SRH vs PBKS
-
ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న అభిషేక్ తల్లి వ్యాఖ్యలు.. ఆరెంజ్ ఆర్మీ మస్త్ ఖుష్
క్రికెట్ ప్రేమికుల్లో.. ముఖ్యంగా ఆరెంజ్ ఆర్మీలో ఎక్కడ చూసినా అభిషేక్ శర్మ నామస్మరణే.. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా ఈ పంజాబీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తనలోని మాస్టర్ క్లాస్‌ను వెలికి తీసి విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు.గత కొన్నాళ్లుగా కొనసాగుతున్న తన వైఫల్యాలకు తెర దించుతూ బీస్ట్ మోడ్‌లోకి వెళ్లిపోయి.. భారీ సెంచరీ సాధించాడు. కేవలం నలభై బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్న అభిషేక్.. ఐపీఎల్లో సన్‌రైజర్స్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన తొలి క్రికెటర్‌గా, ఓవరాల్‌గా మూడో ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు.మొత్తంగా ఈ మ్యాచ్‌లో యాభై ఐదు బంతులు ఎదుర్కొన్న అభిషేక్ శర్మ .. పద్నాలుగు ఫోర్లు, పది సిక్సర్ల సాయంతో 141 పరుగులు సాధించాడు. తద్వారా ఐపీఎల్ మ్యాచ్ ఛేజింగ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత ఆటగాడిగానూ ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ఆల్‌టైమ్ రికార్డు సాధించాడు.ఇలా తన సుడిగాలి ఇన్నింగ్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను గెలిపించి.. తిరిగి విజయాల బాట పట్టించాడు. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మపై ప్రశంసల వర్షం కురుస్తోంది. సహచర ఆటగాళ్లు, సన్‌రైజర్స్ ఫ్యామిలీతో పాటు అతడి కుటుంబం కూడా సంతోషంలో తేలియాడుతోంది.𝘼 𝙣𝙤𝙩𝙚-𝙬𝙤𝙧𝙩𝙝𝙮 𝙏𝙊𝙉 💯A stunning maiden #TATAIPL century from Abhishek Sharma keeps #SRH on 🔝 in this chase 💪Updates ▶ https://t.co/RTe7RlXDRq#TATAIPL | #SRHvPBKS | @SunRisers pic.twitter.com/ANgdm1n86w— IndianPremierLeague (@IPL) April 12, 2025కావ్యా మారన్‌తో కలిసి సంబరాలు ఇక అభి తల్లిదండ్రులు మంజు శర్మ, రాజ్‌కుమార్ శర్మ.. తమ కుమారుడి సెంచరీ పూర్తి కాగానే రైజర్స్ యజమాని కావ్యా మారన్‌తో కలిసి సంబరాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో రైజర్స్ విజయానంతరం అభిషేక్ శర్మ తల్లి మంజు శర్మ పుత్రోత్సాహంతో పొంగిపోయారు.జైత్రయాత్ర కొనసాగుతుంది‘‘ఈరోజు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు.. నేను కూడా ఎంతో ఆనందంగా ఉన్నాను.. మొత్తం హైదరాబాద్ అంతా సంతోషంతో నిండిపోయింది.. మనం మ్యాచ్ గెలిచాం.. ఇన్నాళ్లు కాస్త మనకు బ్రేక్ పడింది... ఇకపై అలాంటిదేమీ ఉండబోదు.. జైత్రయాత్ర కొనసాగుతుంది’’ అని మంజు శర్మ ఆరెంజ్ ఆర్మీకి మాటిచ్చారు.ఈ మేరకు ఆమె చేసిన వ్యాఖ్యలు ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి. అమ్మ ఆశిర్వాదం ఉంటే ఏదైనా సాధ్యమే అంటూ ఆరెంజ్ ఆర్మీ ఫుల్ ఖుషీ అయిపోతూ.. ఇందుకు సంబంధించిన వీడియోను వైరల్ చేస్తున్నారు. కాగా ఐపీఎల్-2025లో ఆరంభ మ్యాచ్‌లో గెలిచిన సన్‌రైజర్స్.. ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిపోయింది.అయితే, సొంత మైదానం ఉప్పల్‌లో పంజాబ్ కింగ్స్‌తో శనివారం నాటి మ్యాచ్‌లో మాత్రం సత్తా చాటింది. తమదైన దూకుడు శైలితో పంజాబ్ విధించిన 246 పరుగుల లక్ష్యాన్ని.. 18.3 ఓవర్లలోనే ఊదేసింది. తద్వారా శ్రేయస్ అయ్యర్ సేనపై కమిన్స్ బృందం ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి.. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి చేరుకోగలిగింది.ఐపీఎల్-2025: సన్‌రైజర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్👉టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్.. మొదట బ్యాటింగ్👉పంజాబ్ కింగ్స్ స్కోరు: 245/6 (20)👉హైదరాబాద్ స్కోరు: 247/2 (18.3)👉ఫలితం: పంజాబ్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ గెలుపుచదవండి: అతడి బ్యాటింగ్‌కు వీరాభిమానిని.. వాళ్లంతా అద్భుతం: కమిన్స్Mother's blessings ✨Hyderabad's joy 😇Abhishek Sharma's whirlwind night to remember 🧡Describe his knock in one word ✍️#TATAIPL | #SRHvPBKS | @SunRisers | @IamAbhiSharma4 pic.twitter.com/yJwBK5bAiD— IndianPremierLeague (@IPL) April 12, 2025 -
నేను కెప్టెన్‌ని!.. ముందు నన్ను అడగాలి కదా: మండిపడ్డ శ్రేయస్
ఐపీఎల్-2025 (IPL 2025)లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌కు చేదు అనుభవమే మిగిలింది. ధనాధన్ బ్యాటింగ్‌తో దంచికొట్టినా.. ఆతిథ్య జట్టు ఓపెనింగ్ జోడీ ‘ట్రావిషేక్’ (Travis Head- Abhishek Sharma) చెలరేగడంతో శ్రేయస్ అయ్యర్ సేనకు పరాజయం తప్పలేదు. ఈ విధ్వంసకర బ్యాటర్లను కట్టడి చేసేందుకు పంజాబ్ బౌలర్లు ఎంతగా ప్రయత్నించినా సఫలం కాలేకపోయారు.భావోద్వేగాల డోలికల్లోఫలితంగా రైజర్స్ చేతిలో పంజాబ్ ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఇక ఈ మ్యాచ్ సందర్భంగా పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు భావోద్వేగాల డోలికల్లో తేలిపోయారు. ముఖ్యంగా విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer- 36 బంతుల్లో 82) ముఖం సంతోషంతో వెలిగిపోయింది.ఇక లోయర్ ఆర్డర్లో మార్కస్ స్టొయినిస్ (11 బంతుల్లో 34 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడి.. స్కోరును 230 దాటించిన వేళ పంజాబ్ శిబిరంలో నవ్వులు పూశాయి. అయితే, ఈ సంతోషం ఎక్కువ సేపు నిలవలేదు.Timber Strike and Outfoxed ⚡️Harshal Patel with a 4⃣-fer to provide calm amidst chaos 🧡Updates ▶ https://t.co/RTe7RlXDRq #TATAIPL | #SRHvPBKS | @HarshalPatel23 pic.twitter.com/pnLsDo8sJL— IndianPremierLeague (@IPL) April 12, 2025 ఆకాశమే హద్దుగాపంజాబ్ విధించిన 246 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సన్‌రైజర్స్ ఓపెనర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. పంజాబ్ ఫీల్డర్ల తప్పిదాలను క్యాష్ చేసుకుని మరో తొమ్మిది బంతులు మిగిలి ఉండగానే జట్టును గెలుపుతీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించారు.ట్రవిస్ హెడ్ 37 బంతుల్లో 66 పరుగులతో దుమ్ములేపగా.. అభిషేక్ శర్మ 55 బంతుల్లో ఏకంగా 14 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో ఏకంగా 141 పరుగులతో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖర్లో హెన్రిచ్ క్లాసెన్ (14 బంతుల్లో 21*), ఇషాన్ కిషన్ (6 బంతుల్లో 9*) కలిసి రైజర్స్ గెలుపును ఖరారు చేశారు. దీంతో పంజాబ్ ఆటగాళ్ల ముఖాలు వెలిసిపోయాయి.ముందు నన్ను అడగాలి కదా!ఇక ఈ మ్యాచ్ సందర్భంగా బౌలర్ల వైఫల్యం, ఫీల్డర్ల తప్పిదాల కారణంగా పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కోపం నషాళానికి అంటింది. ముఖ్యంగా గ్లెన్ మాక్స్వెల్, అంపైర్ చేసిన పనితో అతడు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో ఐదో ఓవర్‌ను స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ మాక్సీ వేశాడు.అయితే, ఆ ఓవర్లో లెగ్ సైడ్ దిశగా సంధించిన ఫ్లాటర్ డెలివరీ (రెండో బంతి) అంపైర్ వైడ్‌గా ప్రకటించడం మాక్సీకి రుచించలేదు. దీంతో అతడు రివ్యూ (డీఆర్ఎస్) తీసుకోవాలనే ఉద్దేశంతో ‘T’ సంజ్ఞ చూపించాడు. అంపైర్ అందుకు అంగీకరించగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు కోపం వచ్చింది.సాధారణంగా ఫీల్డింగ్ టీమ్ రివ్యూ విషయంలో ఆన్ ఫీల్డ్ అంపైర్ కెప్టెన్ నిర్ణయం తర్వాతే స్పందిస్తాడు. కానీ ఇక్కడ అలా జరుగలేదు. దీంతో కోపోద్రిక్తుడైన శ్రేయస్ అయ్యర్.. ‘‘అంపైర్.. ముందు నన్ను అడగాలి కదా.. నన్ను.. నన్ను అడగాలి కదా!’’ అంటూ తనవైపు వేలు చూపిస్తూ అసంతృప్తి వెళ్లగక్కాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఐపీఎల్-2025: హైదరాబాద్ వర్సెస్ పంజాబ్👉వేదిక: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం, ఉప్పల్, హైదరాబాద్👉టాస్: పంజాబ్.. తొలుత బ్యాటింగ్👉పంజాబ్ స్కోరు: 245/6 (20)👉హైదరాబాద్ స్కోరు: 247/2 (18.3)👉ఫలితం: ఎనిమిది వికెట్ల తేడాతో హైదరాబాద్ చేతిలో పంజాబ్ చిత్తు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: అభిషేక్ శర్మ.చదవండి: అతడి బ్యాటింగ్‌కు వీరాభిమానిని.. వాళ్లంతా అద్భుతం: కమిన్స్నాకైతే నవ్వొస్తోంది.. అభిషేక్ లక్కీ.. అతడుంటే వికెట్లు తీసేవాడు: శ్రేయస్ Shreyash iyer i am the captain momentIn SRH vs PBKS high scoring matchGlenn Maxwell asked for review and umpire took itThen shreyash iyer came and said i am the captain ask me i will take review #SRHvsPBKSpic.twitter.com/bADvhNrLQw— Viraj Rk17 (@VirajRk17) April 12, 2025 -
నాకైతే నవ్వొస్తోంది.. అభిషేక్ లక్కీ.. అతడుంటే వికెట్లు తీసేవాడు: శ్రేయస్
ఐపీఎల్-2025 (IPL 2025)లో పంజాబ్ కింగ్స్ జైత్రయాత్రకు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) అడ్డుకట్ట వేసింది. భారీ స్కోరు సాధించినా.. పంజాబ్‌కు ఆ సంతోషాన్ని మిగలనివ్వలేదు. ఆడుతూ పాడుతూ.. లక్ష్యాన్ని ఛేదించి శ్రేయస్ అయ్యర్ సేనకు ఊహించని షాకిచ్చింది. విధ్వంసకర బ్యాటింగ్‌లో తమకు తిరుగులేదని మరోసారి చాటుకుని.. పంజాబ్‌ను ఏకంగా ఎనిమిది వికెట్లతో రైజర్స్ చిత్తు చేసింది.ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ‘‘నిజం చెప్పాలంటే మేము అద్బుతంగా బ్యాటింగ్ చేసి భారీ స్కోరు సాధించాము. కానీ వాళ్లు.. మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే దానిని ఛేదించేశారు.నాకైతే నవ్వొస్తోంది.. అభిషేక్ లక్కీ..ఇదెలా సాధ్యమైందో!.. నాకైతో నవ్వు వస్తోంది. మేము కొన్ని క్యాచ్‌లు మిస్ చేశాం. అభిషేక్ అదృష్టవంతుడు. అసాధారణ ఆటగాడు. మేము అంచనాలకు తగ్గట్లుగా బౌలింగ్ చేయలేకపోయాం. పొరపాట్లను సమీక్షించుకోవాలి.ఏదేమైనా అభిషేక్- ట్రవిస్ హెడ్ మధ్య ఓపెనింగ్ భాగస్వామ్యం అద్భుతం అనే చెప్పాలి. మాకు పుంజుకునే అవకాశమే ఇవ్వలేదు. ఫెర్గూసన్ వరుస విరామాల్లో వికెట్లు తీసేవాడు. కానీ.. అతడు గాయపడ్డాడు.అత్యుత్తమ ఇన్నింగ్స్‌లో ఒకటిఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగుతాం. నేను, వధేరా 230.. మంచి స్కోరు అనుకున్నాం. కానీ రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం చూపింది. ఇక సన్‌రైజర్స్ ఓపెనర్లు బ్యాటింగ్ చేసిన తీరును మాటల్లో వర్ణించలేము. ముఖ్యంగా అభిషేక్ శర్మ.. నేను ఇంత వరకు చూసిన అత్యుత్తమ ఇన్నింగ్స్‌లో ఒకటి ఇది’’ అని శ్రేయస్ అయ్యర్ ప్రత్యర్థి జట్టు ఓపెనర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు.కాగా ఉప్పల్‌లో శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ సన్‌రైజర్స్‌తో తలపడింది. టాస్ గెలిచిన శ్రేయస్ అయ్యర్.. ఆతిథ్య జట్టును తొలుత బౌలింగ్‌కు ఆహ్వానించాడు. ఇక బ్యాటింగ్ అనుకూలించిన పిచ్‌పై పంజాబ్ బ్యాటర్లు దంచికొట్టారు.శ్రేయస్ అయ్యర్ ధనాధన్ఓపెనర్లలో ప్రియాన్ష్ ఆర్య (13 బంతుల్లో 36) మెరుపు వేగంతో ఆడగా.. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (23 బంతుల్లో 42) రాణించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ భారీ అర్ధ శతకం (36 బంతుల్లో 82) దుమ్ములేపగా.. ఆఖర్లో మార్కస్ స్టొయినిస్ (11 బంతుల్లో 34 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. ఫలితంగా పంజాబ్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది.‘ట్రావిషేక్’ జోడీ బీస్ట్ మోడ్ఇక లక్ష్య ఛేదనను సన్‌రైజర్స్ 18.3 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి పూర్తి చేసింది. చాన్నాళ్ల తర్వాత రైజర్స్ ఓపెనింగ్ ‘ట్రావిషేక్’ జోడీ బీస్ట్ మోడ్‌లో బ్యాటింగ్ చేసింది. ట్రవిస్ హెడ్ (37 బంతుల్లో 66) అర్ధ శతకంతో ఆకట్టుకోగా.. అభిషేక్ శర్మ (55 బంతుల్లో 141) భారీ సెంచరీతో మెరిసి.. రైజర్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. వీరుడికి అదృష్టం కూడా కలిసి వచ్చిందిఅయితే, అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత.. రైజర్స్ ఇన్నింగ్స్‌లో ఎనిమిదో ఓవర్ చహల్ వేశాడు. అతడి బౌలింగ్‌లో అభి ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను చహల్ మిస్ చేశాడు. అంతకంటే ముందు అంటే మూడో ఓవర్లో అభి రనౌట్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. తర్వాత(3.4 ఓవర్) నోబాల్ ద్వారా లైఫ్ పొందాడు. ఆ తర్వాత.. అంటే 12.4 వద్ద అభి శతకం పూర్తి చేసుకుని ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ (40 బంతుల్లో) నమోదు చేసిన బ్యాటర్ల జాబితాలో చేరాడు. మరోవైపు.. పంజాబ్ బౌలర్ ఫెర్గూసన్ రెండు బంతులు వేసిన తర్వాత గాయంతో మైదానం వీడాడు.చదవండి: అతడి బ్యాటింగ్‌కు వీరాభిమానిని.. వాళ్లంతా అద్భుతం: కమిన్స్ FORTUNE FAVOURS THE BRAVE, INDEED! 🙌#AbhishekSharma, what an innings 💪#IPLonJioStar 👉 #SRHvPBKS | LIVE NOW on Star Sports Network & JioHotstar! pic.twitter.com/x4FqzXsiWI— Star Sports (@StarSportsIndia) April 12, 2025WHAT. A. MOMENT. 🙌100 reasons to celebrate #AbhishekSharma's knock tonight! PS. Don't miss his special message for #OrangeArmy 🧡Watch the LIVE action ➡ https://t.co/HQTYFKNoGR#IPLonJioStar 👉 #SRHvPBKS | LIVE NOW on Star Sports Network & JioHotstar! pic.twitter.com/DECkzxRYhi— Star Sports (@StarSportsIndia) April 12, 20254, 6, CAUGHT but NO-BALL, 6 on Free-hit! 🔥Stop watch you're doing because it's all happening in Hyderabad 🥶Watch the LIVE action ➡ https://t.co/HQTYFKNoGR#IPLonJioStar 👉 #SRHvPBKS | LIVE NOW on Star Sports Network & JioHotstar! pic.twitter.com/vAEZNA65wD— Star Sports (@StarSportsIndia) April 12, 2025 -
మైదానంలోనే మాక్సీ, స్టొయినిస్‌తో గొడవ.. స్పందించిన ట్రవిస్ హెడ్
ఐపీఎల్-2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్- పంజాబ్ కింగ్స్ (SRH vs PBKS) మధ్య శనివారం నాటి మ్యాచ్ ఆద్యంత ఆసక్తికరంగా సాగింది. ఇరుజట్లు ఉప్పల్ మైదానంలో పరుగుల వరద పారిస్తూ.. టీ20 ప్రేమికులకు అసలైన మజా అందించాయి. అయితే, విధ్వంసకర బ్యాటింగ్‌కు పెట్టింది పేరైన సన్‌రైజర్స్ సొంతగడ్డపై పంజాబ్‌పై పైచేయి సాధించి విజయంతో ఈ హోరాహోరీ పోరును ముగించింది.ఇక ఈ మ్యాచ్ సందర్భంగా ఆస్ట్రేలియా స్టార్లు, పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు గ్లెన్ మాక్స్వెల్ (Glenn Maxwell), మార్కస్ స్టొయినిస్ (Marcus Stoinis).. సహచర ఆటగాడు, సన్‌రైజర్స్ ఓపెనర్ అయిన ట్రవిస్ హెడ్ మధ్య వాగ్వాదం జరిగింది. పంజాబ్ విధించిన 246 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సన్‌రైజర్స్ ఓపెనర్లు హెడ్, అభిషేక్ శర్మ ఆది నుంచే దూకుడుగా ఆడారు.మాక్సీ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లుఈ క్రమంలో తొమ్మిదో ఓవర్లో పంజాబ్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ బంతితో రంగంలోకి దిగాడు. అతడి బౌలింగ్‌లో మొదటి బంతిని ఎదుర్కొన్న హెడ్ ఒక పరుగు తీయగా.. మరో బంతికి అభి కూడా సింగిల్‌తో సరిపెట్టుకున్నాడు.అయితే, ఆ తర్వాత హెడ్ గేరు మార్చాడు. మాక్సీ వేసిన మూడో బంతిని 78 మీటర్ల సిక్సర్‌గా మలిచిన ఈ కంగారూ బ్యాటర్.. మరుసటి బంతిని మరోసారి మిడ్ వికెట్‌గా తరలించి.. 84 మీటర్ల మేర భారీ సిక్సర్ నమోదు చేశాడు. దీంతో మాక్సీ విసుగెత్తిన మాక్సీ హెడ్‌ను చూస్తూ ఏదో అన్నాడు. ఆ తర్వాత రెండు బంతులను డాట్ చేశాడు.MAXIMUMS 🆚 Maxwell 👀Travis Head completes a blistering half-century 💥Updates ▶ https://t.co/RTe7RlXDRq#TATAIPL | #SRHvPBKS | @travishead34 pic.twitter.com/PuUmUbj1On— IndianPremierLeague (@IPL) April 12, 2025మాక్సీ, స్టొయినిస్‌తో గొడవ.. స్పందించిన ట్రవిస్ హెడ్ఈ క్రమంలో ఓవర్ ముగిసిన అనంతరం మాక్స్‌వెల్‌కు హెడ్ కూడా గట్టిగానే బదులిచ్చాడు. ఇద్దరూ కలిసి వాగ్వాదానికి దిగగా.. అంపైర్ వారిని నవ్వుతూనే సున్నితంగా మందలించాడు. ఇంతలో స్టొయినిస్ కూడా మధ్యలోకి వచ్చాడు. హెడ్‌తో అతడూ కాసేపు వాదించి వెళ్లిపోయాడు.ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ కాగా.. ‘‘ఆస్ట్రేలియా ఆటగాళ్లు... ఇప్పుడు తమ సహచర ప్లేయర్‌నే స్లెడ్జింగ్ చేసేంతగా ఎదిగిపోయారు’’ అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాక్సీ- స్టొయినిస్‌తో ‘గొడవ’పై ట్రవిస్ హెడ్ స్పందించాడు.బెస్ట్, వరస్ట్ అంటూ..పంజాబ్‌పై సన్‌రైజర్స్ విజయానంతరం మాట్లాడుతూ.. ‘‘మన గురించి బాగా తెలిసిన వాళ్లే.. మనలోని అధమస్థాయి, అత్యుత్తమ వ్యక్తిత్వాన్ని బయటకు తీయగలరు కదా!.. మా మధ్య వాగ్వాదం అంత తీవ్రమైనది కాదు.. ఏదో సరదాగా అలా టీజ్ చేసుకున్నాం అంతే’’ అని ట్రవిస్ హెడ్.. సహచర ఆటగాళ్లతో తనకున్న అనుబంధం గురించి చెప్పాడు. కాగా ట్రవిస్ హెడ్, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టొయినిస్ అంతర్జాతీయ స్థాయిలో ఆస్ట్రేలియా తరఫున అగ్రశ్రేణి ఆటగాళ్లుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.కాగా పంజాబ్‌తో మ్యాచ్‌లో ట్రవిస్ హెడ్ 37 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 66 పరుగులు సాధించాడు. యజువేంద్ర చహల్ బౌలింగ్‌లో మాక్స్‌వెల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మరోవైపు అభిషేక్ శర్మ విధ్వంసకర శతకం (55 బంతుల్లో 141)తో విరుచుకుపడి సన్‌రైజర్స్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు.ఐపీఎల్-2025: హైదరాబాద్ వర్సెస్ పంజాబ్👉పంజాబ్ స్కోరు: 245/6 (20)👉హైదరాబాద్ స్కోరు: 247/2 (18.3)👉ఫలితం: ఎనిమిది వికెట్ల తేడాతో హైదరాబాద్ చేతిలో పంజాబ్ చిత్తు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: అభిషేక్ శర్మ.చదవండి: అతడి బ్యాటింగ్‌కు వీరాభిమానిని.. వాళ్లంతా అద్భుతం: కమిన్స్ఎగిరి గంతులేసిన కావ్యా మారన్.. అభిషేక్ తల్లిని హగ్ చేసుకుని మరీ! వీడియో Fight between Travis Head, Maxwell & Stoinis in IPL.IPL on peak#SRHvsPBKS pic.twitter.com/LaiRMAExIC— Hindutva Knight (@KinghtHindutva) April 12, 2025 -
అతడి బ్యాటింగ్‌కు వీరాభిమానిని.. వాళ్లంతా అద్భుతం: కమిన్స్
వరుస పరాజయాల తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఎట్టకేలకు గెలుపు బాట పట్టింది. సొంత మైదానంలో పంజాబ్ కింగ్స్ (PBKS)ను చిత్తు చేసి.. ఆరెంజ్ ఆర్మీని సంతోషపెట్టింది. ఉప్పల్‌లో పరుగుల వరద పారించి మరోసారి తమదైన దూకుడుతో జయభేరి మోగించింది. ఈ నేపథ్యంలో విజయానంతరం రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins) సంతోషం వ్యక్తం చేశాడు.అభిషేక్ శర్మ బ్యాటింగ్‌కు వీరాభిమానిని‘‘నిజంగా ఇదొక అద్బుత విజయం. మా శైలిలో దూకుడుగా ఆడి గెలిచాం. ఈ వికెట్ చాలా చాలా బాగుంది. ఇక్కడ బౌలర్ ఓ ఓవర్లో పది పరుగుల కంటే తక్కువ రన్స్ ఇచ్చాడంటే అదే గొప్ప. అందుకే మేము పంజాబ్ విధించిన లక్ష్యాన్ని సులువుగానే ఛేదించగలమనే ఆత్మవిశ్వాసం కలిగింది.నేను అభిషేక్ శర్మ బ్యాటింగ్‌కు వీరాభిమానిని. ఏదేమైనా మేము బ్యాటింగ్ శైలిని మార్చుకునేందుకు సిద్ధంగా లేము. గతేడాది మా వాళ్లు ఎలా ఆడారో అందరికీ తెలుసు. ఈసారి కూడా అదే శైలిని కొనసాగిస్తాం. మా బ్యాటర్ల నైపుణ్యాలపై మాకు నమ్మకం ఉంది.వాళ్లు అద్భుతమైన వాళ్లుఇక ఆరెంజ్ ఆర్మీ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది?!... వాళ్లు అద్భుతమైన వాళ్లు.. మా కోసం సన్‌రైజర్స్ జెండాలు రెపరెపలాడిస్తూ.. చుట్టూ అందమైన, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తారు’’ అంటూ ప్యాట్ కమిన్స్ తన ఆనందాన్ని పంచుకున్నాడు.వరుసగా నాలుగు ఓడికాగా ఐపీఎల్-2025లో తొలుత ఉప్పల్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్ ఆడిన కమిన్స్ బృందం.. ఘన విజయంతో సీజన్‌ను మొదలుపెట్టింది. కానీ ఆ తర్వాత వరుసగా లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమి పాలైంది.విధ్వంసకర బ్యాటింగ్‌తో విజయాల బాట ఈ నేపథ్యంలో అగ్రెసివ్‌గా బ్యాటింగ్ చేసే సన్‌రైజర్స్ శైలిపై విమర్శలు వెల్లువెత్తగా కెప్టెన్ కమిన్స్‌తో పాటు.. హెడ్‌కోచ్ డానియల్ వెటోరీ కూడా తమ విధానం మారదని స్పష్టం చేశారు. అందుకు తగ్గట్టుగానే శనివారం నాటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ విధ్వంసకర బ్యాటింగ్‌తో తిరిగి విజయాల బాట పట్టింది.ఉప్పల్‌లో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బ్యాటింగ్ చేసింది. రైజర్స్ స్టైల్లోనే ఆడిన అయ్యర్ సేన నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 245 పరుగులు సాధించింది. ప్రియాన్ష్ ఆర్య (13 బంతుల్లో 36), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (23 బంతుల్లో 42).. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (36 బంతుల్లో 82) ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఆఖర్లో మార్కస్ స్టొయినిస్ (11 బంతుల్లో 34 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.అభిషేక్ విశ్వరూపంసన్రైజర్స్ బౌలర్లలో హర్షల్ పటేల్ నాలుగు వికెట్లు తీయగా.. ఇషాన్ మలింగ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. ఇక భారీ లక్ష్య ఛేదనలో రైజర్స్ ఏమాత్రం తడబడలేదు. సొంత మైదానంలో ట్రవిస్ హెడ్ (37 బంతుల్లో 66) బ్యాట్ ఝులిపించగా.. అభిషేక్ శర్మ (55 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్సర్లతో 141) న భూతో న భవిష్యత్ అన్నట్లుగా భారీ శతకం బాదాడు. హెన్రిచ్ క్లాసెన్ (14 బంతుల్లో 21 నాటౌట్), ఇషాన్ కిషన్ (6 బంతుల్లో 9 నాటౌట్) పని పూర్తి చేశారు. 18.3 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయిన రైజర్స్.. పంజాబ్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసింది. చదవండి: ఎగిరి గంతులేసిన కావ్యా మారన్.. అభిషేక్ తల్లిని హగ్ చేసుకుని మరీ! వీడియో 𝘼 𝙣𝙤𝙩𝙚-𝙬𝙤𝙧𝙩𝙝𝙮 𝙏𝙊𝙉 💯A stunning maiden #TATAIPL century from Abhishek Sharma keeps #SRH on 🔝 in this chase 💪Updates ▶ https://t.co/RTe7RlXDRq#TATAIPL | #SRHvPBKS | @SunRisers pic.twitter.com/ANgdm1n86w— IndianPremierLeague (@IPL) April 12, 2025 -
ఎగిరి గంతులేసిన కావ్యా.. అభిషేక్ తల్లిని హగ్ చేసుకుని మరీ! వీడియో
అభిషేక్ శర్మ... వరుస వైఫల్యాలకు చెక్ పెడుతూ అభిమానులను ఉర్రూతలూగించాడు.. ఉప్పల్‌లో బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ పరుగుల దాహం తీర్చుకున్నాడు.. నలభై బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్న ఈ ఓపెనింగ్ బ్యాటర్.. ‘‘ఇది ఆరెంజ్ ఆర్మీ కోసం’’ అంటూ రాసిన పేపర్ చూపిస్తూ ఫ్యాన్స్ సంతోషం కోసం తాము ఎంతగా శ్రమిస్తున్నామో శతకనాదంతో చాటిచెప్పాడు.పంజాబ్ కింగ్స్‌తో శనివారం నాటి మ్యాచ్ సందర్భంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ అభిషేక్ తన చేతికే బ్యాట్ మొలిచిందా అన్నట్లు అలవోకగా అలా షాట్లు బాదుతూ.. ప్రేక్షకులకు పైసా వసూల్ ప్రదర్శన ఇచ్చాడు. అతడలా ఫోర్లు, సిక్స్‌లు కొడుతుంటే పంజాబ్ బ్యాటర్లు అలా చూస్తూ ఉండిపోయారే తప్ప అతడి దూకుడుకు కళ్లెం వేయలేకపోయారు.ఈ క్రమంలో మొత్తంగా 55 బంతులు ఎదుర్కొన్న అభిషేక్ శర్మ 141 పరుగులతో దుమ్ములేపాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏకంగా పద్నాలుగు ఫోర్లు, పది సిక్సర్లు ఉండటం విశేషం. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో ప్రవీణ్ దూబేకు క్యాచ్ ఇవ్వడంతో అభి తుఫాన్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. అయితే, క్రీజులో ఉన్నంత సేపు చక్కటి షాట్లతో అలరించిన అభిషేక్‌ను చూస్తూ అభిమానులు మురిసిపోయారు.ఎగిరి గంతులేస్తూ.. అభిషేక్ ల్లి ఆలింగనం చేసుకునిఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు యజమాని కావ్యా మారన్ ఆనందానికైతే అవధుల్లేకుండా పోయాయి. అభి సెంచరీ పూర్తి చేసుకోగానే ఆమె సంబరాలు అంబరాన్నంటాయి. సీట్లో నుంచి లేచి ఎగిరి గంతులేస్తూ కావ్య.. కరతాళధ్వనులతో అభిని అభినందించింది. పక్కనే ఉన్న రైజర్స్ మద్దతుదారులతో కరచాలం చేసిన కావ్య.. అభిషేక్ ల్లి ఆలింగనం చేసుకుని సంతోషాన్ని పంచుకుంది. 𝘼 𝙣𝙤𝙩𝙚-𝙬𝙤𝙧𝙩𝙝𝙮 𝙏𝙊𝙉 💯A stunning maiden #TATAIPL century from Abhishek Sharma keeps #SRH on 🔝 in this chase 💪Updates ▶ https://t.co/RTe7RlXDRq#TATAIPL | #SRHvPBKS | @SunRisers pic.twitter.com/ANgdm1n86w— IndianPremierLeague (@IPL) April 12, 2025ఎన్నాళ్లకెన్నాళ్లకు..ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇది చూసిన నెటిజన్లు.. ‘‘ఎన్నాళ్లకెన్నాళ్లకు.. కావ్యా కళ్లలో ఆనందం.. ఈరోజు అభిషేక్ శర్మదే.. సన్‌రైజర్స్‌ది... ఆరెంజ్ ఆర్మీకి కన్నుల విందు అందించారు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఐపీఎల్-2025లో తమ ఆరంభ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌పై గెలిచిన సన్‌రైజర్స్ .. ఆ తర్వాత వరుసగా నాలుగు ఓటములు చవిచూసింది.ఈ క్రమంలో శుక్రవారం పంజాబ్ కింగ్స్‌తో తలపడ్డ ప్యాట్ కమిన్స్ బృందం తమదైన శైలిలో కమ్‌బ్యాక్ ఇచ్చింది. సొంత మైదానం ఉప్పల్‌లో టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన రైజర్స్.. బౌలర్లు పెద్దగా రాణించకపోవడంతో భారీగానే పరుగులు ఇచ్చుకుంది.పంజాబ్ ఫటాఫట్పంజాబ్ బ్యాటర్లలో ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (13 బంతుల్లో 36), ప్రభ్‌సిమ్రన్‌సింగ్ (23 బంతుల్లో 42) దంచికొట్టగా.. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్ (36 బంతుల్లో 82)తో చెలరేగాడు. మిగతా వాళ్లలో నేహల్ వధేరా (27), మార్కస్ స్టొయినిస్ (11 బంతుల్లో 34 నాటౌట్) రాణించారు.రైజర్స్ రైట్ రైట్ఇక లక్ష్య ఛేదనను దూకుడుగా ఆరంభించిన సన్‌రైజర్స్ 18.3 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసింది. ఓపెనర్లలో ట్రవిస్ హెడ్ (37 బంతుల్లో 66) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడగా.. అభిషేక్ శర్మ (55 బంతుల్లో 141) విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. హెన్రిచ్ క్లాసెన్ (14 బంతుల్లో 21), ఇషాన్ కిషన్ (6 బంతుల్లో 9) కలిసి జట్టు విజయాన్ని ఖరారు చేశారు.చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. తొలి క్రికెటర్