Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

TDP Govt Red Book Conspiracy against senior IPS officer PSR Anjaneyulu1
పక్కా కక్షే... అక్రమ కేసే

సాక్షి, అమరావతి: సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులుపై టీడీపీ కూటమి సర్కారు పక్కా పన్నాగంతో అక్రమ కేసు నమోదు చేసింది. సీఐడీ దాఖలు చేసిన రిమాండ్‌ నివేదికే ఆ కుట్రలను బహిర్గతం చేసింది. వలపు వల విసిరి బడాబాబులను బురిడీ కొట్టించే నేర చరిత్ర ఉన్న ముంబై నటి కాదంబరి జత్వానీతో అబద్ధపు ఫిర్యాదు ఇప్పించేందుకు ఎంతటి పన్నాగంతో వ్యవహరించారో బయటపడింది. ఆమెపై గతంలో నమోదైన క్రిమినల్‌ కేసులు దర్యాప్తు ఉండగానే వాటిని వక్రీకరిస్తూ... భారత సాక్ష్యాధారాల చట్టానికి విరుద్ధంగా కక్ష పూరితంగా అక్రమ కేసు నమోదు చేసినట్లు స్పష్టమైంది. తాను ఎలాంటి తప్పూ చేయలేదని... జత్వానీపై గతంలో విజయవాడ పోలీసులు నమోదు చేసిన కేసుతో నాడు ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ఉన్న తనకు ఎలాంటి సంబంధం లేదని పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు తన వాదనలను న్యాయస్థానంలో స్వయంగా వినిపించారు. ఈ కేసులో ఆయనకు న్యాయస్థానం 14 రోజులు రిమాండ్‌ విధించింది. మరోవైపు ప్రస్తుత డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు గతంలో చేసిన ఫిర్యాదుతో నమోదు చేసిన అక్రమ కేసులోనూ పీఎస్‌ఆర్‌ పేరును చేరుస్తూ సీఐడీ మెమో దాఖలు చేయడంతోపాటు మరిన్ని అక్రమ కేసులకు ప్రభుత్వం సిద్ధమైంది.జత్వానీ అబద్ధపు ఫిర్యాదు.. అక్రమ కేసుటీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పీఎస్‌ఆర్‌ ఆంజనేయులుపై అక్రమ కేసు నమోదు చేసేందుకు ఉపక్రమించింది. అందుకోసం కాదంబరీ జత్వానీని సాధనంగా చేసుకుంది. విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్త కుక్కల విద్యాసాగర్‌కు చెందిన భూములను ఫోర్జరీ పత్రాలతో విక్రయించేందుకు యత్నించిన కేసులో ఆమె నిందితురాలు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాదంబరి జత్వానీ ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వ గౌరవ అతిథిగా మారిపోయారు. అక్రమ కేసు నమోదుకు రంగం సిద్ధం చేస్తూ ముందుగా 2024 ఆగస్టులో టీడీపీ అనుకూల చానల్‌తో ఆమెను మాట్లాడించారు. వెంటనే విజయవాడ పోలీసులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆమెతో మాట్లాడారు. ఈ క్రమంలో ఆమెను 2024 సెప్టెంబరు 5న విజయవాడకు రప్పించడంతో ఏసీపీతోపాటు విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ ఎస్వీ రాజశేఖర్‌బాబును కలిశారు. వారం రోజులు ఆమె విజయవాడలోనే ప్రభుత్వ అతిథి హోదాలో ఉన్నారు. ఈ కేసులో విచారణ అధికారిగా నియమించాలని అప్పటికే నిర్ణయించిన ఉమామహేశ్వరరావు ఆమెకు కుట్ర కేసు నమోదు కథను వివరించారు. అనంతరం 2024 సెప్టెంబరు 13 అర్ధరాత్రి కాదంబరీ జత్వానీ ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిరా>్యదు చేయడం... వెంటనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం చకచకా జరిగిపోయాయి.జత్వానీ ఫోర్జరీ పత్రాలపై కేసు విచారణలో ఉండగానే పోలీసులపై ఫిర్యాదా..!పీఎస్‌ఆర్‌ ఆంజనేయులుపై అక్రమ కేసు నమోదు చేసేందుకే కాదంబరీ జత్వానీతో అబద్ధపు ఆరోప­ణలతో ఫిర్యాదు చేయించినట్లు సీఐడీ నివేదిక ద్వారా స్పష్టమవుతోంది. కుక్కల విద్యా సాగర్‌కు చెందిన భూములను విక్రయించేందుకు వాటిని 2018లో కొనుగోలు చేసినట్టు ఆమె 2023లో ఫోర్జరీ పత్రాలు సృష్టించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఆ కేసు ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉంది. కానీ తనపై అక్రమ కేసు పెట్టారని జత్వానీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఫిర్యాదు చేయడం గమనార్హం. అవి ఫోర్జరీ పత్రాలో.. కావో అన్నది పోలీసుల దర్యాప్తులో నిగ్గు తేలుతుంది. అంతిమంగా న్యాయస్థానం తుది తీర్పు ఇవ్వాలి. అంతేగానీ ఇంకా దర్యాప్తులో ఉన్న కేసులోని అభియోగాలు తప్పని చెబుతూ నిందితులు పోలీసులపైనే ఫిర్యాదు చేస్తే వెంటనే కేసు నమోదు చేయడం నిబంధనలకు విరుద్ధం. అదే విధానంగా మారితే దేశంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్న అన్ని క్రిమినల్‌ కేసుల్లోనూ నిందితులు తిరిగి పోలీసులపై ఫిర్యాదు చేసి అక్రమ కేసులు పెట్టేందుకు అనుమతించినట్టే అవుతుంది. తప్పు చేయలేదు... జత్వానీ ఎవరో తెలియదుతనపై నమోదు చేసిన అక్రమ కేసులో పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు న్యాయస్థానంలో స్వయంగా వాదనలు వినిపించారు. కాదంబరి జత్వానీపై గతంలో విజయవాడ పోలీసులు నమోదు చేసిన కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని విస్పష్టంగా ప్రకటించారు. సివిల్‌ పోలీసులు పర్యవేక్షించే క్రిమినల్‌ కేసులు, ఇతర దర్యాప్తులతో ఇంటెలిజెన్స్‌ డీజీగా ఉన్న తనకు ఎలాంటి సంబంధం ఉండదని పోలీసు సర్వీసు నియమావళిని ఉటంకిస్తూ వివరించారు. జత్వానీ తనపై చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవాలన్నారు. అందుకే తాను కనీసం ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కూడా దాఖలు చేయలేదని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. తనపై అబద్ధపు అభియోగాలతోనే పోలీసులు, సీఐడీ అధికారులు అక్రమ కేసు నమోదు చేశారన్నారు. ఈ కేసులో మరో నిందితుడు ఐపీఎస్‌ అధికారి విశాల్‌ గున్నీ న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇవ్వలేదనే విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. పోలీసుల ఒత్తిడితో ఆయన నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన వాంగ్మూలాన్ని పరిగణలోకి తీసుకోకూ­డదని కోరారు. తాను సదా అందుబాటులో ఉన్నానని... దర్యాప్తునకు పూర్తిగా సహకరించేందుకు సిద్ధమని చెప్పినా సరే సీఐడీ అధికారులు తనను అక్రమంగా అరెస్టు చేశారన్నారు.అబద్ధపు వాంగ్మూలం కోసం పీఎస్‌ఆర్‌పై ఒత్తిడిఈ కేసులో అబద్ధపు వాంగ్మూలాల కోసం సీఐడీ అధికారులు సీనియర్‌ ఐపీఎస్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులపై ఒత్తిడి తేవడం గమనార్హం. ఆయన్ను హైదరాబాద్‌లో అరెస్టు చేసే సమయంలో తన వద్ద ఉన్న ఒకే ఒక్క ఫోన్‌ను సీఐడీ అధికారులకు అప్ప­గించారు. అదే విషయాన్ని అధికారులకు చెప్పడంతో వారు సమ్మతించారు. కానీ పీఎస్‌ఆర్‌ను విజయ­వాడకు తీసుకువచ్చిన తరువాత సీఐడీ అధికారులు మధ్యవర్తుల నివేదిక పేరుతో ఓ పత్రాన్ని తెచ్చి సంతకం చేయాలని పేర్కొన్నారు. అందులో ఆయన వద్ద ల్యాప్‌టాప్, ఐప్యాడ్, మరో సెల్‌ ఫోన్‌ ఉన్నా­యని అంగీకరించినట్లుగా పొందుపరిచారు. దీనిపై పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు అభ్యంతరం వ్యక్తం చేశా­రు. తన వద్ద లేని ఎలక్ట్రానిక్‌ పరికరాలు ఉన్నట్టుగా రాసేందుకు నిరాకరించారు. హైదరాబాద్‌లో తన ఇంటి వద్దే అన్ని విషయాలు చెప్పానని, ఇప్పుడు ఇలా అబద్ధపు వాంగ్మూలం రాయమని చెప్పడం ఏమిటని నిలదీశారు. తమపై ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి ఉందని సీఐడీ అధికారులు నిస్సహాయత వ్యక్తం చేయడం గమనార్హం. ఇదే విషయాన్ని పీఎస్‌ఆర్‌ న్యాయస్థానం దృష్టికి తెచ్చారు.సాక్ష్యాధారాల చట్టం వక్రీకరణ...పోలీసులే తన చేతిలో ఫోర్జరీ పత్రాలు పెట్టి వెంటనే స్వాధీనం చేసుకున్నారని కాదంబరి జత్వానీ తన ఫిర్యాదులో పేర్కొనడం మరో అబద్ధపు అభి­యో­గం. విచారణ జరుగుతున్న కేసులో భారత సాక్ష్యా­ధారాల చట్టాన్ని వక్రీకరించేందకు తెగించడం గమ­నార్హం. డ్రగ్స్, గంజాయి, ఇతర స్మగ్లింగ్‌ నిరో­ధక కేసుల్లో దేశవ్యాప్తంగా పోలీసులు, కస్టమ్స్‌ అధికా­రులు అనుసరించే విధానాన్నే నాడు విజయ­వాడ పోలీసులు పాటించారు. ఆమె నివాసంలో సోదాలు నిర్వహించగా ఫోర్జరీ పత్రాలు లభించా­యి. పోలీసులే తన చేతిలో ఫోర్జరీ పత్రాలు పెట్టా­రని ఆమె ప్రస్తుతం తప్పుడు అభియోగాలు మోప­డం వెనుక కూటమి ప్రభుత్వ పెద్దల పన్నాగం ఉంది.టిఫిన్‌ కూడా పెట్టకుండా.. సీఐడీ అధికారులు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు పట్ల మానవత్వం లేకుండా, అగౌరవంగా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. ఆయన్ని బుధవారం ఉదయం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చిన అనంతరం న్యాయస్థానానికి తరలించారు. ఆయనకు కనీసం టిఫిన్‌ కూడా పెట్టలేదు. అనంతరం మధ్యాహ్నం రిమాండ్‌ కోసం విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. పీఎస్‌ఆర్‌పై మరిన్ని అక్రమ కేసులు నమోదు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.⇒ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్‌ రఘురామరాజు గతంలో ఇచ్చిన అబద్ధపు ఫిర్యాదులో పీఎస్‌ఆర్‌ ఆంజనేయులును ఇరికించేందుకు కుట్ర పన్నుతున్నారు. తనను సీఐడీ అధికారులు హింసించారని రఘురామ గతంలో ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టు దీన్ని తోసిపుచ్చినప్పటికీ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అక్రమ కేసు నమోదు చేసింది. ఈ కేసులో అప్పటి సీఐడీ డీజీ పీవీ సునీల్‌కుమార్‌తోపాటు ఇతర అధికారులపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసింది. ఈ కేసులో పీఎస్‌ఆర్‌ ఆంజనేయులును కూడా చేరుస్తూ న్యాయస్థానంలో సీడీఐ బుధవారం మెమో దాఖలు చేయడం గమనార్హం. అసలు ఆయనకు సీఐడీతో ఎలాంటి సంబంధం లేదు. ఆ సమయంలో ఆయన ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా కూడా లేరు. ఏసీబీ డీజీగా ఉన్నారు. అయినా సరే పీఎస్‌ఆర్‌ను ఆ కేసులో నిందితుడుగా చేర్చడం విస్మయం కలిగిస్తోంది.⇒ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు గతంలో ఏపీపీఎస్పీ కార్యదర్శిగా వ్యవహరించారు. ఆ సమయంలో కొన్ని ఫైళ్లు కనపడకుండా పోయాయంటూ దాదాపు నాలుగేళ్ల తరువాత ఏపీపీఎస్పీ కార్యదర్శితో తాజాగా ఫిర్యాదు ఇప్పించడం కూటమి సర్కారు కుట్రలకు నిదర్శనం.⇒ గతంలో పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు తనను బెదిరించారంటూ ఉద్యోగ సంఘం నేత సూర్యనారా­యణతో టీడీపీ ప్రభుత్వం ఇటీవల అబద్ధాలతో ఫిర్యాదు ఇప్పించింది. ఆ ఫిర్యాదును సీఐడీకి తాజాగా పంపించడం ప్రభుత్వ కుటిల పన్నా­గానికి నిదర్శనం.

YSRCP Vidadala Rajini Relative Gopi Arrest In Hyderabad Updates2
రెడ్‌బుక్‌ పాలన.. విడదల రజిని మరిది గోపీ అరెస్ట్‌

సాక్షి, గుంటూరు/హైదరాబాద్‌: ఏపీలో కూటమి సర్కార్‌ పాలనలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలవుతోంది. వైఎస్సార్‌సీపీ నాయకులపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు సర్కార్‌.. వైఎస్సార్‌సీపీ నాయకులు, వారి కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు పెడుతూ అరెస్ట్‌లకు పాల్పడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా మాజీ మంత్రి విడదల రజిని మరిది విడదల గోపీని ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు.వివరాల ప్రకారం.. ఏపీలో నారా లోకేష్‌ రెడ్‌బుక్‌ రాజ్యాంగంలో అమలులో భాగంగా మరో వైఎస్సార్‌సీపీ నేతను అక్రమంగా అరెస్ట్‌ చేశారు. మాజీ మంత్రి విడదల రజిని మరిది విడదల గోపీని ఏపీ ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గోపీపై పలు కేసులు నమోదు చేశారు. ఏసీబీ అధికారులు హైదరాబాదులోని గచ్చిబౌలిలో గోపీని అరెస్ట్ చేశారు. లక్ష్మీ బాలాజీ క్రషర్స్ ఆరోపణల కేసులో విడదల గోపీని అరెస్ట్‌ చేసినట్టు అధికారులు చెబుతున్నారు. కాసేపట్లో గోపీని ఏపీకి తరలించనున్నారు.

somashetti Madhusudan Funeral At Kavali Over Pahalgam3
కావలి చేరుకున్న మధుసూదన్ పార్థివ దేహం.. కుటుంబ సభ్యులు ఆవేదన

సాక్షి, నెల్లూరు: జమ్ము కశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో మృతిచెందిన సోమిశెట్టి మధుసూదన్ మృతదేహాం కావలి చేరుకుంది. మధుసూదన్‌ను చూసిన కుటుంబ సభ్యులు, స్థానికులు కన్నీటిపర్యంతమవుతున్నారు. మధుసూదన్‌ ఇంటి వద్దకు భారీ సంఖ్యలో​ బంధువులు, స్థానికులు చేరుకున్నారు.వివరాల ప్రకారం.. పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో మృతిచెందిన సోమిశెట్టి మధుసూదన్ మృతదేహాం గురువారం ఉదయం స్వగ్రామం చేరుకుంది. తెల్లవారుజామున మూడు గంటలకు చెన్నై ఎయిర్‌పోర్టు చేరుకున్న మధుసూదన్ పార్థివ దేహాన్ని కావలికి తరలించారు. ఈ క్రమంలో ఇంటి వద్ద మధుసూదన్ మృతదేహానికి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి నివాళి అర్పించారు. మరోవైపు.. ప్రభుత్వ లాంఛనాలతో మధుసూదన్ అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.కశ్మీర్‌లో పహల్గాంలో టెర్రరిస్టులు సృష్టించిన మారణహోమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు మరణించారు. బెంగళూరులో స్థిరపడ్డ మధుసూదన్ కుటుంబ సభ్యులతో విహారయాత్రకు వెళ్ళగా ఈ ఘటన జరిగింది. సోమిశెట్టి మధుసూదన్‌ తల్లిదండ్రుల పరిస్థితి దయనీయంగా ఉంది. మధుసూదన్‌ తండ్రి తిరుపాల్, తల్లి పద్మావతి పట్టణంలోని పెదపవని బస్టాండ్‌లో అరటిపళ్లు, టెంకాయల వ్యాపారం చేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెల తరువాత మధుసూదన్‌రావు పుట్టారు. స్థోమత లేకున్నా కష్టపడి చదివించారు. అన్నితరగతుల్లో మంచి మార్కులు తెచ్చుకున్న మధుసూదన్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. ఐబీఎం కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా చేరారు.వృత్తిరీత్యా బెంగళూరులో ఉంటున్న మధుసూదన్‌ అక్కడ సొంతింటిని కూడా కట్టుకున్నారు. వృత్తిలో ఒక్కో మెట్టు ఎక్కుతుంటే ఆశలు పండాయని వృద్ధ తల్లిదండ్రులు సంబరపడ్డారు. వేసవి విడిది కోసమని మధుసూదన్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పనిచేస్తున్న తన భార్య కామాక్షి, కుమార్తె మేధు (ఇంటర్‌) కుమారుడు దత్తు (8వతరగతి)తో కలసి కశ్మీర్‌ పర్యటనకు వెళ్లారు. అక్కడ ఉగ్రవాదుల తూటాలకు మధుసూదన్‌రావు బలయ్యారు. తమ కుమారుడు మృతి చెందాడన్న విషయం తెలియని ఆ తండ్రి బుధవారం ఉదయం కూడా అరటిపళ్ల బండి వద్ద ఉండి వ్యాపారం చేసుకుంటున్నారు. మృతుడు మధుసూదన్‌కు భార్య మీనాక్షి, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

PM Narendra Modi Govt Fires On Pakistan For Pahalgam Terror Attack4
పాక్‌కు ‘పంచ్‌’.. ఆ దేశ పౌరులకు వీసాలు రద్దు

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం వద్ద పర్యాటకులపై మంగళవారం ఉగ్ర ముష్కరులు జరిపిన ఆటవిక దాడిని భారత్‌ అత్యంత తీవ్రంగా పరిగణించింది. దీని వెనక పాకిస్తాన్‌ హస్తం స్పష్టంగా కనిపిస్తోందంటూ మండిపడింది. సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయాదిపై కఠిన చర్యలకు దిగింది. పాకిస్తాన్‌ పౌరులకు భారత్‌లోకి ప్రవేశాన్ని నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అంతేగాక పాక్‌తో దౌత్య సంబంధాలకు చాలావరకు కత్తెర వేసింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో సమా వేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఈ మేరకు ఐదు కీలక నిర్ణయాలు తీసుకుంది. సింధూ నదీ జలాల ఒప్పందం సస్పెన్షన్, అటారీ సరిహద్దు మూసివేత, దౌత్య సిబ్బంది తగ్గింపు తదితరాలు వీటిలో ఉన్నాయి. దీంతో పాక్‌తో ఇప్పటికే క్షీణించిన దౌత్య సంబంధాలు మరింత అట్టడుగుకు దిగజారాయి. ఈ చర్యలతోనే సరిపెట్టకుండా ఉగ్ర ముష్కరులకు, వారిని ప్రేరేపిస్తున్న పొరుగు దేశానికి దీటుగా బదులిచ్చేందుకు కూడా కేంద్రం సమాయత్తమవుతోంది. ఆ దిశగా చేపట్టాల్సిన చర్యలపై సీసీఎస్‌ భేటీలో రెండున్నర గంటలకు పైగా లోతుగా చర్చ జరిగింది. విమానాశ్రయంలోనే మోదీ సమీక్ష మంగళవారం రాత్రి సౌదీ అరేబియా పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని వెనుదిరిగిన ప్రధాని మోదీ బుధవారం తెల్లవారుజామున ఢిల్లీ చేరుకున్నారు. విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్, విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రం మిస్రీతో విమానాశ్రయంలోనే సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. పలు అంశాలపై వారితో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం సాయంత్రం ఆరింటికి మోదీ సారథ్యంలో సీసీఎస్‌ అత్యవసరంగా సమావేశమైంది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, జైశంకర్, దోవల్, కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి టీవీ సోమనాథన్, రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్‌కుమార్‌ సింగ్, విక్రం మిస్రీ, ప్రధాని ముఖ్య కార్యదర్శులు పీకే మిశ్రా, శక్తికాంత దాస్, అత్యున్నత స్థాయి అధికారులు పాల్గొన్నారు. సీసీఎస్‌ సభ్యురాలైన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అమెరికా పర్యటనలో ఉండటంతో హాజరు కాలేదు. దాడిపై ప్రతిస్పందన ఎలా ఉండాలన్నదే ప్రధాన అజెండాగా భేటీ జరిగింది. దాడి జరిగిన తీరు తదితరాలను అమిత్‌ షా వివరించారు. 25 మంది భారతీయులు, ఒక నేపాల్‌ జాతీయుడు మృతి చెందినట్టు చెప్పారు. శిక్షించి తీరతాం: మిస్రీ పహల్గాం దాడిని సీసీఎస్‌ అత్యంత తీవ్రంగా ఖండించినట్టు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రం మిస్రీ తెలిపారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. దాడికి తెగబడ్డ ముష్కరులతో పాటు దాని సూత్రధారులను కూడా కఠినంగా శిక్షించి తీరాలని సీసీఎస్‌ తీర్మానించింది’’ అని వెల్లడించారు. ముంబై దాడుల సూత్రధారుల్లో ఒకడైన తహవ్వుర్‌ రాణా మాదిరిగానే వారిని కూడా చట్టం ముందు నిలబెట్టడం ప్రకటించారు. ‘‘జమ్మూ కశ్మీర్‌లో విజయవంతంగా అసెంబ్లీ ఎన్నికలు జరిగి, ఆ ప్రాంతమంతా ఆర్థికాభివృద్ధితో కళకళలాడుతున్న వేళ పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిన కుట్రపూరిత దాడి ఇది. దాని వెనక దాగున్న సీమాంతర లింకులపై సీసీఎస్‌ లోతుగా చర్చించింది. ప్రపంచ దేశాలన్నీ దాన్ని అత్యంత తీవ్ర పదజాలంతో ఖండించిన తీరును ప్రశంసించింది. ఉగ్రవాదంపై రాజీలేని పోరులో భారత్‌కు ఆ దేశాల మద్దతుకు ఇది ప్రతీక అని పేర్కొంది. పాక్‌పై తీసుకున్న చర్యల జాబితాను చదివి వినిపించారు. పాక్‌పై చర్యలివే... – సార్క్‌ వీసా మినహాయింపు పథకం (ఎస్‌వీఈఎస్‌) కింద పాక్‌ జాతీయులకు భారత వీసాల జారీ నిలిపివేత. ఇప్పటికే జారీ చేసిన వీసాల రద్దు. వాటిపై ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న పాకిస్తానీలు 48 గంటల్లో దేశం వీడాలని ఆదేశం. – ఉగ్రవాదానికి పాక్‌ మద్దతివ్వడం మానుకునేదాకా 1960లో కుదుర్చుకున్న సింధు నదీ జలాల ఒప్పందం సస్పెన్షన్‌. – భారత్, పాక్‌ మధ్య రాకపోకలు జరుగుతున్న పంజాబ్‌లోని అటారీ సరిహద్దు తక్షణం మూసివేత. దానిగుండా పాక్‌కు వెళ్లినవారు తిరిగొచ్చేందుకు మే 1 దాకా గడువు. – ఢిల్లీలోని పాక్‌ హై కమిషన్‌ నుంచి రక్షణ, త్రివిధ దళాల సలహాదారు, వారి ఐదుగురు సహాయక సిబ్బంది బహిష్కరణ. వారంలోపు భారత్‌ వీడాలని ఆదేశం. ఇస్లామాబాద్‌లోని భారత హై కమిషన్‌ నుంచి భారత రక్షణ, త్రివిధ దళాల సలహాదారుల ఉపసంహరణ. – ఇరుదేశాల హై కమిషన్లలో సిబ్బంది సంఖ్య 55 నుంచి 30కి తగ్గింపు.

IPL 2025: Mumbai Indians Get Four Consecutive Wins After Very Bad Start5
SRH Vs MI: లైన్‌లోకి వచ్చారా వార్‌ వన్‌ సైడే.. వరుస విజయాలతో దూసుకుపోతున్న ముంబై ఇండియన్స్‌

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌ను ముంబై ఇండియన్స్‌ చెత్తగా ప్రారంభించి, తిరిగి గాడిలో పడింది. తొలి ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు పరాజయాల తర్వాత వరుసగా నాలుగు విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దూసుకొచ్చింది. ఆ జట్టుకు పడి లేవడం కొత్త కాదు. గతంలో చాలా సీజన్లలో ఇలాగే తొలుత పరాజయాలు ఎదుర్కొని ఆతర్వాత టైటిల్‌ రేసులో నిలిచింది. ‍ప్రస్తుత సీజన్‌లోనూ ముంబై ఇండియన్స్‌ అదే ఒరవడిని కొనసాగిస్తుంది.ఆ జట్టు ఆటగాళ్లు ఒక్కసారి ఊపులోకి వస్తే వార్‌ సైడ్‌ అవుతుంది. ఇది మరోసారి నిరూపితమైంది. ఈ సీజన్‌ తొలి మ్యాచ్‌ల్లో రోహిత్‌ శర్మ విఫలం కావడం.. బ్యాటర్లలో పెద్దగా ఆత్య విశ్వాసం లేకపోవడం.. పేసర్లు లయను అందిపుచ్చుకోలేకపోవడం, బుమ్రా అందుబాటులో లేకపోవడం వంటివి జరిగాయి. ఈ కారణాల చేత ముంబై తొలి మ్యాచ్‌ల్లో వరుస పరాజయాలు ఎదుర్కొంది.అయితే ప్రస్తుతం​ సీన్‌ మారిపోయింది. రోహిత్‌ శర్మ తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. బుమ్రా జట్టులో చేరడమే కాకుండా, సామర్థ్యం మేరకు సత్తా చాటుడుతున్నాడు. బ్యాటర్లు తిరిగి ఆత్మ విశ్వాసాన్ని పొందారు. బౌలర్లు, ముఖ్యంగా పేసర్లు లయను అందుకున్నారు. దీపక్‌ చాహర్‌, సూర్యకుమార్‌, బౌల్ట్‌, మిచెల్‌ సాంట్నర్‌ అత్యుత్తమంగా రాణిస్తున్నారు. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా అవకాశం వచ్చిన ప్రతిసారి చెలరేగుతున్నాడు.నిన్న (ఏప్రిల్‌ 23) సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పైన పేర్కొన్న ఆటగాళ్లంతా తలో చేయి వేయడంతో ముంబై ఇండియన్స్‌ ఏకపక్ష విజయం సాధించింది. ఈ సీజన్‌లో ముంబై సన్‌రైజర్స్‌ను ఓడించడం ఇది రెండో సారి. నిన్నటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచి సన్‌రైజర్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన ముంబై.. ఆ జట్టును స్వల్ప స్కోర్‌కే పరిమతం చేసింది. పేసర్లు బౌల్ట్‌, చాహర్‌ చెలరేగడంతో సన్‌రైజర్స్‌ 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి 100 పరుగులైనా చేస్తుందా అనిపించింది. అయితే క్లాసెన్‌ (71), అభినవ్‌ మనోహర్‌ (43) ఆదుకోవడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేయగలిగింది. బౌల్ట్‌ 4, చాహర్‌ 2, బుమ్రా, హార్దిక్‌ తలో వికెట్‌ తీసి సన్‌రైజర్స్‌ పుట్టి ముంచారు.అనంతరం ఛేదనలో ముంబై ఆదిలోనే రికెల్టన్‌ (11) వికెట్‌ కోల్పోయినా.. రోహిత్‌ (46 బంతుల్లో 70).. విల్‌ జాక్స్‌తో (22) పాటు ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. జాక్స్‌ ఔటయ్యాక క్రీజ్‌లోకి వచ్చిన సూర్యకుమార్‌ యాదవ్‌ (19 బంతుల్లో 40 నాటౌట్‌) తన సహజ శైలిలో రెచ్చిపోయి బౌండరీతో మ్యాచ్‌ను ముగించాడు. రోహిత్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడి విజయానికి చేరువలో ఔటయ్యాడు. ముంబై మరో 26 బంతులు మిగిలుండగానే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో ముంబై వరుసగా నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ జట్టు చివరిగా 2020 సీజన్‌లో నాలుగు అంతకంటే ఎక్కువ విజయాలు సాధించింది. ఆ సీజన్‌లో ముంబై వరుసగా 5 మ్యాచ్‌ల్లో గెలిచి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. అదే ముంబై ఇండియన్స్‌ను చివరి (ఐదో) టైటిల్‌.

India puts Indus Waters Treaty on hold, special story6
ఏమిటీ సింధూ నదీ  జలాల ఒప్పందం?

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సింధూ జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని భారత సర్కార్‌ సంచలన నిర్ణయం తీసుకోవడంతో ఈ నదీజలాల అంశం చర్చనీయాంశమైంది. ఘర్షణతో మొదలై ఒప్పందం దాకా..ఇరు దేశాల మధ్య విస్తరించి ఉన్న సింధూ నది, దాని ఉపనదుల జలాలను సాగు కోసం, జలవిద్యుత్‌ఉత్పత్తి, జల రవాణా, చేపల వేట తదితరాల కోసం వినియోగించుకునేందుకుగాను భారత్, పాకిస్తాన్‌ దశాబ్దాల క్రితం ఒక ఒప్పందం చేసుకున్నాయి. దాదాపు తొమ్మిదేళ్లపాటు విస్తతస్థాయి చర్చల తర్వాత 1960 సెప్టెంబర్‌ 19వ తేదీన నాటి భారత ప్రధాన మంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ, పాకిస్తాన్‌ అధ్యక్షుడు అయూబ్‌ఖాన్‌లు ఈ చరిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు చేశారు. ఒప్పందంలో పేర్కొన్న మేరకు సింధూ ఉపనదుల్లో తూర్పువైపుగా ప్రవహించే రావి, బియాస్, సట్లైజ్‌ నదులపై భారత్‌కు హక్కులు దఖలుపడ్డాయి. సింధూ ఉపనదుల్లో పశ్చిమ దిశగా ప్రవహించే జీలం, చినాబ్‌లపై పాకిస్తాన్‌కు హక్కులు లభించాయి. ఈ నదీ జలాల వినియోగం, ఇరు దేశాల మధ్య ఉత్తరప్రత్యత్తరాల కోసం ఒక సహకార యంత్రాంగాన్ని నెలకొల్పారు. ఎలాంటి ఘర్షణలకు తావులేకుండా పరస్పర సహకారం భావనతో నదీజలాలను సద్వినియోగం చేసుకోవడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం. భారత్‌ తన పాక్షిక హక్కు మేరకు పాకిస్తాన్‌ పరిధిలోని పశ్చిమ ఉపనదుల జలాలనూ పరిమితంగా వాడుకోవచ్చు. వ్యవసాయం, జలవిద్యుత్‌ ఉత్పత్తి కోసం వినియోగించుకోవచ్చు. అయితే పశ్చిమ దిశగా ప్రయాణించే జలాలు పాకిస్తాన్‌లోకి వెళ్లకుండా అడ్డుకోకూడదు. ఈ ఒప్పందంలో భాగంగానే గతంలోనే శాశ్వత సింధూ కమిషన్‌ను ఏర్పాటుచేశారు. ఈ కమిషన్‌లో ఇరు దేశాలకు ప్రాతినిధ్యం ఉంది. ఇరు దేశాలు తమ అభ్యంతరాలను ఈ శాశ్వత కమిషన్‌ ద్వారా చెప్పుకోవచ్చు. ఈ నదీజలాలపై ఉద్దేశపూర్వకంగా డ్యామ్‌లను నిర్మించి, హఠాత్తుగా నీటిని వదిలి నీటిబాంబులుగా మార్చకూడదని షరతు పెట్టుకున్నారు. గడచిన ఆరు దశబ్దాల్లో ఈ నదీప్రవాహాల వెంట భౌగోళికంగా, రాజకీయంగా, పర్యావరణపరంగా చాలా మార్పులొచ్చాయి. జీలంకు ఉపనది అయిన కిషన్‌గంగ నదిపై భారత్‌ జలవిద్యుత్‌ కేంద్రాన్ని నిర్మించింది. దీనిపై పాకిస్తాన్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తోంది. ప్రాజెక్టు కారణంగా తమ భూభాగంలోకి నదీజలాల ఉధృతి బాగా తగ్గిపోయిందని సింధూ నదీజలాల ఒప్పందానికి భారత్‌ తూట్లు పొడుస్తోందని పాకిస్తాన్‌ వాదిస్తోంది. భారత్, పాక్‌ల మధ్య గతంలో 1965, 1971, 1999లో యుద్ధాలు జరిగినా, పలుమార్లు ఉద్రిక్తతలు నెలకొన్నా సింధు జలాల ఒప్పందం అమలుకు నిరాటంకంగా కొనసాగడం విశేషం. అయితే ఇటీవలి కాలంలో డ్యామ్‌ల నిర్మాణం, నీటి వినియోగం తదితర అంశాలపై వివాదాలు ఎక్కువయ్యాయి. కిషన్‌గంగ, రాట్లే ప్రాజెక్టులపై పంచాయతీని పాకిస్తాన్‌ ప్రపంచబ్యాంక్‌ దాకా తీసుకెళ్లింది. అయితే తాజాగా ఒప్పందం నుంచి తాత్కాలికంగా భారత్‌ వైదొలిగితే ఇకపై కేంద్రప్రభుత్వం తనకు నచ్చినట్లు ప్రవర్తించే వీలుంది. అంటే జీలం, చినాబ్, రావి, బియాస్, సట్జైజ్‌ నదీజలాలు పాకిస్తాన్‌కు స్వేచ్ఛగా ప్రవహించకుండా డ్యామ్‌లు కట్టే వీలుంది. అప్పుడు పాకిస్తాన్‌కు నీటి కష్టాలు పెరుగుతాయి. దీంతో దాయాదిదేశాన్ని జలసంక్షోభం చుట్టుముడుతుంది. – సాక్షి, నేషనల్‌ డెస్క్‌ .

Singer Sunitha Share One Video Song From MM Keeravani Voice7
పడిపోయినా ఈ పరుగు ఆగదు.. సునీత పోస్ట్‌

గాయని ప్రవస్తి (Pravasthi) రీసెంట్‌గా ఒక వీడియోతో సింగర్‌ సునీతకు పలు ప్రశ్నలు సందించారు. వాటికి సమాధానం చెప్పాలని ఆమె కోరారు. మూడురోజులుగా ‘పాడుతా తీయగా’ ప్రోగ్రాం చుట్టూ పలు విమర్శలు వస్తున్నాయి. ఈ ప్రోగ్రాంలో ఉన్న జడ్జెస్‌ వారికి నచ్చినోళ్లను మాత్రమే ఎంకరేజ్‌ చేస్తారని ప్రవస్తి కామెంట​్‌ చేశారు. వారికి నచ్చన కంటెస్టెంట్స్‌ పట్ల వివక్ష చూపుతున్నారని చెప్పుకొచ్చారు. తనను బాడీషేమింగ్‌ కూడా చేశారని ఆమె అన్నారు. అయితే, ఇందులో ఎలాంటి నిజం లేదని సింగర్‌ సునీత ఒక వీడియోను విడుదల చేశారు. ఆపై వెంటనే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ ప్రవస్తి కూడా సునీత కోసం వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో సింగర్‌ సునీత మరో వీడియోను తన సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. అయితే, ప్రవస్తి గురించి కాదు. మనిషి జీవితానికి అవసరమైన మోటివేషన్‌ ఇచ్చే లిరిక్స్‌తో ఆ పాట ఉంది. గోపీచంద్‌ నటించిన 'ఒక్కడున్నాడు' మూవీలోని సాంగ్‌ను ఆమె పంచుకున్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన ఆ పాటకు కీరవాణి సంగీతం అందించడమే కాకుండా ఆలపించారు. 'అడుగడుగున పడిపోయినా ఆగే వీల్లేదే పరుగు.. కోరిన తీరాన్నే చేరుకునే వరకు ఓ నిమిషమైనా నిదరపోవా..' అనే లిరిక్స్‌ అందులో ఉన్నాయి. సింగర్‌ ప్రవస్తి గురించే సునీత ఈ పాటను పోస్ట్‌ చేశారా..? అనే సందేహాలు వస్తున్నాయి.‘పాడుతా తీయగా’(Padutha Theeyaga) ప్రోగ్రాం వల్ల తెలుగు చిత్రపరిశ్రమకు చాలామంది సింగర్స్‌ పరిచయం అయ్యారు. ఒకరకంగా ఈ వేదికపై పాటలు పాడిన చాలామంది నేడు రాణిస్తున్నారు. జీవితంలో ఒక్కసారైనా ఈ వేదిక మీద తమ గాత్రాన్ని వినిపించాలని పోటీ పడిన సింగర్స్‌ ఎందరో ఉన్నారు. అయితే, కొద్దిరోజుల క్రితం ‘పాడుతా తీయగా’ జడ్జెస్‌గా ఉన్న సునీత, కీరవాణి, చంద్రబోస్‌లపై గాయని ప్రవస్తి చేసిన ఆరోపణలతో సంచలనంగా మారింది. జడ్జిమెంట్‌ విషయంలో వివక్ష చూపుతున్నారని ప్రవస్తి తెలిపింది. కొందరి కంటెస్టెంట్స్‌ పట్ల జడ్జెస్‌ చాలా బాగుంటారని, వారు తప్పుగా పాడినా ఫైనల్‌ వరకు తీసుకొచ్చారని కొన్ని ఆధారాలతో ప్రవస్తి బయటపెట్టింది. అయితే, సింగర్‌ సునీత, నిర్మాత ప్రవీణ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఇలా పలుమార్లు వివరణలు ఇవ్వడం ఎందుకని సునీత అనుకున్నట్లు ఉన్నారు. అందుకే ఒక సినిమా పాటతో ఆమె ఫుల్‌స్టాప్‌ పెట్టినట్లు ఉన్నారు. జీవితం అంటే ఎలా ఉంటుందో ఈ పాట ద్వారా తెలుసుకోవాలని సునీత చెప్పినట్లు ఉన్నారు. View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha)

Syed Adil Hussain tried to stop terrorist Pahalgam8
పహల్గాం హీరో అతడే.. ఉగ్రవాదులతో పోరాడిన పోనీవాలా

న్యూఢిల్లీ: ఒక జంటది హనీమూన్‌. కొందరిది పెళ్లి రోజు. ఇంకొందరికి ఎన్నో ఏళ్ల కల. పహల్గాం మారణకాండ 26 కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ఒక్కొక్క పర్యాటకున్నీ పేరు, వ్యక్తిగత వివరాలు అడిగి మరీ ముష్కరులు బలి తీసుకున్న తీరు హృదయాలను కలచివేస్తోంది. దాదాపుగా అందరినీ ఆధార్‌ కార్డులు చూపించాలని, ఖురాన్‌ పంక్తులు అప్పజెప్పాలని అడిగి మరీ కాల్చేశారు.మృతుల్లో ఇద్దరు మినహా అంతా హిందువులే. వారిలో మహారాష్ట్రకు చెందిన వారు ఆరుగురు, గుజరాత్, కర్నాటక నుంచి ముగ్గురేసి, పశి్చమబెంగాల్‌ నుంచి ఇద్దరు, ఆంధ్రప్రదేశ్, హరియాణా, ఉత్తరాఖండ్, యూపీ, బిహార్, పంజాబ్, కేరళ, ఒడిశా, మధ్యప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్‌ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. వీరితో పాటు ఒక నేపాలీ పర్యాటకునితో పాటు స్థానికుడు కూడా దాడిలో మరణించారు.హార్స్‌ రైడింగ్‌కని బయటికొచ్చి...ఉగ్ర కాల్పులకు బలైన వారిలో యూపీలోని కాన్పూర్‌కు చెందిన శుభం ద్వివేది అనే 31 ఏళ్ల వ్యాపారవేత్త కూడా ఉన్నాడు. ఆయనకు గత ఫిబ్రవరిలోనే పెళ్లైంది. భార్య, తల్లిదండ్రులు, సోదరి, ఆమె అత్తామామలు, బావమరిది తదితరులతో కలిసి సరదాగా గడిపేందుకు బైసారన్‌ వెళ్లాడు. మంగళవారం కుటుంబీకులంతా హోటల్‌కే పరిమితం కాగా భార్యతో కలిసి శుభం హార్స్‌ రైడింగ్‌కు వెళ్లాడు. ఉగ్రవాదులు అతన్ని కూడా పేరడిగారు. కల్మా చదవమన్నారు. రాదనడంతో నేరుగా తలపై కాల్చి భార్య కళ్లముందే పొట్టన పెట్టుకున్నారు.CM Omar Abdullah, joined by thousands, offered funeral prayers for Syed Adil Hussain—killed in the Pahalgam militant attack that left 26 tourists dead—at his native village on Wednesday.Photos KM / @UmarGanie1 pic.twitter.com/nXCD0vbsnh— The Kashmir Monitor (@Kashmir_Monitor) April 23, 2025👉కేరళలోని ఎడప్పల్లికి చెందిన రామచంద్రన్‌ (65) కూడా కాల్పులకు బలయ్యాడు. పర్యాటకప్రియుడైన ఆయన భార్య, ఇటీవలే దుబాయ్‌ నుంచి వచ్చిన కూతురు, ఆమె పిల్లలతో కలిసి కశ్మీర్‌ వెళ్లాడు. వాళ్ల కళ్లముందే ఉగ్రవాదులు ఆయన్ను కాల్చేశారు. ఆయన్ను కూడా ఖురాన్‌ పంక్తులు చదవాలని అడిగి, తాను ముస్లింను కాదని చెప్పగానే చంపేశారు.👉ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు చెందిన దినేశ్‌ మిరానియా అనే వ్యాపారవేత్త పెళ్లి రోజును సరదాగా జరుపుకునేందుకు కుటుంబీకులతో కలిసి పహల్గాం వచ్చారు. భార్యాపిల్లల కళ్లముందే ఉగ్ర తూటాలకు బలయ్యారు.👉కశ్మీర్‌ వెళ్లాలన్నది ఒడిశాకు చెందిన ప్రశాంత్‌ సత్పతి (41) కల. నెలల తరబడి డబ్బు కూడబెట్టి మరీ బైసారన్‌ వెళ్లాడు. భార్య, 9 ఏళ్ల కొడుకు కళ్లముందే నిస్సహాయంగా మృత్యువాత పడ్డాడు.పోరాడిన పోనీవాలా.. ఉగ్రవాదుల నుంచి పర్యాటకులను కాపాడేందుకు సయ్యద్‌ ఆదిల్‌ హుస్సేన్‌ షా (30) అనే స్థానిక పోనీవాలా వీరోచితంగా ప్రయత్నించాడు. ఉగ్ర వాదుల నుంచి తుపాకులను లాక్కునే ప్రయత్నంలో వారి కాల్పులకు బలయ్యాడు. ఆదిల్‌ గొప్ప ధైర్య సాహసాలు ప్రదర్శించాడంటూ జమ్మూ కశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా ప్రస్తుతించారు. బుధవారం అతని అంత్యక్రియల్లో పాల్గొని నివాళులర్పించారు.

Gold jewellery retailers face sales decline amid rising prices 9
బంగారం డిమాండ్‌కు ‘ధరా’ఘాతం!

ముంబై: బంగారం ధరలు గణనీయంగా పెరిగిపోవడం వినియోగ డిమాండ్‌ను దెబ్బతీయొచ్చని పరిశ్రమ వర్గాలు, రేటింగ్‌ ఏజెన్సీలు భావిస్తున్నాయి. అయినప్పటికీ ఈ నెల 30న అక్షయ తృతీయ, తదుపరి మే చివరి వరకు వివాహాల సీజన్‌ నేపథ్యంలో కొనుగోళ్ల సెంటిమెంట్‌ సానుకూలంగా ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ నెల 22న బంగారం 10 గ్రాములకు ఢిల్లీలో రూ.1,01,350కు పెరిగిపోవడం తెలిసిందే. ‘‘బంగారం ధరలు అనూహ్యంగా పెరగడం అన్నది డిమాండ్‌పై కచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. ఈ షాక్‌ నుంచి తేరుకున్న తర్వాత డిమాండ్‌ స్థిరపడుతుంది. మొత్తం మీద అయితే మార్కెట్లో సానుకూల సెంటిమెంట్‌ ఉంది. అక్షయ తృతీయ, వివాహాల సీజన్‌ నేపథ్యంలో వినియోగదారుల నుంచి మంచి డిమాండ్‌ ఉంటుందని అంచనా వేస్తున్నాం’’ అని ఆల్‌ ఇండియా జెమ్స్‌ అండ్‌ జ్యుయలరీ డొమెస్టిక్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ రాజేష్‌ రోక్డే తెలిపారు.2023లో 741 టన్నుల బంగారం దిగుమతి కాగా, ధరలు 20% మేర పెరిగినప్పటికీ 2024లో 802 టన్నులు దిగుమతి కావడాన్ని ఆయన ప్రస్తావించారు. బంగారం ధర రూ.లక్షకు చేరడం కచ్చితంగా డిమాండ్‌పై 10–15% ప్రభావం ఉండొచ్చని ఆల్‌ ఇండియా జెమ్స్‌ అండ్‌ జ్యుయలరీ డొమెస్టిక్‌ కౌన్సిల్‌ వైస్‌ చైర్మన్‌ అవినాష్‌ గుప్తా చెప్పారు. ఒత్తిడి ఉన్నప్పటికీ.. ‘‘మార్కెట్లో ఆశావహ వాతావరణం కనిపిస్తోంది. బంగారం ధరలు భవిష్యత్తులో ఇంకా పెరుగుతాయన్న అంచనాలు నెలకొన్నాయి. కొంతకాలంగా ధరలు పెరుగుదలతో అమ్మకాల పరిమాణంపై ఒత్తిడి నెలకొంది. అయినప్పటికీ వినియోగదారుల్లో ఉన్న సానుకూల సెంటిమెంట్‌ పరిశ్రమకు అనుకూలిస్తుంది’’ అని పీఎన్‌ గాడ్గిల్‌ జ్యుయలర్స్‌ చైర్మన్‌ సౌరభ్‌ గాడ్గిల్‌ తెలిపారు.విక్రయాలు 9–11 శాతం తగ్గొచ్చు.. బంగారం ధరలు ఆల్‌టైమ్‌ గరిష్టాలకు చేరినందున ఈ ఏడాది (2025–26) సంస్థాగత రిటైల్‌ జ్యుయలర్ల అమ్మకాలు (పరిమాణం పరంగా) 9–11% వరకు తగ్గొచ్చని క్రిసిల్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. అధిక ధరల కారణంగా వినియోగదారులు తక్కువ పరిమాణంలో కొనుగోళ్లకు మొగ్గు చూపించొచ్చని పేర్కొంది. కొనుగోలు వ్యయం అంతే ఉండి, క్యారట్, గ్రాముల రూపంలో తగ్గొచ్చని వివరించింది. అయినప్పటికీ అమ్మకాల ఆదాయం క్రితం ఆర్థిక సంవత్సరం కంటే 13–15% పెరగొచ్చని తాజా నివేదికలో తెలిపింది.రూ.లక్ష దిగువకు పసిడిబంగారం ధర రూ.లక్షను దాటిన ఒక్కరోజులోనే అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నది. బుధవారం ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాములకు (99.9 శాతం స్వచ్ఛత) రూ.2,400 నష్టపోయింది. రూ.99,200 వద్ద స్థిరపడింది. 99.5% స్వచ్ఛత బంగారం రూ.3,400 నష్టపోయి రూ.98,700కు దిగొచ్చింది. చైనాపై విధించిన టారిఫ్‌లు చాలా ఎక్కువగా ఉన్నాయని, వాటిని త్వరలోనే తగ్గించనున్నట్టు ట్రంప్‌ ప్రకటించడం అమ్మకాలకు దారితీసింది.

Rasi Phalalu: Daily Horoscope On 24-04-2025 In Telugu10
ఈ రాశి వారికి ఆస్తిలాభం.. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలం

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: బ.ఏకాదశి ప.10.14 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం: శతభిషం ఉ.6.52 వరకు, తదుపరి పూర్వాభాద్ర తె.5.45 వరకు (తెల్లవారితే శుక్రవారం), వర్జ్యం: ప.12.58, నుండి 2.30 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.55 నుండి 10.45 వరకు, తదుపరి ప.2.53 నుండి 3.43 వరకు, అమృతఘడియలు: రా.10.04 నుండి 11.36 వరకు; రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు, యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు, సూర్యోదయం: 5.42, సూర్యాస్తమయం: 6.13. మేషం.. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.వృషభం.... పనుల్లో ప్రతిబంధకాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.మిథునం... రుణయత్నాలు. ఆలోచనలు కలసిరావు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. ధనవ్యయం. వ్యాపారాలలో గందరగోళం. ఉద్యోగులకు పనిభారం.కర్కాటకం... దూరపు బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.సింహం.... కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.కన్య.... శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. బంధువులతో తగాదాలు. ఆస్తి వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు.తుల.... ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. శ్రమ తప్పదు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.వృశ్చికం... శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. అంచనాలు నిజమవుతాయి. ఆస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలం.ధనుస్సు... వ్యవహారాలలో ఆటంకాలు. అనుకోని ఖర్చులు. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.మకరం... సోదరులు, సోదరులతో సఖ్యత. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ. ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.కుంభం.... కుటుంబంలో చికాకులు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ప్రయాణాలలో మార్పులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.మీనం... నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement