
మాస్కో: రష్యాలో ప్రధాని మోదీ టూర్ రెండోరోజు కొనసాగుతోంది. మంగళవారం(జులై 9) ఉదయం రష్యా అధ్యకక్షుడు పుతిన్, మోదీలు కలిసి పుతిన్ అధికారిక నివాసం నొవో ఒగర్యోవ్‌లో గార్డెన్‌లో టీ సేవించారు. ఈ సందర్భంగా వీరిద్దరూ పలు విషయాలపై అనధికారికంగా చర్చించుకున్నారు.
అనంతరం గార్డెన్‌లో ఇద్దరు కలిసి కొద్దిసేపు నడిచారు. అక్కడే ఉన్న గుర్రాలశాలను సందర్శించి గుర్రాలను చేతితో నిమిరి పలకరించారు. మంగళవారం పుతిన్, మోదీ మధ్య శిఖరాగ్ర సదస్సులో భాగంగా ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి.
ప్రధాని మోదీ సోమవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో మాస్కో చేరున్నారు. అనంతరం అధ్యక్షుడు పుతిన్ నివాసంలో ఇచ్చిన విందు స్వీకరించారు. ఈ సందర్భంగా భారత ప్రజల కోసం మోదీ చేస్తున్న కృషిని పుతిన్ కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment