Empty
-
సమ్మర్ : ఉదయాన్నే ఈ ఫ్రూట్స్ తీసుకుంటే యవ్వనంగా మెరిసిపోవాల్సిందే!
మన ఆరోగ్య సంరక్షణలో తాజా కూరగాయలు, పండ్లకు ఉన్న ప్రాధాన్యతే వేరు. ఆరోగ్యంగా ఉండాలంటే పండ్లు, కూరగాయలు తినాలని ఆరోగ్యనిపుణులు చెబుతారు. అయితే ఉదయం పూట ఖాళీ కడుపుతో కొన్ని పండ్లు తింటే అదనపు ప్రయోజనం ఉంటుందని మీకు తెలుసా. రోజు ఉప్మా, ఇడ్లీ లాంటివి తిని బోర్ కొట్టిందా? మరింత ఆరోగ్యంగా ఉండేందుకు పండ్లను తీసుకోవాలని భావిస్తున్నారా. ఖాళీ కడుపుతో శక్తికి గేమ్-ఛేంజర్‌గా పనిచేసే కొన్ని పండ్ల గురించి తెలుసుకుందాం.ఉదయాన్నే పండ్లు తీసుకోవడంతో రోజంతా ఫ్రెష్ గా, ఎనర్జిటిక్‌గా ఉంటారు. శరీరానికి మంచి శక్తిని ఇస్తాయి. ఖాళీ కడుపుతో కొన్ని పండ్లను తీసుకుంటే మంచి పోషకాలు లభిస్తాయి. మలబద్దకం, కడుపు కేన్సర్, డయేరియా, ఎముకల ఆరోగ్యం, మెదడు ఆరోగ్యం, చర్మం, జుట్టు ఆరోగ్యానికి మంచిది. జీర్ణక్రియ అద్భుతంగా పని చేస్తుంది. రక్తపోటును నియంత్రించవచ్చు. పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ మెరుస్తూ, యవ్వనంగా కనిపిస్తారు. ముఖ్యంగా అధిక బరువును నియంత్రించుకోవచ్చు. పుచ్చకాయ: జ్యూసీ జ్యూసీగా పుచ్చకాయశరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. రిఫ్రెషింగ్ రుచితోపాటు, మంచి హైడ్రేటింగ్‌గా పనిచేస్తుంది. ఇందులో 92 శాతం నీరు ఉండటం వల్ల ఉదయం తీసుకుంటే చాలా హైడ్రేటింగ్‌గా ఉంటుంది. పుచ్చకాయలో లైకోపీన్ కూడా అధికంగా ఉంటుంది. ఇది గుండె, చర్మాన్ని రక్షించడంలో సహాయపడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. లిక్విడ్స్, ఎలక్ట్రోలైట్లతో నిండిన పుచ్చకాయతో రోజును ప్రారంభించడం వల్ల రోజంతా హైడ్రేట్‌గా ఉండేందుకు ఉపయోగపడుతుంది.బొప్పాయి: బొప్పాయిలో పపైన్, కైమోపాపైన్ వంటి ఎంజైమ్‌లు పుష్కలంగా లభిస్తాయి. కేలరీలు తక్కువగా, ఫైబర్ అధికంగా ఉండే బొప్పాయి చాలా ఆరోగ్యప్రయోజనాలున్నాయి. విటమిన్లు A, C , E లతో నిండిన బొప్పాయితో బరువు కూడా తొందరగా తగ్గుతాం. ఇందులోని ఎంజైమ్‌లు జీర్ణక్రియకు మంచిది. మలబద్ధకాన్ని నివారించడానికి తోడ్పడతాయి. మెరుగైన జీర్ణక్రియను ప్రోత్సహించి, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి.పైనాపిల్ : విటమిన్ సి , మాంగనీస్ పుష్కలంగా లభించే పైనాపిల్ రోగనిరోధక వ్యవస్థకు ఒక సూపర్ హీరో అని చెప్పవచ్చు. ఎముకలను బలోపేతం చేస్తుంది. ఉబ్బరం , వాపు కూడా తగ్గుతుంది.ఆపిల్స్: పెక్టిన్ తో నిండిన ఆపిల్స్ జీర్ణక్రియకు సహాయపడతాయి. ఆకలికి తట్టుకుంటుంది. క్వెర్సెటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు బోనస్.మెదడు పనితీరును ,మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుంది.చదవండి: ఐశ్వర్యరాయ్ బాడీగార్డ్ వేతనం ఎంతో తెలుసా? సీఈవోలకు మించికివి: విటమిన్లు, ఖనిజాలు, ఎంజైమ్లతో నిండిన కివీ పండ్లు చాలా శక్తినిస్తాయి. ఈ పండు రోగనిరోధక శక్తిని మెరుగు పరుస్తుంది. చర్మ ఆరోగ్యం , జీర్ణక్రియకు అద్భుతాలు చేస్తుంది. ఇందులో జీర్ణక్రియకు సహాయపడే ఎంజైమ్యాక్టినిడిన్ కూడా ఉంటుంది. ఉదయమే ఈ పండును తినడం అంటే పోషకాలతో కూడిన ఫుడ్‌ను శరీరానికి అందించడమే. అరటిపండ్లు: అరటిపండ్లు పొటాషియానికి గొప్ప మూలం. ఇవి గుండెకు మంచిది. ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేయడానికి , కండరాల పనితీరుకు ఇది అవసరం. ఈ పండ్లలో కార్బోహైడ్రేట్లు సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి సులభంగా జీర్ణమవుతాయి.బెర్రీ: కడుపు నిండిన అనుభూతికోసం ఈ పండ్లు ఉత్తమం. విటమిన్లు సి , కె, అలాగే పొటాషియం, కాపర్ అధికంగా ఉంటాయి. ఆరోగ్యానికి, ముఖ్యంగా మూత్రపిండాలు, ప్రేగులు, గుండెకు ప్రయోజనకరంగా ఉంటాయి. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, రాస్ప్బెర్రీస్ వంటి బెర్రీలు యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి, ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడానికి, రోగనిరోధక వ్యవస్థకు బలాన్నిస్తాయి కణాలను దెబ్బతినకుండా కాపాడటానికి సహాయపడతాయి. -
ఖాళీ కడుపుతో వ్యాయామాలు చేయొచ్చా..? నిపుణులు ఏమంటున్నారంటే..
ఖాళీ కడుపుతో వ్యాయామం చేయొచ్చా లేదా అనేది ప్రతి ఒక్కరి మనుసులో మెదిలే సందేహమే ఇది. కొంతమంది వ్యక్తులు వారి జీవక్రియ, శక్తి స్థాయిలను బట్టి వ్యాయామానికి ముందు ఏదైనా తినవలసి ఉంటుంది. ప్రతి వ్యక్తికి పరిస్థితి భిన్నంగా ఉంటుంది. అసలు ఇలా ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం వల్ల మంచిదేనా..? దీని వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాలు గురించి సవివరంగా తెలుసుకుందాం. ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండేందుకు వర్కౌట్లు చేయడం చాలా ముఖ్యం. అయితే ఆరోగ్యకరమైన రీతిలో చేస్తేనే మంచి ఫలితాలను పొందగలుగుతారు. చాలామంది ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడమే మంచిదని గట్టిగా నమ్ముతారు. ఎందుకంటే ఉత్తమ ఫలితాలు పొందేందుకు ఇది సరైనదే కానీ ఇది అందరికీ సరిపోకపోవచ్చు అని చెబుతున్నారు నిపుణులు. కొంతమంది వ్యక్తులు వారి జీవక్రియ, శక్తి స్థాయిలను బట్టి వ్యాయామానికి ముందు ఏదైనా తినవలసి ఉంటుంది. ప్రతి వ్యక్తికి వారి ఆరోగ్య రీత్యా పరిస్థితి భిన్నంగా ఉంటుందనేది గ్రహించాలి. ఖాళీ కడుపుతో వ్యాయామం చేస్తే కలిగే ప్రయోజనాలు..ఖాళీ కడుపుతో వ్యాయామం చేస్తే.. దాన్ని ఫాస్టెడ్ కార్డియో అంటారు. ఇలా చేస్తే తిన్న ఆహారానికి బదులుగా నిల్వ చేయబడిన కొవ్వు, కార్బోహైడ్రేట్ల నుంచి శరీరం శక్తిని ఉపయోగించుకుంటుంది. బరువు తగ్గడం సులభమవుతుంది గానీ కొందరిలో ఇది అధిక కొవ్వు నష్టానికి దారితీయొచ్చు.ఉపవాస స్థితిలో ఉన్నప్పుడు వ్యాయామాలు బరువు నిర్వహణకు సహాయపడుతుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. 2016 నుంచి జరిపిన అధ్యయనం ప్రకారం, వ్యాయామం చేసే ముందు అల్పాహారం తీసుకోని వ్యక్తులు ఎక్కువ కొవ్వును కరిగిస్తారని తేలింది. అయితే ఈ వాస్తవాన్ని తోసిపుచ్చే ఒక అధ్యయనం ఇటీవల ఒకటి వెలుగులోకి వచ్చింది. 2014 అధ్యయనం ప్రకారం, వ్యాయామం చేసే ముందు తిన్న లేదా ఉపవాసం ఉన్న సమూహాల మధ్య శరీర కూర్పు మార్పులలో గణనీయమైన తేడా లేదు. అధ్యయనం కోసం, పరిశోధకులు నాలుగు వారాల పాటు శరీర బరువు, కొవ్వు శాతం, నడుము చుట్టుకొలతలను తీసుకున్నారు. అయితే అధ్యయనంలో ఈ రెండు గ్రూపులు బరువు, కొవ్వు ద్రవ్యరాశిని కోల్పోయినట్లు పరిశోధకులు గుర్తించారు.ఇక్కడ ఖాళీ కడుపుతో వ్యాయామం చేసినప్పుడు శరీరం ప్రోటీన్‌ను శక్తి వనరుగా ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంది. ఇది కండరాలను నిర్మించడానికి, మరమ్మత్తు చేయడానికి సహాయపడుతుంది.ఖాళీ కడుపుతో పని చేయడం వల్ల శరీరం తక్కువ శక్తిని కలిగి ఉంటుంది. అలాగే వ్యాయామానికి ముందు తినకపోతే స్ప్రుహ కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక్కోసారి రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోయి తలనొప్పి, వికారంకు దారితీస్తుంది.వ్యాయామానికి ముందు తినడం వల్ల కలిగే ప్రయోజనాలువర్కౌట్లకు ముందు ఆహారం తీసుకోవడం వల్ల వర్కౌట్లు చేయగలిగేలా శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది. ముఖ్యంగా కార్బోహైడ్రేట్లను తీసుకున్నప్పుడు శరీరం దానిని గ్లూకోజ్‌గా మారుస్తుంది. ఇది ప్రాధమిక శక్తి వనరుగా పనిచేసి ఎక్కవ వర్కౌట్లు చేసేందుకు ఉపయోగపడుతుంది.అంతేగాదు కండరాల సంరక్షణలో సహాయపడుతుంది. ఇక్కడ శారీరక శ్రమ చేసినప్పుడు,శరీరం శక్తి నిల్వల కోసం చూస్తుంది. ఎప్పుడైతే తినకుండా వ్యాయామాలు చేస్తామో అప్పుడూ కండరాల కణజాలం విచ్ఛిన్నం కావడం మొదలై కండరాల నష్టానికి దారి తీస్తుంది. అందువల్ల, వ్యాయామానికి ముందు తింటే ఇలాంటి నష్టాన్ని నివారించవచ్చు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులు ఎలాంటి ఫుడ్ తీసుకుంటారో తెలుసా..!) -
Empty nest syndrome: పిల్లలు ఎగిరెళ్లాక ఒకరికి ఒకరై
చదువుల కోసమో.. ఉద్యోగాల కోసమో పెళ్లయ్యాక వేరొక చోట ఉండేందుకో పిల్లలు తల్లిదండ్రులను విడిచి వెళతారు. ఆ సమయంలో ఇల్లు ఖాళీ అవుతుంది.. బోసి పోతుంది. తల్లిదండ్రుల జీవితంలో నైరాశ్యం వచ్చే అవకాశం ఉంటుంది. దీనినే ‘ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్’ అంటారు. ఈ సమయంలో భార్యను భర్త, భర్తను భార్య పట్టించుకోకపోతే, కొత్త జీవితం మొదలుపెట్టకపోతే అనేక సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. తల్లిదండ్రులు ఏం చేయాలి? కేస్ స్టడీ 1: దీపావళి పండగ వచ్చింది. అపార్ట్మెంట్లో అందరూ టపాకాయలు కాలుస్తున్నారు. కాని మూర్తి గారు, ఆయన భార్య సరళ గారు మాత్రం కిందకు రాలేదు. సరదాకైనా నిలబడలేదు. మామూలుగా ప్రతి సంవత్సరం వాళ్లు బోలెడన్ని టపాకాయలు కాలుస్తారు. సందడి చేస్తారు. ఈసారి అస్సలు తలుపులే తీయలేదు. కారణం? ఆరు నెలల క్రితమే వాళ్ల ఒక్కగానొక్క కొడుకు ఎం.ఎస్. చేయడానికి యు.ఎస్. వెళ్లాడు. అప్పటి నుంచి వారిలో ఒక రకమైన నిర్లిప్తతను అపార్ట్మెంట్ వాసులు గమనిస్తున్నారు. చివరకు ఆ నిర్లిప్తత పండగల మీద కూడా ఆసక్తిని కోల్పోయేలా చేసింది. కేస్ స్టడీ 2: యాభై ఏళ్ల సీతాదేవికి విపరీతంగా కాలు నొప్పి వస్తోంది. భర్త జానకిరామ్ ఆమెను అన్ని హాస్పిటళ్లకు తిప్పాడు. కాల్లో ఏ సమస్యా లేదు. ఏదైనా ఆందోళన వల్ల వస్తున్న సైకలాజికల్ నొప్పేమోనని డాక్టర్లు అంటున్నారు. సీతాదేవి, జానకిరామ్‌లకు కూతురు, కొడుకు. మొదట కూతురు పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లింది. కొడుకు చదువుకుంటానని స్వీడన్ వెళ్లాడు. అప్పటి నుంచి ఆమెకు తెలియని ఆందోళన. ఒంటరితనం. దిగులు. భర్త ఏదైనా కాలక్షేపం కోసం బయటకు వెళ్లినా ఆమెకు దిగులు ముంచుకొస్తోంది. పిల్లలు లేని ఇల్లు ఆమెకు ఎంతకాలానికీ అలవాటు కావడం లేదు. ‘నెస్ట్’ అంటే గూడు. పిల్లలు లేని గూడు ఎంత లేదన్నా బోసి పోతుంది. తల్లిదండ్రులు... వారు లేని వెలితితో ఇంట్లో మిగులుతారు. ఆ సమయంలో వారిలో అనేక రకాలైన మానసిక సంచలనాలు వస్తాయి. అటువంటి సందర్భాన్ని మానసిక నిపుణులు ‘ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్’ అంటున్నారు. పాశ్చాత్య దేశాలలో పిల్లలను విడి గదుల్లో ఉంచి పెంచడం అలవాటు. 18 ఏళ్లు రాగానే వారు దూరమవుతారనే మానసిక సంసిద్ధతతో ఉంటారు. భారతీయులు మాత్రం పిల్లలను తమ వద్దే పడుకోబెట్టుకుంటారు. వారికి ఎంత వయసొచ్చినా వారు తమతో లేదా వారి వెంట తాము ఉండాలనుకుంటారు. అలాంటిది చదువు, ఉద్యోగాలు, పెళ్లి చేసుకొని విడి కాపురం పెట్టడాలు లేదా వేరే చోట స్థిరపడటాలు జరిగినప్పుడు ఒక ఖాళీతనం వారిని ఇబ్బంది పెడుతుంది. దానికి అడ్జస్ట్ కావడానికి టైమ్ పడుతుంది. అలాంటి సందర్భంలో తల్లిదండ్రులు కాస్తా భార్యాభర్తలుగా మారి ఒకరికి ఒకరై కనిపెట్టుకోవాలని నిపుణులు అంటున్నారు. ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్ ప్రతికూలతలు: ⇒ పిల్లల గురించి ఆందోళన... వారితో మానసిక ఎడబాటు వస్తుందేమోనన్న భయం ⇒ ఒంటరితనం ఫీల్ కావడం ⇒ సంతోషంగా ఉండలేకపోవడం ⇒ కలత నిద్ర ⇒ జీవితానికి అర్థమేమిటి అనే సందేహం ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్ అనుకూలతలు: ⇒ బోలెడంత ఖాళీ టైమ్ రావడం ⇒ బాధ్యతలు లేని స్వేచ్ఛ ⇒ స్వీయ ఇష్టాలు నెరవేర్చుకునే వీలు ⇒ కొత్తగా ఏదైనా చేద్దాం అనే ఉత్సాహం అయితే తమ మానసిక సామర్థ్యాన్ని బట్టి అనుకూలతలను తీసుకోవాలా ప్రతికూలతలతో కుంగిపోవాలా అనేది తేల్చుకుని ప్రతికూలతలను జయించి ముందుకు సాగాలి. కొత్త జీవితం: అన్నింటి కంటే మించి అంతవరకూ తల్లిదండ్రులుగా ఎక్కువ మసలినవారు పిల్లలు స్థిరపడ్డాక మళ్లీ భార్యాభర్తలుగా మారతారు. ఆ సమయంలో ఇద్దరూ ఇంట్లో ఎక్కువ సేపు గడిపే వీలు చిక్కుతుంది. దాంతో ఒకరితో ఒకరు అనుబంధం పెంచుకోవచ్చు. కాని సాధారణంగా ఒకరిని మరొకరు భూతద్ధంలో చూస్తూ పాత నష్టాలనూ, తొక్కిపెట్టిన పాత ఫిర్యాదులనూ బయటకు తీస్తే జీవితం దారుణంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఈ సమయంలోనే భార్యను భర్త, భర్తను భార్య ఎక్కువగా అర్థం చేసుకోవాలి... స్నేహంగా ఉండాలి... పరస్పరం కలిసి యాత్రలు, విహారాలు, బంధుమిత్రులను కలవడం, ఏదైనా హాబీని అలవర్చుకోవడం, వాకింగ్ గ్రూపుల్లో చేరడం, ఇష్టమైన సినిమాలు చూడటం, జీవితంలో గడిచిన మంచి విషయాలు గుర్తుకు చేసుకోవడం, ఒకప్పుడు ఇవ్వలేని సమయాన్ని ఇప్పుడు ఇవ్వడం చేయాలి. ఈ సమయంలో పరస్పర భద్రత కూడా ముఖ్యమే కాబట్టి దానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఆర్థికపరమైన సౌలభ్యం ఉంటే అందాక తీరని ముచ్చట్లను తీర్చుకోవడం కూడా మంచి వ్యాపకమే. జీవితంలో పిల్ల లకు ఇవ్వదగ్గ ప్రేమంతా ఇచ్చాం... ఇప్పుడు పరస్పరం ప్రేమను పంచుకుందాం అనే భావన అత్యంత ముఖ్యమైనది ఈ ‘ఎంప్టీ నెస్ట్’ కాలంలో. ఈ జాగ్రత్తలు తీసుకుంటే బెంగ ఉండదు. పిల్లలు ఫోన్ చేసినప్పుడు అలాంటి తల్లిదండ్రుల గొంతులో తప్పక సంతోషాన్ని వింటారు. ఆ సంతోషమే పిల్లలకు గొప్ప కానుక. -
స్పందన కరువైంది...
వరల్డ్ కప్ తొలి మ్యాచ్ అంటే సహజంగా క్రికెట్ అభిమానుల్లో అమితాసక్తి ఉంటుంది. టాస్ వేసేసరికే స్టేడియాలు నిండిపోతాయి. కానీ ఈ మ్యాచ్‌పై అహ్మదాబాద్ ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించినట్లుగా లేదు. మ్యాచ్ ఆరంభమైన చాలాసేపటి వరకు కూడా స్టేడియంలో చాలా భాగం ఖాళీగా కనిపించింది. భారత్ లేని మ్యాచ్‌కు లక్షకు పైగా సామర్థ్యం ఉన్న స్టేడియం ఫ్యాన్స్‌తో హౌస్‌ఫుల్ అవుతుందని కోరుకోవడం అత్యాశే అయినా మరీ నామమాత్రంగా కూడా జనం లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. చివరి వరకు వేర్వేరు కారణాలతో టికెట్లు అమ్మకానికి ఉంచకపోవడం, నగరంలో తీవ్రమైన ఎండ, వారాంతం కాకపోవడం కూడా అందుకు కారణాలు కావచ్చు. 40 వేల టికెట్లను స్థానిక రాజకీయ నాయకులు తమ కార్యకర్తలకు పంచి పెట్టారు. టికెట్లు తీసుకున్న వారంతా వచ్చేందుకు ఆసక్తి కనబర్చలేదని తెలిసింది. నిజానికి ఇలాంటి మెగా ఈవెంట్లు ఆతిథ్య జట్టు మ్యాచ్‌తో ప్రారంభం కావడం సహజంగా జరుగుతూ ఉంటుంది. కానీ నిర్వాహకులు భిన్నంగా ఆలోచించి ‘ఫైనలిస్ట్’లతో పోరు ఖరారు చేశారు. మ్యాచ్ సాగినకొద్దీ సాయంత్రానికి స్టేడియంలో ప్రేక్షకులు సంఖ్య పెరగడం కాస్త ఊరట. -
కేరళలో కాలనీయే ఖాళీ ..!
కొచి: కేరళలోని కొట్టాయం జిల్లా కైపుజా గ్రామంలో ఒక కాలనీలో ఇళ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఆ కాలనీలో ఉన్న 100కి పైగా ఇళ్లు అమ్మకానికి పెట్టారు. ఇవన్నీ ఎన్నారైలకు చెందిన ఇళ్లే. ఒకప్పుడు ఈ ప్రాంతం నుంచి మెరుగైన జీవితం కోసం ప్రజలు వివిధ దేశాలకు వెళ్లిపోయారు. అక్కడ సంపాదించిన డబ్బులతో తమ ప్రాంతంలో అత్యాధునిక సౌకర్యాలతో ఇళ్లు నిర్మించారు. రిటైర్మెంట్ జీవితం ఆ ఇళ్లల్లోనే గడిపారు. వారి తదనంతరం పిల్లలు విదేశాల్లో స్థిరపడడంతో ఆ ఇళ్లన్నీ ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. సకల సౌకర్యాలు ఉన్న ఆ కాలనీ ఒకేసారి ఖాళీ అయిపోయింది. అయితే అక్కడ మంచి సదుపాయాలు ఉండడంతో చాలా మంది ఆ ఇళ్లను కొనడానికి మొగ్గు చూపిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడ రియల్ ఎస్టేట్ బూమ్ పెరిగింది. -
ఈ సభా సాక్షిగా..అయ్యన్న పని అయిపాయె
-
ప్రభుత్వ ఆస్పత్రుల్లో సత్వరం పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీపై ప్రభుత్వం దృష్టి సారించింది. వెంటనే పోస్టులన్నింటినీ భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం సచివాలయంలో వైద్య, ఆరోగ్య శాఖపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతులు, సదుపాయాలను బలోపేతం చేయాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రధాన ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్నారు. అదనపు గదుల నిర్మాణాల ఆవశ్యకతను సమీక్షించి ఇప్పటికే పనులు ప్రారంభించిన వాటి పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని బోధనాస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో పీడియాట్రిక్ ఆక్సిజన్, పీడియాట్రిక్ ఐసీయూ పడకలను పెంచాలని అధికారులను ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వ్యాక్సినేషన్ కోసం మిగిలిన వారందరినీ గుర్తించేందుకు ప్రత్యేకంగా ‘‘మాప్ అప్ డ్రైవ్’’నిర్వహించాలని సూచించారు. సమావేశంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం.రిజ్వీ, ప్రజారోగ్య విభాగం సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు, వైద్య, విద్య సంచాలకుడు డాక్టర్ రమేశ్‌రెడ్డి, టీఎస్ఎంఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఖాళీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కమిషన్లు
సాక్షి, హైదరాబాద్: రిజర్వేషన్ల అమలులో అన్యాయం.. అట్రాసిటీ కేసుల్లో సత్వర న్యాయం.. సంక్షేమ కార్యక్రమాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించే కమిషన్లు ఖాళీ అయ్యాయి. పదవీ కాలం ముగియడం.. వాటిని తిరిగి ఏర్పాటు చేయకపోవడంతో బడుగు, బలహీన వర్గాల్లో అన్యాయానికి గురైన బాధితుల గోడు వినేవారు కరువయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ–ఎస్టీ కమిషన్తోసహా బీసీ కమిషన్, మైనార్టీ కమిషన్లు ప్రస్తుతం ఖాళీ అయ్యాయి. చైర్మన్, సభ్యుల పదవీ కాలంముగిసి నెలలు గడుస్తోంది. వాస్తవానికి పదవీ కాలం ముగిసిన వెంటనే నూ తన కమిషన్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాల్సి ఉం డగా.. ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయం తీసుకోలేదు. ఇంతకీ కమిషన్ ఏం చేస్తుంది? జాతీయ స్థాయిలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కమిషన్లు చట్టబద్దత కలిగిన సంస్థలు. వీటికి సమాంతరంగా రాష్ట్రాల్లో ఏర్పాటైన కమిషన్లకు విశిష్ట అధికారాలుంటాయి. ప్రధానంగా రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలు, అట్రాసిటీ చట్టం అమలు, సంబంధిత సామాజిక వర్గాల స్థితిగతుల అధ్యయనం, క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రభుత్వానికి సిఫారసు చేయడం, సంక్షేమ పథకాల రూపకల్పనకు సూచనలు తదితర అంశాల్లో రాష్ట్ర కమిషన్లు కీలక భూమిక పోషిస్తాయి. ఇక కులాల విభజన, కేటగిరీల్లో మార్పులు చేర్పులు, రిజర్వేష్లనలో మార్పులపై ప్రతిపాదనలు చేయడం లాంటి అంశాల్లో చురుకుగా ఉంటాయి. కమిషన్‌ను ఆశ్రయించిన వారికి సత్వర సాయం అందించడం, క్షేత్రస్థాయి అధికారులకు నేరుగా ఆదేశాలు జారీ చేయడం, వాటి అమలులో అలసత్వం ప్రదర్శిస్తే తక్షణ చర్యలు తీసుకునే అధికారాలు కమిషన్‌కు ఉంటాయి. ఏడాదిన్నరకు పైగా... తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం రాష్ట్ర బీసీ కమిషన్‌ను 2016 అక్టోబర్‌లో ఏర్పాటు చేసింది. మూడేళ్లపాటు సాగిన ఈ కమిషన్ గడువు 2019 అక్టోబర్‌తో పూర్తయింది. 2018 ఫిబ్రవరిలో ఏర్పాటైన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ గడువు ఈ ఏడాది ఫిబ్రవరితో ముగిసింది. ఇక మైనార్టీ కమిషన్‌ను గడువు సైతం ఈ ఏడాది జనవరితో ముగిసింది. ఎస్టీ, ఎస్టీ కమిషన్‌కు ఎక్కువగా అట్రాసిటీకి సంబంధించిన ఫిర్యా దులు వస్తుంటాయి. ఇది వరకున్న కమిషన్‌కు మూడేళ్ల కాలంలో పదివేలకు పైగా ఫిర్యాదులు వచ్చాయి. రోజు కు సగటున పది ఫిర్యా దులు వచ్చినట్లు చెప్పొచ్చు. ఈ ఫిర్యాదులను యుద్దప్రాతిపదికన పరిశీలించి వేగంగా పరిష్కరం చూపింది. ప్రస్తుతం ఐదు నెలలుగా కమిషన్ ఖాళీ కావడంతో ఫిర్యాదులపై గందరగోళంనెలకొంది. తక్షణమే కమిషన్లు ఏర్పాటు చేయాలని ప్రజా సంఘాలు డిమాం డ్ చేస్తున్నాయి. ఆశ్రిత కులాలకు గుర్తింపు దక్కింది బీసీ సమాజంలో దాదాపు 30 రకాల కులాలకు గుర్తింపు లేదు. అలాంటి కులాలకు మా హయాంలో గుర్తింపు దక్కింది. 30 కులాల నుంచి వినతులు, అభ్యంతరాల స్వీకరణకు ఉపక్రమించాం. కానీ 18 కులాల నుంచి మాత్రమే స్పందన వచ్చింది. పరిశీలన చేసి 17 కులాలకు గుర్తింపు ఇచ్చాం. ఇందులో 14 కులాలను బీసీ–ఏ కేటగిరీలో, 3 కులాలను బీసీ–డీ కేటగిరీలో చేర్చాం. మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లపై సుధీర్ కమిషన్ నివేదిక ప్రకారం ప్రక్రియను పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదించినప్పటికీ కోర్టు పరిధిలో ఈ అంశం పెండింగ్‌లో ఉంది. – బీఎస్ రాములు, రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ విప్లవాత్మక మార్పులు తెచ్చాం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ విప్లవాత్మక మార్పు లు తెచ్చింది. దళిత, గిరిజనులకు కాంట్రాక్టు పనుల్లో రిజర్వేషన్లు కల్పించేలా ప్రభుత్వానికి సూచించగా, సీఎం కేసీఆర్ తక్షణమే స్పందిం చి నిర్ణయం తీసుకోవడం చరిత్రలో నిలిచిపోయింది. ఈఎండీ మినహాయింపుతో రూ.కోటి వరకు పనులు కేటాయిస్తోంది. బ్యాక్లాగ్ పోస్టుల భర్తీలో క్రియాశీలంగా పనిచేసింది. మూడేళ్ల కాలంలో అట్రాసిటీతోపాటు అన్ని కేటగిరీల్లో 13,905 వినతులు స్వీకరించి పరిష్కరించాం. రూ.78.30కోట్లు బాధితులకు పరిహారం అందజేశాం. – ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ -
లారీ వదిలి ఉల్లి ఎత్తుకుపోయారు!
శివ్‌పురి: ఉల్లి లోడు లారీని ఎత్తుకుపోయిన దొంగలు.. రూ.22లక్షల విలువైన ఉల్లి గడ్డలను ఉంచుకుని లారీని వదిలేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని శివ్‌పురి జిల్లాలో జరిగింది. ఈనెల 11వ తేదీన మహారాష్ట్రలోని నాసిక్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు 40 టన్నుల ఉల్లి గడ్డలతో ఓ లారీ బయలుదేరింది. ఆ లారీ ఈ నెల 22వ తేదీన గమ్యస్థానానికి చేరుకోవాల్సి ఉంది. అయితే, అది కనిపించకుండా పోవడంతో ఉల్లి వ్యాపారి ప్రేమ్‌చంద్ మధ్యప్రదేశ్ పోలీసులను ఆశ్రయించాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు టెండు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆ లారీ ఖాళీగా కనిపించింది. మధ్యప్రదేశ్‌లో కిలో ఉల్లి రూ.100 వరకు పలుకుతోంది. సూరత్‌లో ఉల్లి దొంగలు గుజరాత్: సూరత్‌లోని ఒక కూరగాయల దుకాణంలో రూ. 25 వేల విలువచేసే 250 కేజీల ఉల్లిని దొంగలు దోచేశారు. పాలన్పూర్ పటియాలోని దుకాణంలో ఈ చోరీ జరిగింది. ‘ఎప్పటిలాగే ఐదు 50 కేజీల బ్యాగులను బుధవారం రాత్రి అమ్మకానికి తీసుకొచ్చాం. గురువారం తెల్లవారుజామున దొంగలు ఐదు సంచీలను ఎత్తుకెళ్లారు’ అని దుకాణం ఉద్యోగి తెలిపారు -
చిల్లిగవ్వ లేదు..ఏపీ ఖజానా ఖాళీ!
-
మంచి–చెడు
ఒక రోజు ఒక కుక్క పూర్తిగా అద్దాలతో కట్టిన ఒక మ్యూజియంలోకి వచ్చింది. అక్కడ ఎవ్వరూ లేరు. ఆ హాలు నిండా అద్దాలు ఉండటం వలన, ఆ కుక్కకు చుట్టూ ఎన్నో కుక్కలు ఉన్నట్టు కనిపించింది. నిజంగానే చాలా ఉన్నాయి అనుకుని, వాటిని భయపెట్టటానికి పళ్లు బయటపెట్టి అరిచింది. చుట్టూ ఉన్న దాని ప్రతిబింబాలన్నీ అలాగే చేశాయి. మళ్లీ గట్టిగా అరిచింది. అద్దాలలో కూడా అలాగే కనిపించింది. గది ఖాళీగా ఉండటం వల్ల శబ్దం మరింత ప్రతిధ్వనించింది. అద్దాల దగ్గరికి వెళ్లేసరికి ఆ కుక్కలు కూడా తన మీదకు వస్తున్నట్టు భ్రమించింది. రాత్రంతా అలాగే గడిచింది. తెల్లవారి ఆ మ్యూజియం కాపలావాళ్లు వచ్చి చూసేసరికి ఆ కుక్క చాలా దీనంగా, ఒంటినిండా దెబ్బలతో లేవలేని స్థితిలో, దాదాపు చనిపోవటానికి సిద్ధంగా ఉంది. ఎవ్వరూ లేని చోట కుక్కకు దెబ్బలు ఎలా తగిలాయి, ఎవరు దీని మీద దాడి చేశారు అని కాపలావాళ్లు ఆశ్చర్యపోయారు. నిజానికి ఆ కుక్క తన ప్రతిబింబాలతో తనే పోట్లాడింది. వాటిపై దాడి చేస్తున్నాను అనుకుని, తనకు తనే భయంకరంగా గాయాలు చేసుకుంది. ఈ ప్రపంచం కూడా సరిగ్గా అలాంటిదే. అది మనకు మంచి కాని, చెడు కాని చేయదు. మన ఆలోచనలు, మన మనస్తత్వమే మన మంచి చెడులను నిర్ణయిస్తుంది. మన ఆశలు, కోరికలు, ఆలోచనల ఫలితమే ఈ ప్రపంచం అనుకోవాలి. ఈ ప్రపంచం ఒక పెద్ద దర్పణం వంటిది. మనం మంచిగా ఉంటే అందరూ మంచిగానే కనపడతారు. – ఎస్.ఎం. బాషా -
అసెంబ్లీలో చిత్ర విచిత్ర పరిస్థితులు
భువనేశ్వర్ : రాష్ట్ర శాసనసభలో చిత్ర విచిత్ర పరిస్థితులు నెలకొంటున్నాయి. అధికార పక్షం బిజూ జనతా దళ్ ప్రగల్భాలు బట్టబయలవుతున్నాయి. న్యాయసమ్మతమైన శీర్షికలతో ప్రతిపక్షాలు సభలో ప్రస్తావించినా సభా కార్యక్రమాలకు పరోక్షంగా గండి కొట్టిస్తున్నందున ఇటీవల వరుసగా 3 రోజులపాటు అమూల్యమైన సభా కార్యక్రమాలకు నిరవధికంగా గండిపడిన సంగతి తెలిసిందే. మొత్తం మీద ఈ వివాదానికి తెరదించి తదుపరి సభా కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగించేందుకు సభలో సభ్యుల గైర్హాజరు మరో ప్రధాన సమస్యగా నిలుస్తోంది. ప్రభుత్వం తప్పిదాలే కారణం రాజ్యాంగబద్ధమైన కార్యాచరణలో ప్రభుత్వం తప్పటడుగు వేసి ప్రతిపక్షాల్ని ప్రేరేపించి సభా కార్యక్రమాలకు గండి కొట్టిస్తున్న విషయాన్ని తాజా సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి. ఏదోలా ప్రతిపక్షాలను బుజ్జగించి సభలో శాంతియుత వాతావరణం పునరుద్ధరించే సమయానికి అధికార పక్షం సభ్యులు సభా కార్యక్రమాలకు డుమ్మా కొడుతున్నారు. దీంతో సభలో కనీస సభ్యుల హాజరు కొరవడుతోంది. బడ్జెట్ సమావేశంలో అత్యంత కీలకమైన బిల్లుల ఆమోదానికి ఈ పరిస్థితులు ప్రతికూలంగా నిలుస్తున్నాయి. ఇటువంటి దయనీయ పరిస్థితి గురువారం ఎదురైంది. లోకాయుక్త నియామకం జాప్యంపట్ల చెలరేగిన వివాదం అఖిల పక్ష సమావేశం తీర్మానం తర్వాత సభా కార్యక్రమాల నిర్వహణకు అనుకూలత ఏర్పడింది. ఈ సమయంలో అధికార పక్షం సభ్యులు సభలో అదృశ్యమయ్యారు. సభా కార్యక్రమాలు ప్రారంభమయ్యే సమయానికి సభలో నామమాత్రంగా 9 మంది సభ్యులు మాత్రమే దర్శనమిచ్చారు. మిగిలిన సభ్యులు అంతా సభా ప్రాంగణంలోకి విచ్చేసి హాజరు కావలసిందిగా స్పీకర్ అభ్యర్థించాల్సిన దయనీయ పరిస్థితులు తాండవించడం విచారకరం. సభా కార్యక్రమాలకు గంటమోగినా సభ్యుల జాడ కనబడకపోవడంతో అయోమయ పరిస్థితి నెలకొంది. గంట మోగిన ఒక నిమిషం తర్వాత సభలో సభ్యుల సంఖ్య మెల్లగా 10కి చేరుకుంది. మరో 2 నిమిషాల తర్వాత సభ్యుల హాజరు క్రమంగా 14 మంది వరకు పుంజుకుంది. సాయంత్రం 6.37 గంటల ప్రాంతంలో బడ్జెట్ వంటి కీలకమైన అంశంపై సభలో చర్చ సాగుతుండగా కోరం కొరత కనిపించడం విచారకరం. ప్రతిపక్షాల పెదవి విరుపు సభ్యుల గైర్హాజరు పట్ల ప్రతిపక్ష కాంగ్రెస్ పెదవి విరిచింది. సభలో బిల్లుల వ్యవహారాన్ని నిరవధికంగా నిర్వహించేందుకు కోరం లేకపోవడం విడ్డూరం. ఇటువంటి దయనీయ పరిస్థితుల నివారణపట్ల స్పీకర్ స్పందించాల్సి ఉందని కాంగ్రెస్ అభ్యర్థి, ఆలీ నియోజక వర్గం సభ్యుడు దేవేంద్ర శర్మ అభ్యర్థించారు. బడ్జెట్ సమావేశాల్లో మంత్రుల గైర్హాజరుపట్ల ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పరిస్థితులకు నిరసనగా కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి మౌనంగా వాకౌట్ చేశారు. -
అరుణోదయ కార్యాలయాన్ని ఖాళీ చేయించిన పోలీసులు
ప్రభుత్వం కక్ష గట్టింది: విమలక్క హైదరాబాద్: అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కార్యాలయాన్ని కోర్టు ఆదేశాల మేరకు పోలీ సులు ఖాళీ చేయించి ఇంటి యజమానికి అప్పగించారు. అరవింద్‌నగర్‌లో ఓ అద్దె ఇంట్లో విమలక్క 2009 నుంచి అరుణోదయ రాష్ట్ర కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. 2016 డిసెంబరులో నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి రూరల్ పోలీసులు ఓ కేసులో భీంభరత్ అనే వ్యక్తిని అరెస్టు చేసి న సందర్భంగా ఈ కార్యాలయంలో సోదాలు నిర్వహించి నిషేధిత వస్తువులు లభించాయం టూ సీజ్ చేశారు. కాగా, యజమాని ఆర్ఎస్ శాస్త్రి తమ ఇంటిని 2009లో కరియమ్మ అనే మహిళకు అద్దెకు ఇచ్చానని, అయితే తమ ఇంట్లో అరుణోదయ సంస్థ నిర్వహిస్తున్నట్టు 4 నెలల తర్వాత తెలిసిందన్నారు. అప్పటి నుంచి ఇల్లు ఖాళీ చేయమంటూ విజ్ఞప్తి చేస్తూ నే ఉన్నామన్నారు. చివరకు గత నెల 25న కోర్టు తమకు అనుకూలంగా తీర్పును ఇచ్చిం దన్నారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు... ఇంట్లో ఉన్న వస్తువులను అరుణోదయ సమాఖ్యకు, శాస్త్రికి ఇంటిని అప్పగించారు. నాలుగు గంటల హైడ్రామా... అరుణోదయ కార్యాలయాన్ని ఇంటి యజ మానికి అప్పగించే సందర్భంగా 4 గంటల పాటు హైడ్రామా నడిచింది. మాచారెడ్డి రూరల్ పోలీసులు కార్యాలయాన్ని సీజ్ చేసిన సమయంలో సాక్షి సంతకం తీసుకున్న అరుణోదయ సమాఖ్య నాయకుడు మోహన్ బైరాగితో అరవింద్నగర్కు చేరుకోగా, విషయం తెలిసిన విమలక్క, ఇతర కళాకారులు అక్కడికి చేరుకున్నారు. కోర్టు ఆదేశాలు తమకు ఇవ్వకుండా ఎలా ఖాళీ చేయిస్తారని పోలీసులను ప్రశ్నించారు. ఖాళీ చేయడానికి కనీసం వారం గడువైనా ఇవ్వాలన్నారు. పోలీసులు, ప్రభుత్వం తమపై కక్షతో ఇంటిని ఖాళీ చేయిస్తున్నారన్నారు. దీంతో కోర్టు ఆదేశాలను పోలీసులు విమలక్కకు అందజేశారు. విద్యావేత్త చుక్కా రామయ్య, న్యూడెమోక్రసీ నాయకుడు గోవర్దన్ తదితరులు విమలక్కను కలసి పరిస్థితి తెలుసుకున్నారు. -
ఖజానా ఖాళీ
- తలకిందులవుతున్న జెడ్పీ - పెద్ద నోట్ల రద్దుతో తగ్గిపోయిన రిజిస్ట్రేషన్లు - పడిపోయిన స్టాంప్ డ్యూటీ ఆదాయం - ఉచిత ఇసుకతో సీనరేజి ఆదాయానికీ గండి - అందని ఆర్థిక సంఘం నిధులు - గ్రాంటు ఇవ్వని ప్రభుత్వం - వచ్చే నెల నుంచి పెన్షన్లు ఇవ్వలేమంటున్న యంత్రాంగం భానుగుడి (కాకినాడ సిటీ) : పెద్ద నోట్ల రద్దు.. ప్రభుత్వ విధానాల పుణ్యమా అని జిల్లా పరిషత్ నడ్డి విరుగుతోంది. వివిధ రూపాల్లో రావాల్సిన ఆదాయానికి గండి పడడంతో ఖజానా ఖాళీ అవుతోంది. దీంతో అధికారులు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. ఆర్థిక పరిస్థితి తలకిందులవడంతో.. వచ్చే నెలలో రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వడం కష్టమేనని స్వయంగా జెడ్పీ చైర్మనే చెబుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నోటు పోటు పాత రూ.1000, రూ.500 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం, పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిపేవారిపై ఆదాయపన్ను శాఖ ఓ కన్ను వేయడంతో.. జిల్లాలో భూముల క్రయవిక్రయాలు 70 శాతం పైగా పడిపోయాయి. జీఓ నంబరు 725/1998 ప్రకారం రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి జెడ్పీకి స్టాంపు డ్యూటీ, సర్‌చార్జి రూపంలో 1/5వ వంతు సొమ్ము జమ చేయాలి. గత ఏడాది ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ రూపంలో రూ.12,19,39,000 జెడ్పీకి జమ అయ్యింది. పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఈ ఆదాయం రూ.27 లక్షలకు మించలేదు. స్టాంపుడ్యూటీ, సర్‌చార్జి రూపంలో ఏడాదికి రూ.24 కోట్లు పైగా రావాల్సి ఉండగా, ఇప్పటివరకూ 50 శాతం మాత్రమే వచ్చింది. సీనరేజి ఆదాయానికి బ్రేక్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం అధికార పార్టీ దళారులకు కాసులు కురిపిస్తుండగా.. జెడ్పీ ఆదాయానికి పెద్ద మొత్తంలో గండికొట్టింది. ఇసుక వేలం పాటల ద్వారా జెడ్పీకి మినరల్ సెస్సు సీనరేజి వాటా రూపంలో ఏటా రూ.100 కోట్లు పైగా ఆదాయం వచ్చేది. గత ఏడాది సెప్టెంబర్ 30 నాటికి రూ.33.12 లక్షలు వచ్చింది. అనంతరం మారిన ప్రభుత్వ నిబంధనలతో ఈ పద్దు కింద దమ్మిడీ ఆదాయం కూడా రాలేదు. మరోపక్క ప్రభుత్వం నుంచి జెడ్పీకి వివిధ పద్దుల రూపంలో రూ.59 కోట్లు రావాల్సి ఉంది. రెండేళ్ళ నుంచి ఈ నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రికి విన్నవించుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. ఆర్థిక సంఘం నిధులు లేవు.. తలసరి గ్రాంటు రాదు గతంలో గ్రామ పంచాయతీలకు జిల్లా పరిషత్‌ల నుంచి 14వ ఆర్థిక సం«ఘం నిధులు కేటాయించేవారు. కొద్దికాలంగా ఈ నిధులను నేరుగా గ్రామ పంచాయతీలకే ఇస్తున్నారు. దీంతో జెడ్పీకి వచ్చే నిధుల శాతం సగానికి పడిపోయింది. అలాగే, జనాభా లెక్కల ప్రకారం 41,76,541 మందికి తలసరి రూ.4 చొప్పున గత ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకూ రూ.75 లక్షల గ్రాంటు విడుదల చేశారు. తదనంతర కాలంలో ఈ నిధులు సైతం ప్రభుత్వం నుంచి సకాలంలో రావడంలేదు. ఆదాయం రూ.27 లక్షలు.. పెన్షన్లకు రూ.43 లక్షలు.. జెడ్పీలో పదవీ విరమణ పొందిన 465 మంది మినిస్టీరియల్ సిబ్బందికి ప్రతి నెలా రూ.43 లక్షల పెన్షన్ చెల్లిస్తున్నారు. ఇసుక సీనరేజి, స్టాంపు డ్యూటీ, ఇతర పద్దుల నుంచి వచ్చే ఆదాయాన్ని పెన్షన్లు, ఇతర పనులకు కేటాయించేవారు. ప్రస్తుతం ఖజానాలో రూ.27 లక్షలు మాత్రమే ఉంది. దీంతో వచ్చే నెల నుంచి పెన్షన్లు ఇవ్వలేమని సాక్షాత్తూ జెడ్పీ చైర్మనే చేతులెత్తేస్తున్నారు. ఆదాయం తగ్గిపోవడంతో ఈ ఏడాది రిటైరైన 21 మంది దరఖాస్తులను కూడా జెడ్పీ స్వీకరించలేదు. దీనిపై వారు లోకాయుక్తను కూడా ఆశ్రయించారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాం వచ్చే నెల నుంచి జెడ్పీ రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. దీనిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాం. ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.59 కోట్లు తక్షణమే ఇచ్చి ఆదుకోవాలని కోరాం. దీనికి సీఎం సానుకూలంగా స్పందించారు. నిధులు రాకుంటే వచ్చే నెలలో పెన్షన్లు ఇవ్వలేం. - నామన రాంబాబు, జెడ్పీ చైర్మన్ -
ఎన్సీఎస్టీలో ఖాళీలు భర్తీచేయండి...
⇔ షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్ (ఎన్సీఎస్టీ)లో చైర్పర్సన్ సహా ఉన్న మూడు ఖాళీలను మూడు నెలల్లోపు భర్తీ చేయాలని కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఆదే శించింది. ⇔ ప్రజా రవాణా వాహనాల్లో వేగ నియంత్రకాలను అమర్చడానికి సంబంధించి ప్రస్తుత స్థితిని తెలిపే నివేదికలను రాష్ట్రాలు సమర్పించకపోవడంతో ఆయా రాష్ట్రాల రవాణా కార్యదర్శులు తన ముందు హాజరుకావాలని సుప్రీం కోర్టుఆదేశించింది. ⇔ 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం జరిపిన విచారణ స్థితి ఏమిటో తెలుపుతూ సమగ్ర నివేదిను సమర్పించాలని కేంద్రా న్ని సుప్రీం ఆదేశించింది. -
ఖాజానా ఖాళీ
నగదు లేక ఎస్బీఐ ప్రధాన శాఖలో ఆగిన చెల్లింపులు 16 రోజులైనా తప్పని తిప్పలు అనంతపురం అగ్రికల్చర్: పెద్ద నోట్ల రద్దుతో రోజురోజుకు ప్రజాజీవనం అస్తవ్యస్తంగా మారుతోంది. 16వ రోజు శుక్రవారం కూడా జిల్లా అంతటా ప్రజలు డబ్బు కోసం ఇబ్బందులు పడ్డారు. బ్యాంకులు, ఏటీఎంల వద్ద పడిగాపులు తప్పలేదు. చాలా బ్యాంకుల్లో ఖాజానాలు ఖాళీ అయ్యాయి. రూ.100 నోట్లతోపాటు రూ.2 వేల నోట్లు కూడా అయిపోవడంతో చాలా చోట్ల బ్యాంకులను మూసివేశారు. ప్రధానంగా సాయినగర్‌లో ఉన్న స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రధాన శాఖలో శుక్రవారం మొదటి అరగంటలోనే నగదు నిల్వలు అయిపోయాయి. దీంతో అధికారులు చేతులెత్తేశారు. కౌంటర్ల వద్ద క్యూలైన్లలో నిలబడిన వందలాది మంది అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఉన్న మొత్తంతో వారికి నచ్చజెప్పి సర్దుబాటు చేశారు. రూ.2 వేల నగదు మార్పిడిని నిలిపివేశారు. రూ.2 వేలు, రూ.4 వేలు, గరిష్టంగా రూ.10 వేలకు చెల్లింపులు పరిమితం చేశారు. రూ.2 వేల నోట్లు కొరత కూడా ఎక్కువగా ఉండటంతో శుక్రవారం ఏటీఎంలు నామమాత్రంగా పనిచేశాయి. సోమ లేదా మంగళవారం రూ.500 నోట్లు రావచ్చునని బ్యాంకర్లు చెబుతున్నారు. ఈ నెల 10 నుంచి రూ.800 కోట్ల వరకు ప్రజలకు పంపిణీ జరిగిందని, ఈ డబ్బు మార్కెట్లోకి రాకపోవడంతో సమస్య మరింత జఠిలమవుతోందని బ్యాంకర్లు విశ్లేషిస్తున్నారు. రూ.300 కోట్లు వరకు కొత్త రూ.100 నోట్లు ఇచ్చినట్లు చెబుతున్నారు. అందులో 10 శాతం కూడా ప్రజల మధ్య మార్పిడి జరగలేదంటున్నారు. సామాన్యులకే కష్టాలు ఎస్బీఐ, ఏపీజీబీ, సిండికేట్బ్యాంకు, కెనరా, ఆంధ్రాబ్యాంకుల్లో అకౌంట్లు ఉన్న పేదలు, రైతులు, కూలీలు, సామాన్య, మధ్య తరగతివారు అవస్థలు పడుతున్నారు. బడాబాబులు, వ్యాపార, ఉద్యోగ వర్గాల అకౌంట్లు ఎక్కువగా ఉన్న హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, ఐసీఐసీఐ లాంటి ప్రైవేట్ బ్యాంకుల్లో పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నట్లు బ్యాంకు వర్గాలు తెలిపాయి. డబ్బు కోసం స్థానిక ఎస్బీఐ బ్రాంచ్‌కు వచ్చి గంటల తరబడి నిలబడిన ఆర్‌డబ్లూఎస్ ఉద్యోగి ఒకరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శని, ఆది బ్యాంకులకు సెలవు: శని, ఆదివారం సెలవు కావడంతో బ్యాంకర్లకు కాస్త ఉపశమనం కలుగుతోంది. అదే సమయంలో ప్రజల ఇబ్బందులు రెట్టింపు అయ్యే సరిస్థితి ఉంది. ఏటీఎంలలో డబ్బు లేకపోవడంతో వినియోగదారులకు కష్టాలు తప్పడం లేదు. శని, ఆదివారం రోజుల్లో నగదు వస్తే కొంత ఊరట కలుగుతుందని బ్యాంకర్లు చెబుతున్నారు. -
చెనై RBI ముందు కౌంటర్లు వెలవెల
-
ఏపీ ఆఫీసులు ఖాళీ చేయాలి
-
ఏపీ ఆఫీసులు ఖాళీ చేయాలి
► గవర్నర్ దృష్టికి తీసుకెళ్లిన సీఎం కేసీఆర్ ► కొత్త సచివాలయ నిర్మాణం దృష్ట్యా తరలింపు ► పత్యామ్నాయ ఆవాసం కల్పిస్తామంటూ సీఎస్ లేఖ ► తాత్కాలిక సచివాలయంగా బూర్గుల భవన్? ► శాఖల తరలింపునకు మరిన్ని భవనాల పరిశీలన సాక్షి, హైదరాబాద్: కొత్త సచివాలయం నిర్మాణంపై గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌తో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చర్చించారు. కొత్త సచివాలయాన్ని ప్రస్తుతమున్న చోటే నిర్మించే ఆలోచనను ఆయనతో పంచుకున్నారు. సోమవారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో ఆయన దాదాపు అరగంటసేపు సమావేశమయ్యారు. సచివాలయ నిర్మాణంతో పాటు భూ సేకరణ చట్టానికి సంబంధించిన ఆర్డినెన్స్‌పైనా ఈ సందర్భంగా చర్చ జరిగినట్టు తెలిసింది. కొత్త జిల్లాల ఏర్పాటు, పాలన సౌలభ్యానికి వీలుగా ప్రభుత్వం చేపట్టిన పునర్వ్యవస్థీకరణకు ప్రజల నుంచి వచ్చిన స్పందన తదితరాలపైనా చర్చ జరిగింది. కొత్త సచివాలయ నిర్మాణానికి నవంబర్‌లో పునాది రాయి వేయాలని సీఎం భావిస్తున్నారు. దాంతో సచివాలయంలోని కార్యాలయాలన్నిటినీ తాత్కాలికంగా మరో చోటికి తరలించటం అనివార్యమైంది. ఇదే ప్రాంగణంలో ఏపీకి చెందిన కార్యాలయాలు కూడా ఉన్నాయి. కొత్త నిర్మాణానికి వీలుగా వాటిని సైతం ఖాళీ చేయించాలని, వాటికి తాత్కాలికంగా మరో చోట వసతి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాకపోతే ఇది విభజనతో ముడిపడి ఉన్న సున్నితమైన అంశం కావటంతో ముందస్తుగా విషయాన్ని గవర్నర్‌కు సీఎం నివేదించినట్లు తెలుస్తోంది. సచివాలయంలో ఉన్న భవనాలను ఖాళీ చేయాలని, ప్రత్యామ్నాయ భవనాలను సమకూరుస్తామని ప్రతిపాదిస్తూతెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఏపీ సీఎస్‌కు లేఖ రాసింది. దీంతోపాటు భూ సేకరణకు సంబంధించి ప్రస్తుతమున్న జీవోలకు బదులు చట్టం తేవాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రివర్గం ఆమోదంతో ఆర్డినెన్స్ రూపంలో ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. గవర్నర్‌తో భేటీలో ఈ అంశమూ చర్చకు వచ్చినట్టు తెలిసింది. ప్రత్యామ్నాయ భవనాల పరిశీలన సచివాలయంలోని కార్యాలయాలను తాత్కాలికంగా తరలించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ రాజీవ్‌శర్మ సోమవారం సచివాలయానికి దగ్గరగా ఉన్న బూర్గుల రామకృష్ణారావు భవన్‌ను పరిశీలించారు. సీఎం కార్యాలయంతో పాటు కీలక విభాగాలను ఇందులోకి మార్చే అవకాశాలను సమీక్షించారు. దీంతోపాటు అరణ్య భవన్, ఎర్రమంజిల్‌లోని ఆర్ అండ్ బీ కార్యాలయం, జలసౌధ, హిమాయత్‌నగర్‌లోని గృహ నిర్మాణ శాఖ భవన్‌లోకి సంబంధిత శాఖలను తరలించాలని నిర్ణయించారు. మిగతా శాఖల కార్యాలయాలను బీఆర్కే భవన్‌లోని ఏయే బ్లాక్‌లకు తరలించాలనే ప్రణాళికను రూపొందిస్తున్నారు. -
రాజన్నకు వర్షం ఎఫెక్ట్
వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ఎఫెక్టు ఎములాడ రాజన్నపై పడింది. ప్రతీ ఆదివారం వేల సంఖ్యలో వచ్చే భక్తులు ఈ ఆదివారం రాలేదు. దీంతో ఆలయం వెలవెలబోయింది. రాజన్న గుడితోపాటు బద్దిపోచమ్మగుడి, భీమన్న గుడి, నగరేశ్వరస్వామి ఆలయాలు, ధర్మగుండం నిర్మానుష్యంగా కనిపించాయి. – వేములవాడ -
ఖాళీగా వున్న విప్, ఛీఫ్‌విప్ పదవులు
-
ఆ డిప్యూటీ కలెక్టర్లకు పోస్టింగులేవీ?
♦ నెల రోజులుగా ఖాళీగా ఉన్న 33 మంది అధికారులు ♦ ప్రమోషన్లు ఇచ్చి ఖాళీగా ఉంచిన సర్కారు సాక్షి, హైదరాబాద్ : డిప్యూటీ కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా కూర్చోబెట్టింది. ఓవైపు అధికారుల కొరతతో సతమతం అవుతున్నా, జిల్లాల్లో పాలన కుంటుపడుతున్నా.. 33 మందికి పోస్టింగులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోంది. దీనిపై ఉద్యోగ సంఘాలు కూడా తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఇలా రెగ్యులర్ డిప్యూటీ కలెక్టర్లలో 8 మంది, గత నెల 12న తహసీల్దారు నుంచి పదోన్నతి పొందిన 25 మంది డిప్యూటీ కలెక్టర్లు పోస్టింగుల కోసం ఎదురుచూస్తున్నారు. హైకోర్టుకు భయపడి పదోన్నతులు! హైకోర్టు అక్షింతలు వేస్తుందేమోనన్న ఆందోళనతోనే రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా 25 మంది తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు కల్పించిందనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు పొందినవారందరూ వెంటనే ఆయా జిల్లాల కలెక్టర్లకు రిపోర్ట్ చేశారు. ఇవి రాష్ట్రస్థాయి పోస్టులు కావడంతో.. ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చిన వెంటనే తమకు కేటాయించిన జిల్లాలకు వెళ్లేందుకు కూడా సిద్ధమయ్యారు. కొంతమందైతే వ్యక్తిగత కారణాలను తెలుపుతూ ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లాల్లోనే నియమించాలని వినతిపత్రాలు సమర్పించారు. కానీ నెలరోజులు దాటినా పోస్టింగుల ఊసెత్తకపోవడంతో నిరాశ చెందుతున్నారు. -
నిండని భద్రకాళి జలాశయం
వర్షకాలం సీజన్ ప్రారంభమైనప్పటికీ నగరంలోని పలు జలాశయాలు ఇంకా పూర్తిగా నిండలేదు. ఇటీవల కుండపోతగా వర్షాలు కురిసినప్పటికీ వరంగల్ భద్రకాళి చెరువులో నీటిమట్టం పెరగలేదు. దీంతో పరిసర ప్రాంతాలకు చెం దిన ప్రజలు నీటికోసం ఆందోళనకు గురవుతున్నారు. వరుణదేవుడు మరోసారి కరుణించి భారీ వర్షాలు కురిపించి భద్ర కాళి చెరువును నింపాలని వారు వేడుకుంటున్నారు. -
గలగల.. వెలవెల
♦ ఖమ్మం ఖజానా ఖాళీ ♦ నిలిచిపోయిన బిల్లులు ♦ ఆంక్షలపై అయోమయం ♦ ఆందోళనలో ఉద్యోగులు ఖమ్మం జెడ్పీసెంటర్ : ఖజానా ఖాళీ అయింది. బిల్లుల చెల్లింపునకు కష్టకాలమొచ్చింది. ప్రభుత్వం వివిధ శాఖలకు అందించే ఖర్చులు.. పాలనకు సరిపడా నిధులు లేవు. దీంతో ఎక్కడి బిల్లులు అక్కడే నిలిచిపోయాయి. ప్రభుత్వం విధించిన ఆర్థిక ఆంక్షల వల్ల అంతరాయం కలుగుతోంది. జిల్లాలోని పలు శాఖలకు సంబంధించి ప్రతీ నెలా జీతాల బిల్లులు 25వ తేదీలోపు ట్రెజరీ కార్యాలయానికి పంపిస్తారు. మార్చి 31 వరకు ఫైనాన్షియల్ ఇయర్ కావడంతో ప్రభుత్వం చెల్లించే చెల్లింపుల్లో కోత పెట్టేందుకే ఆర్థికపరమైన ఆంక్షలు విధించింది. దీంతో పలు శాఖల ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ చ ర్యలు సరిగా లేవని ఆరోపిస్తున్నారు. పలు శాఖల ఉద్యోగులకు రావాల్సిన కోట్ల రూపాయల టీఏ బిల్లులు నిచిపోయాయి. మెడికల్, ఆఫీస్ కాంటింజెన్సీ, మెయింటెనెన్స్ బిల్లులు కూడా ఆమోదానికి నోచుకోవడం లేదు. ట్రెజరీ చుట్టూ ప్రదక్షిణలు పలు శాఖలకు చెందిన కొన్ని బిల్లులు మాత్రమే క్లియర్ చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని, అందుకే మిగతా బిల్లులు క్లియర్ చేయడం లేదని ట్రెజరీ ఉద్యోగులు పేర్కొంటున్నారు. అయితే ఆయా శాఖల ఉద్యోగులు మాత్రం ట్రెజరీ ఉద్యోగుల నిర్లక్ష్యం వల్ల బిల్లులు నిలిచిపోయాయని ఆరోపిస్తున్నారు. కాగా, ట్రెజరీ నుంచి బిల్లుల క్లియర్ కోసం హాస్టల్ వార్డెన్, ఎయిడెడ్ ఉద్యోగులు, పోలీస్ శాఖ ఉద్యోగులు బారులు తీరారు. 31వ తేదీతో ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం ముగుస్తుందని, బిల్లులు క్లియర్ కాకపోతే చెల్లింపులు జరగవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం బిల్లులు క్లియర్ చేయకపోతే మురిగిపోతాయని, ఇప్పట్లో అవి వచ్చే అవకాశం లేదని ఉద్యోగులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ శాఖలకు సంబంధించి అద్దె భవనాలు, స్టేషనరీ బిల్లులు, హాస్టల్ విద్యార్థుల సబ్బులు, నూనెల బిల్లులు పూర్తిగా నిలిచిపోయాయి. స్పష్టమైన ఆదేశాలు లేకే.. ఖజానా శాఖ నిర్లక్ష్యం వల్ల పలు శాఖల ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆయా శాఖలకు సంబంధించిన బిల్లులపై ఫ్రీజింగ్ ఉందో లేదో తెలియని పరిస్థితి. ఈ పేమెంట్ ద్వారా చెల్లింపుల విషయంలో ఉద్యోగులకు స్పష్టత లేదు. ఈ పేమెంట్ బిల్లులు అవుతున్నాయో లేదో చెప్పాలని ట్రెజరీ ఉద్యోగులను కోరినా.. సమాధానం చెప్పే వారే లేరనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ పేమెంట్ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని పలు శాఖల ఉద్యోగులు కోరుతున్నారు. ఫ్రీజింగ్ లేదని ఒక వైపు చెబుతున్నప్పటికీ.. బిల్లులు పాస్ కాకపోవడంపై ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆదాయ వనరులు, ఖర్చు, ద్రవ్య వినియోగ బిల్లులపై ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని ఉద్యోగులు పేర్కొంటున్నారు. -
అధికారులు కావలెను
♦ 20 శాఖలకు సారథులు లేరు ♦ అధికార పార్టీ పెద్దలంటే భయం ప్రజా సమస్యలు పరిష్కరించాలంటే పాలన సక్రమంగా జరగాలి. పాలన సక్రమంగా జరగాలంటే నడిపించే సారథులుండాలి. ఇదేం చోద్యమో గాని జిల్లాలో ఉన్నతాధికారి పోస్టులు ఖాళీగా ఉండిపోతున్నాయి. ఉన్న కొద్దిమందీ అధికార పార్టీ పెద్దలు, వారిదగ్గర పనిచేస్తున్న వారిపెత్తనం భరించలేక..తప్పులు చేయలేక వెళ్లిపోతున్నారు. మరికొందరు ఇటీవల కలెక్టరు ఆగ్రహానికి గురై నిష్ర్కమించారు. ఈ విధంగా జిల్లాలో 20 శాఖలకు ఉన్నతాధికారులు లేరు. ప్రస్తుతం ఇన్‌చార్జిలతోనే కొనసాగిస్తున్నారు. ద్వితీయశ్రేణి అధికారుల పోస్టుల్లో ఖాళీలు ఉండనే ఉన్నాయి. దీనివల్ల పనుల్లో పురోగతి ఉండటంలేదు. శ్రీకాకుళం టౌన్: జిల్లావ్యాప్తంగా రెవెన్యూ, పంచాయితీరాజ్,ఇంజినీరింగ్, గృహ నిర్మాణం, సంక్షేమ,ఐటీడీఏ ఇలా 69 శాఖలున్నాయి. వాటికి అనుబంధ శాఖలు కొనసాగుతున్నాయి. ఈశాఖల్లో కలెక్టరేటు కీలకమైనది. కలెక్టరు, జాయింట్ కలెక్టరు,జేసీ-2 తర్వాత కీలక స్థానం డీఆర్ఓదే. ఇక్కడి డీఆర్ ఓ వెంకటరావు ఇటీవల ఆర్థిక వ్యవహరాల్లో విమర్శలకు గురవడంతో సెలవుపై వెళ్లాలంటూ కలెక్టరు ఆదేశించారు. దీంతో రెవెన్యూశాఖలో అతికీలకమై న పోస్టు ఖాళీ అయ్యింది. ఇటీవల కలెక్టరు మాట ను ధిక్కరించిన కారణంగా బీసీ సంక్షేమ అధికారి రవిచంద్రను ప్రభుత్వానికి సరెండరు చేశారు. ఆయన స్థానంలో వచ్చేందుకు ఎవరూ సుముఖం గా లేరు. సామాజిక అటవీశాఖ డిఎఫ్ఓ వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయన్ను కూడా ప్రభుత్వానికి సరెండరు చేశారు. డిఎస్ఓ ఆనంద్కుమార్నూ కలెక్టరు సరెండర్ చేశారు. ఐటీడీఏ పరిధిలోని డెప్యూటీ డెరైక్టరును దీర్ఘకాలిక సెలవుపై పంపించా రు. ఆర్థిక లావాదేవీల వివాదంలో చిక్కుకున్న ఆర్వీఎం పీఓ రామచంద్రారెడ్డిని ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఖాళీగా ఉన్న పోస్టులివి డీఆర్ఓ: దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు డీబీసీడబ్య్లు: ప్రభుత్వానికి సరెండర్ అయ్యారు ఆర్వీఎం పీఓ: ప్రభుత్వానికి సరెండర్ అయ్యారు. జిల్లా పౌరసరఫరాల అధికారి: ఆనంద్‌కుమార్‌ను బదిలీపై పంపారు. ఆయన స్థానంలో ఎఎస్‌ఓ స్థాయి అధికారిని ఇన్చార్జిగా నియమించారు. బిసికార్పోరేషన్ ఈడీ: బదిలీతో ఖాళీ ఏర్పడింది. ఎస్డీసీ ఆమదాలవలస: అనారోగ్యకారణంతో సెలవుపై వెళ్లారు నెడ్ క్యాప్ జిల్లా మేనేజరు: బదిలీపై వెళ్లారు.. డిడి ట్రెజరీస్: బదిలీపై వెళ్లారు( ఇన్చార్జిగా విజయనగరం డిడి) డీపీఓ: వివాదాలవల్ల బదిలీపై వెళ్లారు. డిఎఫ్ఓ సోషల్ ఫారెస్టు: రేంజ్ అధికార్లను వేధించారంటూ సరెండరయ్యారు. ఐసిడిఎస్ పిడి: చక్రధరరావు సస్పెండయ్యారు పరిశ్రమల శాఖ: జిల్లా జనరల్ మేనేజరు డ్వామా ఏపీడీ: మాతృశాఖకు వెళ్లిపోయారు. వాటర్‌షెడ్ ఏపీఎం:కొంతకాలంగా పోస్టు ఖాళీ అరసవల్లి ఈఓ: రథసప్తమి వేడుకల ముందు బదిలీ అయ్యారు. జిల్లా రిజిస్ట్రార్: కొన్నేళ్లుగా పోస్టు ఖాళీ. జిల్లాపరిషత్: డిప్యూటీ సీఈఓ బదిలీపెవైళ్లారు. జిల్లా పరిషత్: అకౌంట్స్ ఆఫీసరు పోస్టుఖాళీ. జలవనరులశాఖ ఈఈ: ఇక్కడున్న ఇఇ పదోన్నతిపై వెళ్లిపోవడంతో వంశధార ప్రాజక్టులో డిఈఈ రవీంధ్రబాబుకు పూర్తిబాద్యతలు అప్పగించారు. ఐటీడీఏ డీడీ: అవినీతి ఆరోపణల నేపథ్యంలో బదిలీ. వీరికితోడు ద్వితీయశ్రేణి అధికారులు ఇలా జిల్లా వదిలి వెళ్లిన సందర్భాలు లేక పోలేదు. నచ్చని వారికి ఏదో కారణం చూపి బయటకు పంపిస్తున్న జిల్లాకు చెందిన నాయకులు, ఉన్నతాధికారులు తిరి గి ఆస్థానంలో మరొకరిని తీసుకురావడంలో అంత గా శ్రద్ధ తీసుకోక పోవడం వల్ల ప్రభుత్వశాఖల్లో దిగువస్థాయి సిబ్బంది ఇష్టారాజ్యంగా తయారైంది. అసలే మార్చినెల, ఆపై ఆర్థిక లావాదేవీలు జోరందుకున్న కాలం. దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా ఉన్నతాధికారులు లేక దిగువస్థాయి ఉద్యోగులే చక్కబెడుతున్నారన్న విమర్శులున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చెపుతున్న రెండెంకల అభివృద్ధి ఎలాసాధ్యమవుతుందో.. -
నూటికి నూరు సాధ్యమా?
♦ టెన్త్‌లో వంద శాతం ఉత్తీర్ణతపై అనుమానాలు ♦ విద్యాశాఖలో భారీగా ఖాళీలు ♦ 46 ఎంఈఓ పోస్టులకు 43 మంది ఇన్‌చార్జీలే.. ♦ డిప్యూటీ ఈఓ పోస్టులన్నీ ఖాళీనే ♦ కన్పించని మ్యాథ్స్,సైన్స్ టీచర్లు ♦ 1,371 మంది ఉపాధ్యాయుల కొరత ♦ {పత్యేక తరగతులు నిర్వహించినా ఫలితం డౌటే? పదోతరగతిలో వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని అధికారులు లక్ష్యం పెట్టుకున్నారు. లక్ష్యం సరే కానీ అందుకు అవసరమైన వనరులు లేకుండా ఎలా సాధ్యమని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. విద్యా శాఖలో భారీగా ఖాళీలు ఉన్నాయని, వాటిని భర్తీ చేయకుండా వందశాతం ఉత్తీర్ణత ఎలా సాధ్యమో అధికారులకే తెలియాలి. సబ్జెక్టు టీచర్లు లేకుండానే సర్కార్ స్కూళ్లను నెట్టుకొస్తున్నారని, పర్యవేక్షించే అధికారులు లేకుండా విద్యా శాఖ మొక్కుబడిగా సాగుతోందని ఈ దశలో టెన్త్‌లో టార్గెట్ ఎలా సాధిస్తారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. - సంగారెడ్డి మున్సిపాలిటీ. జిల్లాలో 46 ఎంఈఓ పోస్టులకు గాను 43 మంది ఎంఈఓలు ఇన్‌చార్జీలే. జిల్లాలోని నలుగురు డిప్యూటీ ఈఓలకు గాను అంతా ఇన్‌చార్జిలే కావడం గమనార్హం. ముఖ్యంగా సీఎం జిల్లా కావడంతో పదోతరగతి వార్షిక పరీక్షల్లో రాష్ట్రంలోనే జిల్లాను ప్రథమ స్థానం లో నిలిపేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. విద్యార్థులకు ప్రత్యేక తరగతులతోపాటు ఉపాధ్యాయులకు సైతం బోధన అంశాలపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. వాస్తవంగా జిల్లాలోని 26 మోడల్ స్కూళ్లతోపాటు 43 కేజీబీవీలు, 28 గురుకుల, 4 ఎయిడెడ్, 475 జెడ్పీహెచ్‌ఎస్‌లు, 25 హైస్కూళ్లు ఉన్నాయి. ఇందులో 27,629 మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలకు హాజరుకానున్నారు. హెచ్ఎంలే డిప్యూటీ ఈఓలు.. జిల్లాలో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. చాలా పాఠశాలల్లో ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులు బోధించే వారు లేరు. ఎంఈఓ పోస్టులు ఖాళీగా ఉండటంతో పర్యవేక్షణ కరువైంది. డిప్యూటీ ఈఓ పోస్టులు సైతం ఖాళీగా ఉన్నందున సీనియర్ హెచ్ఎంలే ఇన్చార్జి డిప్యూటీ ఈఓలుగా కొనసాగుతున్నారు. గాడితప్పుతోన్న బడులు... అధికారులుగా హెచ్ఎంలే కొనసాగుతోండడంతో వారు ఉపాధ్యాయుల పట్ల కఠినంగా వ్యవహరించలేకపోతున్నారు. పాఠశాలలు సక్రమంగా నడవకపోయినా చర్యలకు ఉపక్రమించలేకపోతున్నారు. ఫలితంగా పాఠశాలలు గాడి తప్పుతున్నాయి. అనుభవజ్ఞులైన టీచర్లు లేకపోవడంతో బోధన సక్రమంగా సాగడం లేదు. గత రెండేళ్లలో పదోతరగతి ఫలితాలను పరిశీలిస్తే ప్రతి పాఠశాలలో ఫెయిల్ అయిన విద్యార్థులున్నారంటే అక్కడ సంబంధిత సబ్జెక్టు టీచర్లు లేని లోటు స్పష్టంగా కన్పిస్తోంది. ఇప్పటికైనా స్పందిస్తే.. వార్షిక పరీక్షలు దగ్గర పడుతున్నందున ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు చేపడితే మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉందని విద్యా వేత్తలు సూచిస్తున్నారు. తాత్కాలికంగా ఉపాధ్యాయులను నియమించి ప్రత్యేక బోధన తరగతులు నిర్వహిస్తే కొంతలో కొంతైనా పరిస్థితిలో మార్పు వస్తుందని వారు భావిస్తున్నారు. వంద శాతం ఉత్తీర్ణత సాధిస్తాం... పదోతరగతి వార్షిక పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధిస్తాం. జిల్లా ఖ్యాతిని నిలుపుతాం. వంద శాతం ఫలితాలు సాధించేందుకు ఇప్పటికే కలెక్టర్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగానే విద్యార్థులకు రోజూ ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. - నజీమొద్దీన్, డీఈఓ సంగారెడ్డి విద్యార్థుల కోసం తప్పదు... మెరుగైన ఫలితాల కోసం విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. ఆ మాత్రం శ్రమించక తప్పదు. జిల్లాలో మా పాఠశాల విద్యార్థులను జిల్లా, మండల స్థాయి టాపర్లుగా నిలపాలన్నదే మా లక్ష్యం. మెరుగైన ఫలితాలు వస్తే గ్రామానికి, ఉపాధ్యాయులకు కూడా పేరొస్తుంది. సమష్టి కృషితో ముందుకు సాగుతున్నాం. - సుందరరావు, ఉపాధ్యాయుడు, జెడ్పీహెచ్ఎస్ మారెపల్లి మంచి మార్కులు సాధిస్తాం... ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. పాఠ్యాంశాలను ఒకటికి రెండు సార్లు అర్థమయ్యే రీతిలో చెబుతున్నారు. ఈ తరగతులు మాకెంతో ఉపయోగపడుతున్నాయి. వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఈసారి మా పాఠశాలకు జిల్లా స్థాయిలోనే మంచి గుర్తింపును తీసుకొస్తాం. - రవళిక, విద్యార్థిని, జెడ్పీహెచ్ఎస్ మారెపల్లి -
జిల్లాలో పోలీస్స్టేషన్లన్నీ ఖాళీ
- పుష్కరాలకు తరలనున్న పోలీసు యంత్రాంగం - 10న రాజమండ్రిలో రిపోర్ట్ చేయనున్న పోలీసులు - స్థానికంగా అరకొర సిబ్బందితో కొంత ఇబ్బందే నూజివీడు : గోదావరి పుష్కరాల పుణ్యమా అని జిల్లాలోని పోలీసు స్టేషన్లన్నీ మరో రెండు రోజుల్లో ఖాళీ కానున్నాయి. పుష్కరాలకు భారీగా ప్రజలు తరలివచ్చే అవకాశం ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు గాను జిల్లాలోని పోలీసు సిబ్బందిని పెద్ద ఎత్తున బందోబస్తు విధులకు నియమించారు. దీంతో పోలీసు అధికారులతో పాటు సిబ్బంది అంతా పుష్కరాల బందోబస్తు విధులకు తరలివెళ్లనున్నారు. వీరంతా ఈనెల 10వ తేదీనే రాజమండ్రి వెళ్లి రిపోర్ట్ చేయాల్సి ఉంది. ఆ తర్వాత రెండు రోజుల పాటు అక్కడే వారికి పలు అంశాలలో శిక్షణనిస్తారు. జిల్లా నుంచి సీఐలు 20 మంది, ఎస్ఐలు 60మంది, హెడ్కానిస్టేబుల్లు, ఏఎస్ఐలు కలిపి 200 మంది, కానిస్టేబుళ్లు 650 మంది, మహిళా కానిస్టేబుళ్లు 80మంది, మహిళా హోంగార్డులు 20 మంది, హోంగార్డులు 100 మందిని ఇప్పటికే పుష్కరాల విధులకు నియమిస్తూ జిల్లా ఎస్పీ ఉత్తర్వులు జారీచేశారు. దీంతో డ్యూటీ పడిన వారంతా ఈ నెల 10వ తేదీన రాజమండ్రిలో రిపోర్ట్ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. వీరంతా మరల ఈ నెల 26న తమతమ పోలీస్స్టేషన్లకు తరలిరానున్నారు. అప్పటి వరకు స్థానిక పోలీసుస్టేషన్లలో అరకొర సిబ్బంది మాత్రమే విధులు నిర్వహించనున్నారు. అప్రమత్తంగా ఉండకపోతే... ఇంత పెద్ద ఎత్తున పోలీసులు పుష్కరాలకు వెళ్తున్న నేపథ్యంలో పట్టణాల్లో, గ్రామాల్లో నైట్బీట్లు సమర్థవంతంగా అమలుకాని పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. ఈ సమయంలో ప్రజలు అప్రమత్తంగా లేకపోతే దొంగతనాలు జరిగే ప్రమాదముందని, స్థానికులు పోలీసులకు సహకరించాలని పలువురు సూచిస్తున్నారు. -
వెలవెలబోతున్న థియేటర్స్
-
ఇండియా - ఆసీస్ మ్యాచ్ ఎఫెక్టె
-
తెలంగాణలో టీడీపీ ఖాళీ అవుతుంది
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అవుతుందని హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి జోస్యం చెప్పారు. టీఆర్ఎస్లో చేరడానికి చాలామంది టీడీపీ నాయకులు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. మాజీ మంత్రులు తుమ్ముల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస యాదవ్ టీడీపీలో చేరునున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణలో రైతుల రుణ మాఫీకి ఆర్బీఐ ఆటంకం కలిగిస్తోందని నాయిని అన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. -
త్వరలో వాటర్‌బోర్డులో ఖాళీల భర్తీ
హోంమంత్రి నాయిని వెల్లడి నగరంలో నీటిఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని కార్మికులకు సూచన పంజగుట్ట: మహానగరంలో మంచినీటి ఎద్దడి లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని హోం,కార్మికశాఖమంత్రి నాయిని నర్సింహారెడ్డి జలమండలి అధికారులు,కార్మికులను కోరారు. సోమవారం ఖైరతాబాద్‌లోని జలమండలి కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో నూతనంగా నియమితులైన జనరల్ పర్పస్ ఎంప్లాయి(జీపీఈ)లు పదిమంది కార్మికులకునియామకపత్రాలు అందజేసిన సందర్భంగా మంత్రి మాట్లాడారు. బోర్డులో 23 ఏళ్లుగా నానా ఇబ్బందులు పడుతున్న ఎన్ఎంఆర్,హెచ్ఆర్ కార్మికుల విధులను క్రమబద్దీకరించిన ఘనత బోర్డు గుర్తింపు కార్మికసంఘం గౌరవ అధ్యక్షుడు, సాగునీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావుదేనని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలో కార్మికుల సంక్షేమానికి పెద్దపీఠవేస్తున్నామని, సమ్మెలు, లాకౌట్లకు తావులేకుండా కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని హామీఇచ్చారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేస్తామంటూ..బోర్డులో ఖాళీ ఉద్యోగాలను త్వరలో భర్తీ చేస్తామన్నారు. మంగళవారం నూతనంగా నియమితులైన సుమారు 600మంది ఎన్ఎంఆర్,హెచ్ఆర్ కార్మికులకు బోర్డు అధికారులు నియమాక పత్రాలు అందజేస్తారని తెలిపారు. ఈకార్యక్రమంలో జలమండ లి ఎండీ శ్యామలరావు, కామ్‌గార్ యూనియన్ గౌరవాధ్యక్షుడు సతీష్‌కుమార్,ఈఎన్సీ సత్యనారాయణ ఉన్నతాధికారులు, అధికసంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. శాంతిభద్రతలకు పెద్దపీఠ: నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యమిస్తామని నాయిని ప్రకటించారు. పోలీసుశాఖకు తగినన్ని నిధులు కేటాయించడంతోపాటు ఆధునిక ఆయుధాలతోపాటు గల్లీకో కెమెరా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. -
ఖాళీ దిశగా ‘దేశం’
టీడీపీకి జిల్లా అధ్యక్షుడు గొడాం నగేష్ గుడ్‌బై సాక్షి, ఆదిలాబాద్ : జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అవుతోంది. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, కేడర్ చాలావరకు పార్టీకి దూరం అయింది. తాజాగా, తెలంగాణపై టీడీపీ అధినేత చంద్రబాబు వ్యతిరేక వైఖరి, పార్టీలో ఆధిపత్య పోరుతో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, బోథ్ ఎమ్మెల్యే గొడాం నగేష్ టీడీపీకి గుడ్‌బై చెబుతున్నారు. ఈ మేరకు బుధవారం ఆయన స్వగ్రామమైన బజార్హత్నూర్ మండ లం జాతర్లలో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల అభిప్రాయ సేకరణ చేసిన అనంతరం, టీడీపీకి రాజీనామా చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు ప్రకటించారు. కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరుతానని కూడా వెల్లడించారు. చంద్రబాబు టీ-బిల్లును అడ్డుకునేందుకు చేసిన ఒత్తిళ్లు, కార్యకర్తల అభిమతం మేరకు పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. బీజేపీ వైపు ‘పాయల్’ చూపు.. ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి పాయల్ శంకర్ కూడా తెలుగుదేశం పార్టీకి అధికారికంగా రాజీనామా చేసేందుకు ముహూర్తం చూసుకుంటున్నారు. బుధవారం నియోజకవర్గంలోని జైనథ్, బేల, ఆదిలాబాద్ మండలాల నాయకులతో ఆదిలాబాద్‌లోని ఓ హోటల్లో సమావేశమయ్యారు. ఇప్పటికే పార్టీకి దూరంగా ఉంటున్న ఆయన త్వరలోనే తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించి, బీజేపీలో చేరే అవకాశాలున్నాయి. తెలంగాణ బిల్లుకు లోక్‌సభ ఆమోద ముద్ర పడి న వెంటనే జిల్లా రాజకీయ ముఖచిత్రంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ బిల్లు విషయమై ఇన్నాళ్లు వేచి చూసే ధోరణితో ఉన్న నేతలు ఒక్కొక్కరుగా టీడీపీని వీడుతున్నారు. ఎంపీ రాథోడ్ రమేష్‌తో విభేదాలు ఆదిలాబాద్ ఎంపీ రాథోడ్ రమేష్, బోథ్ ఎమ్మెల్యే గొడాం నగేష్‌ల మధ్య ఆధిపత్య పోరు చాలాకాలంగా కొనసాగుతోం ది. ఈ ఇద్దరు పార్టీలో ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిం చారు. ఎంపీ నెల రోజుల క్రితం చేపట్టిన పల్లెనిద్ర విషయం లో కూడా వీరి మధ్య ఉన్న విభేదాలు బహిర్గతమయ్యా యి. పార్టీ అంతర్గత సమావేశాల్లో పల్లెనిద్ర కార్యక్రమాన్ని నగేష్ వ్యతిరేకించినట్లు చర్చ జరిగింది. మరోవైపు ఎంపీ రమేశ్ బోథ్ నియోజకవర్గంలో నగేష్ వ్యతిరేక వర్గాన్ని పెంచి పోషించారనే విమర్శలు ఉన్నాయి. తన ఎంపీ లాడ్స్ నిధుల నుంచి ఆ వర్గం నాయకులకు పనులు ఇవ్వడం వంటివి చేశా రు. ఒక్కో సందర్భంలో ఇరువురు పరస్పరం చంద్రబాబుకు ఫిర్యాదులు చేసుకున్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. బుధవారం నగేష్ జాతర్లలో నిర్వహించిన ఈ సమావేశానికి రాథోడ్ రమేష్ వర్గం నాయకులకు, కార్యకర్తలు దూరంగా ఉన్నారు. ఈ సమావేశానికి వెళ్లవద్దని ఢిల్లీలో ఉన్న రాథోడ్ రమేష్ తన వర్గం నేతలకు ఫోన్లు చేసి చెయడం స్థానికంగా చర్చనీయాంశమమైంది. బోథ్‌కు టీడీపీ అభ్యర్థి కరువు నగేష్ టీడీపికి గుడ్‌బై చెప్పడంతో బోథ్ నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థి ఎవరనేది ప్రశ్నార్థకంగా మారింది. నాలుగు పర్యాయాలు నగేష్ టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. ఆయన తండ్రి రామారావు కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు.