కీవ్: ఎన్ని ఆంక్షలు విధించినా పుతిన్ మాత్రం ఉక్రెయిన్‌పై దాడులను ఆపడం లేదు. ఉక్రెయిన్‌కు సహకరిస్తున్న దేశాలకు వార్నింగ్ ఇస్తూ దాడులను ముమ్మరం చేస్తున్నారు. కాగా, పౌరులను తరలించేందుకు శనివారం యుద్ధానికి తాత్కాలికంగా విరామం ఇస్తున్నట్టు ప్రకటించిన రష్యా.. మాట తప్పింది. యుద్దం నిలిపివేసిన అనంతరం మరియుపోల్, వోల్నోవాఖ నగరాల్లో యుద్ధ క్షేత్రం నుంచి పౌరులను తరలింపునకు ఉక్రెయిన్ ప్రభుత్వం బస్సులను, రైళ్లను సిద్ధం చేసుకుందని మరియుపోల్ మేయర్ వదిమ్ బాయ్‌చెంకో చెప్పారు.
అయితే, యుద్దం ఆపిన గంట వ్యవధిలోనే రష్యా బలగాలు దాడులు ప్రారంభించాయని ఆయన ఆరోపించారు. రష్యా బలగాలు నగరంపై బాంబుల దాడులు చేశాయని ఆయన ఆరోపించారు. ఉక్రెయిన్ ప్రజలు ఇండ్లు, ఆసుపత్రులపై దాడులు చేసినట్టు వెల్లడించారు. నగరాన్ని రష్యా సైన్యం నిర్బంధించి.. మానవతా కారిడార్‌కు నిరాకరించినట్లు చెప్పారు. ఇప్పటికే నగరంలో నీరు, విద్యుత్తు సౌకర్యం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రష్యా బలగాల చేతిలో సుమారు 4 లక్షల మంది నగరవాసులు బంధీగా ఉన్నారని తెలిపారు.
రష్యా భీకర దాడులు కొనసాగుతున్న వేళ ఉక్రెయిన్‌లోని వందల మంది పురుషులు తమ దేశం తరఫున సైన్యంలో చేరేందుకు కీవ్‌లో సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే మిలిటరీ ఆపరేషన్ కోసం 18-60 వయసు వారు దేశం విడిచి వెళ్లటాన్ని ఉక్రెయిన్ నిషేధించింది. కాగా, ఉక్రెయిన్ ఆయుధాలు సరఫరా చేసేందుకు పలు దేశాలు ముందుకు వస్తున్నాయి. తాజాగా ఉక్రెయిన్‌కు పోలాండ్ మిగ్-29 యుద్ధ విమానాలు, Su-25 విమానాలను అందించే అవకాశం ఉన్నట్టు ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది.
Comments
Please login to add a commentAdd a comment