భూకంపం వస్తే ఏం చేయాలి?: చాట్‌జీపీటీ సమాధానం | ChatGPT Safety Guidelines During an Earthquake | Sakshi
Sakshi News home page

భూకంపం వస్తే ఏం చేయాలి?: చాట్‌జీపీటీ సమాధానం

Published Sat, Apr 19 2025 8:53 PM | Last Updated on Sat, Apr 19 2025 9:07 PM

ChatGPT Safety Guidelines During an Earthquake

చాట్‌జీపీటీ.. అందుబాటులోకి వచ్చిన తరువాత చాలామంది వివిధ రకాలుగా ఉపయోగించుకుంటున్నారు. ఏ ప్రశ్నకైనా తనదైన రీతిలో సమాధానాలు ఇస్తూ.. యూజర్లను అబ్బురపరుస్తున్న ఏఐ చాట్‌బాట్, ఇప్పుడు భకంపం వస్తే ఏం చేయాలి అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. ఇంతకీ ఎలాంటి సమాధానం ఇచ్చిందో.. ఈ కథనంలో చూసేద్దాం.

ఇంట్లో ఉన్నప్పుడు భూకంపం వస్తే..
➤భూకంపం వచ్చినప్పుడు మీరు ఇంట్లోనే ఉంటే.. మోకాళ్లపై వంగి కూర్చున్న విధంగా ఉండండి. ఈ భంగిమలో ఉంటే.. మీరు కిందకు పడిపోకుండా ఉంటారు.
➤తల, మెడ మాత్రమే కాకుండా.. వీలైనంత వరకు మీ శరీరాన్ని మొత్తం ఒక దృఢమైన టేబుల్ లేదా డెస్క్ కింద ఉండేలా చూసుకోండి. భూమి కంపించడం ఆగేవరకు అలాగే ఉండండి.
➤కిటికీలు, గోడలకు దూరంగా ఉండండి. భయంతో పరుగులు పెట్టడం మంచిది కాదు.
➤లిఫ్ట్ వంటి వాటిని ఉపయోగించవద్దు.

బయట ఉన్నపుడు భూకంపం వస్తే..
➤మీరు బయట ఉన్నప్పుడు భూకంపం వస్తే.. భవనాలు, యుటిలిటీ వైర్లు, సింక్ హోల్స్, ఫ్యూయెల్ స్టేషన్స్, గ్యాస్ లైన్స్ వంటి వాటికి దూరంగా ఉండండి.
➤చెట్లు, టెలిఫోన్ స్తంభాలకు దగ్గరగా ఉండటం మంచిది కాదు.
➤ఒకవేళా కారులో ప్రయాణిస్తుంటే.. వెంటనే ఒక సేఫ్ పార్కింగ్ ప్రదేశంలో కారును పార్క్ చేయండి.
➤బ్రిడ్జ్, ఫ్లైఓవర్స్, సొంరంగాలు వంటి వాటికి దూరంగా ఉండండి.
➤భూమి కంపించడం ఆగే వరకు.. పరుగులు పెట్టడం వంటివి చేయడం మంచిది కాదు.

ఇదీ చదవండి: ఎండలో కారు చల్లగా ఉండాలంటే: ఇదిగో టాప్ 5 టిప్స్..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement