Russian Railways
-
సికింద్రాబాద్ టు నాగ్‌పూర్... సెమీ హైస్పీడ్ కారిడార్‌కు ఓకే!
సాక్షి, హైదరాబాద్: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సెమీ హైస్పీడ్ రైలు భాగ్యం హైదరాబాద్‌కు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. సికింద్రాబాద్–నాగ్‌పూర్ మధ్య ఈ రైలు పరుగుపెట్టే అవకాశం కనిపిస్తోంది. దాదాపు మూడేళ్ల క్రితం ఈ కారిడార్ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసిన రష్యా రైల్వే కంపెనీ తాజాగా ఈ కారిడార్‌లో 180 కి.మీ. వేగంతో రైళ్ల ప్రయాణం సాధ్యమేనని తేలుస్తూ త్వరలో నివేదిక సమర్పించనుంది. అలాగే ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు సిద్ధమని రష్యన్ రైల్వే సమ్మతి వ్యక్తం చేసినట్టు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ కిర్గిస్తాన్ పర్యటనలో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జరిపిన ద్వైపాక్షిక చర్చల్లో ఈ అంశం చర్చకు వచ్చినట్లు రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి. భారత్‌లో సెమీ హైస్పీడ్ ప్రాజెక్టు చేపడుతున్నందుకు సంతోషంగా ఉందని స్వయంగా పుతిన్ ప్రస్తావించినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. సగానికి తగ్గనున్న సమయం... సికింద్రాబాద్–నాగ్‌పూర్ మధ్య దూరం 584 కి.మీ. ఇంత దూరం ప్రయాణానికి ప్రస్తుతం ఎక్స్‌ప్రెస్‌లకు దాదాపు 9 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం పరుగుపెడుతున్న సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ల గరిష్ట వేగం గంటకు 120 కి.మీ., కానీ రైళ్ల ట్రాఫిక్, ట్రాక్‌ల పరిస్థితి, సిగ్నలింగ్ వ్యవస్థ వల్ల అవి సగటున 75 కి.మీ. వేగాన్ని మించడంలేదు. దీంతో ప్రధాన కారిడార్లలో సెమీ హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టాలని దాదాపు నాలుగేళ్ల క్రితం రైల్వేశాఖ నిర్ణయించింది. బుల్లెట్ రైలు ఇప్పట్లో సాధ్యం కానందున గంటకు 200 కి.మీ. వేగంతో ప్రయాణించేలా సెమీ బుల్లెట్ రైళ్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం తొలుత ఐదు కారిడార్లను ఎంపిక చేసింది. వాటిలో అంత వేగంగా రైళ్ల ప్రయాణం సాధ్యమా కాదా అని తేల్చేందుకు వివిధ దేశాలకు చెందిన కంపెనీలకు బాధ్యత అప్పగించింది. ఇందులో భాగంగా ఢిల్లీ–చండీగఢ్ సెక్షన్‌ను ఫ్రెంచ్ కంపెనీకి, చెన్నై–కాజీపేట మార్గాన్ని జర్మన్ కంపెనీకి, చెన్నై–బెంగళూరు–మైసూరు మార్గాన్ని చైనా కంపెనీకి, ఢిల్లీ–జైపూర్ మార్గాన్ని ఇటలీ కంపెనీకి అప్పగించాలని నిర్ణయించింది. 2016లో గోవాలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మోదీ జరిపిన ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా సికింద్రాబాద్–నాగ్‌పూర్ మార్గాన్ని రష్యా రైల్వే కంపెనీకి అప్పగించాలని నిర్ణయించారు. ఆ మేరకు అదే సంవత్సరం రష్యన్ రైల్వేస్‌కు సంబంధించి భారత్‌లో ఉన్న విభాగం అధిపతి వ్లాదిమీర్ ఎ ఫినోవ్... భారత రైల్వే బోర్డు యంత్రాంగంతో చర్చలు జరిపారు. అందులో తీసుకున్న నిర్ణయం ఆధారంగా అలెగ్జాండర్ కులాగిన్ ఆధ్వర్యంలోని 12 మంది ఇంజనీరింగ్ నిపుణులతో కూడిన రష్యన్ రైల్వేస్ ప్రతినిధి బృందం హైదరాబాద్ వచ్చింది. స్థానిక రైల్వే అధికారులతో కలసి ప్రత్యేక రైలులో సికింద్రాబాద్ స్టేషన్ నుంచి నాగ్‌పూర్ వరకు పరిశీలిస్తూ ప్రయాణించింది. గంటకు 200 కి.మీ. వేగంతో రైలు దూసుకెళ్లాలంటే ప్రస్తుత ట్రాక్‌లో చేయాల్సిన మార్పులను గుర్తించింది. ఆ తర్వాత మరో బృందం 2017 డిసెంబర్లో నాగ్‌పూర్‌కు వెళ్లి అక్కడి నుంచి సికింద్రాబాద్ వరకు ప్రయాణిస్తూ అధ్యయనం చేసింది. కానీ ఇప్పటివరకు నివేదిక సమర్పించలేదు. దీంతో ఈ కారిడార్ ప్రతిపాదన అటకెక్కినట్టేనన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ తాజాగా ప్రధాని మోదీతో రష్యా అధ్యక్షుడు పుతిన్ జరిపిన చర్చల్లో ఈ అంశం ప్రస్తావనకు రావడంతో అది సాకారమయ్యే అవకాశం ఉందని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. ఇది సాకారమైతే రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం సగానికి సగం తగ్గిపోతుంది. దాదాపు నాలుగు గంటల్లోనే గమ్యం చేరే అవకాశం ఉంటుంది. ఫలితంగా హైదరాబాద్–ఢిల్లీ ప్రయాణ సమయం కూడా తగ్గనుంది. ఆ మేరకు వీలుగా ట్రాక్‌ను పూర్తిస్థాయిలో పటిష్టం చేస్తారు. నివేదిక సమర్పించిన తర్వాత అంచనా వ్యయం విలువ తెలుస్తుంది. వేగంగా మూడో లైన్ పనులు.... కాజీపేట–బల్లార్షా మార్గం అత్యంత కీలకమైనది కావడంతో ఈ కారిడార్‌లో ప్రయాణించే రైళ్ల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో రైళ్ల వేగం మందగించింది. ఈ మార్గం బొగ్గు వ్యాగన్లు ప్రయాణించేది కావడం, బొగ్గు సరఫరాకు ప్రాధాన్యం ఉండటంతో ఈ మార్గంలో వాటి కోసం ఎక్స్‌ప్రెస్ రైళ్లను కూడా నిలిపేస్తున్నారు. దీంతో ప్రయాణికుల రైళ్ల ప్రయాణంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ కారిడార్‌లో మూడో మార్గం నిర్మించాలని రైల్వేశాఖ గతంలో నిర్ణయించి ప్రయారిటీ ప్రాజెక్టుగా గుర్తించింది. ఫలితంగా పనులు వేగంగా సాగుతున్నాయి. కాజీపేట నుంచి మంచిర్యాల మధ్య దాదాపు పని పూర్తయింది. మంచిర్యాల, పెద్దంపేట, రామగుండం, మందమర్రి సెక్షన్లో పనులు చివరి దశకు వచ్చాయి. సిర్పూర్ కాగజ్‌నగర్–మాకుడి మధ్య 29 కి.మీ. మార్గంలో ఫారెస్ట్ క్లియరెన్స్ కోసం పెండింగ్‌లో పడ్డాయి. రాఘవాపురం–పొత్కపల్లి మధ్య 31 కి.మీ. మార్గం, బిజ్గర్ షరీఫ్–ఉప్పల్ మధ్య 18 కి.మీ. మార్గంలో ఇటీవలి వరకు భూసేకరణ జరగక నిలిచిపోయిన పనులు ఇప్పుడు పూర్తి కావొచ్చాయి. ప్రస్తుతం బీరూరు–మాణిక్‌ఘర్ పనులు జరుగుతున్నాయి. హైస్పీడ్ కారిడార్ కావాలంటే ఆ మార్గంలో గూడ్సు రైళ్లు తిరగొద్దని రష్యన్ ఇంజనీర్లు గతంలో పేర్కొన్నారు. ఇప్పుడు మూడో కారిడార్ అందుబాటులోకి వస్తే ఆ సమస్య కూడా దాదాపు పరిష్కారమవుతుంది. భవిష్యత్తులో నాలుగో లైన్ కూడా నిర్మించనున్నారు. రైల్–19 వస్తుందా...? వందే భారత్ ఎక్స్‌ప్రెస్... భారతీయ రైల్వేలో నవశకానికి నాంది పలికింది. ఇంజిన్ లేని ఈ రైలు అభివృద్ధి చెందిన దేశాల వేగవంతమైన రైళ్లను తలపిస్తోంది. గంటకు 180 కి.మీ. వేగంతో దూసుకుపోతోంది. రైల్–18 పేరిట మొదలైన ఈ రైళ్ల తదుపరి వెర్షన్ రైల్–19 (2019)గా రాబోతోంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పూర్తిగా సీటింగ్‌కే పరిమితం కాగా కొత్త వెర్షన్లో స్లీపర్ కోచ్‌లు ఉంటాయి. ఈ సంవత్సరమే పట్టాలెక్కే ఈ రైళ్లు సెమీ హైస్పీడ్ రైళ్లుగా నిలుస్తున్నాయి. మరి సికింద్రాబాద్–నాగ్‌పూర్ సెమీ హైస్పీడ్ కారిడార్‌లో వీటినే ప్రవేశపెడతారా లేక అధునాతన కొత్త రైళ్లను ప్రారంభిస్తారా అన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. -
శుభవార్త.. ఇక 584కి.మీ మూడుగంటల్లో..
సాక్షి, న్యూఢిల్లీ : రెండు ప్రముఖ వాణిజ్య నగరాలు హైదరాబాద్ - నాగ్‌పూర్‌ల మధ్య ప్రయాణించేందుకు ప్రస్తుతం పట్టే సమయం(తొమ్మిది గంటలు) కాస్త అమాంతం తగ్గిపోనుంది. ఈ రెండు నగరాల మధ్య దాదాపు 584 కి.మీల దూరాన్ని బాహుబలిలాంటి సినిమాను చూసినంత సమయంలో అంటే మూడే మూడు గంటల్లో రైలు ప్రయాణం ద్వారా ముగించే అవకాశం కలగనుంది. అందుకోసం ప్రత్యేక రైల్వే కారిడార్‌ను సిద్ధం చేసేందుకు బ్లూప్రింట్ కూడా రెడీ అయిందట. ఈ మేరకు రైల్వేశాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి ఈ విషయం చెప్పారు. 'రష్యన్ రైల్వేస్ సహకారంతో పూర్తి చేయాలనుకుంటున్న ఈ ప్రాజెక్టు వివరాలను రైల్వే బోర్డు ఆమోదం కోసం పంపించాల్సి ఉంది' అని ఆ అధికారి చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్ - నాగ్‌పూర్‌ల మధ్య నేరుగా విమాన సర్వీసులు లేవు. వేరే ప్రాంతం గుండా విమానంలో వచ్చినా దాదాపు నాలుగు గంటల సమయంలో పడుతుంది. ఈ విషయాన్ని తమకు అవకాశంగా రైల్వే శాఖ ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఈ రెండు నగరాల మధ్య ఉన్న రైల్వే లైన్‌ను గంటకు 160-200కిలో మీటర్ల వేగంతో (సెమీ-హైస్పీడ్ కారిడార్) వెళ్లేందుకు అనువుగా రూపొందించడం ద్వారా మూడుగంటల్లో ఈ రెండు నగరాల మధ్య ప్రయాణం పూర్తి చేసేలా చూడొచ్చని భావిస్తున్నారు. అదే జరిగితే, హైదరాబాద్ - నాగ్‌పూర్ మధ్య ప్రయాణం కాస్త.. హైదరాబాద్ - సూర్యాపేట మధ్య బస్సులో వెళ్లినంత సేపట్లో ముగించేయొచ్చు. -
కొత్త లైన్‌తోనే ‘హై స్పీడ్’
సికింద్రాబాద్-నాగ్‌పూర్ కారిడార్‌పై రష్యా నిపుణుల ప్రాథమిక అభిప్రాయం రెండు రోజులపాటు 12 మంది ఇంజనీర్ల పరిశీలన సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్-నాగ్‌పూర్ మార్గంలో సెమీ హైస్పీడ్ రైలు ప్రాజెక్టుకు భారీ ఖర్చు తప్పదని రష్యా రైల్వే ఓ అభిప్రాయానికి వచ్చింది. పైగా ప్రస్తుతం ఉన్న లైన్‌నే హైస్పీడ్ కారిడార్‌గా మార్చటం చిక్కుముడులతో కూడిందని గుర్తించింది. ప్రతిపాదిత ప్రాజెక్టు ప్రకారం ఈ మార్గంలో రైళ్లను గంటకు 200 కి.మీ. వేగంతో నడపాల్సి ఉంటుంది. ఆ వేగంతో రైళ్లను నడపాలంటే ప్రస్తుత లైన్ తట్టుకోలేదని ప్రాథమికంగా నిర్ధారించింది. ఆ స్థారుుకి లైన్‌ను అభివృద్ధి చేయాలంటే దాదాపు 60 శాతం మేర పూర్తిగా మార్చాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. సికింద్రాబాద్-నాగ్‌పూర్ మార్గంలో సెమీ హైస్పీడ్ రైలు ప్రాజెక్టును చేపట్టేందుకు ఉన్న అవకాశాలను రష్యా రైల్వే సంస్థకు చెందిన 12 మంది ఇంజనీర్లతో కూడిన బృందం రెండు రోజుల పాటు అధ్యయనం చేసింది. రష్యాతో ఒప్పందం సికింద్రాబాద్-నాగ్‌పూర్ మధ్య 575 కిలోమీటర్ల దూరం ఉంది. ప్రస్తుతం ఈ రెండు స్టేషన్ల మధ్య సూపర్‌ఫాస్టు రైళ్లు తిరిగేందుకు దాదాపు 10 గంటల సమయం తీసుకుంటున్నారుు. దాన్ని 4 నుంచి ఐదు గంటలకు తగ్గించేలా సెమీ హైస్పీడ్ రైళ్లను నడపాలనేది ప్రాజెక్టు ఉద్దేశం. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రష్యా రైల్వే సంస్థతో ఒప్పందం చేసుకుంది. దేశంలో తొలిదశలో అహ్మదాబాద్-ముంబై మధ్య జపాన్ సాయంతో హైస్పీడ్ రైలు ప్రాజెక్టు పనులు త్వరలో మొదలు కాబోతున్నారుు. మలిదశలో మరికొన్ని నగరాల మధ్య సెమీ హైస్పీడ్ రైళ్లను నడపాలనేది ప్రభుత్వం నిర్ణయం. ఇందుకోసం ఇటీవల గోవాలో రష్యా అధ్యక్షుడు పుతిన్, ప్రధాని మోదీ సమక్షంలో రెండు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చును రెండు దేశాలు 50:50 చొప్పున భరించేందుకు నిర్ణరుుంచాయి. ఇందులో భాగంగా రష్యా రైల్వేకు చెందిన 12 మంది ఇంజనీరింగ్ నిపుణులు హైదరాబాద్ వచ్చి అధికారులతో భేటీ అరుు శని, ఆదివారాలు రెండు రోజుల పాటు ఆ మార్గాన్ని స్థానిక అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా రష్యా బృందం కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఒకే లైన్‌తో ఇబ్బంది ఈ మార్గంలో నిత్యం 85 రైళ్లు పరుగుపెడుతున్నాయి. సరుకు రవాణా, సాధారణ ప్రయాణికుల రైళ్లు ఒకే లైన్‌పై నడుస్తున్నాయి. దీన్ని 200 కి.మీ. వేగానికి తగ్గట్టుగా స్థారుు పెంచాలంటే కొంతకాలంపాటు ఈ రైళ్లను ప్రత్యామ్నాయ మార్గాలమీదుగా మళ్లించాల్సి ఉంటుంది. బల్లార్షా మార్గం ఉత్తర- దక్షిణ భారతానికి ప్రధాన అనుసంధాన మార్గం కావటంతో దీనిపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఈ మార్గాన్ని మూయాలంటే సాధ్యమయ్యే పరిస్థితి లేదు. ఇక కనీసం 60 శాతం మేర పూర్తిస్థారుులో మారిస్తే తప్ప ఈ మార్గం కొత్త ప్రాజెక్టుకు పనికిరాదని రష్యా నిపుణులు పేర్కొన్నట్టు సమాచారం. అలాంటప్పుడు కొత్త మార్గాన్నే నిర్మించాల్సి ఉంటుంది. అందుకు దాదాపు రూ.20 వేల కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. ఇంతఖర్చును భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందా అన్నది ప్రధానాంశం. కొత్త లైన్‌తోనే లాభం.. హైస్పీడ్ రైళ్లు నడిచేందుకు తట్టుకునేలా నేల స్వభావం ఉన్నందున కొత్త లైను నిర్మిస్తే కొన్ని దశాబ్దాల పాటు భావి అవసరాలు తీరే అవకాశం ఉన్నందున కొత్త లైను నిర్మాణమే మేలని రష్యా నిపుణులు సూచించినట్లు సమాచారం. దీన్ని హైస్పీడ్ కారిడార్‌గా కూడా వినియోగించుకునే అవకాశం ఉంటుందని వారు సలహా ఇచ్చినట్టు తెలిసింది. దీనికి సంబంధించి పూర్తిస్థారుు నివేదికను త్వరలో రష్యా నిపుణులు రైల్వే బోర్డుకు సమర్పించనున్నారు. దాని ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఇక్కడి రైల్వే అధికారులు వెల్లడించారు. సగటు వేగం 80 కి.మీ మాత్రమే... ఈ లైనుపై సూపర్‌ఫాస్టు రైళ్లు 120 కి.మీ. వేగంతో ప్రయాణిస్తున్నాయి. కానీ వాస్తవంగా వాటి ప్రయాణ వేగం సగటున 80 కి.మీ.గా మాత్రమే ఉంటోంది. ఉన్న లైను పాతది కావటం, దాని దిగువన కాంక్రీట్ బెడ్ లేనందున అది అంతకంటే ఎక్కువ వేగాన్ని తట్టుకోలేదని వారు తేల్చారు. కనీసం గంటకు 150 కిలోమీటర్ల వేగాన్ని కూడా తట్టుకోలేదని రష్యా ఇంజనీర్లు తేల్చినట్టు సమాచారం. కాగా, వారు తమ పర్యటనలో సిగ్నలింగ్, ఇంజనీరింగ్ వ్యవస్థలు, బోగీల సామర్థ్యం, రైళ్ల ట్రాఫిక్, రైల్వే గేట్లు, వంతెనలు, ఇతర మౌలిక సదుపాయాల గురించి అధ్యయనం చేసినట్టు సమాచారం. ఖాజీపేటలో కూడా స్థానిక అధికారులతో రష్యా నిపుణులు భేటీ అయ్యారు.