అరుణోదయ విమలక్క
ఒక గొంతుక అనేక గొంతుకలై నాలుగు దశాబ్దాలుగా ప్రజలపక్షం నిలవడం అపురూపం. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య పురుడు పోసు కున్న పదేళ్ల తరువాత, విప్లవ కుటుం బంలో పుట్టిన విమల 1964లో అరుణ గానవనంలోకి ప్రవేశించింది. నలభై ఏళ్లుగా ఆగకుండా సాగుతున్న విప్లవ సాంస్కృతిక రంగంలో అజేయంగా నిలిచింది.
కళాకారిణిగా ఉంటూ అరుణోదయ (ఏసీఎఫ్)కి నాయకత్వం వహిం చింది. జాతీయ స్థాయిలో తెలుగువారి చేవ చూపించిన మహి ళల్లో విమలక్క ఒక్కరే. దేశంలో వివిధ భాషా రాష్ట్రా లలో తన గళం వినిపించిన ఘనత ఆమెదే. రెండు దశాబ్దాలుగా తెలంగాణ కోసం తన పంచేంద్రియా లను ఆట, మాట, పాట, సంగీతం ఆహార్యంగా చేసింది. తనకి సంకెళ్లు వేసిననాడు గుండె చెదరలేదు. కార్యా లయాన్ని పోలీసులు ఆక్రమించి రోడ్డు మీద పడేసిననాడు వెరవలేదు. పాటలచెట్టుని నరికేశామనుకున్నారు. తాను, తన కళాకారులు రోజుకొక్క చోట తలదాచుకున్నారు. నిర్బంధా లలో సైతం అనేక రాగాలవేడి కాపు కుని చలికాచుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి అరెస్టు, నిర్బంధం అరుణోదయ విమలపైనే!
కడుపులో బాధ ఎలా కాలి పోతుందో, విషాదాన్ని ఏ పేగు మూలన కుక్కి పెడుతుందో తెలి యదు. కానీ చిరునవ్వు ఆమె పెదా లని విడిచిపోలేని నేస్తం. మహిళా కళా కారిణులలో దేశం గర్వించే స్థాయి ఆమెది. సగం ఆకాశం కాదు. ఒకే ఒక్క విమలక్క. జనం చప్పట్లే ఆమెకు జేజేలు. విప్లవ సాంస్కృతికోద్య మంలో సుదీర్ఘంగా, నిలి చిన పాటల కొండకి అభి నందనలు.
16 సెప్టెంబర్ 2018 (ఆది వారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘నలభై ఐదేళ్ల అరు ణోదయంలో విమలక్క విప్లవ ప్రస్థాన గానసభ’ కార్యక్రమం జరుగుతుంది. ఈ సభలో గద్దర్, అల్లం నారాయణ, జయధీర్ తిరుమలరావు, కె. రామ చంద్రమూర్తి, కె. శ్రీనివాస్, ప్రొ‘‘ ఎ. వినాయక్‌రెడ్డి తదితరులు పాల్గొం టారు. అందరికీ ఆహ్వానం.
జయధీర్ తిరుమలరావు
మొబైల్ : 99519 42242
Comments
Please login to add a commentAdd a comment