వాషింగ్టన్: రష్యాతో ద్వైపాక్షిక వాణిజ్యానికి ఇది సరైన సమయం కాదని అమెరికా పునరుద్ఘాటించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటనలో ఇరుదేశాల మధ్య అణుశక్తి, చమురు, రక్షణ, పెట్టుబడులు తదితర కీలక రంగాల్లో 20 ఒప్పందాలు కుదరడం తెలిసిందే. గతంలో మాదిరిగా రష్యాతో వాణిజ్యానికి ఇది సరైన సమయం కాదని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మేరీ హార్ఫ్ స్పష్టం చేశారు. తూర్పు ఉక్రెయిన్‌లోని రష్యా అనుకూల వేర్పాటువాదులకు రష్యా మద్దతిస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో ఆమె స్పందించారు.