అక్రమ కేసుల కుప్పం | TDP Chandrababu own constituency anarchic rule | Sakshi
Sakshi News home page

అక్రమ కేసుల కుప్పం

Published Mon, Jan 13 2025 5:48 AM | Last Updated on Mon, Jan 13 2025 5:48 AM

TDP Chandrababu own constituency anarchic rule

చంద్రబాబు సొంత నియోజకవర్గంలో అరాచక పాలన

కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచే టీడీపీ నేతల దౌర్జన్యాలు 

వైఎస్సార్‌సీపీ కేడర్‌పై అడ్డగోలుగా తప్పుడు కేసులు, వేధింపులు 

పథకాల గురించి ప్రశ్నించిన సామాన్యులపైనా కేసులు 

దళిత మహిళా సర్పంచిని గ్రామం నుంచి వెళ్లగొట్టిన టీడీపీ నేతలు 

ఆమె భర్తపై అక్రమంగా హత్యాయత్నం కేసు నమోదు 

మరో సర్పంచి పైనా అక్రమ కేసు 

ఇసుక వ్యాపారమే చేయని నేతపై ఇసుక అక్రమ రవాణా కేసు 

ఇలా అనేకానేక తప్పుడు కేసులతో అట్టుడుకుతున్న కుప్పం

శాంతిపురం: ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించే అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధి, శాంతితో వర్ధిల్లడం సహజం. అక్కడి ప్రజలు కూడా ఇదే కోరుకుంటారు. అక్కడి ప్రజలు అభివృద్ధి, సంక్షేమ ఫలాలను మెరుగ్గా అందుకోవాలని ఏ ముఖ్యమంత్రి అయినా ఆశిస్తారు. కానీ సీఎం చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో ఇందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. రాజకీయ వేధింపులు, కక్షలు, అక్రమ కేసులతో అట్టుడికిపోతోంది.

తప్పుడు కేసులను ఉపేక్షించేది లేదని చంద్రబాబు పైకి చెబుతున్నా, ఆయన సొంత నియోజకవర్గంలోనే అనేక అక్రమ కేసులు పెడుతున్నారు. విపక్ష నేతలు, కార్యకర్తలు, పథకాల గురించి అడిగిన సామాన్యులపై అక్రమ కేసులు, బైండోవర్‌ కేసులు, ఆంక్షలు, పోలీసుల వేధింపులు,  నిర్బంధాలు, పథకాల నిలిపివేత వంటి చర్యలు ఎదుర్కోవాల్సిందే. రాష్ట్రంలో అధికార మార్పు జరిగిన తొలిరోజు నుంచే కుప్పంలో ఆటవిక రాజ్యం సాగుతోంది. పోలీసులను అడ్డుపెట్టుకొని టీడీపీ నేతలు దౌర్జన్యకాండను సాగిస్తున్నారు. అందుకు ఉదాహరణలు కొన్ని.. 

ఊరి నుంచి తరిమేసి.. 
రాష్ట్రంలో చంద్రబాబు కూటమి అధికారంలోకి వ­చ్చిన వెంటనే రామకుప్పం మండలం 89 పెద్దూ­రు పంచాయతీ దళిత మహిళా సర్పంచి మల్లిక రా­జీనామా చేయాలంటూ ఆమె ఇంటిపై దాడిచే­సి­, సీసీ కెమెరాలను సైతం ధ్వంసం చేశారు. ఆమె కు­టుంబాన్ని గ్రామం నుంచి వెళ్లగొట్టారు. దీనిపై స్థా­నిక పోలీసులతో పాటు జిల్లా, రాష్ట్రస్థాయి అధికా­రులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయింది. ప్రాణ భయంతో ఆ కుటుంబం దూరప్రాంతానికి వెళ్లడంతో గ్రామంలో అందుబాటు­లో లేరని, మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశాల­కు రాలేదంటూ సర్పంచి చెక్‌ పవర్‌ను రద్దు చే­శా­రు. పైగా ఇసుక అక్రమ రవాణాపై టీడీపీలోని రెండు వర్గాలు ఘర్షణ పడగా, గాయపడిన వా­రి­తో మల్లిక భర్త గోవిందప్పపై తప్పుడు ఫిర్యాదు చే­యించి, ఆయనపై హత్యాయత్నం కేసు పెట్టారు. దీ­నిపై న్యాయం కోరుతూ బాధితులు మానవ హ­క్కుల కమిషన్, ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించారు.

పొలానికి మట్టి తోలారని
తమిళనాడు సరిహద్దుల్లోని ఓ ఎన్‌ కొత్తూరుకు చెందిన వైఎస్సార్‌సీపీ సర్పంచి దేవప్పనా­యుడు బంధువులు తమిళనా­డు భూభాగంలోని చెరువు నుంచి అదే రాష్ట్రంలోని వారి పొలాలకు మట్టి తోలుకున్నారు. అయితే గుడుపల్లె మండలం తలిఅగ్రహారంలోని ఆంధ్ర భూభాగం గుండా మట్టిని రవాణా చేశారంటూ దేవప్పనాయుడు, ఆయన బంధువులపై తప్పుడు కేసు పెట్టారు. తమిళనాడు అధికారుల నుంచి అన్ని అనుమతులు తీసుకుని, మట్టిని తరలిస్తున్నామని చెప్పినా పట్టించుకోలేదు. దేవప్పనాయుడు, ఆయన తమ్ముడు పొండప్పనాయుడును రోజంతా పోలీసు స్టేషన్‌లో కూర్చోపెట్టారు.

రెండు ట్రాక్టర్లను సీజ్‌ చేశారు. ఇలాంటి కేసులు, వేధింపులతో కుప్పంలో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, సామాన్యులను అధికార పక్షం నిత్యం వేధిస్తోంది. వైఎస్సార్‌సీపీ నాయకులు వారి అభిమాన నాయకుడైన వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి జన్మదిన వేడుకలను కూడా జరుపుకోనివ్వకుండా పలుచోట్ల పోలీసులను మోహరించారు. తమ పార్టీ వారిపై పదుల సంఖ్యలో అక్రమ కేసులు, బైండోవర్‌ కేసులు పెట్టారని వైఎస్పార్‌సీపీ నాయకులు చెబుతున్నారు. అయినా వైఎస్సార్‌సీపీ నాయకులు భయపడకుండా న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు.  

ఇసుక రవాణా కేసులో ఇరికించి 
నాయనపల్లికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ మాజీ డైరెక్టర్‌ కృష్ణమూర్తి పైనా తప్పుడు కేసు పెట్టి వేధింపలకు గురిచేస్తున్నారు. ఎప్పుడూ ఇసుక వ్యాపారం చేయని ఆయనపై కర్ణాటకకు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారంటూ ఓ తప్పుడు కేసు పెట్టారు. సొంతిల్లు కట్టుకొనేందుకు ఆయన బంధువులు చట్టబద్ధంగా పన్నులు చెల్లించి, బైరెడ్డిపల్లి స్టాక్‌ యార్డు నుంచి తెచ్చుకున్న ఇసుకను చూపి జైలుకు పంపారు. ఉదయం అదుపులోకి తీసుకుని, సాయంత్రం వీఆర్వో నుంచి ఫిర్యాదు రాయించుకుని, నిబంధనలు పాటించకుండా తనను అరెస్టు చేశారని కృష్ణమూర్తి చెప్పారు. పార్టీ మారాలని, లేదంటే ఊరు వదిలి వెళ్లిపోవాలని అధికారులు బెదిరించారని వాపోయారు. పైగా, సీజ్‌ చేసిన ఇసుకను కూడా అక్రమ మార్గంలో తరలించేశారని కృష్ణమూర్తి బంధువులు చెబుతున్నారు.

హామీలపై మాట్లాడితే బైండోవర్‌ కేసు
గుడుపల్లె మండలం బోయనపల్లికి చెందిన రవి కూటమి ప్ర­భుత్వం హామీలు అ­మలు చేయడంలేదని మీడి­యా ముందు ఆవేదన వ్యక్తం చేయడంతో ఓ రోజు ఆయన్ని పోలీసుల ఇంటి నుంచి పట్టుకెళ్లిపోయారు. ఆయనపై బైండోవర్‌ కే­సు పెట్టి, సొంత పూచీకత్తుపై వి­డుదల చేశారు. మళ్లీ ఇ­­లా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement