Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

India And Pakistan Related Live Updates1
Ind Vs Pak: ఉదయం 11 గంటలకు రక్షణ శాఖ ప్రెస్‌మీట్‌

War Related Updates..అమృత్‌సర్‌లో రెడ్‌ అలర్ట్‌ ఎత్తివేత.తాజా పరిణామాలపై ఉదయం 11 గంటలకు రక్షణ శాఖ మీడియా సమావేశంకాల్పుల విరమణ ఒప్పందం తర్వాత పరిస్థితులపై వివరణ ఢిల్లీ..భారత్, పాక్ సరిహద్దులలో సాధారణ పరిస్థితిఆగిపోయిన కాల్పులు, కనిపించని డ్రోన్లుకాల్పుల విరమణ అవగాహన అతిక్రమిస్తే పాక్‌దే బాధ్యత అని రాత్రే స్పష్టం చేసిన భారత్#WATCH | Rajasthan | Situation seems normal this morning in Barmer. No drones, firing, or shelling were reported overnight. pic.twitter.com/lJOcUvMwY4— ANI (@ANI) May 11, 2025#WATCH | J&K | Visuals this morning in Kupwara. After days of heavy shelling by Pakistan, situation seems normal today. No drones, firing or shelling was reported overnight. pic.twitter.com/3S2s8WFiVQ— ANI (@ANI) May 11, 2025#WATCH | J&K | Situation seems normal this morning in Samba. No drones, firing, or shelling were reported overnight. pic.twitter.com/QPOnrefFHw— ANI (@ANI) May 11, 2025అమృత్‌సర్‌లో రెడ్‌ అలర్ట్‌అమృత్‌సర్‌లో ఇంకా మోగుతున్న సైరన్లు.ప్రజలు ఎవరూ బయటకు రావద్దని డిప్యూటీ కమిషనర్‌ సూచన.ఇళల్లోనే ఉండాలని ఆదేశాలు జారీ.నగరంలో విద్యుత్‌ సరఫరా పునరుద్దణ. 👉కాల్పుల విరమణకు అంగీకరించిన పాక్‌ మరోసారి తన వక్ర బుద్ధిని చాటుకుంది. విరమణ అంగీకరించిన కొన్ని గంటల్లోనే పాక్‌ మళ్లీ దాడులకు తెగబడింది. శనివారం రాత్రి జమ్ము కశ్మీర్‌తోపాటు ఇతర సరిహద్దు రాష్ట్రాల్లో పాక్‌ డ్రోన్‌ దాడులకు తెగబడుతున్నట్లు సమాచారం.బ్లాకౌట్‌ ఎత్తివేత.. మళ్లీ విధింపు 👉కాల్పుల విరమణ ప్రకటన రాగానే పంజాబ్‌లో బ్లాకౌట్‌ను అధికారులు ఎత్తేశారు. ఒప్పందాన్ని పాక్‌ ఉల్లంఘించినట్లు వార్తలు రాగానే దానిని తిరిగి విధించారు. గుజరాత్, కశ్మీర్, రాజస్థాన్‌లలో బ్లాకౌట్‌ను కొనసాగిస్తున్నారు. గుజరాత్‌లోని కచ్‌లోనూ డ్రోన్లు కనిపించాయి. కశ్మీర్‌లోని నగ్రోటా వద్ద చొరబాట్లకు జరిగిన యత్నాన్ని కాల్పులతో సైన్యం వమ్ము చేసింది. #WATCH | J&K: Red streaks seen and explosions heard as India's air defence intercepts Pakistani drones amid blackout in Srinagar(Visuals deferred by unspecified time) pic.twitter.com/XObqcbiQCe— ANI (@ANI) May 10, 2025👉కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి అంతర్జాతీయ సరిహద్దుతోపాటు నియంత్రణ రేఖ వెంబడి శనివారం రాత్రి అనేక ప్రాంతాల్లో పాక్‌ దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. జమ్మూ కశ్మీర్‌లోని ఉధంపుర్‌, శ్రీనగర్‌లలో భారీ శబ్దాలు వినిపిస్తున్నాయి. ఈ పాక్‌ డ్రోన్లను గగనతల రక్షణ వ్యవస్థలు ఎప్పటికప్పుడు ధ్వంసం చేస్తున్నట్లు తెలుస్తోంది. పోఖ్రాన్‌లో, శ్రీనగర్‌లోని ఆర్మీ హెడ్‌ క్వార్టర్స్ సమీపంలో పలు డ్రోన్లను కూల్చివేసినట్లు సమాచారం.#WATCH | Punjab: A complete blackout has been enforced in Pathankot(Visuals deferred by an unspecified time) pic.twitter.com/z8ovHXi0sT— ANI (@ANI) May 10, 2025👉మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌, ఫిరోజ్‌పుర్‌, రాజస్థాన్‌లోని జైసల్మేర్‌, బాడ్‌మేర్‌లలో పూర్తిగా కరెంటు నిలిపివేశారు. కఠువాలో బ్లాక్‌అవుట్‌ పాటిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సైరన్లు మోగుతున్నాయి. పంజాబ్‌లోని మోగాలోనూ కరెంటు నిలిపివేశారు.గుజరాత్‌లోనూ డ్రోన్‌ దాడులు?👉గుజరాత్‌లోనూ డ్రోన్‌ దాడులకు తెగబడినట్లు తెలుస్తోంది. కచ్‌ జిల్లాలో అనేక చోట్ల డ్రోన్లు కనిపించాయని గుజరాత్‌ హోంమంత్రి హర్ష్‌ సంఘవి వెల్లడించారు. ప్రస్తుతం పూర్తి బ్లాక్‌అవుట్‌ అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రజలు సురక్షితంగా ఉండాలని, భయాందోళనలకు గురికావద్దని ‘ఎక్స్‌’ వేదికగా సూచించారు.#WATCH | Haryana: A complete blackout has been enforced in Ambala(Visuals deferred by an unspecified time) pic.twitter.com/nyGQK8Jet2— ANI (@ANI) May 10, 2025👉శ్రీనగర్‌లో భారీ శబ్దాలు వినిపిస్తున్నాయని జమ్ము కశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాల్పుల విరమణ సంగతేంటని ఆయన ‘ఎక్స్’ వేదికగా ప్రశ్నించారు. #WATCH | Gujarat | A complete blackout has been enforced in Bhuj in Kachchh(Visuals deferred by an unspecified time) pic.twitter.com/vBnYnoIkfm— ANI (@ANI) May 10, 2025

Ys Jagan Tweet On Mothers Day2
Mother's Day: మీ ప్రేమ, బలం, త్యాగం అపరిమితమైనవి: వైఎస్‌ జగన్‌

సాక్షి, తాడేపల్లి: మాతృ దినోత్సవం సందర్భంగా తల్లులందరికీ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మీ ప్రేమ, బలం, త్యాగం అపరిమితమైనవి. ఎప్పటికీ మిమ్మల్ని గౌరవిస్తూనే ఉంటాం. మాతృ దినోత్సవం శుభాకాంక్షలు.. అమ్మ’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్‌ చేశారు.Happy Mother’s Day to all the incredible mothers. Your love, strength, and sacrifice are immeasurable. Today, we honor you for all that you do.Happy Mother’s Day Amma!#MothersDay— YS Jagan Mohan Reddy (@ysjagan) May 11, 2025

Pakistan PM Shehbaz Sharif declares victory3
భారత్‌పై పాక్‌ ప్రధాని ఓవరాక్షన్‌ కామెంట్స్‌.. నెటిజన్లు ఫైర్‌

ఇస్లామాబాద్‌: సరిహద్దుల్లో మూడు రోజులుగా జరుగుతున్న భీకర పోరులో అమెరికా మధ్యవర్తిత్వంతో భారత్, పాకిస్తాన్‌ మధ్య శనివారం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన కొద్ది గంటల్లోనే పాకిస్తాన్‌ తన వక్రబుద్ధిని చాటుకుంటూ రెచ్చగొట్టే విధంగా సరిహద్దులో కాల్పులు జరిపింది. అంతటితో ఆగకుండా.. పాక్‌ ప్రధాని విచిత్రంగా తమదే గెలుపు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అనంతరం శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత షెహబాజ్ షరీఫ్ పాకిక్‌ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్బంగా షరీఫ్‌ మాట్లాడుతూ.. భారత్‌తో యుద్ధంలో తాము విజయం సాధించినట్టు పేర్కొన్నారు. తమ దేశాన్ని, తమ పౌరులను రక్షించుకోవడానికి తాము ఏది చేయడాకైనా వెనుదిరిగేది లేదన్నారు. పాక్‌ను ఎవరైనా సవాల్ చేస్తే వారిని విడిచి పెట్టే ప్రసక్తే లేదని వెల్లడించారు. భారత్ తమ దేశంలోని మసీదులు, సామాన్య పౌరులపై డ్రోన్స్, మిస్సైల్స్ తో దాడులు చేసిందని.. అనేకమంది సాధారణ పౌరుల చావుకు భారత్ కారణమైందని మండిపడ్డారు. తమదేశంపై నిరాధార ఆరోపణలు కూడా చేస్తుందని.. భారత్‌కు తగిన బుద్ధి చెప్పామని.. తమ జోలికి వస్తే ఏదైనా చేయగలమని చూపించామంటూ ఓవరాక్షన్‌ కామెంట్స్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.JUST IN: 🇵🇰🇮🇳 Pakistani PM Shehbaz Sharif declares victory over India.pic.twitter.com/go5V3JsGN8— Whale Insider (@WhaleInsider) May 10, 2025 12 Pakistan air bases destroyed, many of their jets shot down by the Indian Army… hundreds of terrorists killed deep inside Pakistan territory.Yet this man, with zero iota of shame, Shehbaz Sharif, says we have won against India. 🤡🤡 pic.twitter.com/qoI7u7NKYY— BALA (@erbmjha) May 10, 2025 ఇక, ఈ వీడియోపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. పాక్‌ ప్రధాని తీరును ఎండగడుతున్నారు. అమెరికా మధ్యలోకి రాకపోతే పాకిస్తాన్‌ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. భారత్‌ దాడులను తట్టుకోలేక తోక ముడిచి.. ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్‌కు ఇంత నష్టం జరిగినా మీది ఎలా గెలుపు అవుతుందని ప్రశ్నిస్తున్నారు. 🇵🇰Pakistan Prime Minister Shehbaz Sharif tweets, praises trump & declares victory over India: “We have won, this is victory.”Also, Pakistani people are celebrating victory all over the country.THIS IS SHAMELESS 🤮🤮 pic.twitter.com/1N9YhfGrya— Vaishnavi (@vaishu_z) May 10, 2025 Shehbaz Sharif won the war in twitter 😂 pic.twitter.com/TTGaMKN86t— Mr. Nice Guy (@Mr__Nice__Guyy) May 10, 2025 ఇదిలా ఉండగా.. ఒకవైపు ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే, మరోవైపు కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంలో కీలక పాత్ర పోషించినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా, సౌదీ అరేబియా తదితర దేశాలకు పాక్ ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడాన్ని యునైటెడ్ కింగ్‌డమ్, సౌదీ అరేబియా స్వాగతించాయి. ఉద్రిక్తతల నివారణకు ఇది కీలకమైన ముందడుగు అని యూరోపియన్ యూనియన్ పేర్కొంది. ఈ ఒప్పందానికి కట్టుబడి ఉండేలా అన్ని ప్రయత్నాలు జరగాలని ఆకాంక్షించింది. Shehbaz Sharif knows the nation is uneducated and will believe whatever they're told, so he quickly declared victory. He's totally an army puppet. It's honestly laughable to watch him.🤣🤣🤣 #ceasefire #PakistanIndianWar pic.twitter.com/dDUr5ONLhI— Sandeep Pathak⛳ (@iPandit_Pathak) May 10, 2025Pakistan PM Shahbaz Sharif, "we won the war against India. Our attack destroyed the enemy's Air Bases".- Welcome to comedy nights hosted by a country's PM in front of the media. pic.twitter.com/gbcaKX64En— Mufaddal Vohra (@mufaddal_vohra) May 10, 2025

Governing Council is considering ending IPL matches4
IPL 2025: బీసీసీఐ కొత్త ప్రణాళికలు .. ‘మే’లోనే ముగించాలని..

న్యూఢిల్లీ: ఐపీఎల్‌కు వారం రోజుల పాటు విరామం ఇచ్చిన బీసీసీఐ భారత్, పాక్‌ యుద్ధానికి సంబంధించి తాజా పరిణామాల తర్వాత మళ్లీ కొత్త ప్రణాళికలతో సిద్ధమవుతున్నట్లు సమాచారం. కాల్పుల విరమణ నేపథ్యంలో పరిస్థితులు మెరుగవుతాయి కాబట్టి వీలైనంత తొందరగా మిగిలిన ఐపీఎల్‌ మ్యాచ్‌లను ముగించాలని గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఆలోచనతో ఉంది. ఈ వారాంతంలో టోర్నీ మళ్లీ మొదలు కావచ్చని వినిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే మే 15 నుంచే మ్యాచ్‌లు జరగవచ్చు. అసలు షెడ్యూల్‌ ప్రకారం మే 25లోపే లీగ్‌ను ముగించాలని బోర్డు పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌ కొనసాగింపుపై నేడు ప్రత్యేక సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా వెల్లడించారు. మూడు వేదికల్లో మ్యాచ్‌లు... ఐపీఎల్‌–2025 లీగ్‌ దశలో మొత్తం 57 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. పంజాబ్, ఢిల్లీ మధ్య జరుగుతున్న 58వ మ్యాచ్‌ను అర్ధాంతరంగా నిలిపివేయాల్సి వచ్చింది. దీనిని ‘రద్దు’గా పరిగణించి ఇరు జట్లకు చెరో పాయింట్‌ కేటాయించాలా లేక మళ్లీ నిర్వహించాలా అనే అంశంపై ఇంకా గవర్నింగ్‌ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకోలేదు. లీగ్‌ దశలో మరో 12 మ్యాచ్‌లతో పాటు 4 ప్లే ఆఫ్స్‌ కలిపి మొత్తం 16 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. ముందుగా ఊహించినట్లుగానే దక్షిణాదిలో ఉన్న వేదికలను ఎంచుకొని మ్యాచ్‌లు జరపాలని బీసీసీఐ ప్రాధమికంగా నిర్ణయించినట్లు సమాచారం. ఇందు కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలను ఎంపిక చేశారు. అసలు షెడ్యూల్‌ ప్రకారం హైదరాబాద్‌ ఎలాగూ రెండు ప్లే ఆఫ్స్‌కు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. ఆటగాళ్లు వెనక్కి వస్తారా... ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు, నిర్వాహకులకు మిగిలిన మ్యాచ్‌ల కోసం విదేశీ ఆటగాళ్లను వెనక్కి రప్పించడమే ఇప్పుడు పెద్ద సమస్య. ఐపీఎల్‌ వాయిదా గురించి తెలిసిన వెంటనే శుక్ర, శనివారాల్లో పలువురు విదేశీ క్రికెటర్లు, సహాయక సిబ్బంది తమ స్వస్థలాలను బయల్దేరి వెళ్లిపోయారు. వీరందరికీ ఐపీఎల్‌ ఇప్పట్లో మళ్లీ జరగదని, ఏడాది చివర్లో మళ్లీ నిర్వహించవచ్చనే సమాచారమే ఉంది. దాంతో వారంతా వెనక్కి వెళ్లిపోయారు. ఇప్పటికే ఫ్రాంచైజీలు తమ జట్లకు చెందిన ఆటగాళ్లకు, ఇతర సిబ్బందికి తాజా సమాచారాన్ని అందించాయని, మళ్లీ వెంటనే వెనక్కి వచ్చే ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా కూడా చెప్పినట్లు సమాచారం. కొందరు ఆదివారం బయల్దేరేందుకు సిద్ధమవుతుండగా వారిని ఆగిపోవాలని ఒక ఫ్రాంచైజీ చెప్పగా... మరికొందరు సగం దూరం ప్రయాణించగా, ఎక్కడ ఉన్నారో అక్కడినుంచే వెనక్కి రావాలని కూడా కోరినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వెళ్లిపోయిన బట్లర్, కొయెట్జీలను వెనక్కి రమ్మని గుజరాత్‌ టైటాన్స్‌ కోరింది. అయితే అందరు విదేశీ ఆటగాళ్లు దాదాపు ఒకే మాట మీద ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మే 25 తర్వాత లీగ్‌ కొనసాగితే తాము ఉండలేమని తేల్చేశారు. జూన్‌ 11 నుంచి ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఉండటంతో ఈ రెండు టీమ్‌ల ప్లేయర్లు మాత్రం అందుబాటులో ఉండే అవకాశాలు పూర్తిగా లేనట్లే.

Pakistan has repeatedly violated the ceasefire understanding5
విరమణ.. ఉల్లంఘన

న్యూఢిల్లీ/వాషింగ్టన్‌/ఇస్లామాబాద్‌ కయ్యానికి కాలుదువ్విన దాయాదికి నాలుగు రోజుల్లోనే తత్వం బోధపడింది. సాయుధ ఘర్షణకు తెర దించుదామంటూ భారత్‌తో కాళ్లబేరానికి వచ్చింది. దాంతో ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. రెండు ప్రభుత్వాలూ దాన్ని ధ్రువీకరించాయి. తమ మధ్యవర్తిత్వమే ఇందుకు కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించగా భారత్‌ దాన్ని తోసిపుచ్చింది. పాక్‌ విజ్ఞప్తి మేరకే ద్వైపాక్షిక చర్చల ద్వారా ఒప్పందం కుదుర్చుకున్నట్టు ప్రకటించింది. ‘‘శనివారం సాయంత్రం ఐదు గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. భూ, గగన, సముద్ర తలాల్లో పూర్తిస్థాయిలో కొనసాగుతుంది’’ అని విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రీ మీడియాకు వెల్లడించారు. కానీ కాసేపటికే పాక్‌ వంకర బుద్ధి ప్రదర్శించింది. శనివారం రాత్రి ఏడింటి నుంచీ మరోసారి దాడులకు దిగింది. సరిహద్దుల గుండా మళ్లీ డ్రోన్‌ ప్రయోగాలకు, కాల్పులకు తెగబడింది. కోరి కుదుర్చుకున్న విరమణ ఒప్పందానికి గంటల వ్యవధిలోనే తూట్లు పొడిచి తాను ధూర్తదేశాన్నేనని మరోసారి నిరూపించుకుంది. ఈ పరిణామంపై భారత్‌ మండిపడింది. రాత్రి 11 గంటలకు మిస్రీ మరోసారి మీడియా ముందుకొచ్చారు. ఓవైపు విరమణ అంటూనే మరోవైపు సరిహద్దుల వెంబడి పాక్‌ తిరిగి దాడులు, కాల్పులకు దిగిందంటూ ధ్వజమెత్తారు. ఒప్పందం కుదిరిందన్న ట్రంప్‌పాక్‌ దొంగ నాటకాల నడుమ శనివారం రోజంతా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి దాటేదాకా పాక్‌ సైన్యం క్షిపణి, డ్రోన్‌ దాడులు, సరిహద్దుల వెంబడి కాల్పులు కొనసాగించింది. వాటికి దీటుగా బదులిచ్చిన భారత్‌ శనివారం తెల్లవారుజాము నుంచీ తీవ్రస్థాయిలో ప్రతి దాడులకు దిగింది. ఆరు పాక్‌ వైమానిక, రెండు రాడార్‌ కేంద్రాలను నేలమట్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇరుదేశాల నడుమ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అనూహ్య ప్రకటన చేశారు. సొంత సోషల్‌ మీడియా హ్యాండిల్‌ ట్రూత్‌ సోషల్‌లో సాయంత్రం ఐదింటి ప్రాంతంలో ఈ మేరకు పోస్ట్‌ చేశారు. ‘‘అమెరికా మధ్యవర్తిత్వంలో రాత్రంతా జరిగిన చర్చోపచర్చల అనంతరం ఎట్టకేలకు ఇరు దేశాలూ తక్షణం పూర్తిస్థాయి కాల్పుల విరమణకు అంగీకరించాయి’’ అని పేర్కొన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా అవే వ్యాఖ్యలు చేశారు. ప్రధానులు నరేంద్ర మోదీ, షహబాజ్‌ షరీఫ్‌లకు అభినందనలు తెలిపారు. ట్రంప్‌ బృందం ఈ దిశగా అద్భుతంగా పని చేసిందని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ చెప్పుకొచ్చారు. సాయంత్రం ఆరింటికి విదేశాంగ కార్యదర్శి మిస్రీ మీడియా ముందుకొచ్చారు. ‘‘పాక్‌ విజ్ఞప్తి మేరకే విరమణకు ఒప్పుకున్నాం. శనివారం మధ్యాహ్నం 3.35 గంటలకు పాక్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మిలిటరీ ఆపరేషన్స్‌ భారత డీజీఎంఓకు ఫోన్‌ చేశారు. వారి నడుమ చర్చల ఫలితంగా ఈ మేరకు ఒప్పందం కుదిరింది’’ అని స్పష్టం చేశారు. దీనిపై డీజీఎంఓల నడుమ సోమవారం పూర్తిస్థాయి చర్చలు జరుగుతాయని వెల్లడించారు. ‘‘శాంతి సాధనకు ఇది నూతన ప్రారంభం. కాల్పుల విరమణకు చొరవ చూపినందుకు ట్రంప్, వాన్స్, రూబియోలకు కృతజ్ఞతలు’’ అంటూ పాక్‌ ప్రధాని షహబాజ్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్, పాక్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్, పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టి(పీపీపీ) అధినేత బిలావల్‌ భుట్టో, ప్రజాప్రతినిధులు తదితరులు ఒప్పందాన్ని స్వాగతించారు. అనంతరం తన గగనతలాన్ని తెరుస్తున్నట్టు పాక్‌ ప్రకటించింది. బయటపడ్డ పాక్‌ నైజం కొద్ది గంటలైనా గడవకుండానే పాక్‌ తన బుద్ధి బయటపెట్టుకుంది. విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ శనివారం రాత్రి ఏడింటి నుంచే మరోసారి సరిహద్దుల వెంబడి దాడులకు దిగింది. జమ్మూ కశ్మీర్‌ మొదలుకుని గుజరాత్‌ దాకా పలుచోట్ల డ్రోన్‌ దాడులు జరిగాయి. శ్రీనగర్‌లో భారీ పేలుడు శబ్దాలు విని్పంచాయి. బారాముల్లా తదితర చోట్ల సైనిక స్థావరాల సమీపంలో డ్రోన్లు ఎగురుతూ కని్పంచాయి. దీనిపై జమ్మూ కశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు. ‘‘శ్రీనగర్‌ అంతటా పేలుళ్ల శబ్దాలే. ఏమిటిది? విరమణకు అప్పుడే తూట్లా?’’ అంటూ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. మరోవైపు నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు మొదలయ్యాయి. పాక్‌ దాడులకు మన సైన్యం దీటుగా బదులిచ్చింది. జమ్మూ, శ్రీనగర్, గుజరాత్‌లోని భుజ్‌ తదితర చోట్ల పాక్‌ డ్రోన్లను బలగాలు కూల్చేశాయి. కచ్‌ తదితర చోట్ల కూడా డ్రోన్లు కని్పంచినట్టు రాష్ట్ర మంత్రి హర్‌‡్ష సంఘవి ధ్రువీకరించారు. ముందుజాగ్రత్తగా సరిహద్దు రాష్ట్రాల్లో పలుచోట్ల కరెంటు సరఫరా నిలిపేసి బ్లాకౌట్‌ పాటించారు. అయితే శనివారం అర్ధరాత్రికల్లా పాక్‌ వెనక్కు తగ్గిందని, నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు దాదాపుగా ఆగిపోయాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.కాల్పుల విరమణ ఒప్పందాన్ని గంటల్లోనే పాక్‌ ఉల్లంఘించింది. ఇది అత్యంత దుర్మార్గం. ఇందుకు పూర్తి బాధ్యత ఆ దేశానిదే. దీన్ని అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నాం. మతిలేని చర్యలను ఇకనైనా కట్టిపెట్టి కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్‌ పూర్తిస్థాయిలో కట్టుబడాలి. లేదంటే తీవ్రస్థాయిలో ప్రతిక్రియ తప్పదు. దాడులను దీటుగా తిప్పికొట్టాల్సిందిగా సైన్యానికి పూర్తిస్థాయి ఆదేశాలిచ్చాం. – విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రీ

Weekly Horoscope In Telugu From 11-05-2025 To 17-05-20256
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం...పనులలో ప్రతిష్ఠంభన తొలగుతుంది. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. సమాజసేవలో భాగస్వాములవుతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు కొంతమేర తీరతాయి. నిరుద్యోగుల ఎదురుచూపులు ఫలిస్తాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగి ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగాలలో ఆశించిన ఆదాయం సమకూర్చుకుంటారు. రాజకీయవేత్తలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆరోగ్య సమస్యలు. ఎరుపు, గులాబీ రంగులు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.వృషభం...చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి అవసరాలు తీరతాయి. ఆప్తుల సహాయసహకారాలు తీసుకుంటారు. మీ ఖ్యాతి మరింత పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తొలగి ఊరట చెందుతారు. కొన్ని ఆహ్వానాలు సంతోషం కలిగిస్తాయి. స్థిరాస్తులు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వివాహ, ఉద్యోగయత్నాలలో కొంత పురోగతి సాధిస్తారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుని మిత్రులను ఆశ్చర్యపరుస్తారు. పారిశ్రామికవర్గాలకు భాగస్వాముల నుంచి సమస్యలు తీరతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. తెలుపు, ఆకుపచ్చ రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.మిథునం...ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. కోర్టు వివాదాల నుంచి కొంత బయటపడతారు. పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు,భూములు కొనుగోలు చేస్తారు. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాల విస్తరణ కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో ఏ మాత్రం అలసత్వం చూపక బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. పారిశ్రామికవర్గాలకు ముఖ్య సమాచారం అందుతుంది. వారం చివరిలో స్వల్ప అనారోగ్యం. బంధువులతో విభేదాలు. గులాబీ, తెలుపు రంగులు. పంచముఖ ఆంజనేయ స్తోత్రాలు పఠించండి.కర్కాటకం...అనుకున్న పనులు తక్షణం పూర్తి చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు పరిష్కారమవుతాయి. ఆలోచనలు కలసివచ్చి ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఆర్థిక వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. కొన్ని సమస్యల పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలం. వ్యాపారాలు మరింత సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు కొంత మేరకు తగ్గవచ్చు. రాజకీయవర్గాలకు ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. బంధువులతో విభేదాలు. ఎరుపు, నేరేడు రంగులు. లక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి.సింహం....ఏ పని ప్రారంభించినా వెనుకడుగు వేయకుండా పూర్తి చేస్తారు. ఆత్మవిశ్వాసం, నమ్మకమే మీ ఆయుధాలుగా నిలుస్తాయి. పరిచయాలు మరింత పెరుగుతాయి. గతంలో చేజారిన కొన్ని డాక్యుమెంట్లు అనుకోని విధంగా లభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు గతం కంటే మరింత ఆశాజనకంగా ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో ఆందోళన తొలగి ఉత్సాహంగా ముందుకు సాగుతారు. పారిశ్రామికవర్గాలకు లక్ష్యాలు నెరవేరతాయి. వారం మధ్యలో ధనవ్యయం. బంధువులతో తగాదాలు. నీలం, నేరేడు రంగులు. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.కన్య...కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. కొత్త వ్యక్తుల పరిచయం. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు సర్దుకుని సఖ్యత నెలకొంటుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి.స్థిరాస్తి వివాదాల నుంచి కొంత గట్టెక్కుతారు. వ్యాపారాలు లాభిస్తాయి. అనుకున్న పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు, సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. వ్యాపారాలు విస్తరించే దిశగా అడుగులు వేస్తారు. ఉద్యోగాలలో ప్రశాంతత చేకూరుతుంది. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. పసుపు, నేరేడు రంగులు. కాలభైరవాష్టకం పఠించండి.తుల....పనుల్లో అవాంతరాలు అధిగమించి పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. ఆస్తుల వ్యవహారాలలో సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడి ఊరట చెందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు క్రమేపీ లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో ఎటువంటి బాధ్యతనైనా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కళారంగం వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ధనవ్యయం. పసుపు, ఆకుపచ్చ రంగులు. దేవీస్తోత్రాలు పఠించండి.వృశ్చికం...నూతనోత్సాహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. అందరిలోనూ గౌరవమర్యాదలు పొందుతారు. ప్రత్యర్థులను అనుకూలురుగా మార్చుకుంటారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. ఒక సంఘటనకు ఆకర్షితులవుతారు. కొన్ని వివాదాలు సోదరుల సహాయంతో పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు గతం కంటే కొంత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకున్న పోస్టులు దక్కవచ్చు. రాజకీయవర్గాలకు ఆశాజనకంగా ఉంటుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. స్వల్ప అనారోగ్యం. నీలం, నేరేడు రంగులు.హయగ్రీవస్తోత్రాలు పఠించండి.ధనుస్సు...అనుకున్న పనులు కొంత నిదానంగా సాగినా ఎట్టకేలకు పూర్తి కాగలవు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మిత్రుల నుంచి శుభవర్తమానాలు అందుకుంటారు. స్థిరాస్తి విషయంలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు క్రమేపీ అనుకూలిస్తాయి. ఆర్థిక లావాదేవీలు పుంజుకుంటాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేసే వీలుంది. విద్యార్థులకు కొంత అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. వ్యాపారాలు ఆశించిరీతిలో కొనసాగి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో పరిస్థితులు చక్కబడతాయి. కళారంగం వారికి మరింత ఉత్సాహవంతంగా గడిచిపోతుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం.ఆరోగ్యం మందగిస్తుంది. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.మకరం...ఆర్థికంగా కొంత ఇబ్బంది పడతారు. అయితే ఏదోవిధంగా కొంత సొమ్ము అంది అవసరాలు తీరతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులు ఉద్యోగయత్నాలు ముమ్మరం చేస్తారు. ముఖ్యమైన పనుల్లో ప్రతిబంధకాలు తొలగి ముందడుగు వేస్తారు. స్థిరాస్తి కొనుగోలులో ఆటంకాలు అధిగమిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. బంధువులు, మిత్రులతో స్వల్ప విభేదాలు నెలకొంటాయి. నిర్ణయాలు సైతం మార్చుకుంటారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. రాజకీయవర్గాలకు కొంత నిరాశాజనకంగా ఉంటుంది. వారం చివరిలో శుభవార్తలు. ఆహ్వానాలు అందుతాయి. ఆకుపచ్చ, నీలం రంగులు. కనకధారాస్తోత్రాలు పఠించండి.కుంభం...కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. బంధువుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు మరింత ముమ్మరం చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. సంఘ సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలలో ముందడుగు వేస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగి పెట్టుబడులు సైతం అందుకుంటారు. ఉద్యోగాలలో క్లిష్టసమస్యలు తీరి ఊరట లభిస్తుంది. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా గడుస్తుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. ఆకుపచ్చ, పసుపు రంగులు. శివాష్టకం పఠించండి.మీనం...కొన్ని సమస్యలు ఎట్టకేలకు పరిష్కారమవుతాయి. అనుకున్న పనులు కొంత నిదానించినా పూర్తి చేస్తారు. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి రుణాలు తీరుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. స్వల్ప అనారోగ్యం. చివరి నిమిషంలో కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలబాటలో పయనిస్తారు. ఉద్యోగాలలో మీరు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో కుటుంబసభ్యులతో విభేదాలు. ధనవ్యయం. గులాబీ, నేరేడు రంగులు. గణేశాష్టకం పఠించండి.

Small Medium companies out performance than large companies7
ఐటీలో ‘చిన్న’ హిట్టు.. ‘పెద్ద’ యావరేజు..

గత ఆర్థిక సంవత్సరంలో ఐటీ, ఎఫ్‌ఎంసీజీ రంగాల్లోని పలు స్మాల్, మిడ్‌ క్యాప్‌ కంపెనీలు గణనీయంగా రాణించాయి. పెద్ద సంస్థలను మించిన పనితీరును కనపర్చాయి. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ సర్వీసుల సంస్థలు అటు క్యూ4లోను ఇటు పూర్తి ఆర్థిక సంవత్సరంలోనూ అదరగొట్టాయి. కోఫోర్జ్, పర్సిస్టెంట్‌ సిస్టమ్స్, హెక్సావేర్‌ టెక్నాలజీస్, ఎంఫసిస్‌ వంటి సంస్థలు 2025 ఆర్థిక సంవత్సరంలో 7 శాతం నుంచి 32 శాతం వరకు ఆదాయ వృద్ధి సాధించాయి.మరోవైపు, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌టెక్‌లాంటి కంపెనీల ఆదాయ వృద్ధి మాత్రం సుమారు 4 శాతానికే పరిమితమైంది. పైపెచ్చు విప్రో ఆదాయం రెండు శాతం క్షీణించింది. జనవరి–మార్చి త్రైమాసికంలోను ఇదే తరహా ఫలితాలు కనిపించాయి. సీక్వెన్షియల్‌గా కోఫోర్జ్‌ ఆదాయం 4.7 శాతం పెరిగి రూ. 3,410 కోట్లకు, ఎల్‌అండ్‌టీ టెక్నాలజీ సర్వీసెస్‌ ఆదాయం 12.4 శాతం వృద్ధితో రూ. 2,982 కోట్లకు చేరాయి. భారీ డీల్స్‌ను దక్కించుకున్నప్పటికీ పెద్ద కంపెనీలు మిశ్రమ ఫలితాలు కనపర్చాయి. ఇదే ధోరణి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగే అవకాశం ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.కొత్త టెక్నాలజీలు, నాయకత్వం దన్ను.. చిన్న కంపెనీలు మెరుగ్గా రాణించడానికి పలు కారణాలున్నాయని విశ్లేషకులు తెలిపారు. జెన్‌ఏఐలాంటి కొత్త టెక్నాలజీలను వేగవంతంగా అందిపుచ్చుకోవడం, ప్రాజెక్టులను సత్వరం ఎగ్జిక్యూట్‌ చేయగలగడం, స్థిరమైన నాయకత్వం మొదలైన అంశాలు ఇందుకు దోహదపడినట్లు పేర్కొన్నారు. జెన్‌ఏఐలాంటి విప్లవాత్మకమైన టెక్నాలజీలనేవి, పరిస్థితులకు తగ్గట్లుగా వేగంగా తమను తాము మల్చుకోగలిగే చిన్న సంస్థలకు అవకాశంగా, ప్రస్తుతమున్న భారీ సంస్థలకు కొంత సవాలుగా మారొచ్చని కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ (కేఐఈ) ఒక నివేదికలో తెలిపింది.వ్యయాలను తగ్గించే కొత్త టెక్నాలజీలను వెనువెంటనే అందించేలా తమ సర్వీస్‌ పోర్ట్‌ఫోలియోలను పునర్‌వ్యవస్థీకరించుకోవడమనేది పెద్ద సంస్థలకు కాస్త సవాలుగా ఉంటుందని పేర్కొంది. వాటి భారీ పరిమాణమే ఇందుకు కారణమని వివరించింది. అదే మధ్య స్థాయి కంపెనీలు, దీర్ఘకాలికంగా వ్యూహాత్మక ప్రయోజనాలు పొందేందుకు స్వల్పకాలికంగా ఆదాయాన్ని పణంగా పెట్టేందుకు సాహసం చేయడానికి వీలుంటుందని వివరించింది. స్థిరమైన నాయకత్వం కూడా కంపెనీల పనితీరులో కీలక పాత్ర పోషిస్తోంది.చాలా మటుకు మధ్య స్థాయి కంపెనీల సీఈవోలు అయిదేళ్లకు పైగా కొనసాగుతుండటం వల్ల విజన్, ఎగ్జిక్యూషన్‌ నిలకడగా ఉంటోంది. పెద్ద కంపెనీల లీడర్‌షిప్‌లలో మాత్రం మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. 2023 జూన్‌లో టీసీఎస్‌ సీఈవోగా కె. కృతివాసన్‌ నియమితులు కాగా, 2023 డిసెంబర్‌లో టెక్‌ మహీంద్రాకు మోహిత్‌ జోషి, 2024 ఏప్రిల్‌లో విప్రోకు కొత్త సీఈవోగా శ్రీనివాస్‌ పల్లియా నియమితులయ్యారు.ఈసారీ జోరు .. గత ఆర్థిక సంవత్సరం తరహాలోనే ఈ ఆర్థిక సంవత్సరంలోనూ చిన్న, మధ్య స్థాయి సంస్థల జోరు కొనసాగవచ్చని అంచనాలు నెలకొన్నాయి. స్థిర కరెన్సీ ప్రాతిపదికన కోఫోర్జ్‌లాంటి కంపెనీల ఆదాయ వృద్ధి 16.4 శాతం స్థాయి నుంచి 20.8 శాతానికి పెరగొచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఆర్డర్లు పెద్ద సంఖ్యలో లభిస్తుండటం, అలాగే డీల్స్‌ పరిమాణం కూడా భారీ స్థాయిలో ఉండటం ఇందుకు దోహదపడొచ్చని పేర్కొన్నాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 1.56 బిలియన్‌ డాలర్ల మెగా డీల్‌ కుదుర్చుకున్న ఏకైక దేశీ కంపెనీగా కోఫోర్జ్‌ నిల్చిందని వివరించాయి.అమెరికాకు చెందిన సేబర్‌కు 13 ఏళ్ల పాటు సర్వీసులు అందించేందుకు ఈ కాంట్రాక్టు ఉపయోగపడనుంది. మరోవైపు, పెద్ద కంపెనీలే కాస్త అనిశ్చితి ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. డీల్స్‌ బాగానే ఉంటున్నా, అమెరికాలో టారిఫ్‌లపరమైన అనిశ్చితులు, డిస్క్రిషనరీ వ్యయాల విషయంలో క్లయింట్లు ఆచితూచి వ్యవహరిస్తుండటం వంటి అంశాలతో స్థూలఆర్థిక పరిస్థితులపై ఆందోళన నెలకొనడం ఇందుకు కారణం.ఎఫ్‌ఎంసీజీలోనూ అదే తీరు.. నీల్సన్‌ఐక్యూ నివేదిక ప్రకారం వినియోగదారుల బడ్జెట్‌కి అనుగుణమైన ఉత్పత్తులను అందించడంలో పెద్ద బ్రాండ్లకు చిన్న బ్రాండ్లు ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి. మార్చి త్రైమాసికంలో ఇవి 17.8 శాతం మేర వృద్ధి సాధించాయి. మిడ్‌ సైజ్‌ సంస్థలు 14.6 శాతం మేర పెరిగాయి. దాదాపు రూ. 5 లక్షల కోట్ల దేశీ ఎఫ్‌ఎంసీజీ మార్కెట్లో చిన్న, మధ్య స్థాయి సంస్థల వాటా సుమారు 35 శాతం ఉంటుంది. లో బేస్, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ కాస్త మెరుగుపడటం, ద్రవ్యోల్బణం నెమ్మదించడం తదితర అంశాలు వీటికి సానుకూలంగా నిల్చాయి.మరోవైపు, రూ. 5,000 కోట్లకు పైగా రెవెన్యూ ఉండే దిగ్గజాలు క్యూ4లో 6.4 శాతం మాత్రమే వృద్ధి కనపర్చాయి. బడా కంపెనీల ఉత్పత్తుల ధరలు 4.7 శాతం పెరగ్గా, అమ్మకాల పరిమాణం 1.7 శాతంగా నమోదైంది. అంతక్రితం క్యూ4లో ధరలు 0.3 శాతం తగ్గగా అమ్మకాల పరిమాణం ఏకంగా 8.1 శాతంగా నమోదైంది. నివేదిక ప్రకారం.. చిన్న ప్యాక్‌లు, గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం దన్నుతో జనవరి–మార్చి త్రైమాసికంలో ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జూమర్‌ గూడ్స్‌ (ఎఫ్‌ఎంసీజీ) రంగం 11 శాతం వృద్ధి చెందింది.

Sakshi Editorial On India Pakistan8
విరమణ సరే, విధానం సంగతి!

భారత్‌ – పాకిస్తాన్‌ల మధ్య వివాదాలన్నీ ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలనేది చాలా కాలంగా భారత్‌ అనుసరిస్తున్న స్థిరమైన విధానం. కశ్మీర్‌ అంశాన్ని తొలి రోజుల్లో ఐక్యరాజ్యసమితి వద్దకు తీసుకుపోవడం వలన నష్టం జరిగిందనే అభిప్రాయం ఇండియాకు ఏర్పడింది. పాక్, భారత్‌ల మధ్య రెండు కీలకమైన ఒప్పందాలున్నాయి. 1972 నాటి సిమ్లా ఒప్పందం, 1999లో ప్రకటించిన లాహోర్‌ డిక్లరేషన్‌. రెండు దేశాల నడుమ ఏ వివాదం తలెత్తినా ఈ రెండు ఒప్పందాల పరిధిలో, ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్‌ చాలా కాలంగా దృఢమైన వైఖరితో ఉండేది. మూడో పక్షం మధ్యవర్తిత్వాన్ని భారత్‌ ఏనాడూ అంగీకరించలేదు.ఇందుకు భిన్నంగా రెండు దేశాల వివాదంలో ఇప్పుడు మూడో పక్షం తలదూర్చిందా? కాల్పుల విరమణకు భారత్, పాకిస్తాన్‌ దేశాలు అంగీకరించాయనీ, ఇది వెంటనే అమల్లోకి వస్తుందనీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ సోషల్‌ మీడియా వేదికగా సాయంత్రం 5.30కి ప్రకటించారు. అమెరికా మధ్య వర్తిత్వం వహించి, రాత్రంతా చర్చలు జరిపిన ఫలితంగా ఈ ఒప్పందం సాధ్యమైందని కూడా ఆయన వెల్లడించారు. కామన్‌ సెన్స్‌నూ, తెలివిడినీ ఉపయోగించినందుకు రెండు దేశాలనూ ఆయన అభినందించారు.ఆ తర్వాత అరగంటకు విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ మీడియాతో మాట్లాడారు. కాల్పుల విరమణకు రెండు దేశాలూ అంగీకరించాయని ఆయన ధ్రువీకరించారు. సాయంత్రం ఐదు గంటలకే అమల్లోకి వచ్చినట్టు చెప్పారు. అయితే ఆయన ట్రంప్‌ ట్వీట్‌ ప్రస్తావన గానీ, అమెరికా మధ్యవర్తిత్వం గురించి గానీ మాట్లాడలేదు. ఈరోజు మధ్యాహ్నం 3:30కు పాకిస్తాన్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మిలిటరీ ఆపరేషన్స్‌ (డీజీఎంవో), ఇండియా డీజీఎంవోకు ఫోన్‌ చేశారు. కాల్పుల విరమణకు ప్రతిపాదించారు. ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరిందని మిస్రీ చెప్పారు.మూడో పక్షం జోక్యం లేకుండానే ఇరు దేశాలూ ఒప్పందానికి వచ్చాయనే విధంగానే ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత ట్వీట్‌ చేసిన విదేశాంగ మంత్రి జైశంకర్‌ కూడా రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందంగానే దీన్ని అభివర్ణించారు. రేపు సోమవారం నాడు రెండు దేశాల మధ్య చర్చలు జరగబోతు న్నాయని అధికారిక ప్రకటన వెలువడింది. రెండు దేశాల డీజీఎంవోలు మాట్లాడుకోవడానికి ముందు నుంచే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో రెండు దేశాల ముఖ్య నేతలతో మాట్లాడుతున్నట్టుగా వార్తలు వెలువడ్డాయి.ఈ మొత్తం వ్యవహారంలో అమెరికా నిర్వహించిన పాత్రేమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఉద్రిక్తతల సడలింపునకు కాల్పులు విరమణ పాటించాలని స్నేహపూర్వక సలహా మాత్రమే రెండు దేశాలకు ఇచ్చిందా? లేక చర్చల ప్రాతిపదికను తయారు చేసే మధ్యవర్తిత్వ పాత్ర పోషించిందా? ఒకవేళ మధ్యవర్తిగానే చర్చల ప్రాతిపదికను కూడా సిద్ధం చేసి ఉంటే దక్షిణాసియా భౌగోళిక రాజకీయాల్లో ఒక కీలకమైన మార్పు వచ్చినట్టే భావించాయుద్ధం అమానుషమై నది. అనాగరికమైనది. యుద్ధం కారణంగా దేశాలు, ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. యుద్ధ ప్రమాదాన్ని నివారించడం వివేకవంతమైన చర్యే! కాల్పుల విరమణ ఆహ్వానించదగ్గదే! అయితే ఈ విరమణ వల్ల దేశం సాధించేది ఏమిటి? పోగొట్టుకునేదేమిటనే విశ్లేషణ కూడా అవసరం. యుద్ధం భారత్‌ ప్రారంభించలేదు. ఉగ్రవాదాన్ని ప్రయోగించి పాకిస్తానే కయ్యానికి కాలు దువ్వింది. బదులుగా పాక్‌లోని ఉగ్రవాద స్థావరాల మీద మాత్రమే భారత్‌ దాడులు చేసింది. నూరు శాతం కచ్చితత్వంతో చేసిన ఈ దాడులు పదును దేలిన భారత రణ వ్యూహానికీ, అద్భుతమైన సైనిక పాటవానికీ అద్దం పట్టాయి.భారత దాడులకు పాక్‌ నివ్వెరపోయింది. అధీన రేఖ వెంబడి విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడింది. జనావాసాలను టార్గెట్‌గా చేసుకొని దాడులకు దిగింది. ప్రాణనష్టం, ఆస్తి నష్టం భారీగానే జరిగినట్టు కశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా పరోక్షంగా అంగీకరించారు. మిగిలిన సరిహద్దు రాష్ట్రాల కంటే జమ్మూకశ్మీర్‌ ఈ దారుణాన్ని ఎక్కువగా భరించవలసి వచ్చింది. పసిపిల్లలతో సహా సాధారణ ప్రజలను బలి తీసుకుంటున్న మహమ్మారి యుద్ధాన్ని వెంటనే నిలిపివేయాలని కశ్మీర్‌ ప్రతిపక్ష నేత మెహబూబా ముఫ్తీ కన్నీళ్ళతో వేడుకున్నారు.యుద్ధాలను వేగిరపడి ప్రారంభించడం కాకుండా పూర్తి ప్రణాళికను రచించుకొని మొదలుపెట్టాలనీ, వీలైనంత వేగంగా ముగించాలనీ, శత్రువు ప్రతిఘటనా శక్తిని దెబ్బకొట్టి పోరాడకుండానే యుద్ధాలను గెలిచే మార్గాలను అన్వేషించాలనీ సన్‌షూ తన యుద్ధతంత్ర గ్రంథమైన ‘ఆర్ట్‌ ఆఫ్‌ వార్‌’లో చెబుతాడు. ఈ నాలుగు రోజుల భారత దాడుల్లో సన్‌షూ చెప్పిన ‘ఆర్ట్‌ ఆఫ్‌ వార్‌’ కనిపించింది. ఉగ్రవాద స్థావరాలపై గురి తప్పకుండా, సరిహద్దులు దాటకుండా దాడి చేయడం, పలువురిని మట్టు పెట్టడంతోనే భారత్‌ సగం యుద్ధాన్ని గెలిచింది. పాక్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ను ధ్వంసం చేయడం, ఎనిమిది కీలకమైన ఎయిర్‌ బేస్‌లను దెబ్బతీయటం, బాలిస్టిక్‌ మిసైల్‌ను గాల్లోనే పేల్చేయడంతో పాకిస్తాన్‌ దాదాపుగా చేతు లెత్తేసింది.ఈ దశలోనే పాక్‌ నేతలు అమెరికా శరణు కోరి ఉంటారనీ, అవమానకరమైన ఓటమి నుంచి కాపాడాలని విజ్ఞప్తి చేసి ఉంటారనీ అంచనాలు వెలువడుతున్నాయి. అమెరికా జోక్యం చేసుకున్న విషయం యథార్థం. అది ఏ మేరకు అన్నది తేలవలసి ఉన్నది. సాధారణ ప్రజలపై మారణ హోమం చేయడం తప్ప పాకిస్తాన్‌ సాధించిందేమీ లేదు. భారత్‌ సాధించిన ఈ వేగవంతమైన విజయం రేపు జరిగే చర్చల్లో ప్రభావవంతమైన పాత్రను పోషించాలి. భారత్‌ కోరుతున్న విధంగా ఉగ్ర హంతకులకు స్థావరం లేకుండా చేస్తామని అంగీకరించాలి. భారత్‌లో నేరాలకు పాల్పడిన ఉగ్రవాదులను అప్పగించడానికి అంగీకరించాలి. భారత కశ్మీర్‌లో వేలు పెట్టబోమని అంగీ కరించే విధంగా పాక్‌పై ఒత్తిడి తేవాలి. సింధూనదీ జలాల ఒప్పందం నిలిపివేత విషయంలో పునఃసమీక్షకు అంగీకరించరాదు. అప్పుడే ఇది విజేత షరతుల మేరకు జరిగే ద్వైపాక్షిక చర్చలుగా పరిగణించవలసి ఉంటుంది. లేకుంటే మధ్యవర్తిత్వాన్ని అంగీకరించబోమన్న చారిత్రక విధానానికి వీడ్కోలు పలికినట్లవుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో కొసమెరుపు ఏమిటంటే... కాల్పుల విరమణ ప్రకటించిన మూడు గంటల తర్వాత సరిహద్దుల వెంబటి పాకిస్తాన్‌ ఆర్మీ ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు వార్తలు వస్తున్నాయి. భారత భూభాగంపై కాల్పులు జరుపుతున్నాయి. ఇది పాకిస్తాన్‌ రాజకీయ నాయకత్వానికీ, ఆర్మీ నాయకత్వానికీ మధ్య సమన్వయ లోపమా? లేక రేపటి చర్చల్లో బేరమాడేందుకు తమ శక్తిని పెంచు కోవడానికి ఆ దేశం ఆడుతున్న నాటకమా? అదీ త్వరలోనే తేలుతుంది.వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com

Andhra University 100 Years Celebration9
100 ఏళ్ల చదువుల గుడి ఎయూ శతవార్షికోత్సవాలు

ఆంధ్రరాష్ట్ర ప్రజల కోసం ప్రత్యేకంగా ఆవిర్భవించిన మొదటి విశ్వవిద్యాలయం ఆంధ్ర విశ్వ కళాపరిషత్‌. తెలుగు ప్రజల కోసం ఏర్పడిన భాషా ప్రయుక్త విశ్వవిద్యాలయం ఆంధ్రవిశ్వవిద్యాలయం. దేశంలో అనేక విశ్వవిద్యాలయాలు ఉన్నప్పటికీ విశ్వకళాపరిషత్‌ అనే పేరుతో వ్యవహరించేది మాత్రం ఆంధ్ర విశ్వవిద్యాలయానికి మాత్రమే! దేశంలో మరో విశ్వవిద్యాలయానికి లేని ప్రత్యేకత ఇది. పేరుకు తగినట్లే లలిత కళలైన నృత్యం, సంగీతం, చిత్రలేఖనం, రంగస్థలం, నటన వంటి కళలకు యూనివర్సిటీలో స్థానం కల్పించారు. స్వతహాగా కళా సాహిత్యాల పట్ల మక్కువ ఉన్న కట్టమంచి రామలింగారెడ్డి ‘ఆంధ్ర విశ్వకళాపరిషత్‌’ పేరును ప్రతిపాదించారు. 1926లో మద్రాసు విశ్వవిద్యాలయ చట్టం ప్రకారం తెలుగు మాట్లాడే ప్రజల కోసం ప్రత్యేకంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటైన రెసిడెన్షియల్‌ టీచింగ్‌– కమ్‌– అనుబంధ విశ్వవిద్యాలయంగా ఘనతకెక్కిన ఏయూ శతాబ్ది ఉత్సవాలను జరుపుకొంటోంది. మొదటగా విజయవాడలో 1926 ఏప్రిల్‌ 24న ఏర్పాటైన ఈ విశ్వవిద్యాలయానికి పునాదిని మొట్టమొదటి వీసీ డాక్టర్‌ కట్టమంచి రామలింగారెడ్డి వేయగా, అప్పటి మద్రాస్‌ గవర్నర్‌ లార్డ్‌ గోచెన్‌ చాన్సలర్‌గా వ్యవహరించారు. డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని 1930 సెప్టెంబరు 5న ఈ యూనివర్సిటీ ప్రాంగణాన్ని విశాఖపట్నానికి తరలించారు. ప్రతి ఏటా సగటున వెయ్యి నుంచి పన్నెండు వందల మంది విద్యార్థులు పీహెచ్‌డీ పట్టాలు తీసుకునే ఈ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ప్రస్తుతం 58 విభాగాలు, 18 పరిశోధన కేంద్రాల్లో 20 వేలమంది విద్యార్థులు చదువుకుంటున్నారు.ఏడాది పాటు శతాబ్ది ఉత్సవాలు...!ఏయూ ఏర్పాటై 2026 నాటికి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఏడాది పాటు శతాబ్ది ఉత్సవాలను నిర్వహించుకునేందుకు ఏయూ సిద్ధమయ్యింది. ఏడాదిపాటు నిర్వహించే ఈ ఉత్సవాల్లో ఎడ్యుకేషన్, రీసెర్చ్, ఔట్‌రీచ్‌– ఈ మూడు విభాగాల్లో పనిచేయాలని విజన్‌ డాక్యుమెంట్‌ను ఏయూ ప్రకటించింది. శతాబ్ది ఉత్సవాల లోగోను ప్రత్యేకంగా తయారు చేశారు. ఈ లోగోను యూనివర్సిటీ ఫైన్‌ ఆర్ట్స్‌ విభాగంలోని బీఎఫ్‌ఏ విద్యార్థి షేక్‌ రఫీ రూపొందించారు. ఏయూ లోగో ప్రత్యేకత!ఆంధ్రా యూనివర్సిటీ లోగోను ప్రత్యేక శ్రద్ధతో తయారుచేసి, లోగోలోని ప్రతి చిహ్నానికి అర్థం స్ఫూరించేలా తయారు చేశారు. కాంతి కిరణాలతో ఉదయించే సూర్యుడు విశ్వవిద్యాలయాన్ని, దాని అనేక అధ్యయన విభాగాలను సూచిస్తుంది. ఇక కమలం శ్రేయో దేవత లక్ష్మీ, జ్ఞాన దేవత సరస్వతి– ఇద్దరినీ ప్రతిబింబిస్తుంది. సూర్యకిరణాలపై ఆర్యులలో దీవెన చిహ్నమైన స్వస్తిక ఉంటుంది. అరవై నాలుగు తామర రేకులతో కూడిన శిఖరం బయటి వృత్తం, భారతదేశ శాస్త్రీయ సంప్రదాయంలోని అరవై నాలుగు కళలను, శాస్త్రాలను సూచిస్తుంది. ఇక సముద్రాన్ని– విద్యార్థులు ప్రావీణ్యం పొందడానికి దోహదపడే విస్తారమైన జ్ఞానకేంద్రం అనే అర్థంలో తయారు చేశారు. ఉపనిషత్తులలోని ‘తేజస్వినావధితమస్తు’ అనే నినాదాన్ని కూడా లోగోలో భాగం చేశారు. దీని అర్థం ఏమిటంటే ‘దైవిక కాంతి మన అధ్యయనాలను ప్రకాశింపజేయుగాక‘ అని. ఈ జ్ఞాన చిహ్నం కింద అన్ని మతాలలోనూ ప్రాశస్త్యం కలిగిన నెలవంక ఉంది. ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని కళల అభివృద్ధికి నెలకొల్పిన సంస్థ అనే అర్థంతో ‘ఆంధ్ర విశ్వకళాపరిషత్‌’ అని దీనికి నామకరణం చేశారు. లోగోలోని దిగువభాగంలో ఉన్న రెండు సర్పాలు తామర రేకుల నుంచి జ్ఞానాన్ని కోరుకునేవారిని, జ్ఞాన సంరక్షకులను సూచిస్తాయి. అంతేకాకుండా, పురాతనకాలం నుంచి ఆంధ్రులలో నాగారాధన సంప్రదాయం ఉంది. ఈ లోగోను కౌతా రామమోహనశాస్త్రి రూపొందించగా, ఏయూ వ్యవస్థాపక వీసీ డాక్టర్‌ కట్టమంచి రామలింగారెడ్డి ఆమోదించారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో...వాస్తవానికి మొట్టమొదటగా బెజవాడలోని (ఇప్పటి విజయవాడ) తాత్కాలిక భవనాల్లో ఏర్పాటైన ఏయూ 1930లో విశాఖకు తరలివచ్చింది. అయితే, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో మాత్రం ఏయూ ప్రాంగణం అంతా సైనిక స్థావరంగా మారిపోయింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 1942 ఏప్రిల్‌ 6న విశాఖ హార్బర్‌పై జపాన్‌ బాంబులు వేసింది. ఆ దాడి తర్వాత యూనివర్సిటీ భూమిని, భవనాలను తమ అవసరాలకు ఉపయోగించుకోవాలని అప్పటి బ్రిటిష్‌ సైన్యం నిర్ణయించుకుంది, యూనివర్సిటీని మార్చమని బలవంతం చేసింది. బాంబు దాడి జరిగిన పది రోజుల తర్వాత– అంటే 1942 ఏప్రిల్‌ 16న యూనివర్సిటీని తరలించడానికి సన్నాహాలు చేసుకోవడం కోసం మూసివేశారు. కెమిస్ట్రీ మినహా చాలా విభాగాలు గుంటూరుకు మారగా, కెమిస్ట్రీ విభాగం మద్రాసులోని ప్రెసిడెన్సీ కళాశాలకు మారింది. భవనాలన్నింటినీ సైన్యం ఆక్రమించడంతో ఆంధ్ర విశ్వవిద్యాలయం జూన్‌ 1945 వరకు అంటే మూడేళ్లపాటు విశాఖపట్నం వెలుపలి నుంచే పనిచేసింది.న్యాక్‌ ఏ ప్లస్‌ ప్లస్‌ గ్రేడ్‌తో...!తెలుగు ప్రజల సుదీర్ఘ పోరాట ఫలితంగా ఆంధ్రా యూనివర్సిటీ ఏర్పడటంతో తెలుగు ప్రజలు యూనివర్సిటీతో మానసికంగా అనుబంధం పెంచుకున్నారు. ఆంధ్రా యూనివర్సిటీ దేశంలోని పురాతన విద్యాసంస్థలలో ఒకటి మాత్రమే కాదు, రెసిడెన్షియల్‌ మల్టీ–డిసిప్లినరీ యూనివర్సిటీగా ఏర్పడిన విశ్వవిద్యాలయాలలో మొదటిది. శతాబ్ది ఉత్సవాలకు సిద్ధమైన ఈ యూనివర్సిటీకి కట్టమంచి రామలింగారెడ్డి వ్యవస్థాపక వైస్‌ చాన్సలర్‌గా, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ రెండో వైస్‌ చాన్సలర్‌గా, తిరిగి సీఆర్‌ రెడ్డి, అనంతరం డాక్టర్‌ వీఎస్‌ కృష్ణు్ణడు– ఈ ముగ్గురు దార్శనికులు వేసిన పునాదులు ఆ తర్వాతి దశాబ్దాల్లో ఫలవంతమై, ఏకంగా దేశంలోనే న్యాక్‌ ఏ ప్లస్‌ ప్లస్‌ గ్రేడ్‌ పొందిన మొట్టమొదటి ప్రభుత్వ యూనివర్సిటీగా 2024లో చరిత్రకెక్కింది. ఏయూలో 59 దేశాల విద్యార్థులు...దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులతో పాటు విదేశాల్లోని విద్యార్థులనూ ఏయూ ఆకర్షిస్తోంది. ఇక్కడ చదువుకునేందుకు విదేశీ విద్యార్థులు ఎంతో ఆసక్తి చూపుతుంటారు. ఏకంగా 59 దేశాలకు చెందిన 1,130 మంది విద్యార్థులు వివిధ కోర్సుల్లో చదువుకుంటున్నారు. ఎక్కువగా ఇంజినీరింగ్‌ కోర్సుల్లో 472 మంది విదేశీ విద్యార్థులు ఉన్నారు. 2019–20 సంవత్సరంలో 190 మంది ఉన్న విదేశీ విద్యార్థుల సంఖ్య గత ప్రభుత్వ హాయంలో ప్రత్యేకంగా హాస్టల్స్‌ ఏర్పాటుతో పాటు ప్రత్యేక మెనూను అమలు చేయడంతో ఈ సంఖ్య 1,130కి చేరుకుంది. ఇక్కడ చదువుకుంటున్న విదేశీ విద్యార్థులు ఒకవైపు చదువుకుంటూనే, మరోవైపు సినిమాల్లోనూ నటిస్తూ తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ప్రధానంగా విశాఖలో జరిగే వివిధ రకాల సినిమా షూటింగుల కోసం అవసరమైన విదేశీయుల కోసం ఇక్కడ చదువుకుంటున్న విదేశీ విద్యార్థులను దర్శకులు వెదుక్కుంటూ వచ్చి మరీ తీసుకెళుతున్నారు. ఇస్మార్ట్‌ శంకర్, శివం వంటి సినిమాల్లో ఇక్కడి విదేశీ విద్యార్థులు నటించారు. ఎందరో మహానుభావులు...ఆంధ్రా యూనివర్సిటీలో చదువుకున్న అనేక మంది ఎంతో గొప్ప స్థానాలకు చేరుకున్నారు. ఆచార్య సూరి భగవంతం (భౌతికశాస్త్రం), ఆచార్య జ్ఞానానంద (అణుభౌతిక శాస్త్రం), ఆచార్య సి.మహదేవన్‌ (జియాలజీ), ఆచార్య టీఆర్‌. శేషాద్రి (రసాయన శాస్త్రం), ఆచార్య బి. రామచంద్రరావు(స్పేస్‌ ఫిజిక్స్‌), ఆచార్య సి.ఆర్‌రావు (స్టాటస్టిక్స్‌), ఆచార సీవీ రామన్‌(భౌతికశాస్త్రం), ఆచార్య ఆర్‌.రంగదామరావు (మీటీయరాలజీ) వంటి అనేక మంది ప్రపంచస్థాయిలో శాస్త్రవేత్తలుగా రాణించినవారే! ఇక భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, ప్రస్తుత ఒడిశా గవర్నర్‌ ఆచార్య కంభంపాటి హరిబాబు, రాజ్యసభ మాజీ సభ్యుడు, విశ్వ హిందీపరిషత్‌ అద్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్, పెన్‌స్టేట్‌ యూనివర్సిటీ (అమెరికా) అద్యక్షురాలు నీలి బెండపూడి, జీఎంఆర్‌ గ్రూప్‌ అధినేత డాక్టర్‌ జి.ఎం.రావు, ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ డాక్టర్‌ దువ్వూరి సుబ్బారావు, లోక్‌సభ మాజీ స్పీకర్‌ జీఎంసీ బాలయోగి తదితర ప్రముఖులు ఏయూ పూర్వవిద్యార్థులలో ఉండటం విశేషం. దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలకు నాయకత్వం వహిస్తున్న 50 మంది వీసీలను, 10 మంది చాన్సలర్లనూ అందించిన ఘనత ఏయూ సొంతం. ఇదిలా ఉంటే, ఈ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థుల్లో ఎనిమిది మంది శాంతి స్వరూప్‌ భట్నాగర్‌ అవార్డు గ్రహీతలు, ముగ్గురు పద్మవిభూషణ్‌ అవార్డు గ్రహీతలు, నలుగురు పద్మశ్రీ అవార్డు గ్రహీతలతో పాటు సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఒకరు ఉన్నారు. డిసెంబర్‌లో పూర్వ విద్యార్థుల సమావేశం...ఏయూ పూర్వ విద్యార్థులు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నవారు ఉన్నారు. దేశంతో పాటు విదేశాల్లోనూ తమదైన ముద్ర వేస్తున్నారు. ఆస్ట్రేలియా, సింగపూర్, జపాన్, కెనడా, ఆఫ్రికా, జర్మనీ, ఫ్రా¯Œ ్స, రష్యా, థాయ్‌లండ్, మలేషియా మొదలైన దేశాల్లో మంచి సంఖ్యలో పూర్వ విద్యార్థులు స్థిరపడి పని చేస్తున్నారు. వీరందరూ కలిపి ఏర్పాటు చేసుకున్న ఆంధ్రా యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సంఘం యూనివర్సిటీ అభివృద్ధిలోనూ ఎంతగానో సహాయ సహకారాలను అందిస్తోంది. ఈ సంఘం ద్వారా యూనివర్సిటీలో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ప్రతి ఏటా డిసెంబర్‌లో ఆంధ్రా యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సంఘం వ్యవస్థాపక వీసీ సీవీ రెడ్డి జయంతి సందర్భంగా పూర్వ విద్యార్థుల వార్షిక సమావేశాన్ని నిర్వహించుకుంటున్నారు. ‘నాసా’ పరిశోధనల్లోనూ...ప్రారంభంలో ఏయూ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఆర్ట్స్‌ కళాశాలలు ఉమ్మడిగా ఉండేవి. ఈ ఉమ్మడి విభాగాలకు ప్రిన్సిపల్‌గా పనిచేసిన ఎం. వెంకటరంగయ్య ‘పద్మవిభూషణ్‌’ అందుకున్నారు. అయితే, 1931లో ఈ రెండు విభాగాలను వేరు చేశారు. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కళాశాల తొలి ప్రిన్సిపాల్‌గా ఆర్‌.రామనాథం పనిచేశారు. జయపూర్‌ మహారాజా విక్రమ్‌దేవ్‌ వర్మ ఏయూకు విలువైన భూములను, భారీగా నగదును విరాళంగా ఇచ్చారు. సంప్రదాయ కోర్సులకు భిన్నంగా భవిష్యత్‌ అవసరాలను గుర్తించి కొత్త కోర్సులను విద్యార్థులకు అందించడంలో ఆంధ్రా యూనివర్సిటీ అగ్రగామిగా ఉంటోంది. ఏయూ మీటియరాలజీ, ఓషనోగ్రఫీ, జియాలజీ, నూక్లియర్‌ ఫిజిక్స్‌ వంటి వైవిధ్యభరితమైన ప్రత్యేక శాస్త్ర విభాగాలను నిర్వహిస్తోంది. దేశంలోనే మొదటిసారిగా న్యూక్లియర్‌ ఫిజిక్స్‌ విభాగాన్ని ఏర్పాటు చేసిన యూనివర్సిటీగా ఏయూ పేరు సంపాదించింది. ఇక వివిధ రకాల పరిశోధనల కోసం ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని అడ్వాన్స్‌డ్‌ అనలిటికల్‌ లేబొరేటరీ, ఎన్‌ఎంఆర్‌ స్పెక్టోస్కోపీలు వర్సిటీ విశిష్టతను చాటుతున్నాయి. ఇక ‘నాసా’ చేపట్టిన లూనార్‌ ప్రయోగాలకు ఏయూ తన వంతు సహాయాన్ని అందించింది. తూర్పు కనుమలలోని పలు రకాల రాళ్లను సేకరించి, చంద్రమండలంలోని పదార్థాలలో పోలి ఉన్నాయా లేదా అనే ప్రయోగాన్ని నిర్వహించింది. ఇందుకు అవసరమైన సహకారాన్ని ఏయూ జియాలజీ విభాగం అందించింది. తమకు అందించిన సహకారానికి ‘నాసా’ స్వయంగా ఏయూకు కృతజ్ఞత లేఖ రాసింది. అలాగే ఏయూ ఫ్రాన్స్‌కు కూడా అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందించింది.మరో ఎత్తుకు వైఎస్‌ జగన్‌ హాయంలో....!నూతన పోకడలకు అనుగుణంగా ఆంధ్రా యూనివర్సిటీలో కొంగొత్త మార్పులకు గత వైఎస్సార్‌సీపీ హాయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేతృత్వంలో శ్రీకారం చుట్టారు. ఎన్నడూ లేని విధంగా స్టార్టప్‌ల కోసం ప్రత్యేకంగా ఏ–హబ్‌ను ఏర్పాటు చేయడంతో పాటు పేటెంట్ల కోసం ఏకంగా నూటికిపైగా దరఖాస్తులు చేయడంలో ఏయూ మరో శిఖరానికి చేరుకుంది. పేటెంట్లకు దరఖాస్తు చేసేందుకు ప్రత్యేకంగా ఆంధ్రా యూనివర్సిటీలో మేధాసంపత్తి హక్కులను పొందేందుకుగానూ ప్రత్యేకంగా మేధాసంపత్తి హక్కుల కేంద్రాన్ని (సీఐపీఆర్‌) గత ప్రభుత్వ హాయంలో అప్పటి వీసీ ప్రసాద్‌రెడ్డి సెప్టెంబరు 2020లో ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం ద్వారా నూటికిపైగా దరఖాస్తులను పంపారు. ఇక గత ప్రభుత్వ హాయంలో చేపట్టి, పూరైన 5 ప్రత్యేక భవనాలను సీఎం హోదాలో 2023 ఆగస్టు 1వ తేదీన వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. అప్పటి వీసీ ప్రసాద్‌ రెడ్డి నేతృత్వంలో ఏయూ ఈ ప్రగతిని సాధించింది. ఆ భవనాలు ఇవే... ఏ–హబ్‌ (ఆంధ్రా యూనివర్సిటీ స్టార్టప్‌ – టెక్నాలజీ ఇంక్యుబేషన్‌ హబ్‌): దీనిని రూ. 21కోట్ల వ్యయంతో 30,000 చదరపు అడుగుల స్థలంలో కొత్తగా నిర్మించారు. ఇందులో 121 స్టార్టప్స్‌ తమ కార్యాలయాలను ప్రారంభించి సేవలందిస్తున్నాయి. రాష్ట్రంలో స్టార్టప్స్‌కు అంకురార్పణ కూడా ఇక్కడి నుంచే ఊపందుకుందని చెప్పవచ్చు.ఎలిమెంట్‌(ఆంధ్రా యూనివర్సిటీ ఫార్మా ఇంక్యుబేషన్‌ మరియు బయోలాజికల్‌ మానిటరింగ్‌ హబ్‌): ఫార్మా/బయోటెక్‌/ జెనోమిక్స్‌ ఇంక్యుబేషన్, టెస్టింగ్‌ ల్యాబ్‌ కోసం 55,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్తగా నిర్మించారు. దీని నిర్మాణానికి రూ. 44 కోట్లు ఖర్చు చేశారు.ఆల్గోరిథమ్‌(ఆంధ్రా యూనివర్సిటీ డిజిటల్‌ జోన్‌ –స్మార్ట్‌ క్లాస్‌ రూమ్స్‌ కాంప్లెక్స్‌): దీనిని 60,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో రూ. 35 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఇందులో 250 మంది కూర్చునేందుకు వీలు కలిగిన రెండు ఆధునిక సెమినార్‌ హాళ్లు, 15 స్మార్ట్‌ క్లాస్‌ రూమ్‌లలో 500 కంప్యూటర్‌లతో విద్యార్థులకు శిక్షణ, ఆన్‌లైన్‌ పరీక్షలను నిర్వహించుకునే వీలు కలిగింది. ఇందుకోసం ప్రత్యేక ఫ్లోర్‌ను నిర్మించారు.ఏయూ–సిబ్‌ (ఆంధ్రా యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌): ఐఐఎం–విశాఖపట్నంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకుని, రూ. 18 కోట్ల వ్యయంతో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని నిర్మించారు. ఇందులో ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ అండ్‌ అనలిటిక్స్‌లో ప్రత్యేకమైన బ్యాచిలర్‌ మరియు మాస్టర్‌ ప్రోగ్రామ్‌లను అందిస్తున్నారు.ఏయూ–అవంతి ఆక్వాకల్చర్‌ ఇనోవేషన్‌ మరియు స్కిల్‌ హబ్‌మొదటి దశలో రూ. 11 కోట్లతో 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో మెరైన్‌ ఫార్మింగ్, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్‌లో నైపుణ్య శిక్షణను అందించడానికి దీనిని నిర్మించారు.

Indian archers win 5 medals at Archery World Cup10
భారత్‌ ‘పాంచ్‌ పటాకా’

షాంఘై: ప్రపంచకప్‌ ఆర్చరీ స్టేజ్‌–2 టోర్నమెంట్‌లో భారత కాంపౌండ్‌ ఆర్చర్లు 5 పతకాలతో సత్తాచాటారు. వ్యక్తిగత విభాగంలో మధుర స్వర్ణ పతకంతో మెరిసింది. దీంతో ఈ టోర్నీలో భారత ఆర్చర్లకు మొత్తంగా 2 స్వర్ణాలు, ఒక రజతం, 2 కాంస్యాలు దక్కాయి. మహిళల కాంపౌండ్‌ వ్యక్తిగత ఫైనల్లో మధుర 139–138తో కార్సన్‌ (అమెరికా)పై గెలుపొందింది. మహారాష్ట్రకు చెందిన 24 ఏళ్ల మధుర ఈ టోర్నీలో ఓవరాల్‌గా మూడు పతకాలు గెలుచుకుంది. వ్యక్తిగత విభాగంలో పసిడి నెగ్గిన మధుర... టీమ్‌ ఈవెంట్‌లో రజతం, మిక్స్‌డ్‌ విభాగంలో కాంస్యం గెలిచిన జట్లలో కూడా సభ్యురాలు. ఫైనల్లో మొదట ‘పర్‌ఫెక్ట్‌ 30’ పాయింట్లు సాధించిన మధుర ఆ తర్వాత ఆకట్టుకోలేకపోయింది. ఒకదశలో వరుసగా రెండు సార్లు 8 పాయింట్లతో పాటు ఒకసారి 7 పాయింట్లు ఖాతాలో వేసుకొని 81–85తో వెనుకంజలో పడింది. తర్వాతి రౌండ్‌లో మెరుగైన ప్రదర్శనతో స్కోరును 110–110తో సమం చేసి... అదే జోరు కొనసాగిస్తూ పసిడి ఖాతాలో వేసుకుంది. అంతకుముందు కాంపౌండ్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత పురుషుల జట్టు స్వర్ణం గెలుచుకుంది. అభిషేక్‌ వర్మ, రిషభ్‌ యాదవ్, ఓజస్‌ ప్రవీణ దేవ్‌తలేలతో కూడిన భారత పురుషుల జట్టు ఆదివారం జరిగిన ఫైనల్లో 232–228 పాయింట్ల తేడాతో మెక్సికో జట్టుపై గెలుపొందింది. ఇక పురుషుల వ్యక్తిగత విభాగంలో 22 ఏళ్ల రిషభ్‌ యాదవ్‌ కాంస్య పతకంతో మెరిశాడు. షూటాఫ్‌లో అతడు దక్షిణ కొరియా ఆర్చర్‌పై విజయం సాధించాడు. వెన్నం జ్యోతి సురేఖ (ఆంధ్రప్రదేశ్‌), తనిపర్తి చికిత (తెలంగాణ), మధుర (మహారాష్ట్ర) లతో కూడిన భారత మహిళల కాంపౌండ్‌ జట్టు రజత పతకం చేజిక్కించుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో సురేఖ, చికిత, మధుర త్రయం. 221–234తో మెక్సికో జట్టు చేతిలో ఓడింది. ఇక మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో మధుర–అభిõÙక్‌ వర్మ జంట కాంస్యం గెలుచుకుంది. కాంస్య పతక పోరులో భారత జోడీ 144–142 పాయింట్ల తేడాతో ఫాటిన్‌ నూర్‌ఫతే–మొహమ్మద్‌ జువైదీ (అమెరికా)పై గెలుపొందింది. తాజా ప్రదర్శనతో భారత కాంపౌండ్‌ జట్టు భవిష్యత్తుపై మరిన్ని అంచనాలు పెరుగుతున్నాయి. తొలి సారి 2028 లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌లో ఆర్చరీ కాంపౌండ్‌ టీమ్‌ ఈవెంట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఇదే జోరు కొనసాగిస్తే మనకు ఒలింపిక్స్‌కు పతకం సాధించేందుకు మంచి అవకాశం ఉంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement