
మన ఆరోగ్య సంరక్షణలో తాజా కూరగాయలు, పండ్లకు ఉన్న ప్రాధాన్యతే వేరు. ఆరోగ్యంగా ఉండాలంటే పండ్లు, కూరగాయలు తినాలని ఆరోగ్యనిపుణులు చెబుతారు. అయితే ఉదయం పూట ఖాళీ కడుపుతో కొన్ని పండ్లు తింటే అదనపు ప్రయోజనం ఉంటుందని మీకు తెలుసా. రోజు ఉప్మా, ఇడ్లీ లాంటివి తిని బోర్ కొట్టిందా? మరింత ఆరోగ్యంగా ఉండేందుకు పండ్లను తీసుకోవాలని భావిస్తున్నారా. ఖాళీ కడుపుతో శక్తికి గేమ్-ఛేంజర్‌గా పనిచేసే కొన్ని పండ్ల గురించి తెలుసుకుందాం.
ఉదయాన్నే పండ్లు తీసుకోవడంతో రోజంతా ఫ్రెష్ గా, ఎనర్జిటిక్‌గా ఉంటారు. శరీరానికి మంచి శక్తిని ఇస్తాయి. ఖాళీ కడుపుతో కొన్ని పండ్లను తీసుకుంటే మంచి పోషకాలు లభిస్తాయి. మలబద్దకం, కడుపు కేన్సర్, డయేరియా, ఎముకల ఆరోగ్యం, మెదడు ఆరోగ్యం, చర్మం, జుట్టు ఆరోగ్యానికి మంచిది. జీర్ణక్రియ అద్భుతంగా పని చేస్తుంది. రక్తపోటును నియంత్రించవచ్చు. పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ మెరుస్తూ, యవ్వనంగా కనిపిస్తారు. ముఖ్యంగా అధిక బరువును నియంత్రించుకోవచ్చు.
పుచ్చకాయ: జ్యూసీ జ్యూసీగా పుచ్చకాయశరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. రిఫ్రెషింగ్ రుచితోపాటు, మంచి హైడ్రేటింగ్‌గా పనిచేస్తుంది. ఇందులో 92 శాతం నీరు ఉండటం వల్ల ఉదయం తీసుకుంటే చాలా హైడ్రేటింగ్‌గా ఉంటుంది. పుచ్చకాయలో లైకోపీన్ కూడా అధికంగా ఉంటుంది. ఇది గుండె, చర్మాన్ని రక్షించడంలో సహాయపడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. లిక్విడ్స్, ఎలక్ట్రోలైట్లతో నిండిన పుచ్చకాయతో రోజును ప్రారంభించడం వల్ల రోజంతా హైడ్రేట్‌గా ఉండేందుకు ఉపయోగపడుతుంది.
బొప్పాయి: బొప్పాయిలో పపైన్, కైమోపాపైన్ వంటి ఎంజైమ్‌లు పుష్కలంగా లభిస్తాయి. కేలరీలు తక్కువగా, ఫైబర్ అధికంగా ఉండే బొప్పాయి చాలా ఆరోగ్యప్రయోజనాలున్నాయి. విటమిన్లు A, C , E లతో నిండిన బొప్పాయితో బరువు కూడా తొందరగా తగ్గుతాం. ఇందులోని ఎంజైమ్‌లు జీర్ణక్రియకు మంచిది. మలబద్ధకాన్ని నివారించడానికి తోడ్పడతాయి. మెరుగైన జీర్ణక్రియను ప్రోత్సహించి, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి.
పైనాపిల్ : విటమిన్ సి , మాంగనీస్ పుష్కలంగా లభించే పైనాపిల్ రోగనిరోధక వ్యవస్థకు ఒక సూపర్ హీరో అని చెప్పవచ్చు. ఎముకలను బలోపేతం చేస్తుంది. ఉబ్బరం , వాపు కూడా తగ్గుతుంది.
ఆపిల్స్: పెక్టిన్ తో నిండిన ఆపిల్స్ జీర్ణక్రియకు సహాయపడతాయి. ఆకలికి తట్టుకుంటుంది. క్వెర్సెటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు బోనస్.మెదడు పనితీరును ,మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
చదవండి: ఐశ్వర్యరాయ్ బాడీగార్డ్ వేతనం ఎంతో తెలుసా? సీఈవోలకు మించి
కివి: విటమిన్లు, ఖనిజాలు, ఎంజైమ్‌లతో నిండిన కివీ పండ్లు చాలా శక్తినిస్తాయి. ఈ పండు రోగనిరోధక శక్తిని మెరుగు పరుస్తుంది. చర్మ ఆరోగ్యం , జీర్ణక్రియకు అద్భుతాలు చేస్తుంది. ఇందులో జీర్ణక్రియకు సహాయపడే ఎంజైమ్యాక్టినిడిన్ కూడా ఉంటుంది. ఉదయమే ఈ పండును తినడం అంటే పోషకాలతో కూడిన ఫుడ్‌ను శరీరానికి అందించడమే.
అరటిపండ్లు: అరటిపండ్లు పొటాషియానికి గొప్ప మూలం. ఇవి గుండెకు మంచిది. ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేయడానికి , కండరాల పనితీరుకు ఇది అవసరం. ఈ పండ్లలో కార్బోహైడ్రేట్లు సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి సులభంగా జీర్ణమవుతాయి.
బెర్రీ: కడుపు నిండిన అనుభూతికోసం ఈ పండ్లు ఉత్తమం. విటమిన్లు సి , కె, అలాగే పొటాషియం, కాపర్ అధికంగా ఉంటాయి. ఆరోగ్యానికి, ముఖ్యంగా మూత్రపిండాలు, ప్రేగులు, గుండెకు ప్రయోజనకరంగా ఉంటాయి. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, రాస్ప్బెర్రీస్ వంటి బెర్రీలు యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి, ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడానికి, రోగనిరోధక వ్యవస్థకు బలాన్నిస్తాయి కణాలను దెబ్బతినకుండా కాపాడటానికి సహాయపడతాయి.