
వేసవి తీవ్రతతో మార్కెట్ వేళల్లో మార్పు
● 30వ తేదీ నుంచి ప్రతి బుధవారం బంద్
వరంగల్: వేసవి ఎండల తీవ్రత పెరగడంతో వరంగల్ వ్యవసాయ మార్కెట్‌లో నిర్వహించే బీటు సమయాల్లో మార్పులు చేసినట్లు వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రతినిధులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 28(సోమవారం నుంచి 11జూన్ తేది వరకు) మిర్చి బీటు ఉదయం 7–05 గంటలకు, పత్తి బీటు ఉదయం 8–05గంటలకు, పల్లికాయ ఉదయం 8–15, పసుపు బీటు 8–30లకు, అపరాలు, ధాన్యం బీటు ఉదయం 8–45 గంటలకు ఉంటుందని తెలిపారు. వేసవి కాలంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున వరంగల్ గ్రేయిన్ మార్కెట్ గుమస్తా సంఘం కోరిక మేరకు 30–04–2025 బుధవారం నుంచి 11–06–2025 బుధవారం వరకు వచ్చే ప్రతి బుధవారం మార్కెట్ యార్డ్‌కు సెలవు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ మార్పులను రైతులు, అడ్తి వ్యాపారులు, మార్కెట్ సిబ్బంది, కార్మికులు గమనించాలని విజ్ఞప్తి చేశారు.
వడదెబ్బతో ఒకరి మృతి
జనగామ: జనగామ పట్టణంలోని గుండ్లగడ్డ ప్రాంతానికి చెందిన కార్మికుడు అలిసెరి ప్రసాద్(63) గురువారం వడదెబ్బకు గురై మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాణాపురంలోని తన కుమారుడు శ్రవన్ ఇంటి వద్దకు ఈ నెల 23న కాలినడకన వెళ్లగా, వడదెబ్బకు గురై తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు ప్రసాద్‌ను జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తీసుకు రాగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపినట్లు కుమారుడు స్పష్టం చేశారు.
నకిలీ నక్సలైట్ల అరెస్ట్
జనగామ: జనగామ మండలంలో ఓ భూవివాదం కేసులో నక్సలైట్ల పేరు చెప్పి బె దిరించిన ఇద్దరితోపాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించినట్లు సీఐ దామోదర్‌రెడ్డి తెలిపారు. సీఐ గురువారం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఓబుల్‌కేశ్వాపూర్‌కు చెంది న మద్దుల మల్లారెడ్డి, మద్దుల తిరుమల్‌రెడ్డి మధ్య భూవివాదం ఉంది. భూ వివాదం పరి ష్కారం కోసం తిరుమల్‌రెడ్డి కొత్తగూడెంకు చెందిన మెరుగు శ్యాంబాబు, జిలుగు సోమెన్ రాజు, టవర్ సాంబ అలియాస్ కంకణాల రా జరెడ్డి అలియాస్ శ్యామ్‌కుమార్‌ను సంప్రదించారు. ముగ్గురు వ్యక్తులు మల్లారెడ్డి వద్దకు వచ్చి నక్సలైట్ల పేరు చెప్పి, భూ వివాదాన్ని పరిష్కరిస్తామని చెప్పి డబ్బులు డిమాండ్ చేశా రు. మల్లారెడ్డి తమకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్పీడీసీఎల్ ఉద్యోగి మద్దుల తిరుమల్‌రెడ్డితో పాటు నకిలీ నక్సలైట్లు భద్రాద్రి కొత్తగూడెం శివారు సన్యాసి బస్తీకి చెందిన మెరుగు శ్యాంబాబు, జీలుగు సోలోమన్ రాజును రిమాండ్‌కు పంపించగా, టవర్ సాంబ పరారీలో ఉన్నాడు. కాగా.. భూవివాదం పరిష్కరిస్తామని కొత్త వ్యక్తులు లేదా నక్సలైట్ల పేరు చెప్పి డబ్బులు డి మాండ్ చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, లేదా 100కు డయల్ చేసి తెలియజేయాలని సీఐ సూచించారు.

వేసవి తీవ్రతతో మార్కెట్ వేళల్లో మార్పు

వేసవి తీవ్రతతో మార్కెట్ వేళల్లో మార్పు