
మతిస్థిమితం లేని మహిళ ఆత్మహత్య
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని ఎక్కపల్లి గ్రామానికి చెందిన ల్యాగల శోభ(45) అనే మహిళ బుధవారం ఉరేసుకొని మృతి చెందినట్లు ఎస్సై వెంకట్రావు తెలిపారు. గత నాలుగైదు సంవత్సరాలుగా శోభ మతిస్థిమితం కోల్పోయి వింతగా ప్రవర్తించేదని, ఆస్పత్రుల్లో వైద్యం చేయించినా తగ్గలేదు. మంగళవారం రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో బాత్‌రూమ్ వద్ద ఉన్న కర్రకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. భర్త పర్వయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ముగ్గురికి జైలు
రెంజల్(బోధన్): డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబ డిన ముగ్గురికి జైలు శిక్ష విధించగా మరో ము గ్గురికి బోధన్ ద్వితీయ శ్రేణి అదనపు న్యాయమూర్తి జరిమానా వేసినట్లు ఎస్సై చంద్రమో హన్ తెలిపారు. మంగళవారం సాయంత్రం సాటాపూర్ చౌరస్తాలో వాహనాల తనిఖీ చే స్తుండగా తాగి వాహనాలు నడిపిన వారిని పట్టుకొని కేసు నమోదు చేసి బుధవారం కోర్టుకు తరలించినట్లు పేర్కొన్నారు. ముగ్గురికి రెండు రోజుల జైలు, మరో ముగ్గురికి రూ. 4 వేల చొప్పున జరిమానా విధించారు.
కిరాణా షాప్ యజమానికి..
ఖలీల్‌వాడి: నగరంలోని రెండో టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నిర్దేశిత సమయానికి మించి కిరాణాదుకాణాన్ని తెరిచి ఉంచిన యజమాని షేక్ జుబేర్ హాజీపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై యాసీన్ ఆరా ఫత్ బుధవారం తెలిపారు. సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చగా నాలుగు రోజుల జైలు శిక్ష విధించినట్లు చెప్పారు.