medchal
-
బీజేపీ సమావేశంలో ఈటెల ఆసక్తికర వ్యాఖ్యలు
మేడ్చల్: జిల్లా బీజేపీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో ఎంపీ ఈటెల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పదవిని పొందేటప్పుడు ఉండే ఆరాటం.. పని చేసేటప్పుడు కూడా ఉండాలని బీజేపీ శ్రేణులకు చురకలంటించారు. పార్టీలో అటెండెన్స్ సిస్టం ఉండొద్దని, చేతులు ఎత్తే పద్ధతి ఉండొదన్నారు ఈటెల. ఇది ఇన్సల్ట్ చేసే పద్ధతి అని ఈటెల పేర్కొన్నారు.‘ పదవుల్లో పొందిన వారు కష్టపడి పార్టీ కోసం పని చేయాలి. ఆరాటం అనేది రెండు విషయాల్లో ఉండాలి. ఒక వేళ పదవులు పొంది.. పని చేయకపోతే వారు రాజీనామా చేయండి. ఇందులో రాజీపడే ప్రసక్తే లేదు. డివిజన్ అధ్యక్షుడు ఆపైన నాయకులు 24 గంటలు అందుబాటులో ఉండాలి. ఆలా ఉండకపోతే పార్టీకి రాజీనామా చేయండి. ఈ రాష్ట్రంలో రాబోయే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమేనని చర్చ జరుగుతోంది. దానిని అందిపుచ్చుకునేందుకు మనమంతా సిద్ధంగా ఉండాలి’ అని ఈటెల పేర్కొన్నారు. -
మేడ్చల్ సీఎంఆర్ కళాశాలలో విషాదం
-
ఎంఎంటీఎస్ ఘటన: నిందితుడి గుర్తించిన బాధితురాలు
హైదరాబాద్, సాక్షి: ఎంఎంటీఎస్ రైలులో యువతిపై జరిగిన అత్యాచారయత్నం కేసును పోలీసులు చేధించారు. నిందితుడిని మేడ్చల్ జిల్లాకు చెందిన ఓ యువకుడిగా నిర్ధారించారు. బాధితురాలు గుర్తించడంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మేడ్చల్ జిల్లా గౌడవెల్లికి చెందిన యువకుడు.. తల్లిదండ్రులు చనిపోవడంతో ఒంటరిగానే ఉంటున్నాడు. ఈ క్రమంలో గంజాయికి బానిసై నేరాలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలోనే ఎంఎంటీఎస్ రైల్లో వెళ్తున్న ఒంటరి యువతిపై అఘాయిత్యానికి యత్నించినట్లు తెలుస్తోంది. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు.. నిందితుడిని ఫొటో ద్వారా గుర్తు పట్టింది. ఆ తర్వాతే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. గంజాయి మత్తులోనే ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసుల వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లాకు చెందిన యువతి (23) మేడ్చల్‌లో ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. తన సెల్‌ఫోన్ రిపేర్ చేయించుకుని సికింద్రాబాద్ నుంచి ఎంఎంటీఎస్‌లో మేడ్చల్‌కు బయలుదేరింది. అయితే మహిళల కోచ్‌లో ఆమె యువతి ఒక్కతే ఉండగా నిందితుడు (25) ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అతని నుంచి తప్పించుకునేందుకు బాధితురాలు రైలు నుంచి బయటకు దూకింది. కొంపల్లి సమీప ప్రాంతంలోని రైలు బ్రిడ్జి వద్ద కిందపడి గాయపడిన ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలిని రైల్వే ఎస్పీ చందనా దీప్తి పరామర్శించారు. మరోవైపు ఈ ఘటన రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలకు సంకేతమంటూ ప్రభుత్వంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ విరుకుపడుతోంది. -
HYD: MMTSలో యువతిపై లైంగిక దాడి యత్నం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కదులుతున్న ఎంఎంటీఎస్(MMTS) రైలులో ఓ దుండగుడు.. యువతిపై అత్యాచారయత్నం చేశాడు. దీంతో, భయాందోళనకు గురైన సదరు యువతి.. రైలులో నుంచి బయటకు దూకేసింది.వివరాల ప్రకారం.. ఎంఎంటీఎస్(MMTS)లో ఓ దుండగుడు రెచ్చిపోయాడు. ఎంఎంటీఎస్ ప్రయాణంలో ఉండగా.. ఓ యువతిపై దుండగుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తున్న ఎంఎంటీఎస్ రైలు బోగీలో యువతి ఒక్కరే ఉన్నారు. ఈ క్రమంలో బోగీలోకి ఎక్కిన దుండగుడు.. కొంపల్లి వద్ద ఆమెపై లైంగికదాడికి ప్రయత్నించాడు. అతడి నుంచి తప్పించుకునేందుకు కదులుతున్న రైలులో నుంచి కిందకు దూకేసింది.దీంతో, బాధితురాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన యువతిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. -
తన కంటే చిన్న వాడితో ప్రేమ.. భర్త, పిల్లల్ని కాదని ప్రియుడితో..
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియా పరిచయాలు కొందరికి శాపంగా మారుతున్నాయి. సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తి కోసం ఓ వివాహిత భర్త, పిల్లలను వదిలేసి పారిపోయిన ఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది. ప్రియుడితో పారిపోతున్న తన భార్యను భర్త పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ అది ఫలించలేదు. దీంతో, సదరు భర్త పోలీసులను ఆశ్రయించాడు.వివరాల ప్రకారం..ఏపీలోని పల్నాడు జిల్లాకు చెందిన గోపి (22) కంప్యూటర్ ట్రైనింగ్ కోసం హైదరాబాద్‌కు వచ్చాడు. కూకట్‌పల్లిలోని హాస్టల్ ఉంటూ కోర్స్ నేర్చుకుంటున్నారు. ఈ క్రమంలో మేడ్చల్ జిల్లాలోని పేట్ బషీరాబాద్‌కు చెందిన సుకన్య(35)కు సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. దీంతో, వీరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. వీరద్దరూ రోజూ ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. సుకన్యకు అప్పటికే వివాహం జరగగా ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. అయినా గోపి లేకుండా ఉండలేనని భావించిన సుకన్య.. ప్రియుడితో పారిపోయేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 5న ఇంట్లో నుంచి వెళ్లిపోయి గోపితో కలిసి ఉంటోంది.తన భార్య సుకన్య కనిపించకపోవడంతో భర్త జయరాజ్ ఆందోళనకు గురయ్యాడు. వెంటనే పోలీసులను ఆశ్రయించడంతో సీసీ కెమెరాల ఆధారంగా గోపితో వెళ్లిందని నిర్ధారించుకున్నారు. ఈ క్రమంలో జయరాజ్ వారికోసం గాలిస్తుండగా మేడ్చల్‌లోని ఆక్సిజన్ పార్క్ వద్ద బైక్‌పై వెళుతున్న గోపి, సుకన్య కనిపించారు. దీంతో వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా.. బైక్‌ను అక్కడే వదిలేసి సుకన్య, గోపి రన్నింగ్ బస్ ఎక్కి మళ్లీ పారిపోయారు. ఈ ఘటనలో భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వారి కోసం గాలిస్తున్నారు. భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి సోషల్ మీడియాలో పరిచయమైన ప్రియుడితో పారిపోయిన వివాహితమేడ్చల్ జిల్లా పేట్ బాషీరాబాద్ పీయస్ పరిధిలో గతనెల 5న తన భార్య సుకన్య(35) కనిపించడం లేదంటూ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన భర్త జయరాజ్తన భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి సోషల్ మీడియాలో పరిచమైన… pic.twitter.com/e0oDcb0593— Telugu Scribe (@TeluguScribe) March 1, 2025Video Credit: Telugu Scribe -
మంటల్లో పూర్తిగా దగ్ధమైన ప్రైవేట్ బస్సు
-
Medchal: నడి రోడ్డుపై అన్నను హత్య చేసిన తమ్ముళ్లు
మేడ్చల్/ మేడ్చల్ రూరల్: అది జాతీయ రహదారి.. ఆదివారం సాయంత్రం కావస్తోంది.. జన సంచారం.. వందలాది వాహనాలు వస్తూ పోతున్నాయి. ఓ వ్యక్తి ప్రాణ భయంతో పరుగెత్తుకుంటూ వస్తున్నాడు. అతడిని కొందరు వ్యక్తులు వెంబడించారు. అందరూ చూస్తుండగానే కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చారు. ఈ దారుణాన్ని అక్కడున్న వారు ఆపే ప్రయత్నం చేయకపోగా.. తమ సెల్ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు. పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమారంపేటకు గుగులోతు గన్యా మేడ్చల్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉమేష్ (25), రాకేష్ ఉన్నారు. వీరు మేడ్చల్ ఆర్టీసీ కాలనీలో నివాసముంటున్నారు. పెద్ద కుమారుడు ఉమేష్ నిత్యం మద్యం తాగి వచ్చి భార్య ప్రియాంకను, సోదరుడు రాకేష్‌ను, ఇంట్లోని పిల్లలను వేధింపులకు గురి చేస్తుండేవాడు. దురలవాట్లకు బానిసైన అతడిని దుబాయ్‌కి పంపించే ఏర్పాట్లు చేస్తుండగా.. వాటిని కూడా చెడగొట్టాడు. ఈ క్రమంలో ఆదివారం సైతం మద్యం తాగి ఇంటికి వచ్చిన ఉమేష్.. కుటుంబ సభ్యులతో ఘర్షణకు దిగాడు. అందరినీ చంపేస్తానంటూ బెదిరించాడు. ఇంట్లోనే ఉన్న సోదరుడు రాకేష్‌తో, చిన్నాన్న కుమారుడు లక్ష్మణ్‌లతో ఉమేష్ వాగ్వాదానికి దిగాడు. వారిని బీరు సీసాతో బెదిరించాడు. రాకేష్ లక్ష్మణ్‌లు అతడిని ప్రతిఘటించారు. దీంతో ఉమేష్ సమీపంలోని జాతీయ రహదారి వైపు పరుగెత్తాడు. రాకేష్ లక్ష్మణ్‌లు బస్టాండ్ సమీపంలో ఉమేష్‌ను పట్టుకుని రోడ్డుపై పడుకోబెట్టి కత్తితో పొడవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఉమేష్ మృతదేహంపై 12 కత్తిపోట్లు ఉన్నాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. మృతుడికి భార్య ప్రియాంక, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా.. హత్య ఘటన వీడియోల్లో ఇద్దరు మాత్రమే కనిపిస్తున్నా.. మొత్తం ఐదుగురు పాల్గొన్నట్లు తెలుస్తోంది. రాకేష్ లక్ష్మణ్‌తో పాటు వీరి కుటుంబ సభ్యులు నవీన్, నరేష్ సురేష్‌లు ఉన్నట్లు సమాచారం. ఉమేష్‌ను కత్తులతో దారుణంగా పొడుస్తున్నా.. అక్కడున్నవారు కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. తమ మొబైల్ ఫోన్లలో హత్య చేస్తున్న దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. తోటి మనిషి కత్తి పోట్లకు గురవుతున్నా.. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నా.. ఎవరూ స్పందించకపోవడం మానవత్వం కనుమరుగవుతోందనడానికి మచ్చుతునకగా చెప్పవచ్చు. -
మేడ్చల్ హత్య కేసులో ట్విస్ట్
సాక్షి, మేడ్చల్: మేడ్చల్‌లో పట్టపగలే దారుణ హత్య జరిగింది. బస్సు డిపో వద్ద నడిరోడ్డుపై ఓ వ్యక్తిని దారుణంగా కత్తులతో పొడిచి చంపారు. ఉమేష్ అనే వ్యక్తిని ఆదివారం సాయంత్రం గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు.ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఉమేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తమ్ముడే అన్నను చంపినట్లు పోలీసులు గుర్తించారు. తమ్ముడే మరో వ్యక్తితో కలిసి అన్నను చంపినట్లు పోలీసులు భావిస్తున్నారు. -
హ్యాండ్‌బాల్..డిఫెండర్స్..
క్రికెట్.. ఫుట్‌బాల్.. బ్యాడ్మింటన్.. ఈ సరసన హ్యాండ్బాల్కూ ఎనలేని ప్రాచుర్యం తీసుకొచ్చేందుకు ఇక్కడి కోచ్‌లు నిరి్వరామంగా కృషి చేస్తున్నారు. క్రీడలపై ఉన్న ప్రీతితో నేటి తరం వారిని జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు చిన్ననాటి నుంచే బీజాలు వేస్తున్నారు. ఇందు కోసం స్కూల్ స్థాయి నుంచే విద్యార్థులను ప్రోత్సహిస్తూ హ్యాండ్‌బాల్ క్రీడలో శిక్షణ ఇస్తున్నారు. వారే సనత్‌నగర్ కార్మిక సంక్షేమ మైదానం కేంద్రంగా దశాబ్దాల కాలంగా హ్యాండ్‌బాల్ శిక్షణ ఇస్తున్న అసోసియేషన్ సభ్యులు. – సనత్‌నగర్ సనత్‌నగర్ లేబర్ వెల్ఫేర్ గ్రౌండ్ హ్యాండ్‌బాల్ క్రీడలో ఎందరో ఆణిముత్యాలను అందించింది. పారిశ్రామికవాడగా కార్మికుల ఆవాసంగా ఉన్న సనత్‌నగర్‌లో పలువురు హ్యాండ్‌బాల్ ఆటలో ఆసక్తి చూపిస్తున్న క్రమంలో 1975లో స్థానిక ఎస్ఆర్టీ కాలనీలోని కార్మిక సంక్షేమ సంఘం భవనం ఆవరణలో ప్రత్యేక క్రీడా శిబిరం నిర్వహించారు. అలా మొదలైన శిబిరం క్రీడాకారుల్లో మరింత ఆసక్తిని రేకెత్తించింది. ఇక్కడ శిక్షణ పొందిన ఎంతోమంది జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని క్రీడాస్ఫూర్తిని రగిలించారు. వారిలో సనత్‌నగర్ మాజీ కార్పొరేటర్ అయూబ్‌ఖాన్, మక్సూద్, జగన్నాథం, సుబోద్ విల్సన్, ప్రబోద్ విల్సన్, డాక్టర్ నగేశ్, విద్య, ఏఎస్ మునవర్, పీవీ నాగార్జున, ధన్‌రాజ్ తదితరులు హ్యాండ్‌బాల్ క్రీడాకారులుగా వెలుగులోకి వచ్చినవారే. అలాగే సనత్‌నగర్‌కు చెందిన ఎంఏ అజీజ్ ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో పాల్గొన్న ఘనతను దక్కించుకున్నారు. మరో క్రీడాకారుడు బాసిత్ ఆసియా క్రీడల ప్రొబబుల్స్‌లో స్థానం కైవసం చేసుకున్నాడు. వీరంతా వృత్తిపరంగా వేర్వేరు రంగాల్లో ఉన్నప్పటికీ హ్యాండ్‌బాల్ క్రీడపై అభిమానాన్ని విడవలేదు. ఇక్కడే శిక్షణ తీసుకుని కోచ్‌లుగా ఎదిగిన వారు ఎందరో ఉన్నారు. నిరంతర శిక్షణనిస్తూ.. జాతీయ స్థాయిలో రాణించిన ఆనాటి మేటి క్రీడాకారులంతా సంఘటితమై 1980లో అప్పటి రంగారెడ్డి జిల్లా (ప్రస్తుత మేడ్చెల్ జిల్లా) హ్యాండ్‌బాల్ అసోసియేషన్ (రిజిస్టర్డ్ నెంబర్: 1859)ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ కొన్ని వేల మంది హ్యాండ్‌బాల్ క్రీడాకారులను తీర్చిదిద్దారు. ఎక్కడ ఏ పోటీ జరిగినా జిల్లా నుంచి పాల్గొనే టీమ్‌ను సన్నద్ధం చేసేది ఈ అసోసియేషనే సభ్యులే. ఇక్కడ శిక్షణ పొందేవారు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎంపిక అవుతున్నారు. అండర్–12, అండర్–16, అండర్–19, సీనియర్స్ విభాగాల్లో ఇక్కడ శిక్షణ అందిస్తున్నారు. మొదట స్కూల్ లెవల్ క్యాంపులు నిర్వహించి హ్యాండ్‌బాల్ క్రీడలో ఉచిత శిక్షణ ఇస్తారు. ఆ తరువాత వారిలో నుంచి జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేసి క్రీడలో మెళకువలు నేర్పిస్తారు. ఆ తరువాత వారి ప్రతిభ ఆధారంగా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా తగిన ప్రోత్సాహాన్ని కల్పిస్తున్నారు. వారే కోచ్‌లుగా, ఇక్కడి గ్రౌండ్‌లోనే శిక్షణ పొందిన వారే కోచ్‌లుగా వ్యవహరిస్తూ ఉచిత శిక్షణ అందిస్తుండడం గమనార్హం. స్పోర్ట్స్ కోటాలో సీట్లు సాధించిన వారు ఎందరో.. జనరల్ కోటాలో సీటు రానివారికి హ్యాండ్‌బాల్ క్రీడే ఆపన్నహస్తంగా మారుతోంది. ఈ క్రీడలో గతంలో జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఆడినవారు పదుల సంఖ్యలో స్పోర్ట్స్ కోటాలో సులభంగా సీట్లు సాధించడం గమనార్హం. -
మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధిలో హైడ్రా కూల్చివేతలు
-
మునీరాబాద్‌లో దారుణం.. మహిళ దారుణ హత్య?
మేడ్చల్: మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మునీరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ దారుణ హత్యకు గురైనట్లు తెలుస్తోంది. ఔటర్‌రింగ్ రోడ్ సమీపంలో 25 ఏళ్ల మహిళ బండరాళ్లతో కొట్టి పెట్రోల్ పోసి తగలబెట్టారు దుండగులు. మహిళ సగం కాలిపోయి మృతదేహంగా పడి ఉన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి ేచేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు.వివరాల్లోకి వెళితే.. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు ముందుగా గుర్తించారు. ఈ సమాచారంతో స్థానికంగా కలకలం రేగింది. సగం కాలిన స్థితిలో మహిళ మృతదేహం ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ మహిళ మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో ాకాలి పోవడంతో ఆమె ఎవరు అనే కోణంలో విచారణ ప్రారంభించారు పోలీసులు -
రియల్ ఎస్టేట్ బ్రోకర్‌పై ఎంపీ ఈటల, అనుచరుల దాడి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రియల్ ఎస్టేట్ బ్రోకర్‌పై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ దాడి చేశారు. పేదల భూములు కబ్జా చేశారనే ఆరోపణల నేపథ్యంలో రియల్ వ్యాపారిపై ఈటల చేయిచేసుకున్నారు. దీంతో, అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది.పేదలను భూములను కబ్జా చేస్తున్నారని బాధితులు ఈ విషయాన్ని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఈటల నేడు.. మేడ్చల్ జిల్లాలోని పోచారం మున్సిపాలిటీలో ఉన్న ఏకశిలానగర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా పేదల భూములను రియల్ వ్యాపారులు ఆక్రమించుకోవడంతో ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో, అక్కడే ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారిపై చేయిచేసుకున్నారు. దీంతో, అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.అనంతరం, ఈటల మీడియాతో మాట్లాడుతూ..‘కొందరు తెలియక కబ్జా స్థలాలను కొంటున్నారు. పేదల భూములకు కబ్జా చేయడం నేరం. పేదల భూములను కబ్జా చేసి వ్యాపారం చేసుకుంటున్న బ్రోకర్లు. పేదల భూములను కబ్జా చేస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయి. బ్రోకర్లకు అధికారులు వత్తాసు పలుకుతున్నారు. రాష్ట్రంలో పేదలకు అండగా ఉన్న పార్టీ బీజేపీ. అనేక పేదల కాలనీలకు రూపశిల్పి బీజేపీనే. పేదలు కొనుక్కున్న భూములకు బీజేపీ సంపూర్ణంగా అండగా ఉంటుంది. బీజేపీ తాటాకు చప్పుళ్లకు భయపడదు. అధికారులు బ్రోకర్లకు కొమ్ముకాస్తున్నారు.1985లో నారపల్లి, కొర్రెముల గ్రామాల్లో పేదవారు కంచెలు, జంగల్ భూములు కొనుక్కుని ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. రెవెన్యూ అధికారులకు, కలెక్టర్‌కి, సీపీకి, మంత్రికి, ముఖ్యమంత్రికి కూడా ఇక్కడ వివరాలతో ఉత్తరాలు రాస్తాను. తప్పు భూములు కొనుక్కున్న వారిది కాదు.. దొంగ కాగితాలు సృష్టించిన అధికారులది, వాళ్ళని జైల్లో పెట్టాలి. తప్పు బ్రోకర్లది. ఎవరైనా పేదల మీద దౌర్జన్యం చేస్తే ఖబడ్దార్ అని హెచ్చరిస్తున్నా. చిన్న జిల్లాలు ఏర్పాటు చెస్తే పాలన సులభం అవుతుంది. కలెక్టర్లు అందుబాటులో ఉంటారు అనుకున్నాం. కానీ కలెక్టర్లు దొరకడం లేదు. పోలీస్ కమిషనర్‌కి మనకు కలవడానికి సమయం ఉండదు కానీ బ్రోకర్లను కలవడానికి మాత్రం సమయం ఉంటుంది అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
హైదరాబాద్ నార్త్ సిటీ మెట్రో రైల్.. రెండు రూట్లలో డబుల్ డెక్కర్!
సాక్షి, హైదరాబాద్: నార్త్‌సిటీ మెట్రో కారిడార్లపై హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రోరైల్ లిమిటెడ్ (హెచ్‌ఏఎంఆర్‌ఎల్) దృష్టి సారించింది. మార్చి నాటికి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్)ను రూపొందించే దిశగా అధికారులు కార్యాచరణ చేపట్టారు. ఈమేరకు రెండు కారిడార్లలో క్షేత్రస్థాయిలో అధ్యయనం మొదలైంది. కారిడార్ల నిర్మాణానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, ఎదురు కానున్న సమస్యలు తదితర అంశాల ఆధారంగా అధికారులు సర్వే చేపట్టారు. ఈ రెండు రూట్లలో ఇప్పటికే హెచ్ఎండీఏ (HMDA) ఆధ్వర్యంలో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి సన్నాహాలు చేపట్టిన సంగతి తెలిసిందే.ఈ మార్గాల్లోనే మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. దీంతో డబుల్ డెక్కర్ కారిడార్ల కోసం పియర్స్ ఎత్తును ఏమేరకు పెంచాల్సి ఉంటుంది, ఈ క్రమంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందనే అంశాలను సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రెండు కారిడార్లు సైతం డబుల్ డెక్కర్ (Double Deccar) పద్ధతిలో చేపట్టనున్న దృష్ట్యా ఇతర ఎలివేటెడ్ మెట్రోల కంటే నార్త్‌సిటీ మెట్రో (North City Metro) భిన్నంగా ఉండనుంది. ఇందుకనుగుణంగా డీపీఆర్ సిద్ధం చేయనున్నారు. 3 నెలల్లో డీపీఆర్ రెడీ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించిన నేపథ్యంలో అధికారులు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని సమగ్ర ప్రాజెక్టు నివేదిక కోసం కసరత్తు చేపట్టారు.హెచ్ఎండీఏతో సమన్వయం.. రెండు రూట్లలో ఎలివేటెడ్ కారిడార్ల కోసం నిర్మించే పియర్స్పైనే మెట్రో కారిడార్ రానుంది. దీంతో నార్త్‌సిటీ మెట్రోకు పియర్స్ ఎత్తు, మెట్రో స్టేషన్ల నిర్మాణం కీలకం కానున్నాయి. ప్యారడైజ్ నుంచి డెయిరీ ఫామ్‌కు, శామీర్‌పేట్ ఓఆర్ఆర్ వరకు ఎలివేటెడ్ కారిడార్లకు హెచ్ఎండీఏ కార్యాచరణ చేపట్టింది. దీంతో మెట్రో నిర్మాణంపై హెచ్‌ఏఎంఆర్‌ఎల్ సంస్థ హెచ్ఎండీఏతో కలిసి పని చేయనుంది. పియర్స్, కారిడార్ల నిర్మాణం తదితర అంశాల్లో రెండు సంస్థల భాగస్వామ్యం తప్పనిసరి. డబుల్ డెక్కర్ వల్ల నిర్మాణ వ్యయం తగ్గడంతో పాటు నగర వాసులకు ఒకే రూట్లో రోడ్డు, మెట్రో సదుపాయం అందుబాటులోకి రానుంది. ప్యారడైజ్ నుంచి మేడ్చల్ 23 కి.మీ. మెట్రో కారిడార్‌లో డెయిరీఫామ్ వరకు అంటే 5.32 కి.మీ డబుల్‌డెక్కర్ ఉంటుంది. మిగతా 17.68 కి.మీ ఎలివేటెడ్ పద్ధతిలోనే నిర్మించనున్నారు. మరోవైపు జేబీఎస్ (JBS) నుంచి శామీర్‌పేట్ వరకు 22 కి.మీ. మార్గంలో ఇంచుమించు పూర్తిగా డబుల్‌డెక్కర్ నిర్మాణమే. ప్యారడైజ్ మెట్రో స్టేషన్ నుంచి తాడ్‌బండ్, బోయిన్పల్లి, సుచిత్ర సర్కిల్, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, కండ్లకోయ, ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా మేడ్చల్‌కు దాదాపు 23 కి.మీ, జేబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి విక్రంపురి, కార్ఖానా, తిరుమలగిరి, లోతుకుంట, అల్వాల్, బొల్లారం, హకీంపేట్, తూంకుంట, ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా శామీర్‌పేట్ వరకు 22 కి.మీ. పొడవుతో మెట్రో అందుబాటులోకి రానున్న సంగతి తెలిసిందే. ఈ రెండు కారిడార్లను మెట్రో రెండో దశ ‘బి’ విభాగం కింద చేర్చనున్నారు.ఇదీ చదవండి: చర్లపల్లి తరహాలో మరిన్ని రైల్వే స్టేషన్లుడబుల్డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ల వల్ల సికింద్రాబాద్ నుంచి ఉత్తరం వైపు వివిధ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ప్రయాణ కష్టాలు తీరనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, విద్యార్ధులు, వివిధ రంగాల్లో పని చేసే అసంఘటిత కారి్మక వర్గాలు సిటీ బస్సులు, సెవెన్ సీటర్ ఆటోలు, సొంత వాహనాలపై ఆధారపడాల్సి వస్తోంది. దీంతో వాహనాల రద్దీ, గంటల తరబడి ట్రాఫిక్ ఇబ్బందులకు గురవుతున్నారు.అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాలుమెట్రో రెండో దశపై కేంద్రం ఆమోదం లభించిన వెంటనే పనులు ప్రారంభించే అవకాశం ఉంది. త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో కేంద్రం నిధులు కేటాయించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మెట్రో నిర్మాణానికి నిధుల కొరత ఏ మాత్రం సమస్య కాదని, కేంద్రం నుంచి సావరిన్ గ్యారంటీ లభిస్తే అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాలు పొందవచ్చని ధీమా వ్యక్తం చేస్తున్నారు. చెన్నై, బెంగళూర్లలో మెట్రో విస్తరణకు గత బడ్జెట్లలో నిధులు కేటాయించినట్లుగానే హైదరాబాద్ మెట్రోకు కూడా ఈసారి కేంద్రం నిధులు ఇచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. -
మేడ్చల్‌లో ఘోర ప్రమాదం.. లారీ బీభత్సం.. ముగ్గురి మృతి
సాక్షి, మేడ్చల్: మేడ్చల్ చెక్‌పోస్టు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా దూసుకొచ్చిన లారీ ముగ్గురిని ఢీకొట్టింది. ద్విచక్ర వాహనంపై ఓ వ్యక్తి తన భార్య, కుమార్తెను తీసుకెళ్తుండగా.. అదుపు తప్పిన లారీ వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కుమారుడికి తీవ్ర గాయాలు కాగా, ఆసుపత్రికి తరలించారు. ఘటన తర్వాత లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. -
రహస్య వీడియోలపై విద్యార్థుల ఆగ్రహం
-
హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. మేడ్చల్, శామీర్‌పేట్‌కు మెట్రో పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: నగర నార్త్ సిటీ వాసులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. మేడ్చల్, శామీర్‌పేట్‌లకు మెట్రో(Metro) పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డీపీఆర్ సిద్ధం చేయాలని హెచ్ఎంఆర్ఎల్ అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ప్యారడైజ్ నుంచి మేడ్చల్ (23 కిలోమీటర్లు), జేబీఎస్-శామీర్‌పేట్ (22 కిలోమీటర్లు) మెట్రో కారిడార్ల డీపీఆర్‌ల తయారీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ప్యారడైజ్ మెట్రో స్టేషన్ నుంచి తాడ్‌బండ్, బోయిన్పల్లి, సుచిత్ర సర్కిల్, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, కండ్లకోయ, ఆర్ఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా మేడ్చల్ వరకు 23 కిలోమీటర్ల కారిడార్.. జేబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి విక్రమ్‌పురి, కార్ఖానా, తిరుమలగిరి, లోతుకుంట, ఆల్వాల్, బొల్లారం, హకీంపేట్, తూముకుంట, ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా శామీర్‌పేట్‌కు 22 కిలోమీటర్ల మేర ఈ కారిడార్ విస్తరించి ఉంటుందని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. డీపీఆర్ తయారీని మూడు నెలల్లో పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని సీఎం తెలిపారని మెట్రో ఎండీ మీడియాకు వెల్లడించారు. డీపీఆర్, ఇతర అనుబంధ డాక్యుమెంట్ల తయారీ చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.ఇదీ చదవండి: TSRTC: సంక్రాంతికి 6,432 ప్రత్యేక బస్సులు -
HYD: మేడ్చల్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత
సాక్షి,మేడ్చల్‌జిల్లా: మేడ్చల్ పట్టణంలో డ్రగ్స్ కలకలం రేపాయి. మేడ్చల్ బస్సుడిపో వద్ద మంగళవారం(డిసెంబర్ 10) భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఓ వ్యక్తి బస్సులో ప్రయాణిస్తూ మేడ్చల్ బస్సు డిపో వద్ద దిగాడు.డ్రగ్స్‌తో దిగుతున్నాడని ముందే సమాచారం అందుకున్న నార్కొటిక్స్ బ్యూరో అధికారులు అతని వద్ద నుంచి 600 గ్రాముల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ స్వాధీనం చేసుకొని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: లోన్ యాప్ వేధింపులకు యువకుడు బలి -
మేడ్చల్‌లో డ్రగ్స్ కలకలం.. ముఠా నాయకుడు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో మరోసారి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఒక కిలో మెపిడ్రైన్ను పోలీసులు పట్టుకున్నారు. ఈ క్రమంలో డ్రగ్స్ ముఠా నాయకుడు అల్లు సత్యనారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు.వివరాల ప్రకారం.. మేడ్చలో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మేడ్చల్ పోలీసులతో నార్కోటిక్ పోలీసులు జాయింట్ ఆపరేషన్‌లో భాగంగా ఒక విలో మెపిడ్రైన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ఏడు సంవత్సరాలుగా డ్రగ్స్ తయారు చేస్తున్న అల్లు సత్యనారాయణ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు సత్యనారాయణ యాదగిరిగుట్టలోని ఒక మూతపడిన ఫ్యాక్టరీలో డ్రగ్స్ తయారు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇక, డ్రగ్స్ ముఠాలో ఉన్న మరో ఏడుగురు నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
సైలెంట్ గా ఉన్న హైడ్రా మళ్లీ యాక్టీవ్
-
విపరీతమైన ట్రాఫిక్ సమస్య.. మెట్రో ఒకటే పరిష్కారం..
-
Meetho Sakshi: మేడ్చల్ రోడ్లపై నరకం..
-
డోర్‌లాక్ పేరుతో అడ్డగోలు బాదుడు
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ సర్కిల్ జీడిమెట్ల డివిజన్ ప్రగతినగర్ సెక్షన్ బాచుపల్లిలోని ఓ అపార్ట్మెంటులో విద్యుత్ లైన్‌మన్ మీటర్ రీడింగ్ నమోదు చేయకుండానే డోర్‌లాక్ పేరుతో మినిమం బిల్లు జారీ చేశారు. ఆగస్టులో 5 యూనిట్లకు బిల్లు ఇచ్చారు. సెప్టెంబర్‌లో ఇవ్వలేదు. అక్టోబర్‌లో మాత్రం ఏకంగా రూ.3,667 బిల్లు జారీ చేశారు. సదరు వినియోగదారుడు బాచుపల్లి ఏఈని ఫోన్లో సంప్రదించేందుకు యత్నించగా ఆయన స్పందించకపోవడంతో బాధితుడు కార్పొరేట్ కార్యాలయంలోని ఉన్నతాధికారులను ఆశ్రయించాల్సి వచ్చింది.హబ్సిగూడ సర్కిల్ కీసర డివిజన్ నారపల్లి సెక్షన్ పరిధిలోని ఓ వినియోగదారుడి ఇంట్లోని విద్యుత్ మీటర్‌కు ఒక నెలలో బిల్ కన్జమ్షన్, మరో నెలలో మీటర్ స్టకప్ అని నమోదు చేశారు. ఫలితంగా ఆయన ఇంటి నెలవారీ బిల్లు రూ.2 వేలు దాటింది. ఒక వైపు కరెంట్ వినియోగం జరగలేదంటూనే..మరో వైపు మినిమం బిల్లు పేరుతో అధిక బిల్లు జారీ చేశారు. కనీసం బిల్ స్టేటస్‌ను కూడా పట్టించుకోలేదు. వినియోగదారుడు ఈ లోపాన్ని గుర్తించి సంబంధిత సెక్షన్ అధికారులకు ఫిర్యాదు చేసినా కనీస స్పందన కూడా లేదు.ఆజామాబాద్ డివిజన్లోని రామాలయం సెక్షన్ పరిధిలో ఓ వినియోగదారుడి ఇంట్లో కరెంట్ మీటర్లో సాంకేతిక లోపం తలెత్తింది. గత నాలుగు నెలలుగా స్టకప్లోనే ఉంది. రీడింగ్ నమోదు కావడంలేదు. వెంటనే ఆ మీటర్ స్థానంలో కొత్తది ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆపరేషన్స్ విభాగం డీఈ, ఏడీఈ, ఏఈలు ప్రతినెలా బిల్స్టేటస్పై రివ్వూ్యలు నిర్వహించాల్సి ఉంది. కానీ ఇక్కడి అధికారులు అవేవీ పట్టించుకోకపోవడం, క్షేత్రస్థాయి లైన్మెన్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో సదరు వినియోగదారుడు నెలకు రూ.1,500కు పైగా బిల్లు చెల్లించాల్సి వస్తోంది...ఇలా మేడ్చల్, హబ్సిగూడ సర్కిళ్ల పరిధిలోనే కాదు శివారులోని సరూర్‌నగర్, సైబర్‌సిటీ, రాజేంద్రనగర్ సర్కిళ్లలోనూ ఇదే తంతు కొనసాగుతోంది. ఆపరేషన్ విభాగంలోని ఇంజినీర్ల నిర్లక్ష్యంతో వినియోగదారులు నష్టపోతున్నారు. నెలకు రాబడి రూ.1,800 కోట్లు గ్రేటర్ పరిధిలో 60 లక్షలకుపైగా విద్యుత్ వినియోగదారులు ఉన్నారు. వీరిలో 52 లక్షల మంది గృహ విద్యుత్ వినియోగదారులు, మరో 8లక్షల మంది వాణిజ్య వినియోగదారులు ఉన్నా రు. పారిశ్రామిక, ఇతర కనెక్షన్లు మరో 2 లక్షల వరకు ఉన్నట్లు సమాచారం. వీరి ద్వారా సంస్థకు ప్రతి నెలా రూ.1,600 కోట్ల నుంచి రూ.1,800 కోట్లకుపైగా ఆదాయం సమకూరుతోంది. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేసేందుకు డిస్కం.. అన్ని డివిజన్ల పరిధిలోనూ రెండు బృందాలను ఏర్పాటు చేసింది. విపత్తుల నిర్వహణ, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, సాంకేతిక సమస్యల పునరుద్ధరణ కోసం సెంట్రల్ బ్రేక్ డౌన్ (సీబీడీ) గ్యాంగ్‌ను ఏర్పాటు చేసింది. అదేవిధంగా కొత్త కనెక్షన్ల జారీ, లైన్లకు అంచనాలు రూపొందించడం, మీటర్ రీడింగ్, రెవెన్యూ వసూళ్ల కోసం ఆపరేషన్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. అత్యవసర పరిస్థితుల్లో సీబీడీ గ్యాంగ్‌లు చురుగ్గా పని చేస్తున్నాయి. ఆపరేషన్ విభాగం పనితీరు అధ్వానం భారీ వర్షాలు, వరదలు, ఈదురు గాలులతో చోటు చేసుకున్న నష్టాలను గంటల వ్యవధిలోనే సీబీడీ గ్యాంగ్‌లు పునరుద్ధరిస్తున్నాయి. కానీ ఆపరేషన్ విభాగంలోని డీఈలు, ఏడీఈలు, ఏఈలు, లైన్మెన్లు మాత్రం ఆఫీసు దాటి బయటికి రావడం లేదు. ముఖ్యమైన మీటర్ రీడింగ్‌కు ఒక నెలలో రెగ్యులర్ లైన్మెన్లు, ఏఈలు, ఏడీఈలు వెళ్లాల్సి ఉంది. మరో నెలలో కాంట్రాక్టు కార్మికులతో రీడింగ్ నమోదు చేయాల్సి ఉంది. కానీ ప్రతి నెలా కాంట్రాక్ట్ మీటర్ రీడర్లు మినహా ఆపరేషన్ విభాగంలోని జేఎల్ఎంలు, ఏఈలు, ఏడీఈలు మాత్రం రీడింగ్‌కు వెళ్లడంలేదు.చదవండి: ఎంఎంటీఎస్ రైళ్లపై ఎందుకీ నిర్లక్ష్యం? లైన్ల నిర్వహణ, విద్యుత్ చౌర్యం, రెవెన్యూ వసూళ్లపైనే కాదు.. కనీసం మీటర్ స్టేటస్‌పై రివ్వు్యలు కూడా నిర్వహించడం లేదు. డిస్కంలో కీలకమైన సైబర్ సిటీ, సరూర్‌నగర్, రాజేంద్రనగర్, మేడ్చల్ సర్కిళ్ల పరిధిలోని ఆపరేషన్ విభాగంలోని ఇంజినీర్ల అలసత్వం కారణంగా ఆయా ప్రాంతాల్లోని వినియోగదారులు నష్టపోతున్నారు. చేతికందుతున్న బిల్లులను చూసి.. లబోదిబోమంటున్నారు. -
ఏసీబీ వలలో మేడ్చల్ ఏఎస్ఐ
మేడ్చల్‌రూరల్: స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ. 2 లక్షలు డిమాండ్ చేసిన ఏఎస్ఐని ఏసీబీ అధికారులు సోమవారం అరెస్ట్ చేశారు. ఏసీబీ డీఏస్పీ శ్రీధర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సికింద్రాబాద్‌కు చెందిన శర్మ మేడ్చల్ మండలం, గౌడవెళ్లి గ్రామ పరిధిలోని సాకేత్ ప్రణమ్లో విల్లా కొనుగోలు చేశాడు. అందులో ఇంటీరియర్ పనుల కోసం సరూర్‌నగర్‌కు చెందిన విశ్వనాథ్‌తో రూ.8 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అడ్వాన్స్‌గా రూ.4 లక్షలు చెల్లించాడు. సగం పనులు పూర్తి చేసిన విశ్వనాథ్ మిగిలిన డబ్బులు ఇవ్వాలని కోరగా, అందుకు శర్మ నిరాకరించడంతో విశ్వనాథ్ పనులు నిలిపివేశాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో శర్మ రెండు నెలల క్రితం మేడ్చల్ పోలీస్‌స్టేషన్‌లో విశ్వనాథ్‌పై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నార్సింగిలో అతడిని అదుపులోకి తీసుకుని మేడ్చల్ పీఎస్‌కు తీసుకువచ్చారు. కేసు దర్యాప్తు చేస్తున్న ఏఎస్ఐ మధుసూదన్ స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు, ఇరువర్గాల మధ్య సయోద్య కుదిర్చేందుకు విశ్వనాథ్‌ను రూ.2 లక్షలు డిమాండ్ చేశాడు. అందులో భాగంగా మొదట రూ.10 వేలు తీసుకున్నాడు. మిగతా మొత్తాన్ని విడతల వారీగా ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. ఈ నెల 5న రూ.50 వేలు తీసుకురావాలని ఏఎస్ఐ ఫోన్ చేయడంతో విశ్వనాథ్ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వారి సూచన మేరకు సోమవారం స్టేషన్‌కు వచ్చి డబ్బులు ఇస్తానని ఏఎస్ఐకి చెప్పాడు. పథకం ప్రకారం మాటు వేసిన ఏసీబీ అధికారులు సోమవారం విశ్వనాథ్ ఏఎస్ఐ మధుసూదన్‌రావుకు స్టేషన్ ఆవరణ వెనుక నగదు అందజేస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడి నుంచి రూ.50 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన అధికారులు ఏఎస్ఐని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఈ విషయంలో ఇతర అధికారుల ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
మెట్రో రెండో దశ.. నార్త్ హైదరాబాద్‌కు తీవ్ర నిరాశ!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టు నార్త్ హైదరాబాద్‌ను తీవ్ర నిరాశకు గురిచేసింది. సికింద్రాబాద్, ప్యారడైజ్ నుంచి శామీర్‌పేట్ మీదుగా ఔటర్‌రింగ్ రోడ్డు వరకు మెట్రో విస్తరణకు గత ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించింది. కానీ.. ఇటీవల హైదరాబాద్ మెట్రోరైల్ ప్రకటించిన రెండో దశ డీపీఆర్‌లో ఉత్తరం వైపు మెట్రో ప్రస్తావన లేకపోవడం పట్ల తాజాగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు మేడ్చల్ మెట్రో సాధన సమితి ప్రతినిధులు ఇటీవల హైదరాబాద్ మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు.గత ప్రభుత్వ హయాంలో నగరానికి నలువైపులా మెట్రో సేవలను విస్తరించేలా 278 కిలోమీటర్ల మేర ప్రణాళికలను రూపొందించగా.. ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు 6 కారిడార్లలో 116.2 కిలోమీటర్లకే పరిమితం చేసింది. ఎయిర్‌పోర్టుతో పాటు కొత్తగా ప్రతిపాదించిన ఫోర్త్‌సిటీకి సైతం మెట్రో విస్తరించనున్నట్లు పేర్కొంది. గతంలోనే ప్రణాళికలను సిద్ధం చేసినప్పటికీ రెండో దశలో నార్త్‌సిటీ ప్రస్తావన లేకపోవడం గమనార్హం. డబుల్ డెక్కర్ మెట్రో ఎక్కడ? జంట నగరాలతో పాటు ఉత్తర తెలంగాణలోని అయిదు జిల్లాల ప్రజలు, వాహనదారుల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించింది. ఇదే మార్గంలో మెట్రో రైల్ నిర్మాణం చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆమధ్య ప్రకటించినా ఇప్పటివరకు ఈ దిశగా ఎలాంటి పురోగతి లేదు. ప్రస్తుతం ఈ రూట్లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ఎలాంటి నిధులను కేటాయించలేదు. భూసేకరణ దశకే ఈ ప్రాజెక్టు పరిమితమైంది.ప్యారడైజ్ జంక్షన్ నుంచి తాడ్‌బండ్, బోయినపల్లి జంక్షన్ల మీదుగా డెయిరీఫాం రోడ్డు వరకు ఆరు వరుసల్లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని ప్రతిపాదించారు. ఇది పూర్తయిన తర్వాత ఈ ఎలివేటెడ్ కారిడార్‌పై మెట్రో నిర్మాణం చేపట్టాలనే ప్రతిపాదన ఉంది. ప్రస్తుతం ఈ రూట్లో ప్రతిరోజూ లక్షలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. నగరవాసులు సిటీ బస్సులపై ఆధారపడి ప్రయాణం చేయాల్సివస్తోంది. పలుచోట్ల రహదారులు ఇరుకుగా ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సుమారు రూ.1,580 కోట్ల అంచనాలలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించి, అదే రూట్లో డబుల్ డెక్కర్ మెట్రో కారిడార్‌ను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదించారు. కానీ ఎలాంటి పురోగతి లేకుండాపోయింది. మేడ్చల్ మెట్రో సాధన సమితి ఆవిర్భావం.. నార్త్ సిటీకి మెట్రో నిర్మాణం చేపట్టాలనే డిమాండ్‌తో ఆవిర్భవించిన మేడ్చల్ మెట్రోసాధన సమితి ఆధ్వర్యంలో ధర్నాలు, నిరసనలు చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ నేతృత్వంలో మేడ్చల్ సాధన సమితి ఆవిర్భవించింది. గత ప్రభుత్వం ప్రతిపాదించిన విధంగా జేబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి తూంకుంట వరకు 17 కిలోమీటర్ల మార్గంలో డబుల్ ఎలివేటెడ్ ఫ్లై ఓవర్, మెట్రో రైల్ నిర్మాణం చేపట్టాలని, , ప్యారడైజ్ నుంచి కండక్లకోయ వరకు 12 కి.మీ మార్గంలో, ఓఆర్ఆర్ మేడ్చల్ ఇంటర్‌ఛేంజ్‌కు రాకపోకలు సాగించేలా మెట్రో సదుపాయం కల్పించాలని ఈ సంఘం డిమాండ్ చేస్తోంది. చదవండి: హైడ్రా.. రిజిస్ట్రేషన్లు విత్డ్రాఅలాగే గతంలో ప్రతిపాదించినట్లుగా ఉప్పల్‌క్రాస్‌రోడ్ నుంచి ఘట్కేసర్ ఓఆర్ఆర్– బీబీనగర్ వరకు 25 కిలోమీటర్లు, తార్నాకా ఎక్స్‌రోడ్– ఈసీఐఎల్ ఎక్స్‌రోడ్ వరకు 8 కిలోమీటర్ల మేర మెట్రో చేపట్టాలనే డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. మరోవైపు ప్రతిరోజూ లక్షలాది మంది రాకపోకలు సాగించే సూరారం, కుత్బుల్లాపూర్ ప్రాంతాలకు మెట్రో విస్తరణ చేపట్టాలని, ఎల్బీనగర్–మియాపూర్ రూట్లోని భరత్‌నగర్ నుంచి మూసాపేట్ మీదుగా సూరారం, కుత్బుల్లాపూర్ వరకు మెట్రో విస్తరించాలని ఆ ప్రాంతాల్లోని వివిధ కాలనీల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. -
TG: ప్రభుత్వ ఆఫీసులో రైతు ఆత్మహత్య
సాక్షి,మేడ్చల్‌జిల్లా: రుణమాఫీ కాలేదని మేడ్చల్ జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయ ఆవరణలో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మేడ్చల్‌లో నివాసం ఉండే రైతు సురేందర్ రెడ్డి(52) తనకు రుణమాఫీ కాలేదని శుక్రవారం(సెప్టెంబర్6) ఉదయం వ్యవసాయ శాఖ కార్యాలయ ఆవరణలో చెట్టుకు ఉరి వేసుకున్నాడు. రైతు ఆత్మహత్య సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రాష్ డ్రైవింగ్ తో అమాయకులను బలితీసుకుంటున్న మైనర్లు
-
విషాదం.. రైలు ఢీకొని తండ్రి, ఇద్దరు కూతుళ్లు మృతి
సాక్షి, మేడ్చల్: మేడ్చల్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రైలు ఢీకొన్న ఘటనలో తండ్రి, ఇద్దరు కుమార్తెలు మృతిచెందారు. ఈ ఘటన గౌడవెల్లి రైల్వేస్టేషన్ వద్ద జరిగింది.వివరాల ప్రకారం.. రైల్వే లైన్మెన్గా పనిచేస్తున్న కృష్ణ తన ఇద్దరు పిల్లలను తీసుకుని ట్రాక్ వద్ద పనులు చేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో తన కుమార్తెలను ట్రాక్‌పై కూర్చోబెట్టి కృష్ణ పనులు చేసుకుంటున్నాడు. అదే సమయంలో సడెన్‌గా రైలు రావడంతో ట్రాక్‌పై ఉన్న తన పిల్లలను కాపాడేందుకు కృష్ణ ప్రయత్నించాడు. ఈ క్రమంలో వారిని కాపాడబోయి రైలు తగిలి ముగ్గరు అక్కడికక్కడే మృతిచెందారు. ఇక, మృతులను రాఘవేంద్రనగర్‌కు చెందిన వారిగా గుర్తించారు. మృతి చెందిన కూతుర్ల పేరు వర్షిత, వరిణిగా స్థానికులు చెప్తున్నారు. -
గాజుల రామారంలో అక్రమ కట్టడాలపై హైడ్రా అధికారుల కొరడా
సాక్షి, మేడ్చల్ జిల్లా: హైదరాబాద్ శివారులో చెరువులు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన కబ్జాదారులపై హైడ్రా అధికారులు కొరడా ఝులిపించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారం, దేవందర్‌నగర్‌లలో హైడ్రా ఆధ్వర్యంలో మంగళవారం అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలతో అక్రమ కట్టడాల తొలగింపు చేపట్టారు.329, 342 సర్వే నెంబర్లలోని ప్రభుత్వ భూముల్లో వెలిసిన సుమారు 51 అక్రమ నిర్మాణాలను తొలగించారు. బాలనగర్ ఏసీపీ హనుమంతరావు సమక్షంలో సూరారం, జగద్గిరిగుట్ట సీఐలు భరత్ కుమార్, క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో సుమారు వందమంది పోలీసుల భద్రతతో మూడు ప్రోక్లైన్లను ఉపయోగించి అక్రమంగా నిర్మించిన గదులను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు.అయితే కూల్చివేతలను ఆక్రమణదారులు అడ్డుకోగా.. వారిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు చేపడితే, చెరువు కబ్జాలకు పాల్పడితే ఊరుకోమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు. ఆక్రమణదారులపై చట్టపరంగా చర్యలుంటాయని వార్నింగ్ ఇచ్చారు. -
మేడ్చల్: జ్యువెలరీ షాపులో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు
సాక్షి, మేడ్చల్: మేడ్చల్ జ్యువెలరీ షాపులో దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. 24 గంటల్లో నిందితులను పట్టుకున్నారు. షాపు యాజమానిని కత్తితో పొడిచి దొంగలు నగదు ఎత్తుకెళ్లారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పోలీసులు పట్టుకున్నారు.ఆ రోజు ఏం జరిగిందంటే?ఒకరు బుర్ఖా.. మరొకరు హెల్మెట్ ధరించిన దుండగులు పట్టపగలే జ్యువెలరీ షాపులో దోపిడీకి యత్నించారు. దుకాణ యజమానిపై కత్తితో దాడి చేసి బంగారు ఆభరణాలు, నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. యజమాని చాకచక్యంగా వ్యవహరించడంతో పలాయనం చిత్తగించిన ఘటన గురువారం మేడ్చల్ పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు, జ్యువెలరీ షాపు యజమాని చెప్పిన వివరాల ప్రకారం.. మేడ్చల్ పట్టణంలో 44వ జాతీయ రహదారి పక్కన మేడ్చల్ పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు (20 అడుగుల) దూరంలో జగదాంబ జ్యువెలరీ దుకాణం ఉంది.గురువారం మధ్యాహ్నం 1.45 గంటల సమయంలో బైక్‌పై ఇద్దరు దుండగులు (వెనుక కూర్చున్న వ్యక్తి బుర్ఖా.. మరొకరు ముఖానికి హెల్మెట్ ధరించి ఉన్నారు) వచ్చారు. షాపులోకి వచ్చి యజమాని శేషురాం చౌదరిపై బుర్ఖా ధరించిన దుండగుడు కత్తితో దాడి చేశాడు. ఆభరణాలు, నగదును తన వద్ద ఉన్న కవర్లో వేయాలని బెదిరించాడు. అరవవద్దని హిందీలో బెదిరించాడు. దీంతో పక్కనే ఉన్న శేషురాం చౌదరి కుమారుడు సురేశ్ షాపు వెనుక గదిలోకి పరుగులు తీశాడు.హెల్మెట్ ధరించిన దుండగుడు షాపులోని వెండి ఆభరణాలు తీసుకుని బుర్ఖా ధరించిన వ్యక్తికి కవర్ పట్టుకో అందులో వేస్తానని చెప్పాడు. వెంటనే అప్రమత్తమైన షాపు యజమాని శేషురాం చౌదరి చాకచాక్యంగా వ్యవహరించి.. హెల్మెట్ ధరించిన వ్యక్తిని తోసి బయటికి వచ్చి చోర్ చోర్ అంటూ అరవసాగాడు. దీంతో దుండగులు పరారయ్యేందుకు బయటికి వస్తుండగా కొంత మేర దోచుకున్న ఆభరణాల కవర్ కిందపడింది. దానిని అక్కడే వదిలిపెట్టి బైక్ ఎక్కారు. అప్పటికే గది లోపలి నుంచి బయటికి వచ్చిన సురేశ్ షాపులోని కుర్చీని దుండగులపై విసిరి వారిని నిలువరించేందుకు యత్నించడంతో పరారయ్యారు. దుండగుల దాడిలో గాయపడిన శేషురాం చౌదరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.దుండగులు దోపిడికి యత్నించిన జగదాంబ జ్యువెలరీ షాపులో, షాపు బయట సీసీ కెమెరాలు ఉన్నాయి. దీంతో దుండగుల దోపిడీ చేసిన తీరు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. బైక్‌పై వచ్చి లోపలికి ప్రవేశం. షాపు యజమానిపై దాడి, బెదిరింపులకు దిగిన తీరు సీసీ కెమెరాల్లో నమోదు కావడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.దర్యాప్తు చేపట్టి పోలీసులు సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను పరిశీలించారు. బైక్ నంబర్, ఇతర ఆధారాలు సేకరించి నిందితులను పోలీసులు 24 గంటల్లో పట్టుకున్నారు. -
మేడ్చల్‌లో పట్టపగలే ముసుగు దొంగల బీభత్సం.. జ్యువెలరీ షాప్‌లో చొరబడి..
సాక్షి, మేడ్చల్: పట్టపగలే బంగారం షాపు యజమానిపై కత్తితో దాడి చేసిన ఘటన సంచలనం సృష్టించింది. జ్యువెలరీ షాపులోకి చొరబడిన ఇద్దరు దొంగలు షాప్ యజమానిని కత్తితో పొడిచి గల్లాపెట్టెలోని డబ్బులతో పరారయ్యారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా చోరుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.మేడ్చల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని శేషారాం అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. మధ్యాహ్నం.. షాపులో కస్టమర్లు లేని సమయంలో ఇద్దరు దొంగలు చొరబడ్డారు. ఒక వ్యక్తి బుర్ఖా ధరించి ఉండగా.. మరో దుండగుడు హెల్మెట్ ధరించి ఉన్నాడు. యజమాని శేషారాంను కత్తితో పొడిచి నగదుతో ఉడాయించారు. ఈ ఘటన అంతా సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. శేషారాంను ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. -
ఆ ఈవీఎంల వినియోగానికి హైకోర్టు ఓకే
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ అసెంబ్లీ ఎన్నికలకు వినియోగించిన ఈవీఎంలు, వీవీప్యాట్లు పార్లమెంట్ ఎన్నికల్లో వాడుకునేందుకు ఎన్నికల కమిషన్‌కు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అలాగే మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేసింది. 2023 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున మల్లారెడ్డి, కాంగ్రెస్ తరఫున వజ్రేష్‌యాదవ్ పోటీ చేశారు. 33 వేల మెజారిటీతో మల్లారెడ్డి విజయం సాధించారు. అయితే అఫిడవిట్లో మల్లారెడ్డి తప్పుడు సమాచా రం ఇచ్చారని.. నిర్ణీత ఫార్మాట్లో వివరాలన్నీ ఇవ్వలేదని ఆయన ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ వజ్రేష్ యాదవ్ హైకోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. సమీప అభ్యర్థి అయిన తనను ఎమ్మెల్యేగా ప్రకటించేలా ఎన్నికల కమిష న్కు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. వజ్రేష్ తరఫున న్యాయవాది సిర్థ పోగుల దాఖలు చేసిన పిటిష న్పై జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు బుధవారం విచారణ చేపట్టారు. ఎన్నికల కమిషన్, మేడ్చేల్ ఆర్డీవో, అసెంబ్లీ కార్యదర్శి, మల్లారెడ్డితో పాటు ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. అయితే కేసు కారణంగా గోడౌన్లో భద్రపరిచిన ఈవీఎంలు, వీవీప్యాట్లను వాడుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఈసీ మధ్యంతర పిటిషన్ దాఖలు చేయగా, అందుకు న్యాయమూర్తి అంగీకరించారు.పల్లా రాజేశ్వర్‌రెడ్డికి నోటీసులుజనగామ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి (బీఆర్ఎస్) ఎన్నికను సవాల్ చేస్తూ కొమ్మూరి ప్రతాపరెడ్డి(కాంగ్రెస్) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సమీప ప్రత్యర్థినైన తనను శాసనసభ్యుడిగా ప్రకటించేలా ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై కూడా న్యాయమూర్తి జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు బుధవారం విచారణ చేపట్టారు. వాదన తర్వాత.. రాజేశ్వర్‌రెడ్డి సహా ఇతర ప్రతివా దులకు న్యాయమూర్తి నోటీసులు జారీ చేస్తూ, విచారణను జూన్ 14కు వాయిదా వేశారు. -
రేవంత్లాంటోళ్లను కేసీఆర్ చాలామందినే చూశారు: కేటీఆర్
సాక్షి, మేడ్చల్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు మరోసారి మండిపడ్డారు. బీఆర్ఎస్ను బొందపెడతామని రేవంత్ ప్రగల్భాలు పలుకుతున్నారని.. అలాంటి వాళ్ళను చాలా మందినే చూశామని అన్నారు. ఘట్కేసర్లో శుక్రవారం నిర్వహించిన మేడ్చల్ నియోజకవర్గ విజయోత్సవ సభకు ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘రేవంత్ లాంటి బుడ్డర్ ఖాన్‌లను కేసీఆర్ ఎంతోమందని చూశారు. ఎంతోమంది తీస్మార్ ఖాన్‌లను మాయం చేసి తెలంగాణా తెచ్చారు కేసీఆర్. పార్టీ కార్యకర్తలు ఎవరికి అన్యాయం జరిగిన అందరం బస్ వేసుకొని వస్తాం. మా బాస్‌లు ఢిల్లీలో లేరు. గుజరాత్‌లోనూ లేరు. లంకె బిందెల కోసం వెతికే వారు అధికారంలోకి వచ్చారు. సెక్రటేరియట్లో కంప్యూటర్లు, జీవోలు ఉంటాయి.. లంకె బిందెలు ఉండవు. లంకెబిందెల కోసం వెదికేది ఎవరో ప్రజలకు తెలుసు. ప్రతి ప్రతి హామీని నెరవేర్చే వరకు ప్రజల తరపున పోరాడుతాం.’ అని కేటీఆర్ అన్నారు. ‘2 లక్షల అప్పు తెచ్చుకోండి. నేను మాఫీ చేస్తా అన్నారు. ఇప్పుడు ఆ హామీ ఎటుపోయింది. ఆడబిడ్డలకు నెలకు రూ.2500 ఇస్తామన్నారు. వాటికోసం కోటి 57 లక్షల మంది ఆడబిడ్డలు వేచి చూస్తున్నారు. ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్ల కడుపు కొట్టారు. కడుపు కాలిన ఆటోడ్రైవర్ ప్రజాభవన్ ముందు ఆటో కాలబెట్టాడు. రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలు జుట్లు పట్టుకుంటున్నారు’ అని కేటీఆర్ మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి చెక్ పెట్టాలని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేంద్రంలో బీజేపీని అడ్డుకోగలిగేది ప్రాంతీయ పార్టీలేనని పేర్కొన్నారు. ఆరు గ్యారంటీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి చేతులెత్తేశారని మండిపడ్డారు. కేంద్రంలో తాము అధికారంలోకి వస్తేనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని అంటున్నారని విమర్శించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు, ఆరు గ్యారంటీలు అమలు చేసేది లేదని అన్నారు. కాంగ్రెస్‌కు గతంలో వచ్చిన సీట్లు కూడా రావని దుయ్యబట్టారు. మల్లారెడ్డిని ఢీ కొట్టలేరు మేడ్చల్‌లో మల్లారెడ్డితో పోటీ పడే పరిస్థితి ఎవరికీ లేదని అన్నారు. ప్రజల కోసం పనిచేసే నాయకుడు మల్లారెడ్డి అని తెలిపారు. 420 హామీలు ఇచ్చిన రేవంత్ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. మోసపూరిత మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. తెలంగాణ మాట ఢిల్లీలో వినబడాలి అంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేయాలన్నారు. తెలంగాణ హక్కుల కోసం కొట్లాడేది బీఆర్ఎస్ ఎంపీలేనని.. అందుకే బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో ఉండాలన్నారు. చదవండి: బీఆర్ఎస్కు బిగ్ షాక్.. మర్రి జనార్దన్‌రెడ్డి రాజీనామా? -
మాజీ మంత్రి మల్లారెడ్డికి భారీ షాక్!
సాక్షి, మేడ్చల్: మేడ్చల్ నియోజకవర్గంలోని 19 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరనున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి సొంత నియోజకవర్గం మేడ్చల్‌లోని జవహర్‌నగర్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ మేకల కావ్యపై 19 మంది అసమ్మతి కార్పొరేటర్లు అవిశ్వాసం తీర్మానం ఇచ్చిన సంగతి తెలిసిందే. కావ్య ఒంటెద్దు పోకడలకు సొంత పార్టీ అసమ్మతి కార్పొరేటర్లు మేడ్చల్ జిల్లా కలెక్టర్‌కు అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చి వైజాగ్ టూర్‌కు వెళ్లినట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కొత్తగా ఎన్నుకున్న మేయర్‌తో అసమ్మతి కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి మల్లారెడ్డికి మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డిల మధ్య విభేదాలన్న విషయం తెలిసిందే. ఇక.. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టికి మలిపెద్ది సుధీర్ రెడ్డి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. చదవండి: TS: ప్రభుత్వ సలహాదారుల నియామకం -
ఘనంగా రికేల్ ఫోర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ 12వ వార్షికోత్సవం
మేడ్చల్ జిల్లా: కీసర మండలం రాంపల్లీ గ్రామంలో ఉన్న రికెల్ ఫోర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్లో 12వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. చిన్నారులు భరత నాట్యం నృత్యం చేస్తూ, పాటలు పాడుతూ అల్లరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు శ్రద్ధతో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అన్నారు. విద్యార్థులు అనునిత్యం ఫోన్లు దూరం పెట్టి చదువుపై శ్రద్ధ పెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఛైర్మెన్ ఉదయ్ కుమార్, ఎన్.జి.అర్.ఐ మాజీ చీఫ్ సైంటిస్ట్ కీర్తి శ్రీవాస్తవ, ఉస్మానియా యూనివర్సిటీ బయో కెమిస్ట్రీ హెచ్.ఓ.డీ సూర్య సత్యనారాయణ సింగ్, విద్యార్థులు, తల్లిదండ్రులు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
రెండు లక్షల కొలువులిస్తాం
జవహర్‌నగర్, మేడ్చల్ రూరల్: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెసేనని, తమ ప్రభుత్వం ఏర్పాటుకాగానే రెండు లక్షల కొలువులను భర్తీ చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ వస్తే ఆగమవుతుందని కేసీఆర్, కేటీఆర్ ప్రచారం చేస్తున్నారని.. బీఆర్ఎస్ పాలనలోనే తెలంగాణ ఆగమైందని మండిపడ్డారు. మంత్రి మల్లారెడ్డి మేడ్చల్‌ను అభివృద్ధి చేయకపోగా కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గురువారం మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్, మేడ్చల్ పరిధిలో కాంగ్రెస్ అభ్యర్ధి తోటకూర వజ్రేశ్ (జంగయ్య) యాదవ్‌ను గెలిపించాలంటూ కార్నర్ మీటింగ్‌లు నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ‘‘సీఎం కేసీఆర్‌కు, మంత్రులకు ఆస్తులున్న కోకాపేట వైపు ఐటీ సంస్థలను ఏర్పాటు చేశారు. జవహర్‌నగర్‌ను అభివృద్ధి చేయకపోగా డంపింగ్ యార్డ్‌ను బహుమతిగా ఇచ్చారు. మేడ్చల్, జవహర్‌నగర్‌లలో ఐటీ కంపెనీలు రాకుండా బీఆర్ఎస్ నాయకులు అడ్డుపడుతున్నారు. మేడ్చల్‌లో ఐటీ పార్క్ తెస్తామని గొప్పలు చెప్పిన కేటీఆర్ పత్తాలేకుండా పోయారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఐటీ కారిడార్‌ను ఏర్పాటు చేస్తాం..’’అని తెలిపారు. మల్లారెడ్డి టికెట్ కోసం ఎన్నికోట్లు ఇచ్చారు? రాష్ట్రంలో కేసీఆర్ వందల కోట్లు దండుకుంటుంటే.. మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డి చెరువులను కబ్జాచేస్తూ, కిందిస్ధాయి ప్రజాప్రతినిధులకు సీట్లు అమ్ముకుని వందల కోట్లు వెనకేసుకున్నారు. జవహర్‌నగర్‌లో ప్రభు త్వ స్థలంలో మంత్రి మల్లారెడ్డి ఆస్పత్రి కట్టినా పట్టించుకోవడం లేదుగానీ.. పేదలు 60 గజాల్లో గుడిసెలు వేసుకుంటే కూల్చివేస్తున్నారు. ఇంత అవినీతికి పాల్పడ్డ మల్లారెడ్డి ఎమ్మెల్యే టికెట్ కోసం కేసీఆర్‌కు ఎన్ని కోట్లు ఇచ్చారో చెప్పాలి..’’అని రేవంత్ డిమాండ్ చేశారు. ఇక్కడ మూడుచింతలపల్లిని దత్తత తీసుకున్న సీఎం కేసీఆర్ ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ దళితులకు మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు, నిరుద్యోగ భృతి వంటి ఎన్నో హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని, ఇప్పుడు మూడోసారి గెలిపించాలంటూ వస్తున్నారని విమర్శించారు. ఇన్నాళ్లూ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని కేసీఆర్ అడుగుతున్నారని.. హైదరాబాద్‌లో ఔటర్ రింగురోడ్డు, శంషాబాద్ విమానాశ్రయం, ఫార్మా కంపెనీలు, మెట్రో రైలు, ఫ్లైఓవర్లు, గోదావరి, కృష్ణా జలాల తరలింపు వంటివి వచ్చిది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కాదా? అని ప్రశ్నించారు. దొరల ప్రభుత్వాన్ని కూల్చాలి అసలు తెలంగాణ ఇచ్చింది సోనియాగాందీ, కాంగ్రెస్ పార్టీ అని.. రాష్ట్రం ఇవ్వకుంటే కేసీఆర్ కుటుంబం నాంపల్లి దర్గా వద్దో. బిర్లామందిర్ మెట్లపైనో బిచ్చమెత్తుకునే వారని రేవంత్ అన్నారు. హరీశ్‌రావుకు వేల కోట్లు ఎలా వచ్చాయని, కేసీఆర్, కేటీఆర్‌లకు వేల ఎకరాల భూములు, ఫామ్‌హౌస్‌లు ఎక్కడివని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటోందని ఆరోపించారు. ఈ అసెంబ్లీ ఎన్నికలు దొరల పాలనకు, పేదలకు మధ్య పోరాటమని.. పేదల ప్రభుత్వం రావాలంటే దొరల ప్రభుత్వాన్ని కూల్చాలని పిలుపునిచ్చారు. రైతులను మోసం చేస్తున్న కేసీఆర్ కేసీఆర్ రైతుబంధు, రైతు బీమా అంటూ రైతులను మోసం చేస్తున్నారని.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇప్పటికే 91వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు నివేదికలే వెల్లడించాయని రేవంత్ చెప్పారు. సీఎం కేసీఆర్ కాళేశ్వరం పేరిట లక్ష కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా 30లక్షల మంది నిరుద్యోగులను ముంచిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలతో పేదలకు మేలు జరుగుతుందన్నారు. ఇల్లు లేని వారికి 250 గజాల స్థలంతోపాటు ఇల్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు ఇస్తామని.. ఆడపిల్లలకు పెళ్లినాడే రూ.లక్ష ఆర్థిక సా యంతోపాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ మున్సిపాలిటీకి చెందిన ఐదుగురు కార్పొరేటర్లు, జవహర్‌నగర్ ముదిరాజ్ జిల్లా యువజన అధ్యక్షుడు అనిల్, రజక, కురుమ సంఘం సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
34 కాలనీలు.. 85 నామినేషన్లు
మేడ్చల్: ఏళ్ల క్రితం చట్ట ప్రకారంగా కొనుగోలు చేసిన భూముల్లో వారు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. అయితే ఓ వ్యక్తి ఫిర్యాదుతో వారి స్థలాలు వక్ఫ్ భూములని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో తమ సమస్యలను పట్టించుకోవాలని మేడ్చల్ బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని 30 కాలనీల ప్రజలు 85 మందితో అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్లు వేసి నిరసన తెలిపారు. బోడుప్పల్ ప్రాంతంలో ఆర్ఎన్ఎస్ కాలనీ, పెంటారెడ్డి కాలనీ,ç మారుతీనగర్, ఘట్కేసర్కు చెందిన మధురానగర్ తదితర 30 కాలనీల ప్రజలు నాలుగేళ్లుగా విచిత్ర సమస్యను ఎదుర్కొంటున్నారు. బోడుప్పల్ ప్రాంతంలో 30 సర్వే నంబర్లలో 300 ఎకరాలు, ఘట్కేసర్ పరిధిలో 10 ఎకరాలు భూమి ఉంది. 40 ఏళ్ల క్రితం అవన్నీ వెంచర్లుగా మారిపోయాయి. బోడుప్పల్, పిర్జాదీగూడ నగర శివారు ప్రాంతాలు కావడంతో శరవేగంగా అభివృద్ధి సాధించాయి. రియల్టర్లు భూములను కొనుగోలు చేసి వెంచర్లను ఏర్పాటు చేశారు. చట్టబద్ధంగా వినియోగదారులకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు ప్లాట్లు కొనుగోలు చేసి సొంతింటి కల నెరవేర్చుకున్నారు. దాదాపు 30 కాలనీలలో ఏడు వేల కుటుంబాలు నివసిస్తున్నాయి. 2018 వరకు అంతా సాఫీగానే ఉన్నా ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. 2018లో ఓ వ్యక్తి కాలనీలు ఉన్న భూములన్నీ వక్ఫ్ భూములని ఫిర్యాదు చేయడంతో ఆ భూముల రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. దీంతో 7వేల కుటుంబాల వారు జేఏసీగా ఏర్పడి పోరాటం మొదలు పెట్టారు. 2022 సంవత్పరంలో 30 కాలనీల్లో ఉన్న భూములన్నీ ప్రభుత్వ నిషేధిత జాబితాలో చేర్చడంతో కాలనీలలో ఇల్లు కట్టుకున్న వారి భవిష్యత్ అంధకారంగా మారంది. జేఏసీ తరపున పోరాటాలు చేసినా పాలకుల నుంచి, ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో వారి రోదన అరణ్య రోదనగా మారింది. తమ సమస్యను ఎమ్మెల్యే నుంచి ఎంపీ వరకు ఎవరికి విన్నవించుకున్నా పరిష్కారం కాకపోవడంతో వారు తమ సమస్యపై పాలకులు స్పందించాలని డిమాండ్ చేస్తూ ఏకంగా 88 నామినేషన్లు వేశారు. శుక్రవారం కాలనీల వాసులు కీసరలోని ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి నామినేషన్లను దాఖలు చేశారు. మేడ్చల్ నియోజకవర్గంలో మొత్తం 116 మంది నామినేషన్లు వేయగా అందులో 88 మంది బోడుప్పల్ 30 కాలనీలకు చెందిన వారే. ప్రభుత్వానికి మా సమస్య తెలియాలనే.. మేం ఎన్నికలలో విజయం సాధిస్తామని నామినేషన్ వేయలేదు. మా సమస్య వచ్చే ప్రభుత్వానికి తెలియాలనే మూకుమ్మడి నామినేషన్లు వేశాం. ఎన్నికల ద్వారానైన మా సమస్య ప్రభుత్వం దృష్టికి పోతుందని అనుకుంటున్నాం. – శ్రీధర్‌రెడ్డి, ఐక్యకార్యాచరణ సమితి అధ్యక్షుడు పాలకులు పట్టించుకోవడం లేదు.. పాలకులు పట్టించుకోకపోవడం వల్లే 88 మంది నామినేషన్లు వేశారు. సమస్యను మంత్రి మల్లారెడ్డికితో పాటు అందరు పాలకులకు విన్నవించినా ఎవరూ పట్టించుకోలేదు. మా సమస్య పట్టించుకోని నేతలకు ఓటు ద్వారా బుద్ది చెబుతాం – కుంభం కిరణ్‌కుమార్, కార్పొరేటర్, జేఏసీ కోచైర్మన్ -
ఆ వృత్తం.. ఓ వి‘చిత్రం’!
అది ఏడున్నర మీటర్ల వ్యాసంతో ఉన్న భారీ వృత్తం.. ఎక్కడా వంకరటింకరగా లేకుండా వృత్తలేఖినితో గీసినట్టు కచ్చితమైన రూపం.. పెద్ద బండరాయి మీద 30 అంగుళాల మందంతో చెక్కటంతో అది ఏర్పడింది.. కానీ అది ఇప్పటిది కాదు, దాదాపు 3 వేల ఏళ్ల నాటిది కావడం విశేషం. సాక్షి, హైదరాబాద్: భాగ్యనగర శివారు ప్రాంతాల్లో కొన్ని గుట్టల్లో ఆదిమానవులు గీసిన రంగుల చిత్రాలు నేటికీ కనిపిస్తాయి. కానీ వాటికి భిన్నంగా ఇప్పుడు గుట్ట పరుపుబండ మీద ఆదిమానవులు చెక్కిన పెద్ద వృత్తం (జియోగ్లిఫ్) చరిత్ర పరిశోధకులను ఆకర్షిస్తోంది. మేడ్చల్ సమీపంలోని మూడు చింతలపల్లి శివారులోని గుట్ట మీద ఇది వెలుగు చూసింది. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు కె.గోపాల్, మహ్మద్ నజీరుద్దీన్, అన్వర్ బాష, అహోబిలం కరుణాకర్‌లు ఇచ్చిన సమాచారం మేరకు చరిత్ర పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి ఆ బృందంతో కలసి దాన్ని పరిశీలించారు. ‘తక్కువ ఎత్తున్న గుట్ట పరుపుబండపై ఈ వృత్తం చెక్కి ఉంది. ఏడున్నర మీటర్ల వ్యాసంతో భారీగా ఉన్న ఈ వృత్తం మధ్యలో రెండు త్రిభుజాకార రేఖా చిత్రాలను కూడా చెక్కారు. అంత పెద్దగా ఉన్నప్పటీకీ వంకరటింకరలు లేకుండా ఉండటం విశేషం. దీనికి సమీపంలో కొత్త రాతియుగం రాతి గొడ్డళ్లు నూరిన గాడులు (గ్రూవ్స్) ఉన్నాయి. ఇప్పటి వరకు తెలంగాణలో ఈ తరహా చెక్కిన రేఖా చిత్రం వెలుగుచూడకపోవటంతో దీనిపై మరింతగా పరిశోధించాల్సి ఉంది’అని శివనాగిరెడ్డి పేర్కొన్నారు. సమాధి నమూనా అయ్యుండొచ్చు.. ఈ చిత్రం ఇనుప యుగానికి చెందిందిగా భావిస్తున్నాం. అప్పట్లో మానవుల సమాధుల చుట్టూ వృత్తాకారంలో పెద్ద రాళ్ల వరుసను ఏర్పాటు చేసేవారు. ఆ సమాధి నిర్మాణానికి నమూనాగా ఈ వృత్తాన్ని గీసి ఉంటారన్నది మా ప్రాథమిక అంచనా. గతంలో కర్ణాటకలో ఇలాంటి చిత్రం కనపించింది. దాని మధ్యలో చనిపోయిన మనిషి ఉన్నట్లు చిత్రించి ఉంది. ఈ చిత్రాన్ని మరింత పరిశోధిస్తే కొత్త విషయాలు తెలుస్తాయి. – రవి కొరిశెట్టార్, పురావస్తు నిపుణుడు -
కీలక పరిణామం.. కాంగ్రెస్ గూటికి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే
సాక్షి, మేడ్చల్: ఎన్నికల వేళ రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. బీఆర్ఎస్కు మరో నేత గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్‌రెడ్డి హస్తం గూటికి చేరనున్నారు. టీపీసీసీ ఛీప్ రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లోకి చేరనున్నారు. రేవంత్‌రెడ్డి ఇవాళ సుధీర్‌రెడ్డి నివాసానికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. మలిపెద్ది సుధీర్ రెడ్డి 2014లో బీఆర్ఎస్ తరఫున మేడ్చల్ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2018లో జరిగిన ఎన్నికల్లో మాత్రం ఆయనకు మళ్లీ సీటు దక్కలేదు. పార్టీ అధిష్టానం అప్పట్లో పార్లమెంటు సభ్యుడిగా ఉన్న మల్లారెడ్డిని మేడ్చల్ నుంచి బరిలోకి దింపింది. ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత మల్లారెడ్డిని ఏకంగా మంత్రి వర్గంలోకి చేర్చుకుంది. తరువాతి కాలంలో మల్లారెడ్డి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితలకు దగ్గరయ్యారు. బీఆర్ఎస్లో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. ఈ నేపథ్యంలోనే ఐదేళ్ల నుంచి మల్లారెడ్డికి, సుధీర్‌రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇరువురు నేతలూ బహిరంగంగానే విమర్శలకు దిగిన సందర్భాలూ ఉన్నాయి. సుధీర్ రెడ్డి అసంతృప్తిని చల్లార్చేందుకు అప్పట్లో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి చర్చలు జరిపి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి, కుమారుడు శరత్‌చంద్రారెడ్డికి జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవి దక్కే ప్రయత్నం చేశారు. సమయం కోసం ఎదురుచూస్తున్న ఆయనకు.. 2023 ఎన్నికల ప్రకటన వెలువడిన నేపథ్యంలో సుధీర్ రెడ్డి బీఆర్ఎస్లో కొనసాగే విషయంలో మల్లగుల్లాలు పడుతుండగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగింది. బీఆర్ఎస్లో తాను ఎంతకాలమున్నా తాను మళ్లీ ఎమ్మెల్యే కాలేని, నియోజకవర్గంలోనూ పట్టు సాధించలేనని సుధీర్‌రెడ్డి చాలా కాలంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో సుధీర్‌రెడ్డికి బంధుత్వం కూడా ఉంది. అయితే, తనకు అసెంబ్లీ టికెట్ ఇస్తేనే కాంగ్రెస్ పార్టీలోకి వస్తానని సుధీర్ రెడ్డి తేల్చి చెప్పినట్లు సమాచారం. కానీ మేడ్చల్ నియోజకవర్గంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తరఫున హరివర్ధన్‌రెడ్డి, జంగయ్య యాదవ్, నక్క ప్రభాకర్ గౌడ్ వంటి నేతలు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. మరోవైపు సుధీర్‌రెడ్డి మాత్రం తనకు టికెట్ ఇస్తే విజయం సాధించి తీరతానని కాంగ్రెస్ నేతల వద్ద ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంప్రదాయ ఓట్లతోపాటు రెడ్డి సామాజిక వర్గం ఓట్లు, బీఆర్ఎస్ ఓట్లూ తాను పొందగలనని, టికెట్ ఆశిస్తున్న మిగిలిన నేతలకు ఈ అవకాశం లేదన్నది ఆయన విశ్లేషణగా ఉంది. ఇద్దరు కౌన్సిలర్లు బీఆర్ఎస్కు రాజీనామా.. నల్లగొండ మున్సిపాలిటీలో మరో ఇద్దరు కౌన్సిలర్లు బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. కోమటిరెడ్డి సమక్షంలో వారు కాంగ్రెస్‌లోకి చేరారు. ఇప్పటి వరకు ఎనిమిది మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లోకి చేరారు. మరో నలుగురు కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది. చదవండి: మన పార్టీలో కూడా ఫ్యామిలీ ప్యాకేజీలుంటాయా? -
భయాందోళనలో హాస్టళ్ల విద్యార్థులు
-
మైసమ్మగూడలో నీట మునిగిన హాస్టల్స్
-
HYD Rains: మైసమ్మగూడలో నీట మునిగిన అపార్ట్మెంట్లు
సాక్షి, మేడ్చల్: భారీ వర్షాలతో గుండ్ల పోచంపల్లి పరిధి మైసమ్మగూడలో పలు కాలనీలు నీటమునిగాయి. ప్రధాన రోడ్లపై వర్షం నీరు ఏరులైపారుతోంది. ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువుకునే విద్యార్థులు ఉంటున్న సుమారు 30 అపార్ట్మెంట్లలో వరద నీరు చేరింది. ఒకటో అంతస్తు వరకు వరద నీరు చేరింది. పలువురు విద్యార్థులకు ఈ రోజు పరీక్షలు ఉండటంతో మునిగిపోయిన హాస్టల్ నుండి ఎటు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. మైసమ్మగుడలో కాలువలు, నాళాలు కబ్జాకు గురయ్యాయి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలు నీట మునగటంతో విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు. రెండు జేసీబీలను రప్పించి అపార్ట్ మెంట్లలో ఉంటున్న విద్యార్థులను బయటకు తీసుకువస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో నగరానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. నగరం, శివారుల్లోని పలు కాలునీలు నీట మునిగి చెరువుల్ని తలపిస్తున్నాయి. జలాశయాలకు నీరు పోటెత్తడంతో గేట్లు వదిలి.. దిగువనకు విడుదల చేస్తున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజల్ని ముందస్తుగానే ఖాళీ చేయాలని కోరుతున్నారు అధికారులు. -
‘మంత్రి మల్లారెడ్డి నుంచి ప్రాణహాని ఉంది’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కార్మిక శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డిపై సంచలన ఆరోపణలు చేస్తూ ఇద్దరు వ్యక్తులు ఇవాళ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మీడియా ముందుకు వచ్చారు. దాదాపు 30 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని కాజేసే కుట్ర జరుగుతోందని.. మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన బామ్మర్ది శ్రీనివాస్‌రెడ్డి తమపై దౌర్జన్యానికి దిగుతున్నారని.. తమకు ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు వాళ్లు. మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లిలో ఉన్న మంత్రి మల్లారెడ్డి కాలేజీ ఎదురుగా ఉన్న భూమిని మర్రి వెంకట్‌రెడ్డి, దయాసాగర్‌రెడ్డి అనే ఇద్దరు.. సుంకరి అనే కుటుంబం నుంచి భూమిని కొనుగోలు చేశారు. మొత్తం ఎనిమిది ఎకరాల్లో.. 4.5 ఎకరాలు కొన్నారు వీళ్లు. అదే సమయంలో మంత్రి మల్లారెడ్డి తన భార్య పేరు మీద 2 ఎకరాలు కొన్నారు. అయితే మొత్తం భూమిని కాజేసేందుకు మంత్రి కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు వీళ్లు. భూమి వద్దకు వెళ్లిన మాపై మంత్రి, ఆయన అనుచరులు దాడి చేశారు. మంత్రి బామర్ది శ్రీనివాస్ రెడ్డి అయితే ఏకంగా గన్‌తో షూట్ చేస్తానంటూ బెదిరించాడు. భూమిని వదిలి వేళ్లాలని మమ్మల్ని బెదిరించారు. పోలీసులకు పిర్యాదు చేసినా.. రాజకీయ ఒత్తిడి ఉందంటూ పట్టించుకోవడం లేదు. భూ రికార్డుల నుండి మా పేరు తొలగించి.. అక్రమంగా మంత్రి వారి పేరు పై మార్చుకున్నారు. మా భూమి మాకు ఇప్పించాలని ప్రభుత్వం కు విజ్ఞప్తి చేస్తున్నాం అని బాధితులు మీడియా ముందు వాపోయారు. మంత్రి మల్లారెడ్డి చాలా మంది రైతులను మోసం చేస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి నుంచి మాకు ప్రాణహాని ఉంది. రక్షణ కల్పించి మాకు న్యాయం చేయాలని సీఎం కేసీఆర్‌ను కోరుతున్నాం అని బాధితులు మర్రి వెంకట్ రెడ్డి, దయాసాగర్ రెడ్డిలు మీడియా సాక్షిగా విజ్ఞప్తి చేశారు. ఇక ఈ ఆరోపణలపై మంత్రి మల్లారెడ్డిగానీ, శ్రీనివాసరెడ్డిగానీ స్పందించాల్సి ఉంది. ఇదీ చదవండి: మేం తిరగబడితే.. మీరెక్కడా తిరగలేరు! -
వాష్ రూంకు వెళ్లొస్తానని... పరీక్ష కేంద్రం నుంచి వెళ్లిపోయిన అభ్యర్థి..
సాక్షి, మేడ్చల్ జిల్లా: పరీక్షా కేంద్రం నుంచి నిర్ణీత సమయం కంటే ముందే పారిపోయిన అభ్యర్థిపై మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేశారు. టీఎస్పీఎస్సీ మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖలో అకౌంటెంట్ పోస్టుల భర్తీకి మంగళవారం పరీక్ష జరిగింది. ఆన్లైన్లో నిర్వహించిన ఈ పరీక్షకు మేడ్చల్ మండలంలో 8 కేంద్రాలను ఏర్పాటు చేశారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయలోని సీఎంఆర్ సెట్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో పరీక్ష రాసేందుకు ఆదిలాబాద్ జిల్లా శాంతినగర్‌కు చెందిన మహ్మద్ అసర్ హాజరయ్యాడు. బయో సబ్జెక్ట్‌కు విరామం ఇచ్చిన సమయంలో సాయంత్రం 4:15 నిమిషాలకు అసర్ టాయిలెట్ కోసం అనుమతి తీసుకొని బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో అతను పారిపోయినట్లు గుర్తించిన చీఫ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్‌రెడ్డి మేడ్చల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు సీఐ నర్సింహారెడ్డి తెలిపారు. -
కేంద్రం నిధులపై లెక్కలు రాయాలి
మేడ్చల్: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి విడుదల చేస్తున్న నిధులపై రాష్ట్ర ప్రజలందరూ లెక్కలు రాసి వాటిని అవసరమైనప్పుడు చూపాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మేడ్చల్ పట్టణంలోని కేఎల్ఆర్ వెంచర్ ఫేజ్–2 కమాన్ వద్ద ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని, అమరవీరుల స్థూపాన్ని ఆదివారం ఆమె మంత్రి మల్లారెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రొ. జయశంకర్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ కోసం ఖర్చు చేసిన నిధులపై లెక్కలు రాసి రాష్ట్ర సాధన ఉద్యమాల సమయంలో ప్రజలకు నాయకుల ద్వారా వివరించారన్నారు. ఆయన రాసిన లెక్కల ద్వారానే తెలంగాణ ఎంత అన్యాయం జరిగింది ప్రజలకు తెలిసిందన్నారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు. మోసం చేస్తున్న వారిని పక్కాగా గుర్తు పెట్టుకోవాలన్నారు. ఆర్టీసీ బిల్లుపై గవర్నర్‌కు వచ్చిన ఇబ్బంది ఏమిటో తమకు అర్థంకావడం లేదని అన్నారు. అలుపెరగని యోధుడు జయశంకర్.. అలుపెరగని యోధుడు జయశంకర్ అని ఆమె పేర్కొన్నారు. జీవితాన్ని తెలంగాణ కోసం త్యాగం చేశాడన్నారు. ఆంధ్రలో తెలంగాణ వీలీనాన్ని ఆయన ఒప్పుకోలేదని, ఆ తర్వాత ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నాడని, ఆ తర్వాత తొలిదశ, మలి దశ ఉద్యమాల్లో పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించాడని కొనియాడారు. ఆయన జీవితం యువతకు ఆదర్శనీయమన్నారు. కేసీఆర్‌కు అండగా నిలిచారు.. రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో కేసీఆర్ దొర అని ఆయన వెనుక బీసీ అయిన జయశంకర్ ఉండవద్దని ఎంతో మంది జయశంకర్‌కు చెప్పారని అందుకు ఆయన కేసీఆర్ తెలంగాణ కోసం ఉద్యమం చేస్తున్నాడని ఆయన తెలంగాణ నినాదం వదిలితే తాను కేసీఆర్‌ను వదులుతానని అనేవారని గుర్తు చేశారు. కేసీఆర్ ఉద్యమాన్ని వదలేదని జయశంకర్ కేసీఆర్‌ను వదలేదన్నారు. ఉద్యమంలో అమరుడైన శ్రీనివాస్ కుటుంబానికి రూ.5 లక్షలు ఇస్తానని మంత్రి మల్లారెడ్డి ఈ సందర్భంగా ప్రకటించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దేవీ వరప్రసాద్, బీఆర్ఎస్ నాయకులు మహేందర్‌రెడ్డి, వీరభద్రారెడ్డి, ప్రవీణ్‌కుమార్ ,సత్యపాల్‌రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ దీపిక నర్సింహారెడ్డి, మద్దుల శ్రీనివాస్‌రెడ్డి, భాస్కర్ యాద వ్, శంకర్‌ముదిరాజ్, జగన్‌రెడ్డి, దయానంద్‌యాదవ్, రమేష్ , దేవ, శ్రీనివాస్‌రెడ్డి, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
బాచుపల్లి: రోడ్డు గుంతలే నా బిడ్డను బలిగొన్నాయి
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బాచుపల్లిలో ఈ ఉదయం జరిగిన విషాదంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఎనిమిదేళ్ల దీక్షిత మృతి చెందిందని పోలీసులు చెబుతుండగా.. రోడ్డు గుంత కారణంగానే తన బిడ్డ ప్రాణం పోయిందని దీక్షిత తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఘటనలో దీక్షిత తండ్రి కిషోర్‌కు సైతం గాయాలు అయ్యాయి. వెంటనే ఆయన్ని స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్ప్రతికి తరలించారు. అయితే.. కూతురి మరణాన్ని జీర్ణించుకోలేని ఆ తండ్రి స్థానిక ఆసుపత్రి వెంటనే డిశ్చార్జి అయ్యి బయటకు వచ్చాడు. ‘‘రోడ్లు నా కూతురును బలి తీసుకున్నాయి. నేను ఇప్పుడు ఏమీ మాట్లాడే స్థితిలో లేను అంటూ కన్నీటి పర్యంతం అయ్యాడాయన. మరోవైపు బంధువులు తూర్పు గోదావరి జిల్లాలోని సొంతూరుకు దీక్షిత మృతదేహాన్ని తరలిస్తున్నట్లు తెలిపారు. బాచుపల్లిలో బైక్‌పై వెళ్తున్న సమయంలో.. గుంత కారణంగా బైక్‌పై నుంచి ఎగిరిపడి దీక్షిత కింద రోడ్డు మీద పడిపోయింది. ఆ సమయంలో వేగంగా ఓ స్కూల్‌కు చెందిన మినీ వ్యాన్ ఆమె పైనుంచి వెళ్లిందన్నది తండ్రి వాదన. అయితే.. మినీ వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. అతివేగంగా వెనుక నుంచి బైక్‌ను ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగిందని అంటున్నారు. ఘటనకు సంబంధించి డ్రైవర్‌ను డ్రైవర్ రహీంను అదుపులోకి తీసుకుని.. వాహనాన్ని స్టేషన్‌కు తరలించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక స్థానికంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో దీక్షిత 2వ తరగతి చదువుతోంది. -
మందు కాదు..పాలు తాగిన సార్..
-
ప్రియుడి గొడవ.. ‘అమ్మా.. అందరి ముందు పరువు పోయింది’ అంటూ
సాక్షి, మేడ్చల్: అమ్మా.. అందరి ముందు నా పరువు పోయిందని లేఖ రాసి ఇంట్లో పెట్టిన యువతి ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధి సుతారిగూడలో చోటు చేసుకుంది. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి సుతారిగూడకు చెందిన వరగంటి శైలజ(25) రెండేళ్లుగా ఓ అబ్బాయిని ప్రేమించింది. కొన్ని రోజులుగా అతడితో మాట్లాడటం మానేసింది. ఈ నెల 9న రాత్రి సమయంలో ప్రేమించిన యువకుడు మద్యం మత్తులో శైలజ ఇంటికి వచ్చి బూతులు తిట్టి వెళ్లిపోయాడు. దీంతో మరుసటి రోజు 10వ తేదీన మధ్యాహ్నం ఇంట్లో చెప్పకుండా శైలజ వెళ్లిపోయింది. ఇంట్లో లెటర్ కనిపించింది. అందులో ‘అమ్మా.. అందరి ముందు నా పరువు పోయింది, నేను ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నా.. నా కోసం వెతకకండి’ అంటూ శైలజ లేఖలో పేర్కొంది. దీంతో కుటుంబికులు మేడ్చల్ పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్ రావడంతో బయటకు వెళ్లి.. ఫోన్ రావడంతో ఇంట్లో నుంచి వెళ్లిన యువతి అదృశ్యమైన ఘటన కండ్లకోయలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కొండం వెంకటేశ్వరి(22) కొంత కాలంగా ఓ అపార్ట్మెంట్లో హౌస్ కీపింగ్ పనులు చేస్తోంది. ఈ నెల 7వ తేదీన రాత్రి ఇంట్లో కుటుంబ సభ్యులంతా కూర్చొని మాట్లాడుకుంటుండగా ఆమెకు ఫోన్ వచ్చింది. దీంతో ఫొన్ మాట్లాడుకుంటూ ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాకపోవడంతో కుటుంబికులు మేడ్చల్ పోలీసులను ఆశ్రయించారు. మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: పెళ్లి రిసెప్షన్లో యువకుల హల్చల్.. తుపాకీ, తల్వార్‌తో డ్యాన్స్‌లు -
మేడ్చల్ జిల్లాలో నాలుగేళ్ల కృష్ణవేణి కిడ్నాప్
-
మేడ్చల్: వీధి కుక్కలు వెంటపడడంతో ఆ చిన్నారి..!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని జగద్గిరిగుట్ట లెనిన్‌నగర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇంటి బయట ఆడకుంటూ అదృశ్యమైన నాలుగేళ్ల చిన్నారి మనోజ్.. శవమై కనిపించాడు. మనోజ్ మృతదేహాన్ని దగ్గర్లోని క్వారీ గుంత నుంచి పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. చిన్నారి ఎలా చనిపోయి ఉంటాడనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే.. వీధి కుక్కల వల్లే తమ కొడుకు చనిపోయి ఉంటాడని మనోజ్ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి బయట ఆడుకుంటున్న సమయంలో వీధి కుక్కలు వెంటపడి ఉంటాయని, వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో క్వారీ గుంతలో పడిపోయి ఉంటాడని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. -
మేడ్చల్: ప్రియుడి ఇంట్లో ప్రియురాలి ఆత్మహత్య!
సాక్షి, క్రైమ్: మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా జవహార్ నగర్లో ఘోరం చోటు చేసుకుంది. ప్రియుడి ఇంట్లోనే ప్రియురాలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. మెహిదీపట్నంలో నివాసం ఉంటున్న పూజ.. చైతన్యపురిలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేస్తోంది. ఈ క్రమంలో జవహర్ నగర్ యాప్రాల్‌కి చెందిన దయాకర్‌తో పరిచయం ఏర్పడగా.. అది ప్రేమగా మారింది. అయితే ఆ విషయం తెలిసి దయాకర్ తల్లి ఇద్దరినీ మందలించింది. కూతురిని హద్దులో పెట్టుకోవాలంటూ పూజ పేరెంట్స్‌ను బెదిరించినట్లు కూడా తెలుస్తోంది. ఈ క్రమంలో.. పూజను ఇంటికి తీసుకెళ్లి మరీ తల్లిని ఒప్పించాలని దయాకర్ ప్రయత్నించాడు. ఆ సమయంలో దయాకర్‌కి, అతని తల్లికి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. అయితే తాను పూజను వివాహం చేసుకోనని దయాకర్ తెగేసి చెప్పడం.. ఊహించని ఆ పరిణామంతో పూజ షాక్‌కు గురైంది. ఆపై ఓ గదిలోకి పరిగెత్తి గడియ పెట్టుకుంది. ఎంతకీ ఆమె తలుపు తీయకపోవడంతో.. బద్ధలు కొట్టి చూడగా పూజ సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించింది. విషయం పోలీసులకు చేరడంతో వాళ్లు వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం.. పూజ పేరెంట్స్ ఫిర్యాదుతో దయాకర్‌తో పాటు అతని తల్లిపైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
బీఆర్ఎస్లో రగులుతున్న అసమ్మతి.. మంత్రి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
సాక్షి, హైదరాబాద్: మంత్రి మల్లారెడ్డి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిగా మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ తయారైంది. మంత్రి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిల మధ్య పార్టీలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇద్దరు ప్రధాన నాయకులు చెరో గ్రూపుగా మారడంతో మేడ్చల్ బీఆర్ఎస్లో అసమ్మతి బయటపడుతోంది. ఆత్మీయ సమ్మేళనాలతో మరోసారి ఈ విషయం బయటపడింది. మొదటి నుంచీ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరే.. 2014లో మేడ్చల్ నుంచి కారు గుర్తుపై సుధీర్‌రెడ్డి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికై ఐదేళ్లు పని చేశారు. 2014 ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంట్‌కు టీడీపీ తరఫున మంత్రి మల్లారెడ్డి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత బంగారు తెలంగాణ సాధన కోసం బీఆర్ఎస్లో చేరారు. ఎంపీగా ఉన్న సమయంలోనే మల్లారెడ్డి మేడ్చల్ నియోజకవర్గంలో తన అనుచరుల ద్వారా విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించారు. అదే సమయంలో నాటి ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి మల్లారెడ్డి మధ్య పలు మార్లు భేదాభిప్రాయాలు వచ్చినా అవి అప్పటి వరకే పరిమితమయ్యాయి. 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ అధిష్టానం సుధీర్‌రెడ్డిని కాదని ఎంపీగా ఉన్న మల్లారెడ్డికి టికెట్ ఇవ్వడంతో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆ సమయంలో అలకబూనిన సుధీర్‌రెడ్డిని ప్రస్తుత రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి అధిష్టానం దూతగా వచ్చి బుజ్జగించి ఆయనకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవిని ఇచ్చి బుజ్జగించారు. ఆ తర్వాత మంత్రిగా మల్లారెడ్డి కావడం, ఆయన అర్థ బలం ముందు సుధీర్‌రెడ్డి తట్టుకోలేకపోవడంతో ఆయన కొంతమేర వెనకడుగు వేశారు. ఆ తర్వాత వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సు«దీర్‌రెడ్డి తన తనయుడు శరత్‌చంద్రారెడ్డిని ఘట్కేసర్ నుంచి పోటీలో దింపి గెలిపించుకున్నారు. అదే ఎన్నికల్లో మంత్రి మల్లారెడ్డి తన బావమరిది మద్దుల శ్రీనివాస్‌రెడ్డిని మూడుచింతలపల్లి మండలం నుంచి పోటీలో దింపగా ఆయన ఓటమిపాలయ్యారు. దీంతో సు«దీర్‌రెడ్డి తనయుడు శరత్‌చంద్రారెడ్డి జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. నాటి నుంచి నియోజకర్గంలో ఇద్దరి నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. సుధీర్‌రెడ్డి తన అనుచరులతో తనకూ ఓ గ్రూపును ఏర్పాటు చేసుకోగా మంత్రి మల్లారెడ్డి తన కోటరిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నారు. ఆత్మీయ సమ్మేళనాలతో మరోసారి రచ్చ.. బీఆర్ఎస్ నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలతో బీఆర్ఎస్లో వర్గ విభేదాలు జోరుగా బయట పడ్డాయి. మొదట్లో సర్పంచ్, ఎంపీటీసీ స్థాయి, గ్రామ, వార్డుస్థాయి నాయకులు తమ అసమ్మతి వెల్లగక్కినా అది బయటపడకుండా మంత్రి తనయుడు మహేందర్‌రెడ్డి మేనేజ్ చేశారు. చాలామంది నాయకులు ఆత్మీయ సమ్మేళనాలకు డుమ్మా కొట్టినా మంత్రి బలం ముందు తమ అసమ్మతిని బహిరంగంగా వెల్లడించలేకపోయారు. ఆత్మీయ సమ్మేళనాలకు హాజరైన సుధీర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ శరత్‌చంద్రారెడ్డిలు తమ ప్రసంగాల్లో అధిష్టానం ఎవరికి టికెట్ కేటాయించినా వారి గెలుపు కోసం అందరూ పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సుధీర్‌రెడ్డి ఈ అంశాన్ని పదేపదే నాయకుల ముందు ఉంచడంతో చిర్రెత్తిన మంత్రి మల్లారెడ్డి మేడ్చల్ మండల ఆత్మీయ సమ్మేళనంలో టికెట్ తనకు సీఎం కేసీఆర్ ఖరారు చేశారని, గెలుపు తనదేనని అన్నారు. ఆ తర్వాత జరిగిన బోడుప్పల్ ఆత్మీయ సమ్మేళనంలో ఇదే అంశం ఇద్దరి నేతల మధ్య అగ్గి రాజేసింది. పార్టీ ఎవరికి టికెట్ ఖరారు చేయలేదని సుధీర్‌రెడ్డి అనగా తనకే కేటాయించిందని మంత్రి మల్లారెడ్డి అనడం వారి మధ్య వాగ్వాదానికి తేరలేపింది. మొదటి నుంచీ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్న నేతలకు మరోసారి అవకాశం రావడంతో పార్టీ పరువును జవహర్‌నగర్ డంపింగ్ యార్డులో కలిపారు. రంగంలోకి ఎవరు..? వీరి మధ్య ఆధిపత్య పోరు జోరుగా ఉండటంతో అధిష్టానం మేడ్చల్ గెలుపుకోసం చురుగ్గా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. సీఎంకు అత్యంత సన్నిహితంగా ఉండే జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును, రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డిని రంగంలోకి దించాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. మల్లారెడ్డి స్థాయిలో కాకున్నా ఇద్దరు నేతలు అర్థబలం గట్టిగా ఉన్నవారు కావడం, సీఎంకు నమ్మి న బంట్లుగా ఉండటంతో వీరిద్దరిలో ఒకరికి మేడ్చల్ బీఆర్ఎస్ టికెట్ కేటాయించే అవకాశం ఉన్నట్లు పార్టీ శ్రేణుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. -
కుషాయిగూడలో ఘోర అగ్ని ప్రమాదం.. ముగ్గురు సజీవదహనం
సాక్షి, మేడ్చల్: కుషాయిగూడలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. టింబర్ డిపోలో మంటలు చెలరేగడంతో ముగ్గురు సజీవ దహనం అయ్యారు. మృతులంతా వరంగల్ జిల్లా ఒకే కుటుంబానికి చెందిన నరేష్, సుమ, బాబుగా గుర్తించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైరింజన్లతో మంటలను నియంత్రించారు. ఈ ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్‌గా భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. చదవండి: సవాల్ విసురుతున్న గుండెపోట్లు.. -
కట్నం విషయంలో నిలిచిపోయిన పెళ్లి
-
HYD: సడన్ హార్ట్ ఎటాక్.. కాలేజీలోనే కుప్పకూలిన ఇంజనీరింగ్ విద్యార్థి..
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరో యువకుడు గుండెపోటుకు బలయ్యాడు. మేడ్చల్ సీఎంఆర్ కాలేజీలో ఈ విషాద ఘటన జరిగింది. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న విశాల్ అనే విద్యార్థి గుండెపోటుతో కాలేజీ ఆవరణలోనే కుప్పకూలాడు. కారిడార్‌లో నడుస్తూ ఛాతీలో నొప్పితో సడన్‌గా కిందపడిపోయాడు. తోటి విద్యార్థులు అతడ్ని సీఎంఆర్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ప్రకటించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విశాల్‌ది రాజస్థాన్ అని తెలుస్తోంది. కాగా.. ఇటీవల యువకుల్లో గుండెపోటు ఘటనలు బాగా పెరిగిపోయాయి. కొద్దిరోజుల క్రితమే యువ కానిస్టేబుల్ జిమ్‌లో కసరత్తులు చేస్తూ గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. మరో ఘటనలో స్నేహితుడి పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూ యువకుడు సడన్‌గా కుప్పకూలి ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే.. గుండె.. ఉండేది మనిషి గుప్పెడంత. కానీ, నిలువెత్తు మనిషి ప్రాణం దాని మీదే ఆధారపడి ఉంటుంది. అయితే మారుతున్న లైఫ్‌స్టైల్.. ఆహారపు అలవాట్లు మనిషిని నిలబెట్టే ఆ బలాన్ని.. బలహీనపరుస్తోంది. అందుకే గుండె సమస్యలతోపాటు కార్డియాక్ అరెస్ట్ సమస్యలతో.. వయసుతో సంబంధం లేకుండా ఉన్నచోటే కుప్పకూలిపోతున్నారు. అప్పటికప్పుడే ప్రాణం విడుస్తున్నారు. చదవండి: దోస్తు పెళ్లి బరాత్‌లో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన యువకుడు.. 19 ఏళ్లకే గుండెపోటుతో.. -
రాజకీయ క్రీడలో ప్రభుత్వ అధికారి ఔట్.. ఇక్కడ ఇంతే!
సాక్షి,మేడ్చల్(హైదరాబాద్): మేడ్చల్ మున్సిపాలిటీలో చైర్పర్సన్, కౌన్సిలర్లు ఆడిన రాజకీయ క్రీడలో కమిషనర్ అవుట్ అయ్యారు. చైర్పర్సన్ లక్ష్యంగా సాగిన ఈ రాజకీయ క్రీడలో కౌన్సిలర్ల బంతికి చైర్పర్సన్ కాకుండా కమిషనర్ చిక్కాడు. ఆరు నెలలుగా మేడ్చల్ మున్సిపాలిటీలోని అధికార పార్టీలో 16 మంది కౌన్సిలర్లు, చైర్పర్సన్ దీపికా నర్సింహా రెడ్డిల మధ్య రాజకీయ అగాధం ఏర్పడింది. 16 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు చైర్పర్సన్, కమిషనర్ అహ్మద్ షఫిఉల్లా కుమ్మక్కై అభివృధ్ధి చేయకుండా అవినితీకి పాల్పడుతున్నారని విమర్శిస్తూ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం నోటీసు ఇచ్చారు. ఆరు నెలలుగా మేడ్చల్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు రెండు వర్గాలుగా వీడి జోరుగా రాజకీయాలు చేస్తున్నారు. కొందరు వైస్ చైర్మన్ గ్రూపుగా, మరి కొందరూ చైర్పర్సన్ గ్రూపుగా మారారు. చైర్‌పర్సన్‌పై అవిశ్వాస నోటీసులు ఇవ్వగా రెండో డిమాండ్ కింద కమిషనర్‌ను బదిలీ చేయాలని పట్టుబట్టారు. కమిషనర్ చైర్‌పర్సన్‌తో కుమ్మక్కై తమను ఖాతరు చేయడం లేదని, ఆయన్ను బదిలీ చేయాలని అధిష్టానం వద్ద పట్టుబట్టి కూర్చున్నారు. మంత్రి ఇంట్లో సమావేశంతోనే.. మేడ్చల్ మున్సిపాలిటీలో సమావేశాలు నిర్వహిస్తే తరుచూ రచ్చ చేస్తున్నారని, మీడియా ముంగిట అసమ్మతి వెల్లగక్కుతున్నారని మంత్రి మల్లారెడ్డి చైర్పర్సన్, అధికారులు, కమిషనర్, అధికార పార్టీ కౌన్సిలర్లతో తమ ఇంట్లో రెండు రోజుల క్రితం రహస్య సమావేశం నిర్వహించారు. అవిశ్వాస విషయం చట్ట పరిధిలో ఉండటంతో అది పక్కన పెట్టి అసమ్మతి కౌన్సిలర్ల వాదనను మంత్రి విన్నారు. తమకు విలువ ఇవ్వని కమిషనర్ అహ్మద్ షఫిఉల్లాను బదిలీ చేయాలని గట్టిగా వాదించడం, ఒక్కసారిగా బదిలీ చేసే అధికారం లేకపోవడంతో మంత్రి మల్లారెడ్డి ఇక్కడ రాజకీయం ప్రదర్శించారు. కౌన్సిలర్ల డిమాండ్ మేరకు కమిషనర్ అహ్మద్ షఫిఉల్లా వెళ్లిపోవాలని మంత్రి ఆదేశించినట్లు సమాచారం. బదిలీకి వెంటనే ఆస్కారం లేకపోవడంతో కమిషనర్ 15 రోజుల పాటు దీర్ఘకాలికంగా సెలవు పెట్టి వెళ్లిపోయారు. చట్టం చెప్పే కమిషనర్... సెలవులపై వెళ్లిన కమిషనర్ అహ్మద్ షఫిఉల్లా ముక్కుసూటిగా మాట్లాడే అధికారిగా మేడ్చల్‌లో తన ముద్ర వేశారు. ప్రతి విషయంలో తాను చట్టం ప్రకారంగా ఉంటూ పనులను ఆ ప్రకారంగానే చేస్తానని బల్ల గుద్ది చెప్పేవాడు. ఎవరికి అనుకూలంగా ఉండకుండా తన దైన శైలిలో పనిచేసి ఆఖరుకు సెలవు పెట్టే వరకు తెచ్చుకున్నాడు. తనపై ఆరోపణలు చేసిన కౌన్సిలర్లకు ఆయన గతంలో మున్సిపల్ కార్యాలయంలోనే నాపై ఆరోపణలు చేసిన వారికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, ఏది ఉన్నా తాను ఉన్నతాధికారులకు చెప్పుకుంటానని మీడియా ముందు తేల్చి చెప్పాడు. అధికార పార్టీ నాయకులు, కౌన్సిలర్లకు అండగా ఉండకపోవడంతో ప్రభుత్వ అధికారి తనకు ఇష్టం, అవసరం లేకున్నా దీర్ఘకాలిక సెలవుపై వెళ్లాల్సి వచ్చింది. రాజకీయ నాయకుల క్రీడలో ఓ అధికారి సెల్ఫ్ అవుట్ అవ్వడం స్థానిక ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చదవండి యజమాని భార్యతో డ్రైవర్ వివాహేతర సంబంధం.. చివరికి షాకింగ్ ట్విస్ట్ -
ఇన్నోవా కారు బీభత్సం.. పిజ్జా డెలివరీ చేసేందుకు వెళుతుండగా..
సాక్షి, మేడ్చల్: ఇన్నోవా కారు ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందగా, మరో నలుగురు గాయపడిన సంఘటన మేడ్చల్ పట్టణంలోని 44 నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం చోటు చేసుకుంది. మేడ్చల్ సీఐ రాజశేఖర్‌రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం మధ్యాహ్నం కొంపల్లి నుంచి తూప్రాన్ వైపు వెళ్తున్న ఇన్నోవా కారు అతివేగం కారణంగా అదుపుతప్పి ఏజీఎస్ వెంచర్ సమీపంలో 44వ జాతీయ రహదారిపై డివైడర్‌ను ఢీకొని ఎదురు రోడ్డులోకి దూసుకెళ్లింది. అదే సమయంలో మేడ్చల్ నుంచి కొంపల్లి వైపు వెళ్తున్న రెండు బైక్‌లను, అశోక్ లేలాండ్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళుతున్న సాయితేజ(19), సాయికిశోర్(20) అనే యువకులు తీవ్రంగా గాయపడ్డారు. సాయితేజ అక్కడికక్కడే మృతి చెందగా, సాయికిశోర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో బైక్ పై వెళ్తున్న దంపతులు బందెల రవి, మమత వారి కుమార్తె యోగితతో పాటు అశోక్ లేలాండ్ వాహన డ్రైవర్ హరిచంద్‌కు గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న మేడ్చల్ సీఐ రాజశేఖర్‌రెడ్డి, ట్రాఫిక్ సీఐ నర్సింహారెడ్డి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ సైతం తీవ్రంగా గాయపడ్డాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. పిజ్జా డెలివరీ చేసేందుకు వెళుతూ... దుండిగల్ మండలం, బహదూర్‌పల్లికి చెందిన సాయి కిశోర్, సాయితేజ స్నేహితులు. పిజ్జా హంట్‌లో పనిచేస్తున్న వీరు ఇరువురు శుక్రవారం పిజ్జాలు డెలివరీ చేసేందుకు కొంపల్లివైపు వెళ్తుండగా వేగంగా వచ్చిన ఇన్నోవా కారు డివైడర్ అవతలి వైపు వెళ్తున్న వీరిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో సాయితేజకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సాయి కిశోర్‌ను స్థానిక మెడినోవా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
మేడ్చల్ పీఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదం
-
మేడ్చల్– ఉందానగర్ మార్గంలో వాహనదారులకు బ్రేక్‌లు.. అదొక్కటే పరిష్కారం!
సాక్షి, హైదరాబాద్: అది సుమారు ఇరవై ఎనిమిది కిలోమీటర్ల మార్గం. మేడ్చల్‌లో రైలు ఎక్కితే నేరుగా ఉందానగర్ వరకు వెళ్లొచ్చు. అక్కడి నుంచి శంషాబాద్ విమానశ్రయానికి మరో ఆరు కిలోమీటర్లు మాత్రమే. ఎంఎంటీఎస్ రెండో దశలో ఈ లైన్‌ను దక్షిణమధ్య రైల్వే ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి పూర్తి చేసింది. జీఎమ్మార్ సంస్థ అనుమతిస్తే ఉందానగర్ నుంచి ఎయిర్‌పోర్టు వరకు కూడా ఎంఎంటీఎస్ రైళ్లను నడపాలనేది అప్పటి ప్రతిపాదన. ఈ క్రమంలోనే రూ.కోట్లు వెచ్చించి మేడ్చల్ నుంచి ఉందానగర్ వరకు లైన్ల డబ్లింగ్, విద్యుదీకరణ తదితర పనులను పూర్తి చేశారు. సికింద్రాబాద్ నుంచి బొల్లారం వరకు రైల్వేభద్రతా తనిఖీలు కూడా పూర్తయ్యాయి. కానీ.. ఆ మార్గంలో రైళ్లను ప్రారంభించాలంటే అధికారులు హడలెత్తుతున్నారు. ఎంఎంటీఎస్ రెండో దశ రైళ్లను నడిపేందుకు లైన్ క్లియర్‌గా ఉన్నా వెనుకడుగు వేస్తున్నారు. కేవలం 10 కిలోమీటర్ల మార్గంలో కనీసం 10 చోట్ల లెవల్ క్రాసింగ్‌లు ఉండడమే ఇందుకు కారణం. వీటితో నగరవాసులకు తీవ్ర ఆటంకం ఏర్పడనుంది. వాహనదారుల రాకపోకలు స్తంభించిపోనున్నాయి. లెవల్ క్రాసింగ్లను తొలగించేందుకు ఎలాంటి కార్యాచరణ లేకుండానే పట్టాలు పరిచారు. దీంతో ఇప్పుడు ఆ లైన్ ఉన్నా లేనట్లుగానే మారింది. అక్కరకొచ్చేది ఎలా..? ఎంఎంటీఎస్ రెండో దశలో చేపట్టిన రైల్వే లైన్ల విస్తరణతో ఇప్పుడు మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ మీదుగా ఫలక్‌నుమా నుంచి ఉందానగర్ వరకు ఎంఎంటీఎస్ రైళ్లు నడిపేందుకు మార్గం సుగమమైంది. సికింద్రాబాద్ నుంచి ఫలక్‌నుమా వరకు ప్రస్తుతం ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తున్న సంగతి తెలిసిందే. కొత్తగా పూర్తి చేసిన ఫలక్‌నుమా– ఉందానగర్ మార్గంలోనే రైళ్లు నడిపేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ వరకే కనీసం 10 చోట్ల లెవల్ క్రాసింగ్‌లు ఉన్నాయి. కనీసం ప్రతి 2 కిలోమీటర్లకు ఒకటి చొప్పున లెవల్ క్రాసింగ్ ఉంది. అంటే ట్రైన్ బయలుదేరిన తర్వాత రెండు, మూడు నిమిషాలకోసారి గేట్లు వేసి వాహనాల రాకపోకలను నిలిపివేయాల్సి ఉంటుంది. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ రద్దీ నెలకోనుంది. దయానంద్‌నగర్, సఫిల్‌గూడ, తుకారంగేట్, అమ్ముగూడ, మల్కాజిగిరి, అల్వాల్, బొల్లారం తదితర ప్రాంతాల్లో లెవల్ క్రాసింగ్‌లు ఉన్నాయి. ఈ రూట్ పూర్తిగా కాలనీలు, బస్తీల్లోంచే వెళ్తుంది. దీంతో లెవల్ క్రాసింగ్‌లు తీసివేసేందుకు కొన్ని చోట్ల జనావాసాలను, దుకాణాలను, ఇతర నిర్మాణాలను తొలగించాల్సి ఉంటుంది. పైగా రైల్ ఓవర్ బ్రిడ్జీల (ఆర్ఓబీ)ను నిర్మించాలంటే చాలా చోట్ల భూమి లభ్యత సమస్యగా మారింది. ఈ క్రమంలో రైల్ అండర్ బ్రిడ్జీలు (ఆర్యూబీ) ఒక్కటే పరిష్కారం. ఇందుకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం, మౌలిక సదుపాయాల కల్పన తప్పనిసరి. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కొరవడడంతో నిధుల లేమి ప్రధాన అడ్డంకిగా మారింది. లెవల్ క్రాసింగ్‌లు తొలగిస్తే తప్ప రైళ్లు నడపడం సాధ్యం కాదని దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. -
Hyderabad: మిస్టరీగా మారిన సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి.. అదే కారణమా!
సాక్షి, మేడ్చల్, మహబూబ్‌నగర్: మేడ్చల్ జిల్లా బాచుపల్లి మండలం ప్రగతినగర్‌లోని మధురానగర్ కాలనీకి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి మణికంఠవర్మ (29) మృతి మిస్టరీగా మారింది. తన పెంపుడు కుక్కకు మందులు కొనేందుకు బుధవారం ఉదయం కారులో ఇంటి నుంచి బయలుదేరిన ఆయన వనపర్తి జిల్లా శ్రీరంగాపుర్ మండలం జానంపేట శివారులోని రామసముద్రం చెరువులో గురువారం శవమై తేలడం పలు అనుమానాలకు తావిస్తోంది. మృతుడి తల్లి విష్ణుప్రియ, అక్క అన్నపూర్ణదేవి కథనం ప్రకారం.. బుధవారం ఉదయం కుక్కపిల్లకు మందులు తీసుకువస్తానని మణికంఠవర్మ కారులో ఇంటి నుంచి బయలుదేరాడు. అతను ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు అతడికి కాల్ చేయగా మొబైల్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దీంతో వారు అతడి స్నేహితులు, తమ బంధువులకు ఫోన్ చేసినా ప్రయోజనం లేకపోవడంతో సాయంత్రం జేఎన్టీయూ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. వారు ప్రగతినగర్ బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధికి వస్తుందని చెప్పడంతో బాచుపల్లి స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రామసముద్రం చెరువులో శవమై.. వనపర్తి జిల్లా, శ్రీరంగాపుర్ మండలం, జానంపేట శివారులోని రామసముద్రం చెరువులో తూము వద్ద శవం ఉన్నట్లు గ్రామస్తులు గుర్తించి సర్పంచ్ వెంకటేశ్వర్‌రెడ్డికి తెలియజేయగా.. ఆయన పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని చెరువులో నుంచి మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడికి షర్టు లేదు.. ట్రాక్ ప్యాంట్‌కు కారు తాళం చెవి కట్టి ఉంది. పోలీసులు తాళం చెవి తీసుకుని కారును ఓపెన్ చేసి చూడగా.. అందులో స్విచ్ ఆఫ్ అయిన సెల్‌ఫోన్ లభించింది. ఆన్‌చేసి ఓపెన్ చేసేందుకు ప్రయత్నం చేయగా లాక్‌వేసి ఉంది. పోలీసులు అందులోని సిమ్‌కార్డును తీసి మరో సెల్లో వేసి ఆన్ చేశారు. దీంతో అతడి మిత్రులు, బంధువులకు ఎస్ఎంఎస్ వచి్చంది. శివాజీ అనే వ్యక్తి వెంటనే కాల్ చేయగా.. కానిస్టేబుల్ విషయం చెప్పి రమ్మన్నారు. ఈ మేరకు కుటుంబసభ్యులు గురువారం సాయంత్రానికి వనపర్తికి చేరుకున్నారు. శుక్రవారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఆస్తి వివాదమే కారణమా ? కొన్నేళ్ల క్రితం గండిమైసమ్మ ప్రాంతంలో మృతుడి తండ్రి ఓ వెంచర్లో 340 గజాల ప్లాటు కొనుగోలు చేశాడు. దీని పక్కనే మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ భవన్‌ను నిరి్మంచారు. దాని పార్కింగ్ కోసం ఆ పార్టీ నేతలు వెంచర్‌లోని ప్లాట్లను చదును చేసేందుకు యత్నించారు. దీంతో మణికంఠవర్మ, తనతో పాటు కొనుగోలు చేసిన వారితో కలిసి కోర్టులో కేసు వేశారు. కోర్టు స్టే ఇవ్వగా.. తహసీల్దార్ స్వయంగా వచ్చి చదును చేసే పనులను నిలిపివేయించారు. ఈ క్రమంలో మణికంఠవర్మ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఆస్తి వివాదమే ప్రాణం తీసిందని.. ఈ వివాదం తప్ప తమకు ఎలాంటి సమస్యలు లేవని మృతుడి తల్లి, అక్క రోదిస్తూ తెలిపారు. పోస్టుమార్టం నివేదిక అందిన తర్వాత పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు. -
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి..
సాక్షి, మేడ్చల్ జిల్లా: ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఔషపూర్ గ్రామంలో వృత్తిరీత్యా కూలీ పని చేసుకుని జీవనం సాగిస్తున్న మౌలాన్-శాంతి కుటుంబం. భార్య శాంతి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో గత కొన్ని రోజులుగా పలుమార్లు ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. దీంతో శాంతి, తన భర్తను హతమార్చాలని నిర్ణయించుకుంది. భర్త సేవించే మందులో భార్య శాంతి, ప్రియుడు బాబు విషం కలిపారు. ఈ విషయం బయటకు రాకుండా తన భర్త కడునొప్పితో చనిపోయారని పోలీస్ స్టేషన్లో శాంతి ఫిర్యాదు చేసింది.. రంగంలోకి దిగిన పోలీసులు, మృతి చెందిన మౌలాన్ మృతదేహాని పోస్టుమార్టం నిమ్మిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం రిపోర్ట్ చూసి, హత్యగా అనుమానించిన పోలీసులు.. భార్య శాంతిని అదుపులోకి తీసుకుని విచారించగా వాస్తవాలు బయటకు వచ్చాయి. శాంతి, ఆమె ప్రియుడు బాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి భర్తను హత్యచేసినట్లు శాంతి ఒప్పుకుంది. చదవండి: క్షణికావేశం.. తమిళనాడులో దారుణం! -
తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. ఈమేరకు 15 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ► ప్రస్తుతం మంచిర్యాల జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న భారతీ హోలికెరి.. మహిళా శిశు సంక్షేమ వాఖ స్పెషల్ సెక్రటరీగా నియమితులయ్యారు. ► ప్రస్తుత హన్మకొండ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు.. నిజామాబాద్ కలెక్టర్‌గా బదిలీ. ► ప్రస్తుత ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్.. హన్మకొండ జిల్లా కలెక్టర్‌గా బదిలీ. ► ప్రస్తుత రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ మేడ్చల్ కలెక్టర్‌గా బదిలీ. అలాగే హైదరాబాద్ కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు ► ప్రస్తుత వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా.. కొమురం భీమ్ ఆసిఫాబాద్ కలెక్టర్‌గా బదిలీ. ► ప్రస్తుత జగిత్యాల జిల్లా కలెక్టర్ జీ రవి.. మహబూబ్‌నగర్ కలెకర్ట్‌గా బదిలీ. ► ప్రస్తుత మహబూబ్‌నగర్ కలెక్టర్ ఎస్ వెంకట్రావు.. సూర్యాపేట కలెక్టర్‌గా బదిలీ. ► ప్రస్తుత మెదక్ జిల్లా కలెక్టర్ ఎస్ హరీష్.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా బదిలీ. ► జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ బి సంతోష్.. మంచిర్యాల కలెక్టర్‌గా బదిలీ. ► ప్రస్తుత సంగారెడ్డి అదనపు కలెక్టర్ రాజార్షి షా.. మెదక్ జిల్లా కలెక్టర్‌గా బదిలీ. ► ప్రస్తుత నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి.. వికారాబాద్ జిల్లా కలెక్టర్‌గా బదిలీ. ► ప్రస్తుత కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్‌కు జగిత్యాల ఇన్చార్జ్ కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు. ► ఐటీడీఏ ఉట్నూర్ ప్రాజెక్ట్ అధికారి వరుణ్ రెడ్డి.. నిర్మల్ జిల్లా కలెక్టర్‌గా బదిలీ ► ప్రస్తుత కొమురం భీమ్ ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్.. ఆదిలాబాద్ కలెక్టర్‌గా బదిలీ ► ప్రస్తుత మహబూబ్ నగర్ అదనపు కలెక్టర్ తేజాస్ నందలాల్ పవార్.. వనపర్తి కలెక్టర్‌గా బదిలీ కలెక్టర్ల బదిలీ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి -
ప్రకృతి వనం... ఆక్సి‘జనం’
సాక్షి, మేడ్చల్ జిల్లా: నగరీకరణ శరవేగంగా పెరుగుతోంది. దీంతోపాటే కాలుష్యమూ పెచ్చుమీరుతోంది. దీంతో తలెత్తుతున్న అనారోగ్య సమస్యలతోపాటు ఉద్యోగ, వ్యాపారాల్లో ఎదురవుతున్న మానసిక ఒత్తిళ్లు సరేసరి. వీటితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగరవాసులకు చక్కటి సాంత్వన కల్పిస్తున్నాయి ప్రకృతి వనం, లంగ్స్ స్పేస్. హరితహారంలో భాగంగా ఆహ్లాదం, ఆరోగ్యాన్ని పంచేందుకు ప్రభుత్వం సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. గ్రేటర్‌తోసహా శివారు పట్టణాలు, సెమీఅర్బన్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే లక్షలాది మొక్కలు నాటిన సర్కారు పల్లె, పట్టణ ప్రకృతి వనాలను పెంచుతోంది. వీటిలో వాకింగ్ పాత్‌లు, చిల్ట్రన్ కార్నర్స్ ఏర్పాటుచేయడంతోపాటు ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు ప్రత్యేక ఏర్పాటుచేస్తోంది. 80 లక్షల వాహనాలు... ఎన్నో పరిశ్రమలు గ్రేటర్ పరిధిలో అత్యంత రద్దీగా ఉండే ప్రధాన కూడళ్లలో వాయు కాలుష్యం అవధులు దాటుతోంది. సుమారు 80 లక్షల మేర ఉన్న వాహనాలు వెదజల్లుతున్న పొగతో ‘సిటీ’జన్ల ముక్కుపుటాలు, శ్వాసకోశాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. పలుప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లో చెత్తను తగలబెట్టడంతో కాలుష్య తీవ్రత మరింత పెరుగుతోంది. వీటికితోడు పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యంతో సమీప ప్రాంతాలు పొగచూరుతున్నాయి. ఫలితంగా పీల్చే గాలిలో సూక్ష్మధూళికణాలు చేరి సమీప ప్రాంతాల్లోని ప్రజల ఊపిరితిత్తుల్లోకి చేరుతున్నాయి. ఘనపు మీటరు గాలిలో సూక్ష్మధూళికణాల (పీఎం2.5) మోతాదు 40 మైక్రోగ్రాములకు మించరాదు. కానీ పలు కూడళ్లలో అంతకు రెట్టింపు స్థాయిలో ధూళికాలుష్యం నమోదవుతోంది. పుర, పంచాయతీల్లో వనాలు పుర, పంచాయతీల్లో అర ఎకరం నుంచి 4 ఎకరాల పరిధిలో ప్రకృతి వనాలను ఏర్పాటుచేశారు. గ్రేటర్ శివారు (మేడ్చల్ జిల్లా + రంగారెడ్డి జిల్లా)లోని 29 పురపాలక సంఘాల్లో 595 పట్టణ ప్రకృతి వనాలున్నాయి. వీటిని పురపాలక సంఘాలు నిర్వహిస్తున్నాయి. అలాగే, 619 పంచాయతీల పరిధిలో 946 పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. ఉపాధి హామీ పథకం నిధులు వెచ్చించి ఎకరాకు 2,500 మొక్కల చొప్పున పెంచారు. లంగ్స్ స్పేస్ ఎక్కడెక్కడ? హైదరాబాద్ శివారుల్లో ఏడు అర్బన్ లంగ్స్ స్పేస్లున్నాయి. ►మేడిపల్లి ఫారెస్టు బ్లాకులో 100 ఎకరాల్లో శాంతివనం ►దూలపల్లి ఫారెస్టు బ్లాకులోని ప్రశాంత వనం ►నారపల్లిలోని భాగ్యనగరం నందన వనం ►బహుదూర్‌పల్లి ఫారెస్టు బ్లాకులోని 50 ఎకరాల్లో ►నాగారం ఫారెస్టు బ్లాకులోని 70 ఎకరాల్లో.. ►నారపల్లి–పర్వతాపూర్ ఫారెస్టు బ్లాకులోని 60 ఎకరాల్లో.. ►కండ్లకోయలోని ఆక్సిజన్ పార్కు హైదరాబాద్‌లో ఏడాదికి సగం రోజులకుపైగా కాలుష్యం నమోదవుతున్న ప్రాంతాలు ►బాలానగర్, ఉప్పల్, జూబ్లీహిల్స్, చార్మినార్, ప్యారడైజ్, జూపార్క్, పంజగుట్ట, కూకట్పల్లి, చిక్కడపల్లి, ఎంజీబీఎస్ మరిన్ని అభివృద్ధి చేస్తాం నగర శివారుల్లో పల్లె, పట్టణ ప్రకృతి వనాలు, లంగ్స్ స్పేస్‌లను మరింత అభివృద్ధి పరుస్తాం. ఇందుకోసం ప్రభుత్వ భూములను కూడా గుర్తిస్తున్నాం. పెరుగుతున్న జనాభా, నగరీకరణ నేపథ్యంలో వీటి అవసరం ఎంతో ఉంది. పెరుగుతున్న కాలుష్యం కట్టడికి ఇవి ఎంతగానో దోహదపడుతున్నాయి. – డా.ఎస్. హరీశ్, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ స్వచ్ఛమైన గాలి.. ప్రకృతి వనాలు, లంగ్ స్పేస్‌లు స్వచ్ఛమైన గాలిని అందిస్తున్నాయి. కాలుష్యం బారి నుంచి రక్షిస్తున్నాయి. సెలవు రోజుల్లో కుటుంబ సభ్యులతో కలిసి వెళుతున్నాం. రోజంతా అక్కడే ఉండాలనిపిస్తుంది. – కె. ఆంజనేయులు, పోచారం గొప్ప ఉపశమనం.. నారపల్లి–పర్వతాపూర్‌లోని 60 ఎకరాల్లో ఉన్న అర్బన్ లంగ్స్ స్పేస్ పిల్లలతోపాటు పెద్దలనూ ఆహ్లాదపరుస్తోంది. నగరానికి సమీపంలో ఉండటం వల్ల ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో పెద్ద సంఖ్యలో మహిళలు, వృద్ధులు వస్తారు. ఆటపాటలతో అందరూ ఆనందంలో మునిగితేలుతారు. –పి. రవికిరణ్, పీర్జాదిగూడ -
మేడ్చల్ జిల్లాలో అర్థరాత్రి కాల్పుల కలకలం.. తుపాకీతో బెదిరించి..
సాక్షి, మేడ్చల్: సినీ ఫక్కీలో మద్యం దుకాణం వద్ద రూ.2.8 లక్షల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. సోమవారం రాత్రి 10.30 గంటలకు నగర శివారులోని మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలం ఉద్దమర్రి గ్రామంలో గుర్తు తెలియని ఆగంతుకులు రెండు రౌండ్ల కాల్పులు జరిపి దోపిడీకి పాల్పడిన ఈ ఘటన కలకలం సృష్టించింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉద్దమర్రిలోని వినాయక వైన్స్‌లో బాలకృష్ణ అనే వ్యక్తి క్యాషియర్‌గా, హెల్పర్‌గా జైపాల్‌రెడ్డి పని చేస్తున్నారు. ప్రతిరోజు మాదిరిగానే సోమవారం సైతం మద్యం అమ్మగా వచ్చిన నగదు రూ.2.8 లక్షలు తీసుకుని రాత్రి 10.30 గంటలకు వైన్స్ షాపును మూసివేసి బయటకు వచ్చారు. అదే సమయంలో ముగ్గురు దుండగులు (25 నుంచి 30 ఏళ్ల వయసు) మంకీ క్యాపులు, కర్చీష్‌లు ధరించి బైక్‌పై వచ్చారు. పైసా దేవో అంటూ తుపాకితో బెదిరించారు. దీంతో వైన్స్ సిబ్బంది పక్కనే ఉన్న కర్రలతో వారిపై దాడి చేస్తుండగా.. దుండగులు తుపాకీతో బాలకృష్ణపై కాల్పులు జరపడంతో అతను తప్పించుకున్నాడు. తూటా వైన్స్ షెటర్‌కు తగిలి లోపల ఉన్న 5 మద్యం సీసాలు ధ్వంసమయ్యాయి. దుండగులు మరో రౌండ్ కాల్పులతో వైన్స్ సిబ్బందిని బెదిరించి వారి నుంచి రూ.2.8 లక్షల నగదుతో పరారయ్యారు. దుండగులు పక్కా ప్రణాళికతోనే దోపిడికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. గ్రామానికి చివర మద్యం దుకాణం ఉండటంతో పాటు మెయిన్ రోడ్డుకు ఆనుకొని ఉండటంతో పారిపోయేందుకు సులువుగా ఉంటుందని ఈ దుకాణాన్ని దుండగులు ఎంచుకొని ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు.దుండగులను పట్టుకునేందుకు 5 బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు పేట్‌బషీరాబాద్ ఏసీపీ రామలింగరాజు తెలిపారు. చదవండి: Smita Sabharwal: నెల క్రితమే నిందితుడి రెక్కీ.. ప్లజెంట్ వ్యాలీలో కరువైన నిఘా -
కన్నతల్లితో మరో వ్యక్తి సహజీవనం.. సన్నిహితంగా నటించి
సాక్షి, హైదరాబాద్: వివాహేతర సంబంధం ఓ వ్యక్తి దారుణ హత్యకు దారితీసిన ఘటన మేడ్చల్ జిల్లాలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ గోవర్ధనగిరి తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని కృష్ణా జిల్లా తెలప్రోలు గ్రామానికి చెందిన వివాహితకు, కోల వెంకటరమణమూర్తి (47) అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో అక్కడి నుంచి 14 ఏళ్ల క్రితం సదరు మహిళ కుటుంబ సభ్యులను వదిలి నగరాని వచ్చింది. పీర్జాదిగూడ బీబీసాహెబ్ మక్తా అమృత కాలనీలోని వృద్ధాశ్రమంలో వెంకటరమణమూర్తి కేర్ టేకర్‌గా పనిచేస్తూ ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఫేస్బుక్ ద్వారా తన తల్లి చిరునామా తెలుసుకున్న ఆమె కుమారుడు నగరానికి వచ్చాడు. వెంకటరమణమూర్తికి నచ్చజెప్పి ఆమెను ఊరికి తీసుకువెళ్లాడు. వెంకటరమణమూర్తి కొన్ని రోజులుగా ఆమెకు ఫోన్ చేస్తూ నగరానికి రావాలంటూ పట్టుబడుతున్నాడు. ఎన్నో ఏళ్ల తర్వాత ఇంటికి వచ్చిన తన తల్లి మళ్లీ దూరమవుతుందనే ఆలోచన అతడిలో మొదలైంది. దీంతో నెల రోజుల క్రితం నగరానికి వచ్చి వెంకటరమణమూర్తితో సన్నిహితంగా ఉంటున్నట్లు నటించాడు. ప్రణాళిక ప్రకారం ఆదివారం మధ్యాహ్నం వెంటకరమణమూర్తి వద్దకు వచ్చాడు. ఇద్దరు కలిసి మద్యం తాగుతూ మాట్లాడుకున్నారు. అక్కడే ఉన్న 5 కేజీల గ్యాస్ సిలిండర్‌తో వెంకటరమణమూర్తి తల, పక్కటెముకలపై దాడి చేయడంతో పాటు తన వెంట తెచ్చుకున్న కత్తితో పొడిచాడు. అదే సమయంలో సిలిండర్ కింద విసిరేసినట్లు శబ్దం రావడంతో ఇంటి యజమాని కొడుకు పైకి వెళ్లి చూశాడు. అప్పటికే వెంకటరమణమూర్తి రక్తపు మడుగులో ఉన్నాడు. నిందితుడిని గది లోపలే ఉంచి తాళం వేసి మేడిపల్లి పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
విక్రయానికి రాజీవ్ స్వగృహ టవర్లు
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని పోచారం, గాజుల రామారం టౌన్ షిప్‌ల పరిధిలో పూర్తిగా నిర్మాణం కాని రాజీవ్ స్వగృహ టవర్లు ఎక్కడ ఎలా ఉన్నవి అలా విక్రయించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు హెచ్ఎండీఏకు బాధ్యతలను అప్పగించింది. ఇందులో భాగంగా హెచ్ఎండీఏ, రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఉన్నతాధికారులు ఈ నెల 9వ తేదీ సోమవారం ప్రీ బిడ్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు హిమాయత్ నగర్, ఉర్దూగల్లీలోని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ కార్యాలయం మీటింగ్ హాల్లో ఈ సమావేశం జరుగుతుందని అధికారులు తెలిపారు. పోచారంలో 9 అంతస్తులవి నాలుగు టవర్లు ఉండగా, వాటిల్లో ఒక్కొక్క టవర్‌లో కనీసం 72 నుంచి 198 ఫ్లాట్లను నిర్మించుకునే సదుపాయం ఉంది. అదేవిధంగా గాజుల రామారంలో 14 అంతస్తుల ఐదు టవర్లు ఉండగా వాటిల్లో ఒక్కొక్క టవర్ లో 112 ఫ్లాట్ లను నిర్మించుకునే సదుపాయం ఉంది. ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఉన్న పోచారం, గాజులరామారం స్వగృహ టవర్లను కొనుగోలు చేయడానికి ఆసక్తిగల బిల్డర్లు, డెవలపర్లు, సొసైటీలు, వ్యక్తులు ఈ నెల 30వ తేదీ నాటికి గడువు విధించారు. ఈ గడువు వరకు రూ.10 లక్షలు ధరావత్తును డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ధరావత్తు చెల్లించిన దరఖాస్తుదారుల ఎంపిక పారదర్శకంగా లాటరీ విధానం ద్వారా టవర్లను కేటాయిస్తారు. ఆసక్తిగల వ్యక్తులు, సంస్థలు, బిల్డర్లు, డెవలపర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపార వర్గాలు సోమవారం జరిగే ప్రీ బిడ్ సమావేశానికి హాజరై ఇతర వివరాలను అడిగి తెలుసుకోవచ్చునని అధికారులు తెలిపారు. -
కేసీఆర్ సర్కార్ కాసుల వేట.. అసైన్డ్ భూములపై స్పెషల్ ఫోకస్!
సాక్షి, సిటీబ్యూరో: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన రాష్ట్ర సర్కారు కాసుల వేట సాగిస్తోంది. ఖజానా నింపుకునేందుకు అసైన్డ్ భూములను అన్వేషిస్తోంది. వ్యవసాయేతర అవసరాలకు మళ్లిస్తున్న భూములను సేకరించి.. లేఅవుట్లుగా అభివృద్ధి చేసే దిశగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తోంది. ధరలు ఆకాశాన్నంటడంతో.. - రాజధానికి చేరువలో ఉన్న రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో భూముల ధరలు ఆకాశాన్నంటాయి. పారిశ్రామికాభివృద్ధి, ఐటీ కంపెనీల తాకిడితో ఈ రెండు జిల్లాల్లో నగరీకరణ శరవేగంగా జరుగుతోంది. దీంతో స్థిరాస్తి రంగం మూడు పూలు ఆరు కాయలుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే అసైన్డ్ భూములు సైతం పరాదీనమవుతున్నాయి. భూమిలేని నిరుపేదలకు జీవనోపాధి నిమిత్తం వివిధ దశల్లో రాష్ట్ర ప్రభుత్వం భూములను పంపిణీ (అసైన్మెంట్) చేసింది. - ఈ భూములను వ్యవసాయ సాగుకు మాత్రమే వినియోగించుకోవాలని నిర్దేశించింది. ఒకవేళ ఇతర అవసరాలకు మళ్లించినా.. క్రయ విక్రయాలు జరిపినా చట్టరీత్యా నేరం. ఇవేమీ పట్టని కొందరు ఈ భూములను యథేచ్ఛగా విక్రయించారు. బహిరంగ మార్కెట్‌తో పోలిస్తే కారుచౌకగా ఈ భూములు అందుబాటులో ఉండడంతో బడాబాబులు, ప్రజాప్రతినిధులు ఇబ్బడిముబ్బడిగా కొనుగోలు చేశారు. - ఇలా అసైన్మెంట్ చట్టాన్ని ఉల్లంఘించినా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో ఈ భూములక్రయ విక్రయాలకు అడూ అదుపూ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే అన్యాక్రాంతమవుతున్న అసైన్డ్ భూములను గుర్తించిన ప్రభుత్వం.. వీటిని ప్లాట్లుగా అభివృద్ధి చేయడం ద్వారా నిధుల సమీకరించుకోవాలనే ఆలోచన చేసింది. నగరానికి సమీపంలో ఉన్న ఈ తరహా భూములను గుర్తించి.. వాటిని లేఅవుట్లుగా అభివృద్ధి చేసి వేలం వేయాలని నిర్ణయించింది. ఈ అభివృద్ధి చేసిన భూమిలో ఎకరాకు 600 చదరపు గజాలను అసైన్డ్‌దారులకు ఇచ్చే విధంగా ప్రణాళికను రూపొందించింది. గజం రూ.40 వేల చొప్పున.. - ఉప్పల్ భగాయత్‌లో పట్టాదారుల భాగస్వామ్యంతో సేకరించిన హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) లేఅవుట్లుగా అభివృద్ధి చేసింది. దీంట్లో డెవలప్ చేసి ఎకరాకు వేయి గజాల చొప్పున పట్టాదార్లకు కేటాయించింది. ఇదే పద్ధతిని అసైన్డ్ భూములకు కూడా వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా మార్గదర్శకాలను ఖరారు చేసి భూములను గుర్తించాలని కలెక్టర్లకు లేఖ రాసింది. ఈ మేరకు చర్లపటేల్ గూడ, కుర్మల్‌గూడ, తొర్రూర్, కవాడిపల్లి, చందానగర్, మునగనూరు, కొల్లూరు, పసుమాముల, తుర్కయంజాల్, లేమూరు, కొల్లూరులలో దాదాపు 3వేల ఎకరాలను ప్రాథమికంగా ఎంపిక చేసింది. - సేకరిస్తున్న అసైన్డ్ భూములకు ఆయా ప్రాంతాల్లో ఉన్న విలువ ఆధారంగా ఎకరాకు 600 గజాల నుంచి 800 వరకు ఇవాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రైవేటు భూములతో పోలిస్తే అసైన్డ్ భూములకు ధర తక్కువ. వీటి క్రయవిక్రయాలపై నిషేధం ఉన్నందున.. ఇవి ఎకరాకు రూ.25 లక్షలు కూడా లభిస్తున్నాయి. - ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న సర్కారు వీటిని లేఅవుట్లుగా అభివృద్ధి చేయడం ద్వారా గజాన్ని సగటున రూ.40వేల చొప్పున విక్రయించవచ్చని అంచనా వేస్తోంది. దీంతో అటు అసైన్డ్‌దారులు.. ఇటు ప్రభుత్వానికి ఉభయతారకంగా లబ్ధి చేకూరుతుందని భావిస్తోంది. ఎన్నికల సంవత్సరం కావడం.. సంక్షేమ పథకాలకు నిధులు భారీగా అవసరం ఉండడంతో సాధ్యమైనంత త్వరగా అసైన్డ్ భూములను సేకరించి వెంచర్లుగా అభివృద్ధి చేసి నిధులను సమకూర్చుకోవాలనుకుంటోంది. దీంతో ఈ ప్రక్రియను వడివడిగా పూర్తి చేయాలని కలెక్టర్లకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. -
Cyberabad Police Commissionerate: సైబరాబాద్‌లో 5 జోన్లు!
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సరం నుంచి సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ స్వరూపం మారనుంది. హైదరాబాద్ తరహాలో సైబరాబాద్ కూడా ఐదు జోన్లతో కార్యకలాపాలు సాగించనుంది. ఇప్పటికే శాంతి భద్రతల విభాగంలో మాదాపూర్, శంషాబాద్, బాలానగర్ మూడు జోన్లు ఉండగా.. కొత్తగా రాజేంద్రనగర్, మేడ్చల్ జోన్లు అవతరించనున్నాయి. ట్రాఫిక్ విభాగాన్నీ రెండు జోన్లుగా విభజించి, జాయింట్ సీపీ అధికారిని నియమించనున్నారు. ఈ మేరకు ఆయా ఏర్పాట్లపై సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు. 3,644 చ.కి.మీ. మేర విస్తరించి ఉన్న సైబరాబాద్‌లో సుమారు ఏడు లక్షల జనాభా ఉంది. పట్టణీకరణ, కొత్త ప్రాంతాల ఏర్పాటుతో సైబరాబాద్ విస్తరిస్తుంది. దీంతో కొత్త జోన్ల ఏర్పాటు అనివార్యమైంది. ఈ మేరకు ప్రస్తుతం బాలానగర్ జోన్లో భాగంగా ఉన్న మేడ్చల్‌ను వేరే చేసి కొత్తగా మేడ్చల్ జోన్‌ను, అలాగే ప్రస్తుతం శంషాబాద్ జోన్లో ఉన్న రాజేంద్రనగర్‌ను విడదీసి రాజేంద్రనగర్ జోన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇటీవలే సైబరాబాద్‌కు 750 కొత్త పోస్టులు మంజూరయ్యాయి. వీటిలో ఒక జాయింట్ సీపీ, నాలుగు డీసీపీ, ఏడు అదనపు డీసీపీ, ఎనిమిది ఏసీపీ ర్యాంకు పోస్టులు కాగా.. మిగిలినవి ఇన్స్పెక్టర్, ఆ కింది స్థాయి ర్యాంకు పోస్టులున్నాయి. కొత్త జోన్ల స్వరూపం ఇదే: మేడ్చల్ జోన్: ఈ జోన్లో మేడ్చల్, పేట్‌బషీరాబాద్ డివిజన్లుంటాయి. మేడ్చల్ డివిజన్లో కొత్తగా ఏర్పాటయ్యే సూరారం, జీనోమ్‌వ్యాలీతో పాటు ఇప్పటికే ఉన్న మేడ్చల్, దుండిగల్ ఠాణాలుంటాయి. రాజేంద్రనగర్ జోన్: ఈ జోన్లో రాజేంద్రనగర్, చేవెళ్ల డివిజన్లుంటాయి. రాజేంద్రనగర్ డివిజన్లో రాజేంద్రనగర్, మైలార్‌దేవ్‌పల్లి, నార్సింగితో పాటు కొత్తగా ఏర్పాటుకానున్న అత్తాపూర్ ఠాణా కూడా ఉంటుంది. పేట్‌బషీరాబాద్ డివిజన్లో అల్వాల్, శామీర్‌పేట, పేట్‌బషీరాబాద్ పీఎస్‌లు, చేవెళ్ల డివిజన్లో మొయినాబాద్, శంకర్పల్లి, షాబాద్, చేవెళ్ల పీఎస్‌లుంటాయి. కొత్త ఠాణాలు ఇక్కడే.. తాజా పునర్ వ్యవస్థీకరణతో సైబరాబాద్‌లో ప్రతి జోన్‌లోనూ రెండేసి డివిజన్లు ఉంటాయి. ప్రస్తుతం మాదాపూర్ జోన్లో ఉన్న కూకట్పల్లి డివిజన్‌ను విడదీసి బాలానగర్ జోన్లో కలిపేయనున్నారు. దీంతో మాదాపూర్ జోన్లో మాదాపూర్, మియాపూర్ డివిజన్లు, బాలానగర్ జోన్లో బాలానగర్, కూకట్పల్లి, శంషాబాద్ జోన్లో శంషాబాద్, షాద్‌నగర్ డివిజన్లుంటాయి. అలాగే ప్రస్తుతం సైబరాబాద్‌లో 37 శాంతి భద్రతల పోలీసు స్టేషన్లు ఉండగా.. కొత్తగా గండిపేట, మెకిలా, కొల్లూరు, జన్వాడ, సూరారం, జీనోమ్‌వ్యాలీ, అత్తాపూర్ ఠాణాలను ఏర్పాటు చేయనున్నారు. ట్రాఫిక్‌కు జాయింట్ సీపీ.. ప్రస్తుతం సైబరాబాద్ మొత్తానికీ ఒకటే ట్రాఫిక్ జోన్ ఉంది. దీన్ని రెండుగా విభజించి రాజేంద్రనగర్, మేడ్చల్ జోన్లుగా ఏర్పాటు చేయనున్నారు. ప్రతి జోన్ ఒక డీసీపీ, అదనపు డీసీపీ పర్యవేక్షణలో ఉంటాయి. కొత్తగా ట్రాఫిక్ విభాగానికి జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీసు (జాయింట్ సీపీ)ను నియమించనున్నారు. ప్రస్తుతం సైబరాబాద్‌లో మాదాపూర్, శంషాబాద్, బాలానగర్ ట్రాఫిక్ డివిజన్లలో 14 పీఎస్‌లున్నాయి. -
ఇస్కాన్ సేవలు అభినందనీయం
మేడ్చల్: ఇస్కాన్ దేశ విదేశాల్లో అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని రాష్ట్ర గవర్నర్ తమిళి సై పేర్కొన్నారు. మండలంలోని డబీల్‌పూర్ ఇస్కాన్ ఆలయంలో ఆదివారం నిర్వహించిన మహాసుదర్శన నారసింహ హోమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్యక్రమంలో పాల్గొనేందుకు గవర్నర్ గా కాకుండా సామాన్య భక్తురాలిగా వచ్చానని మేడ్చల్ ప్రాంతంలో ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం అనందంగా ఉందన్నారు. ఇస్కాన్ సంస్థ ప్రజల కోసం ధార్మిక కార్యక్రమాలతో పాటు ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. మంత్రి మల్లారెడ్డి పూజలు.. కార్యక్రమంలో మంత్రి చామకూర మల్లారెడ్డి పాల్గొ ని పూజలు చేశారు. కార్యక్రమంలో బీజేపీ మధ్య ప్రదేశ్ ఇన్చార్జి మురళీధర్‌రావు, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్, కాంగ్రెస్ నాయకుడు హరివర్ధన్‌రెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
బీఆర్ఎస్లో రచ్చకెక్కిన విభేదాలు
సాక్షి, మేడ్చల్ జిల్లా: మంత్రి మల్లారెడ్డి వ్యవహారంపై అధిష్టానం నోరు మెదపకపోవడం మేడ్చల్ జిల్లాలో ఆసక్తిగా మారింది. సొంతపార్టీ ఎమ్మెల్యేలు ఆయనపై తిరుగుబాటు చేస్తూ బహిరంగంగా విమర్శనాస్త్రాలు సంధించినా అధిష్టానం దిద్దుబాటు చర్యలకు దిగకపోవడం చర్చనీయాంశంగా మారింది. కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తీరును తప్పుబడుతూ జిల్లా ఎమ్మెల్యేలంతా అసంతృప్తి గళం వినిపించారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే నేతృత్వంలో సమావేశమైన శాసనసభ్యులు మల్లారెడ్డిపై బహిరంగంగా.. జిల్లా అధ్యక్షుడు శంభీపూర్ రాజుపై పరోక్షంగా ఆరోపణలు గుప్పించారు. నామినేటెడ్ పదవుల ఖరారులో ఏకపక్ష వైఖరిని తప్పుబడుతూ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళతామని ప్రకటించారు కూడా. ఇలా మంత్రి, ఎమ్మెల్యేల మధ్య అసమ్మతి వ్యవహారం రచ్చకెక్కి వారం రోజులవుతున్నా అధిష్టానం దిగిరాకపోవడం.. కనీసం అసమ్మతి ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాకపోవడం.. సర్దుబాటుకు చొరవ చూపకపోవడం పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది. ఎన్నికలకు గడువు సమీపిస్తున్న తరుణంలో బడా నేతలే క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడినా గులాబీ బాస్ పట్టించుకోకపోవడమేమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మంత్రి మల్లారెడ్డి, బీఆర్ఎస్ అధ్యక్షుడు శంభీపూర్ రాజుతో కలిసి జిల్లా పార్టీలో గ్రూపులను ప్రోత్సహిస్తున్నారని ఎమ్మెల్యేలు ఆరోపించిన తీరుపై కూడా పార్టీ పెద్దలు మౌనం వహించటం వెనక అంతర్యమేమిటో ఆర్థం కావడంలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చాప కింద నీరులా విభేదాలు.. పార్టీలో చాప కింద నీరులా కొనసాగుతున్న విభేధాలు మంత్రి మల్లారెడ్డిపై ఎమ్మెల్యేల తిరుగుబాటుతో బహిర్గతమైంది.అధినేత కేసీఆర్ ఇటీవల సిట్టింగ్‌లందరికీ రాబోయే ఎన్నికల్లో టికెట్లు ఇస్తామన్న ప్రకటనతో ఆశావహుల్లో అలజడి మొదలైంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సిట్టింగ్‌లే టికెట్‌ను ఖరారు చేసుకునే దిశగా అడుగులు వేస్తుండగా, ఆశావహులు వ్యూహా, ప్రతి వ్యూహాలతో పార్టీ గాడ్ ఫాదర్ల ఆశీస్సులతో ప్రజల వద్దకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య అంతర్గతంగా ఉన్న గ్రూపులు బయట పడుతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ ప్రభావం పార్టీ కేడర్తోసహా జిల్లా ప్రజల్లో పొడచూపటంతో లుకలుకలు తారస్థాయికి చేరినట్లు ప్రచార జరుగుతోంది. u కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మళ్లీ బరిలో నిలిచేందుకు అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకోవటం ద్వారా ప్రజల మద్దతును కూడగట్టుకొంటుండగా,.. ఇక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ,ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు శక్తియుక్తులను కూడగట్టుకుని గాడ్ ఫాదర్ల ఆశీస్సుల కోసం పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో నియోజకవర్గలో ఇరువురి నేతల మధ్య పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు ,కేడర్ నలిగిపోతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉప్పల్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి మళ్లీ పోటికి ఏర్పాట్లు చేసుకుంటుండగా, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ టికెట్ దక్కించుకొవటమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఈ నేపధ్యంలోనే ఇరువురి మధ్య తరచుగా పార్టీ వేదికలు, పార్టీ కార్యక్రమాల్లో వివాదాలు తలెత్తుతున్నాయి. మేడ్చల్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే ,మంత్రి మల్లారెడ్డి ,మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి పోటా పోటీగా టికెట్ ఆశిస్తుండగా, మధ్యలో మంత్రి తనయుడు మహేందర్‌రెడ్డి కూడా అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. మల్కాజిగిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుతోపాటు ఆయన తనయుడు మైనంపల్లి రోహిత్ పోటికి సిద్దపడుతుండగా, కూకట్పల్లి సీటుపై సిట్టింగ్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో పాటు ఎమ్మెల్సీ నవీన్‌రావు కూడా నజర్ పెట్టినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అలాగే, మల్కాజిగిరి ఎంపీగా పోటీచేసేందుకు రేసులో మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుతోసహా ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్ కూడా ఆసక్తి కనబరుస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. రాబోయే సాధారణ ఎన్నికల నేపథ్యంలో పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేల పాటు కొత్తగా టికెట్లు ఆశిస్తున్న నేతల మధ్య నెలకొన్న విభేధాలు చాపకింద నీరులా బజారున పడినా అధిష్టానం నోరువిప్పక పోవటంపై పార్టీ వర్గాలతోపాటు రాజకీయ పార్టీలు, పరిశీలకులు పలు అభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు. -
Hyderabad: వైద్యుల నిర్లక్ష్యంతో నిండు గర్భిణి మృతి!
సాక్షి, హైదరాబాద్(కీసర): వైద్యుల నిర్లక్ష్యం కారణంగా నిండు గర్భిణీ మృతి చెందిందని ఆరోపిస్తూ ఓ ప్రైవేటు ఆస్పత్రి ఎదుట మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. బొమ్మలరామారం మండలం తూంకుంటకు చెందిన రాధిక అలియాస్ లావణ్య(22)కు పదినెలల క్రితం కీసరకు చెందిన పూండ్రు శేఖర్‌తో వివాహం జరిగింది. ఆమె 5 నెలల గర్భిణీ కాగా.. ఆమెకు కడుపు నొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఈనెల 16న కీసరలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యురాలు చికిత్స చేసి ఇంటికి పంపించారు. నొప్పి తగ్గకపోవడంతో అదే రోజు భువనగిరిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు వెంటనే నగరంలోని గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లమని సూచించారు. గాంధీలో పరీక్షించిన వైద్యులు కడుపులో బిడ్డ పరిస్థితి బాగాలేదని తొలగించారు. ఆ తర్వాత ఆమె పరిస్థితి విషమించి శుక్రవారం మృతి చెందింది. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి నుంచి సదరు ప్రైవేటు ఆసుపత్రికి తీసుకొచ్చి ఆందోళనకు దిగారు. మృతురాలి కుటుంబీకులు ఆసుపత్రి అద్దాలు, ఫర్నీచర్‌ను సైతం ధ్వసం చేశారు. సమాచారం అందుకున్న కీసర పోలీసులు మృతురాలి కుటుంబసభ్యులతో మాట్లాడారు. గర్భిణీ అయిన తన భార్యను వైద్య పరీక్షల కోసం తీసుకొచ్చినప్పుడు పచ్చ కామెర్లు వచ్చాయని చెప్పలేదని ముందే చెబితే జాగ్రత్త పడేవారమని భర్త ఆవేదన వ్యక్తం చేశాడు. బాధితులు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు. చదవండి: (హైదరాబాద్‌లో కోటి విలువ చేసే వజ్రాభరణాలు చోరీ.. దొంగలను పట్టించిన భూతద్దం) -
చిన్నారి మృతిపై వీడని మిస్టరీ.. తల్లిదండ్రుల ఫోన్లు స్వాధీనం!
సాక్షి, మేడ్చల్: దమ్మాయిగూడ చిన్నారి మృతి కేసులో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. పాప మృతికి గల కారణాలపై మిస్టరీ వీడలేదు. ఈ క్రమంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణకు 10 పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. సైంటిఫిక్ ఎవిడెన్స్లతో పాటు హ్యూమన్ ఇంటెలిజెన్స్‌తో విచారిస్తున్నారు. చిన్నారి తల్లిదండ్రుల మొబైల్ ఫోన్స్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. చిన్నారి ఇందుకు ఇవాళ(శనివారం) అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పాప మృతికి గల అసలు కారణాలను వెలికి తీసి వారి కుటుంబానికి న్యాయం చేయాలని పెద్ద ఎత్తున ప్రజలు డిమాండ్ చేస్తున్న క్రమంలో దమ్మాయిగూడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఎలాంటి అవాంఛనీయం సంఘటనలు జరగకుండా దమ్మాయిగూడలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు.. సైంటిఫిక్ ఎవిడెన్స్ కోసం చెరువు నీటిని సైతం పరీక్షలకు పంపించినట్లు సమాచారం. అలాగే.. గంజాయి సెవిస్తూ విచ్చలవిడిగా తిరిగే కొందరు అనుమానితులను సైతం జవహార్‌నగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే, పోస్టుమార్టం నివేదిక, సైంటిఫిక్ ఆధారాలతోనే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇదీ చదవండి: బాలిక మిస్సింగ్ విషాదాంతం.. చెరువులో మృతదేహం లభ్యం -
ఇందు మృతిపై ఎలాంటి అనుమానాలు లేవు : బాలిక తండ్రి
-
మిస్టరీ డెత్.. దమ్మాయిగూడ చౌరస్తాలో ఉద్రిక్తత..
-
దమ్మాయిగూడ బాలిక మృతి కేసు.. పోస్టుమార్టం నివేదికలో కీలకాంశాలు
సాక్షి, మేడ్చల్: దమ్మాయిగూడ చెరువులో లభ్యమైన చిన్నారి ఇందు మృతదేహానికి గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. గ్రూప్ ఆఫ్ డాక్టర్స్‌తో పంచనామా, పోస్టుమార్టం పూర్తి చేశారు. నాలుగు పేజీల పంచనామాలో అధికారులు వివరాలు రికార్డ్ చేశారు. కాగా ఇందు పోస్టుమార్టం నివేదికలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. బాలిక ఊపిరితిత్తుల్లో నీరు గుర్తించిన వైద్యులు.. శరీరంపై ఎటువంటి గాయాలు లేవని తేల్చారు. చెరువులో పడి నీరు మింగి చనిపోయినట్లు నిర్ధారణకు వచ్చారు. అయితే చెరువులో ఎవరైనా తోసేశారా..? తనే ఆడుకుంటూ పడిందా అనేది తేలాల్సి ఉంది. దమ్మాయిగూడలో ఉద్రిక్తత దమ్మాయిగూడ చౌరస్తాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బాలిక మృతదేహంతో తల్లిదండ్రులు నిరసనకు దిగారు. పోస్టుమార్టం రిపోర్టు తమకు ఇవ్వాలని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందు మృతిపై స్పఫ్టత ఇవ్వాలని, చిన్నారి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అసలు ఏం జరిగింది? మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని దమ్మాయిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న 10 ఏళ్ల బాలిక ఇందు గురువారం ఉదయం కనిపించకుండా పోయింది. గురువారం ఉదయం తండ్రితో పాటు స్కూల్‌కు వచ్చిన బాలిక తన బ్యాగును అక్కడే విడిచిపెట్టి పార్కుకు వెళ్లినట్లుగా మిగిలిన పిల్లలు చెప్పారని హెడ్మాస్టర్ తెలిపారు. బాలిక వెళ్లిపోయిన విషయాన్ని ఆమె తండ్రికి ఫోన్ చేసి చెప్పినట్లు వెల్లడించారు. ఎంత వెతికినా ఆచూకీ దొరకకపోయే సరికి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. దీంతో స్కూల్ హెడ్మాస్టర్, బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. డాగ్ స్వ్కాడ్స్, క్లూస్ టీంలను రంగంలోకి దింపి గాలించారు. పాఠశాల ఆవరణలో సీసీటీవీ కెమెరాలు లేవు. దమ్మాయిగూడ చౌరస్త వద్ద ఉన్న ఓ సీసీటీవీ కెమెరాలో మాత్రమే బాలిక కనిపించింది. ఆ తర్వాత ఎటు వెళ్లిందనే విషయం తెలియరాలేదు. డాగ్ స్వ్కాడ్స్ చెరువు వద్దకు వెళ్లి ఆగిపోయాయి. దీంతో గజ ఈతగాళ్లతో గాలించగా.. శుక్రవారం ఉదయం చెరువులో మృతదేహం లభ్యమైంది. -
మేడ్చల్: బాలిక మిస్సింగ్ ఘటన విషాదాంతం
-
Medchal: పెళ్లై ఆరు నెలలు గడవకముందే యువకుడి ఆత్మహత్య
సాక్షి, మేడ్చల్: పెద్దలను ఒప్పించి మరీ ప్రేమ వివాహం చేసుకున్న ఓ యువకుడు పెళ్లైన ఆరు నెలలు తిరగకముందే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది. వనపర్తి జిల్లాకు చెందిన వినయ్ అనే వ్యక్తి ఓ యువతిని ప్రేమించాడు. ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. అనంతరం తన భార్యతో కలిసి హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని వెంకటాపురంలో కాపురం పెట్టాడు. దంపతుల మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ.. వినయ్ ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం రాత్రి వినయ్ ఇంటి నుండి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా వినయ్ ఫ్యానుకు ఉరేసుకొని విగత జీవిగా కనిపించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కి తరలించారు. కాగా అయిదు రోజుల క్రితమే వినయ్ ఆత్మహత్య చేసుకొని ఉండచ్చని పోలీసులు భావిస్తున్నారు. పెళ్లైన ఆరు నెలలకే యువకుడు ఆత్మహత్య చేసుకోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. వినయ్ ఆత్మహత్య విషయాన్ని పోలీసులు అతని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అయితే భార్య వేధింపుల కారణంగానే వినయ్ ప్రాణం తీసుకున్నాడని అతడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. కుటుబం సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: యువతి కిడ్నాప్ కేసు.. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు -
స్వామి వారి పేరు మార్చి... రికార్డులు ఏమార్చి!
సాక్షి, మేడ్చల్ జిల్లా: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేడ్చల్ జిల్లా దేవరయాంజాల్ రామచంద్రస్వామి ఆలయ భూములు దేవాదాయ శాఖవేనని విచారణ కమిటీ నిగ్గుతేల్చింది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ బర్తరఫ్‌తో వెలుగుచూసిన ఈ భూముల వ్యవహారంపై నిగ్గు తేల్చాలని నిర్ణయించిన సర్కారు.. సీనియర్ ఐఏఎస్ అధికారి ఎం.రఘునందన్‌రావు నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. ఈ త్రిసభ్య కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి ఆలయ భూముల్లో వాణిజ్య నిర్మాణాలు, ఫంక్షన్ హాళ్లు, రిసార్టులు, పరిశ్రమలు పుట్టుకొచ్చినట్లు గుర్తించింది. అలాగే, కొంతమంది సాగు కూడా చేసుకుంటున్నట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆలయానికి సంబంధించి 1,350 ఎకరాలు దేవాదాయశాఖకే చెందుతాయని కమిటీ తేల్చింది. ప్రభుత్వ పెద్దలు, ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు ఈ భూముల్లో తిష్టవేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. సీతారామస్వామి... సీతారామరెడ్డి అయ్యాడు! దేవరయాంజాల్‌లోని శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయం చాలా పురాతనమైనది. నిజాం హయాంలో ఓ భక్తుడు ఈ ఆలయానికి 1,531 ఎకరాల భూమిని వితరణ చేశారు. దానిని ఆలయ భూమిగా రికార్డుల్లో చేర్చారు. ఇప్పటివరకు కచ్చితమైన భూరికార్డులుగా చెప్పుకొనే 1924–25 రెవెన్యూ రికార్డుల్లో.. ఈ 1,531 ఎకరాల భూమి సీతారామచంద్రస్వామి ఆలయం పేరిటే ఉంది. ఈ భూములన్నీ 55 నుంచి 63, 639–641, 656, 657, 660–682, 686–718, 736 సర్వే నంబర్లలో ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. కానీ తర్వాత ఆ భూమి కబ్జాల పాలైంది. భూమి యజమానిగా ఉన్న శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయం పేరు కాస్తా.. సీతారామరెడ్డి, సీతారామారావు, సీతారామయ్య, సీతారాములుగా.. మారిపోయి కబ్జాదారుల పేర్లు రికార్డులకెక్కాయి. ఆ భూముల్లో రిసార్టులు, పరిశ్రమలు, నివాసాలు, వాణిజ్య సముదాయాలు వెలిశాయి. రికార్డులు స్పష్టంగా ఉన్నా... ఆ భూముల్లోనే 130 ఎకరాల్లో హకీంపేట ఎయిర్‌బేస్ ఉంది. మరో 800 ఎకరాల భూమి వ్యవసాయం పేరుతో ఖాళీగా ఉంది. మరి వాటి రూపంలో రావాల్సిన ఆదాయం ఎటుపోతోంది? ఎవరి జేబుల్లోకి వెళుతోంది? అసలా భూములన్నీ దేవుడి మాన్యమేనని పాత రెవెన్యూ రికార్డులు స్పష్టంగా చెబుతున్నా ఇన్ని నిర్మాణాలు ఎలా వెలిశాయి? వీటన్నింటికీ జవాబు ఒకటే... పలువురు నేతలు, అధికారులు కుమ్మక్కై దేవుడి సొమ్మును దోచుకుంటున్నారు. ఈ భూములను తమ అధీనంలో ఉంచుకున్న వారు ప్రతినెలా రూ.5 కోట్ల మేర అద్దె/లీజు పేరిట వసూలు చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. అక్రమార్కులకు క్లీన్చిట్.. పదోన్నతులు ఈ భూములను ’కబ్జా’లో ఉన్నవారికే ఇచ్చి డబ్బులు వసూలు చేయాలంటూ కొంతకాలం కింద దేవాదాయశాఖ నిర్ణయం తీసుకుంది. కానీ, దీనిపై నియమించిన జస్టిస్ వెంకటరామిరెడ్డి కమిషన్ ఈ వ్యవహారంలో అక్రమాలను నిగ్గుతేల్చి.. ఆలయ మేనేజర్ చంద్రమోహన్, సహాయ కమిషనర్ రాఘవాచార్యులు, మాజీ డిప్యూటీ కమిషనర్ జ్యోతిపై చర్యలు తీసుకోవాలని నివే దికలో పేర్కొంది. విజిలెన్స్, ఏసీబీ కూడా వీరితోపాటు నాటి దేవాదాయ కమిషనర్ వెంకటేశ్వర్లు, ముఖ్యకార్యదర్శి జేపీ మూర్తి, సంయుక్త కమిషనర్ రామకృష్ణకుమార్, ఉపకమిషనర్ మోహనాచారిని కూడా బాధ్యులను చేస్తూ చర్యలకు సిఫారసు చేశాయి. కానీ, అప్పటి ప్రభుత్వం వారికి క్లీన్చిట్ ఇచ్చింది. ఆపై పదోన్నతులు కూడా కల్పించిందన్న ఆరోపణలున్నాయి. కాగా, హైదరాబాద్ శివారులోని ఈ 1,350 ఎక రాలు దేవాదాయ శాఖవేనని కమిటీ తేల్చ డంతో కబ్జాదారుల్లో గుబులు మొదలైంది. మాజీమంత్రి ఈటల రాజేందర్‌సహా వారి బంధువుల భూములు ఉన్నాయన్న నేపధ్యంలో కక్ష సాధింపునకే ప్రభుత్వం విచారణ చేపట్టిందని పలువురు విమర్శించారు. -
అమ్మానాన్నా.. క్షమించండి
మేడ్చల్ రూరల్: యూపీఎస్సీ (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) పరీక్ష క్లియర్ చేయలేదని మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్‌నోట్ రాసి ఓఆర్ఆర్ సమీపంలో నిర్మానుష్య ప్రదేశంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేడ్చల్ సీఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అల్వాల్‌లో నివాసం ఉండే గంగిశెట్టి సాకేత్ కుమార్ (28) ప్రస్తుతం బెంగళూరులో ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. రెండేళ్ల క్రితం ఢిల్లీలో యూపీఎస్సీ కోచింగ్ తీసుకున్న సాకేత్ మూడుసార్లు యూపీఎస్సీ పరీక్ష రాసినా విజయం సాధించలేదని కుమిలిపోతూ ఉన్నాడు. ఈ నెల 16న హైదరాబాద్‌లో గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష రాసి ఇంటికి చేరుకున్నాడు. రాత్రి తల్లిదండ్రులు, సోదరి, బావతో కలిసి భోజనం చేసి పడుకుంటానని చెప్పి మొదటి అంతస్తులోని తన గదిలోకి వెళ్లాడు. సోమవారం ఉదయం గదిలో చూడగా సాకేత్ కనిపించలేదు. తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సాకేత్ రాసిన సూసైడ్ నోట్ లభ్యమైంది. దీంతో కుటుంబీకులు అల్వాల్ పోలీసులను ఆశ్రయించగా వారు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధి గౌడవెళ్లి వద్ద ఓఆర్ఆర్ సమీపంలో నిర్మానుష్య ప్రదేశంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం అందింది. గమ్యం చేరని ప్రయాణానికి ముగింపు సాకేత్ రెండు సూసైడ్నోట్లు రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ‘అమ్మానాన్నా.. చెల్లి దయచేసి ఈ జన్మకి నన్ను క్షమించండి. నేను బెంగళూరు వెళ్లాక జీవితం కుదుట పడిందని, కిందటి వారం జీతం కూడా పెరిగి మంచి భవిష్యత్తు ఉందని భావించాను. కానీ నేను యూపీఎస్సీ పరీక్ష క్లియర్ చేయలేదనే బాధ నా మదిలో నుంచి పక్కకి పోవడంలేదు. భావోద్వేగాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నా, గమ్యం (ఐఏఎస్) చేరని ప్రయాణానికి ఒక ముగింపు’అంటూ సూసైడ్ నోట్ రాశాడు. మరో సూసైడ్‌నోట్‌లో ‘భయం కారణంగా నేను అనుకున్నది చేయలేకపోతున్నా. కాబట్టి సులువైన మార్గంలో ఇంటిని విడిచిపెట్టాలనుకుంటున్నా. నా కోసం వెతకకండి. నేను అదృష్టవంతుడినైతే నా శరీరం కుళ్లిపోయిన స్థితిలో దొరుకుతుంది’ అని రాశాడు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. -
చదువులు సాగేదెలా?
సాక్షి, హైదరాబాద్: సర్కారు బడుల్లో పాఠ్య పుస్తకాలే కాదు... ఏకరూప దుస్తులు సైతం అందని ద్రాక్షగా తయారయ్యాయి, ఒకవైపు విద్యార్థులకు పూర్తిస్థాయి పాఠ్య పుస్తకాలు లేకుండానే చదువులు సాగుతుండగా.. యూనిఫాంల జాడ కూడా లేకుండా పోయింది. 2022– 23 విద్యా సంవత్సరం ప్రారంభమై 6 నెలలు గడిచినా 60 శాతం మించి పాఠ్యపుస్తకాలు సరఫరా కాలేదని అధికారుల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రధాన ప్రచురణ కేంద్రం నుంచి గోదాములకే అరకొర స్టాక్ వచ్చి చేరడంతో పాఠశాలలకు పుస్తకాల సరఫరా అంతంత మాత్రంగా ఉంది. ఇప్పటి వరకు వచి్చన వాటిలో సైతం ఏ ఒక్క తరగతికి సైతం పూర్తి స్థాయి పుస్తకాల సెట్ అందలేనట్లు తెలుస్తోంది. విద్యా సంవత్సరం ప్రారంభంలో పాఠ్యపుస్తకాల పంపిణీ ఆలస్యం కావడంతో అప్పటిదాకా బ్రిడ్జి కోర్సులు నిర్వహించారు. అనంతరం బోధన ప్రారంభించినప్పటికీ పూర్తి స్థాయి పాఠ్య పుస్తకాల కొరత వెంటాడుతోంది. పాత పుస్తకాలతోనే.. గత విద్యా సంవత్సరం ప్రభుత్వ బడుల్లో చాలా తరగతులకు సగం పుస్తకాలే పంపిణీ చేశారు. పాత వాటిని సైతం ఈసారి సేకరించి సర్దుబాటు చేసినా విద్యార్థులందరికీ సరిపోని పరిస్థితి నెలకొంది. కొన్ని పాఠశాలల్లో అయిదుగురు విద్యార్థులను ఒక గ్రూప్‌గా చేసి వారికి ఒక్కో పాఠ్య పుస్తకాన్ని ఇచ్చి సర్దుబాటు చేశారు. దీంతో చేతిలో పుస్తకాలు లేక విద్యార్థులు దిక్కు తోచని స్థితిలో పడ్డారు. తోటి విద్యార్థుల పుస్తకాలపై ఆధారపడి చదువులు కొనసాగించడం ఇబ్బందిగా తయారైంది. తరగతి గదిలో బోధన తర్వాత ఇంటివద్ద హోంవర్కు సమస్యగా తయారైంది. పాఠ్య పుస్తకాలపై విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణలో నిర్లక్ష్యం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు శాపంగా తయారైంది. 24.73 లక్షలపైనే.. గ్రేటర్‌లోని హైదరాబాద్–రంగారెడ్డి–మేడ్చల్ జిల్లా పరిధిలోని ప్రభుత్వ బడులకు సుమారు 24.73 లక్షల పాఠ్యపుస్తకాల అవసరం ఉంటాయని విద్యాశాఖాధికారులు అంచనా వేశారు. ఈ మేరకు ఇండెంట్ పెట్టారు. అందులో 60 శాతం మాత్రమే ప్రింటింగ్ ప్రెస్ నుంచి గోదాములకు చేరాయి. అందులో సైతం తరగతులకు సంబ ంధించిన అన్ని పాఠ్యపుస్తకాలు అందలేదు. ఈ విద్యా సంవత్సరం ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టడంతో ఒకే సా రి ఇంగ్లి‹Ù, తెలుగు మీడియం పుస్తకాల ప్రచురణ తలపెట్టడంతో పూర్తి స్థాయి కోటాకు ఆటంకంగా తయారైంది. ఊసే లేని యూనిఫాంలు.. సర్కారు బడుల విద్యార్థులకు ఇప్పటి వరకు యూనిఫాంల ఊసే లేకుండా పోయింది. విద్యార్థులకు రెండు జతల చొప్పున ఉచితంగా యూనిఫాంలను అందించాల్సి ఉంది. సాధారణంగా వేసవి సెలవుల్లోనే వీటికి అవసరమైన వ్రస్తాన్ని టెస్కో ద్వారా కొనుగోలు చేసి, ఆయా జిల్లాలు, మండలాల వారీగా స్కూళ్లకు అందించాలి. ఈ ఏడాది యూనిఫాంలకు అవసరమైన వస్త్రం కొనుగోలు ప్రక్రియలో తీవ్ర జాప్యం ఏర్పడింది. దీంతో సకాలంలో దుస్తుల పంపిణీ ప్రశ్నార్థకంగా మారింది. (చదవండి: ఆ సొమ్మంతా ఎవరికి వెళ్లింది?) -
మేడ్చల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
సాక్షి, మేడ్చల్: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. వివరాల ప్రకారం.. సోమవారం తెల్లవారుజామున మేడ్చల్‌లో ఓ బైక్ ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి అదుపుతప్పి.. లారీ కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, మహిళ ఉన్నట్టు సమాచారం. -
చిన్నారుల్ని చిదిమేసిన లారీ
కుషాయిగూడ (హైదరాబాద్): సాయంత్రం 5 గంటల సమయం. పాఠశాలలు వదిలేశారు. ఒకేచోట ఉన్న మూడు పాఠశాలలకు చెందిన విద్యార్థులు తాము రోజూ వచ్చే ఆటోలో ఎక్కారు. అందరిలోనూ ఇంటికి వె ళుతున్న సంతోషం. సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. అంతలోనే ఘోరం.. వారు ప్రయాణిస్తున్న ఆటోను లారీ ఢీకొట్టడంతో ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి కిందపడి పల్టీలు కొట్టింది. పిల్లలు చెల్లా చెదురుగా పడిపోయారు. అమ్మా అంటూ ఆర్తనాదాలు మిన్నంటాయి. ఇద్దరు విద్యార్థినులు అక్కడి కక్కడే మరణించారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. రక్తం మడుగులు కట్టింది. చర్లపల్లి చలించిపోయింది. స్థానికు లు హుటాహుటిన చిన్నారుల్ని సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు విద్యార్థినులు మరణించినట్లు ధ్రువీకరించిన వైద్యులు, ఒకరి పరిస్థితి విషమంగా ఉందని, ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు. కుషాయిగూడ పోలీ స్‌స్టేషన్ పరిధిలో గురువారం ఈ ప్రమాదం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఇళ్లకు చేరతారనగా.. చర్లపల్లి ప్రాంతానికి చెందిన తన్మయి (13) కోమలిత (11), రిషిప్రియ, రిషి వల్లభ్, రిషి కుమార్, వర్ణిక ఈసీఐఎల్‌లోని శ్రీ చైతన్య, నారాయణ, రవీంద్రభారతి పాఠశాలల్లో చదువుకుంటున్నారు. ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడంతో వీరంతా రోజూ ఒకే ఆటోలో స్కూళ్లకు వచ్చి వెళ్తుంటారు. రోజులానే గురువారం ఉదయం కూడా స్కూల్‌కు వచ్చి సాయంత్రం ఇంటికి బయలుదేరారు. ఆటో బయలుదేరిన పది నిమిషాలకు, కాసేపట్లో ఇళ్లకు చేరతారనగా ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చక్రిపురం చౌరస్తా మీదుగా చర్లపల్లి జైలు దాటి వెళ్తున్న క్రమంలో ఎదురుగా వచ్చిన లారీ (ఏపీ 28 టీడీ 0599) అదుపుతప్పి పిల్లలతో వెళ్తున్న ఆటోను (టీఎస్ 34 టీ 4311) వేగంగా ఢీ కొట్టింది. దీంతో ఆటో పల్టీలు కొడుతూ నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో నారా యణ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న తన్మయి (13), శ్రీ చైతన్య స్కూల్లో 7వ తరగతి చదువుతున్న కోమలిత (11) చనిపోగా మిగతా నలుగురు గాయపడ్డారు. రవీంద్రభారతి స్కూల్లో 7వ తరగతి చదువుతున్న వర్ణిక పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను యశోద ఆసుపత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ వినోద్‌కు కూడా తీవ్ర గాయాలు కాగా లారీ డ్రైవర్ పరారయ్యాడు. ఘోర దుర్ఘటనతో చర్లపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
Hyderabad: మహిళకు ఫైనాన్స్ సంస్థ వేధింపులు.. సుసైడ్ నోట్ రాసి..
సాక్షి, హైదరాబాద్: ఫైనాన్స్ సంస్థ వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాజబొల్లారం తండాకు చెందిన సునీత(35) గత కొంత కాలంగా కూతురుతో కలిసి మేడ్చల్ పట్టణంలోని కేఎల్ఆర్ వెంచర్లో నివాసం ఉంటూ అలియాబాద్ ఎక్స్ రోడ్డు వద్ద బైక్‌జోన్ నిర్వహిస్తుంది. వ్యాపార నిర్వహణకు ఇన్‌స్టా ఫండ్ ఫైనాన్స్ సంస్థలో రుణం తీసుకుంది. అయితే కొన్ని నెలలుగా ఫైనాన్స్ సంస్థ నిర్వాహకులు వేధింపులకు గురి చేస్తుండడంతో మనస్థాపానికి లోనైంది. శుక్రవారం ఉదయం కుమార్తెను పాఠశాలకు పంపిన తర్వాత తన ఆత్మహత్యకు ఇన్‌స్టా ఫండ్ ఫైనాన్స్ వారి వేధింపులే కారణమంటూ సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: పింఛన్ కోసం వెళ్తే చనిపోయావన్నారు ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
మేడ్చల్ నూతన కలెక్టరేట్ ను ప్రారంభించిన కేసీఆర్
-
30 వేల మంది విద్యార్థుల జాతీయ గీతాలాపన
మేడ్చల్‌రూరల్: స్వతంత్ర భారత వజ్రోత్సవా లను పురస్కరించుకుని సామూహిక జాతీయ గీతాలాపనలో మల్లారెడ్డి వర్సిటీ రికార్డు సృష్టించింది. వర్సిటీకి ’ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్’అవార్డు దక్కింది. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మైసమ్మగూడలో ఉన్న మల్లారెడ్డి వర్సిటీ క్రీడామైదానంలో మంగళవారం ఉదయం 11.30 గం.కు మంత్రి హరీశ్‌రావు జాతీయజెండా ఆవిష్కరించి సెల్యూట్ చేయగా ఏకకాలంలో 30 వేలమంది విద్యార్థులు జాతీయ గీతాన్ని ఆలపించారు. దీంతో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు వర్సిటీని ‘ఇండియన్ బుక్’ అవార్డుకు ఎంపిక చేశారు. అనంతరం మంత్రి మల్లారెడ్డికి అవార్డును అందజేశారు. హరీశ్‌రావు మాట్లాడుతూ.. రికార్డు సృష్టించాలన్నా, దాన్ని తిరగరాయాలన్నా మంత్రి మల్లన్నకే సాధ్యమవుతుందన్నారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ తన జన్మధన్యమైందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్‌రావు, జిల్లా కలెక్టర్ హరీశ్ తదితరులు పాల్గొన్నారు. -
రెండు రోజుల్లో గ్రామానికి రూ.కోటి నిధులు ఇవ్వాలి.. లేకుంటే..
సాక్షి, ఘట్కేసర్: హామీల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని.. స్థానిక సంస్థల అభివృద్ధికి మూడేళ్లుగా మంత్రిని నిధులు అడిగితే ఎంపీపీనని చూడకుండా మంత్రి మల్లారెడ్డి వ్యక్తిగతంగా తనను దూషిస్తున్నారని ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పట్టణంలోని ప్రెస్‌క్లబ్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరు నెలల కిందట ఇచ్చిన ప్రొసిడింగ్స్ పనులకు దిక్కులేదని.. నిధులు లేకుండా అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. నిధుల కోసం అధికారులకు వినతులు ఇచ్చి , గాంధీ విగ్రహం వద్ద నిరసనలు చేపట్టినా నిధులు ఇవ్వడం లేదన్నారు. నిధులడిగితే పార్టీ మారుతున్నాడని.. నిధులడిగితే పార్టీ మారుతున్నాడని అంటున్నారని.. తనను విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మండలోని ప్రతి గ్రామానికి రూ.కోటి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మండలంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మండలంలోని పేదలకు మొదట ఇవ్వాలన్నారు. మండలంలోని దళితులందరికీ దళితబంధు ఇవ్వాలని... గతంలో ఇచ్చిన ప్రొసిడెంగ్స్ పనులు చేయించాలని డిమాండ్ చేశారు. కరోనా సమయంలో మండలంలో అందించిన సేవలు ప్రజలకు తెలుసనని ఈ సందర్భంగా ఎంపీపీ అన్నారు. రెండు రోజుల్లో నిధులివ్వని పక్షంలో ఎంపీపీ పదవికి, టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. అనంతరం ప్రజల మధ్యకు వెళ్లి వారి అభీష్టం మేరకు నడుచుకుంటానని అన్నారు. -
మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి నారాజ్!
సాక్షి, మేడ్చల్: పార్టీలో తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని.. మాజీ ఎమ్మెల్యే అయినా తన ఫొటోలు ఎక్కడా ఫ్లెక్సీల్లో పెట్టడం లేదంటూ మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. మేడ్చల్ పట్టణంలో 50 పడకల ఆస్పత్రి శంకుస్థాపనకు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు వచ్చిన విషయం విదితమే. శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు పూర్తి చేసుకుని మంత్రులు వేదిక వద్దకు వచ్చారు. సమావేశ ఉపన్యాసకులు మంత్రులను వేదికపైకి ఆహ్వానించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి వేదికపైకి రావాలని కోరారు. కానీ సుధీర్‌రెడ్డి వేదిక పైకి వెళ్లకుండా కార్యకర్తల మధ్యే కూర్చుకున్నారు. మంత్రి మల్లారెడ్డి సైతం పుండుమీద కారం చల్లినట్లు తన ప్రసంగం ప్రారంభ సమయంలో అందరి పేర్లు చెప్పి చివరిలో మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పేరు పలకలేదు. మంత్రి హరీష్‌రావు అసలు ఆయన ఊసే ఎత్తకపోవడం గమనార్హం. చదవండి: చర్చకు రమ్మంటే ముఖం చాటేస్తున్న ఈటల: ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి -
ముంబైలో ప్రత్యక్షమైన మేడ్చల్ బీటెక్ విద్యార్థిని.. ఇన్‌స్టా అధారంగా...
సాక్షి, హైదరాబాద్: కండ్లకోయ సీఎంఆర్ కళాశాలలో బీటెక్ చదవుతున్న విద్యార్థి అదృశ్యం ఘటన సుఖాంతంగా ముగిసింది. మేడ్చల్‌లో నివసమున్న సకిరెడ్డి వర్షిణి కండ్లకోయలోని సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్‌లో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈనెల 7న కళాశాలకు తమ బంధువు వంశీమోహన్‌రెడ్డి వెంట ద్విచక్రవాహనంపై వెళ్లింది. అయితే వర్షిణి ఇంట్లోనే ఐడి కార్డు, ఫోన్ మరిచిపోవడంతో వాటిని తీసుకోవడానికి ఉదయం 10 గంటల ప్రాంతంలో ఇంటికి రావడానికి కళాశాల బయటకు వచ్చింది. ఆ తరువాత ఆమె ఆచూకీ లభించలేదు. ఆమె కళాశాల నుంచి బయటకు వచ్చిన దృశ్యాలు కండ్లకోయలో రోడ్డుపై ఉన్న బేకరి సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యాయి. కుమార్తె కోసం ఆమె తండ్రి శివాజీ వెతికినా లభ్యం కాకపోవడంతో మేడ్చల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా ఆదివారం ఉదయం వర్షిణి ముంబయ్‌లోని కళ్యాణ దుర్గ రైల్వెస్టేషన్లో ఉందని మేడ్చల్ పోలీసులకు సమాచారం వచ్చింది. ఆమెను మేడ్చల్ కు రప్పించడానికి ప్రత్యేక బృందం ముంబయ్‌కు వెళ్ళింది. ఇన్‌స్టా గ్రామ్ అధారంగా... వర్షిణి ఇన్‌స్ట్రాగాం ఆధారంగా ఆమె ఆచూకీని పోలీసులు కనుగొన్నట్లు సమాచారం. వర్షిణి వద్ద సెల్ ఫోన్ లేకపోయినప్పటికీ ముంబయ్‌లో తన ఇన్‌స్ట్రాగాంను ఓపెన్ చేసినట్లు పోలీసులు గుర్తించి అక్కడి పోలీసుల సహయంతో అమెను గుర్తించారని సమాచారం. చదవండి: తెలంగాణలో మరో మూడురోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ -
20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ పార్కు
సాక్షి, మేడ్చల్‌జిల్లా: నగర శివారు మేడ్చల్ జిల్లా పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందుతోంది. వందలాది పరిశ్రమల ఏర్పాటుతో వేలాది మంది నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, లక్షలాది కుటుంబాలకు పరోక్షంగా ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. ఈ నేపథ్యంలోనే గ్రేటర్ హైదరాబాద్ కు తూర్పు దిశలో ఉన్న ఘట్కేసర్ మండలం మాదారంలో కొత్తగా ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటునకు తొలి అడుగుపడింది. 150కి పైగా కంపెనీల స్థాపన.. శివారుల్లో ఇప్పటికే గ్రీడ్ పాలసీలో భాగంగా ఉప్పల్ జెన్‌ప్యాక్ వద్ద 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ పార్కు స్థాపనకు పునాది రాయి పడింది. నగరానికి ఉత్తరం వైపు కండ్లకోయలో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో గేట్‌వే ఐటీ పార్కుకు శ్రీకారం చుట్టారు. ఈ రెండు పార్కుల ఏర్పాటుతో 150కి పైగా సంస్థలు తమ కార్యకలాపాలను స్థాపించేందుకు ముందుకు వచ్చాయి. భూ పరిహారం సైతం చెల్లింపు... గ్రేటర్‌కు తూర్పు దిశలో ఘట్కేసర్ మండలం మాదారంలో త్వరలో ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటు కానుండటంతో... జిల్లా నిరుద్యోగ యువతలో ఉపాధిపై ఆశలు చిగురించాయి. ఈ పార్కు స్థాపనకు రైతుల అంగీకారంతో 226 ఎకరాల భూ సేకరణ కార్యక్రమాన్ని పూర్తి చేసిన అధికార యంత్రాంగం వారికి చెల్లించాల్సిన భూ పరిహారాన్ని కూడా అందజేసింది. జిల్లా పరిశ్రమల శాఖ కూడా టీఎస్ ఐపాస్ ద్వారా ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటునకు అన్నీ అనుమతులు ఇప్పించింది. భూ నిధి ఎక్కువే... నగర శివారు మేడ్చల్ జిల్లాలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు తగినంత భూనిధి ఉంది. జిల్లా పరిధిలో 66.8 కిలోమీటర్ల జాతీయ రహదారులు, 65 కిలోమీటర్ల రాష్ట్రీయ రహదారులు ఉన్నాయి. వీటికి తోడు ఔటర్ రింగ్ రోడ్డు ఉండటంతో కొత్త పరిశ్రమల స్థాపనకు అనువైన ప్రాంతంగా పారిశ్రామికాధిపతులు భావిస్తున్నారు. రహదారుల సమీపంలో దాదాపు 10వేల ఎకరాల భూములు ఉన్నాయి. అందులో 6,084 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. కొత్తగా 5వేల ఉద్యోగాలు మేడ్చల్ జిల్లాలో కరోనా కష్టకాలం (2021–22 ఆర్థిక సంవత్సరం)లో రూ34.95 కోట్ల పెట్టుబడులతో కొత్తగా 685 పరిశ్రమలు ఏర్పడగా, 5,536 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించాయి. దీంతో పరోక్షంగా జిల్లాలో వందలాది మందికి ఉపాధి దక్కుతోంది. పరిశ్రమల స్థాపనతో 1.93 లక్షల ఉద్యోగాలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మేడ్చల్ జిల్లాగా ఏర్పడిన తర్వాత 2016 అక్టోబర్ నుంచి 2021 మార్చి వరకు ఐదేళ్ల కాలంలో రూ.14,762 కోట్ల పెట్టుబడులతో 8,461 సూక్ష్మ, చిన్న, మధ్యతరహ, భారీ పరిశ్రమలు ఏర్పడ్డాయి. తద్వారా 1,93,050 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించాయి. (క్లిక్: ఈవీ చార్జింగ్ స్టేషన్లొస్తున్నాయ్..) -
హైదరాబాద్: మైనర్ల ‘ప్రేమకథ’ విషాదాంతం
సాక్షి, హైదరాబాద్: తెలిసీ తెలియని వయసు.. ప్రేమ పేరుతో ఆకర్షణ.. ఆ వయసుకి స్వతహాగానే పెద్దల మందలింపు.. వెరసి ఆ బాధలో ఇద్దరు మైనర్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు. హైదరాబాద్ పేట్బషీరాబాద్లో విషాదం చోటు చేసుకుంది. ఫాక్స్‌సాగర్‌లో దూకి ఓ మైనర్ జంట ఆత్మహత్య చేసుకుంది. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న ఇద్దరు.. ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన పెద్దలు.. అలాంటి పనులు వద్దంటూ మందలించారు. విద్యార్థినిని ఇంటి వద్దే ఉంచారు. ఈ క్రమంలో హఠాత్తుగా కనిపించకుండా పోయారు. తండ్రికి భోజనం బాక్స్ ఇచ్చే వంకతో బయటకు వెళ్లిన విద్యార్థిని.. అతన్ని కలుసుకుంది. ఆపై వేరే విద్యార్థి ఇంట్లో బ్యాగు పెట్టేసి.. సైకిల్‌పై వెళ్లిపోయారు. వాళ్లు కనిపించపోయేసరికి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. సీసీ కెమెరాల ఆధారంగా వాళ్లు చెరువు వైపు వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గజ ఈతగాళ్లతో వెతక్కగా.. ముందుగా విద్యార్థిని మృతదేహాం దొరికింది. ఇక ఇవాళ(శుక్రవారం) ఉదయం విద్యార్థి దేహం దొరకడంతో.. ఈ ప్రేమ వ్యవహారం విషాదాంతం అయినట్లు పోలీసులు నిర్ధారించారు. -
దేశం కోసం ఎన్నో త్యాగాలు చేశాం
సాక్షి, మేడ్చల్ జిల్లా: ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చాలా త్యాగనిరతులని ఆ సంస్థ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. గురువారం హైదరాబాద్ తార్నాకలో నూతనంగా నిర్మించిన అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) తెలంగాణ ప్రాంత కార్యాలయం ‘స్ఫూర్తి –ఛాత్రశక్తి’భవన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ఏబీవీపీ పూర్వ కార్యకర్తల సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ బాగా ప్రాచుర్యం పొందితే, భవిష్యత్తులో కొందరికి అడ్డంకి కావచ్చని, ఈ విషయంపై జాగరూకతతో ఉండాలని సూచించారు. హింస ద్వారా సత్యం మరణించలేదని అన్నారు. తెలంగాణ విద్యార్థి పరిషత్ కార్యకర్త అంటే హేళన చేసేవారని, కానీ, ఇప్పుడు అది నంబర్ వన్ స్థానంలో ఉందని పేర్కొన్నారు. దేశ సమైక్యత, సమగ్రతల కోసం ఎంతోమంది ఏబీవీపీ కార్యకర్తలు బలిదానాలు చేశారని కొనియాడారు. దేశంపట్ల విద్యార్థులు ప్రేమానురాగాలను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం కంటే పెద్ద ఆనందం, గర్వం ఏముంటుందని అన్నారు. మనుషుల జీవితంలో రాముడు పరివర్తన తీసుకొచ్చారని భగవత్ పేర్కొన్నారు. ఏబీవీపీ అఖిలభారత ప్రధాన కార్యదర్శి ఆశీష్ చవాన్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో ‘స్ఫూర్తి –ఛాత్రశక్తి’భవన్‌ను నిర్మించటం గర్వంగా ఉందన్నారు. విద్యార్థి సమస్యలపై ఏక్తామార్గంలో ఏబీవీపీ సమరశీల పోరాటాలు నిర్వహించిందని చెప్పారు. సమ్మేళనంలో ఏబీవీపీ అఖిల భారత, రాష్ట్ర నాయకులు ప్రవీణ్‌రెడ్డి, శేఖర్, రాజేందర్‌రెడ్డి, శంకర్, నిధి తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ శేషగిరిరావు రచించిన ‘దేశ చరిత్ర–పునర్జీవనం–సంస్కృతి’అనే పుస్తకాన్ని మోహన్ భగవత్ ఆవిష్కరించారు. -
భూవివాదంలో కేసు నమోదు.. పరారీలో మంత్రి మల్లారెడ్డి బావమరిది
సాక్షి, హైదరాబాద్: గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలోని భూవివాదంలో మంత్రి మల్లారెడ్డి బావమరిది, గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ భర్త ముద్దుల శ్రీనివాస్ రెడ్డితో పాటు 15 మందిపై కేసు నమోదైంది. వారిలో ఎనిమిది మంది మహిళలు, ఇద్దరు వ్యక్తులు మొత్తం 10 మందిని రిమాండుకు తరలించినట్లు పేట్ బషీరాబాద్ పోలీసులు తెలిపారు. సీఐ రమేశ్ తెలిపిన వివరాల ప్రకా రం గుండ్లపోచంపల్లిలోని సర్వే నంబర్ 5,6లో ఉన్న భూ యజమానులు మల్లారెడ్డి, వేణునాయుడు మధ్య స్థలవివాదం నడుస్తోంది. మూడు రోజుల కిందట రాత్రి ఒంటి గంట సమయంలో మల్లారెడ్డికి సంబంధించిన వ్యక్తులు మద్యం సేవించి స్థలంలో ఉన్న కడీలను పడగొట్టి సెక్యూరిటీ సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి చేశారని తమకు అందిన ఫిర్యాదు మేరకు 15 మంది నిందితులపై కేసు నమోదు చేయగా అందులో 10 మందిని ఇప్పటికే రిమాండ్ తరలించామని చెప్పారు. మరో ఐదుగురిలో మంత్రి మల్లారెడ్డి బావమరిది శ్రీనివాసరెడ్డి, మల్లారెడ్డి, విద్యాసాగర్ రెడ్డి, నర్సింహారెడ్డిలు పరారీలో ఉన్నారని తెలిపారు. చదవండి: దెయ్యం పట్టిందని వస్తే చుక్కలు చూపించిన భూత వైద్యుడు.. నిప్పులపై నడిపించి -
Medchal: స్విమ్మింగ్‌పూల్స్ వద్ద భద్రత ప్రశ్నార్థకం!
సాక్షి, హైదరాబాద్(పోచారం): వేసవి కాలంలో పిల్లల కేరింతలతో స్విమ్మింగ్ పూల్స్ సందడిగా ఉంటాయి. నీళ్లలో ఈత కొట్టేందుకు పిల్లలు ఉరకలు వేస్తారు. పూల్‌లో కూల్ అవుతూ వేసవి తాపం నుంచి తప్పించుకుంటున్నారు. కానీ, పోచారం మున్సిపాలిటీలోని స్విమ్మింగ్ పూల్స్ వద్ద భద్రత ప్రశ్నార్థకంగా మారడంతో చిన్నారులు తనువు చాలించిన సందర్భాలు చోటుచేసుకుంటున్నాయి. కొరవడిన అధికారిక పర్యవేక్షణ.. స్విమ్మింగ్ పూల్స్పై అధికారిక పర్యవేక్షణ లోపించడంతో నిర్వహణ ఇష్టారాజ్యంగా మారింది. నిర్వాహకుల దయాదాక్షిణ్యాలపైనే స్విమ్మర్లు ఆధారపడాల్సి వస్తోంది. నేషనల్ బిల్డింగ్ కోడ్ నిబంధనలు మినహా నిర్వాహకులకు వేరే ఎలాంటి గైడ్‌లైన్స్‌ను ప్రభుత్వం జారీ చేయకపోవడంతో స్విమ్మింగ్ నేర్చుకునే వారికి వసతులు కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. స్విమ్మింగ్ పూల్స్ గణాంకాలు.. స్విమ్మింగ్ పూల్స్‌కు సంబంధించిన గణాంకాలు పోచారం మున్సిపల్ అధికారుల వద్ద లేవు. వీటిలో ఎలాంటి సదుపాయాలున్నాయో వీరు పరిశీలించరు. లైఫ్ గార్డులు, నీటి లోతు, తరచు నీటి మార్పిడి, హెచ్చరిక బోర్డుల ఏర్పాటు వంటి అంశాలను గాలికి వదిలేస్తున్నారు. కోచ్‌లు అందుబాటులో ఉండటం లేదు. ఇవన్నీ స్విమ్మింగ్ పూల్స్ వద్ద భద్రత లోపించిందనడానికి నిలువెత్తు నిదర్శనాలు. ఇటీవల బాలుడి మృతి.. ఇటీవల అన్నోజిగూడలోని స్విమ్మింగ్ పూల్‌లో 16 ఏళ్ల విద్యార్థి పూజారి పారికర్ మృతి చెందిన సంఘటన తెలిసిందే. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే భద్రత విషయంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాల్సిందే. జిల్లా వ్యాప్తంగా 50కు పైగానే.. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా గేటెడ్ కమ్యూనిటీలను కలుపుకొని గణాంకాలు తీస్తే సుమారు 50కు పైగానే స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయని అంచనా వేశారు. వీటిలో నిబంధనల ప్రకారం నిర్మితమైనవి పది కంటే మించవు. నీటి కొరత, ఇతరత్రా కారణాల వల్ల మరో 15 స్విమ్మింగ్ పూల్స్ మూతపడినట్లు తెలిసింది. పిల్లలకు ఇవి ఇవ్వడం మర్చిపోవద్దు.. స్విమ్మింగ్ పూల్‌లోకి దిగే ముందు పిల్లలకు కంటి అద్దాలు, చెవి ప్లగ్‌లు, ఫ్లోటర్లు, టవర్లు వంటి భద్రతా పరికరాలు ఇవ్వడం గుర్తుంచుకోవాలి. వీటితో నిర్భయంగా ఈత నేర్చుకోవచ్చు. అప్పుడే పిల్లలు సురక్షితంగా ఉంటారు. -
పూడురు సర్పంచ్.. ఒకరోజు ఆమె, మరొకరోజు ఆయన.. ఏంటీ మాకీ కన్ఫ్యూజన్!
మండలంలోని మేజర్ పంచాయతీలలో పూడూర్ గ్రామ పంచాయతీ ఒకటి. పూడూర్ గోసాయిగూడ గ్రామాలు కలిపి పూడూర్ గ్రామ పంచాయతీగా ఉంది. అలాంటి పూడూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ సీట్లో సస్పెన్షకు గురైన వ్యక్తి ఒకరోజు, ఉపసర్పంచ్‌గా అవిశ్వాసంతో ఉపసర్పంచ్ పదవి కోల్పోయిన వ్యక్తి మరొక రోజు సర్పంచ్ సీట్లో కూర్చుంటూ గ్రామస్తులను అయోమయంలో పడేస్తున్నారు. అధికారులు ఏ విషయం ఖచ్చితంగా తేల్చకపోవడంతో ఎవరికి వారే సర్పంచ్‌గా కొనసాగుతుండటం గమనార్హం. సాక్షి,మేడ్చల్: పూడూర్ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో సర్పంచ్‌గా బాబుయాదవ్‌ను ప్రజలు ఎన్నుకున్నారు. అదే సమయంలో 7వ వార్డు నుంచి వార్డు సభ్యురాలిగా ఎన్నికైన జ్యోతిరెడ్డిని వార్డుసభ్యులు ఉపసర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో ఉండటంతో అంతా సాఫీగా సాగింది. తదనంతరం మారిన రాజకీయ సమీకరణాలతో బాబుయాదవ్ టీఆర్ఎస్లో చేరారు. గత ఫిబ్రవరిలో బాబుయాదవ్ ఓ రియల్ ఎస్టెట్ వెంచర్ ఏర్పాటు వ్యవహారంలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. దీంతో జిల్లా అధికారులు బాబుయాదవ్‌ను సర్పంచ్ పదవి నుంచి తొలగించి ఉపసర్పంచ్ జ్యోతికి సర్పంచ్ బాధ్యతలు అప్పగించారు. అదే సమయంలో జ్యోతిరెడ్డి కాంగ్రెస్ నుంచి మంత్రి మల్లారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. అవిశ్వాసంలో పదవి కోల్పోయి.. తిరిగి ఇన్చార్జ్ సర్పంచ్‌గా బాధ్యతులు ఈ క్రమంలో వార్డు సభ్యులు ఉపసర్పంచ్ జ్యోతిపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. అది నెగ్గడంతో ఉపసర్పంచ్ పదవి కోల్పోయింది. దీంతో సర్పంచ్, ఉపసర్పంచ్ స్థానాలు రెండు ఖాళీ కావడంతో ఒక వార్డుమెంబర్‌కు ఇన్చార్జ్ సర్పంచ్ బాధ్యతుల అప్పగించాల్సి ఉండగా.. తిరిగి 7వ వార్డు సభ్యురాలైన జ్యోతిరెడ్డి ఇన్చార్జ్ సర్పంచ్‌గా అధికారులు నియమించారు. కోర్టు ఆర్డర్‌తో సర్పంచ్‌గా బాబుయాదవ్.. రెండు నెలలు తర్వాత బెయిల్‌పై వచ్చిన బాబుయాదవ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీంతో బాబుయాదవ్ తిరిగి బాధ్యతలు తీసుకుని సర్పంచ్‌గా కొనసాగుతున్నారు. బాబుయాదవ్ కేవలం తప్పుడు పత్రాలతో ఎలాంటి అధికారిక పత్రాలు చూపెట్టకుండా సర్పంచ్ కుర్చీలో కూర్చుంటున్నాడని.. ఆయన సర్పంచ్‌గా ఉండటానికి అధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని జ్యోతి తిరిగి గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ కుర్చీలో కూర్చుంటున్నారు. దీంతో పూడూర్ సర్పంచ్ ఎవరో తెలియక గ్రామస్తులు అయోమయంలో ఉన్నారు. జాతరకు ముందే సర్పంచ్ ఎవరో తేల్చాలి.. గ్రామంలో ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి పోచమ్మ, మైసమ్మ జాతరను వారం రోజుల పాటు నిర్వహిస్తారు. ఆ జాతర మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. జాతర సాఫీగా జరగాలంటే గ్రామంలో సర్పంచ్ ఎవరో ముందుగా అధికారులు తేల్చాలి. లేకుంటే రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనే అవకాశం ఉంటుందని స్థానిక నాయకులు అంటున్నారు. ఒత్తిళ్లతోనే ఆర్డర్‌ను ఆమోదించడం లేదా? దీనికి పుల్‌స్టాప్ పెట్టాలంటే కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం పూడూర్ సర్పంచ్‌గా బాబుయాదవ్ పేరును జిల్లా అధికారులు అధికారికంగా ప్రకటించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. కోర్టు ఉత్తర్వులను జిల్లా ఉన్నతాధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదనేది అందరిలో నెలకొన్న ప్రశ్న. ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతోనే కోర్టు ఆర్డర్‌ను ఆమోదించడం లేదని అందరూ బాహాటంగానే అనుకుంటున్నారు. మరి దీనిపై జిల్లా ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకుంటారో లేదో వేచి చూడాలి. నాకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదు బాబుయాదవ్ సస్పెన్షకు గురికావడంతో జిల్లా కలెక్టర్ నన్ను పూడూర్ ఇన్చార్జ్ సర్పంచ్‌గా నియమించారు. అధికారులు పదవి అప్పగిస్తే సర్పంచ్ సీట్లో కూర్చున్నాను. çబాబుయాదవ్‌ను తిరిగి సర్పంచ్‌గా నియమించినట్లు నాకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదు. ఆయన తానే సర్పంచ్‌ను అంటూ గ్రామస్తులు, అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో కూర్చుంటూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు – జ్యోతిరెడ్డి న్యాయస్థానం ఉత్తర్వుల అనుగుణంగానే.. జిల్లా కలెక్టర్ సర్పంచ్ పదవి నుంచి నన్ను తొలగించడంతో హైకోర్టును ఆశ్రయించాను. సర్పంచ్‌గా నన్నే కొనసాగించాలంటూ న్యాయస్థానాన్ని కోరాను. ఏప్రిల్ 11న ఇన్చార్జ్ సర్పంచ్ జ్యోతిని పదవి నుంచి తొలగిస్తూ నన్ను సర్పంచ్‌గా కొనసాగించాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో న్యాయస్థానం ఆర్డర్ కాపీలను జిల్లా కలెక్టర్, డీపీఓ, గ్రామస్థాయి అధికారులకు అందజేశాను. పిటిషన్లో జ్యోతిని సైతం పార్ట్ చేశాను. న్యాయస్థానం ఉత్తర్వుల అనుగుణంగానే.. అధికారుల ఆదేశానుసారమే నేను తిరిగి సర్పంచ్ బాధ్యతలు చేపట్టాను. స్వార్థ రాజకీయాలతో జ్యోతి వర్గీయులు గ్రామస్తులను తప్పుదోవ పట్టిస్తున్నారు. శుక్రవారం జ్యోతి సర్పంచ్ సీట్లో కూర్చోవంపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాను. – బాబుయాదవ్ ప్రస్తుతానికి బాబుయాదవే సర్పంచ్ కోర్టు ఎవరిని ఉండమంటే వారే సర్పంచ్. పూడూర్ విషయంపై జిల్లా పంచాయతీ అధికారి రమణమూర్తి వివరణ కోరితే ఆయన నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. కొత్తగా అడుగుతారేంటి అక్కడ మొన్నటి వరకు ఎవరు ఉంటే వారే సర్పంచ్‌గా ఉంటారు. కోర్టు బాబుయాదవ్‌ను సర్పంచ్‌గా నియమించింది. ఆయనే సర్పంచ్‌గా కొనసాగుతారు. శుక్రవారం జ్యోతి సీట్లో కూర్చుంది కదా అని అడగగా తనకు తెలియదని... ఉదయం కూర్చుంటే కూర్చుండొచ్చు కాని ప్రస్తుతానికి బాబుయాదవే సర్పంచ్. – డీపీఓ రమణమూర్తి చదవండి: అయ్యో మౌనిక.. ప్రమాదం అని తెలియక మృత్యువు పక్కనే కూర్చున్నావా! -
Photo Feature: చింత చెట్టుపై వింత ఇల్లు .. 20 ఏళ్ల క్రితమే!
వింత ఇల్లేంటి.. అని ఆలోచిస్తున్నారా? ఏమీ లేదండి.. నేలపై కాకుండా చెట్టుపై ఇల్లు నిర్మించడంతో అందరూ వింతగాచూస్తున్నారు. అందుకే వింత ఇల్లు అని సంబోధించామంతే. ఓకే.. ఇప్పుడు అసలు విషయానికొద్దాం.. ఇటీవల ట్రీ–హౌజ్, బోట్–హౌజ్‌లో విడిది చేయాలనేది ట్రెండ్‌గా మారింది. దీంతో కొన్నేళ్లుగా ట్రీ–హౌజ్, బోట్–హౌజ్ అనే పదాలు టూర్‌కి వెళ్లాలనుకునే వారి నోళ్లలో నానుతున్న పదాలు. తరచు విహార యాత్రకు వెళ్లే వారు ట్రీ–హౌజ్‌లో విడిది చేస్తూ తమ అనుభూతిని పంచుకుంటున్నారు. అందరూ ట్రెండ్ ఫాలో అవుతారు.. కొందరు మాత్రమే ట్రెండ్ సెట్ చేస్తారు. రెండు దశాబ్దాల క్రితమే ఓ రియల్టర్ తన వెంచర్లో చింత చెట్టుపై ట్రీహౌజ్ నిర్మించుకుని ట్రెండ్ సెట్ చేశాడు. దానికి ముద్దుగా ‘టార్జన్ ట్రీ–హౌజ్’అని పేరు పెట్టుకున్నాడు. మేడ్చల్ జిల్లాలోని ఎదులాబాద్ ఊరి సమీపంలో చింత చెట్టుపై ఉన్న ఈ ఇల్లు ఇప్పటికీ అందరినీ ఆకట్టుకుంటోంది. – ఘట్కేసర్ చదవండి👉🏼: ఎమ్మెల్యే శంకర్‌నాయకే ఇదంతా చేయించారు: రవినాయక్ భార్య పూజ -
దడ పుట్టిస్తున్న ధరణి పోర్టల్
మేడ్చల్: ధరణి పోర్టల్ వల్ల లాభాల కంటే ఇబ్బందులే అధికమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ జె.గీతారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ సంఘటన్ అధ్యక్షురాలు మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్ చేపట్టిన భూదాన్ పాదయాత్ర గురువారం మేడ్చల్‌కు చేరింది. అత్వెల్లి వద్ద పాదయాత్ర బృందాన్ని కలిసిన ఆమె విలేకరులతో మాట్లాడుతూ ధరణి పోర్టల్ వల్ల ఎంతోమంది భూములు కోల్పోతున్నారన్నారు. జహీరాబాద్ నియోజకవర్గం సత్వార్ గ్రామంలో 200 ఏళ్లుగా రైతుల అధీనంలో ఉన్న 800 ఎకరాల భూమి వక్ఫ్ భూమిగా మారిందన్నారు. కేవలం ధరణి వల్ల రైతుల భూమి వారికి కాకుండా చేశారని ఆరోపించారు. అభయహస్తాన్ని పూర్తిగా ప్రభుత్వం మరిచిపోయిందన్నారు. ఇప్పుడేదో హడావుడి చేస్తున్నా మహిళలకు ఎంతో నష్టం జరిగిందన్నారు. ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఇందిరాగాంధీ హయాంలో ఉన్న ఇళ్లు తప్ప.. రాష్ట్రంలో ఎక్కడా ప్రభుత్వం కట్టించిన ఇళ్లు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. సికింద్రాబాద్, గజ్వేల్, సిద్దిపేటలో డబుల్ బెడ్రూం ఇళ్లు కడితే సరిపోదని.. రాష్ట్రంలో పేదలకు ఇళ్లు నిర్మించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. మేడ్చల్‌కు చేరిన యాత్ర భూదాన్ పోచంపల్లి నుంచి ప్రారంభమైన పాదయాత్ర మేడ్చల్ మీదుగా మెదక్ జిల్లాకు చేరింది. మండలంలోని పూడూర్, కిష్టాపూర్, మేడ్చల్, అత్వెల్లి మీదుగా యాత్ర సాగింది. పాదయాత్రలో ములుగు ఎమ్మెల్యే సీతక్క పాల్గొని సమస్యలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో పీసీసీ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
అమ్మమ్మ పాలకూర కావాలంటూ.. పుస్తెలతాడుతో..
సాక్షి, మేడ్చల్: అమ్మమ్మ పాలకూర కావాలంటూ పొలం చేను పని చేస్తున్న మహిళ వద్దకు వెళ్లిన వ్యక్తి పాలకూర కొన్నట్టు మాయ చేసి మహిళ మెడలోని 4తులాల పుస్తెలతాడుతో ఊడాయించిన సంఘటన మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బండమాదారం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన మేకల శంకరమ్మ(52) ఉదయం తమ పొలంలో కూరగాయ పంట సాగు పని చేస్తుంది. మంగళవారం ఉదయం 11.30 గంటల సమయంలో ఇండికా కారులో ఇద్దరు వ్యక్తులు పొలం వద్దకు వచ్చారు. అందులో ఒక వ్యక్తి కారు దిగి పోలంలో పని చేస్తున్న శంకరమ్మ వద్దకు వెళ్లి అమ్మమ్మ పాలకూర కావాలంటూ ఆకుకూర కొనే వ్యక్తిలా వెళ్లాడు. ఇప్పుడు వీలు కాదని శంకరమ్మ తెలుపగా ఇప్పుడు వండుకోవాలంటూ మాయమాటలు చెప్పడంతో శంకరమ్మ పాలకూర తెచ్చి ఇచ్చింది. రూ.10 శంకరమ్మకు చేతిలో పెట్టి మరో చేతితో ఆమె మెడలోని 4 తులాల పుస్తెలతాడును లాక్కుని పరిగెత్తాడు. దీంతో శంకరమ్మ కేకలు వేయగా అంతలోనే కారులో ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు సమీప గ్రామాల నాయకులకు సమాచారం అందజేసి ఇండికా కారు కనబడితే ఆపాలంటూ తెలిపారు. పుస్తెలతాడుతో పరారవుతున్న వ్యక్తుల కారు మండలంలోని రాయిలాపూర్ వద్ద రాయిలాపూర్ గ్రామస్తులు గమనించి దాని పట్టుకునే లోపు వారు కారు వెనక్కి తీసుకుని నూతన్‌కల్ గ్రామం వైపు వెళ్లింది. చదవండి: హైదరాబాద్‌లో వర్క్ ఫ్రం ఆఫీస్; బ్యాక్ టు ‘ట్రాఫిక్ రూల్స్’ నూతన్‌కల్ గ్రామానికి చెందిన పీఏసీఎస్ చైర్మన్ సురేశ్‌రెడ్డికి రాయిలాపూర్ వాసులు సమాచారం ఇచ్చారు. నూతన్‌కల్ గ్రామంలో ఓ వాహనాన్ని సురేశ్‌రెడ్డి అడ్డుపెట్టగా దీనిని గమనించిన దుండగులు వారి కంటపడకుండా పరారయ్యారు. విషయం తెలుసుకున్న మేడ్చల్ పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: హైదరాబాద్‌లో తొలి మహిళా స్టేషన్ హౌస్ ఆఫీసర్.. రాష్ట్రంలో ముగ్గురే! -
అర్బన్ పార్కులతో ఆహ్లాదం, ఆరోగ్యం
సాక్షి, హైదరాబాద్/బోడుప్పల్: నగరవాసులకు ఆహ్లాదం, ఆరోగ్యాన్ని పంచేవిధంగా అర్బన్ పార్కు లను అభివృద్ధి చేయాల్సిన అవసరముందని ప్రముఖ సినీహీరో అక్కినేని నాగార్జున అన్నారు. దివంగతనటుడు, తన తండ్రి అక్కినేని నాగేశ్వర రావు పేరిట ఆయన హైదరాబాద్ శివార్లలోని చెంగిచర్ల అటవీ ప్రాంతంలో అర్బన్‌ఫారెస్ట్ పార్కు ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. గురువారం సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని, గ్రీన్ ఇండియా చాలెంజ్ స్ఫూర్తితో ఎంపీ సంతోష్ కుమార్‌తో కలసి నాగార్జున ఈ కార్య క్రమంలో పాల్గొన్నారు. చెంగిచర్ల అటవీ బ్లాక్ పరిధిలోని 1,080 ఎకరాల భూమిని దత్తత తీసుకుంటు న్నట్టు ఆయన ప్రకటించారు. నాగార్జున వెంట భార్య అక్కినేని అమల, కుమారులు నాగచైతన్య, అఖిల్, సోదరుడు అక్కినేని వెంకట్, సోదరి నాగ సుశీలతో పాటు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అటవీపార్కు అభివృద్ధికి సీఎం కేసీఆర్ సంక ల్పించిన హరితనిధికి రూ.2 కోట్ల చెక్‌ను నాగార్జున అటవీ శాఖ ఉన్నతాధికారులకు అందజేశారు. బిగ్‌బాస్ ఫైనల్లో ఇచ్చిన మాట ప్రకారం.. గత బిగ్‌బాస్ సీజన్ ఫైనల్ సందర్భంగా అడవి దత్తతపై ప్రకటించినట్లుగానే అర్బన్ ఫారెస్ట్ పార్కు ఏర్పాటుకు శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉం దని నాగార్జున అన్నారు. అడవిని దత్తత తీసుకునేం దుకు నాగార్జున ముందుకు రావడాన్ని ఎంపీ సం తోష్ ప్రశంసించారు. అర్బన్ పార్కు అభివృద్ధితో పాటు, అటవీ ప్రాంతంలో దశలవారీగా లక్ష మొక్క లను నాటే కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించి నట్లు చెప్పారు. నాగార్జున, సంతోష్ వివిధ రకాల మొక్కలను నాటారు. కార్యక్రమంలో అటవీ శాఖ ప్రత్యేకకార్యదర్శి శాంతికుమారి, పీసీసీఎఫ్ ఆర్.శోభ, పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియల్, రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పాల్గొన్నారు. చదవండి: (సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ) -
వివాహేతర సంబంధం: ప్రియుడి మోజులో పడి ఇంట్లోనే..
సాక్షి, మేడ్చల్ రూరల్: వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ ప్రియుడి మోజులో పడి తమ ఇంటిలోనే వివాహేతర బంధం కొనసాగించి భర్తకు పట్టుపడింది. తమ గుట్టురట్టయ్యిందని భావించి తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ప్రియుడితో కలిసి కడతేర్చి కటకటాలపాలైన భార్య, ప్రియుడికి మేడ్చల్ కోర్టు జీవిత ఖైదు విధిస్తూ సోమవారం తీర్పు ఇచ్చింది. మేడ్చల్ మండలంలోని అక్బర్జాపేట్ గ్రామానికి చెందిన మహంకాళి లక్ష్మి, మహంకాళి కృష్ణ దంపతులు. అదే గ్రామానికి చెందిన గుంటి బాలరాజ్ 2014లో మహంకాళి కృష్ణ ఆటో కొనుగోలు చేయడం అప్పటి నుంచి వీరి మధ్య స్నేహం ఏర్పడింది. స్నేహాన్ని అడ్డుపెట్టుకుని తరచూ కృష్ణ ఇంటికి వెళ్లిన గుంటి బాలరాజు అతడి భార్య లక్ష్మితో పరిచయం ఏర్పరచుకున్నారు. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. చదవండి: హైదరాబాద్‌లో దారుణం.. కన్న తల్లిని కడతేర్చిన సైకో కొడుకు.. భర్తకు విషయం తెలియడంతో అడ్డు తొలగించుకోవాలని.. ► వీరి విషయం తెలియడంతో మహంకాళి కృష్ణ తన భార్యను మందలించాడు. భర్త అడ్డు తొలగించుకోవాలని మహంకాళి లక్ష్మి, ప్రియుడు గుంటి బాలరాజ్‌తో కలిసి పథకం వేసుకున్నారు. అందులో భాగంగా పలుమార్లు మహంకాళి కృష్ణకు కల్లులో నిద్రమాత్రలు కలిపి తాగించినా మృతుడికి ఏమీ కాలేదు. తీగను మెడకు చుట్టి.. 2020 ఏప్రిల్ 8న రాత్రి సమయంలో మహంకాళి లక్ష్మి భర్త నిద్రపోయిన తర్వాత ప్రియుడు గుంటి బాలరాజ్‌కు ఫోన్ చేసి ఇంటికి పిలుచుకుని తమ అక్రమ బంధం కొనసాగిస్తుండగా వీరి శబ్ధం విని నిద్రలేచిన కృష్ణ వారిని పట్టుకున్నాడు. దీంతో ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారం కృష్ణను తీగలతో మెడను బిగించి హతమార్చారు. హత్య విషయం బయట పడకుండా కరోనా సమయంలో కల్లు (మద్యం) దొరకకపోవడంతో మనస్తాపంతో మరణించినట్లు కట్టుకథ అల్లింది. చదవండి: వివాహేతర సంబంధం: సాంబార్లో విషం కలిపి.. మృతుడి సోదరుడి ఫిర్యాదుతో బయటపడిన విషయం.. మృతుడి సోదరుడు మహంకాళి సురేశ్ మృతుడి దేహంపై గాయాలు చూసి అనుమానం వ్యక్తం చేస్తూ మేడ్చల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు హత్యగా గుర్తించి మహంకాళి లక్ష్మి,గుంటి బాలరాజ్లను రిమాండ్‌కు తరలించారు. కాగా మేడ్చల్ 11 ఏడీజే కోర్టులో సోమవారం కేసు విచారణ రావడంతో న్యాయమూర్తి జయంతి కేసు విచారణ జరిపారు. ఇద్దరకి జీవిత కాలం కఠిన కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.3వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు. -
నవ దంపతుల జీవితంలో ‘పిడుగుపాటు’
సాక్షి, మేడ్చల్: పిడుగుపాటు ఓ కుటుంబంలో విషాదం నింపింది. ఈ సంఘటన మేడ్చల్ మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. రావల్కోల్ గ్రామానికి చెందిన చీర్ల మహేష్ (25)కు సొంతంగా పశువులు ఉన్నాయి. వాటిని కాస్తూ జీవనం సాగిస్తున్నాడు. మండలంలో మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం పశువులను మేపడానికి వెళ్లిన మహేష్‌కు సమీపంలో పిడుగు పడింది. దాని ధాటికి మహేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామంలో విషాధచాయలు మహేష్‌కు ఏడాది క్రితం వివాహం జరిగింది. రెండు నెలల క్రితం మగశిశువు జన్మించాడు. అంతా సాఫీగా సాగుతున్న కుటుంబంలో పిడుగుపాటు ఆ కుటుంబ సభ్యులను కుదిపేసింది. మహేష్ మరణ వార్తతో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. -
నేనున్నానని.. నీకేం కాదని..
‘‘పచ్చని చిలకలు తోడుంటే.. పాడే కోయిల వింటుంటే.. భూలోకమే ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింకా చెల్లు! ఓ పాటలోని పల్లవి ఈ వృద్ధ దంపతులను చూస్తుంటే సరిగ్గా సరిపోతుందని అనిపిస్తుంది.’’ సాక్షి, మేడ్చల్(హైదరాబాద్): ఆంధ్రప్రదేశ్ కు చెందిన కోసం నాగమ్మ, రంగారావు దంపతులు. మేడ్చల్ మున్సిపాలిటీ గిర్మాపూర్‌కు వచ్చి కూలీ పనిచేస్తు జీవనం సాగిస్తున్నారు. భార్య నాగమ్మ కూలి పని చేసే సమయంలో ఇనుప రాడ్ పైన పడటంతో చేతికి గాయమయ్యింది. మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది. గిర్మాపూర్‌కు రోజు వెళ్లి రావాలంటే రూ.40 ఖర్చు అవుతుండటంతో వారు మేడ్చల్ బస్టాండ్‌లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. భార్య చేతికి నొప్పి ఎక్కువ కావడంతో ఆ బాధను తట్టుకోలేని రంగారావు ఆమె చేతికి కట్టు కడుతూ సపర్యాలు చేశారు. బుధవారం ఉదయం ఈ దృశ్యాన్ని సాక్షి మేడ్చల్ ప్రతినిధి క్లిక్‌మనిపించారు. చదవండి: 18 ఏళ్లు నిండాయా? ఓటరుగా నమోదు చేయించుకోండి -
కాంగ్రెస్ పార్టీలో వర్గవిభేదాలు
-
కాంగ్రెస్ పార్టీలో వర్గవిభేదాలు.. ఎంపీ ఫ్లెక్సీని కత్తిరించిన దుండగులు..
సాక్షి, మేడ్చల్: కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మేడ్చల్ జిల్లాలో కోమడిరెడ్డితో పేరుతో ఉన్న ఫ్లెక్సీలను గుర్తుతెలియని దుండగులు కత్తిరించారు. కొంపల్లిలో ఈ నెల 9,10 తేదీల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో.. శిక్షణా తరగతులను నిర్వహించనున్నారు. ఈ క్రమంలో.. ఎంపీ కోమటిరెడ్డి పేరుతో కాంగ్రెస్ నాయకుడు మహిపాల్‌రెడ్డి హోర్డింగ్‌లను ఏర్పాటు చేశారు. ఈ హోర్డింగ్‌లను గుర్తుతెలియని ఆగంతకులు కత్తిరించారు. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా కలకలంగా మారింది. అంతర్గత విభేదాల కారణంగా సొంత పార్టీ నాయకులే ఈ ఘటనకు పాల్పడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
Medchal: రాజకీయ నాయకులంతా ఆ గ్రామం నుంచే..
సాక్షి, మేడ్చల్: మండల రాజకీయ హెడ్ క్వార్టర్‌గా ఆ గ్రామం నిలిచింది. దశాబ్దాల నుంచి లీడర్లను అందిస్తున్న మెషినరీగా ఈ గ్రామం నిలవడం విశేషం. మొదటి నుంచి రాజకీయ చైతన్యానికి పేరుగాంచిన గౌడవెళ్ళి తాజాగా మూడు ప్రధాన పార్టీల మండల అధ్యక్షులను అందివ్వడంతో మరోసారి ఆ గ్రామం పేరు మండలంలో చర్చనీయాంశంగా మారింది. చదవండి: ప్రాణం తీసిన వివాహేతర సంబంధం గ్రామంలో ఘనమైన రాజకీయ చరిత్ర గ్రామానికి చెందిన దివంగత స్వాతంత్ర సమరయోధుడు సింగిరెడ్డి వెంకట్రాంరెడ్డి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎమ్మెల్సీగా ఉండి మంత్రిగా పని చేశారు. ఆయన మరణం తర్వాత ఆయన సతీమణి ఉమాదేవి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేశారు. ► గ్రామానికి చెందిన సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి జిల్లా పరిషత్‌లో కాంగ్రెస్ జెడ్పీ ఫ్లోర్ లీడర్‌గా, పీసీసీ సీనీయర్ అధికార ప్రతినిధిగా పని చేస్తున్నారు. ►గ్రామానికి చెందిన దయానంద్‌యాదవ్ మండల టీఆర్ఎస్ అధ్యక్షుడిగా, నరేందర్‌రెడ్డి మండల బీజేపీ అధ్యక్షుడిగా, రమణారెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. ► ఇదే గ్రామం నుంచి ఎంపీటీసీగా గెలిచిన పద్మజగన్‌రెడ్డి ప్రస్తుతం మండల పరిషత్ అధ్యక్షురాలిగా ఉన్నారు. గ్రామానికి చెందిన రణదీప్‌రెడ్డి డైరక్టర్‌గా ఎన్నికై మేడ్చల్ సహకార సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. చదవండి: హుజురాబాద్ ఉపఎన్నిక: రెండో డోసు సర్టిఫికెట్ ఉంటేనే రండి! ► మూడు ప్రధాన పార్టీ అధ్యక్షులు, మండల పరిషత్ అ«ధ్యక్షురాలు గౌడవెళ్ళి వారే కావడంతో మండల రాజకీయం గౌడవెళ్ళి చుట్టూ తిరుగుతోంది. అందరూ 50 ఏళ్ల వయస్సులోపు వారు కావడంతో ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ మండల రాజకీయాన్ని రంజుగా నడిపిస్తున్నారు. ►రాష్ట్ర సర్పంచ్ల సంఘం అధికార ప్రతినిధిగా కొనసాగుతున్న సురేందర్ ముదిరాజ్ ఈ గ్రామ సర్పంచే. ►జిల్లా బీజేపీ అధ్యక్షుడు విక్రంరెడ్డి, నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ అమరం మోహన్‌రెడ్డి, కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యురాలు సరస్వతీ గుండ్లపోచంపల్లికి చెందిన వారే. ►మండలంలో అధికంగా రాజకీయం గుండ్లపోచంపల్లి, గౌడవెళ్ళి చుట్టు ఉండటంతో ఇతర గ్రామాల నాయకుల అసహనం కనిపిస్తున్నా చైతన్యం ఎక్కువగా ఉండటంతో నాయకులు గౌడవెళ్ళి నాయకులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. -
‘హత్యాచార’ నిందితుడిని ఎన్కౌంటర్ చేస్తాం
మేడ్చల్: నగరంలోని సింగరేణికాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యం ఆపై హత్య చేసిన నిందితుడిని వదిలిపెట్టబోమని, అతడిని తప్పకుండా ఎన్కౌంటర్ చేస్తామని మంగళవారం మంత్రి మల్లారెడ్డి మీడియాతో సంచలన వ్యాఖ్యలు చేశారు. సింగరేణికాలనీలో బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లే పరిస్థితి లేనందున తాము అక్కడకు వెళ్లలేదని, త్వరలోనే ఆ కుటుంబాన్ని పరామర్శించి నష్టపరిహారాన్ని అందజేస్తామని మంత్రి తెలిపారు. -
వాళ్లే ఆగుతారనుకుంటే, ఆగమైపోతారు.. జరజాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు, అధికారులు ఎంత చెప్పిన ఇంకా కొందరిలో మార్పు రావడం లేదు. హెల్మెట్ ధరించకపోవడం, అతివేగం, ఇష్టం వచ్చినట్లు రోడ్డు దాటం..నిత్యం ప్రమాదాలకు కారణాలుగా మారుతున్నాయి. హైవేపై వాహనాలు వేగంగా వెళ్తాయన్న విషయం తెలిసిందే. ఆలాంటి దారిలో రోడ్డు దాటే సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిందే. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్న ప్రాణాలకు ప్రమాదం తప్పదు. తాజాగా మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డబీర్‌పుర దగ్గర రోడ్డు ప్రమాదం చోటుచేసుంది. వేగంగా వాహనాలు వస్తున్నా.. అవేవీ పట్టించుకోకుండా ఓ యువకుడు రోడ్డు దాటేందుకు ప్రయత్నించాడు. తనను చూసి వాహనాల డ్రైవర్లు నెమ్మదించరా! అని అతను రోడ్డును క్రాస్ చేసే క్రమంలో ఓ వాహనం వేగంగా రానే వచ్చింది. సదరు యువకుడిని ఢీ కొట్టింది. దీంతో ఆ పాదచారుడు ఎగిరిపడ్డాడు. అదృష్టవశాత్తూ ఆ యువకుడు గాయాలతో బయటపడ్డాడు. అయితే ప్రమాద సమయంలో బాధితుడు మద్యం మత్తులో ఉన్నాడని పోలీసులు గుర్తించారు. రోడ్డు దాటే సమయంలో వచ్చిపోయే వాహనాలను చూసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. అతివేగంగా వెళ్తున్న వాహనం ఒక్కసారిగా స్పీడ్‌ను కంట్రోల్ చేయడం కష్టతరమవుతుందని, పాదచారులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు తెలిపారు. Do not assume that vehicles will stop. A non-fatal road accident occurred near Dabirpura in Medchal PS limits.#RoadSafety #RoadSafetyCyberabad pic.twitter.com/pjsdCX8qTu — CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) August 28, 2021 -
మేడ్చల్ జిల్లా శామీర్‌పేటలో ఘోర ప్రమాదం
-
మేడ్చల్ రసాయన పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం..
హైదరాబాద్: మేడ్చల్ జిల్లాలోని పారిశ్రామికవాడలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. జీడిమెట్లలోని నాసెన్స్ రసాయన పరిశ్రమలో నుంచి మంటలు పెద్ద ఎత్తున ఎగిసి పడుతున్నాయి. కాగా, స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఈ క్రమంలో.. పోలీసులు, ఫైర్సెఫ్టీ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కాగా, క్షత గాత్రులను ఆసుపత్రికి తరలించారు. భారీగా ఎగిసిపడుతున్న మంటలను నాలుగు ఫైరింజన్ల సహయంతో అదుపులోనికి తేవడానికి ప్రయత్నిస్తున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో ఆకాశంలో నల్లని పొగలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు తీవ్రగాయాలపాలయ్యారు. ఈ దుర్ఘటనకు బాయిలర్ పేలుడే కారణమని స్థానికులు తెలిపారు. కాగా, ఈ మేరకు కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
భర్త పని కోసం బయటకు.. భార్య బిడ్డతో కలిసి అనంతలోకాలకు
సాక్షి, మేడ్చల్: ఇంట్లో చీరతో ఉరివేసుకుని తల్లి, కుమారుడు ఆత్మహత్య చేసుకున్నారు. మేడ్చల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపాలిటీ పరిధిలోని అత్వెల్లిలో ఘటన చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన దీపక్, శాలిని(33) దంపతులు 4 నెలల క్రితం అత్వెల్లికి వచ్చి భూపతిరెడ్డి అనే వ్యక్తి ఇంట్లో మొదటి అంతస్థులో అద్దెకుదిగారు. దిలీప్ దూరప్రాంతాల్లో కూలీపని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రెండు మూడు రోజులకోసారి ఇంటికి వస్తూ భార్య శాలిని, కుమారుడు నయిన్(11)లను చూసుకుంటున్నాడు. దిలీప్‌కు పని దొరకడంతో నాలుగు రోజుల క్రితం వరంగల్‌కు వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో శాలిని తన కుమారుడితో కలిసి పై కప్పుకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మొదట కుమారుడికి ఉరివేసి తాను ఉరివేసుకుని శాలిని ఆత్మహత్య చేసుకున్నట్లు ఘటనా స్థలంలో కనిపిస్తుంది. ఆత్మహత్యకు కారణాలు మాత్రం తెలియడం లేదు. రెండు రోజుల క్రితం.. ఇంటి పై అంతస్థు నుంచి దుర్వాసన వస్తుండటంతో ఇంటి యజమాని భూపతిరెడ్డి పైకి వెళ్లి చూడటంతో శాలిని గదికి లోపలినుండి గడియ వేసి ఉంటడంతో తలుపులు తట్టినా ఎంతకు తీయడంతో అనుమానంతో తలుపులు బద్దలు గొట్టి లోపలికి వెళ్లి చూడంతో తల్లి కుమారుడు పై కప్పుకు వేలాడుతుండటంతో వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను మార్చురికి తరలించారు. తల్లికూతురు రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని ఎస్ అప్పారావు తెలిపారు. మృతురాలి కుటుంబసభ్యులకు సమాచారమిచ్చామని వారు వచ్చాక వివరాలు తెలిసే అవకాశముందని ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
6 వరుసలుగా నాగ్‌పూర్ హైవే
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ చిక్కులతో విలవిల్లాడుతున్న 44వ నంబర్ జాతీయ రహదారి(నాగ్‌పూర్– నిజామాబాద్ హైవే)ని హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఆరు వరుసలకు విస్తరించనున్నారు. ఈ మేరకు భారత జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ (ఎన్హెచ్ఏఐ) ప్రతిపాదించింది. హైదరాబాద్‌లోని బోయిన్పల్లి నుంచి మేడ్చల్ తర్వాత ఉండే కాల్లకల్ వరకు దాదాపు 24 కి.మీ. మేర రహదారిని విస్తరించాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖకు తాజాగా ప్రతిపాదించింది. ఇందుకు దాదాపు రూ.1,300 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసింది. దీనికి కేంద్రం నుంచి అనుమతి రావాల్సి ఉంది. ఈ జాతీయ రహదారికి ఇరువైపులా మేడ్చల్ వరకు కొత్త కాలనీలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ చిక్కులు ఏర్పడుతున్నాయి. కూడలి ప్రాంతాల్లో సిగ్నల్ పడితే కిలోమీటర్ మేర వాహనాల బారులు తీరుతున్నాయి. దీంతో ఈ రహదారిని విస్తరించాలని చాలాకాలం నుంచి ప్రజలు కోరుతున్నారు. భారీ ఎలివేటెడ్ కారిడార్లతో.. బోయిన్పల్లి నుంచి మేడ్చల్ వరకు కీలక కూడళ్లలో భారీ ఎలివేటెడ్ కారిడార్లకు ప్రణాళిక రచించారు. హైదరాబాద్ నుంచి మేడ్చల్ వెళ్లే దారిలో తొలుత కీలక జంక్షన్ అయిన సుచిత్ర కూడలి వద్ద 2 కి.మీ. పొడవైన వంతెన నిర్మించనున్నారు. ఇక్కడి నుంచి 10 కి.మీ. అంటే గుండ్లపోచంపల్లి వరకు మూడు భారీ వంతెనలు ఉంటాయి. సుచిత్ర కూడలి మొద టిది కాగా, సినీప్లానెట్ కూడలి వద్ద 560 మీటర్ల పొడవుతో రెండో వంతెన, కొంపల్లి–దూలపల్లి మధ్య 1.2 కి.మీ. మేర మూడో వంతెన నిర్మిస్తారు. అక్కడి నుంచి మేడ్చల్ దాటేవరకు రోడ్డును పూర్తి స్థాయిలో విశాలంగా మారుస్తారు. మేడ్చల్ దాటే వరకు రెండున్నర కి.మీ. మేర వంతెన నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టును రెండు భాగాలుగా విభజించారు. బోయిన్పల్లి నుంచి గుండ్ల పోచంపల్లి వరకు పనులకు రూ.450 కోట్లు, అక్కడి నుంచి మేడ్చల్ వరకు చేపట్టే పనులకు రూ.850 కోట్లు ప్రతిపాదించారు. -
మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా రైతుల నినాదాలు : మేడ్చల్
-
ఘట్కేసర్ ఓఆర్ఆర్ వద్ద బాలిక అనుమానాస్పద మృతి
ఘట్కేసర్: ఫోన్లో మాట్లాడొద్దని తల్లి మందలించడంతో వేదనకు గురైన ఓ బాలిక బలవన్మరణానికి పాల్పడింది. ఘట్కేసర్ సీఐ చంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం మహబూబ్‌నగర్ జిల్లా ఒంద్యాల్ గ్రామానికి చెందిన జమ్మికుంట విష్ణు, పద్మ దంపతుల కుమార్తె (16), కుమారుడితో కలసి అన్నోజీగూడ రాజీవ్ గృహకల్పలో నివసిస్తున్నారు. కొంతకాలంగా కూతురు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుండటాన్ని గమనించి మందలించారు. బాలికలో మార్పు రాకపోగా శుక్రవారం తిరిగి అపరిచితునితో మాట్లాడుతుండటంతో గట్టిగా హెచ్చరించారు. దీంతో వేదనకు గురైన బాలిక శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో వారు నిద్రించాక కిరోసిన్ సీసా తీసుకొని, కుటుంబ సభ్యులు బయటకు రాకుండా గడియపెట్టి సమీపంలోని ఖాళీ ప్రదేశంలో కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. కాలిన గాయాలతో అక్కడికక్కడే మరణించింది. ఉదయం వాకింగ్‌కు వచ్చిన స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి డాగ్, క్లూస్ టీంలు చేరుకొని ఆధారాలు సేకరించాయి. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఖాళీ ప్రదేశంలో బాలిక మృతదేహం కనిపించడంతో దుండగులు బాలికను సజీవదహనం చేసి ఉండొచ్చనే వదంతులు వచ్చాయి. దీంతో స్థానికులు భారీగా ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో సమీపంలోని సీసీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించగా బాలిక కిరోసిన్ సీసాతో ఒంటరిగా వెళ్లడం కనిపించింది. దీంతో పోలీసులు ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చారు. చదవండి: అడ్డగూడూరు ఠాణాలో మహిళ లాకప్‌డెత్? -
లాక్డౌన్ దెబ్బ.. ఆర్థిక ఇబ్బందులు తాళలేక
సాక్షి, మేడ్చల్ : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ తండ్రి, కుమారుడితో కలిసి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ సంఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బండ్లగూడా ఈడెన్ గార్డెన్ కాలనీలో ఉండే దూదేకుల ప్రవీణ్ కుమార్(39) లాక్డౌన్ కారణంగా ఆర్థికంగా బాగా చితికిపోయాడు. ఈ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు తాళలేక శనివారం కుమారుడు యశ్వంత్(6) ఒంటిపై కిరోసిన్ పోసి,తాను పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న కీసర పోలీసులు 108లో ఉస్మానియా హాస్పిటల్‌కు వెద్యానికి తరలించారు. -
ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య
-
మేడ్చల్: కుమారుడి మృతిని తట్టుకోలేక గుండెపోటుతో తల్లిదండ్రులు మృతి
-
కరోనాతో కొడుకు మృతి, ఆగిన తల్లిదండ్రుల ఊపిరి
సాక్షి, మేడ్చల్: జవహర్‌నగర్ పరిధి వంపుగూడలో విషాదం చోటుచేసుకుంది. 24 గంటల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. కరోనాతో చికిత్స పొందుతూ నిన్న హరీష్‌రెడ్డి (31) మరణించగా, కుమారుడి మరణాన్ని తట్టుకోలేక ఆ తల్లిదండ్రుల గుండె ఆగింది. కుమారుడు లేడనే విషయాన్ని జీర్ణించుకోలేని హరీష్‌రెడ్డి తల్లి, తండ్రి ఇద్దరూ సోమవారం గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గంటల వ్యవధిలోనే మృతి చెందడంతో బంధువులు, స్థానికులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ విషాద ఘటన అందరి మనసులను కలిసివేసింది. చదవండి: Zero Covid Cases: ఆ ఊరికి కరోనా రాలే..! లాయర్ల హత్య కేసు: ఏరోజు ఏం జరిగిందంటే..? -
Etela Rajender:రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలనుకుంటున్నారు
మేడ్చల్: అందరి అభిప్రాయాల మేరకు తుది నిర్ణయం తీసుకుంటానని మాజీమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకోనని, ఆచితూచి అడుగులు వేస్తానని స్పష్టం చేశారు. మేడ్చల్ మండలం పూడూర్ గ్రామ పరిధిలోని ఈటల నివాసంలో శుక్రవారం మధ్యాహ్నం హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్, వీణవంక, ఇల్లంతకుంట మండలాలకు చెందిన నాయకులు ఆయనను కలిశారు. ఈ సందర్భంగా ఈటల వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రస్తుత పరిణామాలు, తన రాజకీయ జీవితం, వ్యాపారం, తన భూముల వ్యవహారాలు, నియోజకవర్గంలో జరగబోయే పరిణామాల గురించి వారికి వివరించారు. కొందరు తనకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారని, కానీ అది జరిగే పనికాదని అన్నారు. గతంలో మన అనుకున్న నాయకులు కూడా మోసాలు చేశారని విచారం వ్యక్తం చేశారు. తాను మరికొంత మందితో సమావేశాలు నిర్వహిస్తానని, మనతో కలసి వచ్చేవారు ఎవరు.. ఎవరి తీరు ఎలా ఉంది.. అనే అంశాలను గుర్తించి అందరి అభిప్రాయాలు తెలుసుకున్నాకే ముందడుగు వేస్తానన్నారు. ‘ఆగం కాకుండా మీ పనుల్లో మీరు ఉండాలి, నా ప్రయోజనాల కోసం మీ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బందులు కలగవద్దని నేను భావిస్తున్నాను. మీరు కూడా కొద్ది రోజులు ఓపికగా ఉండాలి’అని వారికి సూచించారు. చదవండి: ఏ నిర్ణయమైనా నీ వెంటే..! ఈటలకు కొండా మద్దతు -
పాత రికార్డుల పరిశీలన.. ఆక్రమణలపై ఆరా
సాక్షి, మేడ్చల్ జిల్లా: హైదరాబాద్ శివారు దేవరయాంజాల్‌లోని శ్రీరామచంద్ర స్వామి దేవాలయ భూముల వ్యవహారంపై ఐఏఎస్‌ల ఉన్నతస్థాయి కమిటీ నాలుగోరోజూ విచారణ కొనసాగించింది. రికార్డులు, ఫైళ్లను పరిశీలించింది. ల్యాండ్ సర్వే శాఖకు చెందిన ముగ్గురు అధికారులు, 19 మంది సర్వేయర్లు, ఎనిమిది మంది తహసీల్దార్ల ఆధ్వర్యంలోని 8 బృందాలు నిర్వహించిన సర్వే నాలుగు రోజుల అనంతరం గురువారం ముగిసింది. ఐఏఎస్‌ల కమిటీ దేవరయాంజాల్ ఆలయపూజారితో మాట్లాడి పలు అంశాలను అడిగి తెలుసుకుంది. దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ల వద్ద నుంచి ఆలయానికి సంబంధించిన పాత రికార్డులు, ఫైళ్లను స్వాధీనం చేసుకుంది. కచ్చితమైన భూరికార్డులుగా చెప్పుకొనే 1924–25 రెవెన్యూపత్రాల్లో 1,531 ఎకరాల భూములు సీతారామస్వామి ఆలయం పేరిట ఉన్నట్లు దేవాదాయ శాఖ అధికారులు పేర్కొన్నారు. పాత రికార్డులు, నక్ష, పహాణీలు, మ్యాప్‌లను కమిటీకి అందజేశారు. ఆలయ భూముల వివాదానికి సంబంధించి అప్పట్లో వేసిన వెంకట్రాంరెడ్డి, దివాన్ కమిటీల గురించి ఆరా తీయటంతోపాటు వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు, పత్రాలు, ఫైళ్లను కమిటీ పరిశీలించింది. భూమి యజమానిగా ఉన్న శ్రీసీతారామ చంద్రస్వామి ఆలయం పేరు కాస్తా... సీతారామరెడ్డిగా, సీతారామారావుగా, సీతారామయ్యగా, సీతారాములుగా రకరకాల పేర్లతో మారి... చివరికి కబ్జాదారుల పేర్లు రికార్డుల్లోకి ఎక్కినట్లు దేవాదాయ శాఖ అధికారులు కమిటీకి వివరించారు. దేవాలయ భూములు అమ్మేందుకు వీలులేదని, వాటిని చట్టపరంగా స్వాధీనం చేసుకునేందుకు అవకాశముందని వారు అభిప్రాయపడ్డారు. హెచ్ఎండీఏ అనుమతి పొందినవి మూడు మాత్రమే.. ఆలయ భూముల్లో గోదాములు, కమర్షియల్ షెడ్లు, ఫామ్‌హౌస్‌లు, కొత్తగా నిర్మిస్తున్న కట్టడాలు అన్నీ కలిపి 178 వరకు ఉన్నప్పటికీ, సర్వే లెక్కల్లో మాత్రం తేడా ఉన్నట్లు సమాచారం. తూముకుంట మున్సిపాలిటీ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 129 నిర్మాణాలు (గోదాములు, కమర్షియల్ షెడ్లు) ఉన్నప్పటికీ, ఇందులో మూడింటికి మాత్రమే హెచ్ఎండీఏ అనుమతులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తూముకుంట మున్సిపాలిటీ, అప్పటి పంచాయతీల్లో విధులు నిర్వహించిన ఉద్యోగులను కమిటీ విచారించింది. నివేదిక ఇవ్వాలని కోరినట్లు సమాచారం. అక్రమ నిర్మాణాలను అరికట్టని సంబంధిత ఉద్యోగులపై శాఖ పరమైన చర్యలకు కూడా కమిటీ సిఫారసు చేసే అవకాశమున్నట్లు చర్చ సాగుతోంది. రాజకీయ పలుకుబడితోనే అక్రమ కట్టడాలు ఆలయ భూముల్లో 2007 నుంచి ఇప్పటివరకు యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్న విషయం ఐఏఎస్‌ల కమిటీ పరిశీలనలో తేలింది. మాజీమంత్రి ఈటల రాజేందర్ సతీమణి జమునకు సంబంధించిన కట్టడాలు, రాజకీయ పలుకుడి కలిగిన వ్యక్తులతోపాటు అధికార పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధుల నిర్మాణాలు కూడా ఆలయ భూముల్లో ఉన్నట్లు కమిటీ గుర్తించింది. ఈటల, ఆయన బినామీల అక్రమ నిర్మాణాలకు సంబంధించిన వివరాలు పూర్తిస్థాయిలో సేకరించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి సమర్పించే నివేదిక సమగ్రంగా ఉండేలా అన్ని కోణాల నుంచి కమిటీ పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించింది. ఆలయ ప్రాంగణంలో కమిటీ సభ్యులు భేటీ ఐఏఎస్‌ల కమిటీ దేవాలయ ప్రాంగణంలో సమావేశమైంది. 8 బృందాలు నిర్వహించిన సర్వే నివేదికలతోపాటు దేవాదాయ, రెవెన్యూ, విజిలెన్స్ శాఖలు, రైతులు, కబ్జాదారులు, నిర్మాణదారుల నుంచి సేకరించిన రికార్డులు, పత్రాలు, మ్యాప్‌లను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రభుత్వానికి శనివారంలోగా నివేదిక సమర్పించే అవకాశముండటంతో మదింపు కోసం కమిటీ అన్ని రికార్డులను పరిశీలించి తుది సమాలోచనలు చేసింది. పత్రాలు అందజేసిన కబ్జాదారులు ఐఏఎస్‌ల ఉన్నత స్థాయి కమిటీకి కబ్జాదారులు, రైతులు తమ భూరికార్డులు, గోదాములు, కమర్షియల్ షెడ్లకు సంబంధించిన పత్రాలను చూపించారు. 1953లో ఈ భూములను కొనుగోలు చేసినట్లు పలువురు వివరణ ఇచ్చారు. గోదాములు, షెడ్లు నిర్మించుకోవటానికి గ్రామ పంచాయతీ నుంచి తీసుకున్న అనుమతి పత్రాలు, చెల్లిస్తున్న పన్నులు, భూమి శిస్తుకు సంబంధించిన పాత వివరాలను కూడా కమిటీకి చూపించారు. -
ఈటలపై ఆరోపణలు.. దేవరయాంజాల్‌లో చురుగ్గా విచారణ
సాక్షి, మేడ్చల్ జిల్లా: హైదరాబాద్ నగర శివారులోని దేవరయాంజాల్ శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ భూముల ఆక్రమణపై ఐఏఎస్ ఉన్నత స్థాయి కమిటీ విచారణ చురుగ్గా సాగుతోంది. మూడో రోజైన బుధవారం ఆలయ భూముల్లో అక్రమంగా నిర్మించినట్లు ఆరోపణలున్న నిర్మాణాలను పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎం.రఘునందన్‌రావు నేతృత్వంలోని ఐఏఎస్ అధికారుల కమిటీ పరిశీలించింది. ఆలయ భూముల కబ్జాలో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌తోపాటు పలువురి ప్రమేయం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం విచారణకు నలుగురు ఐఏఎస్‌లతో కూడిన కమిటీని నియమించింది. దీంతో మూడు రోజులుగా ఆలయ భూము ల్లో వెలసిన నిర్మాణాలతోపాటు భూముల వివరాలను కమిటీ బృందం సేకరిస్తోంది. కష్టంగా వివరాల సేకరణ దేవరయాంజాల్‌లోని ఆలయ భూములకు సంబంధించి 91 సర్వే నంబర్ల పరిధిలో 39 మందికి సంబంధించి 178కి పైగా వాణిజ్య కట్టడాలు ఉన్నాయి. అయితే, ఇందులో 129కి మాత్రమే ఏడాదికి రూ.1.02 కోట్ల ఆస్తి వన్ను రూపేణా తూముకుంట మున్సిపాలిటికి చెల్లిస్తున్నట్లు తేలింది. ఆలయానికి సంబంధించి దాదాపు 200 ఎకరాల్లో కమర్షియల్ షెడ్లు ఉండగా, మరో 800 ఎకరాల భూములు వ్యవసాయ భూమిగా ఉన్నట్లు తెలుస్తోంది. గోదాములు, కమర్షియల్ షెడ్లతోపాటు ప్రహరీతో నిర్మించిన భూములు వందలాది ఎకరాలుగా ఉండ టం వల్ల వీటికి సంబంధించిన యజమానుల వివరాలు తెలుసుకునేందుకు సమ యం పడుతోంది. బినామీలతోపాటు 2, 3 తరాలకు చెందిన వారు యజమానులుగా ఉన్నట్లు వెల్లడవుతుండటం.. పైగా కొందరు మరణించటం వంటి వాటి వల్ల ఆ వివరాల సేకరణ కష్టంగా మారుతోంది. డీజీపీఎస్ టెక్నాలజీతో సర్వే ఆలయ భూములు, అందులోని నిర్మాణాలకు సంబంధించిన వివరాలు పక్కాగా సేకరించేందుకు కమిటీ బృందం అధునాతన టెక్నాలజీని ఉపయోగిస్తోంది. గోదాములు, స్థలం (భూమి) లోకేషన్ ఆధారంగా డీజీపీఎస్ సర్వే చేస్తోంది. దీంతో అంగుళం కూడా తప్పిపోకుండా వివరాలు పక్కాగా ఉంటాయని అధికారులు అంటున్నారు. ఆలయానికి సంబంధించిన 1,531ఎకరాలల్లో 178కి పైగా నిర్మాణాలు ఉండటం వల్ల సర్వే పూర్తి కావడానికి రెండు రోజులు పట్టవచ్చునని సమాచారం. పత్రాలు చూపుతున్న రైతులు ఆలయ భూముల్లో సర్వే చేస్తున్న తహసీల్దార్ల బృందాలకు రైతులు పట్టాదారు పాసుపుస్తకాలతోపాటు పాత రికార్డులు, పత్రాలు చూపిస్తున్నారు. సర్వే నంబర్లు 671, 674, 676, 714లలో పలు నిర్మాణాలు చేపట్టిన రైతులు 25 ఎకరాలకు సంబంధించిన రికార్డులను విచారణ బృందం అధికారి రఘునందన్‌రావుకు చూపించారు. 715, 717, 718 సర్వే నంబర్లలో 16 ఎకరాలున్న యాజమాని కూడా పత్రాలను అందజేశారు. చదవండి: ఈటలపై భూకబ్జా ఆరోపణలు: వివరాలు వెల్లడించిన కలెక్టర్ Etela Rajender: ఈటలకు షాకిచ్చేందుకు ‘కెప్టెన్’ రెడీ! -
దేవరయాంజాల్ సీతారామచంద్రస్వామి భూకబ్జాపై విచారణ
-
మేడ్చల్ జిల్లా మల్లాపూర్ లో అగ్నిప్రమాదం
-
ఆ రెండు జిల్లాల అభివృద్దికి కొత్త ప్రాజెక్ట్: సీఎం కేసీఆర్
హైదరాబాద్: హైదరాబాద్ నగరానికి ఆనుకుని ఉన్న రంగారెడ్డి , మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల సమీకృతాభివృద్ధి, సమస్యలకు శాశ్వత పరిష్కారం, ఏకీకృత విధానం ఏర్పాటు కోసం.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధ్యక్షతన నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ జిల్లాల పరిధిలోని నియోజకవర్గాలు, మున్సిపాలిటీలు, ముఖ్య పట్టణాల్లో.. సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు, రోడ్లు, విద్యుత్, తాగునీరు తదితర మౌలిక వసతుల అభివృద్ధి, డ్రైనేజీ, నాలాల మరమ్మతులు వంటి సమస్యల శాశ్వత పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీనిపై సీఎం శుక్రవారం ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ‘‘హైదరాబాద్ కాస్మోపాలిటన్ నగరంగా పురోగమిస్తోంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ జిల్లాల పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలను సిద్ధం చేయాలి. హైదరాబాద్‌తోపాటు సమ్మిళిత అభివృద్ధిని కొనసాగించేలా సమీకృత విధానాన్ని రూపొందించాలి. ఇందుకు నిరంతర పర్యవేక్షణ కోసం సీఎస్ అధ్యక్షతననోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేద్దాం’’ అని కేసీఆర్ చెప్పారు. ప్రణాళికలు సిద్ధం చేయండి రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని ప్రజలకు విద్య, వైద్యం వంటి అన్ని సౌకర్యాలను మరింతగా అందుబాటులోకి తేవాలని కేసీఆర్ అన్నారు. ‘‘ఏ నియోజకవర్గం పరిధిలో ఏ సమస్యలున్నాయనే దానిని ఒక ప్రాజెక్టు రూపంలో స్థానిక ఎమ్మెల్యేలు రూపొందించాలి. మౌలిక వసతుల అభివృద్ధికి ఆయా శాఖల అధికారులతో కలిసి ప్రణాళికలను సిద్ధం చేయాలి. నోడల్ అధికారి అధ్యక్షతన తరచూ సమావేశం కావాలి. అందులో ఏయే శాఖల భాగస్వామ్యం ఉండాలి, ఖర్చు ఎంతవుతుందన్న అంశాన్నింటినీ ప్రజాప్రతినిధులు అధికారులు కలిసి చర్చించాలి. నెలకోసారి ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, కలెక్టర్లతో సీఎస్ క్రమం తప్పకుండా సమావేశం కావాలి. నోడల్ అధికారి ఎప్పటికప్పుడు పురోగతిని సమీక్షించాలి. సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం నిధులు సమకూర్చడానికి సిద్ధంగా ఉంది’’ అని కేసీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో అద్భుతమైన వాతావరణం హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ విమానాశ్రయం, అద్భుతమైన వాతావరణ పరిస్థితులున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. మిషన్ భగీరథ తాగునీరు నిరంతరం అందుతోందని, నీటి అవసరాల కోసం అతిపెద్ద రిజర్వాయర్లను ఏర్పాటు చేసుకుంటున్నామని వివరించారు. ‘‘ఈ రెండు జిల్లాల్లో కూడా బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలి. సమీకృత మార్కెట్లు ఏర్పాటు చేయాలి. నాణ్యమైన విద్యుత్ సరఫరా, రోడ్ల నిర్మాణం, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం, వరదల ముంపు రాకుండా చర్యలు తీసుకోవాలి. రెవెన్యూ, భూరిజిస్ట్రేషన్ సమస్యలకు శాశ్వత పరిష్కారాలను అన్వేషించాలి. తద్వారా ఈ రెండు జిల్లాలు భవిష్యత్తులో హైదరాబాద్ తో పోటీ పడాలి..’’ అని కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధికి చర్యలు చేపడతామన్నారు. నిధుల సమీకరణపై దృష్టి సమగ్రాభివృద్ధికి సంబంధించి నిధుల సమీకరణపై దృష్టి పెట్టాలని సీఎం కేసీఆర్ సూచించారు. నోడల్ ఏజెన్సీ ఏర్పాటుతో హైదరాబాద్ నలువైపులా అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడానికి వీలవుతుందన్నారు. అన్ని దిక్కుల్లో అన్ని రకాల పనులు సమాంతరంగా కొనసాగేలా చూడాలన్నారు. సమావేశంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, నవీన్‌రావు, ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, బేతి సుభాష్ రెడ్డి, అరికెపూడి గాంధీ, కె.పి వివేకానంద, కాలె యాదయ్య, మాధవరం కృష్ణారావు, అధికారులు పాల్గొన్నారు. -
హృదయవిదారకం.. రోడ్డుపక్కనే ఇలా
మేడ్చల్ : ఇది అమానవీయం.. సిగ్గుచేటు.. హృదయ విదారకరం.. సర్కారు దవాఖాన అంటేనే ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’ అనే పాటను గుర్తుకు తెచ్చే ఘటన. ఒక నిండు గర్భిణి నెలలు నిండి సర్కారు దవాఖానకు వెళితే ఆస్పత్రిలో చేర్చుకోవడానికి నిరాకరించిన వైద్యులు. చేసేది లేక రోడ్డుపైనే ప్రసవం. పుట్టిన గంటలోనే శిశువు మృతి. ఆ నవజాత శిశువు చేసిన నేరం ఏమిటి?, ఆ మహిళ చేసిన పాపం ఏమిటి?, మానవత్వం కనీసం కూడా కనిపించని ఈ తరహా ఘటనలకు ముగింపు ఎక్కడ? వివరాల్లోకి వెళితే.. ప్రభుత్వ ఆసుపత్రి వెద్యులు పట్టించుకోకపోవటంతో ఓ గర్భిణి రోడ్డు పక్క ప్రసవించిన ఘటన జిల్లాలోని జవహార్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. మేడ్చల్‌కు చెందిన ఓ గర్భిణి ప్రసవం కోసం జవహార్ నగర్‌లోని బాలాజీ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లింది. అయితే వైద్యులు ఎవరూ పట్టించుకోకపోవటంతో రోడ్డు పక్కనే ప్రసవించింది. పుట్టిన కొన్ని నిమిషాలకే శిశువు మరణించింది. తల్లిని గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
పేట్ బషీరాబాద్‌లో ఇంజనీరింగ్ విద్యార్ధి అనుమానాస్పద మృతి
-
హాస్టల్ పైనుంచి దూకి బీటెక్ స్టూడెంట్ మృతి, వీడియో వైరల్
సాక్షి, మేడ్చల్ : మేడ్చల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పేట్ బషీరాబాద్‌లోచంద్రిక అనే ఇంజనీరింగ్ విద్యార్ధి అనుమానాస్పదంగా మృతి చెందింది. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో యువతి నాలుగో సంవత్సరం చదువుతోంది. చంద్రిక స్వస్థలం మిర్యాలగూడ. కాగా ప్రస్తుతం మైసమ్మగూడలోని కృప వసతి గృహంలో ఉంటోంది. హాస్టల్ భవనం పైనుంచి దూకి చంద్రిక ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా యువతి చంద్రిక ఘటనకు సంబంధించి వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై డీసీపీ పద్మజ మాట్లాడుతూ..'కృప హాస్టల్ పక్కన యువతి మృతదేహాం ఉందని మంగళవారం ఉదయం 8.15 కి స్థానిక కౌన్సిలర్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. యువతిని మిర్యాలగూడకు చెందని చంద్రికగా గుర్తించాం. ఆమెకు బాక్‌ల్యాగ్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా తర్వాత ఇటీవల సీటీకి వచ్చిన చంద్రిక ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతుంది. చదువులో వెనకబడి ఉన్నానన్న మసస్తాపంతో యువతి బలవన్మరణానికి పాల్పడినట్టు ప్రాథమికంగా అంచనాకు వచ్చాం. అనుమానస్పద మృతి కేసు నమోదు చేసుకున్నాం. సీసీ కెమెరాలు, చంద్రిక ఫోన్ డేటా పరిశీలిస్తున్నాం'అని ఆమె పేర్కొన్నారు. చదవండి : పెద్దలకు ఇష్టం లేకపోయినా ప్రేమ పెళ్లి.. నాలుగు నెలల్లోనే... వయసు 26.. కేసులు 20 -
శామీర్‌పేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు సజీవ దహనం
సాక్షి, మేడ్చల్: మేడ్చల్ జిల్లా శామీర్‌పేట రాజీవ్ రహదారిపై గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు లారీలు ఒకదానికొకటి ఢీకొట్టిన ఘటనలో మంటలు చెలరేగి ఒక వ్యక్తి సజీవ దహనమయ్యాడు. నగరం నుండి తమిళనాడు సేలం కు వెళ్తున్న కంటైనర్ ను లారీ ఓవర్టేక్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రెండు లారీల మధ్య రాపిడి జరగడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగగా.. ఒక వ్యక్తి సజీవదహనమయ్యాడు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కాగా, మృతుడికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. ఫైర్ ఇంజిన్ లు సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. -
వివాహేతర సంబంధం: చెరువులోపడి భార్య ఆత్మహత్య
సాక్షి, మేడ్చల్: దుందిగల్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. తన భార్య చూడటానికి లావు ఉందనే కోపంతో నిత్యం వేధింపులకు గురి చేశాడు ఓ కానిస్టేబుల్. దీంతో ఆ వివాహిత తీవ్ర మనస్తాపానికి గురై చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీలత భర్త శివ కుమార్ సనత్ నగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. కొంత కాలంగా శ్రీలత లావు అందనే కోపంతో అన్నం కూడా పెట్టేవాడు కాదని తెలిపారు. కొన్ని నెలలు క్రితమే పూర్వ విద్యార్థుల గేట్‌టుగెదర్ కార్యక్రమం జరిగిన సమయంలో అక్కడ మరో వివాహిత శివ కుమార్‌కి పరిచయం అయింది. దీంతో ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందని శ్రీలత తీవ్ర మనస్తాపం చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనను పోలీసులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని దుండిగల్ సీఐ తెలిపారు. మరోవైపు తమ కూతురును చంపేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని శ్రీలత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఎనిమిదేళ్ల క్రితం తమ అమ్మాయి శ్రీలతను కానిస్టేబుల్ శివకుమార్‌తో వివాహం చేశామని తెలిపారు. వివాహం జరిగినప్పటి నుంచి కట్నం కోసం వేధింపులు చేస్తున్నాడని తెలిపారు. ఇక కానిస్టేబుల్ శివ కుమార్ ఆరేళ్ల కూతురు తన తండ్రి అరాచకంపై కన్నీరు పెట్టుకుంది. అమ్మను ప్రతిరోజు కొట్టేవాడని, అన్నం పెట్టకుండా వేధించే వాడని చిన్నారి తెలిపింది. బయట నుంచి కోపంతో వచ్చి అమ్మ పైన దాడి చేసేవాడిని తెలిపింది. చదవండి: గగన్ అగర్వాల్ హత్యకేసు: వెలుగులోకి కీలక విషయాలు -
రోడ్లపై యువతుల దందా..
-
రోడ్లపై యువతుల దందా..
సాక్షి, మేడ్చల్ : ఈజీ మనీకి అలవాటు పడి రోడ్లపై దందాకు దిగారు కొందరు యువతులు. వచ్చీ, పోయే వాహనాలను అడ్డగించి డబ్బులు వసూలు చేస్తూ పోలీసులకు చిక్కారు. వివరాలు.. రాజస్థాన్, గుజరాత్ రాష్టాలకు చెందిన యువతులు ఐదు బృందాలుగా ఏర్పడి, జాతీయ రహదారి, నిర్మానుష ప్రాంతాలను టార్గెట్ చేశారు. ఓ గ్రూపు ఘట్కేసర్ రోడ్లపై స్వచ్ఛంద సంస్థ కోసం విరాళాలు అంటూ డబ్బులు వసూలు చేయసాగింది. ఆ గ్రూపులోని యువతులు వచ్చీ, పోయే వాహనాలను ఆపి దందాకు పాల్పడుతున్నారు. డబ్బులు ఇవ్వని వారిని బెదిరించసాగారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డబ్బులు వసూలు చేస్తున్న ఆరుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. చదవండి : రోజుకో మలుపు తిరుగుతున్న బోధన్ పాస్‌పోర్టుల కేసు రోజుకో మలుపు తిరుగుతున్న బోధన్ పాస్‌పోర్టుల కేసు -
మద్యం మత్తు: భర్త ముందే భార్యతో అసభ్య ప్రవర్తన
సాక్షి, కుషాయిగూడ: మద్యం మత్తులో ఓ ఇంట్లోకి చొరబడి భర్త ఎదుటే ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యకితోపాటు... అతడిపై దాడి చేసిన నలుగురిపై ఆదివారం కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ శ్రీనివాస్ సమాచారం మేరకు... రాంపల్లి సత్యనారాయణ కాలనీకి చెందిన శ్యామల లింగస్వామి ఆటో డ్రైవర్. మద్యానికి బానిసైన అతడు తరచు గొడవలు పడేవాడు. కొడుకు తీరుతో విసిగిపోయిన తల్లిదండ్రులు కొంత కాలం క్రితమే ఎస్‌ఆర్‌నగర్‌కు మకాం మార్చారు. ఈ నెల 26 ఇక్కడికొచ్చిన లింగస్వామి మిత్రులతో కలిసి మద్యం సేవించాడు. రాత్రి మత్తులో అంబేడ్కర్‌నగర్‌కు చెందిన నిఖిత ఠాగూర్ అనే మహిళ ఇంట్లోకి ప్రవేశించాడు. భర్త ఎదుటే ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఇరుగుపొరుగు వారు లింగస్వామిని మందలించారు. బాధితురాలి సోదరుడి సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు లింగస్వామిని అదుపులోకి తీసుకున్నారు. అతడికి 41 నోటీసు జారీ చేసి వదిలేశారు. ఈ క్రమంలో చిన్న చర్లపల్లిలోని ఓ ఫాస్ట్ పుడ్ సెంటర్ వద్ద ఉన్న లింగస్వామిని గుర్తించిన మహిళ భర్త, సోదరుడు పృథ్వీ, మనీష్ఠాగూర్ అతడి మిత్రులు సిరాజ్, ప్రవీణ్‌లు మాట్లాడుకుందామని ఆయనను కారులోకి బలవంతంగా ఎక్కించుకున్నారు. కారులోనే అతడిపై దాడికి పాల్పడ్డారు. అనంతరం చర్లపల్లిలోని ఓ పాస్ట్ పుడ్ సెంటర్‌కు తీసుకెళ్లి ఓ గదిలో తాళ్లతో బంధించి విచక్షణ రహితంగ చితకబాదారు. దాడి దృశ్యాలను సెల్ఫోన్లో చిత్రీకరించారు. అవికాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. బాధితుడి తల్లి సైదమ్మ ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడ్డ నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: ప్రాంక్ అంటూ 300 అశ్లీల వీడియోలు.. మహిళా ఐపీఎస్ అధికారిణిపై లైంగిక వేధింపులు.. -
ఏ సమస్య వచ్చినా మీకు నేనున్నా: ఎమ్మెల్సీ కవిత
సాక్షి, హైదరాబాద్: చైనా లోన్‌యాప్ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న మేడ్చల్‌కు చెందిన చంద్రమోహన్ కుటుంబానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భరోసా ఇచ్చారు. చంద్రమోహన్ భార్య సరితకు ఉద్యోగం కల్పించడంతోపాటు ముగ్గురు ఆడపిల్లలకు ఉద్యోగం వచ్చేవరకూ చదివిస్తానని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబ సభ్యులతో ఆదివారం కవిత భేటీ అయ్యారు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లికి చెందిన చంద్రమోహన్ చైనా లోన్ యాప్‌ల వేధింపులు భరించలేక ఈ ఏడాది జనవరిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి యజమాని ఆత్మహత్యకు పాల్పడటంతో భార్య సరిత, ముగ్గురు ఆడపిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. విషయం తెలుసుకున్న కవిత ఆదివారం బాధిత కుటుంబాన్ని కలిసి ఓదార్చారు. ముగ్గురు పిల్లలు ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు సాధించే వరకు సాయం అందిస్తానని సరితకు హామీ ఇచ్చారు. ఏ సమస్య వచ్చినా తనను సంప్రదించాలని, కుటుంబానికి పూర్తిగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. -
ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లో కట్టేసి చిత్రహింసలు
-
ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లో కట్టేసి చిత్రహింసలు
సాక్షి, మేడ్చల్ : మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ వ్యక్తిని మాట్లాడదామని పిలిచి చిత్రహింసలు పెట్టారు ముగ్గురు వ్యక్తులు. ఈ సంఘటన మేడ్చల్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. మేడ్చల్ జిల్లా చర్లపల్లి ఈసీ నగర్‌కు చెందిన లింగాస్వామి అనే వ్యక్తి ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కుషాయిగూడ పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు లింగాస్వామిని అదుపులోకి తీసుకుని విచారించారు. మరుసటి రోజు రమ్మని చెప్పి పంపేశారు. ఈ నేపథ్యంలో ముగ్గురు వ్యక్తులు లింగాస్వామిని మాట్లాడదామని కారులో తీసుకెళ్లారు. చర్లపల్లి ఈసీ నగర్‌లోని ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లింగా స్వామి నోట్లో గుడ్డలు కుక్కి, కట్టేసి చితకబాదారు. ఆ రాత్రి మొత్తం కారులో తిప్పి బాగా కొట్టి వదిలేశారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో వెలుగులోకి రావటంతో బాధితుని తమ్ముడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు విచారిస్తున్నారు. చదవండి : నిందితుడి ఆత్మహత్య.. ఎస్ఐ సస్పెన్షన్ భార్య ఫిర్యాదు, ఆందోళనతో భర్త ఆత్మహత్యాయత్నం -
మూడు వేర్వేరు ప్రదేశాల్లో రోడ్డు ప్రమాదాలు
-
అప్పుడే అర్థమైంది.. అసలు పరీక్ష ప్రారంభమైందని!
సాక్షి, ఘట్కేసర్ : వారంతా అర్ధాకలితో నిరుద్యోగ బాధను దిగమింగుకున్నారు. రాత్రింబవళ్లూ శ్రమించి చదువుకున్నారు. పేదరికం విలువ తెలుసుకొని పోటీ పరీక్షలకు సమయత్తమై విజేతలుగా నిలిచి పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగం సాధించారు. కటిక పేదరికాన్ని అనుభవించి ఉద్యోగం రావడంతో ఉప్పొంగిపోయారు. ఇన్నాళ్లు కష్టపడి చదివించిన తల్లితండ్రుల జీవితాల్లో వెలుగులు నింపుదామని అనుకున్నారు. ఏడాది పాటు ఉత్సాహంగా విధులు నిర్వహించారు. ఆ తర్వాతే తెలుసుకున్నారు జీవితంలో అసలు పరీక్ష ప్రారంభమైందని. పంచాయతీ కార్యదర్శులుగా ఉద్యోగమిచ్చినా.. సర్కారు శిక్షణ ఇవ్వకుండానే ఉద్యోగ బాధ్యతలు అప్పగించడంతో ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. పని భారం పెరగడం, ప్రజా ప్రతినిధులు, అధికారుల ఒత్తిడిని భరించలేకపోయారు. అప్పటి వరకు పేదరికాన్ని చవిచూసిన ఆ ఉద్యోగులు కుటుంబానికి అన్నం పెట్టే ఉద్యోగానికే రాజీనామ చేశారు. 2019 సంవత్సరంలో జిల్లాలో 20 మంది జూనియర్ కార్యదర్శలుగా ఉద్యోగంలో చేరగా 9 మంది రాజీనామా చేశారు. చదవండి: కూకట్‌పల్లిలో బయటపడ్డ ఫేక్ డాక్టర్ మోసం! కనుబొమ్మలు తీసివేసి.. కోట్లలో మోసాలు ఒత్తిడి భరించలేక... నియామక సమయంలో పార్లమెంట్ ఎన్నికలు రావడంతో శిక్షణ లేకుండానే ఉద్యోగంలో చేరారు. అనంతరం పల్లెప్రగతి కార్యక్రమం వారికి దిమ్మదిరిగేలా చేసింది. ఇంటి అనుమతులు, పన్నుల వసూళ్లతో పాటు ఉపాధి హామీ పనులు, హరితహారం, పల్లె ప్రగతి, వైకుంఠ ధామం, డంపింగ్ యార్డు షెడ్ల పనులు వారిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. కార్పొరేట్ స్కూల్లో చదవడంతో గ్రామ కంఠం భూమి అంటేనే వారికి తెలియదు. అలాంటిది సర్పంచ్, ఉప సర్పంచులకు మధ్యన పొసగక పోవడం, ఓడిన, గెలిచిన వారు రెండు వర్గాలుగా చీలి అభివృద్ధి పనులు ఆపడం, కొత్తగా వచ్చిన జూనియర్ కార్యదర్శులకు మేజర్ పంచాయతీలు అప్పగించడం, డీపీఓ ఆఫీస్ నుంచి ఉదయం 8 గంటలకే వీడియో కాల్ రావడం తల నొప్పిగా మారింది. ఉదయం ఇంటి నుంచి బయలు దేరిన వాళ్లు తిరిగి ఇంటికి ఎప్పుడు చేరుతారో తెలియని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు ప్రజాప్రతినిధుల ఒత్తిడి పెరగడం, నిధులు లేకున్నా పనులు చేయాలని మెడమీద కత్తిపెట్టడం, లేదంటే షోకాజ్ నోటీసులివ్వడం వారిని మరింత కుంగదీసింది. ఎగ్జిక్యూటివ్ పదవి కార్యదర్శి ఉద్యోగం వదిలి చిన్న స్థాయి ఉద్యోగంలో చేరిపోయారు. ప్రభుత్వం ఇలాంటి అంశాలపై దృష్టిసారించి ప్రస్తుతం అమలు చేస్తున్న అవుట్ సోర్సింగ్ విధానాన్ని రదు చేసి నోటిఫికేషన్ ద్వారా జూనియర్ కార్యదర్శుల నియామకాలను నిర్వహించాలని నిరుద్యోగులు కోరుతున్నారు. సవాలక్ష ఆంక్షలతో ఎలా... ప్రభుత్వం సవాలక్ష ఆంక్షలు విధిస్తూ నిరుద్యోగులను మోసం చేస్తోంది. జూనియర్ కార్యదర్శులుగా అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి నోటిఫికేషన్ ద్వారా నియామకాలను చేపట్టాలి. – బద్దం మిత్రారెడ్డి, నిరుద్యోగి, ఘనాపూర్ -
ఘోరం: డ్రైవింగ్‌లో ఉండగా ఫిట్స్!
సాక్షి, దుండిగల్: వేగంగా కారు నడుపుతున్న వ్యక్తికి ఫిట్స్ రావడంతో వాహనం అదుపు తప్పి ప్రహరీని ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందిన ఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. దుండిగల్ మున్సిపల్ పరిధి డీపోచంపల్లికి చెందిన అక్బర్ ఖాన్(38) ఎలక్ట్రీషియన్ శనివారం రాత్రి ఔటర్ నుంచి దుండిగల్ వైపు వర్నా కారులో వేగంగా ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో ఫిట్స్ రావడంతో కారు పక్కనే ఉన్న ఓపెన్ ప్లాట్ గోడను ఢీకొంది. అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న దుండిగల్ పోలీసులు అతడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
లోన్ యాప్ వేధింపులు: మరో వ్యక్తి బలి
సాక్షి, మేడ్చల్: ఆన్లైన్ యాప్ నిర్వాహకుల వేధింపులు ఆగడం లేదు. రుణాల పేరుతో ప్రజలను మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వేధింపులు తట్టుకోలేక తెలంగాణలో మరో వ్యక్తి బలైయ్యాడు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లిలోని తన నివాసంలో చంద్రమోహన్ అనే వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. (చదవండి: సూసైడ్ నోట్ రాసి మహిళా ఎస్సై ఆత్మహత్య) లోన్ కట్టాలంటూ యాప్ నిర్వాహకులు బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా వేధింపులు ఆగకపోవడంతో.. తన ఫోన్ కాంటాక్ట్స్‌లో ఉన్న నంబర్లకూ మెసేజ్‌లు పంపడంతో మనస్థాపం చెందిన చంద్రమోహన్.. తన నివాసంలోనే ఉరేసుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: సాక్షి స్టింగ్ ఆపరేషన్: కరోనా టెస్టులే లేకుండా సర్టిఫికేట్లు) -
రేవ్ పార్టీ : విందులు, అమ్మాయిలతో చిందులు..
మేడ్చల్ : కీసరలో రేవ్ పార్టీ కలకలం రేపింది. ఆదివారం రాత్రి ఓ ఫెర్టిలైజర్ వ్యాపారి తిమ్మాయిపల్లిలోని ఫారెస్ట్ రిడ్జ్ రిసార్ట్‌లో సన్నిహితుల కోసం ఆరుగురు అమ్మాయిలతో రేవ్ పార్టీ ఏర్పాటు చేశాడు. సిద్దిపేట, నల్గొండ, వరంగల్, గజ్వేల్‌కు చెందిన డీలర్లు ఇందులో పాల్గొన్నారు. విందులు, అమ్మాయిలతో చిందులతో వారు రచ్చరచ్చ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఆరుగురు యువతుల్ని, 10 మంది యువకుల్ని అరెస్ట్ చేశారు. బెస్ట్ క్రాఫ్ట్స్ సీడ్స్ కంపెనీ మేనేజర్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనుంచి సెల్ఫోన్లు, వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
పుట్టింటికి పంపించలేదని.. క్షణికావేశంలో
సాక్షి, మేడ్చల్: జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. క్షణికావేశంతో ఇద్దరు పిల్లలతో కలిసి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. భర్త క్రిస్మస్ పండుగకు పుట్టింటికి పంపించలేదని మనస్తాపంతో ఆమె బిడ్డలతో సహా చెన్నాపురం చెరువులో దూకేసింది. మృతులు నాగమణి (25), రూబీ (5), పండు (3 నెలలు)గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు. -
‘బ్లాక్’లో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లా రెడ్డికి చెందిన ‘మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజ నీరింగ్–ఎంఆర్‌సీఈ(క్యాంపస్–1)’ను నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) ఐదేళ్ల పాటు బ్లాక్ లిస్టులో పెట్టింది. దూలపల్లిలోని ఈ కళాశాలకు మెరుగైన గ్రేడ్ కోసం ఫోర్జరీ సంతకాలు, నకిలీ ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసు కున్నట్లు న్యాక్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎం.అరుణ్.. మల్లారెడ్డి కాలేజీ ప్రిన్సిపాల్ కు లేఖ రాశారు. గతంలో ఎంఆర్సీ ఈకి న్యాక్ ‘బీ++’ గ్రేడ్ ఉండేది. మరింత మెరు గైన గ్రేడ్ కోసం రీఅసెస్మెంట్కు సెల్ఫ్ స్టడీ రిపోర్టును (ఎస్ఎస్ఆర్) మల్లారెడ్డి కాలేజీ గతేడాది న్యాక్‌కు పంపించింది. అయితే, అందులో జత చేసిన బీహెచ్ ఈ ఎల్, యాష్ టెక్నాలజీస్, ఎయిర్టెల్ కం పెనీల సంతకాలు, స్టాంపులు, లెటర్ హె డ్లను డిజిటల్ ఫోర్జరీ చేసినట్లు న్యాక్ పే ర్కొంది. డాక్యుమెంట్లు ఫోర్జరీ అని, ఎస్ఎస్ఆర్ సరైంది కాదని తేల్చింది. ఈ వ్యవహారంపై షోకాజ్ నోటీసు జారీ చేసిం ది. అయినప్పటికీ కాలేజీ నుంచి ఎలాంటి స్పందనా రాలేదని, దీంతో ఎస్‌ఎస్‌ఆర్‌ను రద్దు చేసి, ఆ కశాశాలను ఐదేళ్లు బ్లాక్ లిస్ట్‌లో పెడుతున్నట్లు పేర్కొంటూ న్యాక్ ఈ నెల 24న నోటీసు జారీచేసింది. కాగా, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన కాలేజీ.. ఫోర్జరీ సంతకాలు, నకిలీ ధ్రువ పత్రాలు తయారు చేసే కేంద్రంగా మారిం దని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల అధ్యా పక సంఘాలు ఆరోపించాయి. న్యాక్ గుర్తింపు ఎందుకంటే.. నాణ్యత ప్రమాణాలు పాటించే కాలేజీలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆధ్వర్యం లోని న్యాక్ కమిటీ గుర్తింపు ఇస్తుంది. వి ద్యా ప్రమాణాలు, బోధన, లెర్నింగ్ ప్రాసె స్లో మెరుగైన విధానాలు, మౌలిక సదు పాయాలు, ఉత్తమ ఫ్యాకల్టీ, పరిశోధన, ఉద్యోగ అవకాశాలు లభించే కాలేజీలకు తగిన గ్రేడ్ (గుర్తింపు)ను న్యాక్ ఇస్తుంది. దీంతో పరిశోధన ప్రాజెక్టులు, వాటికి ఆర్థిక సహకారం లభిస్తుంది. కంపెనీలు కూడా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో న్యాక్ గుర్తింపున్న కాలేజీలకు ప్రాధాన్యమిస్తాయి. ఇటు వి ద్యార్థులకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కాగా, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీని న్యాక్ బ్లాక్‌లిస్టులో పెట్టిన నేప థ్యంలో.. ఇందుకు నైతిక బాధ్యత వహి స్తూ మంత్రి మల్లారెడ్డి తన పదవికి రా జీనామా చేయాలని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు పి.మధుసూ దన్‌రెడ్డి ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. -
మేడ్చల్: తల్లి, సోదరి దారుణ హత్య
-
అన్నంలో విషం: తల్లి, సోదరి దారుణ హత్య
సాక్షి, మేడ్చల్ : ఐపీఎల్ బెట్టింగ్‌లకు, జల్సాలకు బానిసైన యువకుడు తల్లికి, సోదరికి విషం హతమార్చిన సంఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రావలకోల్ గ్రామానికి చెందిన సాయినాథ్‌రెడ్డి తండ్రి ప్రభాకర్ రెడ్డి ఇటీవల అకాల మరణ చెందడంతో అతడి పేరిట ఉన్న ఇన్సూరెన్స్ 20 లక్షలు నగదు అందింది. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న సాయినాథ్ రెడ్డి దురలవాట్లకు బానిసయ్యాడు. జులాయిగా తిరుగుతూ మొత్తం డబ్బులను ఖర్చు చేశాడు. ఈ విషయంపై తల్లి, చెల్లిలు ఎక్కడ నిలదీస్తారోనని భయపడిన అతను ఈ నెల 23న ఉదయం అన్నం వండి అందులో విషం కలిపి తల్లి సునీతా రెడ్డి (42), సోదరి అనూష (20)లకు పెట్టాడు. (విషాదం: హెచ్‌సీయూ ప్రొఫెసర్ ఆత్మహత్య) పథకం ప్రకారం ముందే సిద్ధం చేసుకున్న ఆహారాన్ని తీసుకుని ఆఫీసుకు వెళ్లాడు. మధ్యాహ్నం అన్నం తిన్న సునీత, అనూష అస్వస్థతకు గురయ్యారు. తల్లి సునీత కుమారుడికి ఫోన్ చేసి ఆ తిన్నం తినవద్దని చెప్పింది. 23వ తేదీ సాయంత్రం ఇంటికి తిరిగివచ్చిన సాయినాథ్ రెడ్డి అపస్మారక స్థితిలో ఉన్న తల్లి, చెల్లిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సునీత 27న మృతిచెందగా.. అనుష 28మ కన్నుమూసింది. ఈ ఘటనపై తమకు ఫిర్యాదు అందిందని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానికి సీఐ ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. నిందితుడు సాయిని అరెస్ట్ చేసిన పోలీసులు పోలీస్ కస్టడీకి తరలించి విచారిస్తున్నారు. -
ధర్మారెడ్డి ఆత్మహత్య.. అనుమానాలెన్నో..
సాక్షి, హైదరాబాద్/కుషాయిగూడ: కీసర భూవివాదం కేసులో మాజీ తహసీల్దారు నాగరాజుతో పాటు అరెస్టయిన ధర్మారెడ్డి (77) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇప్పటికే నాగరాజు జైల్లోనే ఆత్మహత్య చేసుకోగా.. ధర్మారెడ్డి జైలు నుంచి బెయిల్‌పై బయటకొచ్చిన పది రోజు లకే స్థానిక ఆలయం సమీపంలో వేపచెట్టుకు ఉరివేసుకున్న స్థితిలో కనిపించడం అనుమానాలకు తావి స్తోంది. పోస్టుమార్టం అనంతరం ఆయన మృతదేహాన్ని కుషాయిగూడ నాగార్జుననగర్ కాలనీకి తరలించారు. ఇదే కేసులో చంచల్‌గూడ జైల్లో ఉన్న కుమారుడు శ్రీకాంత్‌రెడ్డి రాగానే రాంపల్లి దయారాలో ధర్మారెడ్డి అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. శనివారం ఇంట్లోంచి వెళ్లి.. ఆదివారం శవమై.. శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ధర్మారెడ్డి ఇంటి నుంచి బయటికెళ్లారు. రాత్రయినా తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల వెతికారు. ఆదివారం తెల్లవారుజామున ఆరున్నర గంటల ప్రాంతంలో వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం సమీపంలోని వేపచెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడన్న సమాచారం తెలి సింది. ఏడేళ్లుగా అప్పుడప్పుడు ధర్మారెడ్డి ఆ ఆలయంలో రాత్రిళ్లు నిద్రించేవారని, చివరకు అక్కడే శాశ్వత నిద్రలోకి వెళ్లారంటూ బంధువులు రోదిం చారు. కాగా, బెయిల్‌పై ఇంటికి వచ్చినా ధర్మారెడ్డికి పోలీసుల వేధింపులు ఆగలేదని వారు అంటున్నారు. నాంపల్లి ఏసీబీ కోర్టుకొచ్చి సంతకం చేసి వెళ్లాలని చెప్పారని, ఆరోగ్యం సహకరించట్లేదని బతిమాలినా పోలీసులు వినిపించుకోలేదని వారు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో రావాల్సిందేనని బెదిరింపు ధోరణిలో మాట్లాడారని, కోర్టుకు వెళ్లలేక, మరోపక్క కొడుకుకు ఇంకా బెయిల్ రాకపోవడంతో మానసికంగా కుంగిపోయారన్నారు. అనుమానాలెన్నో.. 77 ఏళ్ల ధర్మారెడ్డి సరిగా నడవలేరు. చీకటిపడితే కళ్లు సరిగా కనిపించవు. అటువంటి వ్యక్తి గుడి సమీపంలో 12 అడుగుల ఎత్తున్న వేపచెట్టు కొమ్మకు తాడు ఎలా కట్టారన్నది అంతుచిక్కట్లేదు. గుడిలోకి చెందిన అడుగున్నర ఎత్తుండే ఓ కుర్చీ ఘటనాస్థలిలో కనిపించింది. ఒకవేళ కుర్చీ ఎక్కి కొమ్మకు దుస్సు ముడివేశారా అంటే.. ఘటనాస్థలాన్ని చూస్తే అలా లేదు. తాడును కొమ్మకు గట్టిగా బిగించి కట్టినట్టుంది. చెట్టెక్కితేనే అది సాధ్యం. వయసు దృష్ట్యా ధర్మారెడ్డి చెట్టెక్కి కొమ్మకు తాడు కట్టడం సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే, ఘటన స్థలంలో కనిపించిన కుర్చీని వేపచెట్టువైపు తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీకి చిక్కలేదు. ఈ దిశగా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇదీ వివాదం.. నవాబుల నుంచి వారసత్వంగా సంక్రమించిన 96 ఎకరాలకు ధర్మారెడ్డి తండ్రి నారాయణరెడ్డి 1950 నుంచి 58 మధ్యకాలంలో టెనెంట్‌గా ఉన్నారని ధర్మారెడ్డి కుటుంబసభ్యులు చెబుతున్నారు. ‘రెండేళ్ల పాటు పన్నులు చెల్లించడంతో 38ఈ సర్టిఫికెట్ కూడా వచ్చింది. కిషన్‌సింగ్ అనే వ్యక్తి రికార్డులను తారుమారుచేసి కొందరికి ఆ భూమి విక్రయించాడు. దీనిపై విచారణ జరిపిన అప్పటి తహసీల్దార్ అందులో 24 ఎకరాలకు ధర్మారెడ్డితో పాటు అతని ముగ్గురి సోదరుల పేరుపై పట్టా పాస్‌బుక్ ఇవ్వాలని ఆదేశాలిచ్చారు. అయితే, ఆ భూమి తమదంటూ కొందరు ఫిర్యాదు చేయడంతో సెప్టెంబర్ 25న ధర్మారెడ్డిని, 29న అతని కుమారుడు శ్రీకాంత్‌రెడ్డి తదితరులను అన్యాయంగా అరెస్టు చేశార’ని వారు అంటున్నారు. కాగా, ఈ వివాదానికి సంబంధించి అప్పటికే లంచం కేసులో అరెస్టయి ఉన్న మాజీ తహసీల్దార్ నాగరాజుపై.. ధర్మారెడ్డి పేరిట అక్రమంగా పట్టా పాస్ పుస్తకాలను సృష్టించారనే ఆరోపణలతో ఏసీబీ మరో కేసు నమోదు చేసింది. ఏ సమయంలో ఏం చేశాడంటే.. – శనివారం సాయంత్రం 4.48 ని.: ధర్మారెడ్డి వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయానికి వచ్చారు. 5.08: వరకు ఉండి వెళ్లిపోయారు. 5.24కి మళ్లీ వచ్చి.. రాత్రి 7.43కి బయటకు వెళ్లారు. 8.06కు మళ్లీ వచ్చి వెంటనే వెళ్లిపోయారు. – రాత్రి 8.54: ధర్మారెడ్డి ఫోన్ మాట్లాడుతూ మళ్లీ ఆలచానికి వచ్చారు. 9.30: టవల్ వేసుకొని పడుకున్నారు. 10.11: ఓ బాబుతో ముగ్గురు మహిళలు వచ్చి చాప పర్చుకొని పడుకున్నారు. ఈ అలికిడికి ధర్మారెడ్డి నిద్రలేచి 10.14 సమయంలో గుడిలోనే అటుఇటు తిరిగారు. – 11.24: ఓ మహిళ నిద్రలేచింది. అటూఇటూ చూసి మళ్లీ పడుకుంది. – 11.33: మళ్లీ లేచిన ఆమె అక్కడే ఉన్న కుళాయి నుంచి బాటిల్లో నీళ్లు నింపుకుంది. ఆపై తనతో ఉన్న ఇద్దరినీ నిద్రలేపింది. వారంతా ధర్మారెడ్డి కదలికలను గమనించారు. – 12.10: ముగ్గురు మహిళలు వెళ్లిపోయారు. – 12.13: ధర్మారెడ్డి చేతిలో టవల్‌తో వెళ్లారు. సివిల్ కేసులో పోలీసుల ప్రమేయమేంటి? మాకు ఎలాంటి సంబంధం లేని తహసీల్దార్ నాగరాజు కేసులో మా నాన్న, అన్నయ్యను పోలీసులు కొందరు పెద్దల ఒత్తిడితో ఇరికించారు. కావాలని సివిల్ కేసును క్రిమినల్ కేసుగా మార్చారు. ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి. – ఉమాదేవి, మృతుడి చిన్న కుమార్తె అంత్యక్రియలకు నా కొడుకును పంపించండి కొందరి ఫిర్యాదుతో నా భర్తను, కొడుకును అన్యాయంగా అరెస్ట్ చేశారు. సదరు భూమి పత్రాలు ఎక్కడంటూ నా భర్త ధర్మారెడ్డిని ఏసీబీ అధికారులు బెదిరించారు. నా భర్త అంత్యక్రియల కోసం కుమారుడు శ్రీకాంత్‌రెడ్డిని పంపించాలి. అప్పటివరకు మృతదేహాన్ని ఇక్కడే ఉంచుతాం. – వెంకటమ్మ, మృతుడి భార్య -
వేధింపులతోనే ఆత్మహత్య: ధర్మారెడ్డి భార్య
సాక్షి, హైదరాబాద్ : కీసర తహసీల్దార్ నాగరాజు కేసులో తన భర్తను పోలీసులు వేధించారని ఆత్మహత్య చేసుకున్న ధర్మారెడ్డి భార్య వెంకటమ్మ ఆరోపించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ధర్మారెడ్డి ఆదివారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మృతుడి భార్య మాట్లాడుతూ.. ‘భూ వివాదంలో నా భర్తను అన్యాయంగా అరెస్ట్ చేశారు. తహసీల్దార్ నాగరాజుకు, నా భర్తకు సంబంధం లేదు. మా ఇంట్లో సోదాల్లో ఎలాంటి పాస్‌బుక్ దొరకలేదు. (నాగరాజు కేసు : మరో వ్యక్తి ఆత్మహత్య) జైలు నుంచి బయటకు వచ్చాక నా భర్త తీవ్ర మనస్తాపం చెందారు. బెయిల్‌పైన వచ్చాక కూడా రోజు పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంతకాలు పెట్టాలని పోలీసులు వేధించారు. నా భర్తను కలిసి బయటకి వచ్చిన తర్వాత రోజు నాగరాజు జైలులో ఆత్మహత్య చేసుకున్నట్లు వార్త విన్నాం. ఓ వైపు పోలీసుల వేధింపులు, మరోవైపు భవిష్యత్‌లో ఏమవుతుందో అనే భయంతోనే నా భర్త ఆత్మహత్య చేసుకున్నాడు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్మారెడ్డి కుమార్తెలు మాట్లాడుతూ... ‘మా నాన్నపై కక్ష కట్టి కేసులు పెట్టారు. జైలు నుంచి బయటకి వచ్చాక మనస్తాపం చెందాడు. తన మర్యాద మొత్తం పోయిందని బాధపడ్డాడు. కందాడి భూపాల్ రెడ్డి, లక్ష్మారెడ్డితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు మా నాన్నపై ఫిర్యాదు చేశారు. ఏసీబీ, విజిలెన్స్ అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చి కేసు పెట్టించారు. కేఎల్ఆర్ మా భూమిని కబ్జా చేసి వేధించారు. నాగరాజుకు మా నాన్నకు పెద్ద పరిచయం కూడా లేదు. జైలు నుంచి వచ్చాక నేను ఎందుకు బతకాలి... చనిపోతా అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. నిన్న ఇంటి నుంచి బయటకు వెళ్లి మా నాన్న తిరిగి రాలేదు. ఉదయం చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం’ అని అన్నారు. కాగా ఇదే కేసులో అరెస్ట్ అయిన ధర్మారెడ్డి కుమారుడు శ్రీధర్ రెడ్డికి బెయిల్ లభించకపోవడంతో జైలులోనే ఉన్నాడు. ధర్మారెడ్డి మృతదేహానికి శవ పరీక్ష పూర్తయ్యింది. అసిస్టెంట్ దాక్టర్ లావణ్య మరియు 5దు గురు పీజీ డాక్టర్స్ బృందం పోస్ట్‌మార్టం నిర్వహించింది. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
కుషాయిగూడలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య
-
నాగరాజు కేసు : మరో వ్యక్తి ఆత్మహత్య
సాక్షి, మేడ్చల్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కీసర తహసీల్దార్ కోటి రూపాయల లంచం కేసులో మరో నిందితుడు ఆత్మహత్య చేసుకున్నారు. నాగరాజు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ధర్మారెడ్డి ఆదివారం తెల్లవారుజామున ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కోటి రూపాయల లంచం కేసులో ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చిన ధర్మారెడ్డి కుషాయిగూడ, వాసవి శివ నగర్‌లోని శివాలయంలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భూమి అక్రమ మోటేషన్ ఆరోపణతో ఏసీబీ ఇతన్ని అరెస్ట్ చేయగా.. 33 రోజుల పాటు జైలు జీవితం గడిపాడు. ప్రస్తుతం ఆయన వయసు 80 ఏళ్లు. ఇదే కేసులో అరెస్ట్ అయిన దర్మారెడ్డి కుమారుడు శ్రీధర్ రెడ్డికి బెయిల్ రాకపోవడంతో ఇంకా జైల్లోనే ఉన్నాడు. కాగా కోటి రూపాయల కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కీసర మాజీ ఎమ్మార్వో నాగరాజు ఇటీవల జైల్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం తెలిసిందే. ఒకే కేసులో ఇద్దరు నిందితులు వరుగా ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేకిత్తిస్తోంది. మరోవైపు వీరి మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
మేడ్చల్ రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం
సాక్షి, మల్కాజ్గిరి: మేడ్చల్ రైల్వేస్టేషన్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న సూపర్ ఫాస్ట్ ట్రైన్లో నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఓ బోగి నుంచి మరో బోగికి మంటలు అంటుకున్నాయి. వెంటనే అప్రమత్తమయిన ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. అయితే అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. -
దేశానికి మార్గదర్శకం
-
నాగరాజు రెండో లాకర్లో భారీగా బంగారం
సాక్షి, హైదరాబాద్: కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు బినామీ ఖాతాలో భారీగా బంగారం బయటపడింది. నాగరాజు బినామీ అయిన అల్వాల్‌కు చెందిన నందగోపాల్ అనే వ్యక్తి ఇంటిపై ఏసీబీ అధికారులు సోమవారం దాడులు చేసిన విషయం తెలిసిందే. ఆ దాడుల్లో నందగోపాల్ పేరిట అల్వాల్‌లోని ఐసీఐసీఐ బ్యాంకులో ఒక లాకర్, పీజే మహేందర్ కుమార్ పేరిట మేడ్చల్‌లోని ఐసీఐసీఐ బ్రాంచ్‌లో మరో లాకర్‌ను కూడా నాగరాజు, అతని భార్య స్వప్న వాడుతున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆ లాకర్లను గురువారం అధికారులు తెరవగా నందగోపాల్ పేరిట ఉన్న లాకర్లో రూ.60 లక్షల విలువైన ఒక కిలో 250 గ్రాముల బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. నాగరాజుకు సంబంధించి ఇది రెండో లాకర్ కాగా, మూడో లాకర్లో రూ.4.5 లక్షల విలువచేసే 7.29 కిలోల బరువున్న 35 వెండిబిస్కట్లు బయటపడ్డాయి. వాటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, మొదటి లాకర్ అల్వాల్‌లోని సౌత్ ఇండియన్ బ్యాంకులో నాగరాజు సమీప బంధువు నరేందర్ పేరిట ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. సెప్టెంబర్ 2న ఈ లాకర్‌ను తెరిచిన ఏసీబీ రూ.57.6 లక్షల విలువ చేసే కిలోన్నర బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. -
నాగరాజు లాకర్లలో భారీగా బంగారం
సాక్షి, మేడ్చల్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు కోటి రూపాయల అవినీతి కేసులో ఏసీబీ దూసుడు పెంచింది. విచారణ ఎదుర్కొంటూ ఇటీవల ఆయన ఆత్మహత్యకు పాల్పడటంలో కేసును మరింత వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే అల్వాల్ ఐసీఐసీఐ బ్యాంక్‌లో నాగరాజు లాకర్లను ఏసీబీ అధికారులు ఓపెన్ చేశారు. నాగరాజు బినామీ నందగోపాల్ పేరుతో ఉన్న ఈ లాకర్లో దాదాపు కేజీకిపైగా బంగారు ఆభరణాలను గుర్తించారు. బినామీ పేరుతో పెద్ద ఎత్తున్న ఆస్తులు కూడబెట్టినట్టు గుర్తించి ఏసీబీ... ఇతర ఖాతాలపై విచారణ చేస్తున్నారు. రెండు రోజలు క్రితం నందగోపాల్ నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహించగా.. లాకర్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు లాకర్లు ఓపెన్ చేయగా.. పెద్ద ఎత్తున బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కాగా ఇంతకుముందు మరో బ్యాంక్ లాకర్లలో రెండు కేజీల బంగారాన్ని సీజ్ చేసిన విషయం తెలిసిందే. (కీసర ఎమ్మార్వో మృతిపై సంచలన ఆరోపణలు) ఆగస్టు 14వ తేదీన నాగరాజు ఇంటిపైన దాడి చేసిన సమయంలో ఏసీబీ అధికారులకు ఓ బ్యాంకు లాకర్‌కు చెందిన తాళంచెవి లభించింది. అది నాగరాజు బంధువైన జి.జే.నరేందర్ పేరిట అల్వాల్‌లోని సౌత్ ఇండియన్ బ్యాంకు లాకర్‌గా ఏసీబీ గుర్తించింది. ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించిన సమయంలోనూ నాగరాజు లాకర్ విషయంలో సహకరించలేదని సమాచారం. ఎట్టకేలకు సదరు లాకర్‌ను తెరిచిన ఏసీబీ అధికారులకు అందులో 1532 గ్రాముల బంగారు ఆభరణాలు లభించాయి. వాటిని సీజ్ చేసిన ఏసీబీ అధికారులు న్యాయస్థానంలో డిపాజిట్ చేయనున్నారు. ప్రస్తుతం కేసులో పట్టుబడ్డ నిందితులంతా చంచల్ గూడ జైల్లోనే ఉన్నారు. -
కీసర ఎమ్మార్వో మృతిపై సంచలన ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోటి రూపాయల లంచం కేసులో అరెస్ట్అయిన కీసర తహసీల్దార్ నాగరాజు జైల్లో ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. అవినీతి నిరోధక శాఖ నమోదు చేసిన కేసుల్లో విచారణ ఎదుర్కొంటూ ఈనెల 14న చంచల్‌గూడ జైల్లో టవల్‌తో ఉరివేసుకున్న విషయం తెలిసిందే. నాగరాజు ఆత్మహత్యపై కస్టోడియల్ డెత్‌గా కేసుగా నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు సైతం సంచలన వ్యాఖ్యలు చేస్తూ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇది ఆత్మహత్య కాదు ముమ్మాటికీ హత్యనని, సీబీఐ విచారణ కోరుతు హైకోర్టులో పిటీషన్ వేస్తాము తెలిపారు. (కీసర మాజీ తాహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య) ఈ మేరకు శుక్రవారం నాగరాజు కుటుంబ సభ్యులు సాక్షి మీడియాతో మాట్లాడుతూ వారి ఆవేదన వ్యక్తం చేశారు. జైల్లో ఆత్మహత్య ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ‘ఎంతోమంది ఖైదీలు ఉండే జైల్లో ఆత్మహత్య చేసుకోవడం అంత సులభం కాదు. అదీ టవల్‌తో హ్యాంగిగ్ ఎలా చేసుకుంటారు..? పక్కన ముగ్గురు ఖైదీలు వున్నారు. ఆ సమయంలో వాళ్లేంచేశారు. ఏసీబీ కేసుల్లో వాస్తవం లేదు. అందుకు తగ్గ ఆధారాలు మా వద్ద ఉన్నాయి. ఇప్పటికే సీసీ వీడియో ఏసీబీ కోర్టుకి ఇచ్చాము. ధర్మారెడ్డికి భూమి మ్యూటేషన్ కేసులో ఏతప్పు చేయలేదు. రికార్డుల ప్రకారమే నాగరాజు వ్యవహరించారు. ఉద్దేశ పూర్వకంగానే ఈ కేసులో ఇరికించారు. ఈ ఘటనపై హత్యకేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలి. చనిపోడానికి ముందు ఉదయం మాతో ఫోన్లో మాట్లాడాడు. త్వరలోనే వచ్చేస్తున్నా.. ధైర్యంగా ఉండమని చెప్పారు. తాను ఎలాంటి తప్పు చేయలేదు అన్నారు. ప్రభుత్వ ఉధ్యోగులకు ఇలాంటి కేసులు సహజం. న్యాయపరంగా బయటకువచ్చాక పోరాటం చేద్దామన్నారు. ఆత్మహత్య చేసుకునేంత పిరికివారు కాదు. మా అందరికీ ఆయనే దిక్కు. మా పరిస్థితి ఏంటీ’అని ప్రశ్నించారు. మరోవైపు నాగరాజు చనిపోయే ముందు రోజులు కస్టడిలో భాగంగా ఏసీబీ అధికారులు విచారించారు. దీంతో ఆత్మహత్య చేసుకునే ముందు రోజు ఏం జరిగిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాగరాజు ఎవరెవరితో మాట్లాడారు, ఏం చెప్పారు, ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏమై ఉంటాయి అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.