
డిమాండ్‌కు అనుగుణంగా సదుపాయాలు
● టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి
హన్మకొండ: భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సదుపాయాలు కల్పించేందుకు సమాయత్తం కావా లని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి టీజీ ట్రాన్స్‌కో, ఎన్పీడీసీఎల్ అధికారులను ఆదేశించారు. హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో ట్రాన్స్ కో డైరెక్టర్, సీఈలు, 16 సర్కిళ్ల ఎస్‌ఈలతో రాబోయే 5, 10 సంవత్సరాల కాలానికి సంబంధించి చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికపై గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. రా బోయే 5, 10 సంవత్సరాల కాలానికి సంబంధించి ట్రాన్స్ కో, డిస్కం పరిధిలో కొత్తగా నెలకొల్పే సబ్ స్టేషన్లు, కొత్త లైన్లు, కొత్త పవర్ టాన్స్‌ఫార్మర్‌ల ఏర్పాటుపై ట్రాన్స్‌కో సీ ఈలు, ఎస్ ఈలను అడి గి తెలుసుకున్నారు. ఈసందర్భంగా వరుణ్ రెడ్డి మాట్లాడుతూ.. కొత్త సబ్ స్టేషన్లకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కొత్తగా సబ్ స్టేషన్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రతి సెక్షన్ ఏఈ వారానికోసారి పొలంబాట కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. త్వరలోనే డాష్ బోర్డు ప్రారంభించే డాష్ బోర్డు ద్వారా ప్రతి ఒక్కరూ సమగ్ర సమాచారాన్ని చూసుకునే సౌకర్యం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో ట్రా న్స్ కో డైరెక్టర్ జగత్ రెడ్డి, ఎన్పీడీసీఎల్ ఇన్‌చార్జ్ డైరెక్టర్లు అశోక్ కుమార్, సదర్ లాల్, మధుసూదన్, ట్రాన్స్‌కో సీఈలు శ్రవణ్ కుమార్, విజయ్ కుమార్, డిస్కం సీఈలు తిరుమల్ రావు, రాజుచౌహాన్, అశోక్, బికం సింగ్, ఎస్‌ఈలు పాల్గొన్నారు.