
బంగారం షాపులో పట్టపగలే యజమానిపై కత్తితో దాడి చేసిన ఘటన సంచలనం సృష్టించింది.
సాక్షి, మేడ్చల్: పట్టపగలే బంగారం షాపు యజమానిపై కత్తితో దాడి చేసిన ఘటన సంచలనం సృష్టించింది. జ్యువెలరీ షాపులోకి చొరబడిన ఇద్దరు దొంగలు షాప్ యజమానిని కత్తితో పొడిచి గల్లాపెట్టెలోని డబ్బులతో పరారయ్యారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా చోరుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.
మేడ్చల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని శేషారాం అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. మధ్యాహ్నం.. షాపులో కస్టమర్లు లేని సమయంలో ఇద్దరు దొంగలు చొరబడ్డారు. ఒక వ్యక్తి బుర్ఖా ధరించి ఉండగా.. మరో దుండగుడు హెల్మెట్ ధరించి ఉన్నాడు. యజమాని శేషారాంను కత్తితో పొడిచి నగదుతో ఉడాయించారు. ఈ ఘటన అంతా సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. శేషారాంను ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.