file photo
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ సోమవారం రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్‌లో చర్చలు జరిపారు. రెండు దేశాలకు సంబంధించిన ప్రాంతీయ అంశాలతో పాటు పలు ఇతర అంతర్జాతీయ అంశాలపైన ఇద్దరి మధ్య చర్చ జరిగింది. బ్రిక్స్ కూటమికి రష్యా అధ్యక్షత వహించే విషయంపైనా చర్చించారు.
‘ప్రెసిడెంట్ పుతిన్‌తో మంచి సంభాషణ జరిగింది. రెండు దేశాల మధ్య భవిష్యత్తు సంబంధాలపై తీసుకోవాల్సిన చొరవపై ఇరువురం చర్చించాం. బ్రిక్స్‌కు రష్యా అధ్యక్షత వహించే విషయంపైనా మాట్లాడాం’అని ప్రధాని మోదీ తన ఎక్స్(ట్విటర్) ఖాతాలో తెలిపారు.
ఇటీవల రెండు దేశాల మధ్య అధికారుల స్థాయిలో జరిగిన హై లెవెల్ భేటీలపైనా మోదీ,పుతిన్‌లు సమీక్షించారని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. 2024లో బబ్రిక్స్‌కు రష్యా అధ్యక్షత వహించే విషయమై భారత్ పూర్తి మద్దతిస్తోందని ప్రకటిస్తూ వారికి ప్రధాని శుభాకాంక్షలు తెలిపారని పీఎంవో పేర్కొంది.
ఇదీచదవండి.. మహారాష్ట్ర సీఎం నిర్ణయంపై సుప్రీం కోర్టుకు ఉద్ధవ్ థాక్రే
Comments
Please login to add a commentAdd a comment