కొత్త లైన్‌తోనే ‘హై స్పీడ్’ 12 engineers for two days of observation | Sakshi
Sakshi News home page

కొత్త లైన్‌తోనే ‘హై స్పీడ్’

Published Mon, Dec 12 2016 2:08 AM | Last Updated on Wed, Aug 15 2018 6:32 PM

కొత్త లైన్‌తోనే ‘హై స్పీడ్’ - Sakshi

సికింద్రాబాద్-నాగ్‌పూర్ కారిడార్‌పై రష్యా నిపుణుల ప్రాథమిక అభిప్రాయం
రెండు రోజులపాటు 12 మంది ఇంజనీర్ల పరిశీలన

 
 సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్-నాగ్‌పూర్ మార్గంలో సెమీ హైస్పీడ్ రైలు ప్రాజెక్టుకు భారీ ఖర్చు తప్పదని రష్యా రైల్వే ఓ అభిప్రాయానికి వచ్చింది. పైగా ప్రస్తుతం ఉన్న లైన్‌నే హైస్పీడ్ కారిడార్‌గా మార్చటం చిక్కుముడులతో కూడిందని గుర్తించింది. ప్రతిపాదిత ప్రాజెక్టు ప్రకారం ఈ మార్గంలో రైళ్లను గంటకు 200 కి.మీ. వేగంతో నడపాల్సి ఉంటుంది. ఆ వేగంతో రైళ్లను నడపాలంటే ప్రస్తుత లైన్ తట్టుకోలేదని ప్రాథమికంగా నిర్ధారించింది. ఆ స్థారుుకి లైన్‌ను అభివృద్ధి చేయాలంటే దాదాపు 60 శాతం మేర పూర్తిగా మార్చాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. సికింద్రాబాద్-నాగ్‌పూర్ మార్గంలో సెమీ హైస్పీడ్ రైలు ప్రాజెక్టును చేపట్టేందుకు ఉన్న అవకాశాలను రష్యా రైల్వే సంస్థకు చెందిన 12 మంది ఇంజనీర్లతో కూడిన బృందం రెండు రోజుల పాటు అధ్యయనం చేసింది.

 రష్యాతో ఒప్పందం
 సికింద్రాబాద్-నాగ్‌పూర్ మధ్య 575 కిలోమీటర్ల దూరం ఉంది. ప్రస్తుతం ఈ రెండు స్టేషన్ల మధ్య సూపర్‌ఫాస్టు రైళ్లు తిరిగేందుకు దాదాపు 10 గంటల సమయం తీసుకుంటున్నారుు. దాన్ని 4 నుంచి ఐదు గంటలకు తగ్గించేలా సెమీ హైస్పీడ్ రైళ్లను నడపాలనేది ప్రాజెక్టు ఉద్దేశం. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రష్యా రైల్వే సంస్థతో ఒప్పందం చేసుకుంది. దేశంలో తొలిదశలో అహ్మదాబాద్-ముంబై మధ్య జపాన్ సాయంతో హైస్పీడ్ రైలు ప్రాజెక్టు పనులు త్వరలో మొదలు కాబోతున్నారుు. మలిదశలో మరికొన్ని నగరాల మధ్య సెమీ హైస్పీడ్ రైళ్లను నడపాలనేది ప్రభుత్వం నిర్ణయం.

ఇందుకోసం ఇటీవల గోవాలో రష్యా అధ్యక్షుడు పుతిన్, ప్రధాని మోదీ సమక్షంలో రెండు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చును రెండు దేశాలు 50:50 చొప్పున భరించేందుకు నిర్ణరుుంచాయి. ఇందులో భాగంగా రష్యా రైల్వేకు చెందిన 12 మంది ఇంజనీరింగ్ నిపుణులు హైదరాబాద్ వచ్చి అధికారులతో భేటీ అరుు శని, ఆదివారాలు రెండు రోజుల పాటు ఆ మార్గాన్ని స్థానిక అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా రష్యా బృందం కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు.

 ఒకే లైన్‌తో ఇబ్బంది
 ఈ మార్గంలో నిత్యం 85 రైళ్లు పరుగుపెడుతున్నాయి. సరుకు రవాణా, సాధారణ ప్రయాణికుల రైళ్లు ఒకే లైన్‌పై నడుస్తున్నాయి. దీన్ని 200 కి.మీ. వేగానికి తగ్గట్టుగా స్థారుు పెంచాలంటే కొంతకాలంపాటు ఈ రైళ్లను ప్రత్యామ్నాయ మార్గాలమీదుగా మళ్లించాల్సి ఉంటుంది. బల్లార్షా మార్గం ఉత్తర- దక్షిణ భారతానికి ప్రధాన అనుసంధాన మార్గం కావటంతో దీనిపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఈ మార్గాన్ని మూయాలంటే సాధ్యమయ్యే పరిస్థితి లేదు. ఇక కనీసం 60 శాతం మేర పూర్తిస్థారుులో మారిస్తే తప్ప ఈ మార్గం కొత్త ప్రాజెక్టుకు పనికిరాదని రష్యా నిపుణులు పేర్కొన్నట్టు సమాచారం. అలాంటప్పుడు కొత్త మార్గాన్నే నిర్మించాల్సి ఉంటుంది. అందుకు దాదాపు రూ.20 వేల కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. ఇంతఖర్చును భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందా అన్నది ప్రధానాంశం.

 కొత్త లైన్‌తోనే లాభం..
 హైస్పీడ్ రైళ్లు నడిచేందుకు తట్టుకునేలా నేల స్వభావం ఉన్నందున కొత్త లైను నిర్మిస్తే కొన్ని దశాబ్దాల పాటు భావి అవసరాలు తీరే అవకాశం ఉన్నందున కొత్త లైను నిర్మాణమే మేలని రష్యా నిపుణులు సూచించినట్లు సమాచారం. దీన్ని హైస్పీడ్ కారిడార్‌గా కూడా వినియోగించుకునే అవకాశం ఉంటుందని వారు సలహా ఇచ్చినట్టు తెలిసింది. దీనికి సంబంధించి పూర్తిస్థారుు నివేదికను త్వరలో రష్యా నిపుణులు రైల్వే బోర్డుకు సమర్పించనున్నారు. దాని ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఇక్కడి రైల్వే అధికారులు వెల్లడించారు.  
 
 సగటు వేగం 80 కి.మీ మాత్రమే...
 ఈ లైనుపై సూపర్‌ఫాస్టు రైళ్లు 120 కి.మీ. వేగంతో ప్రయాణిస్తున్నాయి. కానీ వాస్తవంగా వాటి ప్రయాణ వేగం సగటున 80 కి.మీ.గా మాత్రమే ఉంటోంది. ఉన్న లైను పాతది కావటం, దాని దిగువన కాంక్రీట్ బెడ్ లేనందున అది అంతకంటే ఎక్కువ వేగాన్ని తట్టుకోలేదని వారు తేల్చారు. కనీసం గంటకు 150 కిలోమీటర్ల వేగాన్ని కూడా తట్టుకోలేదని రష్యా ఇంజనీర్లు తేల్చినట్టు సమాచారం. కాగా, వారు తమ పర్యటనలో సిగ్నలింగ్, ఇంజనీరింగ్ వ్యవస్థలు, బోగీల సామర్థ్యం, రైళ్ల ట్రాఫిక్, రైల్వే గేట్లు, వంతెనలు, ఇతర మౌలిక సదుపాయాల గురించి అధ్యయనం చేసినట్టు సమాచారం. ఖాజీపేటలో కూడా స్థానిక అధికారులతో రష్యా నిపుణులు భేటీ అయ్యారు.

Advertisement
 
Advertisement
 
Advertisement