా మెర్కెల్ (61) 3. బరాక్ ఒబామా (54) 4. పోప్ ఫ్రాన్సిస్ (78) 5. జి జిన్ పింగ్ (62) 6. బిల్ గేట్స్ (78) 7. జానెట్ ఎల్లెన్ (69) 8. డేవిడ్ కామెరాన్ (49) 9. నరేంద్ర మోదీ (65) 10. లారీ పేజ్ (42) -
రష్యాను భయపెట్టలేరు: పుతిన్
మాస్కో: ఉక్రెయిన్‌తో వివాదం నేపథ్యంలో రష్యాపై పశ్చిమ దేశాలు మరిన్ని ఆంక్షలు విధించడంతో ఆ దేశాధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా స్పందించారు. ఏ దేశమూ రష్యాను భయపెట్టలేదని, ఏకాకిని చేయలేదని వ్యాఖ్యానించారు. అది ఎప్పటికీ సాధ్యం కాదన్నారు. కష్టాలను అధిగమించేందుకు సన్నద్ధం కావాలని... దేశ సార్వభౌమత్వం, సుస్థిరత, ఐక్యతకు ఎదురయ్యే ఎలాంటి ముప్పునకైనా రష్యా తగిన సమాధానం ఇస్తుందన్నారు. -
రష్యాతో వాణిజ్య బంధం వద్దు: అమెరికా
వాషింగ్టన్: రష్యాతో ద్వైపాక్షిక వాణిజ్యానికి ఇది సరైన సమయం కాదని అమెరికా పునరుద్ఘాటించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటనలో ఇరుదేశాల మధ్య అణుశక్తి, చమురు, రక్షణ, పెట్టుబడులు తదితర కీలక రంగాల్లో 20 ఒప్పందాలు కుదరడం తెలిసిందే. గతంలో మాదిరిగా రష్యాతో వాణిజ్యానికి ఇది సరైన సమయం కాదని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మేరీ హార్ఫ్ స్పష్టం చేశారు. తూర్పు ఉక్రెయిన్‌లోని రష్యా అనుకూల వేర్పాటువాదులకు రష్యా మద్దతిస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో ఆమె స్పందించారు. -
‘చమురు-వజ్ర’ బంధం
పుతిన్ పర్యటనలో భారత్ కంపెనీలతో కీలక ఒప్పందాలు ⇒పదేళ్లపాటు క్రూడ్ దిగుమతి చేసుకోనున్న ఎస్సార్ గ్రూప్ ⇒10 బిలియన్ డాలర్ల డీల్... ⇒ఎస్సార్‌కు బిలియన్ డాలర్ల రుణం ఇవ్వనున్న రష్యా బ్యాంక్... ⇒2 బిలియన్ డాలర్ల వజ్రాల దిగుమతికి 12 కంపెనీల కాంట్రాక్టు న్యూఢిల్లీ: చిరకాల మిత్రదేశాలైన రష్యా, భారత్‌ల మధ్య వాణిజ్య, వ్యాపారం సంబంధాల్లో ‘చమురు-వజ్ర’ బంధానికి తెరలేచింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పర్యటన సందర్భంగా ముడి చమురు(క్రూడ్), వజ్రాల దిగుమతికి వీలుగా కీలక ఒప్పందాలు కుదిరాయి. భారత్‌కు చెందిన ఎస్సార్ గ్రూప్... రష్యా నుంచి క్రూడ్ దిగుమతి చేసుకోవడానికి ఒప్పందం చేసుకుంది. ఏడాదికి 10 మిలియన్ టన్నుల చొప్పున పదేళ్ల పాటు క్రూడ్‌ను దిగుమతి చేసుకునేందుకు రష్యా చమురు దిగ్గజం ఓఏఓ రాస్నెఫ్ట్తో డీల్ ఓకే అయింది. దీని విలువ 10 బిలియన్ డాలర్లు(సుమారు రూ.62,000 కోట్లు). భారత్ ఆయిల్ కంపెనీలు కుదుర్చుకున్న అతిపెద్ద ఆయిల్ డీల్స్‌లో ఒకటిగా కూడా దీన్ని చెబుతున్నారు. వచ్చే ఏడాది నుంచి ఈ డీల్ అమల్లోకి రానుందని... సముద్రమార్గం ద్వారా క్రూడ్‌ను సరఫరా చేయనున్నట్లు ఓఏఓ రాస్‌నెఫ్ట్ చైర్మన్ ఇగర్ ఇవనోవిచ్ సెచిన్ పేర్కొన్నారు. భారత్ ప్రధాని నరేంద్ర మోదీ, పుతిన్‌ల సమక్షంలో ఎస్సార్ సహ వ్యవస్థాపకుడు శశి రూయా, సెచిన్లు ఒప్పందంపై సంతకాలు చేశారు. 4,05,000 బ్యారెల్స్ రోజువారీ సామర్థ్యంతో గుజరాత్‌లోని వడినార్‌లో ఎస్సార్ భారీ రిఫైనరీని నిర్వహిస్తోంది. కాగా, వెనెజువెలా నుంచి రోజుకు 3-4 లక్షల బ్యారెళ్ల(బీపీడీ) క్రూడ్ దిగుమతి కోసం గతంలో కుదుర్చుకున్న పదిహేనేళ్ల ఒప్పందం ఇప్పటిదాకా అతిపెద్దదిగా నిలుస్తోంది. కాగా, ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని ఈ ఒప్పందం కొత్త పుంతలు తొక్కిస్తుందని సెచిన్ వ్యాఖ్యానించారు. భారత్‌కు ఇంధన భద్రతను కూడా కల్పిస్తుందన్నారు. కాగా, ఎస్సార్ రిఫైనరీలకు దీర్ఘకాలంపాటు ఎలాంటి ఆటం కం లేకుండా క్రూడ్ సరఫరా అయ్యేలా ఈ ఒప్పందం భరోసా కల్పిస్తుందని శశి రూయా పేర్కొన్నారు. ఎస్సార్‌కు బిలియన్ డాలర్ల రుణం... ఎస్సార్ గ్రూప్ కార్పొరేట్, ప్రాజెక్టు అవసరాల కోసం రష్యాకు చెందిన వీటీబీ బిలియన్ డాలర్ల(దాదాపు రూ.6,200 కోట్లు) రుణం ఇవ్వడానికి అంగీకరించింది. మోదీ, పుతిన్‌ల సమక్షంలోనే వీటీబీ చైర్మన్ ఆండ్రే కోట్సిన్, ఎస్సార్ శశి రూయాలు అవగాహన ఒప్పందం(ఎంఓయూ)పై సంతకాలు చేశారు. భారత్‌కు రష్యా వజ్రాలు.... రష్యా నుంచి వచ్చే మూడేళ్లలో 2.1 బిలియన్ డాలర్ల విలువైన ముడి వజ్రాలను భారత్ దిగుమతి చేసుకోనుంది. ఈ మేరకు రష్యా డైమండ్ మైనింగ్ దిగ్గజం అల్రోసాతో 12 భారతీయ కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. పుతిన్, మోదీ గురువారమిక్కడ ప్రారంభించిన ప్రపంచ వజ్రాల సదస్సు సందర్భంగా ఈ డీల్‌పై సంతకాలు జరిగాయి. కిరణ్ జెమ్స్, ఆసియన్ స్టార్, రోసీ బ్లూ ఇండియా తదితర కంపెనీలు విడివిడిగా మొత్తం 12 కాంట్రాక్టులు కుదుర్చుకున్నట్లు రత్నాలు, ఆభరణాల ఎగుమతి ప్రోత్సాహక మండలి చైర్మన్ విపుల్ షా తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల ఉత్పత్తి దేశంగా రష్యా నిలుస్తోంది. మరోపక్క, ముడి వజ్రాలను సానపట్టే విషయంలో భారత్ ప్రపంచ కేంద్రంగా ఉంది. రష్యా దిగుమతులవల్ల అంతర్జాతీయ ట్రేడింగ్ హబ్స్‌కు చెల్లిస్తున్న భారీ కమిషన్ ఆదా అవుతుందని ముంబైకి చెందిన రోసీ బ్లూ డైమండ్ ఎండీ రసెల్ మెహతా చెప్పారు. ప్రస్తుతం భారత్ ముడి వజ్రాల కోసం దుబై, ఆంట్వెర్ప్, బెల్జియం వంటి అంతర్జాతీయ హబ్‌లపై ఆధారపడుతోంది. కాగా, ఈ డీల్ కారణంగా ఆయా దేశాలపై రష్యా పైచేయి సాధించేందుకు కూడా దోహదం చేయనుంది. కాగా, భారత్‌ను డైమండ్ హబ్‌గా మార్చేం దుకు వీలుగా భారత్‌తో నేరుగా వ్యాపారాన్ని నిర్వహించాలని రష్యా మైనింగ్ కంపెనీలను సదస్సు సందర్భంగా మోదీ ఆహ్వానించారు. ఈ రంగంలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించేందుకు నిబంధనలను సరళతరం చేయాలని పుతిన్‌ను కోరారు. 2025కల్లా ద్వైపాక్షిక వాణిజ్యం 30 బిలియన్ డాలర్లకు....ఇరు దేశాల లక్ష్యమిది.. న్యూఢిల్లీ: వాణిజ్య, ఆర్థిక సంబంధాలను మరింత పటిష్టం చేసుకునేదిశగా భారత్, రష్యాలు దృష్టిసారించాయి. ఇందులో భాగంగా ఉమ్మడిగా చమురు-గ్యాస్ రంగంలో అన్వేషణ, పెట్రోలియం ప్లాంట్ల ఏర్పాటు, పైప్లైన్ల నిర్మాణం చేపట్టాలని.. మౌలిక సదుపాయాల అభివృద్ధి, స్మార్ట్ సిటీల ఏర్పాటులో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించాయి. అంతేకాకుండా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2025 నాటికి 30 బిలియన్ డాలర్ల స్థాయికి పెంచాలని కూడా నిర్దేశించుకున్నాయి. పుతిన్ పర్యటన సందర్భంగా విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఈ విషయాన్ని పేర్కొన్నారు. ‘చమురు-గ్యాస్ అన్వేషణ, ఎల్ఎన్జీ ప్రాజెక్టులు, సరఫరా విషయంలో హైడ్రోకార్బన్ కంపెనీల మధ్య విస్తృత భాగస్వామ్యం నెలకొల్పాలి. రష్యాలో కొత్త చమురు-గ్యాస్ క్షేత్రాలకు సంబంధించిన ప్రాజెక్టుల్లో భారతీయ కంపెనీలు మరింత పాలుపంచుకోవాలి. ఇరు దేశాలతో పాటు ఇతర దేశాల్లోనూ పెట్రోకెమికల్ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యంపై దృష్టిపెట్టాలి. భారత్, రష్యాల మధ్య చమురు-గ్యాస్ పైప్‌లైన్ నెట్వర్క్ వ్యవస్థ నిర్మాణానికిగల అవకాశాలను అధ్యయనం చేయా లి’ అని సంయుక్త ప్రకటన పేర్కొంది. భారత్ తలపెట్టిన ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా తయారీ రంగంలో విస్తృత అవకాశాలను రష్యా అందిపుచ్చుకోవాలని తెలిపింది. ఇరు దేశాల్లో విద్యుదుత్పత్తి ప్రాజెక్టుల్లో భాగస్వామ్యాన్ని పెంచుకోవాలని మోదీ, పుతిన్ ఆకాం క్షించారు. కాగా, 2025 నాటికి ఇరే దేశాల కంపెనీల ఉమ్మడి పెట్టుబడులను ద్వైపాక్షిక ప్రాతిపదికన 15 బిలియన్ డాలర్లకు చేర్చాలని నిర్దేశించారు. అడ్డంకులు తొలగిస్తాం: పుతిన్, మోదీ హామీ న్యూఢిల్లీ: భారత్, రష్యాల మధ్య ద్వైపాక్షిక వాణి జ్యాన్ని పెంచేందుకు తగిన చర్యలు చేపడతామని పుతిన్, మోదీలు ఇరు దేశాల కార్పొరేట్ దిగ్గజాలకు గురువారం హామీనిచ్చారు. భారత్ పర్యటన సందర్భంగా పుతిన్ అక్కడి టాప్ వ్యాపారవేత్తలతో కూడి అత్యున్నతస్థాయి ప్రతినిధి బృందాన్ని వెంటతీసుకొచ్చారు. గురువారం జరిగిన సమావేశంలో భారత్‌కు సంబంధించి ఎస్సార్ గ్రూప్ సారథులు శశి, రవి రూయా, ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య, ఎల్అండ్టీ చీఫ్ ఏఎం నాయక్, మహీంద్రా గ్రూప్ సీఎండీ ఆనంద్ మహీంద్రా, భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ తదితరులు హాజరయ్యారు. కాగా, ఫార్యా, బ్యాంకింగ్, ఇంధనం, ఇన్ఫ్రా రంగాకు సంబంధించి వాణిజ్యాన్ని పెంచే విషయంలో ఎదురవుతున్న అడ్డంకులు ఇతరత్రా అంశాలను ఈ సందర్బంగా కార్పొరేట్ ఇండియా ప్రతినిధులు లేవనెత్తారు. ‘సమావేశం చాలా బాగా జరిగింది. పెట్టుబడులు, వాణిజ్య పెంపు విషయంలో సమస్యలను తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని ఇరు నేతలు హామీనిచ్చారు’ అని ఒక పారిశ్రామిక ప్రతినిధి చెప్పారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో ద్వైపాక్షిక వాణిజ్యం 6 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.37,200 కోట్లు)గా నమోదైంది. కాగా, ఏప్రిల్ 2000 నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ రష్యా నుంచి భారత్‌కు 93.5 కోట్ల డాలర్ల విలువైన పెట్టుబడులు లభించాయి.