
PM Georgia Meloni Announces Separation ఇటలీ ప్రధాని జార్జియా మెలోని సంచలన విషయాన్ని ప్రకటించారు. తన చిరకాల ప్రియుడు టెలివిజన్ జర్నలిస్ట్ ఆండ్రియా గియాంబ్రూనో నుండి విడిపోతున్నట్లు ఎక్స్ (ట్విటర్(ద్వారా) శుక్రవారం ప్రకటించారు. ఇటీవల ఆండ్రియా చేసిన అభ్యంతర వ్యాఖ్యలే ఈ పరిణామానికి దారితీసినట్టు తెలుస్తోంది.
‘ఆండ్రియా జియాంబ్రూనోతో దాదాపు 10 సంవత్సరాల పాటు కొనసాగిన బంధం ముగిసింది’’ అని ప్రధాని మెలోని వెల్లడించారు. గత కొంతకాలంగా తమదారులు వేరుగా ఉన్నాయి. ఇక ఇపుడు వాటిని చెప్పాల్సిన సమయం వచ్చిందంటూ ఆమె ట్వీట్ చేశారు. అతనితో కలిసి గడిపిన అద్భుతమైన కాలానికి, ఎదుర్కొన్న ఇబ్బందులకు ఇక స్వస్తి. తన జీవితంలో గినేవ్రా పాపను అందించినందుకు అతనికి కృతజ్ఞతలు అంటూ ఆమె పోస్ట్ చేశారు.
అంతేకాదు ఆ ఎపిసోడ్ తర్వాత మెలోని తన భాగస్వామి చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాల్ని చేయవద్దని, భవిష్యత్తులో జియాంబ్రూనో ప్రవర్తనకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం తాను ఇవ్వబోనని ప్రధాని మెలోని తేల్చి చెప్పారు. గత పదేళ్ళుగా సహజీవనం చేస్తున్న మెలోనీ, ఆండ్రియా ఈ దంపతులకు ఏడేళ్ల కుమార్తె ఉంది. కుమార్తె బాధ్యతలను మెలోనీ తీసుకున్నట్టు తెలుస్తోంది.
కాగా ప్రముఖ టీవీ ఛానెల్ లో వ్యాఖ్యాతగా పని చేస్తున్న ఆండ్రియా మహిళా సహోద్యోగిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం విమర్శలకు తావిచ్చింది. 2015లో మెలెనీ కనిపించిన ఒక టీవీ షో రచయితగా ఆండ్రియాను కలిసారు.