
సాక్షి, విజయవాడ: టీడీపీ తప్పుడు ప్రచారాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. మిస్డ్ కాల్ ఇస్తే టీడీపీ ప్రభుత్వం రాగానే పన్ను మినహాయింపులు అంటూ ప్రకటనలు ఇస్తోంది. ఇది పూర్తిగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే అని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యలయ ఇన్‌చార్జ్ లేళ్ల అప్పిరెడ్డి ఎన్నికల కమిషన్‌రకు ఫిర్యాదు చేశారు. ప్రజలను మభ్యపెడుతూ నిబంధనల ఉల్లంఘనకి పాల్పడిన టీడీపీ జాతీయ అధ్యక్షుడిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఎస్‌ఈసీ కోరారు.