
సాక్షి, విజయనగరం: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం విజయనగరం జిల్లా గుర్లలో పర్యటించారు. అక్కడ డయేరియా సోకి మృతి చెందిన వారి కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులను ఓదార్చి, ధైర్యం చెప్పారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
అయితే వైఎస్ జగన్ గుర్ల పర్యటనలో భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. వైఎస్ జగన్‌ను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరాగా.. వారిని అదుపు చేయడంలో పోలీసులు చేతులెత్తేశారు. జనాల తోపులాటలో షామియానాలు చిరిగిపోయాయి.
జనాల తోపులాటతో వైఎస్ జగన్ మీడియా సమావేశానికి కొంత సేపు అంతరాయం ఏర్పడించింది. దీంతో పోలీసులు వైపల్యంపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చిన జనాలను పోలీసులు కంట్రోల్ చేయలేకపోతే ఎలా అని మండిపడ్డారు. పోలీసుల నుంచి సహకారం లేదని విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడు మీడియాతో మాట్లాడుతుంటే.. కనీసం భద్రత కల్పించపోతే పోలీసులు ఎలా పనిచేస్తుస్తున్నారని ప్రశ్నించారు.
చదవండి: కుటుంబ వ్యవహారాలను రాజకీయం చేస్తారా?: వైఎస్ జగన్