
వేసవి సెలవులు వచ్చేశాయ్..
హాస్టళ్ల నుంచి ఇంటిబాట పట్టిన విద్యార్థులు
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు గురువారం నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో బుధవారం పాఠశాలల్లో తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు సమావేశాలు నిర్వహించి ప్రోగ్రెస్ కార్డులను ఇచ్చారు. వేసవి సెలవులు ఈనెల 24 నుంచి జూన్ 11 వరకు కొనసాగనున్నాయి. కాగా, సెలవులు రావడంతో హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ట్రంకుపెట్టెలు, లగేజీ బ్యాగులు సర్దుకుని ఇంటిబాట పట్టారు. పిల్లలను తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు రావడం, ఆయా ప్రాంతాల్లో ఆటోలు, ద్విచక్ర వాహనాలతో సందడి నెలకొంది. విద్యార్థులు పరస్పరం వీడ్కోలు చెప్పుకుంటూ ఇళ ్లకు బయలుదేరారు.
– కొత్తగూడెంఅర్బన్/పాల్వంచరూరల్/ములకలపల్లి

వేసవి సెలవులు వచ్చేశాయ్..