Tree House-Medchal: Tree House Build On Tamarind Tree At Edulabad - Sakshi
Sakshi News home page

Tree House: చింత చెట్టుపై వింత ఇల్లు .. 20 ఏళ్ల క్రితమే!

Published Fri, Apr 22 2022 10:52 AM | Last Updated on Fri, Apr 22 2022 2:24 PM

Medchal: Tree House Build On Tamarind Tree At Edulabad - Sakshi

వింత ఇల్లేంటి.. అని ఆలోచిస్తున్నారా? ఏమీ లేదండి.. నేలపై కాకుండా చెట్టుపై ఇల్లు నిర్మించడంతో అందరూ వింతగాచూస్తున్నారు. అందుకే వింత ఇల్లు అని సంబోధించామంతే. ఓకే.. ఇప్పుడు అసలు విషయానికొద్దాం.. ఇటీవల ట్రీ–హౌజ్, బోట్‌–హౌజ్‌లో విడిది చేయాలనేది ట్రెండ్‌గా మారింది. దీంతో కొన్నేళ్లుగా ట్రీ–హౌజ్, బోట్‌–హౌజ్‌ అనే పదాలు టూర్‌కి వెళ్లాలనుకునే వారి నోళ్లలో నానుతున్న పదాలు. తరచు విహార యాత్రకు వెళ్లే వారు ట్రీ–హౌజ్‌లో విడిది చేస్తూ తమ అనుభూతిని పంచుకుంటున్నారు.

అందరూ ట్రెండ్‌ ఫాలో అవుతారు.. కొందరు మాత్రమే ట్రెండ్‌ సెట్‌ చేస్తారు. రెండు దశాబ్దాల క్రితమే ఓ రియల్టర్‌ తన వెంచర్‌లో చింత చెట్టుపై ట్రీహౌజ్‌ నిర్మించుకుని ట్రెండ్‌ సెట్‌ చేశాడు. దానికి ముద్దుగా ‘టార్జన్‌ ట్రీ–హౌజ్‌’అని పేరు పెట్టుకున్నాడు. మేడ్చల్‌ జిల్లాలోని ఎదులాబాద్‌ ఊరి సమీపంలో చింత చెట్టుపై ఉన్న ఈ ఇల్లు ఇప్పటికీ అందరినీ ఆకట్టుకుంటోంది.  
 – ఘట్‌కేసర్‌ 
చదవండి👉🏼: ఎమ్మెల్యే శంకర్‌నాయకే ఇదంతా చేయించారు: రవినాయక్‌ భార్య పూజ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement