Maldives Row : భారత్‌పై చైనా మీడియా సంచలన కథనాలు | China Media Sensational Comments On India In Maldives Row | Sakshi
Sakshi News home page

మాల్దీవుల వివాదం.. భారత్‌పై చైనా మీడియా అక్కసు

Published Tue, Jan 9 2024 9:22 PM | Last Updated on Tue, Jan 9 2024 9:23 PM

China Media Sensational Comments On India In Maldives Row - Sakshi

న్యూఢిల్లీ: ఓ వైపు భారత్‌, మాల్దీవుల మధ్య దౌత్యపరమైన వివాదం కొనసాగుతోంది. మరోవైపు తాజాగా ఈ వివాదంలో చైనా తలదూర్చింది. ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించిన ప్రధాని మోదీపై విమర్శలు చేసిన మాల్దీవుల మంత్రులపై భారత్‌ వ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబికిన విషయం తెలిసిందే. ఈ మంత్రులను  మాల్దీవుల ప్రభుత్వం ఇప్పటికే సస్పెండ్‌ చేసింది. 

అయితే ఈ విషయంలో చైనా మీడియా మాత్రం భారత్‌దే తప్పన్నట్లు చిత్రీకరిస్తూ కథనాలు ప్రచురిస్తోంది. ‘దక్షిణ ఆసియాలో ఆధిపత్యం ప్రదర్శించాలనే మనస్తత్వంతో భారత్‌ ఉంది. ఎప్పటి నుంచో భారత్‌ తీరు ఇలానే ఉంది. ఇదే ఆ ప్రాంతంలోని మాల్దీవుల లాంటి  దేశాలతో భారత సంబంధాలు దెబ్బతినడానికి కారణమవుతోంది.

మాల్దీవులతో వివాదానికి సంబంధించి మా మీదకు మాత్రం తప్పు నెట్టకండి’అని పలువురు చైనా విశ్లేషకులు భారత్‌పై రాసిన కథనాలను ఆ దేశ అధికార పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ ప్రచురించింది. భారత్‌తో ఓ పక్క వివాదం నడుస్తున్న సమయంలో మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్‌ మొయిజ్జు ఐదు రోజుల పర్యటన కోసం చైనాలోనే ఉండటం గమనార్హం. 

ఇదీచదవండి..ఇజ్రాయెల్‌ గాజా యుద్ధం.. హౌతీ వ్యాఖ్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement