
‘సిల్వర్ జూబ్లీ వేడుకల్లో మంత్రి పాల్గొంటారు’
బాన్సువాడ : పట్టణంలోని ఎస్‌ఆర్‌ఎన్‌కే డి గ్రీ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకలను గురువారం నిర్వహించనున్నామని, ఇందులో జి ల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పా ల్గొననున్నారని వ్యవసాయ సలహాదారు పో చారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. మంగళవా రం డిగ్రీ కళాశాలలో సిల్వర్ జూబ్లీ వేడుకల కరపత్రాలను ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసు ల బాల్‌రాజ్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కళాశాల ఏర్పాటు చేసినప్పటి నుంచి గత సంవత్సరం వరకు 13,050 మంది చదువుకున్నారని, ఇందులో సుమారు 10 వేల మంది ప్ర భుత్వ ఉద్యోగాలు సాధించారని, మూడు వే ల మంది ప్రైవేటు రంగాల్లో రాణిస్తున్నారని పేర్కొన్నారు. పూర్వ విద్యార్థులందరూ వ చ్చి సిల్వర్ జూబ్లీ వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఏ ర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో కళా శాల ప్రిన్సిపల్ వేణుగోపాల్‌స్వామి, కాంగ్రె స్ నాయకులు పోచారం సురేందర్‌రెడ్డి తదితరులున్నారు.
‘వక్ఫ్ సవరణ చట్టంపై అవగాహన కల్పించాలి’
నాగిరెడ్డిపేట: వక్ఫ్ సవరణ చట్టంపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని బీజేపీ కి సాన్ మోర్చా రాష్ట్ర హార్టికల్చర్ కన్వీనర్ గంగారెడ్డి పేర్కొన్నారు. ధర్మారెడ్డిలో మంగళవా రం వక్ఫ్ సవరణ చట్టంపై కార్యకర్తలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వక్ఫ్ సవరణ చట్టంపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎంలు తప్పుడు ప్రచారం ద్వారా అపోహలు సృష్టిస్తూ, శాంతిభద్రతల సమస్య తలెత్తేలా చేస్తున్నాయని ఆరోపించారు. నిరుపేద ముస్లింల కు న్యాయం చేసేందుకే కేంద్రప్రభుత్వం వ క్ఫ్ సవరణ చట్టం తీసుకువచ్చిందన్నారు. వాస్తవమేమిటో ప్రజలకు తెలిసేలా కార్యకర్త లు కృషి చేయాలన్నారు. సమావేశంలో బీజే పీ మండలాధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు హన్మండ్లు, నరేందర్‌రెడ్డి, దేవిసింగ్, మండల ఉపాధ్యక్షులు ఈశ్వర్‌గౌడ్, మల్లేశ్, విష్ణు, నాయకులు భాస్కర్ నాయక్, పోచయ్య, గణేష్ నాయక్, బాలు తదితరు లు పాల్గొన్నారు.
టీఎస్‌ఎన్‌ఏ వైస్
ప్రెసిడెంట్‌గా ఆరోగ్య లక్ష్మి
బాన్సువాడ రూరల్ : తెలంగాణ స్టేట్ న ర్సింగ్ అసోసియేషన్(టీఎస్‌ఎన్‌ఏ) వై స్ ప్రెసిడెంట్‌గా బా న్సువాడ సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ పూదోట ఆరోగ్య లక్ష్మి ఎన్నికయ్యారు. సోమవారం హైదరాబాద్‌లో ని ర్వహించిన కార్యక్రమంలో ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వైస్ ప్రెసిడెంట్‌గా ఎ న్నికైన ఆరోగ్య లక్ష్మిని స్థానిక వైద్యులు, న ర్సులు అభినందించారు.
ఫుట్‌బాల్ అండర్ –14 రాష్ట్ర జట్టుకు ఎంపిక
కామారెడ్డి టౌన్: ఈనెల 25 నుంచి మహారాష్ట్రలోని కొల్లాపూర్‌లో జరిగే జాతీయ స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు జిల్లాకు చెందిన విద్యార్థిని ఎంపికై నట్లు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి హీరాలాల్ తెలిపారు. రామారెడ్డి మండలం అన్నారం గ్రామ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి అక్షయ అండర్–14 బాలికల విభాగంలో రాష్ట్ర జట్టుకు ఎంపికైందని పేర్కొన్నారు. మంగళవారం డీఈవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అక్షయను డీఈవో కార్యాలయ సూపరింటెండెంట్ జగన్నాథం, వ్యాయామ ఉపాధ్యాయుడు చంద్రయ్య తదితరులు అభినందించారు.

‘సిల్వర్ జూబ్లీ వేడుకల్లో మంత్రి పాల్గొంటారు’

‘సిల్వర్ జూబ్లీ వేడుకల్లో మంత్రి పాల్గొంటారు’