
లయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) అనగానే ఆయిల్ నుంచి టెలికాం దాకా వివిధ రంగాల్లో అందిస్తున్న సేవలు గుర్తొస్తాయి. ముఖేష్ అంబానీ (Mukesh Ambani) సారధ్యంలోని రిలయన్స్ ప్రపంచంలోనే అత్యధికంగా మామిడిపండ్లను ఎగుమతి చేసే సంస్థల్లో ఒకటిగా ఉందని తెలుసా? అంబానీకి ఎన్ని ఎకరాల మామిడి తోట ఉంది? ఎన్ని రకాలు మామిడి పళ్లను పండిస్తారు? అసలు మ్యాంగో ఫామ్ వెనుకున్న రియల్ స్టోరీ ఏంటి? ఆ వివరాలు మీకోసం.
గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో 600 ఎకరాల మామిడి తోట (Reliance Mango Farm) రిలయన్స్ సొంతం. ఇందులో 1.5 లక్షలకు పైగా వివిధ రకాల మామిడి చెట్లున్నాయి. అల్ఫాన్సో మొదలు టామీ అట్కిన్స్ , 200లకు పైగా దేశీ, విదేశీ రకాల మామిడి చెట్లు ఫలాలనిస్తాయి. వీటిల్లో చాలా వరకు ప్రపంచంలోని అత్యుత్తమ రకాలకు చెందినవి కావడం విశేషం.
ఇదీ చదవండి : ప్రిన్స్ హ్యారీతో విడాకులా? తొలిసారి మౌనం వీడిన మేఘన్
అయితే రిలయన్స్ మామిడి వ్యాపారంలోకి ప్రవేశించటానికి వెనుక ఒక కథ ఉంది. మ్యాంగో ఫామ్ హౌస్ వెనకాల పెద్ద చరిత్ర ఉంది. 1997లో, జామ్‌నగర్‌లోని రిలయన్స్ శుద్ధి కర్మాగారం భారీ కాలుష్యానికి కారణమైంది. గుజరాత్ కాలుష్య నియంత్రణ బోర్డు నుండి పదేపదే నోటీసులిచ్చింది. పర్యావరణాన్ని కాపాడి, ఫ్యాక్టరీని కొనసాగించే లక్ష్యంతో, అనివార్యంగా రిలయన్స్ మామిడి తోటను పెంచేందుకు నిర్ణయం తీసుకుంది రిలయన్స్. 1998 లో ఈ కర్మాగారం చుట్టూ ఉన్న బంజరు, ఉప్పునీటి భూముల్లో మామిడి చెట్లను నాటించింది. ఇక్కడున్న అనేక ప్రతికూలతలను అధిగమించేందకు కంపెనీ కొత్త టెక్నాలజీని వినియోగించింది. డీశాలినేషన్, బిందు సేద్యం, వర్షపు నీటి సంరక్షణ, పోషక నిర్వహణ పద్దతులను పాటించారు. సముద్రపు నీటిని శుద్ధి చేసేందుకు, డీశాలినేషన్, నీటి కొరత సమస్యను ఎదుర్కోవడానికి వాటర్ హార్వెస్టింగ్ వంటి పద్దతులను ఉపయోగించారు.
చదవండి: ముద్దుల మూట, మనసెలా వచ్చింది : వైద్యురాలి వీడియో వైరల్
దాదాపు 7-8 సంవత్సరాల ప్రయత్నాలు ఫలించాయి. ఈ గార్డెన్ పేరే ధీరూభాయ్ అంబానీ లఖిబాగ్ అమ్రాయీ. ప్రపంచంలోనే అతిపెద్దదిగా 600 ఏకాల విస్తీర్ణంలో చుట్టూ పచ్చని చెట్లతో ఏడాది 600 టన్నుల మామిడి పళ్లను అందిస్తుందీ తోట. అందుకే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మామిడి పండ్ల ఎగుమతిదారుగా అవతరించింది. అలా కాలుష్య కాసార నుంచి పచ్చని ప్రకృతిక్షేత్రంగా ఎదిగింది. దీంతో పాటు రిలయన్స్ ప్రతి సంవత్సరం ఒక లక్ష మొక్కలను ఉచితంగా పంపిణీ చేస్తుంది. అలాగే ఆధునిక వ్యవసాయంలో శిక్షణ అందించడం ద్వారా స్థానిక రైతులకు సహాయం చేస్తుంది.
ఇదీ చదవండి: మనవడితో 50 ఏళ్ల మహిళ పెళ్లి : ఫ్యామిలీని లేపేసేందుకు కుట్ర?