ప్రఖ్యాత ఫోర్బ్స్ మేగజీన్ తాజాగా వెలువరించిన ‘ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తుల జాబితా’ లో ప్రధాని మోదీ టాప్–10లో స్థానం సంపాదించారు.
న్యూయార్క్: ప్రఖ్యాత ఫోర్బ్స్ మేగజీన్ తాజాగా వెలువరించిన ‘ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తుల జాబితా’ లో ప్రధాని మోదీ టాప్–10లో స్థానం సంపాదించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ వరసగా నాలుగో ఏడాదీ తొలి స్థానాన్ని కైవసంచేసుకున్నారు. కాబోయే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో స్థానంలో నిలిచారు. జర్మనీ చాన్స్‌లర్ మెర్కల్ మూడవ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ నాల్గవ, పోప్ ఫ్రాన్సిస్ ఐదో, మోదీ తొమ్మిదో ర్యాంక్ పొందారు.
‘గత కొన్నేళ్లలో మోదీ పాపులారిటీ విపరీతంగా పెరిగి ఆయన ప్రపంచస్థాయి నేతగా ఎదిగారు.’ అని ఫోర్బ్స్ వ్యాఖ్యానించింది. ఈ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ 38వ, ఉత్తర కొరియా నేత కిమ్ 43వ, ఒబామా 48వ, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల 51వ, ఐసిస్ ఉగ్రనేత అబుబకర్ 57వ ర్యాంక్ పొందారు. మొత్తం 74 పేర్లతో ఫోర్బ్స్ జాబితాను విడుదలచేసింది.