
రాష్ట్రంలో 175 నియోజకవర్గాలకు రిటర్నింగ్ అధికారులను నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులిచ్చారు.
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 175 నియోజకవర్గాలకు రిటర్నింగ్ అధికారులను నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులిచ్చారు. నియోజకవర్గంలోని ఆర్‌డీవో, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, మునిసిపల్ కమిషనర్, ప్రాజెక్ట్ డైరెక్టర్లలో ఒకరిని రిటర్నింగ్ ఆఫీసర్లుగా నియమించారు.
వీరినే నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లుగా నియమించారు. మండలాలకు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లుగా, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లుగా తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్, మునిసిపల్ కమిషనర్లలో ఒకరిని నియమిస్తూ మరో ఉత్తర్వు జారీ చేశారు.
చదవండి: మేం చెప్పిందే చట్టం!.. అధికారులను బెదిరించిన ‘నారాయణ’