
తెలంగాణలో టీడీపీ ఖాళీ అవుతుంది
తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అవుతుందని హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి జోస్యం చెప్పారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అవుతుందని హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి జోస్యం చెప్పారు. టీఆర్ఎస్లో చేరడానికి చాలామంది టీడీపీ నాయకులు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. మాజీ మంత్రులు తుమ్ముల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస యాదవ్ టీడీపీలో చేరునున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
తెలంగాణలో రైతుల రుణ మాఫీకి ఆర్బీఐ ఆటంకం కలిగిస్తోందని నాయిని అన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు.