
సాక్షి, విజయనగరం జిల్లా: పూసపాటిరేగ మండలం చల్లవానితోట పంచాయతీ నడుపూర్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి కోసం తల్లిదండ్రులనే కన్న కొడుకు హత్య చేశాడు. తల్లిదండ్రులను కన్నకొడుకు ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపేశాడు. అక్కడిక్కడే తండ్రి అప్పలనాయుడు (60), తల్లి జయమ్మ (58) మృతి చెందాడు. కుమారుడు పాండ్రంగి రాజాశేఖర్ (25) పరారీలో ఉన్నాడు.
ఆస్తి తగాదా నేపథ్యంలోనే దాడి చేసినట్టు బంధువులు అంటున్నారు. తల్లిదండ్రులు ఆస్తిలో చెల్లికి వాటా ఇవ్వడంతో రాజశేఖర్ అనే వ్యక్తి వారిపై కక్ష పెంచుకున్నాడు. కొంతకాలంగా ఈ వివాదం నడుస్తోంది. కుమార్తెకు ఇచ్చిన భూమిని చదును చేస్తుండగా తనను అడ్డుకోవడంతో తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగిన రాజశేఖర్.. అనంతరం వారిని ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపాడు. పూసపాటిరేగ మండలంలో జరిగిన అమానవీయ ఘటనతో మృతుల బంధువులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.