
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ భార్య గౌరీ రెస్టారెంట్ బిజినెస్‌లో ఉన్నారు. అంతేకాదుఇంటీరియర్ డిజైనర్, చిత్ర నిర్మాత ,వ్యవస్థాపకురాలిగా తన కంటూ ప్రత్యేకమైన పేరు ఫ్రఖ్యాతులు సంపాదించుకున్న సెలబ్రిటీ మహిళ. ముఖ్యంగా ఇంటీరియర్ డిజైనర్‌గా ఆమెకు అనేకమంది సెలబ్రిటీ కష్టమర్లు ఉన్నారు. బాలీవుడ్ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు ,అంతర్జాతీయ ప్రముఖుల క్లయింట్లకు సేవలు అందించే లగ్జరీ ఇంటీరియర్ డిజైన్ స్టోర్ గౌరీ ఖాన్ డిజైన్స్‌ను ముంబైలో నడుపుతోంది.అలాగే ఇటీవల టోరీ పేరుతో ముంబైలో ఒక హై-ఎండ్ రెస్టారెంట్ లగ్జరీ రెస్టారెంట్‌ను నిర్వహిస్తోంది. తాజాగా ఈ హోటల్ వివాదంలో ఇరుక్కుంది.
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ , యూట్యూబర్, సార్థక్ సచ్‌దేవా గౌరీ ఖాన్ టోరీ ఫుడ్‌పై సంచలన ఆరోపణలు చేశాడు. ఇక్కడ 'నకిలీ' పనీర్ వడ్డిస్తున్నారంటూ ఒక వీడియో చేశాడు. దీంతో ఇంటర్నెట్‌లో వైరల్ అయింది.
ఇదీ చదవండి : రెండో పెళ్లి చేసుకున్న ప్రముఖ యాంకర్, ఫోటోలు వైరల్
ఫుడ్ ఇన్‌ఫ్లుయెన్సర్లు తరచుగా సెలబ్రిటీలు నడిపే రెస్టారెంట్‌లను సందర్శించి, వాటి నుండి సమీక్షలను పంచుకుంటూ ఉంటారు. ఇలాంటి వీడియోలు సాదారణంగా ప్రజాదరణ పొందుతాయి. అలాగే సదరు హోటల్ ఖ్యాతిని పెంచుకోవడానికి కూడా దోహదపడతాయి. కానీ ఈ విషయంలో మాత్రం గౌరీ ఖాన్‌కు ఎదురు దెబ్బ తగిలింది. గౌరీ ఖాన్‌ఖు చెందిన లగ్జరీ హోటల్ టోరీ నకిలీ పనీర్ (కాటేజ్ చీజ్)ను అందిస్తుందని, ఇది కల్తీకి గుర్తు అని తన వీడియోలో పేర్కొన్నాడు సార్థక్ సచ్‌దేవా. తన వీడియోలో టోరీలో వడ్డించే పనీర్ ముక్కపై అయోడిన్ టింక్చర్ పరీక్ష కూడా చేసాడు. ఇది స్టార్చ్ స్థాయిని గుర్తించడానికి ఉపయోగిస్తారట. , అయోడిన్ వేయగానే పనీర్ ముక్క రంగు నలుపు నీలం రంగులోకి మారిపోయింది. దీంతో తాను షాక్ అయ్యానంటూ సార్థక్ సచ్‌దేవా ఆరోపించారు.
దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. కొందరు ఫన్నీగా, మరికొందరు అతణ్ని ట్రోల్ చేస్తూ కమెంట్స్ చేశారు. మరికొందరు యూజర్లు అతనిని సమర్థించారు."గౌరీ, షారూఖ్ ఖాన్ ఇది నిజమేనా, లేదా అతనుఅబద్ధం చెబుతున్నాడా? దయచేసి స్పందించండి అంటూ మరికొంతమంది స్పందించారు. మరొక అభిమాని అయితే హెల్తీ సెలబ్రెటీలు నక్లీ పనీర్ తింటున్నారా అంటూ వ్యాఖ్యానించడం గమనార్హం.
గౌరీ ఖాన్ టీం స్పందన
"అయోడిన్ పరీక్ష స్టార్చ్ ఉనికిని ప్రతిబింబిస్తుంది తప్ప పనీర్ నాణ్యత ప్రామాణికతను కాదు అంటూ టోరీ టీం స్పందించింది. వంటకంలో సోయా ఆధారిత పదార్థాలు ఉన్నం వల్లే, అలాంటి రియాక్షన్ వచ్చే అవకాశం ఉంది తప్ప, అది నకిలీదికాదని స్పష్టత ఇచ్చింది. తమ పనీర్ చాలా స్వచ్చమైందనీ, టోరీలో పదార్థాలన్నీ నాణ్యంగా, ఆరోగ్యంగా ఉంటాయని హామీ ఇచ్చింది.