ఇంజినీరింగ్ విద్యార్థిని హత్య | Engineering student murdered | Sakshi
Sakshi News home page

ఇంజినీరింగ్ విద్యార్థిని హత్య

Published Sat, Nov 18 2023 8:50 AM | Last Updated on Sat, Nov 18 2023 9:21 AM

Engineering student murdered - Sakshi

ప్రియుడి చేతిలో ఇంజినీరింగ్‌ విద్యార్థిని హతమైంది. ఈఘటన హాసన తాలూకా కుంతిగుడ్డ గ్రామంలో జరిగింది.

కర్ణాటక: ప్రియుడి చేతిలో ఇంజినీరింగ్‌ విద్యార్థిని హతమైంది. ఈఘటన హాసన తాలూకా కుంతిగుడ్డ గ్రామంలో జరిగింది. ఆలూరు తాలూకా కవళగెరె గ్రామానికి చెందిన సుచిత్ర(20), హాసన తాలూకా శంకరనహళ్లి గ్రామానికి చెందిన తేజస్‌లు హాసన మొసళెహోసళ్లి ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కాలేజీలో బీఈ మెకానికల్‌ కోర్సు చదువుతున్నారు. 

ఇద్దరూ కొంతకాలంగా పరస్పరం ప్రేమించుకున్నారు. ఇటీవల సుచిత్ర తేజస్‌ను దూరం పెట్టింది. తనవైపు నుంచి ఏవైనా తప్పులు ఉంటే చెప్పాలని, ఇద్దరూ కూర్చొని మాట్లాడుకుందామని నమ్మించి సుచిత్రను కుంతిగుడ్డ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ గొంతు నులిమి సుచిత్రను హత్య చేశాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement