లండన్: రష్యా అధ్యక్షుడు పుతిన్ చనిపోయే వరకు పవర్‌లోనే ఉంటాడని, ప్రస్తుతం జరుగుతున్న అధ్యక్ష ఎన్నికలు కింది నుంచి మీది దాకా ఒక భూటకం అని యాంటీ కరప్షన్ యాక్టివిస్ట్, రష్యా నుంచి బహిష్కరణకు గురైన ఇన్వెస్టర్ బిల్ బ్రౌడర్ వ్యాఖ్యానించారు. అధ్యక్షఎన్నికల వేళ బ్రౌడర్ వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి.
‘దేశ ప్రజలకు జైలు, చావు తప్ప పుతిన్ ఇచ్చేది ఏమీ లేదు. ఇది ఒక గొప్ప లీడర్ లక్షణం కాదు. పుతిన్ ప్రజలను ఇంకా అణచివేస్తే తిరుగుబాటు తప్పదు. ప్రజలు డిసైడైతే పుతిన్‌కు రొమేనియా కమ్యూనిస్టు లీడర్ నికోలే సెస్క్యూకు పట్టిన గతే పడుతుంది’అని బిల్ బ్రౌడర్ హెచ్చరించారు. హెమిటేజ్ క్యాపిటల్ అనే కంపెనీ ద్వారా రష్యాలో 1990 నుంచి 2000 సంవత్సరం వరకు భారీగా పెట్టుబడులు పెట్టిన బిల్ బ్రౌడర్‌ను అవినీతి ఆరోపణలపై 2005లో దేశం నుంచి బహిష్కరించారు.
కాగా, తొలుత రష్యా గూఢచర్య సంస్థ కేజీబీ ఏజెంట్‌గా పనిచేసిన పుతిన్ 1999 నుంచి రష్యాలో అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లోనూ పుతిన్ గెలుపు ఖాయమేనన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. దీంతో మరో ఆరేళ్లపాటు పుతిన్ అధ్యక్ష పదవిలో కొనసాగనున్నారు. మార్చి 15న ప్రారంభమైన రష్యా ఎన్నికలు 17 దాకా మూడు రోజుల పాటు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment