ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లో కట్టేసి చిత్రహింసలు | 3 People Tortured Man For Harassing Woman In Medchal | Sakshi
Sakshi News home page

ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లో కట్టేసి చిత్రహింసలు

Published Sun, Feb 28 2021 3:45 PM | Last Updated on Sun, Feb 28 2021 6:28 PM

3 People Tortured Man For Harassing Woman In Medchal - Sakshi

సాక్షి, మేడ్చల్‌ : మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ వ్యక్తిని మాట్లాడదామని పిలిచి చిత్రహింసలు పెట్టారు ముగ్గురు వ్యక్తులు. ఈ సంఘటన మేడ్చల్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. మేడ్చల్ జిల్లా చర్లపల్లి ఈసీ నగర్‌కు చెందిన లింగాస్వామి అనే వ్యక్తి ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  కుషాయిగూడ పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు లింగాస్వామిని అదుపులోకి తీసుకుని విచారించారు. మరుసటి రోజు రమ్మని చెప్పి పంపేశారు. ఈ నేపథ్యంలో ముగ్గురు వ్యక్తులు లింగాస్వామిని మాట్లాడదామని కారులో తీసుకెళ్లారు.

చర్లపల్లి ఈసీ నగర్‌లోని ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో లింగా స్వామి నోట్లో గుడ్డలు కుక్కి, కట్టేసి చితకబాదారు. ఆ రాత్రి మొత్తం కారులో తిప్పి  బాగా కొట్టి వదిలేశారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో వెలుగులోకి రావటంతో బాధితుని తమ్ముడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్‌ చేసిన పోలీసులు విచారిస్తున్నారు.

చదవండి : నిందితుడి ఆత్మహత్య.. ఎస్‌ఐ సస్పెన్షన్‌

భార్య ఫిర్యాదు, ఆందోళనతో భర్త ఆత్మహత్యాయత్నం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement