టోక్యో : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి చేస్తున్న ఆసియా పర్యటన సరికొత్త చరిత్రకు నాంది పలుకబోతోంది. ట్రంప్ పర్యటనతో ఇప్పటికే ఆసియాలో ఒకరకమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ట్రంప్.. ఆదివారం జపాన్‌లో అడుగు పెట్టారు. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా సైతం.. అణ్వాయుధాలకు పదును పెడుతున్నట్లు ప్రకటించి వాతావరణాన్ని మరింత వేడెక్కించింది.
ఎయిర్ ఫోర్స్ ఒర్ విమానం టోక్యో విమానాశ్రయంలో దిగీదిగగానే.. ట్రంప్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తే ప్రకటన చేశారు. ఆసియా పర్యటన వ్యూహాత్మకంగా ఉంటుందంటూనే.. తాను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రత్యేకంగా సమావేశమవుతానని ప్రకటించారు. ఉత్తర కొరియా సమస్యకు పరిష్కారం కోసమే పుతిన్‌తో చర్చిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్తర కొరియా సమస్య నుంచి అంతర్జాతీయ సమాజాన్ని కాపాడేందుకు రష్యా సహకారం చాలా అవసరం. అందులో భాగంగానే ఆయనను కలుస్తున్న ట్రంప్ పేర్కొన్నారు. ఉత్తర కొరియా అనేది అమెరికాకు మాత్రమే కాదు.. ప్రపంచానికే ప్రమాదకర దేశమని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా.. కొరియా చుట్టూ అమెరికా బాంబర్ విమానాలు చక్కర్లు కొట్టడంతో.. ఉత్తర కొరియా మరోసారి క్షిపణి పరీక్షలు నిర్వహించింది.
Comments
Please login to add a commentAdd a comment