
అనకాపల్లి జిల్లా: జిల్లాలోని దేవరాపల్లి రిసార్ట్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక నడింపల్లి సత్యనారాయణ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
మృతుడు విశాఖ సీతమ్మధారకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారిగా గుర్తించారు. గత కొంతకాలంగా కుటుంబ సభ్యులు దూరంగా ఉన్న సత్యనారాయణ.. బకాయిలు ఉన్న వారికి బకాయిలు తీర్చకపోవడం వలన ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్ లో వెల్లడించారు. తన ఆత్మహత్యకు సంబంధించి 12 పేజీల సూసైడ్ నోట్ రాసినట్లు తెలుస్తోంది.
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com