
8వ తేదీ నుంచి 12 రైళ్ల సర్వీస్‌లు రద్దు
కాజీపేట రూరల్ : నార్త్ ఇండియా రాయ్‌పురా వ ద్ద గల కొటార్లియా (కేఆర్‌ఎల్) రైల్వే స్టేషన్ వద్ద జరుగుతున్న నాన్ ఇంటర్ లాకింగ్ రైల్వే వర్క్స్ కారణంగా కాజీపేట జంక్షన్ మీదుగా ప్రయాణించే సికింద్రాబాద్–దర్బాంగా–సికింద్రాబాద్ మధ్య ప్రయాణించే ఎక్స్‌ప్రెస్ రైళ్ల సర్వీస్‌లను రద్దు చేసినట్లు కాజీపేట రై ల్వే అధికారులు గురువారం తెలిపారు. సికింద్రాబాద్–దర్బాంగా జంక్షన్ (17007) ఎ క్స్‌ప్రెస్ ఏప్రిల్ 8, 12, 15, 19, 22వ తేదీల్లో రద్దు చేసినట్లు, అదేవిధంగా దర్బాంగా జంక్షన్–సికింద్రాబాద్ (17008) ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ 11, 15, 18, 22, 25వ తేదీల్లో రద్దు చేసినట్లు రైల్వే ఎంకై ్వరీ కౌంటర్ వద్ద డిస్‌ప్లే చేశారు.