కీవ్: రష్యా సైనిక దాడుల కారణంగా ఉక్రెయిన్‌లో భయానక దృశ్యాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే భారీ సంఖ్యలో ఇరు దేశాల సైనికులు, పౌరులు మృత్యువాతపడ్డారు. ఎంతో మంది తీవ్రంగా గాయపడి ఆర్తనాదాలు చేస్తున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ వార్నింగ్‌తో యుద్దం సందర్బంగా ఇప్పటికే చాలా దేశాలు ఉక్రెయిన్‌కు హ్యాండ్ ఇచ్చాయి. దీంతో తాము ఒంటిరిగానే పోరు జరుపుతున్నామంటూ జెలెన్ స్కీ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌కు తాము అండగా నిలుస్తామంటూ రొమేనియా ముందుకు వచ్చింది.
ఉక్రెయిన్‌కు అన్ని విధులుగా తాము సాయం అందిస్తామని రొమేనియా ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. ఉక్రెయిన్‌కు సరిహద్దు దేశంగా రొమేనియా ఉండటంతో తమ దేశంలోకి వచ్చిన ఉక్రెయిన్ మహిళలకు, పిల్లలకు సాయం అందిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌కు 3.3 మిలియన్ డాలర్ల విలువైన సహాయం అందించనున్నట్టు పేర్కొంది. అంతేకాకుండా చమురు, మంచి నీరు, ఆహరం, మిలిటరీ సామాగ్రి, బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లను అందజేస్తామని రొమేనియా ప్రభుత్వ ప్రతినిధి డాన్ కార్బునారు వెల్లడించారు.
అంతేకాకుండా.. రష్యా దాడుల్లో గాయపడిన సైనికులకు, పౌరులకు వైద్య సాయం అందిస్తామన్నారు. సరిహద్దుల్లో గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించేందుకు అంబులెన్స్‌లను సిద్దం చేసినట్టు చెప్పారు. రెండు దేశాల సరిహద్దుల నుంచి చిన్న పిల్లలు, గర్భిణిలు, వృద్ధుల తరలింపు కోసం ప్రత్యేక బస్సులను, అంబులెన్స్‌లను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment