High-speed rail project
-
భారత్‌కు షింకన్సెన్ రైళ్లు
టోక్యో: భారత్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన హైస్పీడ్ రైలు ప్రాజెక్టు ఊపందుకుంటోంది. ట్రయల్ రన్, తనిఖీ తదితర అవసరాల నిమిత్తం రెండు ఐకానిక్ షింకన్సెన్ రైళ్లను భారత్‌కు జపాన్ కానుకగా ఇవ్వనుంది. నిర్మాణంలో ఉన్న ముంబై–అహ్మదాబాద్ బుల్లెట్ రైలు కారిడార్‌లో ట్రయల్ రన్ కోసం వాటిని వినియోగించనున్నారు. వీటిలో ఒకటి ఇ5 సిరీస్‌కు, మరోటి ఇ3 సిరీస్‌కు చెందినవి. ఈ రైళ్లను 2026 మొదట్లో భారత్‌కు డెలివరీ చేయనున్నట్లు టోక్యోకు చెందిన ది జపాన్ టైమ్స్ దినపత్రిక తెలిపింది. ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణం పూర్తయితే దేశంలో తొలి హైస్పీడ్ రైలు మార్గం అవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 320 కిలోమీటర్లు. బుల్లెట్ ట్రైన్‌గా పిలిచే ఈ రైలు వ్యవస్థను భారత రైల్వే అనుబంధ సంస్థ నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ (ఎన్హెచ్ఎస్ఆర్సీ) అభివృద్ధి చేస్తోంది. ముంబై–అహ్మదాబాద్ మార్గంలో పనులు పూర్తయ్యాక అధిక ఉష్ణోగ్రతలు, ధూళి ప్రభావాలతో సహా డ్రైవింగ్ పరిస్థితులపై డేటాను సేకరించడానికి షింకన్సెన్ రైళ్లను ఉపయోగిస్తారు. అంతకు అవసరమైన తనిఖీ పరికరాలను బిగించిన మీదట జపాన్ వాటిని భారత్‌కు అప్పగించనుంది. హైస్పీడ్ టెక్నాలజీ షింకన్సెన్ జపాన్ హైస్పీడ్ రైల్వే టెక్నాలజీ. ఈ10 అందులో నెక్ట్స్ జనరేషన్ మోడల్. 2030 నాటికి ముంబై–అహ్మదాబాద్ కారిడార్‌లో ఈ అత్యాధునిక ఈ10 మోడల్ షింకన్సెస్ రైళ్లను ప్రవేశపెట్టాలని భారత్ యోచిస్తోంది. ‘మేకిన్ ఇండియా’కింద ఈ రైళ్లను భారత్‌లోనే తయారు చేసేందుకు 2016లో నాటి జపాన్ ప్రధాని షింజో అబేతో ప్రధాని నరేంద్ర మోదీ ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని ప్రకారం సంబంధిత సాంకేతిక పరిజ్ఞానాన్ని జపాన్ త్వరలో భారత్‌కు బదిలీ చేస్తుంది. ప్రస్తుత రైల్వే నెట్‌వర్క్‌లో గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఆర్ఆర్టిఎస్, వందేభారత్ వంటి దేశీయంగా తయారైన సెమీ హైస్పీడ్ రైళ్లను భారత్ ఉపయోగిస్తోంది. ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ కారిడార్‌లో ఈ5 సిరీస్ షింకన్సెన్ రైళ్లను నడపాలని తొలుత భావించింది. కానీ అధిక ఖర్చులు, జాప్యం కారణంగా ఆ ప్రతిపాదనలో ప్రతిష్టంభన ఏర్పడింది. దాన్ని తొలగించడమే గాక భారత్‌కు ఏకంగా అత్యాధునిక ఇ10 సిరీస్ రైళ్లను అందించేందుకు జపాన్ ముందుకొచ్చింది. అదే సమయంలో ఇ5, ఇ3 సిరీస్‌లకు చెందిన ఒక్కో రైలును ట్రయల్స్ తదితర అవసరాల నిమిత్తం పూర్తి ఉచితంగా అందించనున్నట్టు పేర్కొంది. మోదీ త్వరలో జరపనున్న జపాన్ పర్యటనలో ఇందుకు సంబంధించి ఒప్పందం కుదురుతుందని సమాచారం. -
కొత్త లైన్‌తోనే ‘హై స్పీడ్’
సికింద్రాబాద్-నాగ్‌పూర్ కారిడార్‌పై రష్యా నిపుణుల ప్రాథమిక అభిప్రాయం రెండు రోజులపాటు 12 మంది ఇంజనీర్ల పరిశీలన సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్-నాగ్‌పూర్ మార్గంలో సెమీ హైస్పీడ్ రైలు ప్రాజెక్టుకు భారీ ఖర్చు తప్పదని రష్యా రైల్వే ఓ అభిప్రాయానికి వచ్చింది. పైగా ప్రస్తుతం ఉన్న లైన్‌నే హైస్పీడ్ కారిడార్‌గా మార్చటం చిక్కుముడులతో కూడిందని గుర్తించింది. ప్రతిపాదిత ప్రాజెక్టు ప్రకారం ఈ మార్గంలో రైళ్లను గంటకు 200 కి.మీ. వేగంతో నడపాల్సి ఉంటుంది. ఆ వేగంతో రైళ్లను నడపాలంటే ప్రస్తుత లైన్ తట్టుకోలేదని ప్రాథమికంగా నిర్ధారించింది. ఆ స్థారుుకి లైన్‌ను అభివృద్ధి చేయాలంటే దాదాపు 60 శాతం మేర పూర్తిగా మార్చాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. సికింద్రాబాద్-నాగ్‌పూర్ మార్గంలో సెమీ హైస్పీడ్ రైలు ప్రాజెక్టును చేపట్టేందుకు ఉన్న అవకాశాలను రష్యా రైల్వే సంస్థకు చెందిన 12 మంది ఇంజనీర్లతో కూడిన బృందం రెండు రోజుల పాటు అధ్యయనం చేసింది. రష్యాతో ఒప్పందం సికింద్రాబాద్-నాగ్‌పూర్ మధ్య 575 కిలోమీటర్ల దూరం ఉంది. ప్రస్తుతం ఈ రెండు స్టేషన్ల మధ్య సూపర్‌ఫాస్టు రైళ్లు తిరిగేందుకు దాదాపు 10 గంటల సమయం తీసుకుంటున్నారుు. దాన్ని 4 నుంచి ఐదు గంటలకు తగ్గించేలా సెమీ హైస్పీడ్ రైళ్లను నడపాలనేది ప్రాజెక్టు ఉద్దేశం. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రష్యా రైల్వే సంస్థతో ఒప్పందం చేసుకుంది. దేశంలో తొలిదశలో అహ్మదాబాద్-ముంబై మధ్య జపాన్ సాయంతో హైస్పీడ్ రైలు ప్రాజెక్టు పనులు త్వరలో మొదలు కాబోతున్నారుు. మలిదశలో మరికొన్ని నగరాల మధ్య సెమీ హైస్పీడ్ రైళ్లను నడపాలనేది ప్రభుత్వం నిర్ణయం. ఇందుకోసం ఇటీవల గోవాలో రష్యా అధ్యక్షుడు పుతిన్, ప్రధాని మోదీ సమక్షంలో రెండు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చును రెండు దేశాలు 50:50 చొప్పున భరించేందుకు నిర్ణరుుంచాయి. ఇందులో భాగంగా రష్యా రైల్వేకు చెందిన 12 మంది ఇంజనీరింగ్ నిపుణులు హైదరాబాద్ వచ్చి అధికారులతో భేటీ అరుు శని, ఆదివారాలు రెండు రోజుల పాటు ఆ మార్గాన్ని స్థానిక అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా రష్యా బృందం కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఒకే లైన్‌తో ఇబ్బంది ఈ మార్గంలో నిత్యం 85 రైళ్లు పరుగుపెడుతున్నాయి. సరుకు రవాణా, సాధారణ ప్రయాణికుల రైళ్లు ఒకే లైన్‌పై నడుస్తున్నాయి. దీన్ని 200 కి.మీ. వేగానికి తగ్గట్టుగా స్థారుు పెంచాలంటే కొంతకాలంపాటు ఈ రైళ్లను ప్రత్యామ్నాయ మార్గాలమీదుగా మళ్లించాల్సి ఉంటుంది. బల్లార్షా మార్గం ఉత్తర- దక్షిణ భారతానికి ప్రధాన అనుసంధాన మార్గం కావటంతో దీనిపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఈ మార్గాన్ని మూయాలంటే సాధ్యమయ్యే పరిస్థితి లేదు. ఇక కనీసం 60 శాతం మేర పూర్తిస్థారుులో మారిస్తే తప్ప ఈ మార్గం కొత్త ప్రాజెక్టుకు పనికిరాదని రష్యా నిపుణులు పేర్కొన్నట్టు సమాచారం. అలాంటప్పుడు కొత్త మార్గాన్నే నిర్మించాల్సి ఉంటుంది. అందుకు దాదాపు రూ.20 వేల కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. ఇంతఖర్చును భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందా అన్నది ప్రధానాంశం. కొత్త లైన్‌తోనే లాభం.. హైస్పీడ్ రైళ్లు నడిచేందుకు తట్టుకునేలా నేల స్వభావం ఉన్నందున కొత్త లైను నిర్మిస్తే కొన్ని దశాబ్దాల పాటు భావి అవసరాలు తీరే అవకాశం ఉన్నందున కొత్త లైను నిర్మాణమే మేలని రష్యా నిపుణులు సూచించినట్లు సమాచారం. దీన్ని హైస్పీడ్ కారిడార్‌గా కూడా వినియోగించుకునే అవకాశం ఉంటుందని వారు సలహా ఇచ్చినట్టు తెలిసింది. దీనికి సంబంధించి పూర్తిస్థారుు నివేదికను త్వరలో రష్యా నిపుణులు రైల్వే బోర్డుకు సమర్పించనున్నారు. దాని ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఇక్కడి రైల్వే అధికారులు వెల్లడించారు. సగటు వేగం 80 కి.మీ మాత్రమే... ఈ లైనుపై సూపర్‌ఫాస్టు రైళ్లు 120 కి.మీ. వేగంతో ప్రయాణిస్తున్నాయి. కానీ వాస్తవంగా వాటి ప్రయాణ వేగం సగటున 80 కి.మీ.గా మాత్రమే ఉంటోంది. ఉన్న లైను పాతది కావటం, దాని దిగువన కాంక్రీట్ బెడ్ లేనందున అది అంతకంటే ఎక్కువ వేగాన్ని తట్టుకోలేదని వారు తేల్చారు. కనీసం గంటకు 150 కిలోమీటర్ల వేగాన్ని కూడా తట్టుకోలేదని రష్యా ఇంజనీర్లు తేల్చినట్టు సమాచారం. కాగా, వారు తమ పర్యటనలో సిగ్నలింగ్, ఇంజనీరింగ్ వ్యవస్థలు, బోగీల సామర్థ్యం, రైళ్ల ట్రాఫిక్, రైల్వే గేట్లు, వంతెనలు, ఇతర మౌలిక సదుపాయాల గురించి అధ్యయనం చేసినట్టు సమాచారం. ఖాజీపేటలో కూడా స్థానిక అధికారులతో రష్యా నిపుణులు భేటీ అయ్యారు. -
గంటల్లోనే గమ్యానికి
ఢిల్లీకి పొరుగున ఉన్న మీరట్, పానిపట్, అల్వార్ నగరవాసులకు శుభవార్త. హైస్పీడ్ రైలు ప్రాజెక్టును చేపట్టేందుకు ఉద్దేశించిన యాంబిషియస్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ (ఆర్ఆర్టీఎస్) ప్రాజెక్టును ఢిల్లీ ప్రభుత్వం ఆమోదించింది. అంతా సవ్యంగా సాగితే ఈ మూడు నగరాలకు ఢిల్లీ నుంచి కొన్ని గంటల వ్యవధిలోనే చేరుకోవచ్చు. న్యూఢిల్లీ: హైస్పీడ్ రైళ్లతో రాజధానిని పొరుగున్న నగరాలకు అనుసంధానం చేసేందుకు ఉద్దేశించిన యాంబిషియస్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ (ఆర్ఆర్టీఎస్) ప్రాజెక్టుకు ఢిల్లీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు కింద మీరట్, పానిపట్, ఆల్వార్-ఢిల్లీ మధ్య హైస్పీడ్ రైలు మార్గాన్ని నిర్మిస్తారు. దీనిని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అనుబంధ నేషనల్ కేపిటల్ రీజనల్ ప్లానింగ్ బోర్డు (ఎన్‌సీఆర్‌పీబీ) ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు కింద తొలి కారిడార్‌ను ఢిల్లీ-సోనిపట్-పానిపట్ మధ్య నిర్మించనున్నారు. ఈ రెండింటి మధ్య దూరం 111 కిలోమీటర్లు. 2016 నాటికల్లా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఈ మార్గంలో ప్రతిరోజూ 3.77 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారని అంచనా. ఇక రెండో కారిడార్‌ను ఢిల్లీ-గుర్గావ్-అల్వార్ మధ్య నిర్మించనున్నారు. దీని పొడవు 180 కిలోమీటర్లు. ఈ మార్గంలో ప్రతిరోజూ ఏడు లక్షల మంది ప్రయాణించొచ్చని అంచనా వేశారు. ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ మధ్య మూడో కారి డార్ నిర్మితమవనుంది. ఈ మార్గం పొడవు 90 కిలోమీటర్లు. ఈ మార్గంలో ప్రతిరోజూ 5.7 లక్షల మంది ప్రయాణిస్తారని అంచనా. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) సహకరించనుంది. వాస్తవానికి ఈ ప్రాజెక్టును ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లను అనుసంధానం చేసేందుకు ఉద్దేశించింది. అయితే ఈ ప్రతిపాదనను గతంలో షీలాదీక్షిత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకించింది. దీనిని నగరంలో వరకూ కాకుండా నగర శివార్లకే పరిమితం చేయాలని షీలా ప్రభుత్వం సూచించింది. అయితే అంతలోనే లోక్‌సభ ఎన్నికలు రావడంతో ఈ ప్రాజెక్టు వాయిదాపడింది.