
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు.
సాక్షి, అమరావతి: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. కేటీఆర్‌కు ఫోన్ చేసి.. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని సీఎం జగన్ అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షించారు.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గజ్వేల్ సమీపంలోని ఫామ్‌హౌస్‌లో శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదానికి గురయ్యారు. బాత్రూమ్‌లో కాలుజారి పడిపోయారు. ఎడమ తుంటిలో ఫ్యాక్చర్ అయినట్లు వైద్యులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం.. యశోద ఆసుపత్రిలో ఆయనకు సర్జరీ నిర్వహించారు.
ఇదీ చదవండి: వాలంటీర్ల ద్వారా రూ.2500 సాయం : సీఎం జగన్