
విజయనగరం, సాక్షి: జిల్లాలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో దారుణం చోటు చేసుకుంది. కాలేజ్ ప్రాంగణంలో ఓ విద్యార్థిని ఫోన్ మాట్లాడుతుండగా.. ఓ మహిళా లెక్చరర్ అడ్డుకుని ఫోన్ లాక్కుంది. ఈ క్రమంలో ఫోన్ ఇవ్వాలంటూ సదరు విద్యార్థిని లెక్చరర్‌ను దుర్భాషలాడింది. అందుకు లెక్చరర్ నిరాకరించడంతో విద్యార్థిని సదరు లెక్చరర్‌ను చెప్పుతో కొట్టింది. లెక్చరర్ సైతం ఆమెపై ప్రతిదాడి చేయగా.. తోటి విద్యార్థులు, ఓ వ్యక్తి అడ్డుపడ్డారు. ఈ ఘటనను అక్కడే ఉన్న మరో విద్యార్థిని వీడియో తీయగా.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోపై రఘు కాలేజ్ యాజమాన్యం స్పందించాల్సి ఉంది.
ఈ తరం పిల్లలు తమ గురువులకు ఇచ్చే గౌరవం ఇది...👆
తప్పు పిల్లలది కాదు, తల్లిదండ్రులది, టీచర్లది. పిల్లలకు ఫోన్లు కొనివ్వడం, వాళ్ళ గౌరవం కోసం లక్షల రూపాయల ఫీజులు కట్టే తల్లిదండ్రులు, లక్షల రూపాయల ఫీజులు తీసుకోని అమ్ముడుపోయిన టీచర్లు గౌరవాన్ని ఆశించడం సరైందేనా? #ShameOnSociety pic.twitter.com/tSmxNdNeW7— ꜱʀɪʀᴀɴɢᴀᴍ ꜱᴀɢᴀʀ(ᴍᴏᴅɪ ᴋᴀ ᴘᴀʀɪᴠᴀʀ) (@SAGAR4TBJP) April 22, 2025
రఘు కళాశాలలో టీచర్ విద్యార్థిని మధ్య వాగ్యుద్ధం.. టీచర్ మీద చేయి చేసుకున్న విద్యార్థిని.#RaghuEngineeringCollege #Vizianagaram #Vizag #AndhraPradesh #UANow pic.twitter.com/APzPn1isCK
— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) April 22, 2025