అరుణోదయ కార్యాలయాన్ని ఖాళీ చేయించిన పోలీసులు
ప్రభుత్వం కక్ష గట్టింది: విమలక్క
హైదరాబాద్: అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కార్యాలయాన్ని కోర్టు ఆదేశాల మేరకు పోలీ సులు ఖాళీ చేయించి ఇంటి యజమానికి అప్పగించారు. అరవింద్‌నగర్‌లో ఓ అద్దె ఇంట్లో విమలక్క 2009 నుంచి అరుణోదయ రాష్ట్ర కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. 2016 డిసెంబరులో నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి రూరల్ పోలీసులు ఓ కేసులో భీంభరత్ అనే వ్యక్తిని అరెస్టు చేసి న సందర్భంగా ఈ కార్యాలయంలో సోదాలు నిర్వహించి నిషేధిత వస్తువులు లభించాయం టూ సీజ్ చేశారు.
కాగా, యజమాని ఆర్‌ఎస్ శాస్త్రి తమ ఇంటిని 2009లో కరియమ్మ అనే మహిళకు అద్దెకు ఇచ్చానని, అయితే తమ ఇంట్లో అరుణోదయ సంస్థ నిర్వహిస్తున్నట్టు 4 నెలల తర్వాత తెలిసిందన్నారు. అప్పటి నుంచి ఇల్లు ఖాళీ చేయమంటూ విజ్ఞప్తి చేస్తూ నే ఉన్నామన్నారు. చివరకు గత నెల 25న కోర్టు తమకు అనుకూలంగా తీర్పును ఇచ్చిం దన్నారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు... ఇంట్లో ఉన్న వస్తువులను అరుణోదయ సమాఖ్యకు, శాస్త్రికి ఇంటిని అప్పగించారు.
నాలుగు గంటల హైడ్రామా...
అరుణోదయ కార్యాలయాన్ని ఇంటి యజ మానికి అప్పగించే సందర్భంగా 4 గంటల పాటు హైడ్రామా నడిచింది. మాచారెడ్డి రూరల్ పోలీసులు కార్యాలయాన్ని సీజ్ చేసిన సమయంలో సాక్షి సంతకం తీసుకున్న అరుణోదయ సమాఖ్య నాయకుడు మోహన్ బైరాగితో అరవింద్‌నగర్‌కు చేరుకోగా, విషయం తెలిసిన విమలక్క, ఇతర కళాకారులు అక్కడికి చేరుకున్నారు.
కోర్టు ఆదేశాలు తమకు ఇవ్వకుండా ఎలా ఖాళీ చేయిస్తారని పోలీసులను ప్రశ్నించారు. ఖాళీ చేయడానికి కనీసం వారం గడువైనా ఇవ్వాలన్నారు. పోలీసులు, ప్రభుత్వం తమపై కక్షతో ఇంటిని ఖాళీ చేయిస్తున్నారన్నారు. దీంతో కోర్టు ఆదేశాలను పోలీసులు విమలక్కకు అందజేశారు. విద్యావేత్త చుక్కా రామయ్య, న్యూడెమోక్రసీ నాయకుడు గోవర్దన్ తదితరులు విమలక్కను కలసి పరిస్థితి తెలుసుకున్నారు.