
మాదాపూర్ నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వినయ్ అనే విద్యార్థి తరగతి గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు.
సాక్షి, హైదరాబాద్: నారాయణ విద్యాసంస్థల్లో ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. మాదాపూర్ నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వినయ్ అనే విద్యార్థి తరగతి గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు.
శ్రీకాళహస్తికి చెందిన వినయ్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని రామానుజన్ క్యాంపస్ నారాయణ కాలేజీలో ఐఐటీ లాంగ్ కోచింగ్ తీసుకుంటున్నాడు. ఐఐటీ ఫలితాల్లో మార్కులు తక్కువ వచ్చాయనే మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: Us: అమెరికాలో మరో భారతీయుడి హత్య