
వాషింగ్టన్: జర్మనీకి చెందిన దిగ్గజ టెక్నాలజీ కంపెనీ సీమెన్స్ స్పెయిన్ విభాగం సీఈవో అగస్టిన్ ఎస్కోబార్ (agustin escobar) కుటుంబం మరణానికి ‘జీసెస్ నట్’ (jesus nut) కారణమైందని నిపుణులు భావిస్తున్నారు.
గత గురువారం ఆగస్టిన్ ఎస్కోబార్, అతని భార్య, మెర్సి కాంప్రూబి మాంటాల్, వారి ముగ్గురు పిల్లలు (వయస్సు 4, 5, 11), పైలట్‌తో సహా సైట్ సీయింగ్ కోసం బయల్దేరారు. ఇందుకోసం బెల్ 206 అనే సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్‌ను వినియోగించారు.
అయితే, సీఈవో కుటుంబం ప్రయాణిస్తున్న హెలికాప్టర్ వాల్ స్ట్రీట్ హెలిపోర్ట్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు టేకాఫ్ అవుతుండగా.. మన్‌హట్టన్ వినువీధిలో .. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దిశగా వెళ్లింది. ఆ సమయంలో గిరిగిరా తిరుగుతూ న్యూయార్క్ నగరంలోని ‘మిరాకిల్ ఆన్ ది హడ్సన్’ (miracle on the hudson) నదిలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
ప్రమాదంపై అందిన ప్రాథమిక సమాచారం మేరకు.. పక్షి ఢీకొట్టడం వల్లే హెలికాఫ్టర్ ప్రమాదం జరిగి ఉంటుందేమోనని అందరూ భావించారు. హెలికాప్టర్‌కు ప్రమాదం జరిగే సమయంలో స్థానికులు వీడియోలు తీశారు. ఆ వీడియోల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఘోరం జరిగే సమయంలో పక్షుల జాడ ఎక్కడా కనిపించలేదు. దీంతో హెలికాప్టర్ ప్రమాదానికి కారణం ఏమై ఉంటుందా? అన్న కోణంలో దర్యాప్తు కొనసాగింది. పలు ఆధారాలు, ఏవియేషన్ రంగ నిపుణులు, ప్రమాదానికి ముందు జరిగిన నిర్లక్ష్యం ఆధారంగా బెల్ 206 హెలికాప్టర్ ప్రమాదానికి కారణం ‘జీసెస్ నట్’ కారణమనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
ఏంటి ‘జీసెస్ నట్’
జీసెస్ నట్ అనేది హెలికాప్టర్ మెయిన్ రోటర్ మాస్ట్‌పై(mast) అమర్చబడి ఉంటుంది. అంటే ఇది హెలికాప్టర్ రెక్కలు..హెలికాప్టర్ ఇంజిన్‌కు జాయింట్ చేసి ఉంటుంది. ఈ భాగం వద్ద జీసెస్ నట్ ఉంటుంది. అది ఏ మాత్రం సరిగ్గా లేకపోయినా, ఊడినా హెలికాప్టర్ మొత్తం అదుపు తప్పుతుంది. ఆ నట్టు ఊడి పోతే హెలికాప్టర్ ప్రమాదం నుంచి బయటపడేయడం పైలెట్ వల్ల కూడా సాధ్యం కాదు. ఆగస్టిన్ ఎస్కోబార్ కుటుంబం ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లోని ఈ జీసెస్ నట్ ఊడిపోవడం వల్లే విషాదం చోటు చేసుకున్న న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. ప్రస్తుతం ఈ ఘటనపై ఎఫ్‌ఏఏ (fedaral viation Administration) విచారణను వేగవంతం చేసింది.
‘జీసెస్ నట్’ అంటే ఏమిటి?.. చరిత్ర ఏం చెబుతోంది
జీసెస్ నట్ అనే పదం వియత్నాం యుద్ధంలో అమెరికన్ సైనికుల నోట తొలిసారి ఈ పదం వెలుగులోకి వచ్చినట్లు చరిత్ర చెబుతోంది. 1930, 1940లలో యుద్ధ సమయంలో అమెరికా నేవి ప్రత్యర్థుల్ని మట్టికరింపించేందుకు చిన్న ఎయిర్ క్ట్రాప్ట్‌లను భారీ సంఖ్యలో డిజైన్ చేయించింది. కాన్సాలిడేటెడ్ మోడల్ 28లో పీబీవై కాటలినా అనే ఎయిర్ క్ట్రాప్ట్‌లో తొలిసారి ఈ నట్టును వినియోగంలోకి తెచ్చారు. పైన చెప్పుకున్నట్లుగా ఈ నట్టు ఎయిర్ క్ట్రాప్ట్ రెక్కలకు, ఇంజిన్‌కు అనుసంధానం చేసి ఉంటుంది. అయితే వియత్నంతో జరిగే యుద్ధంలో ఈ ఎయిర్ క్ట్రాఫ్ట్‌లో సైనికులు ప్రయాణిస్తుండగా ఎదైనా ప్రమాదం జరిగితే ఆ నట్టు బిగించిన రూటర్ మాస్ట్ ఊడిపోతే .. జీసెస్‌ను ప్రార్థించడం తప్ప ఏం చేయలేం అని అమెరికా సైనికులు అనేవారంటూ వీకీపీడియా సమాచారం చెబుతోంది.
ప్రయాణానికి ముందే
అంతేకాదు, ఈ తరహా జీసెస్ నట్ ఉన్న ఎయిర్‌క్రాప్ట్‌లలో ప్రయాణించే ముందు నట్టు సరిగ్గా ఉందా? లేదా? అని పరిశీలించాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే ప్రయాల్సి ఉంది. లేదంటే ప్రాణాలు గాల్లోనే కలిసి పోవడం ఖాయం. తాజాగా ‘మిరాకిల్ ఆన్ ది హడ్సన్’ నదిలో చోటు చేసుకున్న సీమెన్స్ స్పెయిన్ విభాగం సీఈవో అగస్టిన్ ఎస్కోబార్ కుటుంబం హెలికాప్టర్ ప్రమాదం ఈ జీసెస్ నట్ పనితీరుపై దృష్టిసారించకపోవడం వల్లే ప్రాణ నష్టం జరిగినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.