Tree House
-
Photo Feature: చింత చెట్టుపై వింత ఇల్లు .. 20 ఏళ్ల క్రితమే!
వింత ఇల్లేంటి.. అని ఆలోచిస్తున్నారా? ఏమీ లేదండి.. నేలపై కాకుండా చెట్టుపై ఇల్లు నిర్మించడంతో అందరూ వింతగాచూస్తున్నారు. అందుకే వింత ఇల్లు అని సంబోధించామంతే. ఓకే.. ఇప్పుడు అసలు విషయానికొద్దాం.. ఇటీవల ట్రీ–హౌజ్, బోట్–హౌజ్‌లో విడిది చేయాలనేది ట్రెండ్‌గా మారింది. దీంతో కొన్నేళ్లుగా ట్రీ–హౌజ్, బోట్–హౌజ్ అనే పదాలు టూర్‌కి వెళ్లాలనుకునే వారి నోళ్లలో నానుతున్న పదాలు. తరచు విహార యాత్రకు వెళ్లే వారు ట్రీ–హౌజ్‌లో విడిది చేస్తూ తమ అనుభూతిని పంచుకుంటున్నారు. అందరూ ట్రెండ్ ఫాలో అవుతారు.. కొందరు మాత్రమే ట్రెండ్ సెట్ చేస్తారు. రెండు దశాబ్దాల క్రితమే ఓ రియల్టర్ తన వెంచర్లో చింత చెట్టుపై ట్రీహౌజ్ నిర్మించుకుని ట్రెండ్ సెట్ చేశాడు. దానికి ముద్దుగా ‘టార్జన్ ట్రీ–హౌజ్’అని పేరు పెట్టుకున్నాడు. మేడ్చల్ జిల్లాలోని ఎదులాబాద్ ఊరి సమీపంలో చింత చెట్టుపై ఉన్న ఈ ఇల్లు ఇప్పటికీ అందరినీ ఆకట్టుకుంటోంది. – ఘట్కేసర్ చదవండి👉🏼: ఎమ్మెల్యే శంకర్‌నాయకే ఇదంతా చేయించారు: రవినాయక్ భార్య పూజ -
ఆదిత్య ఠాక్రే సంకల్పం: ఉద్యాన వనంలో ‘ట్రీ–హౌస్’.. ప్రత్యేకతలివే..
దాదర్ (ముంబై): బాంద్రాలోని బ్యాండ్‌స్టండ్ ప్రాంతంలో బీఎంసీకి చెందిన ఉద్యాన వనంలో ‘ట్రీ–హౌస్’ రూపుదిద్దుకుంటోంది. పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే సంకల్పంతో ముంబైలో మొదటిసారిగా చేపడుతున్న ఈ ట్రీ–హౌజ్ పర్యాటకులను ఆకట్టుకోనుంది. అందుకు అవసరమైన కోటి రూపాయలు జిల్లా ప్లానింగ్ కమిటీ నిధుల నుంచి సమకూరుస్తున్నారు. పనులు పూర్తయి ట్రీ–హౌస్ వినియోగంలోకి వస్తే స్థానికుతోపాటు పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. కాలక్షేపం కోసం పెద్ద సంఖ్యలో ఇక్కడికి ప్రజలు తరలివచ్చే అవకాశం ఉంది. ముంబైని స్వచ్ఛంగా, సౌందర్యంగా తీర్చిదిద్దడంతోపాటు పర్యాటక ప్రాంతాలను మరింత అభివృద్ధి చేయాలని ఆదిత్య ఠాక్రే సంకల్పించారు. అందులో భాగంగా ముంబైలో అక్కడక్కడ పర్యాటక, ఉద్యానవనాల్లో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. అందులో భాగంగా పశ్చిమ బాంద్రాలోని బ్యాండ్‌స్టండ్ సముద్ర తీరం వద్ద ఏర్పాటు చేసిన ట్రీ–హౌస్ పనులు జోరుగా సాగుతున్నాయని బీఎంసీ అసిస్టెంట్ కమిషనర్ కిరణ్ దిఘావ్కర్ అన్నారు. ఇలాంటి ట్రీ–హౌస్ ముంబైలో ఇదే తొలిసారి అని, పర్యాటకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రత్యేకతలివే.. ►ట్రీ–హౌస్‌ను పూర్తిగా కలపతో నిర్మిస్తున్నారు. ఇందులోకి నేలపై నుంచి వెళ్లేందుకు నిచ్చెన అందుబాటులో ఉంటుంది. అంతేగాకుండా పక్కనే ఉన్న మరో చెట్టు పైనుంచి కూడా ట్రీ–హౌస్‌లోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ►ఎదురుగా సముద్రం, సుమారు 500 చదరపు మీటర్ల స్ధలంలో దీన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని పిల్లలు, పర్యాటకులు, ముంబైకర్లు సందర్శించి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు. ►ఫొటోలు దిగేందుకు సెల్ఫీ పాయింట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ►పచ్చదనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో పర్యాటకులకు అడవిలో ఉన్న అనుభూతి కలుగుతుంది. -
కరోనా కాలం: చెట్టుపైనే మకాం!
తెలుగులో వచ్చిన చెట్టు కింద ప్లీడరు సినిమా చాలా మంది చూసే ఉంటారు. కానీ చెట్టుపైనే నివసించే నల్లకోటాయన్ని చూశారా? కరోనా కాలంలో అలాంటాయన యూపీలో కనిపించారు. హాపూర్: కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్న నేపథ్యంలో మనుషుల మధ్య భౌతిక దూరం పాటించాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో ఎవరికి తోచినట్టుగా వారు భౌతిక దూరం పాటిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన న్యాయవాది ఒకరు వినూత్నంగా ఆలోచించి ఏకంగా చెట్టుపైన ఆవాసం ఏర్పచుకున్నారు. చెట్టునే నివాసంగా మార్చుకుని కాలం గడుపుతున్నారు. ముకుల్ త్యాగి అనే న్యాయవాది హాపూర్ సమీంలోని అశోధ గ్రామంలో చెట్టుపై కట్టెలు, గడ్డితో మంచె నిర్మించుకున్నారు. నిచ్చెన సాయంతో దానిపైకి ఎక్కి పుస్తకాలు చదువుతూ, హాయిగా నిద్రపోతూ కాలం గడిపేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భౌతిక దూరం పాటించేందుకు చెట్టునే ఇల్లుగా చేసుకుని జీవిస్తున్నానని ‘ఏఎన్ఐ’తో ముకుల్ త్యాగి చెప్పారు. తన కుమారుడి సహాయంతో చెట్టుపై మంచె నిర్మించానని వెల్లడించారు. ‘చెట్టుపై ఇల్లు కట్టుకోవాలని మా నాన్న ఆలోచించారు. ఎండిన చెట్ల కొమ్మలను సమానంగా నరికి వీటిని తాడు సహాయంతో సమాంతరంగా కట్టాము. దానిపై గడ్డివేసి మంచెలా తయారు చేశాం. చెట్టుపై కట్టడం గొప్ప అనుభూతి. ఇక్కడ ఉంటే ప్రకృతికి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. అంతేకాదు ఎటువంటి కాలుష్యం లేకుండా హాయిగా ఉంటుంది. ఈ అనుభూతిని ఎంతో ఆస్వాదిస్తున్నాను’ అని త్యాగి కుమారుడు అన్నారు. ఇంటి దగ్గర నుంచి ఇక్కడికే భోజనం తెప్పించుకుంటున్నానని ముకుల్ వెల్లడించారు. ఇదంతా చూసిన స్థానికులు ‘చరిత్ర పునరావృతం కావడం’ అంటే ఇదేనేమో అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటివరకు 410 మంది కోవిడ్ బారినపడ్డారు. కరోనా: మాస్క్ పెట్టుకోలేదని.. -
అమ్మ బ్యాంబోయ్!
మేకుల్లేవ్... స్క్రూలు లేవ్.. అంతా వెదురే! అన్నంతస్తుల బ్యాంబూ ఇల్లు. అయినా ఇల్లంటే... ఇటుకలుండాలి. సిమెంటు వాడాలి. ఉక్కు కడ్డీలతో స్తంభాలు కట్టాలి. కాంక్రీట్‌తో పైకప్పు వేయాలి. ఇదీ మనకు తెలిసిన ఇల్లు! కానీ బీజింగ్ నిర్మాణ సంస్థ పెండా ఇవేమీ లేకుండానే ఇల్లు కట్టేస్తానంటోంది. కనీసం మేకులు, స్క్రూలు కూడా ముట్టుకోకుండా కట్టేస్తుందట. ఎలా అంటారా? వెదురు బొంగులు, తాళ్లూ మాత్రమే వాడుతూ! ఏదో ఒకట్రెండు ఇళ్లు మాత్రమే కాదు... ఒకదానిమీద ఒకటిగా అపార్ట్మెంట్ల తరహాలో కావల్సినన్ని అంతస్తుల్లో ఈ వెదురు ఇళ్లను కట్టేస్తాం అంటోంది పెండా. స్టీల్ కంటే రెండు మూడు రెట్లు ఎక్కువ బలమైన (బరువు ఆధారంగా) వెదురును కావాల్సిన రీతిలో అటూ ఇటూ వంచేయవచ్చునన్నది తెలిసిందే. ఎనిమిది వెదురు గడలను ఒక పద్ధతి ప్రకారం అమర్చడం ద్వారా ఈ ట్రీహౌస్ తాలూకూ స్తంభాలు సిద్ధమవుతాయి. అవసరమైనన్ని స్తంభాలను ఏర్పాటు చేసుకుని నిర్మాణాన్ని మొదలుపెడతారు. ఈ స్తంభాల్లోని వెదురు గడలు అన్ని దిక్కుల్లోనూ ఉంటాయి కాబట్టి.. మనకు అవసరమైన దిక్కులో మరికొన్ని గడలను చేర్చి తాళ్లతో బంధించడం ద్వారా నిర్మాణాన్ని విస్తరించవచ్చు. ఒక్కో అంతస్తూ 13 అడుగుల ఎత్తు ఉంటుందట. అవసరాన్ని బట్టి అంతస్తులను ఎక్కువ చేసుకోవచ్చు. లోపలి భాగాన్ని చిన్న చిన్న రూములుగా, ఇళ్లుగా, రెస్టారెంట్లు, మీటింగ్హాల్స్గా వేర్వేరు అవసరాల కోసం వాడుకోవచ్చు. దాదాపు 20 ఇళ్లు ఉన్న ఓ కాంప్లెక్స్‌ను ఒకట్రెండేళ్లలో నిర్మిస్తామని, 2023 నాటికల్లా కనీసం 20 వేల మంది నివసించగల వెదురు అపార్ట్మెంట్ల నగరాన్ని నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నామని అంటోంది పెండా. అమ్మ ‘బ్యాంబో’య్... భలే ఉంది కదూ! కాంక్రీట్ జంగిల్‌ను వదిలేసి మనం కూడా ఇలాంటి హరిత నివాసాలను నిర్మించుకుందామా! -
కుట్రీరం
నీడ నుంచి ఓడ దాకా పచ్చని చెట్టు ఇచ్చే ప్రతిఫలాలకు లెక్కేలేదు. చెట్టుకీ మనిషికి ఉన్న అనుబంధాన్ని కాంక్రీట్ జంగిల్ కాసింత తగ్గించగలదే కాని తుడిచేయలేదు. ఆ విషయాన్ని మరోసారి నిరూపిస్తున్నాయి ఈ ట్రీహౌస్‌లు. సిటీలో ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న ఈ ట్రెండ్.. పచ్చదనం నీడలో పయనించాలనే మనిషి ఆకాంక్షకు అచ్చమైన ప్రతిరూపంగా నిలుస్తోంది. - ఎస్.సత్యబాబు ఇల్లు, ఆఫీస్, హోటల్స్, థియేటర్స్.. ఇలా సిటీవాసి వెళ్లే ప్రతి చోటు సిమెంట్ మేటలు పరుచుకుని సహజత్వాన్ని దూరం చేసేవే. పార్క్‌లు మినహాయిస్తే.. పది రూపాయలు ఎక్కువ ఇస్తామన్నా.. ప్రకృతి చిరునామా ఇక్కడ దొరకడం కష్టమే. వెదురుతో వెలిసిన ట్రీహౌస్‌లు ఈ సమస్యకు చెక్ పెడుతున్నాయి. ఆధునికతను అందిపుచ్చుకున్న వెదురు.. ఓ చెట్టునీడలో కుటీరాల్లా వెలిసి.. చూడముచ్చటగా కనిపిస్తున్నాయి. పల్లె పొలాల్లో.. రైతులు నిర్మించుకునే మంచెలను తలపిస్తూ.. పట్నవాసంలో పల్లెవాసనలు తీసుకొస్తున్నాయి. భూమికి కాసింత ఎత్తులో ఉండే ఈ ట్రీ హౌస్‌ను చూడగానే సగం రిలాక్స్ అయిపోతాం. ఎంత సేపయినా హాయిగా.. ‘నేను ఈ హౌస్ కట్టినప్పుడు నందివర్ధనం చెట్టు ఉండేది. ఒక కొమ్మ కొట్టేసి కట్టాం. ఇప్పుడు ఆ నందివర్ధనం బాగా పెరిగి ట్రీ హౌస్ పైకి వచ్చేసింది. చూడముచ్చటగా ఉంటుంది. ఈ ట్రీహౌస్‌లో ఎంతసేపైనా గడిపేయవచ్చు’ అంటూ తన ట్రీహౌస్ ప్రత్యేకతను వివరిస్తారు కొత్తపేటకు చెందిన డాక్టర్ సూర్యప్రకాశ్. కూకట్‌పల్లిలోని ఆలంబన ఎన్జీవో నిర్వాహకురాలు శిరీషకు ఈ ట్రీహౌస్ అంటే చాలా ఇష్టం. ‘మా స్కూల్ ఎదుట దీన్ని మూడేళ్ల కిందట కట్టాం. మా పిల్లలకు ఇది మంచి రిక్రియేషన్ ప్లేస్. నేల నుంచి 15 అడుగుల ఎత్తులో నిర్మించిన కుటీరంలో కూర్చునేందుకు ఇక్కడి విద్యార్థులతో పాటు టీచర్లు కూడా పోటీపడుతుంటారు. ట్రీహౌస్ కట్టే సమయంలో ఇక్కడో పెద్ద చెట్టు ఉండేది. ఇటీవల ఆ చెట్టు కొట్టివేయడంతో ట్రీ హౌస్ కొంత బోసిపోయినా.. ఇప్పటికీ ఇది బెస్ట్ మీటింగ్ పాయింట్‌గా నిలుస్తోంది. మా విద్యార్థులు హోమ్‌వర్కులు చేసుకోవాలన్నా.. చదువుకోవాలన్నా.. ఇక్కడికే వచ్చేస్తుంటార’ని తెలిపారు శిరీష. గృహస్థు ఆశ్రమం.. ఎన్జీవోల నుంచి ప్రారంభమైన ఈ ట్రీ హౌస్‌ల ట్రెండ్.. ఇప్పుడు వ్యక్తిగత ఇళ్లకు కూడా విస్తరించింది. వ్యక్తిగత విశ్రాంతి నిలయంగా, రొటీన్‌కు భిన్నమైన ఆవాసంగా నగరవాసులు దీనిని భావిస్తున్నారు. అదే కోవలో ‘మంచిపుస్తకం’ పబ్లిషర్ అయిన సురేష్ కొసరాజు నాగోల్‌లోని తన ఇంటి టై మీద ఈ తరహా ఇల్లు కట్టుకుంటే.. వనస్థలిపురంలోని హస్తినాపురంలో నివసించే విమలాచార్య మామిడి చెట్టు కింద కట్టుకున్నారు. అస్సాం అయితే బెస్ట్.. ప్రస్తుతం నగరంలో నిర్మితమవుతున్న ట్రీ హౌస్‌లకు అస్సాం నుంచి వచ్చిన వెదురునే ఉపయోగిస్తున్నారు. మన దగ్గర లభించే వెదురుతో పోలిస్తే థిక్నెస్ ఎక్కువుంటుందని, మరింత బలమైనదని అంటున్నారు. ఎక్కువ బరువును భరించడంతో పాటు.. పురుగులు కూడా పట్టవని చెబుతున్నారు. భూమిలోకి రెండున్నర అడుగులు, పైకి 5 అడుగులు మొత్తం 8 అడుగుల్లో రూపొందించగలిగిన ఈ ట్రీ హౌస్ నిర్మాణానికి అయ్యే వ్యయం రూ.20 వేలలోపే. విరివిగా కట్టాలి.. నగరంలో గూడులేని వారెందరో ఫుట్‌పాత్‌లపైనే విశ్రమిస్తుంటారు. అలాంటి వారికి ఈ ట్రీ హౌస్‌లు అందుబాటులోకి తీసుకురాగలితే వారికి ఎంతో మేలు చేసిన వారం అవుతాం. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు తలుచుకుంటే, ట్రీ హౌస్‌లను విరివిగా కడితే ఎందరికో ఉపకరిస్తుంది. -డా.సూర్యప్రకాష్, ఓపెన్ హౌస్ చారిటీ సంస్థ నిర్వాహకుడు