
పథకం ప్రకారం ఫోన్ చేసి రప్పించి హతమార్చారు
కొమ్మాలు హత్య కేసులో దంపతుల అరెస్ట్
వివరాలు వెల్లడించిన పోలీసులు
మహబూబాబాద్: ఇంటి అవసరాల కోసం అప్పు ఇప్పించా డు. ఇది ఆసరా చేసుకుని అప్పు తీసుకున్న వ్యక్తి భార్యను శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఈ విషయం తెలిసిన భర్త పరువు పోయిందని భావించి భార్యను నిలదీశాడు. దీంతో తాము కలిసి ఉండాని నిర్ణయించుకుని లొంగదీసుకున్న వ్యక్తిని పథకం ప్రకారం భార్యాభర్తలు హత్యచేశారు. నల్లబెల్లి మండలం మూడు చెక్కలపల్లిలో ఈ నెల 12వ తేదీన జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. బుధవారం నర్సంపేటలోని దుగ్గొండి సీఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ సాయిరమణ.. ఎస్సై గోవర్ధన్‌తో కలిసి హత్య వివరా లు వెల్లడించారు.
ఐదేళ్ల క్రితం మూడుచెక్కలపల్లి గ్రామానికి చెందిన బానోత్ జంపయ్య 23 గుంటల వ్యవసాయ భూమి కొనుగోలు చేశాడు. ఇంటి ని ర్మాణ పనులు చేపట్టారు. ఈక్రమంలో బానోత్ కొమ్మాలు(40) మధ్యవర్తిగా ఉండి రెండుసార్లు రూ.1.50 లక్షలు జంపయ్యకు అప్పుగా ఇప్పించా డు. ఇది ఆసరా చేసుకుని జంపయ్య భార్య విజ యను కొమ్మాలు శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న జంపయ్య పెద్ద మనుషులను ఆశ్రయించగా కొమ్మాలుకు రూ.70 వేలు జరి మానా విధించారు. ఈ క్రమంలో కొమ్మాలు వ్యవహరశైలితో తన పరువు పోయిందని భావించిన జంపయ్య.. కొమ్మాలును చంపాలని అనుకున్నాడు.
కాగా, జంపయ్య తన భర్య విజయతో గొడవపడ్డాడు. కొమ్మాలును అయినా, నిన్ను అయినా చంపుతానని చెప్పాడు. దీంతో భయపడిన విజయ మనం కలిసే ఉందామని భర్తకు తెలిపింది. అనంతరం కొమ్మాలును హత్య చేయాలని ఇద్దరు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా కొమ్మాలు ఫోన్ చేసిన ప్రతీసారి అతడితో మాట్లాడడానికి వెళ్లమని జంపయ్య తన భార్య విజయకు చెప్పాడు. దీంతో విజయ పూర్తిగా కొమ్మాలును నమ్మించింది. ఈ క్రమలో పథకం ప్రకారం ఈ నెల 12న విజయ.. కొమ్మాలుకు ఫోన్ చేసి మాట్లాడాలి మొక్కజొన్న చేనువద్దకు రావాలని కోరింది. అనంతరం దంపతులు పథకం ప్రకారం కత్తులు తీసుకుని మొక్కజొన్న చేనులోకి వెళ్లారు. జంపయ్య ఎవరికీ కనిపించకుండా మొక్కజొన్న చేనులో కొంతదూరంగా ఉన్నాడు.
ఈ విషయం గమనించకుండా కొమ్మాలు మొక్కజొన్న చేనువద్దకు చేరుకున్నాడు. ఇదే అదునుగా భావించి జంపయ్య వెనుకవైపు నుంచి కొ మ్మాలును కత్తితో పలుమార్లు పొడిచాడు. అనంతరం దంపతులిద్దరు పరారయ్యారు. ఈ క్రమంలో రుద్రగూడెంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించడంతో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. కాగా, హత్య కేసు ఛేదనలో ప్రతిభకనబర్చిన ఎస్సై గోవర్ధన్, సిబ్బందిని సీఐ అభినందించారు.