ఫేస్ టూ ఫేస్ తేల్చుకుందాం రమ్మంటూ ఎలన్ మస్క్ వేసిన ట్వీట్.. చాప కింద నీరులా రష్యాలో కాక రేపుతోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ నేరుగా స్పందించకపోయినా అతని కింద పని చేస్తున్న అధికారులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. మా బాస్‌కే ఛాంలెజ్ విసురుతావా ? అంటూ కౌంటర్ ఎటాక్ స్టార్ చేశారు.
తేల్చుకుందారం రమ్మంటూ ఎలన్ మస్క్ చేసిన ట్వీట్‌పై రష్యా ఆధీనంలోని చెచెన్యా రిపబ్లిక్ హెడ్ రమ్‌జాన్ కేడీరోవ్ టెలిగ్రామ్‌లో ఎలన్ మస్క్‌కు పంపిన మెసేజ్‌లో స్పందిస్తూ.. ఎలన్ మస్క్ ! నవ్వు. పుతిన్ వేర్వేరు రంగాలకు చెందిన వారు. నువ్వేమో బిజినెస్‌మేన్, ట్విట్టర్ యూజర్‌వి పుతినేమో రాజకీయవేత్త, వ్యూహకర్త ఎలా కదనరంగంలో దిగుతారు. ఒకవేళ బాక్సింగ్ రింగులో మీరు తలపడితే.. అసలే స్పోర్ట్స్‌మాన్‌లా ఉండే పుతిన్ దెబ్బకు నీలో ఉన్న దయ్యం ఎగిరిపోతుంది అంటూ కౌంటర్ ఇచ్చాడు. అయితే ఈ పంచులు ఇక్కడితే ఆగిపోలేదు.
పుతిన్ లాంటి స్ట్రాంగ్ పర్సన్‌తో నువ్వు యుద్ధం చేయాలంటే నువ్వు మరింత బలంగా మారాలి. ఇలా ఎలోనాగా ఉంటే సరిపోదు. నీకు కావాలంటే రష్యాలో ఉన్న మిలిటరీ ట్రైనింగ్ కేంద్రాల్లో శిక్షణ ఇప్పిస్తాను. అప్పుడు నువ్వు ఎలానా నుంచి ఎలన్‌గా మారవచ్చంటూ దెప్పి పొడిచాడు.
వివాదాలను కొని తెచ్చుకునే అలవాటు ఉన్న ఎలన్‌మస్క్.. రమ్‌జాన్ నుంచి వచ్చిన కవ్వింపు చర్యలకు మరింతంగా రెచ్చిపోయాడు. నాకు మంచి ఆఫర్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. అలాంటి శిక్షణ తీసుకోవడం నాకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది. అప్పుడు నాతో పోరాడటానికి పుతిన్ భయపడితే.. నాది లెఫ్ట్ హ్యాండ్ కాకపోయినా సరే పుతిన్‌తో కేవలం ఎడమ చేయితో ఫైట్ చేయడానికి నేను రెడీ రిటార్ట్ ఇచ్చాడు. అక్కడితో ఊరుకుంటే ఎలన్‌మస్క్ ఎలా అవుతాడు. ఈ ట్వీట్‌ను పోస్ట్ చేసే సమయంలో తన డీపీ పేరును సైతం ఎలోనా మస్క్‌గా మార్చుకుని మరింతగా రెచ్చగొట్టాడు ఎలన్ మస్క్.
Telegram post by Ramzan Kadyrov, head of Chechen Republic! pic.twitter.com/UyByR9kywq
— Elona Musk (@elonmusk) March 15, 2022
చదవండి: ఏయ్ పుతిన్.. ఒంటరిగా నాతో కలబడే దమ్ముందా? సవాల్ విసిరిన ఎలన్ మస్క్
Comments
Please login to add a commentAdd a comment